సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు కొట్టివేత

 

సీఎం చంద్రబాబుపై వైసీపీ హయాంలో పెట్టిన లిక్కర్ కేసును కోర్టు కొట్టివేసింది.  అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.   అధికార దుర్వినియోగం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఏసీబీ కోర్టు కేసును మూసేసింది.

అలాగే ఆయనపై ఉన్న ఫైబర్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటూ  చంద్రబాబు, కొల్లు రవీంద్రపై అప్పటి బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదు చేసిన విషయం విదితమే

Online Jyotish
Tone Academy
KidsOne Telugu