డ్రగ్స్ దందాలో కొత్తరకం మాఫియా

 

పుష్ప సినిమా ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే... అదే తరహాలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు కూడా సంచలనం సృష్టి స్తున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. ఓ మాఫియా కొత్తరకం డ్రగ్స్ దందాకు తెరలేపారు. ఈ ముఠాలు పుష్ప సినిమాను మించి.. కొత్త కొత్త తరహాలో  డ్రగ్స్ సరఫరా చేస్తు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికా రులు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ ఉంటే... మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలు రకరకాల వస్తువుల మాటున వివిధ రకాల డ్రగ్స్ లను ఏదేచ్ఛగా సరఫరా చేస్తున్నారు

 ప్రముఖ యూనివర్సిటీ లో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఈగల్ టీమ్ గుర్తించి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో కీలక పాత్ర వహించిన ముగ్గురు విద్యార్థు లను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ యూని వర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలమైన విష యాలు బయట పడ్డాయి. ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతుం దని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా... కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 10 కొరియర్ సంస్థల నుంచి 100 కోట్ల రూపాయల డ్రగ్స్ తరలించినట్లుగా అధికారులు గుర్తించారు. 

ఈ డ్రగ్స్ ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో  ఉన్న మెడికల్ కాలేజీలు మరియు ఇంజ నీరింగ్ కాలేజీల విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ విక్రయాలు జరుపు తున్నారు అయితే ఈ డ్రగ్స్ ముఠాలు పుష్ప సినిమా తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్, ఆయుర్వేద ఉత్పత్తులు ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలు మొత్తం 36 రకాల వస్తువుల తినుబండారాల మాటున డ్రగ్స్ ని హైదరాబాదు నగరానికి పంపిస్తున్నారు. కొరియర్ సర్వీసులలో డ్రగ్స్ తో కూడిన వస్తువులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు పుస్తకాల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 

ఈ ముఠాలు ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా యూనివర్సిటీ హాస్టల్ లోపలికి మారుతి కొరియర్స్ ద్వారా ఓజీ డ్రగ్స్ పుస్తకాల మధ్యలో పెట్టి పంపిస్తు న్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు కాస్మెటిక్ డబ్బాలో డ్రాప్స్ పెట్టి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా మల్నాడు డ్రగ్స్ నిందితులకు ఫుడ్ ఆర్టికల్స్ రూపంలో డ్రస్ సరఫరా చేశారు.. అంతేకాకుండా పలువురు వ్యాపారవేత్తలకి ఫుడ్ ఆర్టికల్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి పంపిస్తున్నారు. మరికొందరికి మట్టి గాజుల మాటున ఎఫిడ్రిన్ పొట్లాలను కొరియర్ ద్వారా డ్రగ్స్ తరలిస్తు న్నారు. కొరియర్ సంస్థలు కమిషన్కు కక్కుర్తి పడి డ్రగ్స్ ముఠాలకు సహక రిస్తున్నట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu