రాష్ట్రంలో యూరియా కొరత ఉండొద్దు : సీఎం చంద్రబాబు
posted on Sep 8, 2025 7:27PM
.webp)
ఏపీలో రబీ సీజన్‌కు సంబంధించి యూరియా పంపీణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉన్నయని అధికారులు సీఎంకు వివరించారు. మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలన్నారు. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే...ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అరకు కాఫీకి సోకిన కాయతొలుచు తెగులు పైనా సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు .
కాఫీ తోటలకు సోకిన తెగులును ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు 80 ఎకరాలకు మాత్రమే తెగులు సోకిందని....అందులో 60 ఎకరాలు తొలగించామని అధికారులు సీఎం చంద్రకు వివరించారు. తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కే.విజయానంద్, వ్యవసాయశాఖ, వైద్యారోగ్యం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.