హస్తినను కమ్మేసిన వాయు కాలుష్యం
posted on Oct 22, 2025 9:58AM

వాయుకాలుష్యం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసింది. ఐదేళ్ల కనిష్ఠానికి వాయు నాణ్యత పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం దీపావళి సందర్భంగా నగరవాసులు టపాసులు కాల్చడమేనని పర్యావరణ నిపుణులు అంటున్నారు. దిపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చడానికి తోడు గాలుల మందగమనం కూడా ఈ స్థాయిలో వాయు కాలుష్యం ప్రబలడానికి కారణంగా చెబుతున్నారు.
సెంట్రల్ పొల్లూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) మేరకు గత ఐదేళ్లలో ఎన్నడూ హస్తినలో ఈ స్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లలో జీఆర్ఎపీ-2 చర్యలు అమలులోకి వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది దిపావళి సందర్భంగా పరిమితంగానే హరిత బాణసంచా ఉపయోగించినప్పటికీ కాలుష్యం ఈ స్థాయిలో ఏర్పడటంలో హరిత బాణ సంచ నాణ్యతపై కూడా తనిఖీలు చేపట్టాల్సిన అసవరం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.