బాటిల్ బాగోతం బయటపెట్టే ఎక్సైజ్ సురక్షా యాప్!
posted on Oct 13, 2025 12:46PM

ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంపై చంద్రబాబు చాలా చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయంలో ఎన్నో రాజకీయ కుట్ర కోణాలున్నాయని.. వాటిని తానిపుడు చెప్పననీ.. నలుగురు ఐపీఎస్ లతో పాటు మరొక ఎక్సైజ్ అధికారితో ఈ కేసు విచారణ జరుపుతామని, దీని ద్వారా ఈ మొత్తం వ్యవహారంలోని అసలు కుట్ర మొత్తం బయట పడుతుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను ఇటీవలే 15 వేళ్ల పాటు సీఎంగా పదవీ కాలం పూర్తి చేశాననీ.. సరిగ్గా అదే సమయంలో ప్రతిపక్షంలో కూడా అంతే కాలమున్నాననీ.. అలాంటి తనకు ఇలాంటి వ్యవహారం ఎక్కడా తగల్లేదని అన్నారుచంద్రబాబు. డబుల్ ఈఎన్ఏ తీసుకొచ్చింది తానేననీ. మంచో చెడో కొందరు మందుబాబులకు ఈ వ్యసనం అలవాటైంది. వారిని తాగమని ప్రోత్సహించడం కాదు కానీ, వారి ఆరోగ్య పరిరక్షణ తనకు అత్యవసరం అని అన్నారు చంద్రబాబు.
అందులో భాగంగా తాము ఎక్సైజ్ సురక్ష అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చామనీ.. ఈ యాప్ ద్వారా బాటిల్ ట్రాకింగ్ ఈజీగా చేయవచ్చని.. ఒక్కసారి మీరు ప్లే స్టోర్ కి వెళ్లి.. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్ లోడో చేస్కుని.. స్కాన్ చేసుకుంటే.. అసలీ బాటిల్ ఎప్పుడు- ఎక్కడ- ఎలా తయారైంది? ఆ వివరాలేంటి? అనే అంశాలతో కూడిన ట్రేసబిలిటీ నుంచి దాని క్వాలిటీ సర్టిఫికేషన్ తో సహా అన్ని అందులో నమోదు అయ్యి ఉంటాయని అన్నారు.
ఆ మాటకొస్తే తాము ఫించన్లు ఎలా ఇస్తున్నామో జియో ట్యాగింగ్ తో సహా తెలిసిపోతుందని అన్నారు. ఒక బాటిల్ ఎవరు- ఎప్పుడు- ఎక్కడ అమ్మారు? కొన్నారన్న డీటైల్స్ మొత్తం ఇందులో ఎగ్జిబిట్ అవుతాయని. ఒక్కసారి ఒక బాటిల్ అమ్మడంతో ఈ కేస్ హిస్టరీ అక్కడితో క్లోజ్ కావాలని.. ఇక్కడ కొని మరొక చోట అమ్మినా ఆ విషయం కూడా మనకు ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని.. ఇకపై బెల్ట్ షాపులు నడవటం అంత తేలిక కాదని అన్నారాయన. బెల్ట్ షాపులు నడిపితే బెండు తీస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.
అస్తవ్యస్తంగా ఉన్న అబ్కారీ శాఖను అంచెలంచలుగా ప్రక్షాళన చేస్తున్నామని.. సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే తరతమ బేధాలు చూడకుండా వారిపైనా కఠిన చర్యలుంటాయని వార్న్ చేశారు చంద్రబాబు.
ఈ నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన జయచంద్రారెడ్డి తమ పార్టీ వాడైనా సరే ఎక్కువ ఆలోచించకుండానే సస్పెండ్ చేసినట్టు చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక ఏ1 నిందితుడు జనార్దనరావును కూడ అరెస్టు చేసి వివరాలు రాబడుతున్నట్టు చెప్పారు చంద్రబాబు.
ఫ్యూచర్ లో దీని వెనకున్న రాజకీయ కుట్ర కోణం మొత్తం బయటపడుతుందని అన్నారాయన. ఒక వేళ ఈ బాటిల్ ట్రాకింగ్ లో.. ఒక నకిలీ బాటిల్ బయట పడితే.. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలిసిపోతుందని.. నేరస్తులు ఈ విషయం గుర్తించాలని అన్నారు చంద్రబాబు. లేదు మా వెనక వాళ్లున్నారు వీళ్లున్నారని వేషాలు వేస్తే.. వారి తాట తీస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.