హ్యాండ్ షేక్ వివాదం..పాక్‌కు సారీ చెప్పిన ఐసీసీ రిఫరీ

 

ఆసియా కప్‌ 2025లో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయలేదన్న కారణంతో మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. రిఫరీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో పాక్ జట్టు యూఏఈతో మ్యాచ్‌ బహిష్కరించాలని యోచించింది. మ్యాచ్ సమయం దగ్గరపడుతుండగా వారు మైదానానికి వెళ్లకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. చివరికి పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఆడాలని ఆదేశించడంతో, పాక్ జట్టు ఆలస్యంగా మైదానంలోకి దిగింది.

ఈ వ్యవహారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీసీ అధ్యక్షుడు తమవాడని చూసి పాక్ జట్టు పిల్లచేష్టలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి భారత జట్టుకు ఎదురైతే, పాక్ మాజీలు మరియు అభిమానులు ట్రోలింగ్ చేసేవారని గుర్తుచేస్తున్నారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి ఆలస్యంగా ఆడటంపై పాక్ జట్టు ప్రవర్తన సరైనదేనా అన్న ప్రశ్నలు లేవుతున్నాయి. క్రీడలు–రాజకీయం వేరు అని చెప్పిన వారే ఇప్పుడు క్రికెట్‌ని రాజకీయంగా మలుస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu