పుస్తక పఠనం ద్వారానే పరిపక్వత.. పవన్ కల్యాణ్
posted on Oct 11, 2025 3:15PM
.webp)
పుస్తకపఠనం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమౌతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఐరాస మాజీ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, ఆ సందర్భంగా మాట్లాడుతూ
తనపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందన్నారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందన్న పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ మహిళా విభాగానికి 'ఝాన్సీ వీర మహిళ' అని పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరలోనే అమలు చేయబోతున్నామని ఈ వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను పవన్ అభిమానినని చెప్పుకున్నారు. మంత్రిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే తాను కూడా అందరితో కలిసి పవర్ స్టార్, ఓజీ అంటూ అరిచేవాడనని చెప్పారు.