డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్

 

డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన సస్పెండెట్ నేత కోట వినుత వీడియో విడుదల చేశారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ కంటే హత్య చేశారని చెప్పడమే బాధగా ఉందన్నారు. తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది.  కోర్టులో కేసు ఉంది. కావునా ఎక్కువ మాట్లాడలేను. త్వరలో నిజాలు బయట వస్తాయన్నారు. ఈ కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెడతామని వినూత వీడియోలో పేర్కొన్నాది. విదేశాలలో లక్షల జీతాలు వదులుకొని  ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 


మరోవైపు గత కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో టచ్‌లో ఉన్నాను. జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, అలాగే సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి ద్వారా పరిచయం ఏర్పడింది అని పేర్కొన్నారు.అలాగే, వినూత కోటాకు సంబంధించిన రాజకీయ, వ్యక్తిగత వివరాలన్నీ తానే ఎమ్మెల్యేకు అందించానని, ఆ సేవలకు ప్రతిఫలంగా 2024 ఎన్నికల ముందు రూ.20 లక్షలు అందుకున్నానని వీడియోలో తెలిపారు.

ఇంకా ఆయన చెప్పిన మరో సంచలన అంశం— వినూత కోటా, చంద్రబాబు కోటా లను చంపాలని ఎమ్మెల్యే ఆదేశించాడని, ఆ ఆదేశాల మేరకు రెండు సార్లు కారు ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశానని చెప్పారు.అదేవిధంగా, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా వచ్చి, వినూత కోటా, చంద్రబాబు కోటా ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించాడని, అందుకోసం మరో రూ.30 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టాడని శ్రీనివాసులు వీడియోలో వెల్లడించారు. కెమెరాలు బెడ్రూంలో ఏర్పాటు చేసే సమయంలోనే తాను పట్టుబడ్డానని తెలిపారు. డ్రైవర్ శ్రీనివాసులు విడుదల చేసిన ఈ వీడియో బయటకు రావడంతో శ్రీకాళహస్తి ప్రాంతంలో కలకలం రేగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu