ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పిలిప్పైన్స్ లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం (అక్టోబర్ 10) భారీ భూకంపం సంభవించింది.   రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపతీవ్రత 7.6గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో  ఫసిఫిక్ తీరంలో సునామీ సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.  మనీలాకు ఆగ్నేయాన దావో ఓరియంటల్‌ లోని మనాయ్ పట్టణానికి 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.

 ఈ భూకంప తీవ్రతకు ఫిలిప్పీన్స్ తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ఈ భూకంప ప్రభావంతో పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  రెండు వారాల కిందట ఫిలిప్పైన్ లో  6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 72మంది మరణించిన సంగతి తెలిసిందే.  ఈ రోజు వచ్చిన భూకంప తీవ్రత 7.6 కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu