శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకుల పడిగాపులు.. ఎందుకంటే?

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అర్ధరాత్రి నుంచి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి కారణం చెప్పకుండా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన విమానాలు తీవ్ర జాప్యం కావడంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రయాణీకులు నిన్న రాత్రి నుంచీ ఎయిర్ పోర్టులోనే తాము వెళ్లాల్సిన ఫ్లయిట్ ఎప్పుడు బయలుదేరుతుందా అని వేచి చూస్తున్నారు. ఆయా విమానాలలో తలెత్తిన సాంకేతిక లోపాలే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఈ విమానాలన్నీ ఇండిగో సంస్థకు చెందినవే కావడం గమనార్హం. ప్రయాణీకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇండిగో సిబ్బంది సమతమమౌతున్న పరిస్థితి.  

తెల్లవారుజామున రెండు గంటలకు బెంగుళూరు వెళ్లవలసిన ఫ్లైట్ ను రన్ వే పై రెండు గంటలు నిలిపివేశారు.  ప్రయాణికుల ఆందోళనలతో వారిని కిందకు దింపేసి ఎయిర్ పోర్టులో వెయిట్ చేయాల్సిందిగా సిబ్బంది చెప్పారు.  దీంతో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు కనెక్టింగ్ ఫ్లైట్ లు మిస్సయిన పరిస్థితి. అలాగే వీసీ ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు కూడా ఉన్నారు. వీరంతా ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఎయిర్ పోర్టులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu