నకిలీ మద్యం కేసులో మరో అరెస్ట్...దర్యాప్తు వేగవంతం
posted on Oct 11, 2025 3:11PM

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు విచారణలో ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు వేగం పెంచించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో అతను 21వ నిందితుడిగా గుర్తించబడ్డాడు. అరెస్ట్ అనంతరం అష్రఫ్‌కు తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట ఆయనను హాజరుపర్చనున్నారు. నకిలీ మద్యాన్ని వాహనంలో తరలించి గ్రామాలకు చేర్చడంలో అష్రఫ్ పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో జయచంద్రారెడ్డి, ఆయన బావమరదలిని పట్టుకునేందుకు బెంగళూరులో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా సంగతి తెలిసిందే.