ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు
posted on Dec 1, 2025 7:09PM
.webp)
పాతబస్తీ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్లుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ' పథకం కింద ఈ నిధులకు పర్మిషన్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓల్డ్ సిటీ మెట్రోను మరింత వేగం నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్‌లో 20 మంది ట్రాన్స్‌జెండర్లను భద్రతా సిబ్బందిగా నియమించింది.ప్రత్యేక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లు, రైళ్లలో తమ విధులను ప్రారంభించారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో వీరు ప్రముఖ పాత్ర వహించన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.