ఏసీబీకి చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్

 

హన్మకొండ కలెక్టరేట్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.  అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రైవేటు స్కూల్ రెన్యూవల్ కోసం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.  

హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జి డీఈవోగానూ వెంకట్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల అనుమతులకు సంబంధించి రూ.1,00,000 డిమాండ్ చేయగా విద్యాశాఖ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ రూ.60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  ఏసీబీ వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu