కొప్పర్తికి మరిన్ని పరిశ్రమలు తెస్తాం : మంత్రి లోకేష్

 

కొప్పర్తికి మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని, ఇక్కడ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరిన్ని ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలు తీసుకొస్తామని రాష్ట్ర విద్యా ,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కడప జిల్లా, సికె దిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఇఎంసి), లో రూ,231.50 కోట్లతో నూతనంగా ఏర్పాటైన "ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం"ను,ఎంయస్  టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎం ఐ హెచ్) లోని ఎం/యస్  టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను నారా లోకేష్ ప్రారంభించారు. 

కార్యక్రమంలో ముందుగా టెక్నో రూమ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్  యూనిట్ ను, డార్క్ రూమ్, ఈఎస్డి ప్రొటెక్టెడ్ యూనిట్ లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కంపెనీలో ఉత్పత్తి సామర్థ్యం కంపెనీ ప్రొడక్షన్ వివరాలను అక్కడ యాజమాన్యంతో అడిగి తెలుసుకున్నారు. రూ,55.21 కోట్ల ఏర్పాటైన టెక్నో డోమ్ కంపెనీలో ఉత్పత్తి నిర్వహణ పనితీరు అక్కడి ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ,50 కోట్లతో "టెక్సానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" కంపెనీ ఉత్పత్తి యూనిట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 

ఈ సందర్బంగా టెక్సానా యూనిట్లోని అన్ని విభాగాలను కంపెనీ ప్రతినిధులతో కలిసి కలియ తిరిగారు. అనంతరం వస్త్ర తయారీ యూనిట్లో మహిళా ఉద్యోగులను పలకరించారు. టైలరింగ్ సంబంధించి పని ఎలా ఉంది, ఉద్యోగం సంతృప్తి గా ఉందా.. అంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా టెక్సానా ఇండియా ప్రయివేటు లిమిటెడ్" కంపెనీలో.. మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ "గెట్ టు గెదర్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవింపబడుతారో అపుడే సమాజం కూడా గౌరవంగా ఎదుగుతుందన్నారు. 

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తేనే ఆ కుటుంబంతో పాటు ఆ సమాజం మొత్తం అభివృద్ధి పథంలోకి వెళుతుందన్నారు. మహిళల అభ్యున్నతితోనే సమాజం అభివృద్ధి చెందుతున్న నిజాన్ని నమ్మిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. గెలుపొందిన సంవత్సరం లోపే హామీలిచ్చిన మేరకు సూపర్-6 పథకాలను సూపర్ సక్సెస్ గా నెరవేర్చగలిగామన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా అణచి వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహోన్నతమైన ప్రణాళికతో పరిపాలన సాగుస్తున్నారన్నారు. 

*కొప్ఫర్తికి ప్రపంచ ఖ్యాతిగాంచిన పరిశ్రమలు 

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీ ఏఏసి ద్వారా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కును భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళతమన్నారు. అలాగే లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు మరిన్ని ప్రఖ్యాతి గాంచిన కంపెనీలను తీసుకొస్తామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం మహిళా సిబ్బందితో మంత్రి సూపర్ సెల్ఫీ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి మంత్రి టిజి భరత్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఏపీఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్, జెసి అదితి సింగ్, టెక్నో డోమ్ కంపెనీ సిఎండి సాకేత్ గౌరవ్, ప్లాంట్ హెడ్, విక్టర్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ జోష్, పాల్గొన్నారు. వారితో పాటు కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఎర్విన్, ఏపీఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి, డీఐసి జీఎం చంద్ బాషా,  సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu