పలు అభివృద్ధి పనులకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో  44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను మంత్రి పార్థసారథి తెలిపారు. అమృత్ 2 లో భాగంగా 2026 మార్చి 31 కల్లా పెండింగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిందని.. అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. 

ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో E 3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించామన్నారు.

గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‍లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.532 కోట్లతో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు కల్పించింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu