2047 నాటికి నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు

 

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. రామాయపట్నంలో త్వరలో బీపీసీఎల్ పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని అప్పటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా అవతరిస్తుందని చంద్రబాబు తెలిపారు.  

వైజాగ్‌కు రైల్వే జోన్, ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు  చంద్రబాబు ప్రకటించారు. వైజాగ్‌ను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు  పంచాయితీ రాజ్‌లో పంచాయతీలు రేషనలైజేషన్ చేసి రూరల్, అర్బన్ పంచాయితీలుగా చేయాలని తెలిపారు. 2028 నాటికి విశాఖ భారత దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో 4 లక్షల 70 వేల మంది ఆంధ్రాలో పని చేస్తున్నారని తెలిపారు. దీనిని 10 లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

మంత్రులు, సెక్రటరీలకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సిన బాధ్యత మంత్రులదే అని తెలిపారు. శాఖలో పని చేయకపోతే వారిని పిలిచి మందలించాల్సింది మంత్రులే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. తన 15 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో ఎప్పుడూ ఇన్ని పెట్టుబడులు రాలేదని చంద్రబాబు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీకీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై డిప్యూటీ సీఎం  హర్షం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu