ఏపీకి యూరియా.. కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో
posted on Sep 9, 2025 9:53AM
.webp)
రాష్ట్రంలో యూరియాకు ఎటువంటి కొరతా లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు, మరీ ముఖ్యంగా అత్యవసరంగా యూరియా అవసరమైన జిల్లాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సత్వరమే యూరియా సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ విజ్ణప్తి మేరకు 17 వేల 293 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం రాష్ట్రానికి పంపింది.
ఈ యూరియాన కాకినాడ పోర్టులో దిగుమతి చేయడానికి అనుమతి ఇస్తూ కేంద్రం జీవో జారీ చేసింది. దీంతో తక్షణ అవసరాలు ఉన్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత, సమస్య అన్న మాటే వినిపించకూడదని అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 వేల 503 మెట్రిక్ టన్నల యూరియా ఎరువుల నిల్వ ఉందని అధికారులు ఈ సందర్బంగా మంత్రికి వివరించారు. యూరియాను బ్లాక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.