నీలోఫర్ హాస్పిటల్‌లో బొద్దింకల బెడద...రోగుల తిప్పలు

 

నేను రాను బిడ్డో సర్కారు దావఖానకి అనే పాట అందరికీ సుపరిచితం... పాత రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లడానికి జనాలు భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు నీలోఫర్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి పరిస్థితి చూసి రోగుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ... వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు... హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలోని నిలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో రోగుల భద్రత, పరిశుభ్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. 

ముఖ్యంగా RICU వార్డులో బొద్దింకల సంఖ్య అధికంగా పెరిగిపోయిందని చిన్నారుల పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తు న్నారు. తమ పిల్లల చికిత్స కోసం హాస్పిటల్‌కి వస్తే... హాస్పీటల్లో ఉన్న అత్యంత కీలకమైన వార్డులో బొద్దింకలు యథేచ్ఛగా సంచరిస్తు న్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. ఈ బొద్దింకల కారణంగా పిల్లల ఆరోగ్య ప్రమాదంలో పడేటట్టుగా ఉందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హాస్పిటల్ పరిపాలనా విభాగం ఈ అంశాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటోందని తల్లిదండ్రులు వాపోయారు. పరిశుభ్రతా చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షణలో లోపాలు కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని వారు విమర్శించారు.ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకొని, రోగులకు శుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణం కల్పించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu