రీతూ చౌదరిపై నాగ్ ఫైర్.. డీమాన్ పవన్ కెప్టెన్సీ గోవింద!

బిగ్ బాస్ సీజన్-9 సెకెండ్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో కోసం చాలా మంది వెయిటింగ్.. ఎందుకంటే ఇందులోనే కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్ ఎలా ఉందనేది చూస్తారు. ఇక ఈ సీజన్ ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అంటే ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కింగ్ నాగార్జున వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని లేపి క్వశ్చన్స్ అడిగాడు. మొదటగా డీమాన్ పవన్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు.  అతన్ని కెప్టెన్ గా చూడాలని రీతూ చౌదరి అనుకున్న వీడియోని నాగార్జున ప్లే చేసి చూపించాడు. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ కెప్టెన్ గా ఎన్నికవ్వడం గురించి హౌస్ మేట్స్ అందరి నిర్ణయం అడిగి తెలుసుకున్నాడు నాగార్జున.  ఇక హౌస్ అంతా రాంగ్ అని చెప్పడంతో డీమాన్ పవన్ కెప్టెన్సీ నుండి తీసేశాడు నాగార్జున.  మరి ఈ ప్రోమోలో న రీతూపై నాగార్జున ఫైర్ కరెక్ట్ అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

రీతూ డబుల్ ఫేస్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయల్!

బిగ్ బాస్ సీజన్-9 లో మొన్నటి వరకు కెప్టెన్సీ టాస్క్ లు జరుగగా అందులో డీమాన్ పవన్ గెలిచి కొత్త కెప్టెన్ అయ్యాడు. అయితే డీమాన్ కెప్టెన్ అవ్వాలని తనకే రీతూ సపోర్ట్ చేసిందని బిగ్ బాస్ ఆడియన్స్ అందరికి తెలుసు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. పర్మినెంట్ ఓనర్ అవ్వటానికి ఏడుగురు రెంటర్స్ కి టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్. గతవారం భరణి పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. ఈ వారం టాస్క్ లో గెలిచి రాము రాథోడ్ పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. టాస్క్ లో అందరు బాగా ఆడారు.‌ఇక చివరగా ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ ఉండగా.. హౌస్ అంతా ఇమ్మాన్యుయల్ కి సపోర్ట్ చేయగా.. ఒక్క రీతు మాత్రం డీమాన్ పవన్ కి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత రీతూ ఓ దగ్గర కూర్చొని ఉంటే తన దగ్గరికి ప్రియ వస్తుంది. నువ్వు కావాలనే డీమాన్‌కి ఇచ్చావని బయటికి ఏమనలేదు కదా అని అంటూ రీతూని ప్రియ అడిగింది. వీళ్లిద్దరు ఆడారు కదా గేమ్.. దాన్ని బట్టే నేను ఇచ్చాను కదా.. అంటూ రీతూ తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది. ఇంతలో ఇద్దరు కలిసి నా మీద ఎటాక్ చేశారు.. రెండో విషయం ఇమ్మూ అసలు డిఫెండ్ లోనే ఉన్నాడు ఎటాక్‌  చేయలేదు.. ఆ ప్లేట్ పక్కనే కూర్చున్నాడంటూ డీమాన్ మాట్లాడాడు. మరోవైపు మర్యాద మనీష్ కూడా కామనర్లతో కెప్టెన్సీ గేమ్ గురించి చర్చించాడు. నేను ప్లేట్ తన్నడానికి రీజన్ అదే.. ఆయన మనీష్‌ని ఎటాక్ చేయని అన్నాడు.. అప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే భరణిని ఎటాక్ చేద్దామని అనుకున్నామని మనీష్ చెప్పాడు. భరణి గారు అన్‌ఫెయిర్ ఆడుతున్నారని క్లియర్‌గా తెలుస్తుందంటూ ప్రియ మధ్యలో మాట్లాడింది. ఇమ్మాన్యుయల్ కూడా అన్‌ఫెయిర్ ఆడుతున్నాడు కదా భరణి గార్ని చూసి కూడా కొట్టట్లేదంటూ ప్రియ చెప్పుకొచ్చింది. ఇక భరణి దగ్గరికి సుమన్ శెట్టి వస్తాడు. ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఏంటన్నా నా రీతూ నాకు సపోర్ట్ రావట్లేదు ఆడికి సపోర్ట్ వస్తుంది అంటున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఇక కామనర్ల దగ్గర కూర్చొని చేసిన ఘనకార్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ రీతూ కామెంట్లు చేసింది. కాదు నేను క్లియర్‌గా స్టాప్ అన్న తర్వాత ఆపేయకపోతే తీసేస్తానని చెప్పా కదా.. స్టాప్ ఎందుకు చెప్పారని అడుగుతారేంటి నాకు అర్థం కాదంటూ రీతూ అంది. మరోవైపు సుమన్ శెట్టితో మాట్లాడుతూ.. ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ నుంచి రీతూ వాళ్లనే సపోర్ట్ చేస్తుందన్నా.. నా కోసం ఆడలేదన్నా అంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టఫ్ ఇచ్చావో తెలుసా నీకు.. మాములు టఫ్ ఇవ్వలేదు నువ్వు అంటూ సుమన్ శెట్టి ఓదార్చాడు.

Maryada Manish Elimination: మర్యాద మనీష్ ఎలిమినేషన్.. సూపర్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో అప్పుడే సెకెండ్ వీకెండ్ వచ్చేసింది. మొన్నటి టాస్క్ లో గెలిచి  డీమాన్ పవన్ సెకెండ్ కెప్టెన్ అవ్వగా.. నిన్న జరిగిన టాస్క్ లో గెలిచి రాము రాథోడ్ సెకెండ్ ఓనర్ అయ్యాడు. నామినేషన్ లో‌ మొత్తం  ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన కంటెస్టెంట్స్ పై నెగెటివిటి ఏర్పడింది. ఏం మాట్లాడతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు.. మొదటి వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. ఈ వీక్ పక్కాగా ఒక కామనర్ వెళ్లిపోవడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే ఓటింగ్ అలా పడుతుంది. శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి  సుమన్ శెట్టి అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో భరణి ఉండగా.. మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. నాలుగో స్థానంలో డీమాన్ పవన్, అయిదో స్థానంలో ఫ్లోరా సైనీ, ఆరో స్థానంలో ప్రియశెట్టి ఉండగా.. చివరి స్థానంలో మర్యాద మనీష్ ఉన్నాడు. గత వారంలో ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని అందరు భావించారు కానీ లాస్ట్ మినిట్ లో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఈ వారం లీస్ట్ లో ప్రియ, మనీష్ ఉన్నారు. వీళ్ళిద్దరు హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన వాళ్ళే. అయితే ఈ వారం మర్యాద మనీష్ పెద్దగా ఆడిందేమీ లేదు. పైగా నెగెటివిటి పెరిగింది. కామనర్స్ మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, ప్రియాలపై ట్రోల్స్ మాములుగా లేవు. వీరి బిహేవియర్ చూసి అనవసరంగా బిగ్ బాస్ కి సెలెక్ట్ చేశారని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఆనంద్ దేవరకొండతో ఢీ డాన్సర్  నైనిక!

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా అలాగే ఢీ డాన్సర్ గా నైనికా అందరికీ పరిచయమే. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రీల్స్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి నైనిక కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు సమాధానాలు ఇలా చెప్పింది. "నేటివ్ ఐతే వైజాగ్ పుట్టింది ఒరిసాలో సెటిల్ అయ్యింది హైదరాబాద్ లో. మిడిల్ క్లాస్ ఫామిలీ మాది. పదవ తరగతి నుంచి నేను నా డ్రీమ్స్ ని వెతుక్కుంటూ వచ్చాను. ఢీ నాకో మంచి పేరు తెచ్చిపెట్టింది. కాలేజ్ కి నేను వెళ్ళలేదు కానీ  స్కూల్ లో శుభం అనే అబ్బాయి లవ్ లెటర్ లాంటిది ఇచ్చాడు. అందులో నైనిక అండ్ శుభం కిస్స్డ్ అని ఉంది. అది స్కూల్ మొత్తం తెలిసిపోయింది. కానీ అలాంటివి ఏమీ జరగలేదు. నేనొక డీసెంట్ స్టూడెంట్ ని." అని చెప్పింది నైనిక. "యానిమల్స్ డాన్స్ చేయగలిగితే బెస్ట్ డాన్సర్ అవార్డు దేనికి ఇస్తారు" అన్న ప్రశ్నకు "ఎలిఫేంట్" అని చెప్పింది. "సంకేత్ తో ఎక్కువగా పెర్ఫెర్మెన్సులు చేసాను కాబట్టి సంకేత్ బెస్ట్ పెర్ఫార్మర్. అమ్మ నా ఇన్స్పిరేషన్. ఆమె చిన్నప్పటి నుంచి నన్ను ఇంతవరకు ఎలా తీసుకొచ్చింది అనేది నాకు తెలుసు కాబట్టి ఆమెలా స్ట్రాంగ్ గా ఉంటే చాలు అనుకుంటాను. ఢీలో టాప్ 3 కొరియోగ్రాఫర్స్ అంటే యష్, శశి, రామ్ మాష్టర్ లు ఇష్టం. నాగ చైతన్య, ఆనంద్ దేవరకొండ, రణబీర్ కపూర్ ఇష్టం. కీర్తి సురేష్, దీపికా పడుకోన్, అలియా భట్ అంటే ఇష్టం. ఈ ప్రొఫెషన్ లోకి రాకపోయి ఉంటే నేను కెమిస్ట్ అయ్యేదాన్ని. మెడిసిన్ అంటే ఇష్టం. అలా మెడిసిన్ ఏదైనా చదువుకునే దాన్ని.ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకుంటే మోసపోవాల్సి వస్తుంది. ఒకవేళ నాకు హీరోయిన్ గా అవకాశం వస్తే ఆనంద్ దేవరకొండతో చేస్తా. నా లైఫ్ ని ఒక మూవీగా తీస్తే డ్రామా జానర్ కింద వస్తుంది. నావి కొన్ని సాంగ్స్ చూడొచ్చు అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో చూడొచ్చు. పెళ్లి అనేది బ్యూటిఫుల్ రైట్ పర్సన్ దొరికితే. ప్రతీ ఒక్కరూ పెళ్లి చేసుకోవాలి. హ్యాపీ ఫామిలీని అందరూ ఎంజాయ్ చేయాలి." అంటూ చెప్పుకొచ్చింది నైనిక.  

Bigg boss 9 Telugu: రీతూ డబుల్ ఫేస్.. డబుల్ గేమ్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయల్!

బిగ్ బాస్ సీజన్-9 లో మొన్నటి వరకు కెప్టెన్సీ టాస్క్ లు జరుగగా అందులో డీమాన్ పవన్ గెలిచి కొత్త కెప్టెన్ అయ్యాడు. అయితే డీమాన్ కెప్టెన్ అవ్వాలని తనకే రీతూ సపోర్ట్ చేసిందని బిగ్ బాస్ ఆడియన్స్ అందరికి తెలుసు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. పర్మినెంట్ ఓనర్ అవ్వటానికి ఏడుగురు రెంటర్స్ కి టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్. గతవారం భరణి పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. ఈ వారం టాస్క్ లో గెలిచి రాము రాథోడ్ పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. టాస్క్ లో అందరు బాగా ఆడారు.‌ఇక చివరగా ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ ఉండగా.. హౌస్ అంతా ఇమ్మాన్యుయల్ కి సపోర్ట్ చేయగా.. ఒక్క రీతు మాత్రం డీమాన్ పవన్ కి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత రీతూ ఓ దగ్గర కూర్చొని ఉంటే తన దగ్గరికి ప్రియ వస్తుంది. నువ్వు కావాలనే డీమాన్‌కి ఇచ్చావని బయటికి ఏమనలేదు కదా అని అంటూ రీతూని ప్రియ అడిగింది. వీళ్లిద్దరు ఆడారు కదా గేమ్.. దాన్ని బట్టే నేను ఇచ్చాను కదా.. అంటూ రీతూ తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది. ఇంతలో ఇద్దరు కలిసి నా మీద ఎటాక్ చేశారు.. రెండో విషయం ఇమ్మూ అసలు డిఫెండ్ లోనే ఉన్నాడు ఎటాక్‌  చేయలేదు.. ఆ ప్లేట్ పక్కనే కూర్చున్నాడంటూ డీమాన్ మాట్లాడాడు. మరోవైపు మర్యాద మనీష్ కూడా కామనర్లతో కెప్టెన్సీ గేమ్ గురించి చర్చించాడు. నేను ప్లేట్ తన్నడానికి రీజన్ అదే.. ఆయన మనీష్‌ని ఎటాక్ చేయని అన్నాడు.. అప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే భరణిని ఎటాక్ చేద్దామని అనుకున్నామని మనీష్ చెప్పాడు. భరణి గారు అన్‌ఫెయిర్ ఆడుతున్నారని క్లియర్‌గా తెలుస్తుందంటూ ప్రియ మధ్యలో మాట్లాడింది. ఇమ్మాన్యుయల్ కూడా అన్‌ఫెయిర్ ఆడుతున్నాడు కదా భరణి గార్ని చూసి కూడా కొట్టట్లేదంటూ ప్రియ చెప్పుకొచ్చింది. ఇక భరణి దగ్గరికి సుమన్ శెట్టి వస్తాడు. ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఏంటన్నా నా రీతూ నాకు సపోర్ట్ రావట్లేదు ఆడికి సపోర్ట్ వస్తుంది అంటున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఇక కామనర్ల దగ్గర కూర్చొని చేసిన ఘనకార్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ రీతూ కామెంట్లు చేసింది. కాదు నేను క్లియర్‌గా స్టాప్ అన్న తర్వాత ఆపేయకపోతే తీసేస్తానని చెప్పా కదా.. స్టాప్ ఎందుకు చెప్పారని అడుగుతారేంటి నాకు అర్థం కాదంటూ రీతూ అంది. మరోవైపు సుమన్ శెట్టితో మాట్లాడుతూ.. ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ నుంచి రీతూ వాళ్లనే సపోర్ట్ చేస్తుందన్నా.. నా కోసం ఆడలేదన్నా అంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టఫ్ ఇచ్చావో తెలుసా నీకు.. మాములు టఫ్ ఇవ్వలేదు నువ్వు అంటూ సుమన్ శెట్టి ఓదార్చాడు.  

Brahmamudi : అబార్షన్ చేయాల్సిందేనన్న డాక్టర్.. రాజ్ ఒప్పుకుంటాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -830 లో..... రాజ్ కి నిజం చెప్పానని అప్పుతో కళ్యాణ్ అంటాడు. అసలు చెప్పకుండా ఉండాల్సింది ఎలాగైనా బిడ్డని తల్లిని బ్రతికించుకుంటానని అన్నయ్య పట్టుదలగా ఉన్నాడని అప్పుతో కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు నిద్రపోతున్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి నిన్ను నా బిడ్డని ఎలాగైనా కాపాడుకుంటానని అంటాడు. వెళ్లిపోతున్న రాజ్ చెయ్ కావ్య పట్టుకొని మీరు ఎప్పుడు నాతో ఉండాలని అంటుంది. మరుసటి రోజు స్వరాజ్ ని రెడీ చేసి రేవతి హాల్లోకి తీసుకొని వస్తుంది. అప్పుడే జగదీశ్ గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. ఏంటి రావడానికి ఇబ్బంది పడుతున్నావని రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. అపర్ణ, సుభాష్ ఇద్దరు వెళ్లి పిల్వండి.. మీరే అప్పుడు రావద్దని అన్నారు కదా అందుకే ఇబ్బంది పడుతున్నాడని ఇందిరాదేవి అంటుంది. సుభాష్, అపర్ణ వెళ్లి జగదీష్ కి సారీ చెప్పి లోపలికి ఆహ్వానిస్తారు. నేనే మిమ్మల్ని బాధపెట్టానని జగదీష్ అంటాడు. ఆ తర్వాత ఇక మేమ్ వెళ్తామని రేవతి అంటుంది. అందరు ఇక్కడే ఉండాలని నిన్నే మీ అమ్మ చెప్పింది కదా అని ఇందిరాదేవి అంటుంది. ఇక్కడే అందరం ఉందామని అపర్ణ అంటుంది. లేదు అమ్మ కూతురు అత్తారింట్లో ఉండడమే గౌరవం నేను వస్తుంటానని రేవతి చెప్తుంది. వెళ్తాను సర్ అని సుభాష్ కి జగదీశ్ చెప్తుంటే.. సర్ ఏంటి మావయ్య అనమని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రేవతి అక్కడ నుండి వెళ్తుంది. మరొకవైపు ఇక ఇలా ఉంటే ఆస్తులు మనకి వచ్చేలా లేవు.. మంచివాడిలా మారినట్లు నటించాలి.. ముందు స్వప్నని నమ్మించాలని రుద్రాణితో రాహుల్ అనగానే తను సరే అంటుంది. తరువాయి భాగంలో రాజ్, కళ్యాణ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఖచ్చితంగా అబార్షన్ చెయ్యాలని డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత కంపెనీ నుండి కాల్ వచ్చింది ఆఫీస్ కి వెళ్ళమని రాజ్ తో సుభాష్ చెప్తాడు. నేను వెళ్ళనని తనపై రాజ్ చిరాకు పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial :  గంగపై సైదులు ఎటాక్.. కనిపెట్టేసిన రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -61 లో......గంగ పుట్టినరోజు కాబట్టి రుద్ర తనని షాపింగ్ మాల్ కి తీసుకొని వెళ్లి డ్రెస్ తీసుకొమ్మంటాడు. గంగ తక్కువ ధర గల డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. రుద్ర వేరొకవైపు వెళ్తాడు. అక్కడున్న వాళ్ళు గంగ చీప్ గా సెలెక్ట్  చేసుకుంటుందంటూ నవ్వుకుంటారు. అది రుద్ర విని గంగ దగ్గరికి వస్తాడు. గంగకి డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. రుద్ర ఏం చూపించినా కూడా బాగున్నాయంటూ చెప్తుంది. ఏంటి అన్నీ బాగున్నాయంటున్నావ్.. నీకంటు ఒపీనియన్ లేదా అని రుద్ర అంటాడు. ఇవి ట్రైయల్ వేసి చూసుకోమని రుద్ర అంటాడు. నాకు ట్రయల్ రూమ్ ఎక్కడో తెలియదని గంగ  చెయ్ పట్టుకొని రుద్ర తీసుకొని వెళ్తాడు. దాంతో గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంగ లోపలికి వెళ్ళబోతుంటే లోపలున్న సైదులు ఫోన్ రింగ్ అవుతుంది. అప్పటికే రుద్రకి డౌట్ వచ్చి గంగని ఆగమంటాడు. గంగ ఇప్పుడు వెళ్ళమని లోపలున్న వాళ్ళకి వినపడేలా అంటుంటే.. గంగని వెనక్కి వెళ్ళమని సైగ చేస్తాడు. రుద్ర డోర్ ఓపెన్ చేయగానే గంగ అనుకొని సైదులు కత్తితో ఎటక్ చేయబోతుంటే.. రుద్ర ఆపుతాడు. సైదులుని పట్టుకోవాలని చూస్తే అతను పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : శ్రీవల్లికి డౌట్.. కళ్యాణ్ పంపిన పెన్ డ్రైవ్ లో ఏం ఉంది?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -268 లో..... ప్రేమపై కళ్యాణ్ పగతీర్చుకోవాలనుకుంటాడు. అందుకు ప్రేమకి ఫోన్ చేసి నీ జీవితం ఎలా నాశనం చేస్తానో చూడమని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరొకవైపు ప్రేమ గదిలోకి శ్రీవల్లి వెళ్లి కొరియర్ వెతికి ఓపెన్ చేస్తుంది. అందులో ప్రేమ, కళ్యాణ్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని చూసి షాక్ అవుతుంది. అసలు దీని వెనకాల ఏదో రహస్యం ఉందని ఫోటోస్ పట్టుకొని బయల్దేర్తుంది. అప్పుడే నర్మద ఎదురుపడుతుంది. నీకు కొంచెం అయినా సిగ్గుందా.. ప్రేమ గదిలో ఏం చేస్తున్నావని శ్రీవల్లీపై నర్మద కోప్పడుతుంది. ఇదిగో ఫోటోస్ అని తన దగ్గర కొన్ని ఫోటోస్ ఉంచుకొని మిగతావి నర్మదకి చూపిస్తుంది. అవి చూసి నర్మద టెన్షన్ పడుతుంది. ఏంటి మాట పడిపోయిందని శ్రీవల్లి అంటుంది. ఇందులో తప్పేముంది.. వాళ్ళ ఫ్రెండ్ తో ఫోటో దిగిందని నర్మద దబాయిస్తుంది. ఈ విషయం ఎక్కడ చెప్పకని శ్రీవల్లితో నర్మద అంటుంది. ఫోటోస్ అన్నీ తీసుకొని వెళ్లి వేదవతికి చూపిస్తుంది నర్మద. వేదవతి వాటిని చూసి భయపడుతుంది. ఆ కళ్యాణ్ గాడు ఈ ఫోటోస్ తో తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనుకుంటా.. అందుకే ప్రేమ టెన్షన్ పడుతుందని నర్మద, వేదవతి అనుకుంటారు. ఫోటోస్ ని ఇద్దరు కలిసి కాల్చేస్తారు. అదంతా శ్రీవల్లి చూసి ఫోటోస్ కాల్చేస్తున్నారంటే ఆ రహస్యం ఏంటో వాళ్ళకి తెలుసుకావచ్చు.. ఇక వాళ్ళని భయటపెడుతానని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి కళ్యాణ్ ఫోన్ చేసిన విషయం చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు.. వాడిని వెతికే పనిలో ఉన్నానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ తన ఫ్రెండ్ తో కలిసి రామరాజు దగ్గరికి వస్తాడు. పెన్ డ్రైవ్ తన ఫ్రెండ్ కి ఇచ్చి రామరాజుకి ఇవ్వమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : ప్రాణధాత దీపే అని నిరూపించిన కార్తీక్.. తనని సుమిత్ర క్షమిస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -467 లో.....శౌర్య నీ కన్నకూతురు కాకున్నా అన్ని బాగా చేస్తున్నావని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న నీకేం అర్హత ఉందని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావని తనపై దశరథ్ కోప్పడతాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని ఇక్కడ ఒక్కరిచేత అనిపించమని జ్యోత్స్న అనగానే నువ్వు మాట్లాడింది తప్పు అని పారిజాతం అంటుంది. నీకు రక్తబంధం గురించి ఏం తెలుసు.. కొంతమంది పెంచుకున్న కూడా కన్నవాళ్లకంటే ఎక్కువ చూసుకుంటారని జ్యోత్స్నకి పారిజాతం కౌంటర్ వేస్తుంది. గ్రానీ ఏంటి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఇక వెళదామా అని జ్యోత్స్న అనగానే ప్రాణధాతని చూడాలి కదా అని సుమిత్ర అంటుంది. కార్తీక్.. నీ ప్రాణధాతని పిలువమని సుమిత్ర అనగానే నువ్వు కళ్ళు మూసుకోమని కార్తీక్ చెప్తాడు. దీప ని తీసుకొని వెళ్లి సుమిత్ర ముందు నిల్చోబెడతాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. దీపనే నా ప్రాణధాత అని కార్తీక్ అనగానే లేదు తనని నా దృష్టిలో గొప్పగా చెయ్యడానికి అబద్దం చెప్తున్నావ్ అంటుంది. దాంతో కార్తీక్.. దీప చిన్నప్పటి ఫోటో చూపిస్తాడు. ఈ అమ్మాయే నిన్ను కాపాడిందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత దీప, కుబేర్ తో ఉన్న ఫోటో చుపిస్తాడు కార్తీక్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని కార్తీక్ అంటాడు. అవును అది చిన్నప్పటి ఫోటో దీపదే అని అనసూయ అంటుంది. దాంతో అందరు దీపనే కార్తీక్ ప్రాణధాత అని నమ్ముతారు. దాంతో సుమిత్ర ఇబ్బందిగానే దీప కి థాంక్స్ చెప్పి లాకెట్ దీప మెడలో వేస్తుంది. ఆ తర్వాత ఇక వెళదామని సుమిత్ర అంటుంటే.. నాకు ఇంకో హెల్ప్ చెయ్యాలి నువ్వు దీపని క్షమించాలి.. మావయ్య నువ్వు అత్తని క్షమించాలి.. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ప్రేమ దేశం కాదు ఫేక్ దేశంలా ఉంది..మనీష్ ఓవర్ థింకింగ్ బాబోయ్

  బిగ్ బాస్ సీజన్ 9 సోసో నడుస్తోంది. ఐతే ఈ సీజన్ లో కామనర్స్ క్యాటగిరీ నుంచి కొంతమంది హౌస్ లోకి వెళ్లారు. కొంతమంది ఎలిమినేట్ ఇపోయారు. వారిలో శ్వేతా శెట్టి కూడా ఒకరు. ఐతే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ మీద రివ్యూస్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా మనీష్ గురించి, డీమన్ పవన్, రీతూ గురించి గట్టిగానే చెప్పుకొచ్చింది. "అబ్బా లవ్ ట్రాక్ చూడలేకపోతున్నామండీ బాబోయ్...టూ మచ్.. కొంత లిమిట్ వరకు ఓకే. రీతూ, డీమన్ లవ్ స్టోరీ పులిహోరా...ఎవరు ఎవరికీ కలుపుతున్నారో..ఎవరు ఎందుకు కలుపుతున్నారో...ఇటు కలుపుతున్నారా, అటు కలుపుతున్నారా ఎన్ని లవ్ స్టోరీస్.. పవన్ కళ్యాణ్ రీతూ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బుంగ మూతి పెట్టుకుంటుంది. డీమన్ దగ్గర బుంగ మూతి పెట్టుకుంటుంది.. ఇటొచ్చి నా మీద అలిగావా అంటూ వాళ్ళ కాన్వర్జేషన్స్ ..ఇవన్నీ కాకుండా జోక్ గా తనూజా- ఇమ్మానుయేల్ కాన్వర్జేషన్స్ ఎం లవ్ ట్రాక్ అండి చిరాకొస్తోంది...కొంతవరకు చూడగలం కానీ అర్ధమైపోతుంది ఇది ఫేక్ అని.. నాకు తెలిసి మొన్న డేంజర్ జోన్ లోకి వెళ్లిన దగ్గర నుంచి డీమన్ పవన్ ఇలా చేస్తున్నాడు. కానీ ఆ ఫేక్ నెస్ కనిపించేస్తోంది. కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. మరీ రోతగా అనిపించింది." అంటూ రీతూ- డీమన్ లవ్ స్టోరీస్ గురించి చెప్పుకొచ్చింది శ్వేతా శెట్టి. ఇక మనీష్ గురించి చెప్తూ శ్వేతా పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. " అబ్బా మనీష్ రోజురోజుకూ ఎంత చెండాలంగా బిహేవ్ చేస్తున్నాడంటే..ఇమ్మానుయేల్ తో ఇష్యూ అయ్యింది కదా ఇప్పుడు బెడ్ షేర్ చేసుకోవచ్చా లేదా అని అడగడం ఎంత లూజ్ టంగ్ అంటే అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంత లో స్టాండర్డ్స్ లో ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. దానికి ఇమ్మాన్యూల్ ఏదో ఒక రిప్లయ్ ఇవ్వాల్సింది. ఇక ప్రియా గారు వాళ్ళు చూడండి నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారో అని చెప్తూ మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడ్డం.. మనీష్ ఎం అనుకుంటున్నాడో అర్ధం కావడం లేదు. కంప్లీట్ గా డిజాస్టర్ గేమ్ ప్లే చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే కావాలని భరణి గారితోనే ఎందుకు గొడవ పడుతున్నాడో నాకు అర్ధం కావట్లేదు. అతను సీనియర్ కాబట్టి గెలుస్తాడేమో అలంటి వాళ్ళతో  అపోజిట్ గా పెట్టుకుంటే గెలుస్తానని థింక్ చేస్తున్నాడేమో..ఏమో ఓవర్ థింకింగ్ స్ట్రాటజీస్ కదా ఒక్కోసారి ప్లస్ అవుతాయి..ఒక్కోసారి మైనస్ అవుతాయి. బి కేర్ ఫుల్ మనీష్" అంటూ ఒక హెచ్చరిక చేసింది శ్వేతా.

Director Teja : దర్శకుడు తేజపై అభిమానంతో ఇంట్లో ఒక గది కట్టించేసిన సుమన్ శెట్టి!

  బిగ్ బాస్ సీజన్-9 లో సెలెబ్రిటీ కోటాలో సుమన్ శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతను ఫస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నప్పుడు అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో వారం కూడా మెజారిటీ ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. 1983 జూన్ 9న జన్మించారు. సినీ రచయిత సత్యానంద్ ఆయనలోని నటుడిని గుర్తించి, సినిమాలలో ప్రయత్నించమని ప్రోత్సహించారు. అలా తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'జయం' సినిమాతో టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయమయ్యారు సుమన్ శెట్టి. ఆ సినిమాలో 'అలీ బాబా'గా ఆయన పంచిన వినోదాన్ని అంత తేలికగా మరచిపోలేము. మొదటి సినిమాకే బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారో.. ఏ రేంజ్ లో నవ్వుల వర్షం కురిపించారో అర్థం చేసుకోవచ్చు. 'జయం' తర్వాత సుమన్ శెట్టి వెనుతిరిగి చూసుకోలేదు. స్టార్ కమెడియన్ గా దశాబ్దంపాటు ఆయన కెరీర్ దిగ్విజయంగా కొనసాగింది. కబడ్డీ కబడ్డీ, 7జి బృందావన్ కాలనీ, యజ్ఞం, ధైర్యం, రణం, ఉల్లాసంగా ఉత్సాహంగా, దొంగల బండి, బెండు అప్పారావు.. ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ దాదాపు 20 సినిమాల్లో నటించి మెప్పించారు. సుమన్ శెట్టి గురించి డైరెక్టర్ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నీకు మంచి అవకాశాలు వస్తాయి. ఒక సైట్ కొనుక్కోమని చెప్పాను.. అతను చెప్పినట్టే సుమన్ శెట్టి సైట్ కొన్నాడు. ఆ తర్వాత ఒకరోజు తేజ గారి దగ్గరికి వెళ్ళి‌న సుమన్ శెట్టి అతని కాళ్ళ మీద పడబోయాడంట.. అలా ఏం వద్దని డైరెక్టర్ తేజ అన్నాడంట. మరి నేను ఏ విధంగా మీ ఋణం తీసుకోగలనని డైరెక్టర్ తేజని సుమన్ శెట్టి అడుగగా.. నేను కొత్తవాళ్ళతో సినిమాలు తీస్తాను.. ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తాను.. అప్పుడు నాకు ఉండడానికి చోటు కావాలి కదా.. నువ్వు కట్టుకునే ఇంట్లో నా కోసం ఓ గదిని ఉంచమని చెప్పడంతో సుమన్ శెట్టి అలాగే చేశాడంట.. ఆ గదిలో డైరెక్టర్ తేజ గారి ఫోటో ఉంటుందంట.  రోజు ఆ గదిని క్లీన్ చేస్తాడంట సుమన్ శెట్టి. ఇది దర్శకుడు తేజ చెప్తూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు.  ఇదిలా ఉండగా నెటిజన్లు ఫుల్ కామెంట్లు చేస్తున్నారు. సుమన్ శెట్టి వంటి నేచురల్ ఆర్టిస్ట్ ని మనం చాలా మిస్ అయ్యాం.. అందుకే అతడికి మన సపోర్ట్ ఇద్దాం.. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu) లో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి అని ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ వస్తున్నాయి. మరి హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు కామెంట్ చేయండి.  

Bigg boss 9 Telugu : సెకెండ్ వీక్ కెప్టెన్ గా డీమాన్ పవన్.. పెద్ద ట్విస్ట్!

  బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఓనర్స్ అందరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. ఇక అప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. రెంటర్స్ లో అందరు డిసైడ్ అయి ఓనర్స్ కేవలం ముగ్గురే కంటెడర్స్ గా సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. దాంతో మనీష్,భరణి, పవన్ డీమాన్ ని గ్రూప్ డిస్కషన్ ద్వారా సెలక్ట్ చేసుకుంటారు. మమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటని ప్రియ, శ్రీజ ఇద్దరు రెంటర్స్ పై కోప్పడతారు. ఆ తర్వాత బిగ్ బాస్ ముగ్గురు కంటెండర్స్ ని కలిసి రెంటర్స్ లో ఒకరికిని కంటెండర్ గా సెలక్ట్ చేసుకోమనగా ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఇమ్మాన్యుయల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. టాస్క్ పేరు.. రంగు పడుద్ది. దీనికి సంఛాలక్ గా రీతు ఉంటుంది. అందులో మొదటి రౌండ్ కి మనీష్ అవుట్ అవుతాడు. టాస్క్ జరిగేటప్పుడు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లాగే ఆట జరిగింది. ఇమ్మాన్యుయల్, భరణి వాళ్ళు ఇద్దరు అసలు కలర్ పూసుకోకుండా మనీష్ కి పూసి అవుట్ చేసారు. భరణి, ఇమ్మాన్యుయల్ కలిసి డీమాన్ పవన్ ని టార్గెట్ చేశారు. సంఛాలక్ మాటని భరణి విననందుకు అతడిని రీతూ అవుట్ చేసింది. ఇక మిగిలింది ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్. అందులో ఇమ్మాన్యుయల్  టీ షర్ట్ కి ఎక్కువ రంగు ఉండడంతో డీమాన్ పవన్ విన్ అయ్యాడు. ఇలా బిగ్ బాస్ రెండవ ఇంటి కెప్టెన్ గా డీమాన్ పవన్ ఎంపికయ్యాడు.  

Bigg boss 9 Telugu : కెప్టెన్సీ టాస్క్ లో పోటాపోటీ.. గెలిచిందెవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ రెండవ రోజు కొనసాగింది. నిన్న జరిగిన టాస్క్ లో ఓనర్స్ విన్ అయ్యారు.ఈ రోజు టాస్క్.. బజర్ ఆర్ నో బజర్. ఇందులో బిగ్ బాస్ ఇరు టీమ్ లకి అరగంట టైమ్ ఇస్తాడు. ఆ లోపు ఎవరు బజర్ కొడతారో.. వాళ్లకు స్లీప్ లెస్ అవర్ లో గంట టైమర్ తగ్గుతుంది. అలా ఇద్దరు బజర్ కొడితే ఇద్దరికి ఒక గంట పెరుగుతుంది. అలా ఏ విషయమైనా ఇరు టీమ్ లకి టెలీఫోన్ లో మాట్లాడే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్తాడు. ఓనర్స్ లో కళ్యాణ్.. రెంటర్స్ లో రీతు ఫోన్ మాట్లాడుకుంటారు. మీరు కొట్టొద్దు మేమ్ కొట్టమని అనుకుంటారు కానీ ఓనర్స్ లో శ్రీజ బజర్ కొడుతుంది. అలా అని రెంటర్స్ కూడా కొట్టకుండా లేరు.. వాళ్ళు చివరి నిమిషంలో కొట్టారు. చివరికి వచ్చేసరికి ఇరు టీమ్ లు.. టాస్క్ లో ఒకరికి తెలియకుండా ఒకరు కొట్టారు. ఇద్దరు టాస్క్ లో ఫెయిల్ అయి ఇద్దరికి గంట స్లీప్ లెస్ అవర్ పెరుగుతుంది. అప్పటికి కూడా ఓనర్స్ తక్కువ స్లీప్ లెస్ అవర్ లో ఉన్నారు. వాళ్ల టైమర్ ముందు జీరోకి వచ్చింది కాబట్టి వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు.  

Karthika Deepam2 : జ్యోత్స్నకి ఎదురు తిరిగిన పారిజాతం.. రక్తసంబంధం అంటే ఇదేనా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -466 లో..... శౌర్యా బర్త్ డే కి పారిజాతం కేక్ తీసుకొని వస్తుంది. అయిన నువ్వు తీసుకొని రావడం ఏంటి అని జ్యోత్స్న అడుగుతుంది. శివన్నారాయణ తీసుకొని రమ్మన్న విషయం గుర్తు చేసుకుంటుంది పారిజాతం. ఎలా వచ్చావని జ్యోత్స్న అడుగగా నేనే తీసుకొని వచ్చానని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మావయ్య గారు నమస్తే అని శ్రీధర్ అనగానే హా నమస్తే అని అయిష్టంగా సమాధానమిస్తాడు శివన్నారాయణ. ఆ తర్వాత ఒరేయ్ కార్తీక్ నేను వచ్చింది శౌర్యా బర్త్ డే కోసమే కాదు ఇంకొక మనిషిని ప్రాణధాతని కలవడానికి కూడా వచ్చానని సుమిత్ర అంటుంది. అసలు ప్రాణధాత ఏంటని అందరు ఆశ్చర్యంగా చూస్తుంటే కార్తీక్ ని కాపాడిందని జరిగింది మొత్తం పారిజాతం చెప్తుంది.  ఆ రోజు నీకేమైనా అయితే నా కూతురు చేసిన పనికి నేను జీవితాంతం బాధపడే దాన్ని.. నీకు ప్రాణధాత అంటే నాక్కూడా ప్రాణధాత తనని కలిసి ఋణం తీర్చుకోవాలని సుమిత్ర అంటుంది. అందరూ నేను ప్రాణధాతని కలవాలని అంటారు. ఇప్పుడు కాదు కేక్ కటింగ్ అయ్యాక అని కార్తీక్ అంటాడు. అసలు బావ ఏం చేయబోతున్నాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ కి పారిజాతం ఫోన్ చేసి.. కాశీ గాడి గురించి నాకు ఎందుకు చెప్పలేదని అడుగతుంది. జ్యోత్స్న కి చెప్పాను హెల్ప్ చెయ్యమన్నాను కానీ చెయ్యలేదని దాస్ చెప్తాడు. అప్పుడే పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. పారిజాతానికి జ్యోత్స్న అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఎంత మోసం చేసావే అని పారిజాతం మనసులో అనుకుంటుంది. మనం తర్వాత మాట్లాడకుందామని పారిజాతం లోపలికి వెళ్తుంది. కేక్ కటింగ్ అయ్యాక.. నీ సోషల్ సర్వీస్ బాగుందని జ్యోత్స్న అంటుంది. కన్నకూతురు అయితే బాధ్యత అవుతుంది. ఇలా వేరే వాళ్ళ కూతురికి బర్త్ డే చేస్తే సోషల్ సర్వీస్ అవుతుందని జ్యోత్స్న అనగానే దశరథ్ కోప్పడతాడు. నేను అన్నది తప్పు అని ఇక్కడ ఎవరితో అయిన అనిపించు బావ అని జ్యోత్స్న అంటుంది. నువ్వు మాట్లాడింది తప్పు అని నేనంటున్నానని పారిజాతం అంటుంది. రక్తసంబంధం గురించి నువ్వు మాట్లాడకు.. దానికి విలువ లేదని పారిజాతం మాట్లాడుతుంటుంది. ఇన్నాళ్లకి కరెక్ట్ గా మాట్లాడావని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ కి నిజం చెప్పేసిన కళ్యాణ్.. పుట్టబోయే బిడ్డను దక్కించుకుంటాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -829 లో...... రాజ్ దగ్గరకి కళ్యాణ్ వచ్చి నీతో మాట్లాడాలి అన్నయ్య బయటకు వెళదామని అంటాడు. ఇద్దరు బయటకు వెళ్తుంటే.. కావ్య వస్తుంది. ఎక్కడకి వెళ్తున్నారు.. ఈ టైమ్ లో అని అడుగుతుంది. కళ్యాణ్ ఏదో మాట్లాడాలట అని రాజ్ అనగానే అంత సీక్రెట్ ఏముంటుందో కొంపదీసి వేరొక అమ్మాయిని సెట్ చేసుకొని ట్విస్ట్ ఇవ్వడం లేదు కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్, రాజ్ ఇద్దరు బయటకు వెళ్తారు. అన్నయ్య అప్పు నేను హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు.. అప్పుకి ఏదో ప్రాబ్లమ్ ఉందట బేబీని క్యారీ చెయ్యకూడదంట ఒకవేళ చేస్తే అప్పు ప్రాణానికి ప్రమాదమంట అని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. వెంటనే అప్పుకి చెప్పు ఎంత త్వరగా వీలైంత అంత త్వరగా డాక్టర్ చెప్పినట్టు చెయ్యాలని రాజ్ అంటాడు. అప్పు ని ఒప్పించాలని రాజ్ అనగానే అయితే నువ్వే ఒప్పించు అన్నయ్య.. ఏం అంటున్నావని రాజ్ అనగానే.. అవును అన్నయ్య వదినని ఒప్పించాల్సింది నువ్వే ప్రాబ్లమ్ ఉంది.. అప్పుకి కాదు వదిన కి అని కళ్యాణ్ జరిగిందంతా రాజ్ కి చెప్పగానే షాక్ అవుతాడు. మాట్లాడాలని చెప్పి శిక్ష వేసావ్ ఏంట్రా అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత స్వరాజ్ తో అపర్ణ, ఇందిరాదేవి, కావ్య మాట్లాడతారు. నాకు బుల్లి మరదలిని ఇవ్వమని స్వరాజ్ అంటుంటే అందరు నవ్వుకుంటారు. అప్పుడే రాజ్, కళ్యాణ్ డల్ గా వేస్తారు. ఎక్కడికి వెళ్లారని అపర్ణ అడుగుతుంది. ఈ మధ్య అన్నదమ్ములకి రహస్యాలు ఎక్కువ అయ్యాయని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ దేవుడు విగ్రహం దగ్గరికి వెళ్లి బాధపడతాడు. నువ్వు వాళ్ళ తల తలరాత ఎలా రాసావో తెలియదు కానీ నేను నా భార్య బిడ్డని కాపాడుకుంటానని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ రాగానే బావకి చెప్పావా అని అడుగుతుంది. తరువాయి భాగంలో నిద్రపోతున్న కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. నిన్ను నా బిడ్డని నేను కాపాడుకుంటానని అంటాడుమ రాజ్ వెళ్ళిపోతుంటే కావ్య చెయ్ పట్టుకుంటుంది. అంత వినేసిందా అని రాజ్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jayam serial : గంగ బర్త్ డే.. షాపింగ్ కి తీసుకెళ్ళిన రుద్ర!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -60 లో......గంగ డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైందని పెద్దసారు అడుగుతాడు. ఈ రోజు నా పుట్టినరోజు కానీ మా అమ్మ నన్ను గుడికి తీసుకొని వెళ్ళేది.. నాకు నచ్చినవి చేసి పెట్టేదని ఫీల్ అవుతుంది. పాపం లక్ష్మి గంగ సొంతకూతురు కాకపోయినా బాగా చూసుకుందని పెద్దసారు అనుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మీ ఒక దగ్గర కళ్ళు తిరిగిపడిపోతుంది. రుద్ర సంరక్షణ లో పెరుగుతున్న పాప చిన్ని.. లక్ష్మీని చూసి వాటర్ ఇచ్చి కూర్చోపెడుతుంది. లక్ష్మీ వెళ్తుంటే.. ఆగండి నీరసంగా ఉన్నారని చిన్ని అంటుంది. పని చూసుకోవాలని లక్ష్మీ అంటుంది. నీకు పని కావాలి కదా అని చెప్పి వాళ్ళ మేడమ్ దగ్గర ఫోన్ తీసుకొని రుద్రకి ఫోన్ చేసి ఒకరికి హెల్ప్ కావాలి త్వరగా రమ్మని చెప్తుంది. రుద్ర బయల్దేరి వెళ్తుంటే పెద్దసారు ఆపి.. ఈ రోజు గంగ పుట్టినరోజు.. గుడి దగ్గర డ్రాప్ చెయ్యమని చెప్తాడు. రుద్ర షాపింగ్ మాల్ దగ్గర ఆపి గంగకి విషెస్ చెప్తాడు. కొత్త బట్టలు కొనుక్కోమని చెప్తాడు. వద్దని గంగ అంటుంది. డబ్బు నీ శాలరీ నుండి కట్ చేస్తారులే అని రుద్ర అనగానే గంగ సరే అంటుంది. గంగ తక్కువ కాస్ట్ లో డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటుంది. మరొకవైపు సైదులు కత్తి పట్టుకొని గంగని ఫాలో అవుతాడు. ట్రయల్ రూమ్ లో సైదులు ఉంటాడు. అప్పుడే వీరు ఫోన్ చేస్తాడు.. పని పూర్తి అవుతుందని సైదులు చెప్తాడు. తరువాయి భాగంలో గంగకి రుద్ర డ్రెస్ సెలక్ట్ చేసి ట్రయల్ కి వెళ్ళమంటాడు. రుద్రకి రూమ్ నుండి ఏదో సౌండ్ వస్తుంది. గంగ డోర్ తియ్యగానే సైదులు కత్తితో ఎటాక్ చేస్తాడు. రుద్ర ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ప్రేమకి సపోర్ట్ గా ధీరజ్.. శ్రీవల్లి, చందు ఒక్కటయ్యారుగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -267 లో..... ప్రేమ కోసం ధీరజ్ భోజనం తీసుకొని వస్తాడు. తను నాకు వద్దని అంటుంది. ఇన్ని రోజులు ఏమైనా కూడా నాకూ నా ధీరజ్ ఉన్నాడని అనుకున్న కానీ నీ మనసులో నాపై ఎలాంటి ఫీలింగ్ లేదు. నువ్వు నన్ను కళ్యాణ్ గాడు మోసం చేసాడని మాత్రమే పెళ్లి చేసుకున్నావ్ కదా అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నావ్.. నాకు ఇంకా బాధేసిందని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ప్రేమ కోపం తగ్గించాడనికి ధీరజ్ చేతిపై సారీ అని రాసి చూపిస్తాడు అయినా ప్రేమ పట్టించుకోదు. మరొకవైపు నర్మద కోసం సాగర్ మల్లెపూలు తీసుకొని వస్తాడు. తనే స్వయంగా నర్మద తల్లో పెడతాడు. నా భార్యకి ఇంట్లో బయట ఇంత గౌరవం దక్కుతుందమటే నాకు గర్వంగా ఉందని నర్మదతో సాగర్ అంటాడు. ఆ తర్వాత చందు తనని పట్టించుకోవడం లేదని శ్రీవల్లి ఏడుస్తూ.. బావ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు నన్ను పట్టించుకోవని అంటుంది. లేదు నువ్వంటే నాకు ఇష్టమని శ్రీవల్లిని దగ్గరికి తీసుకుంటాడు చందు. నా భర్త నాకు సపోర్ట్ గా ఉన్నాడు.. ఇప్పుడు ఆ నర్మద ప్రేమ సంగతి చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్ ని గుర్తుచేసుకొని ప్రేమ సిగ్గుపడుతు ఉంటుంది. అప్పడే ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. తరువాయి భాగంలో కళ్యాణ్ ఫోన్ చేసిన విషయం ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. ఆ కళ్యాణ్ గాడిని ఎలాగైనా పట్టుకొవాలని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు ప్రేమ గదిలోకి శ్రీవల్లి వచ్చి కొరియర్ ఓపెన్ చేసి చూస్తుంది. కళ్యాణ్ ప్రేమ ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతుంది. ఇవి మావయ్య గారికి చూపిస్తే అప్పుడు ఉంటుందని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రీతు చౌదరి, డీమాన్ పవన్ నిబ్బా లవ్ స్టోరీ.. లైవ్ లో అరాచకం!

  బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్‌లకి ఎప్పుడూ లోటు లేదు. ప్రతి సీజన్‌ ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి బాగానే నడిపిస్తుంటారు. ఇక ఈ ఏడాది బంపరాఫర్ కొట్టేశాడు బిగ్‌బాస్. ఏకంగా ట్రయాంగిల్ ట్రాక్ దొరికేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్‌తో పులిహోర కలుపుతూ రీతూ చౌదరి బాగానే హింట్లు ఇచ్చింది.  పవన్ కళ్యాణ్ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ.. నువ్వేం చేసినా నిన్నే చూడాలనిపిస్తుంది.. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది.. నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుందంటూ రీతూ చౌదరి నిబ్బా డైలాగులు కొట్టింది. ఇక మరోవైపు నుండి డీమాన్ తన లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేశాడు. లైవ్ ఎపిసోడ్ లో.. రీతూ చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తుంటే. మనోడు టిప్ టాప్‌గా రెడీ అయ్యి వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. ఇద్దరి మధ్య గాలికూడా ఆడనంత దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశాడు. ఏంటి నువ్వూ మాట్లాడటం లేదు ఈ మధ్య.. అప్పుడు రీతూ చౌదరి చూసిందయ్యా చూపులూ.. కత్తులే. అటు నుంచి డీమాన్ పవన్ అయితే అలా చూస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద కళ్లు వేసుకుని రెప్పకూడా వేయకుండా.. డీమాన్ పవన్‌ని అలా చూసేసరికి వీడు మొత్తం మర్చిపోయి ఊహల్లో తేలిపోతున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకున్నారు. ఏంటీ.. చెప్పు అని రీతు అనగా.. ఏంటీ.. నువ్వే చెప్పు అంటూ డీమాన్ పవన్ అన్నాడు. లైవ్ ఎపిసోడ్ లో రీతు చౌదరి, డీమాన్ పవన్ ఇద్దరు లవర్స్ మాదిరి చేస్తున్నారు. వీళ్ళ మాటలు, చూపులు, చేష్టలు చూస్తుంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఆ తర్వాత డీమాన్, రీతు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. ఏంటీ రీతూ.. నేను ఉదయం కనిపించకపోయే సరికి కోపం వస్తుందా.. నీకో విషయం తెలుసా రీతూ.. ఆ బ్లూ డ్రెస్ నీ కోసమే వేసుకుని వచ్చా. కానీ నన్ను అస్సలు చూడలేదు. ఎంత ఫీల్ అయ్యానో.. ఆ డ్రెస్ నీకు ఇష్టమని.. దాన్ని నువ్వు చూడాలని నీకోసమే వేసుకుని తిరుగుతున్నానంటూ డీమాన్ పవన్ చెప్పాడు. ఇక ఈ పులిహోర అవ్వగానే అద్దం ముందుకు వెళ్ళి చూసుకొని సిగ్గుపడిపోయాడు డీమాన్. ఇక అప్పుడే వచ్చిన సంజన.. ఏంటీ పడిపోయావా.. చూస్తున్నా చూస్తున్నానని అంది. ఆ మాటతో అప్పటివరకు సిగ్గుపడ్డ డీమాన్.. నేను అంత ఈజీగా పడను.. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టమని కవర్ చేశాడు. ఇదంతా ఫేక్ అని లోపలున్న హౌస్ మేట్స్ కే కాదు చూసే ఆడియన్స్ కి కూడా తెలుసు. మరి వీరి నిబ్బా లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తోందో కామెంట్ చేయండి.   

Bigg boss 9 Telugu : ఓటింగ్ లో సుమన్ శెట్టి నెంబర్ వన్...

  బిగ్ బాస్ సీజన్-9 రెండవవారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ లో ఏడుగురున్నారు. హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన కంటెస్టెంట్స్ పై నెగెటివిటి ఏర్పడింది. ఏం మాట్లాడతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు.. మొదటి వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. ఈ వీక్ పక్కాగా ఒక కామనర్ వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే ఓటింగ్ అలా పడుతుంది. ఓటింగ్ లో అనుకోని రీతిలో సుమన్ శెట్టికి భారీ ఓట్లు వస్తున్నాయి. అత్యధిక ఓటింగ్ తో సుమన్ శెట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కుగా కనెక్ట్ అయ్యారు. మళ్ళీ ఈ వారం సంజన తనని నామినేట్ చేసిన పాయింట్ కూడా వ్యాలిడ్ కాదు. రెండవ స్థానంలో భరణి ఉండగా.. మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. నాలుగో స్థానంలో డీమాన్ పవన్, అయిదో స్థానంలో ఫ్లోరా సైనీ, ఆరో స్థానంలో ప్రియశెట్టి ఉండగా.. చివరి స్థానంలో మర్యాద మనీష్ ఉన్నాడు. గత వారంలో ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని అందరు భావించారు కానీ లాస్ట్ మినిట్ లో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఈ వారం లీస్ట్ లో ప్రియ, మనీష్ ఉన్నారు. వీళ్ళిద్దరు హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన వాళ్ళే.. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బయకి వెళ్తారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.