ములకలచెరువు కల్తీ మద్యం కేసులో మరో అరెస్టు
posted on Oct 13, 2025 6:00PM

అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ 22 నిందితుడిగా ఉన్న చైతన్య బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 15కి చేరింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరి కొంతమందిపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం ఈ కేసుని సిట్‌కి అప్పగించన సంగతి తెలిసిందే.
నకిలీ లిక్కర్ తయారీతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో టెన్షన్ పెరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ (17) నిందితునిగా కేసు నమోదైన టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్థి గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.