అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం...9 మంది మృతి
posted on Dec 12, 2025 9:01AM

అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో యాత్రికుల ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో 9 మంది మృతి చెందగా పలువురికి గాయలపాలయ్యారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల బస్సు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఘటన గురించి తెలియగానే ఆయన అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించామని, వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.