దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీ భగ్నం..!

 

మోయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్ హౌస్‌లో గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగిన బర్త్‌డే పార్టీపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు.

దాడుల సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయనతో ఉన్న మాధురి, అలాగే పలువురు వ్యక్తులు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ప్రాంగణంలో అనుమతి లేని మద్యం బాటిళ్లు స్వాధీనం చేసినట్లు అధికారులు తెలిపారు.

2024లో వ్యక్తిగత సమస్యల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి కలసి నివసిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 12 మాధురి పుట్టినరోజు కావడంతో ఈ వేడుక కోసం ఫామ్ హౌస్‌ను బుక్ చేసినట్లు తెలిసింది.

పార్టీ ప్రదేశంలో మద్యం మాత్రమే కాకుండా ఇతర మత్తు పదార్థాలు కూడా ఉన్నాయనే సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులతో కలిసి ఎస్ఓటీ బృందం సంయుక్త దాడి జరిపి, జరుగుతున్న హంగామాను నిలిపివేశారు.

దాడుల అనంతరం స్వాధీనం చేసిన వస్తువులు, అక్కడ ఉన్న వారి వివరాలు ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పార్టీ నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఉందో, అనుమతి లేకుండా ఎలా వేడుక జరగిందో అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహించి పార్టీలో దొరికిన వస్తువులపై సీరియస్  SOT పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేశారు...ఈ పార్టీ లో మద్యం తో పాటు మత్తు పదార్థాలు కూడా ఉన్నట్లు సమాచారం... దువ్వాడ శ్రీనివాస్, మాధురి తో పాటు పలువురు నాయకులు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మద్యం సేవిస్తూ... డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 

ఈ దాడుల్లో దువ్వాడ శ్రీనివాస్ కనిపించగానే ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం పోలీసులు మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గోన వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పార్టీ నిర్వాహకుడు పార్థసారథి, అలాగే ఫామ్‌హౌస్ యజమాని సుభాష్ పై ఎక్సైజ్ యాక్ట్ 223, 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

దర్యాప్తులో భాగంగా, ఈ పార్టీలో దువ్వాడ మాధురి, శ్రీనివాస్ సహా మొత్తం 29 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.రైడ్ సమయంలో 10 మద్యం బాటిళ్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన అనుమతులు లేకుండా మద్యం పార్టీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu