కపిల్ శర్మ షోలో మెరిసిన "మిరాయ్" మూవీ టీమ్

రీసెంట్ గా వచ్చిన మిరాయ్ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా శ్రేయ, తేజ, జగపతి బాబు, హీరోయిన్ రితిక నాయక్. ప్రధాన పాత్రలు. ఇక వీళ్లంతా కపిల్ శర్మ షోలో మెరిశారు. ఇక కపిల్ శర్మ తేజ చెప్పిన డైలాగ్స్ ని హిందీలో చెప్పి నవ్వించాడు. ఇక శ్రియ తనకు కాఫీ ఇష్టం అని చెప్పేసరికి రష్యన్ అమ్మాయి ఒక్సానానా పిలిచి మీ వదిన వచ్చింది అంటూ కాసేపు హిందీలో, రష్యన్ లో మాట్లాడించాడు. ఇక ఈ షోకి పెర్మనెంట్ గెస్ట్ గా ఉన్న అర్చన పూరన్ సింగ్ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. "జెబి సర్ మీకు గనక సూపర్ పవర్స్ ఉంటే ఎవరి మైండ్ ని చదవాలనుకుంటారు" అని అడిగారు. "దేవుడి మైండ్ చదవాలనుకుంటాను..ఫ్యూచర్ లో ఎం జరుగుతుందో ముందు తెలుసుకుంటాను  " అంటూ జగపతి బాబు ఆన్సర్ ఇచ్చారు. ఇక కపిల్ శర్మ ఐతే "నాకే సూపర్ పవర్స్ ఉంటే వీసా లేకుండా, పెట్రోల్ ఖర్చు లేకుండా మాల్దీవ్స్ లాంటి ప్లేసెస్ కి ఎగిరి వెళ్ళిపోతా" అని చెప్పాడు. "తేజ టెలిపోర్ట్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తావ్" అని అడిగారు అర్చన. "టెలిపోర్ట్ ద్వారా మహాభారతం జరిగిన ప్లేస్ కి వెళ్లి చూడాలనుకుంటాను" అని చెప్పాడు. "జెబి సర్ మీ వాయిస్ ఇలా ఉండడానికి ఏదైనా రిహార్సల్స్ చేస్తారా, ప్రాక్టీస్ చేస్తారా, నేచురల్ గానే ఉంటుందా" అని అడిగాడు కపిల్ శర్మ. "నా వాయిస్ నాకంటే ముందే పుట్టింది..ఇంతకు ముందు నేను చేసిన మూవీస్ కి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా వాయిస్ మెచూర్డ్ గా ఉంది కాబట్టి నేనే చెప్పుకుంటా" అన్నారు జగపతి బాబు.  

Bigg boss 9 Telugu : హౌస్ లో మొదలైన కెప్టెన్సీ టాస్క్.. లీడ్ లో ఉంది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 సెకెండ్ వీక్ లో నిన్న మొన్నటి వరకు నామినేషన్లతో హౌస్ హీటెక్కింది. అయితే హౌస్ లో రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రెంటర్స్ గా ఏడుగురు.. ఓనర్స్ గా ఏడుగురు ఉన్నారు. కాలచక్రం అనే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు. దానికి టైమర్  ఉంటుంది. ఆ టాస్క్ అయిపోయేవరకు ఎవరు పడుకోవద్దు.. టాస్క్ గెలిస్తే వన్ అవర్ స్లీప్ లెస్ అవర్ తగ్గుతుంది. ఈ టాస్క్ లో ఓనర్స్ నుండి ప్రియ సంచాలకులు.. రెంటర్స్ నుండి తనూజ సంచాలకులుగా ఉన్నారు. అసలు టాస్క్ ఏంటంటే.. ఒక చక్రంపై ఇరు టీమ్ లు చెయ్ తో పట్టుకొని ఉంటారు. అందులో చెయ్ పెట్టుకోకుండా ఆపి వాళ్ళు పట్టుకున్న చక్రాన్ని పట్టుకుంటే వాళ్ళు విన్ అవుతారు. ఇందులో ఆ చక్రం పట్టుకోకుండా వాళ్ళని ఆపుకోవచ్చు. భరణి, ఇమ్మాన్యుయల్ ని గట్టిగా లాక్ చేస్తాడు. అసలు రెంటర్స్ టీమ్ లో ఇమ్మాన్యుయల్, రాము, సుమన్ శెట్టి మేల్ కంటెస్టెంట్స్.. ఓనర్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల ఓనర్స్ విన్ అవుతారు. కెప్టెన్సీ టాస్క్ లో టాస్క్ లు గెలిచే కొద్దీ స్లీప్ లెస్ అవర్స్ తగ్గుతాయి. నిద్రపోకుండా ఉండడానికి ఇరు టీమ్ లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓనర్స్ అయితే రెంటర్స్ కి సంబంధించిన ఫుడ్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ ని ప్రియ, శ్రీజ దాచేస్తారు. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ లో లీడ్ లో ఉన్నది ఓనర్స్. మరి ఈ టాస్క్ లో గెలిచిందెవరొ తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే ‌.

Bigg boss 9 Telugu Nominations: రెండో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే వారం పూర్తయింది. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో వారం హోరాహోరీగా నామినేషన్ల ప్రక్రియ సాగింది. దీనిలో కామనర్స్ అంతా కలిసి వారందరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించిన భరణిని నామినేట్ చేశారు. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం ఒక సైకోలా మారిపోయి.. ఎవరితో పడితో వారితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆదివారం రాత్రి మొదలైన రెండో వారం నామినేషన్ ప్రక్రియలో దాదాపు ఇంటి సభ్యుల టార్గెట్ చేశారు. రీతూ చౌదరీ, భరణి, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, ఇతర కంటెస్టెంట్లతో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. దాదాపు నలభై ఎనిమిది గంటలపాటు సాగిన ఈ ప్రక్రియ గందరగోళం మధ్య ముగిసింది. రీతు చౌదరి, మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత దమ్ము శ్రీజ, హరీష్ కి, భరణికి డీమాన్ పవన్ కి, భరణికి పవన్ కళ్యాణ్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. మాస్క్ మ్యాన్ హరీష్ మాటతీరు, బిహేవియర్ చాలా వరెస్ట్ గా ఉందంటూ.. మాతో ఉండటం ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు కదా అని దమ్ము శ్రీజ అనగా.. మీకు దమ్ముంటే నన్ను వెళ్ళిపోమని బిగ్ బాస్ తో చెప్పండి అంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు. అందరిలో దమ్ము ఉందా అని దాని గురించి మాట్లాడొద్దని రీతూ చౌదరి, తనూజ విరుచుకుపడ్డారు.  నిన్న జరిగిన నామినేషన్లో కామనర్స్ దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్ అంతా కలిసి భరణిని టార్గెట్ చేసి ఓటింగ్ చేశారని ఆడియన్స్ కి క్లియర్ గా తెలిసింది. మాస్క్ మ్యాన్ హరీష్ ఓ అడుగు ముందుకేసి.. భరణి అందరితో నామినేషన్ డిస్కషన్ చేశాడని చెప్పాడు. ఇంకా సిల్లీ రీజన్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేసిన హరీష్. ఆడవాళ్లు, మగవాళ్ళు సమానం.‌. కానీ మీరు అలా లేరు అంటూ ఇమ్మాన్యుయల్ ని హరీష్ నామినేట్ చేశాడు. ఇక ఆ మర్యాద మనీష్ అయితే పెద్ద తోపులాగా భావించి భరణిని నామినేట్ చేశాడు. అతను చెప్పిన రీజన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యాలిడ్ లేవు.. ఇలా చిత్ర విచిత్ర రీజన్లతో కామనర్స్ అయినటువంటి దమ్ము శ్రీజ, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ నామినేట్ చేశారు. ఇక వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు సంబంధం లేకుండా పోయింది. బిగ్ బాస్ సీజన్-9(Bigg boss 9 Telugu Nominations) రెండో వారం నామినేషన్ల ప్రక్రియ అతి కష్టం మీద ల్యాగ్ ఎపిసోడ్ లతో పూర్తయింది. రెండో వారం మాస్క్ మ్యాన్ హరీష్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, భరణి, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ నామినేషన్ లో ఉన్నారు. 

Jayam serial : భానుని చంపింది రుద్ర కాదని పోలీసులకి క్లారిటీ.. మరి ఎవరు?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -59 లో.....సంఘటన రీక్రియేట్ లో నేను ఉంటానని గంగ అంటుంటే రుద్ర వద్దని అంటాడు. నేను అమ్మాయిని నాకు బలం లేదని అనుకుంటున్నారా.. నాకు చాలా బలం ఉంది .. ఇప్పుడు నన్ను వద్దన్నారంటే ఇక్కడ నుండి దుకేస్తానని రుద్రని బ్లాక్ మెయిల్ చేస్తుంది గంగ కానీ తనపై రుద్ర కోప్పడతాడు. ఆ తర్వాత వీరు నువ్వు చెయ్ అని రుద్ర అంటాడు. వీరు బయపడుతుంటే నేనున్నాను.. నీకెందుకు టెన్షన్ అని రుద్ర అంటాడు. భాను ప్లేస్ లో వీరు ఉంటాడు. వీరుని రుద్ర గట్టిగా నెడితే గోడ చివరి వరకు వెళ్లి అక్కడ గోడ దగ్గర ఆగిపోతాడు. రుద్ర గారు అంత గట్టిగా నెట్టినా కూడ వీరు కిందపడలేదు.. గోడ అడ్డు ఉంది.. అయితే భాను గారు కూడ పడే ఛాన్స్ లేదు.. ఎవరో కావాలనే పడేసారని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఈ కేసులో రుద్ర గారి తప్పేం లేదని అనుకుంటారు. ఆ తర్వాత గంగ, రుద్ర, పెద్దసారు ఇంటికి వస్తారు. రుద్రని పెద్దసారు హగ్ చేసుకుంటాడు. మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. నువ్వు ప్రాణంగా చూసుకున్నావ్ వాడిని.. అలాంటిది నువ్వు వాడి ప్రాణం తీసావ్ అంటుంటే చాలా బాధపడ్డానని పెద్దసారు అంటాడు. ఈ విషయం వెంటనే మీ పెద్దమ్మ తో చెప్దామని పెద్దసారు అంటాడు. నేను నెట్టలేదని తెలిసింది కానీ ఎవరు నెట్టారో తెలియదు కదా అని రుద్ర అంటాడు. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు నీకు ఇష్టమైన భానుని దూరం చేస్తే మానసికంగా కుంగిపోతావని ఇలా చేసి ఉంటారని పెద్దసారు అనగానే అవును నిజమే అనిపిస్తుందని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : చందుకి డబ్బులు ఇచ్చిన శ్రీవల్లి.. భద్రవతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -266 లో.... శ్రీవల్లి లో చేతిలో భాగ్యం పదిలక్షలు పెడుతుంది. అవి కిందపడేస్తుంది. వల్లి.. నేను చెప్పేది విను ఈ పది లక్షలు తీసుకొని అల్లుడు గారికి ఇవ్వు‌.. దీనివల్ల నీకేం ప్రాబ్లమ్ రాదు.. పైగా ఆ విశ్వ మీ ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.. రెండు కుటుంబాలు ఒకటి అవుతాయని భాగ్యం చెప్పగానే శ్రీవల్లి సరే అంటుంది. మరొకవైపు ఎన్నిసార్లు నువ్వు ఎందుకు భయపడుతున్నావన్నా కూడా చెప్పలేదు.. నువ్వు ఎందుకు అలా ఉన్నవోనని నాకు భయం వేసిందని ప్రేమతో ధీరజ్ అంటాడు. నువ్వు నాకేం అవుతావురా.. మా అన్నయ్యతో నువ్వేం అన్నావో మర్చిపోయావా.. నేను ఒంటరిని నాకు ఎవరు లేరని ప్రేమ బాధపడుతుంటే.. నేనున్నానని ధీరజ్.. ప్రేమ చెయ్ పట్టుకుంటాడు. కానీ నీ మనసులో నేను లేనని ప్రేమ అనగానే చెయ్ వదిలేస్తాడు.. దాంతో ప్రేమ బాధపడుతుంది. మరొకవైపు భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి ముగ్గురు కలిసి వచ్చి.. చందుకి డబ్బు ఇస్తారు. దాంతో చందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత శ్రీవల్లి, భాగ్యం ఆనందరావు ముగ్గురు గుమ్మం దగ్గరికి వస్తారు. ఎదరుగా భద్రవతి, విశ్వ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తానని శ్రీవల్లి వాళ్లకు చెయ్ ఊపుతుంది. అక్కడ నుండి భాగ్యం వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నర్మదకి సాగర్ మల్లెపూలు తీసుకొని వస్తాడు. తరువాయి భాగంలో ప్రేమకి ధీరజ్ సారీ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శౌర్య బర్త్ డే కి వచ్చిన శివన్నారాయణ ఫ్యామిలీ.. దాస్ వస్తాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -465 లో..... శ్రీధర్ మారిపోయాడని కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ రోజు నా కూతురు బర్త్ డే.. నువ్వు ఇంటికి వెళ్లి అందరిని తీసుకొని రా అని కార్తీక్ చెప్పగానే సరేరా అని శ్రీధర్ అంటాడు. కార్తీక్ వెళ్లేసరికి దీప ఇల్లంత బెలూన్ లతో డెకరేషన్ చేస్తుంది. అంతా రెడీ అయ్యాక జ్యోత్స్న ఫోన్ చేసి.. నువ్వు అర్జెంట్ గా ఇంటికి రావాలని ఆర్డర్ వేస్తుంది. నేను ఆల్రెడీ హాఫ్ డే లీవ్ లో ఉన్నానని కార్తీక్ చెప్తాడు. ఇది మా తాత ఆర్డర్ అని చెప్పి జ్యోత్స్న అనగానే కార్తీక్ నేను వెళ్తున్నానని ఇంటి నుండి బయల్దేరతాడు. కార్తీక్ వెళ్లేసరికి శివన్నారాయణ వాళ్ళు రెడి అయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళదాం పద అని అంటారు. నేను డ్రైవ్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి శౌర్య బర్త్ డే కి కార్తీక్ ఇంటికే వస్తారు. దాంతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాంచనని దశరథ్ పలకరిస్తే తను సైలెంట్ గా ఉంటుంది. మరొకవైపు పారిజాతాన్ని తీసుకొని శ్రీధర్ బయల్దేరతాడు. థాంక్స్ అల్లుడు పిక్ అప్ చేసుకున్నందుకు అని పారిజాతం చెప్తుంది. దాస్ కి ఫోన్ చేసి బర్త్ డే కి రమ్మని పిలుస్తుంది. రాను అమ్మ.. బావ వస్తున్నాడు కదా అని దాస్ అంటాడు. దాస్ వాళ్ళ కుటుంబం మా ఇంట్లోనే ఉందని కాశీ యాక్సిడెంట్ చేసిన విషయం గురించి పారిజాతంతో శ్రీధర్ చెప్తాడు. ఈ విషయం వాళ్ళు ఎవరు చెప్పలేదా అని శ్రీధర్ అడుగుతాడు. ఎవరు చెప్పలేదు వాళ్ళ సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. సరే పదండీ బర్త్ డే కి టైమ్ అవుతుందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య గురించి రాజ్ తో నిజం చెప్పేసిన కళ్యాణ్.. సూపర్ ట్విస్ట్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -828 లో..... కావ్య గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని అప్పు బాధపడుతుంటే కళ్యాణ్ వస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి కావ్యకి విషయం చెప్పారా అని అడుగుతుంది. లేదని అప్పు అనగానే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావ్.. త్వరగా చెప్పమని అప్పుపై డాక్టర్ సీరియస్ అవుతుంది. ఈ విషయం ఎలాగైనా అక్కతో చెప్పాలని కళ్యాణ్ తో అప్పు అంటుంది. మరొకవైపు రేవతి ఇంట్లో అందరికి లడ్డులు ఇస్తుంది. ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో కలనే వేరు అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత నా కూతురిని నేను బాగా చూసుకుంటానని రాజ్ అందరితో హ్యాపీగా చెప్తాడు. అంటే నువ్వు కూతురు పుడుతుందని ఫిక్స్ అయ్యావా అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ వస్తారు. అప్పు నాకు ఎవరు పుడతారని కావ్య అడుగుతుంది. నీకెవరు పుట్టరని డాక్టర్ చెప్పింది చెప్పగానే కావ్య కళ్ళు తిరిగి పడిపోయినట్లు అప్పు ఉహించుకొని కావ్యకి నిజం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది అప్పు అని కావ్య అనగానే తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి అప్పు మీ అక్కకి నిజం చెప్తానని అన్నావ్ చెప్పలేదేంటని కళ్యాణ్ అడుగుతాడు. అక్కకి నిజం చెప్తే తట్టుకోలేదని అప్పు అంటుంది. అయితే మా అన్నయ్యకి నిజం చెప్తానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి రాగానే అన్నయ్య నీతో మాట్లాడాలి బయటకు వెళ్దామని కళ్యాణ్ టాడు. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య గురించి నిజం చెప్తాడు కళ్యాణ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

టైం కుదిరితే పెళ్ళి చేసుకుంటాం...

బుల్లితెర మీద ప్రియాంక జైన్ - శివ్ గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారన్న విషయం కూడా వాళ్ళ వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే అర్ధమవుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి రకరకాల ఫెస్టివల్స్ ని కూడా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఐతే వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటార్రా బాబు అని ఆడియన్స్ తెగ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురుచూడటమే కాదు వీళ్ళు ఏ షోలో కనిపించినా ఏ షో ప్రోమోస్ కింద చూసినా "మీ పెళ్ళెప్పుడు" అనే మాట కూడా అడగకుండా ఉండరు. ఇక వీళ్ళు మాత్రం తొందరలో చేసుకుంటాం అని ఇప్పటికే చాలా షోస్ లో చెప్పుకొచ్చారు. ఇక ఆ "తొందరలో" అనేది ఎప్పుడో మాత్రం ఆడియన్స్ గెస్ చేయలేకపోతున్నారు. రీసెంట్ గా ఒక షో ప్రోమోలో వీళ్ళ పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్స్ ప్రోమోలో న్యూ లవ్ వెర్సెస్ ఓల్డ్ లవ్ అనే కాన్సెప్ట్ తో ఈ షో రాబోతోంది. ఇందులో న్యూ లవర్స్ గా ప్రియాంక జైన్ - శివ్ వచ్చారు. 20 స్ లవ్ స్టోరీ అనే సెగ్మెంట్ లో ఇద్దరూ కలిసి ఒక సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత ప్రియాంక "శివ్ నా లిప్ స్టిక్ తెచ్చావా ..నా బ్యాగ్ తెచ్చావా" అని అడిగింది. తెచ్చాను అని చెప్పాడు శివ్. ఇంతలో సుధీర్ "హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఏదో ఇద్దరూ ఒకే ఇంట్లోంచి వస్తున్నట్టు..నా బ్యాగ్ తెచ్చావా ఇవి తెచ్చావా అని అడుగుతారేంటి" అన్నాడు. "ఒకే ఇంట్లోంచి వచ్చాము" అని చెప్పింది ప్రియాంక. "ఓహ్ పెళ్ళైపోయిందా" అన్నాడు సుధీర్. " ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళవడానికి సంబంధం ఏమిటి" అని ఏమీ తెలీనట్టు అడిగాడు శివ్. "ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్ళవలేదా" అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా. "అవును పెళ్ళవలేదు" అన్నారు శివ్-ప్రియాంక. "సరే ఇంతకు పెళ్ళెప్పుడు" అని సుధీర్ అడిగాడు. "ఏమన్నా టైం కుదిరితే చేసుకుందామని చూస్తున్నాం" అన్నారు శివ్ - ప్రియాంక. "వామ్మో ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని కూడా నాకు తెలీదు" అన్నాడు సుధీర్. "మీకు తెలీకుండా కూడా ఉంటుందా" అని సుధీర్ మీద కౌంటర్ వేసింది ప్రియాంక. ఇక పక్కన కూర్చున్న అష్షు రెడ్డి ఐతే "నిజంగా డైలాగ్ బాగుంది" అంటూ సుధీర్ మీద కౌంటర్ వేసింది.  

ఛీ ఈ పెద్దోళ్ళకు మన ప్రేమ అర్ధమే కాదు...

ఫ్యామిలీ స్టార్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో న్యూ లవ్ వెర్సెస్ ఓల్డ్ లవ్ పేరుతో ఈ షోని ప్లాన్ చేశారు. పాత జంటలతో కొత్త జంటలు కూడా వచ్చారు. శ్రీవాణి - విక్రమాదిత్య, లాస్య-మంజునాథ్, మహేశ్వరి- శివ నాగ్, ప్రియాంక జైన్ - శివ్, పంచ్ ప్రసాద్ - సునీత, ధరణి-ప్రశాంత్ వచ్చారు. ప్రేమ గురించి రకరకాలుగా చెప్పుకొచ్చారు. "ప్రేమ అంటే వాళ్ళది కాదు మాది ..మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఫోన్ చేశారు. అందులో లవ్ అనే పదం తీసేసి లాస్య - మంజునాథ్ అని పెట్టమన్నాను" అంటూ తమ లవ్ ఎంత గొప్పదో చెప్పుకొచ్చింది లాస్య. ఇక శివనాగ్ వచ్చి "మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ కాదు పి పాజిటివ్ వచ్చింది అంటే ప్రేమ పాజిటివ్ వచ్చింది" అని చెప్పాడు. "మళ్ళీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి.. మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి అవి కూడా హార్ట్ షేప్ లో ఉన్నాయి. ఇక జెంట్స్ అంతా అమ్మాయిల్లా గెటప్స్ వేసుకుని డాన్స్ చేస్తూ ఫన్ క్రియేట్ చేశారు. ఇక పంచ్ ప్రసాద్ ఐతే సుధీర్ ని పైనా కింద టచ్ చేసి అమ్మాయిలా సిగ్గుపడ్డాడు. మహేశ్వరీ - విక్రమ్ కలిసి "మన్మధుడి బ్రహ్మను పూని" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. "మీరు అన్ని సార్లు తిరిగారమ్మా విక్రమ్ గారికి కళ్ళు తిరిగితే ఎలా చెప్పండి" అంటూ సుధీర్ కౌంటర్ వేసాడు. "ఛీ ఈ పెద్దోళ్ళకు మన ప్రేమ అర్ధమే కాదు" అంటూ మహేశ్వరీ సుధీర్ ని తిట్టి విక్రమ్ ని తీసుకుని వెళ్ళిపోయింది. "నువ్వు నా కన్నా పెద్దోడివి" అంటూ శ్రీవాణి కూడా సుధీర్ ని పెద్దోడ్ని చేసి తిట్టి మరీ వెళ్ళిపోయింది.

Bigg boss 9 Telugu Nominations: వ్యాలిడ్ రీజన్ లేకుండా సుమన్ శెట్టిని నామినేట్ చేసిన సంజన..

  బిగ్‌బాస్ సీజన్-9 రోజుకొకరు హైలైట్ అవుతున్నారు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిపోతున్న ఈ సీజన్ లో కామనర్స్ ని బిబి ఆడియన్స్ అసహ్యచుకుంటున్నారు. వారి ప్రవర్తన రోజురోజుకి మరీ దారుణంగా ఉంటోంది. అయితే హౌస్ లో సోమవారం మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. రెండో రోజు(మంగళవారం)న ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లేందుకు మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే నిజానికి ఆరుగురు మాత్రమే లిస్ట్‌లో ఉన్నారు. కానీ సంజన కెప్టెన్ కావడంతో తనకి బిగ్‌బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో లేని వాళ్ల నుంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పడంతో సుమన్ శెట్టిని ఒక సిల్లీ రీజన్‌కి చెప్పి నామినేట్ చేసింది. నేను సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తున్నాను.. రీజన్ ఏంటంటే నేను ఆ రోజు నా ఫ్యామిలీ గురించి అందరు మాట్లాడారని కూర్చొని ఏడ్చాను. కనీసం నా కన్నీళ్లు కూడా ఇంకా డ్రై అవ్వలేదు.. అప్పుడు సుమన్ గారు వచ్చేసి మేము తొమ్మిది మంది కాదు ఎనిమిది అంటూ నవ్వారు.. అలానే మీరు నా గేమ్ చూసుంటారు సుమన్ గారు నేను ఎవర్నీ పర్సనల్‌గా తొక్కలేదు.. మీరు ఇది చేసినా కూడా ఒక్కసారి కూడా వచ్చి సారీ చెప్పలేదు.. మీకు తెలుసు నన్ను హర్ట్ చేశారని అయినా కూడా సారీ చెప్పలేదు.. అలానే కెప్టెన్‌గా మీకు ఇచ్చిన ప్యాకెట్స్‌లో ఒక్కటైనా త్యాగం చేయండి.. సిస్టర్‌గా అడుగుతున్నాను అన్నా కూడా లేదు.. నేను ఇవ్వను అన్నారు.. అలా ఆయన దగ్గరి నుంచి ఎలాంటి ఎమోషన్స్ రాకపోవడం నాకు చాలా హర్ట్ అయింది. నాకు పర్సనల్‌గా మీ మీద ఏం లేదు.. మీరు నాకు బయట కూడా తెలీదు.. నేను ఏం పర్సనల్ ఎటాక్ చేయలేదంటూ సంజన చెప్పింది. ఇంతమంది మిమ్మల్ని దొంగ అన్నా కూడా మీకు కోపం రాలేదు.. కానీ నేను అన్న ఆ తొమ్మిదవ మెంబర్ మీరే అని మీరెలా ఫిక్స్ అవుతున్నారు.. నేను అవ్వొచ్చు కదా ఆ తొమ్మిది.. మీరెందుకు మీరే అని ఫిక్స్ అవుతున్నారంటూ సుమన్ శెట్టి అడిగాడు. దీనికి ఏం చెప్పాలో తెలీక మీరు మాట తిప్పుతున్నారంటూ సంజన అంది. ఏం తిప్పాను.. నేను అడిగినదానికి చెప్పండి లేదంటే నేను పెయింట్ రాయించుకోను.. నాకు ఇష్టం లేదు.. తప్పు అది.. మీరు తప్పు చేస్తున్నారు అంటూ సుమన్ శెట్టి అన్నాడు.  ఈ పాయింట్‌కి ఆన్సర్ చెప్పకుండా సంజన ఏదేదో మాట్లాడింది. మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్ మీరు వస్తే రాస్తానని సంజన అంది. నేను అందుకే మేడమ్ అంటున్నాను.. నా కంటే పెద్దవారు కాబట్టి.. అందర్నీ ఇక్కడ చెల్లెలు అంటున్నా.. పెద్ద వాళ్లయితే అన్నయ్య అంటున్నానంటూ సుమన్ శెట్టి చెప్పుకొచ్చాడు. మీరు ఎంత తొందరగా రాయించుకుంటే అంత మర్యాద మిగులుతుందండి అంటూ సంజన మాట వదిలింది. దేనికి రీజన్ ఏంటి మేడమ్ అని సుమన్ శెట్టి మళ్లీ అడిగాడు. మీ అరుపులకి ఎవరూ భయపడరని సంజన అంటే రాయండి మేడమ్ టైమ్ వేస్ట్ కాళ్లు నొప్పెడుతున్నాయని సుమన్ శెట్టి అన్నాడు. లేదు రాయనండి అని సంజన అనగానే రాయరంట బిగ్‌బాస్ అంటూ సుమన్ శెట్టి వెనక్కి వెళ్లిపోయాడు.  ఇది కాస్త ఫన్నీగా అనిపించింది. అది చూసిన సంజన ఈ కామెడీ నా దగ్గర వద్దు అంది. మొత్తానికి అసలు నామినేషన్ పాయింట్ లేకుంటా సుమన్ శెట్టిని సంజన నామినేట్ చేసింది. ఇది కంప్లీట్ గా అన్ ఫెయిర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Brahmamudi : కూతురిని క్షమించేసిన అపర్ణ.. బిడ్డ కావాలంటూ కావ్య ఎమోషనల్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 827 లో..... రుద్రాణి డాన్స్ చేస్తూ రేవతి ముసుగు తీస్తుంది. దాంతో రేవతిని చూసి అందరు షాక్ అవుతారు. ఇంత మోసం చేస్తావా అని రుద్రాణి అంటుంటే.. చాలు ఆపు, అసలు రేవతి ఈ కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం నువ్వు కదా అని జరిగిందంతా ఇందిరాదేవి చెప్తుంది. దాంతో రుద్రాణి నోరు మూతపడుతుంది. ఆ తర్వాత ఇన్ని రోజులు అవుతుంది. దాన్ని క్షమించు.. ఎన్నోసార్లు దానికి సాయం చేద్దామని డబ్బు పట్టుకొని వెళ్ళాము కానీ అది మా అమ్మ నన్ను కూతురుగా ఒప్పుకుంటే చాలు నాకు ఏం వద్దని చెప్పింది.. ఇన్ని రోజులుగా తనకి తనే శిక్ష వేసుకుందని అపర్ణకి ఇందిరాదేవి చెప్తుంది.. అపర్ణ మనసు మార్చాలని ఒకవైపు రాజ్.. ఇంకా కావ్య రేవతి తరుపున మాట్లాడతారు. ఇలా ముసుగులో వచ్చి మోసం చెయ్యడం తప్పు అని రుద్రాణి అనగానే ఆ ముసుగులో ఉంది రేవతి అని నాకు ముందే తెలుసని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఒకరోజు స్వరాజ్ ని వాళ్ళ ఇంటికి దగ్గర డ్రాప్ చేసాను.. వాటర్ బాటిల్ మర్చిపోతే ఇంటివరకు వెళ్ళాను. అక్కడ నా కూతురిని చూసాను.. తను నన్ను ఎంత మిస్ అవుతుందో.. ఆ రోజు అర్థమైందని అపర్ణ చెప్తుంటే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను తప్పు చేసాను అమ్మ అని రేవతి అనగానే ఇన్నిరోజులు దూరం పెట్టి నేను తప్పు చేసానని అపర్ణ అంటుంది. ఇద్దరు హగ్ చేసుకుంటారు. అప్పుడే స్వరాజ్ వస్తాడు. నాకు నిజం ఎందుకు చెప్పలేదని అపర్ణ అడుగగా చెప్తే ఇలా కలిసేవాళ్ళు కాదుగా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య గురించి అప్పు టెన్షన్ పడుతుంటే కళ్యాణ్ వస్తాడు. తరువాయి భాగంలో కావ్య బిడ్డని మోయకూడదన్న విషయం కావ్యకి అప్పు చెప్తుంది. నాకు బిడ్డ కావాలని ఏడుస్తూ కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భాను కేసుని రీక్రియేట్ చేసిన బ్లూ టీమ్.. నిజం తేలుతుందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -58 లో.....శకుంతల ఇంటికి వస్తుంది. ఏంటి అక్క డిస్సపాయింట్ అయ్యావా అని శకుంతలకి చిరాకు తెప్పించేలా ఇందుమతి మాట్లాడుతుంటుంది. నేను కేసు పెట్టింది తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలని అని ఇందుమతిపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్ర రాగానే గంగ తనకి దిష్టి తీస్తుంది. అది చూసి గతంలో శకుంతల దిష్టి తీసింది రుద్ర గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఇందుమతి కేసు గురించి తన భర్తని చిరాకు పెడుతుంది. మరొకవైపు పెద్దసారు, రుద్ర కలిసి సంఘటన రిక్రియేట్ చేసే దగ్గరికి వెళ్తుంటే నేను వస్తానని గంగ అంటుంది. వద్దని రుద్ర అంటాడు. పెద్దసారు, గంగ కలిసి మేనేజ్ చేసి గంగని తమ వెంట తీసుకొని వెళ్లేలా చేస్తారు. వీరు వెళ్తుంటే.. ఇషిక ఆపి భాను బావగారి హత్య కేసులో నీ హస్తం ఉందో లేదో కానీ రుద్ర బావ ఈ తప్పు చేయలేదని బుజువు కాకుండా చూసుకోమని వీరుకి ఇషిక సలహా ఇస్తుంది. సంఘటన రీక్రియేట్ దగ్గరికి వెళ్తారు.. బ్లూ టీమ్ వాళ్ళు రీక్రియేట్ చేస్తారు. అందులో రుద్ర ఫోర్స్ గా భానుని నెట్టితే కింద పడిపోయాడని వాళ్ళు అంటారు. అలా ఎలా తేలుస్తారని గంగ అడ్డుపడుతుంది. ఆ తర్వాత నేను రి క్రియేట్ లో ఉంటాను.. భాను ప్లేస్ లో రుద్ర నువ్వు ఉండమని అంటారు. వద్దు బావ రిస్క్ అని వీరు అంటాడు. నేను భాను గారి ప్లేస్ లో ఉంటానని గంగ అంటుంది. వద్దని రుద్ర తనపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : సపోర్ట్ లేదని శ్రీవల్లి ఏడపు.. ధీరజ్ ని హగ్ చేసుకున్న ప్రేమ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -265 లో..... ధీరజ్ ఎక్కడికి అని అంటున్నా కూడా ప్రేమ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. మరొకవైపు తిరుపతి, రామరాజు మాట్లాడుకుంటుండగా అప్పుడే నర్మద, వేదవతి వస్తారు. వేదవతి ఆడవాళ్లు గొప్ప.. అది ఇది అంటూ కొటేషన్ చెప్తుంటే.. అసలు విషయం చెప్పమని రామరాజు అంటాడు. మన నర్మదకి ప్రమోషన్ వచ్చిందని వేదవతి అనగానే అందరు సంతోషపడుతారు. నర్మదని మెచ్చుకుంటుంటే శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. అప్పుడే భాగ్యం, ఆనందరావు వచ్చి నర్మదని మెచ్చుకుంటారు.. కానీ జాగ్రత్త ప్రేమ కుటుంబం వాళ్ళు వచ్చి ప్రేమ తో జాబ్ చేయిస్తున్నారని అన్నయ్య చొక్క పట్టుకున్నట్లు ఇప్పుడు నర్మద వాళ్ళు తనతో ఉద్యోగం చేయిస్తున్నారని ఆలా చెయ్యరు కదా అని భాగ్యం అంటుంటే వదిన ఆ విషయం వదిలేయ్ అని వేదవతి అంటుంది. స్వీట్ పంచండి అని సాగర్ తో రామరాజు అంటాడు. మరొకవైపు కళ్యాణ్ దగ్గరికి ప్రేమ వెళ్తుంది. తన భుజం పై చెయ్ వేస్తాడు. నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావని కళ్యాణ్ ని ప్రేమ కొడుతుంది. దాంతో కళ్యాణ్ తన చేతులు కట్టేస్తాడు. అప్పుడే ధీరజ్ వచ్చి కళ్యాణ్ ని కొడుతుంటే అతను పారిపోతాడు. ధీరజ్ ని  ప్రేమ హగ్ చేసుకొని ఏడుస్తుంది. మరొకవైపు శ్రీవల్లి కోపంగా వచ్చి గదిలో వస్తువులు పగులగొడుతుంది. ఇంట్లో అందరు అంటే మీరు కూడా ఆ నర్మదని పొగుడుతారా.. నాకు ఏ సపోర్ట్ లేదని శ్రీవల్లి అంటుంటే.. తన చేతిలో భాగ్యం పదిలక్షలు పెడుతుంది.. తరువాయి భాగంలో నాకెందుకు కళ్యాణ్ గురించి చెప్పలేదని ప్రేమని ధీరజ్ అడుగుతాడు. నాకెవరు లేరని ప్రేమ ఎమోషనల్ అవుతుంటే నేనున్నానని ధీరజ్ అంటాడు కానీ నీ మనసులో నాకు చోటు లేదు కదా అని ప్రేమ అనగానే ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : నాన్న భుజాలపై వాలిపోయిన కార్తీక్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -464 లో..... మేమ్ ఇంటికి త్వరగా వెళ్ళాలని శివన్నారాయణతో కార్తీక్ అంటాడు. ఎందుకని అని శివన్నారాయణ అడుగగా.. చిన్నపని ఉందని కార్తీక్ చెప్తాడు. శౌర్య నిన్ను ఒక ప్రశ్న అడుగుతానని డ్రాయింగ్ పేపర్ చూపిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్న పాప ఎవరని శివన్నారాయణ అడుగుతాడు. నేనే అని చెప్పబోతు శౌర్య ఆగిపోతుంది. బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొని వచ్చారు. ఈ రోజు నీ బర్త్ డే అని నాకు తెలుసు.. నువ్వు వెళ్లి బయట ఆడుకోమని శౌర్యని శివన్నారాయణ బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత ఈ రోజు శౌర్య బర్త్ డే అని మాకు ఎందుకు చెప్పలేదు.. ఎలాగూ మీ దృష్టిలో మేమ్ చెడ్డవాళ్ళమే.. ఇప్పుడు శౌర్య దృష్టిలో కూడా మమ్మల్ని చెడ్డవాళ్ళని చెయ్యాలి అనుకుంటున్నారా అని కార్తీక్ పై శివన్నారాయణ కోప్పడతాడు. కోపం దీప మీద.. పాప మీద కాదు.. ఇప్పుడు దాన్ని కూడా దూరం చేయాలి అనుకుంటున్నారా అని దీపని సుమిత్ర కోప్పడుతుంది. ఇప్పటికే పాపని అడ్డుపెట్టుకొని కుటుంబానికి దగ్గర అవుతున్నానంటున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే కావాలనే చేస్తుందని అంటారని దీప అంటుంది. ఇక మేమ్ వెళ్ళొస్తామని కార్తీక్ అనగానే వెళ్ళండి మీకు నచ్చింది చేసుకోండి అని శివన్నారాయణ కోప్పడతాడు.ఆ తర్వాత శ్రీధర్ భోజనం చెయ్యడానికి వస్తాడు. పక్కన స్వప్న కూర్చుంటుంది. తను అన్న మాటలకి శ్రీధర్ తో మాట్లాడలేకపోతుంది.. గిల్టీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కార్తీక్, దీప ఇద్దరు శౌర్యని తీసుకొని ఇంటికి వస్తారు. కేక్ కటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసానని అనసూయ అంటుంది. అందరు లోపలికి వెళ్ళాక కాశీ యాక్సిడెంట్ చేసిన విషయం, శ్రీధర్ హెల్ప్ చేసిన విషయం కార్తీక్ కి కాంచన చెప్పగానే ఇప్పుడే వస్తానని కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ ని కార్తీక్ కలుస్తాడు. నాకు ఎందుకు ఈ విషయం చెప్పనివ్వలేదని శ్రీధర్ ని కార్తీక్ అడుగగా నా కూతురికి కష్టం వస్తే అన్నయ్య ఉన్నాడు అనే దానికంటే నాన్న ఉన్నాడని తను అనుకోవాలి.. ఆ బాధ్యత తీసుకున్నాను.. ఏం చేసినా నా కొడుకు, కూతురు కోసమే.. మీరంటే చాలా ఇష్టంరా.. నువ్వు మరమన్నావ్ కదా.. మారానని శ్రీధర్ ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. చాలా రోజులకి నువ్వు నాకు నచ్చావని తండ్రి భుజాలపై కార్తీక్ వాలిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Mask man Harish Elimination: సైకోలా మారిన మాస్క్ మ్యాన్ ..మెడపట్టి బయటకు గెంటేయండి!

  బిగ్ బాస్ సీజన్-9 రోజు రోజుకి ఆసక్తిని పెంచేస్తుంది. ఎవడిలో ఎంతుందో.. టైమ్ వచ్చినప్పుడు తెలుస్తుందంటారు కదా.. అదే జరుగుతుంది హౌస్ లో.‌ సైలైంట్ గా ఉంటాడనుకున్న మర్యాద మనీష్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిబ్బా చేష్టలతో విసుగుతెప్పించే రీతూ చౌదరి నామినేషన్ పాయింట్లు మాట్లాడటం చూసి.. ఈమెలో ఇంతుందా అని జనాలు అనుకుంటున్నారు. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఇమ్మాన్యుయల్ పై మాస్క్ మ్యాన్ హరీష్ విషం చిమ్మాడు. తనలోని సైకో బయటకొచ్చినట్టుగా ఉంది. నామినేషన్ పాయింట్ ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో పూర్తిగా కంట్రోల్ తప్పాడు మాస్క్ మ్యాన్. అతని బిహేవియర్ చూసి హౌస్ లోని కంటెస్టెంట్సే కాదు చూసిన ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు.  బిగ్ బాస్ ద్వారా బాగుపడేవారికంటే వారి క్యారెక్టర్ బ్యాడ్ చేసుకునే వారే ఎక్కువ. అలాగే ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ తన క్యారెక్టర్ ని కోల్పోతున్నాడు.  శ్రీజ, ప్రియ, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళు హౌస్ లోకి రాకముందు సామాన్యులకి సపోర్ట్ చేయాలనిపించేది జనాలకి. ఇప్పుడేమో మనం అగ్నిపరీక్షలో చూసిన ఆ సామాన్యులేనా వీళ్లూ అనేంతగా దిగజారిపోయి,  బిగ్ బాస్ షో చూసే వాళ్లు ఏడ దొరికిన సంతరా ఇదీ అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు వీళ్లని మెడపట్టి బయటకు గెంటేయండి బిగ్ బాస్ అని టీవీలు కట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss season 9 Telugu) తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రీతూ చౌదరి ఏడ్చేసింది. మాస్క్ మ్యాన్ నేను వెళ్లిపోతానని అనడంతో.. గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ అని అర్థం అయిపోతుందంటూ రీతూ చౌదరి నామినేషన్ పాయింట్ చెప్పింది. అది గివ్ అప్ కాదు.. బయట నేను కొంతమందిని కాపాడుకోవాలి.. చరిత్ర హీనుడని చెప్పి నాపై ముద్ర వేశారు కదా అంటూ మాస్క్ మ్యాన్ హరీష్ ఎదురుతిరిగాడు. నీకు నచ్చినట్టు నేను ఉండనని రీతూపై హరీష్ అరవడంతో.. నాకు నచ్చినట్టు ఉండమని నేను అనలేదంటూ అంతే గట్టిగా సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ నడిచింది. ఈ ఇంట్లో గొడవలు రావడానికి కారణం నువ్వే అంటూ రీతూని హరీష్ అన్నాడు. దాంతో రీతూ చౌదరి.. వామ్మో సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు గా అని దండం పెట్టేసింది. మరి ఈ నామినేషన్లు ఎలా ఉన్నాయనేది.. ఎవరెవరి మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరిగాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.  

రాము రాథోడ్ అలా ఉండటం నచ్చలేదు..కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వారమైంది. అందులో మొత్తం పదిహేను కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఆదివారం నాటి ఎపిసోడ్ లో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఆరుగురు కామనర్స్, ఎనిమిది మంది సెలెబ్రిటీస్ ఉన్నారు. సెలెబ్రిటీ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ రాము రాథోడ్. 'రాను.. బొంబాయ్ కి రాను' అనే పాటతో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన ఈ మహాబూబ్ నగర్ కుర్రాడికి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. రీసెంట్ గా జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో కూడా పోటీకి వచ్చిన వారంతా.. రాను బొంబాయ్ కి రాను పాటకి డ్యాన్స్ చేయడంతో రాము రాథోడ్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దాంతో అతడికి బిగ్ బాస్ లో అవకాశం దొరికింది. హౌస్ లో మొదటివారం నామినేషన్ లో ఉన్న రాము రాథోడ్ కి మంచి ఓటింగ్ పడింది. మరి సెకెండ్ వీక్ లో ఉంటాడో లేడో తెలియాలంటే మరోరోజు ఎదురుచూడాల్సిందే. రాము రాథోడ్ ని మొన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో చూసిన అతని తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారంట. రాము హౌస్ లో నవ్వుతూ ఉండటం చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నారంట.. అయితే హౌస్ లో గొడవలు జరగడం అంతగా బాగోలేదని  వాళ్ళు ఎమోషనల్ గా మాట్లాడారు. బిగ్ బాస్ సీజన్-9 (Bigg Boss 9 Telugu)లో రాము రాథోడ్ బిహేవియర్ ఎలా అనిపిస్తోందో కామెంట్ చేయండి.

మర్యాద మనీష్ కి ఇచ్చిపడేసిన రీతూ చౌదరి.. ఈ వారం గుండు హరీష్ బయటకేనా!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే వారం పూర్తయింది. సెకెండ్ వీక్ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో భరణి-మనీష్, రీతూ చౌదరి-మనీష్, తనూజ-మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరా సైనీ-తనూజల మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ నామినేషన్ బ్యాలెన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss 9 Telugu) లో సామాన్యులు కాస్త ఓవర్ గా చేస్తున్నారు. శ్రీజ-మనీష్ గొడవ పడ్డారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతో మనీష్ అనేసరికి ఆమె హర్ట్ అయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్ కి ఇచ్చిపడేసింది శ్రీజ.. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయల్ తో చెప్తూ తెగ బాధపడుతున్నాడు మనీష్. ఇది కాస్త ఓవరాక్షన్ అనే విధంగా అతను చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు నామినేషన్ ప్రక్రియ మొదలైంది.  రీతూ చౌదరిని మర్యాద మనీష్ నామినేట్ చేశాడు. తను గిన్నెలు సరిగ్గా తోమడం లేదని పాయింట్ చెప్పాడు. అది వ్యాలిడ్ పాయింట్ కాదని నేను తోమినా.. ఎవరు నాకు క్లీన్ గా లేదని చెప్పలేదంటూ తను స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది. గుండు హరీష్ ని తనూజ నామినేట్ చేసింది‌. తనని నువ్వు అంటూ సంభోధించాడని, బిహేవియర్ గురించి మాట్లాడాడని, తను హర్ట్ అయిందని చెప్తూ తనూజ నామినేట్ చేసింది. ఇక ఫ్లోరా సైనీ షాంప్ అలా చేయడం కరెక్ట్ కాదని, సంజనని అలా మాటలు అనకూడదని తనని తనూజ నామినేట్ చేసింది. ఇక మర్యాద మనీష్ అయితే భరణిని టార్గెట్ చేశాడు. వీరిద్దరి మధ్య గొడవ గట్టిగానే జరిగింది. ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే.. పద్నాలుగు మందిలో దాదాపు ఎనిమిది మంది నామినేట్ అయ్యారని తెలుస్తోంది. హరీష్, భరణి, మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయ్యారన్నమాట.. మరి ఈ లిస్టులో నుంచి ఎక్కువగా మనీష్ లేదా హరీష్ బయటికి వెళ్లే అవకాశం ఉన్నట్టు బిగ్ బాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్, భరణిలని ఆడవాళ్ళు అని అన్న మాస్క్ మ్యాన్ హరీష్.. సారీ కూడా చెప్పకపోవడంతో.. వీడికి ఇంత బలుపేంట్రా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రతీ బిగ్ బాస్ ప్రోమో కింద మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈవారం ఎవరు హౌస్ నుంచి పెట్టే సర్దుకుని వెళ్తారో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Brahmamudi : రేవతిని క్షమించిన అపర్ణ. షాక్ లో రుద్రాణి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -826 లో....... దుగ్గిరాల ఇంట్లో పూజ అనంతరం గేమ్ ఆడుతారు. చీటిలో ఏది వస్తే అది చెయ్యాలి. అలా స్వప్న, రాహుల్ ఇద్దరు డాన్స్ చేస్తారు. ప్రకాష్ ధాన్యాలక్ష్మి డాన్స్ చేస్తుంది. అలాగే స్వరాజ్ తో సుభాష్, అపర్ణ డాన్స్ చేస్తారు. అప్పు, కళ్యాణ్ ఒక జంటగా చేస్తారు. ఆ తర్వాత రాజ్ చీటీ తియ్యగా ఫస్ట్ లవ్ గురించి చెప్పమని ఉంటుంది. దాంతో రాజ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కంపెనీ బాధ్యతలు స్వీకరించే రోజు ఒక అమ్మాయి పరదా వెనకాల డాన్స్ చేస్తూ కనిపించింది. మొహం చూడలేదు కానీ తనేందుకో నచ్చింది. ఆ తర్వాత ఆ డాన్స్ చేసింది స్వప్న అని తెలిసిందని రాజ్ అనగానే.. అయ్యో రాజ్ ఆ డాన్స్ చేసింది నేను కాదు కావ్య అని స్వప్న చెప్పగానే రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే నేను మొదట లవ్ చేసింది నువ్వేనా అని రాజ్ అనగానే కావ్య వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత రేవతి కూడా గేమ్ లో పార్టిసిపేట్ చెయ్యాలని రుద్రాణి అంటుంది. రుద్రాణితో కలిసి రేవతి డాన్స్ చేస్తుంది. రుద్రాణి డాన్స్ చేస్తూ రేవతి ముసుగు తీసేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఏంటి రేవతి నిన్ను ఎవరు రానివ్వడం లేదని ఇలా వచ్చావా అని రుద్రాణి అంటుంది. అసలు రేవతి అలా పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వు కదా.. ఆ రోజు నువ్వు సలహా ఇవ్వడం వల్లే పెళ్లి చేసుకుందని రుద్రాణితో ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో రేవతిని అపర్ణ క్షమిస్తుంది. ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయం కావ్యకి చెప్తుంది అప్పు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నర్మదకి ప్రమోషన్.. తన బాధని ధీరజ్ కి ప్రేమ చెప్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -264 లో... నర్మద సంతోషంగా ఇంటికి వస్తుంది. అత్తయ్య గుడ్ న్యూస్ అని చెప్తుంది. నెలతప్పావా అని వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అది చూసి ఇదేంటి ఆ నర్మద నా కంటే ముందుగా నెలతప్పిందని శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. అదేం లేదు అత్తయ్య నాకు ప్రమోషన్ వచ్చిందని నర్మద చెప్పగానే వేదవతి మురిసిపోతుంది. హమ్మయ్య నెల తప్పలేదని శ్రీవల్లి రిలాక్స్ అవుతుంది. వెంటనే ఈ విషయం ప్రేమకి చెప్పాలని ప్రేమ దగ్గరికి బయల్దేరతారు. ఆ తర్వాత శ్రీవల్లి పానీపూరి తింటుంది. శ్రీవల్లిని కలవడానికి భాగ్యం ఆనందరావు వెళ్తుంటే పానీపూరి దగ్గర తనే కనిపిస్తుంది. ఇక భద్రవతి వచ్చిన విషయం చెప్తారు. నువ్వే ఆ విశ్వకి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించాలి. అలా చేస్తే నీ భర్తకి ఇవ్వాలసిన పదిలక్షలు ఇస్తారని భాగ్యం చెప్తుంది. నేను అలా చేయను ఇంకా సమస్య తెచ్చుకోనని శ్రీవల్లి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. నర్మద, వేదవతి వెళ్తారు. ఏమైంది డల్ గా ఉన్నావని అడుగుతారు. నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకుందామని వచ్చాను కానీ నువ్వు ఇలా ఉన్నావని నర్మద అంటుంది. హ్యాపీనెస్ ఏంటని ప్రేమ అడుగుతుంది. నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్తుంది. దాంతో ప్రేమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు చెప్పు.. నీ ప్రాబ్లమ్ అని నర్మద అడుగుతుంది. అదేం లేదని ప్రేమ అంటుంటే.. ధీరజ్ కి నర్మద ఫోన్ చేసి ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుంది కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తానని ధీరజ్ అంటాడు. కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఆపమని ప్రేమ అంటుంది. ప్రేమ బైక్ దిగి వెళ్లిపోతుంటే ఎక్కడికి అని ధీరజ్ అడుగుతాడు. నాకు పని ఉందని చెప్పి ప్రేమ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.