ఉద్యోగులకు డీఏ బకాయిల తొలి విడత చెల్లింపు

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయ్యింది. అప్పులు, చెల్లింపుల బకాయిలు వినా చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితిలో.. గత ఏడాది జరిగిన  ఎన్నికలలో విజయం సాధించి తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచీ ఒక్కొక్కటిగా అన్నిటినీ సరిదిద్దుకుంటూ.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజాభిమానాన్ని చూరగొంటున్నది. గత ప్రభుత్వం చెల్లింపులకు ఎగనామం పెట్టి ఉద్యోగులకు డిఏలు పెద్ద ఎత్తున బకాయి పడింది. ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపులపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. తొలి విడతగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలన విడతల వారీగా చెల్లించేందుకు రెడీ అయ్యింది.

ఇందులో భాగంగా సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత డిఏ బకాయిలను విడుదల చేసింది. అనూహ్యంగా తమ ఖాతాల్లో సొమ్ములు జమ అవ్వడంతో  ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఏపీ సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

తొలి విడదలోసెక్రటేరియట్ సీపీఎస్‌ ఉద్యోగులకు డిఏ బకాయిలను ప్రభుత్వం జమ చేసింది. త్వరలోనే  మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ  బకాయిలు నగదుగా చెల్లించేందకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ బకాయిలను మొత్తం ఆరు విడతలలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొలి విడతలో జమ అయిన బకాయిలు ఒక్కో ఉద్యోగికీ 40 నుంచి 70 వేల వరకూ వచ్చాయి.   జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చి  డీఏలు ఎగ్గొట్టడంతో బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోయిన సంగతి విదితమే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలను అందించే ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu