సుగాలి ప్రీతి మృతి కేసు సీబీఐకి అప్పగింత
posted on Sep 2, 2025 9:13PM

ఏపీలో సంచలనం సృష్టించిన పదోతరగతి విద్యార్థి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 ఆగస్టు 18న కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. గత వైసీపీ హయాంలో ఈ కేసు సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నేతల హామీ ఇచ్చారు.
ఈనేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లో 11 సార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు.. ప్రతిసారి పార్టీ ఆఫీస్‌కు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ అడిగాము.. కానీ ఆయన ఇవ్వలేదని సుగాలి ప్రీతి తల్లి వాపోయింది. కొన్ని రోజులుగా ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రీతి తల్లి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.