Karthika Deepam2 : శౌర్య బర్త్ డే అని తెలుసుకున్న శివన్నారాయణ.. పారిజాతం ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -463 లో.. పారిజాతాన్ని పిలుస్తాడు శివన్నారాయణ. ఎన్నిసార్లు పిలవాలి పారిజాతమని శివన్నారాయణ అనగానే అలా పిలవడం ఇబ్బంది అయితే నన్ను డార్లింగ్ అని పిలవొచ్చని పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ చిరాకుగా మాట్లాడతాడు. ఈ డ్రాయింగ్ బుక్ తీసుకొని వెళ్లి శౌర్యకి ఇవ్వు అంటాడు శివన్నారాయణ. పారిజాతం బుక్ తీసుకొని వెళ్లి శౌర్యకి ఇస్తుంది. థాంక్స్ గ్రానీ అని శౌర్య చాక్లెట్ ఇస్తుంది. ప్రేమగా శౌర్య చాక్లెట్ ఇస్తుంటే పారిజాతం ఎమోషనల్ అయి తీసుకుంటుంది. వెనకాల కార్తీక్ ఉంటాడు. ఇక ఎప్పటిలాగే పారిజాతానికి చురకలు అంటిస్తాడు. ఆ తర్వాత శౌర్య కేక్ డ్రాయింగ్ వేసుకుంటుంటే అప్పుడే శివన్నారాయణ వస్తాడు. తను రాగానే డ్రాయింగ్ దాచేస్తుంది శౌర్య. ఆ తర్వాత మళ్ళీ శివన్నారాయణ చాటు నుండి డ్రాయింగ్ చూసి నాకు ఇది ఇవ్వు అని డ్రాయింగ్ తీసుకుంటాడు. ఆ డ్రాయింగ్ పేపర్ తీసుకొని వెళ్లి పారిజాతానికి చూపిస్తాడు. ఇది శౌర్య వేసింది ఎందుకిలా వేసింది.. అసలు ఈ రోజు శౌర్య స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు కనుక్కో అలా కనుక్కుంటే ఈ డబ్బు నీకు ఇస్తానని శివన్నారాయణ అనగానే.. పారిజాతం టెంప్ట్ అయి వెంటనే కాంచనకి ఫోన్ చేస్తుంది. ఏంటి శౌర్యని ఈ రోజు స్కూల్ కి పంపించలేదు.. ఫీజు కట్టలేదా అని కాంచనకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది పారిజాతం. దాంతో ఈ రోజు దాని పుట్టినరోజు అందుకే పంపలేదని కాంచన చెప్తుంది. అదంతా శివన్నారాయణ వింటాడు. ఫోన్ కట్ చేసిన పారిజాతం.. విన్నారుగా ఇక ఈ డబ్బు నాకే అని తీసుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. పిన్ని ఫోన్ చేసింది శౌర్య పుట్టినరోజు అని చెప్పేసానని చెప్తుంది. ఆ తర్వాత దీప కోసం కార్తీక్ కిచెన్ లోకి వెళ్తాడు. అమ్మ తాతయ్య దగ్గరుంది. నిన్ను రమ్మంటున్నారని తీసుకొని వెళ్తుంది. వెళ్లేసరికి అందరు హాల్లో ఉంటారు. మేమ్ ఈవినింగ్ త్వరగా వెళ్తామని కార్తీక్ అనగానే ఎందుకని శివన్నారాయణ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jayam serial : రుద్ర కేసు వాయిదా.. రీక్రియేట్ చేస్తే సాక్ష్యాలు తారుమారు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -57 లో....శకుంతల తన కొడుకుని చంపేశాడని రుద్రపై కేసు పెడుతుంది. ఆ కేసు కోర్ట్ లో ఫైనల్ హియరింగ్ కి వస్తుంది. రుద్ర తరుపున లాయర్ ప్రేమ్ కోర్ట్ లో చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. అసలు శకుంతల కొడుకు భానుప్రతాప్ ని చంపింది వీరు. రౌడీలతో కోర్ట్ లో మాట్లాడతాడు లాయర్ ప్రేమ్. వాళ్ళు ఎలా మాట్లాడిన ఇద్దరు ఒకే సమాధానం చెప్తారు. ఆ తర్వాత శకుంతలని బోనులకి పిలుస్తాడు లాయర్ ప్రేమ్. మీరు చెప్పండి అమ్మ మీ సొంతకొడుకులాగా పెంచారు. ఇంకా భాను, రుద్ర అన్నదమ్ముల కంటే ప్రాణస్నేహితులాగా ఉన్నారని మీ కుటుంబంలో ఎలాంటి ఆస్తుల గొడవలు లేవంటున్నారు.. మరి రుద్ర ఈ నేరం చేసాడని ఎందుకు అంటున్నారని శకుంతలని ప్రేమ్ అడుగుతాడు. క్షనికావేశం..ఎంతపనినైనా చేయించొచ్చని శకుంతల అంటుంది. రుద్రకి ప్రతికూలంగా సాక్ష్యాలు ఉంటాయి. చామంతితో గంగ మాట్లాడుతుంది. నువ్వు కూడా లాయర్ చదువుతున్నావ్ కదా ఏదైనా ఐడియా చెప్పమని అంటుంది. ఆ తర్వాత సాక్ష్యాలు అన్ని క్లియర్ గా అనిపించడం లేదు.. నాకు సిచువేషన్ ని రీక్రియేట్ చేస్తే ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది.. నాకు పర్మిషన్ ఇవ్వండి అని జడ్జ్ ని ప్రేమ్ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో జడ్జ్ ఒప్పుకొని కేసుని వాయిదా వేస్తాడు. ఆ తర్వాత చాలా థాంక్స్ ప్రేమ్ అని రుద్ర చెప్తాడు. ఈ ఐడియా చామంతిది అని ప్రేమ్ అంటాడు. తరువాయి భాగంలో భాను చనిపోయినప్పటి సిచువేషన్ ని రీక్రియేట్ చేస్తారు. అందులో గొడవ జరిగినప్పుడు రుద్ర నెట్టేస్తే పడిపోయే సిచువేషన్ లేదు.. ఎవరో తోసేశారని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg boss 9 Telugu : శ్రష్టి వర్మకి బిగ్ బాస్ నుండి వచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే!

  బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్ శ్రష్టి వర్మ. అందరు ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. హౌస్ ప్రతీ సీజన్ లో ఒక కొరియోగ్రాఫర్ ఉండడం అనేది కంపల్సరీ. అయితే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఇంత త్వరగా హౌస్ నుండి బయటకు వస్తుందని ఎవరు ఉహించలేదు. హౌస్ లో కూడా అందరు సుమన్ శెట్టి లేదా ఫ్లోరా సైనీ వెళ్తుందని భావించారు. బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ లాంఛ్ రోజున శ్రష్టి వర్మ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాగార్జున తనని అడిగాడు. నువ్వు త్వరగా హౌస్ నుండి బయటకు వస్తే నా నెక్స్ట్ సినిమాకి కొరియోగ్రఫి చేద్దువు గానీ అని అడిగాడు. అయ్యో తప్పకుండా సర్.. నేను అదే అనుకుంటున్నానని శ్రష్టి వర్మ అంది.  హౌస్ నుండి త్వరగా వస్తావా అని నాగార్జున అన్నది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏదో సరదాగా అంటే సీరియస్ గా తీసుకున్నట్లుందని నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్-9 లో శ్రష్టి వారం రోజులు ఉంది. ఇందుకు గాను తనకి వారానికి రెండు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ కంటెస్టెంట్ కి ఎలాగూ వారం ఉంటారు కాబట్టి అందరికి వారం రెమ్యునరేషన్ అడ్వాన్స్ లాగా ఇస్తారు. అయితే శ్రష్టి కి ముందే వారం రోజుల పేమెంట్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు హౌస్ నుండి ఖాళీ చేతులతో పంపించారన్నమాట. హౌస్ లో తన ఆటతీరు ఎలా ఉంది.. ఏం చేస్తే తను హౌస్ లో ఉండేదో కామెంట్ చేయండి.  

శ్రష్టి వర్మ ఆడియో కాల్ లీక్ చేసిన ఆర్జే శేఖర్ బాషా!

ఒకప్పుడు ఎవరైనా మహిళ తనకి అన్యాయం జరిగిందని, ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాడని అంటే.. మహిళా సంఘాలన్నీ రోడ్డుకెక్కేవి. అయితే ఇప్పుడు ఎక్కడ ఏ మగాడిపై లైంగిక ఆరోపణలు ఇష్యూ తెరపైకి వచ్చినా ఒకే ఒక్కడి గొంతు గట్టిగా వినిపిస్తుంది. అతనే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషా. ఆ మధ్య సంచలనంగా మారిన జానీ మాస్డర్, శ్రష్టి వర్మ వివాదంలోనూ ఆర్జే శేఖర్ బాషా తన గొంతు వినిపించాడు.  బిగ్ బాస్ సీజన్-9 నుండి శ్రష్టి వర్మ మొదటి వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది.‌ ఈ క్రమంలో ఆమె రెమ్యూనరేషన్, జానీ మాస్డర్ వివాదం ఇలా రకరాల అంశాల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం.. శ్రష్టికి సంబంధించిన ఓ ఆడియో కాల్ ని శేఖర్ బాషా లీక్ చేయగా, ఇప్పుడది వైరల్ గా మారింది.  ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్ బాషా.. అందులో జానీ మాస్టర్ ది తప్పేం లేదని, అంతా శ్రష్టి వర్మదే అన్నాడు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటు చెప్పాడు. అందులో భాగంగానే శ్రష్టి ఒకరితో ఫోన్ మాట్లాడిన ఓ ఆడియో కాల్ రికార్డింగ్ వినిపించాడు. అందులో తనేం మాట్లాడిందంటే.. నాకు జానీ గారంటే ఇష్టం.. తనతో నాకు మెమోరీస్ ఉన్నాయి.. నాకు గుర్తొచ్చినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్డుకుంటాను అని చెప్పింది.  జానీ మాస్టర్ అంటే ఇష్టమేనంటూనే.. అతడిపై ఇలా ఆరోపణలు చేయడం, ఇలా నలుగురిలో అతని పరువు తీయడం కరెక్టేనా అంటూ శేఖర్ బాషా ఆ ఇంటర్వ్యూలో అన్నాడు. శేఖర్ బాషా ఇంటర్వ్యూలో అన్న మాటలు, శ్రష్టి వర్మ ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా, ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రష్టి వర్మ.. అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేట్ అయింది. మరి బిగ్ బాస్ హౌస్ లో శ్రష్టి వర్మ ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Shrasti Verma Elimination: నలుగురు జెన్యున్, ఆ ముగ్గురూ ఫేక్..  బాంబు పేల్చిన శ్రష్టి వర్మ!

  బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం ముగిసింది. ఫస్ట్ వీక్ లోనే ఎన్నో గొడవలు, టాస్క్ లు, అల్లర్లు కంప్లైంట్లు, బ్యాక్ బిచ్చింగ్, ఇలా ఎన్నో భరించి చివరికి ఒకరు బయటకొచ్చేశారు. తనే శ్రష్టి వర్మ. ఎన్నో అంచాలతో హౌస్‌లోకి అడుగుపెట్టిన కొరియోగ్రాఫర్ శ్రష్టి ఊహించని విధంగా మొదటి వారమే బైబై చెప్పేసింది. అయితే వెళ్తూ వెళ్తూ హౌస్‌లో ముగ్గురి మెడలో ఫేక్ అంటూ బోర్డులు వేసింది. అలానే సుమన్ శెట్టికి కూడా పెద్ద షాకే ఇచ్చింది. మరి శ్రష్టి ఎవరిని ఫేక్ అని చెప్పింది. హౌస్‌ నుండి ఎలిమినేషన్ అయ్యాక స్టేజ్ మీదకి వచ్చింది శ్రష్టి. ఇక వచ్చాక తన జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. అది చూసి కాస్త ఎమోషనల్ అయింది శ్రష్టి. హౌస్ లో నలుగురు జెన్యూన్.. నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ల లిస్ట్ ఇచ్చేసి వెళ్లిపోమంటూ నాగార్జున అన్నాడు. జెన్యూన్ లిస్ట్‌లో రాము రాథోడ్ పేరు చెప్పింది శ్రష్టి. అతను చాలా ఇన్నోసెంట్.. నా టామ్ అంటూ శ్రష్టి చెప్పింది. తర్వాత మర్యాద మనీష్, హరిత హరీష్ పేర్లు చెప్పింది. మనీష్ చాలా జెంటిల్‌మ్యాన్, హరీష్ మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. ఆ తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెప్తూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది.. తను చాలా మంచి సోల్ అంటూ చెప్పింది. కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతూ చౌదరి పేరు చెప్పింది శ్రష్టి. తర్వాత తనూజ పేరు కూడా తీసింది. సంజన గారు ఎగ్ కొట్టేసినప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్లి తనూజ అక్కని అడిగా.. కానీ నాకు తెలియదని ముఖం మీద చెప్పింది. అలా నమ్మకం పోగొట్టుకుందంటూ శ్రష్టి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత భరణి పేరు చెప్తూ శ్రష్టి ఎమోషనల్ అయింది. ఇప్పుడు చెప్తున్న పేరు నాకు ఇష్టం లేదు కానీ చెబుతున్నా.. ట్రస్ట్. ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్లీ రాదు లైఫ్ లాంగ్ రాదు.. ఐయామ్ సారీ భరణి అన్నా కానీ అక్కడ నేను బ్రేక్ అయిపోయాను అన్నానంటూ శ్రష్టి ఎమోషనల్ అయింది. దీంతో ఐలవ్యూ శ్రష్టి.. అంటూ భరణి కూడా ఎమోషనల్ అయ్యాడు. చివరగా వెళ్లేటప్పుడు నాగార్జున మరో ప్రశ్న అడిగాడు. నువ్వు వెళ్తూ వెళ్తూ హౌస్‌లో ఒకరిపై బింగ్ బాంబ్ వేయాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పటివరకూ చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరో ఒకరికి ఇవ్వాలని నాగార్జున అన్నాడు. దీంతో టెనెంట్స్‌లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది శ్రష్టి. సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా ఆయన చేస్తారని శ్రష్టి అనడంతో.. తను సరే అన్నట్లుగా చేయి ఎత్తాడు. ఇక హౌస్ అందరికి బైబై చెప్పేసి వెళ్ళిపోయింది శ్రష్టి.

శ్రష్టి వర్మ ఎలిమినేషన్.. ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

  బిగ్ బాస్ సీజన్-9 ఫస్ట్ వీక్ ముగిసింది. హౌస్ లో పదిహేను కంటెస్టెంట్స్  ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేషన్ అవుతారనేది అందరికి తెలిసిందే. అయితే ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది తెలుసుకోవాలనే ఆసక్తి బిబి ఆడియన్స్ అందరిలోను ఉంది. (Shrasti Verma Elimination)   అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఫ్లోరా సైనీ, డీమాన్ పవన్, శ్రష్టి వర్మ ముగ్గురు తక్కువ ఓట్ల తేడాతో లీస్ట్ లో ఉన్నారు. ఓటింగ్ టాప్ లో తనూజ ఉండగా సెకెండ్ ప్లేస్ లో సుమన్ శెట్టి, థర్డ్ ప్లేస్ లో ఇమ్మాన్యుయల్ ఉన్నారు. హౌస్ లో డీమాన్ పవన్ కాస్త బాగానే కన్పిస్తున్నాడు. కానీ ఫ్లోరా సైని, శ్రష్టి వర్మ స్క్రీన్ స్పేస్ తక్కువే ఉంది. అందులోను వీరికి పెద్దగా ఫ్యాన్స్ ఎవరు లేరు. ఫ్లోరా సైనికి తెలుగు అభిమానులు అంతగా కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు. అలాగే శ్రష్టి వర్మకి నెగెటివ్ ఎక్కువగా ఉంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ నుండి బయటకు వస్తారనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది.    ప్రతీ సీజన్ వీకెండ్ శని, ఆదివారాలు ప్రసారం కాబోయే ఎపిసోడ్స్ రెండూ కూడా శనివారం షూట్ పూర్తవుతాయి. అయితే హౌస్ లో ఏం జరిగింది.. శనివారం ఎవరిని నాగార్జున తిట్టాడు.. ఎవరికి రెడ్ కార్డ్ ఇచ్చాడు.. ఇలా కొన్ని లీక్స్ బయటకు వస్తుంటాయి. అయితే దీనితో పాటు ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది కూడా లీక్ అవుతుంది. నిన్న సాయంత్రం నుండి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrasti Verma) ఎలిమినేట్ అయ్యిందని వార్తలొస్తున్నాయి. బిగ్ బాస్ అప్డేట్స్, ట్రోల్స్ అంటు చాలా సోషల్ మీడియా అకౌంట్స్ లో శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అయ్యిందనే చెప్తున్నారు. గత సీజన్ కూడా ఇలానే లీక్స్ వచ్చాయి. అయితే కొన్నిసార్లు బిగ్ బాస్ టీమ్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంటుంది.  

Bigg Boss 9: ఫ్రీబర్డ్ అనేది తప్పేం కాదన్న సంజన.. క్షమాపణ చెప్పిన ఫ్లోరా!

  బిగ్ బాస్ సీజన్-9 తెలుగు ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైర్ చూపిస్తూ ఒక్కొక్కరి బాక్స్ బద్దలు కొట్టేశాడు. ఇక తొలివారం కాబట్టి ఎగ్జైట్‌మెంట్ మామూలుగా లేదు. నాగార్జునని చూడగానే.. ప్రతీ సీజన్‌లోని కంటెస్టెంట్స్ మాదిరిగానే.. వావ్ సర్.. హ్యాండ్సమ్ సర్ అంటూ హౌస్‌లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ పొగిడేశారు. సంజనా అయితే లవ్ సింబల్ చూపిస్తూ.. చాలా అందంగా ఉన్నారు సర్.. మిమ్మల్ని చూడగానే రిఫ్రెష్ అయిపోయాం.. చాలా కొత్తగా కనిపిస్తున్నారని అనగా.. నాగార్జున కూడా లవ్ సింబల్‌ని చూపించేసి.. నీలో కూడా రోజుకో కొత్త పర్సన్ కనిపిస్తున్నారన్నాడు. దెబ్బకి హౌస్ అంతా చప్పట్లు కొట్టేశారు. కొత్త పర్సన్‌ కనిపించడం కాదు సర్.. తనలోకి కొత్త పర్సన్‌ని చూపిస్తుందని ఇమ్మాన్యుయల్ అన్నాడు.     నాగార్జున హౌస్ లో ఉన్నవాళ్ళందరిని పలకరించాడు. సోల్జర్ డ్యూటీ ఎలా ఉందని పవన్ కళ్యాణ్ ని అడుగగా.. పర్లేదు సర్ హ్యాండిల్ చేయొచ్చని అతను అన్నాడు. రీతూని లేపి.. నీ లక్కీ కలర్ బ్లూ అన్నావ్ కదా.. మరి నువ్వెందుకు వేసుకోలేదని నాగార్జున అడిగాడు. మీరు వేసుకుని వచ్చారు కదా.. మీ లక్ నాకు అంటించండి అని రీతూ అంది. దాంతో నాగార్జున.. ఆమె ఎదపై డిష్ వాషర్ అని బ్లూకలర్ బోర్డ్‌ని జిరాక్స్ తీసిన నాగార్జున.. దానిపై ఉందిలే బ్లూ అంటూ మన్మథుడు అని అనిపించాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ తో సరదాగా మాట్లాడాడు. నువ్వు కూర్చో గుండు అంకుల్ తర్వాత మాట్లాడుకుందామని అన్నాడు. ఇక ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిన సంజనకి క్లాప్స్ కొట్టాడు నాగార్జున. సర్.‌ ఎవరూ కెప్టెన్ మాట వినడం లేదు.. చాలా బాధలు ఉన్నాయి సర్ చెప్పుకోవాలని సంజనా అంది. తర్వాత మాట్లాడుదామని కూర్చోమన్నాడు.    ఇక ఆట మొదలెడదామా అని స్టార్ట్ చేశాడు. ఫ్రీ బర్డ్‌తో మొదలుపెడతామంటూ ఆ కార్డ్ తీసి సంజనా, ఫ్లోరా షైనీల మధ్య జరిగిన ఫ్రీ బర్డ్ ఇష్యూపై చర్చ మొదలుపెట్టాడు. రాము రాథోడ్.. మీకు పెళ్లైందా అని నాతో మాట్లాడుతుంటే.. నేను రిలేషన్‌లో ఉన్నానని చెప్పా. ఇంతలో సంజనా వచ్చింది. నన్ను ఫ్రీ బర్డ్ అని చెప్పిందని కంప్లైంట్ చేసింది ఫ్లోరా. ఫ్రీబర్డ్ అంటే తప్పు కాదు సర్.. ఏ డిక్షనరీలో చూసినా అదేం తప్పు పదం కాదని సంజనా సమర్ధించుకుంది. దాంతో వీడియో వేసి చూపించారు నాగార్జున. నేను క్లీయర్‌గానే చెప్పాను కదా సర్.. ఆమెకి అది తప్పుగా అర్థమయ్యింది. అయితే ఫ్లోరాను పర్సనల్‌గా టార్గెట్ చేసిందని హౌస్‌లో ఉన్న వాళ్లంతా సంజనాను తప్పు పట్టారు. ఇక ఫ్లోరాకి కాఫీ ఇవ్వొద్దని సంజనా చెప్పిందని హౌస్‌లో వాళ్లు చెప్పడంతో సంజనాకి క్లాస్ పీకి ఆమె బాక్స్ కూడా బద్దలు కొట్టేశాడు నాగార్జున.    ఆ తర్వాత సంజనా గురించి ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడంతో దానిని గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్చేసింది సంజనా. దాంతో నాగ్ క్షమాపణ చెప్పమన్నారు. అందరి ముందు సంజనాకి క్షమాపణ చెప్పింది ఫ్లోరా. ఇక తనూజని ధైర్యంగా ఉండమని నాగార్జున చెప్పాడు. ఏడ్వొద్దు తనూజా.. నిన్ను ఎమోషనల్‌గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు.. నువ్వు ఏడ్వొద్దు. ధైర్యంగా ఎదుర్కో..మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారని ఇన్ డైరెక్ట్‌గా మాస్క్‌ మ్యాన్‌ కి చురకలు వేశాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. నిందను తనూజ మీదికి నెట్టేసిన ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు నాగార్జున.  

Jayam serial : శకుంతల మనసు మార్చేసిన వీరు.. ఆ కేసు వాపస్ తీసుకుంటుందా?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -55 లో... గంగని రుద్ర పిలిచి మాట్లాడతాడు. నేను ఏమైనా తప్పు చేసానా తిట్టడానికి పిలిచారా అని గంగ భయపడుతుంది. నువ్వు చాలా తెలివైన దానివి గంగ.. ఏ సమస్యనైనా సునాయసంగా దాటగలవు. నేను లేకపోతే కొన్ని పనులు ఆగిపోతాయ్.. అందుకే ఒక ముఖ్యమైన బాధ్యత నీకు అప్పజెప్పాలని అనుకుంటున్నానని రుద్ర అంటాడు.   మరుసటిరోజు ఉదయం అందరు ఈ రోజే కోర్ట్ ఫైనల్ హియరింగ్.. ఒకవేళ శకుంతల కేసు వాపస్ తీసుకోకుంటే రుద్రకి శిక్షపడుతుందని భయపడుతారు. అప్పుడే రుద్ర వస్తాడు. శకుంతల వచ్చి గంగని పిలుస్తుంది. పూజ కోసం పువ్వులు తీసుకొని రమ్మన్నాను కదా.. తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. తీసుకుని వచ్చానని గంగ చెప్తుంది. రుద్ర గురించి శకుంతలతో పెద్దసారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే.. నన్ను ఎవరు డిస్టబ్  చెయ్యకండి అని శకుంతల అంటుంది.   గంగని తీసుకొని రుద్ర బయటకు వెళ్తాడు. మరొకవైపు శకుంతల దగ్గరికి వీరు వెళ్లి రుద్రపై ఇంకా కోపం పెరిగేలా మాట్లాడతాడు. మీరు రుద్ర చేసిన పనిని మర్చిపోతున్నారు అత్తయ్య.. గంగని  మధ్యలో పెట్టి మీకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాడని అన్ని గుర్తు చేస్తాడు. దాంతో రుద్రపై శకుంతలకి ఇంకా కోపం పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9: రెడ్ ఫ్లవర్ వీడియో.. బుక్కైపోయిన హరీష్.. ఏకిపారేసిన నాగార్జున!

  బిగ్ బాస్ సీజన్-9 లో శనివారం నాటి ఎపిసోడ్ ట్విస్ట్ లతో సాగింది. నాగార్జున గ్లామర్ గా రెడీ అయి వచ్చేశాడు. వచ్చీ రాగానే కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. సంజనా అండ్ ఫ్లోరా మధ్య ఇష్యూ ఒకటి, మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన గొడవలు హైలైట్ గా నిలిచాయి.    మొదటగా ఇమ్మాన్యుయల్ ని నాగార్జున లేపాడు. తను గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా.. అగ్నిపరీక్షలో ఒక సంకల్పంతో గుండు చేయించుకుంటే నువ్వు అంత మాట అంటావా.. అతని సంకల్పాన్ని హేళన చేస్తావా అని నాగార్జున అడిగాడు. అయ్యో సర్ నేను అంత హర్ట్ అవుతారంటే నేను అనేవాడ్ని కాదని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇతను నిజంగానే సరదాగా అన్నాడని హౌస్‌లో ఎంత మంది అనుకుంటున్నారని నాగార్జున హౌస్‌లో ఉన్న వాళ్లని అడుగగా.. హౌస్‌లో ఉన్న వాళ్లంతా చేతులు ఎత్తారు. చూశావా హరీష్.. హౌస్‌లో ఉన్న వాళ్లే కాదు.. బయట ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారని నాగార్జున అన్నాడు. నవ్వించడం తన హాబీ.. గుండు అంకుల్ అనే మాట నవ్వించడానికే తప్ప బాడీ షేమింగ్ కాదని నాగార్జున అన్నాడు. ఆ మాటతో ఇమ్మాన్యుయల్ ఏడ్చేశాడు. దాంతో నాగ్.. చూడు ఆడియన్స్ అంతా నీ పక్కనే ఉన్నారు.. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు.. చాలా సరదాగా అన్నావ్ తప్ప.. రాంగ్‌గా అనలేదని జనం నమ్మారు.. నువ్వు ఇలాగే ఎంటర్ టైన్ చేస్తూ హ్యాపీగా ఉండు. కామెడీ చెయ్.. కానీ హద్దులు దాటొద్దు.. ఆలోచించి కామెడీ చెయ్ అని అందరితో ఇమ్మూకి నాగార్జున చప్పట్లు కొట్టించాడు.   రెడ్ ప్లవర్ అని ఇమ్మాన్యుయల్ ని మాస్క్ మ్యాన్ హరీష్ అన్న వీడియో చూపించాడు నాగార్జున. సార్ దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు అని అన్నాడు. దాంతో నాగార్జున.. ‘నేను నిన్ను అడగలేదు కదా’ అని అన్నారు. ఆ తరువాత హౌస్ కాల్ తీసుకున్నారు. అది బ్యాడ్ వర్డ్ అని హౌస్‌లో ఉన్న వాళ్లు చెప్పారు. భరణి అయితే కుండబద్దలు కొట్టినట్టుగా తప్పు సార్ ఆ పదం అని అన్నాడు. దమ్ము శ్రీజ అయితే.. ఫన్నీగా అన్నట్టుగా ఉంది అని అన్నది. లేదు సర్.. ఆయన డబుల్ మీనింగ్‌లో అన్నారని సంజనా అంది. ఆ మాటతో హరీష్. మంచి మాటలు మీ దగ్గర నుంచే వినాలంటూ నాగార్జున ముందే ఫైర్ అయిపోయాడు. దాంతో నాగార్జున.. నేను మాట్లాడుతున్నా.. రాష్ టాక్ వద్దని హరీష్ ని నాగార్జున అన్నాడు. గుండు అంకుల్‌కి సారీ చెప్పించుకున్నప్పుడు.. రెడ్ ఫ్లవర్‌కి చెప్పాల్సిన పని లేదా అని నాగార్జున అడుగగా.. సారీ బ్రదర్.. అవసరం అయితే ఈ షో నుంచి క్విట్ అవుతానని మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు.    దాంతో నాగార్జున మాస్క్ మ్యాన్ హరీష్ చేసిన బ్యాడ్ కామెంట్ల వీడియో అందరికి చూపించాడు.  'తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి.. నేను వాళ్లని ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అనుకున్నా.. కానీ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది' అని మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడాడు. ఆ వీడియో చూపించి చెడుగుడు ఆడుకున్నారు నాగార్జున. దాంతో హరీష్.. నాకు ఆడ మగ సమానమే.. ఆడాళ్లను తక్కువ చేయలేదని అన్నాడు. హౌస్ లోని వాళ్ళని అడుగగా అందరు హరీష్ మాడ్లాడింది తప్పని చెప్పారు. 'ఇతను అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.. భరణి, ఇమ్మానుయేల్‌‌ని అబ్బాయిలు కాదు.. అమ్మాయిలు అని అవమానిస్తూ మాట్లాడారు.. డీ గ్రేడ్ కాదు.. ఈ గ్రేడ్ చేసి మాట్లాడారు' అని సంజనా అంది. సర్ నేను అలా అనలేదు సర్.. నా ఉద్దేశం అది కాదు.. ఇద్దరు మగవాళ్లు ఒక ఆడవాళ్లు అనే అన్నానని హరీష్ అడ్డంగా వాదించడంతో నీతో వాదించలేనురా బాబూ అన్నట్టుగా నాగార్జున చేతిలో ఉన్న సుత్తిని కిందికి వదిలేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ నుండి సోషల్ మీడియాలో మాస్క్ మ్యాన్ హరీష్ పై ఫుల్ నెగెటివ్ ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. మీకేమనిపిస్తోంది.. మగాళ్ళని ఆడాళ్ళంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అనడం కరెక్టేనా లేదా కామెంట్ చేయండి.  

Brahmamudi : రేవతి ముసుగు పోయింది.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ!

  స్టార్ మా టీవీలో ప్రసామవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -825 లో... ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు. అపర్ణ స్వరాజ్ ని మీద కూర్చోపెట్టుకొని భోజనం తినిపిస్తుంటుంది. అది చూసి రేవతి ఎమోషనల్ అయ్యి, బయటకు వెళ్తుంది. తన వెనకాలే రాజ్, కావ్య వెళ్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.. తన మనవడిని ప్రేమగా చూసుకుంటుందని రాజ్, కావ్యలతో రేవతి అంటుంది.   ఆ తర్వాత రాజ్, కావ్య, రేవతి తిరిగి ఇంట్లోకి వెళ్తారు. ఏమైందని అపర్ణ అనగానే.. వాళ్ళ అమ్మగారు దూరంగా ఉంటారట.. నువ్వు అలా ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకుంటే వాళ్ళమ్మ గుర్తు వచ్చిందట అని రాజ్ చెప్తాడు. నన్ను కూడా మీ అమ్మ అనుకోమని అపర్ణ అంటుంది. ఎలాగైనా రేవతి ముసుగు తీయాలని రుద్రాణి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కావాలనే రేవతిపై రుద్రాణి వాటర్ పోసి ముసుగు తియ్యబోతుంటే.. అప్పుడే అపర్ణ కోప్పడుతుంది.    మరొకవైపు కావ్య గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని అప్పు బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కావ్య పడిపోతుంటే రాజ్ చూసి మెల్లిగా కడుపులో నా బిడ్డ ఉందని అంటాడు. మన బిడ్డ అని కావ్య అంటుంది. వాళ్లని చూసి పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కంటున్నారని కళ్యాణ్ తో అప్పు అంటుంది. ఆ తర్వాత సాయంత్రం సరదాగా చీటీ గేమ్ ఆడుతారు. చీటీ లో వచ్చింది చెయ్యాలి. తరువాయి భాగంలో ముసుగులో వచ్చింది రేవతి అని అందరికి తెలిసిపోతుంది. నాకు ముందే తెలుసని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : కార్తీక్ మాటల వల్ల మారిన శ్రీధర్.. పారిజాతంకి శిక్ష!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -462 లో... జ్యోత్స్న చేతిలో తాళి పెట్టి వెళ్తుంది దీప. అప్పుడే జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి.. నా భార్య ఏదో ఇస్తాను అంది ఇచ్చిందా? ఇచ్చే ఉంటుందిలే అని కార్తీక్ వెటకారంగా మాట్లాడుతుంటాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వస్తుంది. నువ్వు ఏదో దాస్తున్నావ్ బావ అని జ్యోత్స్న అడుగుతుంది. ఏం దాస్తున్నానని కార్తీక్ మళ్ళీ వెటకారంగా మాట్లాడతాడు.   ఆ తర్వాత నువ్వు ఇందంతా కావాలనే చేస్తున్నావ్.. అందరిని నాకు యాంటి చేస్తున్నావ్.. ఒక మమ్మీ మాత్రమే నాకు సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు తనని కుడా మీ వైపుకి మార్చుకోవాలని చూస్తున్నావ్.. ఇప్పుడు ఆ పాపని తీసుకొని వచ్చి మరింత దగ్గర అయ్యి.. సీఈఓ అవ్వాలని అనుకుంటున్నావని జ్యోత్స్న అనగానే జోక్ బాగుందని కార్తీక్ అంటాడు.    ఆ తర్వాత శ్రీధర్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టానని స్వప్న ఏడుస్తుంటే.. కావేరి ఓదారుస్తుంది. అప్పుడే స్వప్నని శ్రీధర్ పిలిచి బయటకు వెళదామని అంటాడు. బయటకు వెళ్తుంటే బైక్ స్టార్ట్ అవ్వదు.. శ్రీధర్ చూసి కావేరిని పిలిచి బైక్ రిపేర్ అనుకుంటా.. ఇదిగో డబ్బు అల్లుడికి ఇచ్చి బైక్ రిపేర్ చేయించమను ఖర్చులకి ఉంచుకోమను అని చెప్పి కావేరికి డబ్బు ఇస్తాడు శ్రీధర్. దాంతో డబ్బు తీసుకొని వెళ్లి స్వప్నకి ఇస్తుంది. తర్వాత అది స్వప్న తీసుకొని కాశీకి ఇస్తుంది.   మరొకవైపు శౌర్య దగ్గర నుండి పారిజాతం చాక్లెట్ బాక్స్ దొంగతనం చేస్తుంది. ఆ విషయం శివన్నారాయణకి తెలిసి పారిజాతంపై కోప్పడతాడు. కార్తీక్ బెత్తం తీసుకొని వస్తాడు. అది చూసి పారిజాతం భయపడుతుంది. ఎవరైనా చిన్నపిల్లల నుండి చాక్లెట్ దొంగతనం చేస్తారా అని కార్తీక్ అనగానే.. నోరు అంత చేదుగా ఉంది అందుకేనని పారిజాతం అంటుంది. ఆ తర్వాత శ్రీధర్ లో సడన్ గా ఇంత మార్పు ఏంటి దీనికి అన్నయ్యనే కారణమై ఉంటుందని కావేరితో స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భద్రవతి ఇచ్చిన డబ్బుకి లొంగిపోయిన భాగ్యం.. అంతా శ్రీవల్లి కోసమే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -263 లో... శ్రీవల్లితో చందు కోపంగా మాట్లాడతాడు. నువ్వు నాతో మాట్లాడకని చిరాకు పడతాడు. దాంతో శ్రీవల్లి ఏడుస్తుంది. శ్రీవల్లి తన పుట్టింటికి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. మీరు ఇప్పుడు పది లక్షలు ఇస్తేనే నా కాపురం బాగుంటుందని శ్రీవల్లి చెప్తుంది. సరే.. ఎలాగోలా సర్దుబాటు చేస్తానని భాగ్యం హామీ ఇచ్చి శ్రీవల్లి ని పంపిస్తుంది.   అంత డబ్బు ఎలా తీసుకొని వస్తామని భాగ్యంతో ఆనందరావు అంటాడు. అప్పుడే భద్రవతి, విశ్వ కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. మీరెందుకు వచ్చారని భాగ్యం అడుగుతుంది. నాకొక సహాయం కావాలి.. మీకు కావాల్సిన డబ్బు ఇస్తానని భద్రవతి చెప్తుంది. పాతికేళ్ళుగా నా చెల్లికి దూరంగా ఉంటున్నాను.. ఇప్పుడు నా మేనకోడలికి కూడా.. ఇక ఈ దూరం భరించలేను.. నా మేనల్లుడు విశ్వకి రామరాజు చిన్న కూతురు అమూల్యకి పెళ్లి చేస్తే ఇరు కుటుంబాలు కలుస్తాయి. మేము వెళ్లి రామరాజుతో మాట్లాడితే ఒప్పుకోడు.. నీ కూతురు ఆ అమూల్యకి, విశ్వకి మధ్య సఖ్యత ఏర్పడేలా చేయాలని భద్రవతి చెప్తుంది. మొదట భాగ్యం ఒప్పుకోదు. విశ్వ పదిలక్షలు తీసుకొని రాగానే ఒప్పుకుంటారు.   మరోవైపు ఏ టెన్షన్ లేదు.. ఆ కళ్యాణ్ గాడు ఫోన్ చెయ్యడని ప్రేమ అనుకుంటుంది. కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నేను నిన్ను లేపుకుని వెళ్లిన విషయం.. అలాగే ఏ పరిస్థితిలో ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడో.. మీ మావయ్యకి చెప్తానని కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరొకవైపు ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుందో.. తన ఫ్రెండ్స్ ని ధీరజ్ అడుగుతాడు. ఎవరు తెలియదని అంటారు. ఆ తర్వాత ఆనందరావు, భాగ్యం కలిసి శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంటే దారిలో తనే ఎదురుపడుతుంది.    తరువాయి భాగంలో కళ్యాణ్ చెప్పిన అడ్రెస్ కి ప్రేమ వెళ్తుంది. కళ్యాణ్ తన భుజంపై చేయి వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సంజన vs ఫ్లోరా ... నాగార్జున ఈజ్ బ్యాక్.. బాక్స్‌లు బద్దలైపోతాయ్

బిగ్ బాస్ సీజన్-9 వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో కోసం చాలామంది వెయిటింగ్.. ఎందుకంటే ఇందులోనే కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్ ఎలా ఉందనేది చూస్తారు. ఇక ఈ సీజన్ ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అంటే ఆ క్యూరియాసిటీ నెక్స్ట లెవెల్ ఉంటుంది. కింగ్ నాగార్జున వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పాడు. మిమ్మల్ని చూడగానే పడిపోతున్నా సర్ అని ఫ్లోరా సైనీ ఓ బిస్కెట్ వేసింది. ఇక అందరు నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని లేపి క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి ఇమ్మానుయేల్ కాస్త చిక్కినట్టున్నావ్ అని నాగార్జున అంటే.. సాంబార్ సర్.. సాంబార్ అని అన్నాడు. సరే కూర్చో గుండు అంకుల్ మనం తరువాత మాట్లాడుకుందామని హరీష్‌ని గుండు అంటూ హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాము రాథోడ్‌ని ఎప్పుడు చూసిన బట్టలు ఉతుకుతూనే కనిపిస్తుండటంతో.. ‘అబ్బబ్బా ఏం ఉతుకుతున్నావ్.. ఏం ఆరేస్తున్నావ్’ అని అన్నారు నాగార్జున. మిమ్మల్ని చూసిన తరువాత మొత్తం మర్చిపోయాను సార్ అని రాథోడ్ అంటే.. ‘మీరు మర్చిపోయారేమో.. నేను మర్చిపోలేదు.. నా ముందు బాక్స్‌లు ఉన్నాయి. ఒక్కొక్కరికీ బాక్స్‌లు బద్దలైపోతాయ్ అంటూ సంజనాతో మొదలుపెట్టారు. తన రిలేషన్ షిప్ గురించి హౌస్‌లో మాట్లాడుతుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఫ్లోరా షైనీ. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంజనా, ఫ్లోరాలను నిలబెట్టారు. తనకి పెళ్లి కాలేదని చెప్పడంతో.. ఆమె ఫ్రీబర్డ్ అని అన్నదంటూ హౌస్‌లో జరిగిన దాన్ని నాగార్జున ముందుంచింది ఫ్లోరా. అయితే ఏ డిక్షనరీలో కూడా ఫ్రీబర్డ్ అంటే తప్పుడు అర్థం ఉండదంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ పదం తప్పు కాదు కానీ.. ఫ్లోరా మాట్లాడుతున్నప్పుడు యాడ్ చేయడం తప్పు అని నాగార్జున అన్నాడు. ఆవిషయాన్ని మనసులో పెట్టుకున్న సంజనా.. నాకు కాఫీ ఇవ్వొద్దని చెప్పిందంటూ నాగార్జునకి ఫ్లోరా కంప్లైంట్ చేసింది. అయితే నేను అలా చెప్పలేదని సంజనా అనడంతో అన్నాదంటూ ప్రియ, శ్రీజలు సాక్ష్యం చెప్పారు. దాంతో సంజనాను అడిగాడు. మరి ఈ ప్రోమోలో నాగార్జున అంతగా ఫైర్ అవ్వలేదని అనిపిస్తోంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలై అయిదు రోజులవుతుంది. అప్పుడే వీకెండ్ కూడా వచ్చేసింది. వీకెండ్ అంటే తెలుసుగా మాములుగా ఉండదు. కంటెస్టెంట్స్ కి ఈరోజు నాగార్జున వచ్చి ఏమంటాడోనని చెమటలు పడతాయి. ఎప్పటిలాగే వీకెండ్ లో కొంతమందిని సేవ్ చేసి మిగతా కంటెస్టెంట్స్ ని ఆదివారం రోజు ఎలిమినేట్ చేస్తారు. ఎవరైతే ఆడియన్స్ వేసిన ఓటింగ్ లో లీస్ట్ లో ఉంటారో వాళ్ళే హౌస్ నుండి బయటకు వస్తారు. ప్రస్తుతం ఓటింగ్ లో మొదటి స్థానంలో తనూజ ఉండగా ఎవరు ఊహించని విధంగా సుమన్ శెట్టి రెండవ స్థానంలో ఉన్నాడు. సుమన్ శెట్టికి ఇప్పటివరకు బిగ్ బాస్ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. అందుకే అతడిని కావాలని చూపించట్లేదు. అయితే సుమన్ శెట్టికి సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లోకి వస్తున్నాయి. హౌస్ లో అందరితో సుమన్ శెట్టి కలిసి ఉంటున్నాడని బిగ్ బాస్ అవేమీ చూపించట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే అతను ఓటింగ్ లో టాప్-2లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాలలో అయితే డీమాన్ పవన్, రీతూ చౌదరి, ఫ్లోరా సైని ఉన్నారు. డీమాన్ పవన్ బయటకు వెళ్లే ఛాన్స్ అయితే తక్కువ ఎందుకంటే అతను కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులోను కామనర్స్ ఆరుగురే కాబట్టి తను ఇప్పుడే అప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే ఇప్పడున్న కంటెస్టెంట్స్ లో ఎక్కువ జనాలకి ముఖపరిచయం ఉంది తనే. రీతూ చౌదరి అంత ఈజీగా హౌస్ నుండి బయటకు రాదు. ఇక ఫ్లోరా సైనీకి తెలుగులో ఎక్కువ ఫ్యాన్ బేస్ లేకపోవడం.. తెలుగు మాట్లాడటం సరిగ్గా రాకపోవడం.. హౌస్ లో సైలెంట్ గా ఉండడం.. ఇవన్నీ తనకి మైనస్ అవుతున్నాయనే చెప్పాలి. ఈ వారం హౌస్ నుండి ఫ్లోరా సైనీ బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కన్పిస్తుంది.  అయితే ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వస్తారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో అందరు దొంగలే.. దొరికితే!

  బిగ్ బాస్ హౌస్ లో దొంగలు పడ్డారు. అవును నిజమే.. హౌస్ లో ఒకరికి మించి ఒకరు దొంగతనం చెయ్యడంలో పీహెచ్ డి పట్టా పొందారు. సంజన కెప్టెన్ కాగానే తనకంటూ సపరేట్ గా లగ్జరీ వస్తుంది. హ్యాంపర్ లో చాక్లెట్స్ వస్తాయి. కాసేపటికి సంజన రూమ్ కి  ప్రియ, శ్రీజ  వెళ్ళి హ్యాంపర్ నుండి చాక్లెట్స్ దొంగతనం చేస్తారు. అదిలా ఉండగా రీతూ చాక్లెట్ తీసుకొని తింటుంది. కెప్టెన్ సంజన తనకి చిన్న ఫ్రిడ్జ్ నిండుగా కూల్ డ్రింక్స్ వస్తాయి. అవి చేతిలో పట్టుకొని ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తే వాళ్ళకోసమే ఇవి అని అంటుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉండగా హరీష్ వెళ్లి ఒక థమ్స్ అప్ తీసుకొని వచ్చి సోఫా కింద దాచేస్తాడు. కాసేపటికి ఒక కూల్ డ్రింక్ మిస్ అయింది. ఎవరు తీసుకున్నారని సంజన అడుగగా ఎవరు చెప్పరు. హరీష్ , ఫ్లోరా వాషింగ్ ఏరియాకి వెళ్లి థమ్స్ అప్ ని వాటర్ బాటిల్ లో పోసి ఖాళీ బాటిల్ ని డస్ట్ బిన్ లోపల వేస్తారు. ఆ వాటర్ బాటిల్ లో పోసిన కూల్ డ్రింక్ ని ప్రియకి ఇస్తాడు.  ఆ తర్వాత సంజన రూమ్ కి రీతూ వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో కొంచెం, అందులో కొంచెం తాగి లోపల పెడుతుంది. ఆ తర్వాత సంజనని ఇంప్రెస్ చెయ్యడానికి అందరు కలిసి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తారు. అందులో పర్ఫామెన్స్ బాగా చేసిన వాళ్ళకి థమ్స్ అప్ అనౌన్స్ చేస్తుంది సంజన. చివరకి వచ్చేసరికి ప్రొద్దున ఒక థమ్స్ అప్ ఎవరు తీశారు. అది ఇస్తే ఇవన్నీ అందరికి ఇచ్చేస్తానని అనగానే అందరికి కోపం వస్తుంది. 

Bigg boss 9 Telugu :బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా శివాజీ.. ఈసారి మాములుగా ఉండదుగా!

  బిగ్ బాస్ లో ప్రతీ వీక్ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం అనేది పక్కా.. హౌస్ నుండి బయటకు వచ్చాక హౌస్ లో అనుభవాలని గురించి కొంచెం ఘాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. అదే బిగ్ బాస్ బజ్.... ఇప్పటివరకు బజ్ కి హోస్ట్ గా ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరైతే ముక్కు సూటిగా బోల్డ్ గా మాట్లాడతారో బిగ్ బాస్ టీమ్ వాళ్ళనే సెలక్ట్ చేస్తుంది. గత సీజన్ కి అంబటి అర్జున్ చెయ్యగా ఈసారి ఎవరనేది చాలా రోజులా నుండి బిగ్ బాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అయితే అందరికి ఊరటనిచ్చేలా స్టార్ మా ఒక ప్రోమో వదిలింది. ఈ సారి బిగ్ బాస్ కి  బజ్ కి హోస్ట్ గా మన శివాజీ గారు చేయబోతున్నారు. హౌస్ లో శివాజీ మాటతీరు ఆల్రెడీ చూసేసాం.. ఒక హోస్ట్ గా అయితే ఇదే మొదటిసారి.ఎదుటివారిది తప్పుంటే చెంపదెబ్బ కొట్టినట్లు ఆయన మాట ఉంటుంది. మరి హోస్ట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పలేం తాజాగా వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటూ శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే పనివల్ల ఆడియన్స్ లో తమ ఇమేజ్ మారుతూ ఉంటుంది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక అతను రైటో రాంగో డిసైడ్ చేద్దాం.. అయితే ఈ సారి బజ్.. అంటూ ముగించేశాడు శివాజీ. ఇక కంటెస్టెంట్స్ కి చుక్కలే మరి.

Bigg boss 9 Telugu :ఈ సీజన్ మొదటి కెప్టెన్ గా సంజన.. మిగతా వాళ్ళకి చుక్కలే!

  బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెడర్స్ కి బదులుగా వాళ్ళ జోడి టాస్క్ ఆడుతారు. అందులో మొదటగా ఇమ్మాన్యుయల్ టీమ్ అయినా భరణి రేస్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత హరీష్ జోడి పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్ జోడి ప్రియ తప్పుకుంది. చివరగా రాము, శ్రీజ ఇద్దరు ఉంటారు. రాము టఫ్ ఫైట్ ఇస్తాడు కానీ తప్పుకుంటాడు. ఫైనల్ గా శ్రీజ గెలుస్తుంది.  శ్రీజ కెప్టెన్ అవ్వదు తన జోడీ సంజన కెప్టెన్ వుతుంది. సంచాలక్ మనీష్ కెప్టెన్సీ బ్యాండ్ ని సంజనకి పెడతాడు. సంజన కెప్టెన్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే తనకి ఓనర్స్ తో పాటుగా వారం రోజుల పాటు అన్ని లగ్జరీస్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అందరు నేను చెప్పినట్టు వినాలి ముఖ్యంగా ఇప్పుడు నేను స్పెషల్ రూమ్ కి వెళ్తున్నాను కాబట్టి నా సామాను అంతా ఎవరు షిఫ్ట్ చేస్తారు.. ఇద్దరు హెల్పర్స్ కావాలని సంజన ఆర్డర్ వేస్తుంది. నేను చేస్తాను ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్ గా నాకు ఛాన్స్ ఇచ్చారు కదా అని ఇమ్మాన్యుయల్ అంటాడు. ఇంకొకరు ఫ్లోరా సైని చెయ్యాలని సంజన అనగానే నేను చెయ్యనని ఫ్లోరా సమాధానం చెప్తుంది‌. చూసారా నేను అడిగితే ఎలా చెప్తుందో.. చూసుకుంటానన్నట్లు ఒక లుక్ ఇస్తుంది సంజన. దీన్ని బట్టి చూస్తే సంజన వల్ల ఈ వారం రోజులు కంటెస్టెంట్స్ కి చుక్కలే అని అర్థమవుతుంది.  

Brahmamudi : రుద్రాణి దొంగ.. స్వరాజ్ ని ప్రేమగా చూసుకుంటున్న అపర్ణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -824 లో....కావ్య నువ్వు వెళ్లి నీకు ఇచ్చిన నెక్లెస్ పెట్టుకొని రా అని అపర్ణ పంపిస్తుంది. కావ్య లాకర్ లో చూసేసరికి నెక్లెస్ ఉండదు. అదే విషయం అందరికి చెప్తుంది. ఎవరు తీశారు.. ఎక్కడ ఉంది.. అందరం మనమే కదా అని రాజ్ అంటాడు. మనం కాకుండా వీళ్ళు వచ్చారు కదా అని రేవతి పేరు చెప్తుంది. రుద్రాణి తన బ్యాగ్ లో వెతకాలని రేవతి బ్యాగ్ చెక్ చేస్తుంది కానీ అందులో ఏముండదు. నేను ఇందులోనే వేసాను కదా లేదేంటని రుద్రాణి షాక్ అవుతుంది. నెక్లెస్ ఏమైంది అని అందరు అంటుంటే.. అప్పుడే స్వరాజ్, కనకం ఎంట్రీ ఇస్తారు. నాకు నెక్లెస్ ఎక్కడుందో తెలుసని అపర్ణని తీసుకొని స్వరాజ్, రుద్రాణి రూమ్ లో ఉన్న కబోర్డ్ చూపించి ఇందులో ఉందని చెప్తాడు. అపర్ణ నెక్లెస్ చూసి కోపంగా కిందకి వెళ్తుంది. నెక్లెస్ ఎక్కడ దొరికింది వదిన అని రుద్రాణి అడుగుతుంది. నీ గదిలోనే అని  అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. నేను తియ్యడం ఏంటని రుద్రాణి అంటుంది. అందరు తనపై కోప్పడతారు. ఆ తర్వాత ఆ నెక్లెస్ ఎలా వచ్చిందని రుద్రాణి ఆలోచిస్తుంటే నేనే పెట్టాను.. నువ్వు మా అమ్మని ఇరికించాలని ట్రై చేసావ్ కానీ నువ్వే ఇలా అయ్యావని స్వరాజ్ అంటాడు. స్వరాజ్ తో పాటు కనకం కూడా ఉంటుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. సుభాష్ , అపర్ణ ఇద్దరు స్వరాజ్ ని ప్రేమగా చూసుకుంటే రేవతి అది చూసి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : వీరు కోసం వచ్చిన పోలీసులు.. గంగకి సపోర్ట్ గా పెద్దసారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -54 లో.....పైడిరాజు నెక్లెస్ దొంగతనం చేసి గంగ తీసిందని తనపై నెట్టుతాడు. దాంతో రుద్ర ఒక ప్లాన్ చేస్తాడు. ఈ కిరోసిన్ గంగ, పైడిరాజు పోసుకోండి.. ఎవరైతే తప్పు చెయ్యలేదో వారికేం కాదని రుద్ర అనగానే గంగ పోసుకుంటుంది‌‌. పైడిరాజుకి బలవంతంగా పోస్తారు. ఇక చేసేదేమీ లేక తనే తీసానని పైడిరాజు ఒప్పుకుంటాడు. దాంతో ఇంట్లో అందరు తనపై కోప్పడతారు. ఆ తర్వాత నువ్వే కదా ఈ ప్లాన్ చేసిందని ఇషికతో వీరు అంటాడు. ఏదో ట్రై చేశాను కానీ ఫెయిల్ అయిందని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. గంగ అనే అమ్మాయి భాను ప్రతాప్ గారిపై కంప్లైంట్ ఇచ్చింది. అతన్ని పిలవండి అని అంటారు. దాంతో అందరు షాక్ అవుతారు. గంగ అసలేం జరిగిందో అందరికి చెప్తుంది. ఒకమ్మాయిని గెస్ట్ హౌస్ కి రమ్మటుంటే నేను కాపాడను. కానీ ఆ కార్ లో ఉన్న వ్యక్తిని చూడలేదు కానీ నేను అతను ఉన్నా కార్ నంబర్ చూసాను.. మళ్ళీ నిన్న ఆ కార్ కనిపించింది.. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను కానీ ఆ కార్ భాను బాబుది అనుకోలేదని గంగ చెప్తుంది. ఇప్పుడు ఎవరు ఆ కార్ ని వాడుతున్నారని శకుంతల అడుగగా అబ్రాడ్ నుండి బిజినెస్ పని మీద వచ్చిన వాళ్ళకోసం వాడుతున్నాం.. వాళ్ళెవరో ఇలా చేసి ఉంటారని వీరు అంటాడు. ఇంకొకసరి నా భాను కార్ ఎవరు వాడడానికి వీళ్ళేదని శకుంతల అంటుంది. ఎవరెవరు అబ్రాడ్ నుండి వచ్చారో అందరి లిస్ట్ చెయ్.. ఎవడో వాడు వాని సంగతి తెలుద్దామని పెద్దసారు అంటడు. గంగ బాధపడుతుంటే.. నువ్వు మంచిపని చేసావ్.. బిజినెస్ కోసం వచ్చిన వాళ్లలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని తెలిసి వచ్చిందని గంగతో పెద్దసారు అంటాడు. ఆ తర్వాత తెల్లవారితే రుద్ర ఫైనల్ హియరింగ్ ఉంటుంది. దాంతో రుద్ర దగ్గరికి పెద్దసారు వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.