ట్యూషన్ టీచర్ దారుణం... ఏడేళ్ల బాలుడిపై అట్లకాడతో దాడి
posted on Dec 12, 2025 9:52AM

పిల్లల్లో కొంతమంది చదువులో ముందుంటారు. మరి కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ట్యూషన్ పెట్టించి తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు కూడా తమ చిన్నారి బాలుడిని ట్యూషన్ కి పంపించారు. కానీ ట్యూషన్ టీచర్ ఆ బాలుడు పై చేసిన దారుణం . ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణమైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఓ ట్యూషన్ టీచర్ చదవడం లేదనే పేరుతో ఏడేళ్ల చిన్నారిపై అమానుషంగా దాడి చేసిన ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో భయభ్రాంతులకు గురిచేసింది..ఓయూ కాలనీకి చెందిన మొదటి తరగతి విద్యార్థినిపై ఐదుగురు పిల్లలు వల్లు తేజ నందన్ రెగ్యులర్‌గా ట్యూషన్‌కు వెళ్లేవాడు. అయితే చదువుపై దృష్టి పెట్టడం లేదన్న కారణంతో ట్యూషన్ టీచర్ శ్రీ మానస ఆగ్రహం చెంది చిన్నారిపై తీవ్ర హింసకు పాల్పడినట్టు తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు.
చిన్నారి తేజ నందన్ చేతులు, కాళ్లు, ముఖం తదితర భాగాలపై మొత్తం ఎనిమిది చోట్ల అట్లకాడతో కాల్చినట్టు బాలుడు తన తల్లిదండ్రు లకు వివరించాడు. బాలుడి శరీరంపై గాయాలు చూసిన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలుని ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, కాళ్లపై గాయాల కారణంగా నడవడంలో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. చిన్నారిపై అట్లకాడతో దాడి చేసిన టీచర్ శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.