గురజాడ స్వగృహాన్ని సందర్శించిన జస్టిస్ మానవేంద్రనాథ్

 

విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్  సందర్శించారు. గురజాడ చిత్రపటాలను, ఆయన వాడిన వస్తువులను రచనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ గృహాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు. 

తన చిన్ననాటి నుంచి గురజాడ రచనలను అధ్యయనం చేశానని చెప్పారు. మహాకవి నివసించిన గృహాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిర,  గురజాడ సంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఏ గోపాలరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu