జ్వాల‌కు షాకిచ్చిన నిరుప‌మ్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌కు విషాదాంతపు ఎండింగ్ ని ఇచ్చేసిన ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర వారి పిల్ల‌లు పెద్ద‌వాళ్లు కావ‌డం నుంచి సీరియ‌ల్ ని కొత్త మ‌లుపు తిప్పి న‌డిపిస్తున్నారు. ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోతున్నా కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపిస్తూ స్టార్ మా లో ప్ర‌సారం అవుతోంది. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ఈ మంగ‌ళ‌వారం స‌రికొత్త ట‌ర్న్ తీసుకోబోతోంది. నిరుప‌మ్ ఈ రోజు జ్వాల‌కు షాక్‌ ఇవ్వ‌బోతున్నాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోందంటే.. నిరుప‌మ్ జరిగిన విష‌యాన్ని త‌లుచుకుంటూ బాధ‌ప‌డుతుంటాడు. ఇంత‌లోనే అక్క‌డికి హిమ వ‌చ్చి డాక్ట‌ర్ నిరుప‌మ్ అని పిల‌వ‌డంతో వెంట‌నే నిరుప‌మ్ కోపంతో ర‌గిలిపోతూనే ఏమ‌యింది హిమ బావ అనే పిలుపు కూడా మ‌ర్చిపోయి డాక్ట‌ర్ నిరుప‌మ్ అని పిలుస్తున్నావు అంంటూ ఆగ్ర‌హంతో ఊగిపోతాడు. అప్పుడు హిమ `నేను నీకు క‌రెక్ట్ కాదు అనుకుంటున్నాను` అంటుంది. నువ్వు అనుకుంటే కాదు నేను కూడా అనుకోవాలి` అంటాడు. అంత‌లోనే అక్క‌డికి శోభ వ‌స్తుంది. హిమ‌పై కోపంతో నిరుప‌మ్ శోభ‌ని తీసుకుని బ‌య‌టికి వెళ‌తాడు. క‌ట్ చేస్తే.. సౌంద‌ర్య ఇంట్లో హిమ పెళ్లిచూపులు జ‌రుగుతుంటాయి. ఈ విష‌యాన్ని స్వ‌ప్న త‌న త‌న‌యుడు నిరుప‌మ్ కు చెబుతుంది. ఇక హిమ‌ని మ‌ర్చిపో అంటుంది. కానీ నిరుప‌మ్ మాత్రం హిమ‌నే త‌లుచుకుంటూ చీక‌టి గ‌దిలో కూర్చుని ఎమోష‌న‌ల్ అవుతుంటాడు. ఇదే స‌మ‌యంలో స్వ‌ప్న‌.. శోభ గురించి చెబుతుంది. త‌నే నా పెద్ద కోడ‌ల‌ని ఫిక్స‌య్యానంటుంది. అంతే కాకుండా హిమ పెళ్లికి రెడీ అవుతుంటే నువ్వు ఇంకా త‌న‌నే గుర్తు చేసుకుంటూ వుంటావా? అంటుంది. ఆ త‌రువాత హిమ‌ని క‌లిసిన నిరుప‌మ్ నీకు పెళ్లంటూ జ‌రిగితే అది నాతోనే అన‌డంతో ఆ మాట‌లు చాటుగా విన్న జ్వాల (శౌర్య) షాక‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

యాంకర్ సుమ సీక్రెట్ చెప్పేసిన జోగీ బ్రదర్స్

బుల్లితెరపై యాంకర్ గా సుమకున్న ట్రాక్ రికార్డ్ అందరికి తెలిసిందే. అయితే అమె పంచ్ ల వెనకున్న అసలు సీక్రెట్ ఒకటి వుందట. ఆ విషయాన్ని జోగీ బ్రదర్స్ తాజాగా బయట పెట్టేసి షాకిచ్చారు. ప్రతీ శనివారం ఈటీవీలో సుమ యాంకర్ గా నిర్వహిస్తున్న `క్యాష్ .. దొరికినంత దోచుకో` బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతీ వారం ఈ షోలో సెలబ్రిటీలని, టీవీ నటుల్ని యాంకర్ సుమ ఆహ్వానిస్తూ వారితో కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో నలుగురు గెస్ట్ లని తన షోకి ఆహ్వానించింది. జూన్ 4న శని వారం ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ కి నటి రాగిణి, కాదంబరి కిరణ్, జోగీ బ్రదర్స్ కృష్ణంరాజు, జోగి నాయుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.  ఈ షోలో జోగీ బ్రదర్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డీజే టిల్లు పాటకు కృష్ఱంరాజు స్టెప్పులేస్తే ఆ స్టెప్పులపై సుమ `ఇన్నేళ్లైనా కూడా అవే స్టెప్పులు ఏమీ మారలేదు అంటూ అదిరే పంచ్ వేసింది. దీనికి `నువ్వు యాంకరింగ్ ఏమైనా మార్చావేంటీ? అంటూ కృష్ఱంరాజు కౌంటరిచ్చాడు. ఆ తరువాత జోగీ బ్రదర్స్ కృష్ణంరాజు, జోగి నాయుడు ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తుంటే ఎవరికి ఆ ముద్దులు.. రాత్రి 9:30 షో ఇది.. ఫ్యామిలీ షో ఇది అని పంచ్ విసిరింది సుమ‌. దీనికి జోగినాయుడు `అయితే మా ఫ్యామిలీస్ ని ఎందుకు పిలవలేదు అంటూ కౌంటరిచ్చాడు. ఆ తరువాత జోగీ బ్రదర్స్ ఇద్దరు కూర్చుని సుమపై కౌంటర్లు వేయడం మొదలు పెట్టారు. అన్నయ్యా సుమ తెలుసుకదా అని జోగి నాయుడు అంటే `నాకెందుకు తెలియదురా నేను చిన్నప్పుడు సుమ యాంకరింగ్ చూసేవాడిని అంటూ కృష్ణంరాజు స్ట్రాంగ్ పంచ్ వేశాడు. దీంతో సుమ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసింది. ఆ వెంటనే జోగి నాయుడు అందుకుని `సుమ అనుకుని పంచ్ వేస్తదంటవా లేక స్పాంటెనియస్ గా వేస్తదంటవా? అని అడిగాడు. `పడుకోదూ.. రాత్రి అంతా పంచ్ లు ప్రాక్టీస్ చేసి పొద్దున్నే వేసేస్తది` అని కృష్ణంరాజు పంచ్ వేశాడు. ఈ పంచ్ కి సుమతో సహా కాదంబరి, రాగిణి పగలబడి నవ్వేశారు. జూన్ 4న శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న `క్యాష్` ప్రోగ్రామ్ తాజా ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

యష్ - వేదల మధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ మొద‌లైందా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. స్టార్ ప్లస్ ఛానల్ లో ఏడేళ్ల క్రితం పాపులర్ సీరియల్ గా మహిళా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న `యే హై మొహబ్బతే`కు రీమేక్ గా ఈ సీరియల్ ని తెలుగులో రూపొందించారు. కన్నడ నటుడు నిరంజన్, కోల్ కతా నటి డెబ్జానీ మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, సుమిత్ర, తిరుపతి దోర్య నటించారు. గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళల్ని, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్కూల్ లో ప్రత్యేకంగా నిర్వహించిన స్కూల్ డే కోసం వెళ్లిన వేద, ఖుషీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తనని స్టాప్‌ ముందు వరుసలోకి వెళ్లకుండా చేయడంతో వెనకాలే వుండి ఖుషీ స్పీచ్ ని ఎంజాయ్ చేసిన యష్ ఆ తరువాత మిక్కీ మౌస్ లో ఖుషీని సర్ ప్రైజ్ చేయాలనుకుంటాడు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తిని మిక్కీ మౌస్ గెటప్ లో స్కూల్ కి రప్పిస్తాడు. అయితే అప్పటికే స్కూల్ లో ప్రోగ్రామ్ పూర్తయిపోవడంతో ఖుషీ, వేద కలిసి ఇంటికి వెళ్లిపోతారు. అది తెలిసి యష్ ఫీలవుతాడు. మిక్కీ మౌస్ గెటప్ లో వచ్చిన వ్యక్తిని నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ నిందిస్తాడు. అయితే మిక్కీ మౌస్ గెటప్ లో వచ్చింది తన బద్ద శత్రువు అభిమన్యు అని తెలియడంతో షాకవుతాడు. ఇలాంటి పనులు కూడా చేస్తావా? అంటూ అభిమన్యుపై ఫైర్ అవుతాడు యష్.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు యష్. ఖుషీని ఇంట్లోకి పంపించేసి కార్ పార్క్ చేస్తూ వేద కనిపిస్తుంది. తన కోసం వేచి చూడకుండా వెంటనే ఇంటికి ఎందుకు వచ్చేశావని, తన ఖుషీ ముందు తనని బ్యాడ్ చేయాలని ఇదంతా చేశావని యష్ .. వేదని నిలదీస్తాడు. ఈలోగా వర్షం మొదలవుతుంది. బాల్కనీ విండోలోంచి ఖుషీ చూస్తున్నది గమనించిన యష్ వర్షంలో తడిసి ముద్దవుతున్న వేదని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పేస్తాడు. దీంతో వేద షాక్ అవుతుంది. వెంటనే యష్ ని దూరంగా నెట్టేస్తుంది. ఇదంతా నీపై మోహంతో చేయలేదని, పై నుంచి ఖుషీ చూస్తోందని చేశానని చెబుతాడు యష్. ఆ తరువాత తడిసిన బట్టలతో ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లిపోతారు. ఇదంతా గమనించిన మాళవిక వారి వెంటే ఇంట్లోకి వెళుతుంది. మాళవిక రావడాన్ని గమనించిన య‌ష్ త‌ల్లి మాళిని ఎందకొచ్చావని అడ్డగిస్తుంది. అదే సమయంలో యష్ - వేదల బెడ్రూమ్ నుంచి మాటలు వినిపిస్తాయి. ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లినట్టుగా వాతావరణం మారుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? యష్ - వేదల మధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ మొద‌లైందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్ హంగామా

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. అత్య‌ధిక కాంట్ర‌వ‌ర్సియ‌ల్ షోగా రికార్డు సాధించింది. ఈ షో చుట్టూ ఎలాంటి వివాదాలు, విమ‌ర్శ‌లు త‌లెత్తినా నిర్వాహ‌కులు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నారు. గ‌త ఏడాది సీజ‌న్ 5 ని విజ‌య‌వంతంగా పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. ఈ షో పూర్త‌యిన వెంట‌నే ఓటీటీ వెర్ష‌న్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించేశారు. ఇది కూడా వివాదాలు, గొడ‌వ‌లు, కంటెస్టెంట్ ల అల‌క‌ల మ‌ధ్య మొత్తానికి ఎండ్ అయింది. మ‌హిళా కంటెస్టెంట్ విజేత‌గా నిల‌వ‌డం లేదు అంటూ వినిపిస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ బిగ్ బాస్ నాన్ స్టాప్ వెర్ష‌న్ కు బిందు మాధ‌వి విజేత‌గా నిలిచి మ‌హిళా ప్రేక్ష‌కుల్ని సంతృప్తి ప‌రిచింది. తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ పూర్త‌యిపోవ‌డంతో మ‌ళ్లీ టెలివిజ‌న్ వెర్ష‌న్ బిగ్ బాస్ సీజ‌న్ 6 ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందుకు సంబ‌ధించిన ప్రోమోని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ సీజ‌న్ లో సామాన్యుల‌కు గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నామంటూ నాగార్జున అనౌన్స్ చేసిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 6ని చాలా గ్రాండ్ గా ప్రారంభించ‌డానికి స్టార్ మా వ‌ర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి కూడా. ఇదిలా వుంటే టెలివిజ‌న్ చ‌రిత్ర‌లోనే ఫ‌స్ట్ టైమ్ `బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్` హంగామా ని నిర్వ‌హిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు 100 రోజుల చేసిన హంగామాని ఒక్క రోజులోనే టీవీ న‌టుల‌తో చేయించి ర‌చ్చ ర‌చ్చ చేయ‌బోతున్నారు. 16 మంది టాప్ టెలివిజ‌న్ సీరియ‌ల్స్ స్టార్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి వారితో హంగామా చేయ‌బోతున్నారు. ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. 24 గంట‌ల పాటు ప్ర‌ముఖ పాపుల‌ర్ సీరియ‌ల్స్ లోని 16 మంది పాపుల‌ర్ టీవీ న‌టీన‌టులు క‌లిసి ఈ షోలో హంగామా చేయ‌బోతున్నారు. మ‌ధ్య‌లో దేత్త‌డి హారిక‌, ర‌ష్మీ గౌత‌మ్ స్పెష‌ల్ డ్యాన్స్ లు, టీవీ న‌టులు చేసే ర‌చ్చ‌, వాళ్లు ఆడే గేమ్స్‌, డ్యాన్సులు.. ల‌వ్ ట్రాక్ లు ఒక‌టి కాదు ఇలా ప్ర‌తీదీ బిగ్ బాస్ ఇంట్లో ఒక్క‌రోజు, 24 గంట‌ల్లో చేసిన ర‌చ్చ‌ని ప్ర‌త్యేకంగా `బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్‌` పేరుతో చూపించ‌బోతున్నారు. ఈ ప్ర‌త్యేక షో త్వ‌ర‌లోనే స్టార్ మాలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోని రీసెంట్ గా విడుద‌ల చేశారు. ప్రోమో మామూలుగా లేదు. ఇక షో ఎలా వుంటుందో ఊహించుకోవ‌చ్చు.

వ‌సుధార‌కు సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌నసు`. గ‌త కొంత కాలంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగుతూ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది. క‌న్న‌డ యువ జంట ముఖేష్ గౌడ‌, ర‌క్ష గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో వెండితెర న‌టుడు సాయి కిర‌ణ్, జ్యోతి రాయ్‌, మిర్చి మాధ‌వి, ఉష‌శ్రీ న‌టించారు. ఈ సోమ‌వారం ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోంది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఇప్ప‌డు చూద్దాం. వ‌సుధార‌కు రిషీ ఐల‌వ్ యూ చెప్ప‌డంతో త‌ను చాలా అప్ సెట్ అవుతుంది. నువ్వు చెప్పావు క‌దా అని నేను చెప్పాలా? అంటూ రిషీ ప్రేమ‌ని వ‌సుధార తిర‌స్క‌రిస్తుంది. దీంతో రిషి తీవ్రంగా అప్ సెట్ అవుతాడు. వ‌సుధార ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తుందో అర్థం కాక పిచ్చివాడిలా ప్ర‌వ‌ర్తిస్తూ ఎక్క‌డికో వెళ్లిపోతాడు. రిషీ ఇచ్చిన షాక్ లో వ‌సుధార వుండ‌గా త‌న‌కి సాక్షి మ‌రో షాకిస్తుంది. సాక్షి మాట్లాడుతూ నా టార్గెట్ నువ్వు కాదు రిషి అని చెబుతుంది. రిషీ ప‌రువు తీస్తాను. మీ ఇద్ద‌రి బాగోతం బ‌య‌ట‌పెడ‌తాను. డిబీఎస్ ఎంబీ రిష్యేంద్ర భూష‌ణ్ బాగోతం చూడండి అంటూ మీ ఫొటోలు ప్ర‌ద‌ర్శించి ఉన్న‌వి లేనివి క‌ల్పించి మీ బాగోతం అంతా బ‌య‌ట‌పెడ‌తాను. త‌ల్లీ కొడుకుల్ని విడ‌దీస్తాను అంటుంది సాక్షి. ఆ మాట‌ల‌కు వ‌సుధార షాక్ కు గుర‌వుతుంది. ఇవన్నీ నేను చేయ‌కూడ‌దు అంటే నువ్వు రిషీకి దూరంగా వుండాలంటూ వ‌సుధార‌కు సాక్షి వార్నింగ్ ఇస్తుంది. అయితే షాక్ నుంచి తేరుకున్న వ‌సుధార `నువ్వు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా రిషీ సార్ లైఫ్ లోకి రాలేవ‌ని స్ట్రాంగ్ గా సాక్షికి వార్నింగ్ ఇస్తుంది. ఇంత‌లో వ‌సుధార‌కు `నువ్వు న‌న్ను వ‌దిలేసినా నిన్ను నేను వ‌ద‌ల‌ను.. నీకు క్యాబ్ బుక్ చేశాను. అందులో వెళ్లిపో` అని రిషి మెసేజ్ పెడ‌తాడు. క్యాబ్ లో వెళుతూనే నువ్వు మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేవ‌ని మ‌రోసారి సాక్షికి వార్నింగ్ ఇస్తుంది వ‌సుధార‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  రిషి ఎక్క‌డున్నాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'స్టార్ మా'లో కొత్త సీరియ‌ల్ 'వంటలక్క'

ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `కార్తీక దీపం` సీరియ‌ల్ ఏ స్థాయిలో టాప్ రేటింగ్ తో సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఇందులో వంట‌ల‌క్క పాత్రలో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ సెల‌బ్రిటీగా మారిపోయి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సీరియ‌ల్ కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచి సీరియ‌ల్ టాప్ లో ట్రెండ్ అయ్యేలా చేసింది. వంట‌ల‌క్క పాత్ర కూడా ఓ రేంజ్ లో పాపుల‌ర్ అయింది. అయితే అదే పాత్ర పేరుతో `స్టార్ మా`లో స‌రికొత్త సీరియ‌ల్ జూన్ 6 నుంచి ప్రారంభం కాబోతోంది. ధీర‌వీయ‌మ్ రాజ‌కుమార‌న్‌, శిరీన్‌ శ్రీ‌, నీర‌ళ్ గ‌ల్ ర‌వి, మౌనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అత్యాశ‌కు పోయి ఎలాంటి భ‌యం లేకుండా ఊరునిండా అప్పులు చేసే ఓ యువ‌కుడు ఓ పెద్దింటి అమ్మాయికి వ‌ల వేస్తాడు. పాతిక ఎక‌రాల మాగాణి, ప‌దిహేను ఎక‌రాల కొబ్బ‌రితోట‌.. ప‌ది ఎక‌రాల మామిడి తోట‌. పెద్ద రైస్ మిల్లు.. బంగారం ఫుల్లుగా వున్న ఓ పెద్దింటి అమ్మాయి అమాయ‌క‌త్వాన్ని, మంచిత‌నాన్ని ఆస‌రాగా తీసుకున్న ఓ యువ‌కుడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆస్తిని మొత్తం కొట్టేయాల‌ని ప్లాన్ చేస్తాడు. కానీ అత‌ని ప్లాన్ తెలియ‌ని స‌ద‌రు అమ్మాయి ఆస్తిలో త‌న‌కు చిల్లిగ‌వ్వ కూడా అక్క‌ర్లేదంటూ తండ్రితో శ‌ప‌థం చేసి త‌న‌ని పెళ్లి చేసుకున్న అత్యాశ ప‌రుడితో వెళ్లిపోతుంది. ఊహించ‌ని షాక్ కు కంగుతున్న అత్యాశ ప‌రుడు ప‌నీ పాట లేకుండా కాల‌క్షేపం చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకుని త‌న వెంట వ‌చ్చిన యువ‌తినే ఇబ్బందుల‌కు గురిచేస్తూ వుంటాడు. ఈ క్ర‌మంలో త‌న ఫ్యామిలీని కాపాడు కోవ‌డం కోసం `వంట‌ల‌క్క‌`గా మారుతుంది. మూడుముళ్ల బంధంపై న‌మ్మ‌కం ముడిప‌డ్డ వ్య‌క్తిత్వాన్ని దారికి తీసుకొస్తుందా? అన్న‌ది తెలియాలంటే జూన్ 6 నుంచి ప్రారంభం కాబోతున్న‌ `వంట‌ల‌క్క‌` సీరియ‌ల్ చూడాల్సిందే. సోమ వారం నుంచి శని వారం ప్ర‌తీరోజు మధ్యాహ్నం 2.30 ని.లకు ఈ సీరియ‌ల్ `స్టార్ మా`లో ప్ర‌సారం కానుంది.

స్టార్ మా ప‌రివార్: దేవత vs రాఖీ పూర్ణిమ

ప్ర‌తీ ఆదివారం `స్టార్ మా`లోని పాపుల‌ర్‌ టీవీ సీరియ‌ల్ న‌టీన‌టులతో యాంకర్ ఝాన్సీ నిర్వ‌హిస్తున్న షో `స్టార్ మా ప‌రివార్ లీగ్‌`. గ‌త కొన్ని వారాలుగా సీరియ‌ల్ న‌టీన‌టుల‌తో ఆస‌క్తికంగా సాగుతున్న ఈ షో ఈ ఆదివారం సెమీ ఫైన‌ల్ కి చేరింది. ఈ సెమీస్ లో దేవత, రాఖీ పూర్ణిమ సీరియ‌ల్స్ నువ్వా నేనా అంటూ పోటీప‌డుతున్నాయి. దేవ‌త సీరియ‌ల్ నుంచి అర్జున్ అంబ‌టి, సుహాసిని, కుమారి తో పాటు ఓ బాల‌న‌టి తో క‌లిసి మొత్తం న‌లుగురు హాజ‌ర‌య్యారు. రాఖీ పూర్ణిమ సీరియ‌ల్ నుంచి మ‌ధుబాబు, లిఖితా మూర్తి, సూర‌జ్‌, సుష్మిత మ‌రో న‌టీ హజ‌ర‌య్యారు. షో మ‌ధ్య‌లో టీవీ న‌టుడు అమ‌ర్  దీప్ చౌద‌రి రాఖీ భాయ్ లా సుత్తి ప‌ట్టుకుని ఎంట్రీ ఇచ్చి హంగామా చేశాడు. దేవత, రాఖీ పూర్ణిమ టీమ్ ల మ‌ధ్య ఓ రేంజ్ లో పోటీ జ‌రిగింది. టీమ్ లీడ‌ర్ లుగా మ‌ధు బాబు, అర్జున్ అంబ‌టిల‌ని స్టేజ్ పైకి పిలిచిన యాంక‌ర్ ఝూన్సీ మీమీ హీరోయిన్స్ ని కూడా తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం అని తెలిపింది. దీంతో అర్జున్ అక్క‌డ ముగ్గురున్నారు అందులో ఎవ‌రిని పిల‌వాలో డిసైడ్ చేసుకోవాల‌న్నాడు.. ఇంత‌లో `నువ్వు బాగా తెగించావురా` అంటూ బ్ర‌హ్మీ డైలాగ్ ని వేసి న‌వ్వులు పూయించారు. ఆ త‌రువాత రాఖీ పూర్ణిమ సీరియ‌ల్ నుంచి మ‌ధుబాబు తో క‌లిసి మ‌రో ఇద్ద‌రు `మ‌మ మ‌మ మ‌హేష్‌.. `అంటూ సాగే పాట‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ త‌రువాత `దేవ‌త‌` సీరియ‌ల్ టీమ్ నుంచి అర్జున్‌, సుహాసిని `దేవ‌త‌` సినిమాలోని `యెల్లువ‌చ్చె గోదార‌మ్మా...` పాట‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. మ‌ధ్య‌లో అర్జున్ పై `రాఖీ పూర్ణిమ‌` టీమ్ కు చెందిన సుష్మిత వేసిన పంచ్ లు న‌వ్వులు పూయించాయి. ఆ త‌రువాత సెట్ లో సుహాసిని చేసే హ‌డావిడీ ని అనుక‌రించాడు అర్జున్ అంబటి. ఆ వెంట‌నే `రాఖీ పూర్ణిమ‌` నుంచి మ‌ధుబాబు టీమ్ `రంగ‌స్థ‌లం`నుంచి ఆగ‌ట్టు నుంటావా? .. పాట‌కు అద‌రిపోయే చిందులేశారు. ఫైన‌ల్ గా మ‌హిశాసుర మ‌ర్థిని రూప‌రాన్ని అర్జున్ అంబ‌టి బృందం చేసిన ప్ర‌ద‌ర్శన ఆక‌ట్టుకుంది.

'కామెడీ స్టార్స్ ధ‌మాకా'లో బండ్ల గ‌ణేష్ పై పంచ్ లే పంచ్ లు

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్  కామెడీ షోల‌కు ధీటుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్టార్ మాలో ప్రారంభించిన కామెడీ షో `కామెడీ స్టార్స్ ధ‌మాకా`. గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ కమెడియ‌న్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కామెడీ షోలో హ‌రి, ధ‌న్ రాజ్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, టిల్లు వేణు, అభి, యాద‌మ్మ‌రాజు టీమ్ లీడ‌ర్ లుగా, దీపిక పిల్లి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.   గ‌త కొన్ని నెల‌లుగా హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ న‌వ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షోకి బండ్ల గ‌ణేష్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. తాజా ఎపిసోడ్ లో బండ్ల గ‌ణేష్ అభిమానిని అంటూ హ‌రి చేసిన స్కిట్ న‌వ్వులు పూయిస్తోంది. బండ్ల గ‌ణేష్ ని పొగిడేస్తూనే అత‌నిపై హ‌రి వేసిన పంచ్ లు ఆక‌ట్టుకుంటున్నాయి. `పెళ్లైన మ‌గాడి జీవితం బండ్ల గణేష్ గారు మీడియాకిచ్చే ఇంట‌ర్వ్యూ లాంటిది.. ఎంత ప్ర‌శాంతంగా ఇంట‌ర్వ్యూ ఇద్దామ‌నుకున్నా ఎక్క‌డో ఒక‌చోట ఫ్ర‌స్ట్రేష‌న్ వ‌చ్చేస్తుంట‌ది అనేశాడు హ‌రి. ఇంత‌లో ఓ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చి ఈయ‌నెవ‌రు అంటే బండ్ల గ‌ణేష్ అన్నాడు హ‌రి. అంతే కాకుండా ఆయ‌న సినిమా తీస్తే క‌లెక్ష‌న్ లు వ‌స్తాయి. ఇంట‌ర్వ్యూలిస్తే కాంట్ర‌వ‌ర్సీలు వ‌స్తాయంటూ పంచ్ వేశాడు. ఆ త‌రువాత బండ్ల‌పై మ‌రో పంచ్ పేల్చాడు. నేను బేసిగ్గా బండ్ల గ‌ణేష్ అభిమానిని, మాకు న్యాయ‌మైనా సాయ‌మైనా వెంట‌నే చేసేస్తాం అన్నాడు. ఆ త‌రువాత ల‌క్ష రూపాయ‌ల‌ అప్పు స్కిట్ తో మ‌రో పంచ్ వేశాడు హ‌రి. స్కిట్ లో ఓ వ్య‌క్తి వ‌ద్ద ల‌క్ష రూపాయ‌లు అప్పుతీసుకున్న హ‌రి అది మ‌ర్చిపోయిన‌ట్టు న‌టిస్తూ వారిని నానా ఇబ్బందికి గురిచేస్తుంటాడు. దీంతో అప్పు ఇచ్చిన వ్య‌క్తి నానా ర‌కాలుగా గుర్తు చేస్తుంటాడు కానీ హ‌రి మాత్రం గుర్తు లేన‌ట్టుగా ఎక్స్ ప్రెష‌న్ పెట్ట‌డంతో `వాడు బండ్ల గ‌ణేష్ అభిమాని అప్పు విష‌యం ఏనాడో మ‌ర్చిపోయాడు` అంటూ నాగ‌బాబు పంచ్ వేయ‌డంతో అక్క‌డున్న వారంతా న‌వ్వేశారు.

ఆర్య‌కు రాగ‌సుధ అడ్డంగా చిక్కిన‌ట్టేనా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్ కీల‌క పాత్ర‌లో న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, జ‌య‌లలిత‌, రామ్ జ‌గ‌న్‌, అనూష సంతోష్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, సందీప్‌, జ్యోతిరెడ్డి, మ‌ధుశ్రీ న‌టించారు. కోరుకున్న వ్య‌క్తిని పొంద‌లేక అర్థాంత‌రంగా హ‌త్య‌కు గురైన ఓ ఆత్మ తిరిగి మ‌రో యువ‌తిగా అత‌న్ని కాపాడుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. త‌న క‌ప‌ట బుద్ధితో రాజ‌నందినిని హ‌త్య‌ చేసిన రాగ‌సుధ ..అను అమాయ‌క‌త్వాన్ని అడ్డం పెట్టుకుని ఆర్య ఇంట్లో చేరి అత‌న్నే హ‌త్య చేయాల‌ని ప‌థ‌కం వేస్తుంది. వ‌శిష్ట‌ని సెల్లార్ లో పెట్టి ఆర్య వైద్యం చేయిస్తున్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన రాగ‌సుధ ఎలాగైనా ఆర్య‌ని మెడ‌పై నుంచి తోసేని హ‌త్య చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇదే క్ర‌మంలో అనులోకి రాజ‌నందిని ప్ర‌వేశించి రాగ‌సుధ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకోవ‌డ‌మే కాకుండా త‌న‌కు చుక్క‌లు చూపిస్తుంది. చావు అంచుల దాకా తీసుకెళుతుంది. ఇదే స‌మ‌యంలో సెల్లార్ లో వున్న వ‌శిష్ట గ్యాస్ సిలిండ‌ర్ ని పేల్చి పారిపోవ‌డంతో అనుని ఆవ‌హించిన రాజ‌నందిని వెళ్లిపోతుంది. రాగ‌సుధ బ్ర‌తికి పోతుంది. ఇదే స‌మయంలో క‌ళ్ల‌కు క‌ట్టిన బ్లాక్ క్లాత్ కార‌ణంగా ఆర్య వ‌ర్థ‌న్ ఇబ్బ‌వందిప‌డ‌తాడు. అది అనుకి అందించింది రాగ‌సుధ అని తెలియ‌డంతో ఆర్య‌లో అనుమానం మొద‌ల‌వుతుంది. పేరు మార్చుకుని త‌మ మ‌ధ్యే తిరుగుతున్న లేడీ రాగ‌సుధ‌నే అని ఆర్యలో అనుమానం మొద‌ల‌వుతుంది. జెండే ఎంట్రీతో రాగ‌సుధ అడ్డంగా ఆర్య వ‌ర్థ‌న్ కు చిక్క‌బోతోందా? .. అస‌లు ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

ల‌వ‌ర్‌ కోసం ర‌ష్మీ గౌత‌మ్‌ సూసైడ్ కి ప్ర‌య‌త్నించిందా?

ప్ర‌తీ శుక్ర‌వారం ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ షో కు న‌టి ఇంద్ర‌జ జ‌డ్జిగా, ర‌ష్మీ గౌత‌మ్‌ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే జూన్ 3న ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ లో గెస్ట్ గా `జ‌యం` ఫేమ్, ఒక‌నాటి పాపుల‌ర్ హీరోయిన్ స‌దా పాల్గొంది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను గ‌త కొంత కాలంగా టీమ్ లీడర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇటీవ‌ల వీరిలో సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌నుల‌కు సినిమాల్లో అవ‌కాశాలు పెర‌గ‌డంతో పాటు సుడిగాలి సుధీర్ కు `స్టార్ మా`లో ఇత‌ర ప్రోగ్రామ్ ల‌కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ల‌భించింది. ఈ నేప‌థ్యంలో సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` షోని వీడి బ‌య‌టికి వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచి ఆటో రాంప్ర‌సాద్ షోని ర‌ష్మీతో క‌లిసి నెట్టుకొస్తున్నాడు. తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఇందులో ర‌ష్మీ గౌత‌మ్ తో క‌లిసి ఆటో రామ్ ప్ర‌సాద్ చేసిన స్కిట్ న‌వ్వులు పూయిస్తూనే ర‌ష్మీ ఫ్యాన్స్ ని ఎమోష‌న్ కు గురిచేస్తోంది. తాజా ఎపిసోడ్‌ లో ర‌ష్మీ గౌత‌మ్ పెళ్లికూతురుగా ముస్తాబై పెళ్లిపీట‌లెక్కింది. ఈ స్కిట్ లో ఆటో రామ్ ప్ర‌సాద్ .. ర‌ష్మీకి అన్న‌గా క‌నిపించాడు. త‌న‌కు పెళ్లి చేయాల‌ని త‌పించే వ్య‌క్తిగా రామ్ ప్ర‌సాద్ ఈ స్కిట్ లో క‌నిపించాడు. అయితే పెళ్లిపీట‌లెక్కే స‌మ‌యానికి త‌న‌కు ఈ పెళ్లి ఇష్టం లేద‌ని, త‌ను వేరే వ్య‌క్తిని ప్రేమించాన‌ని ర‌ష్మీ నానా హంగామా చేసింది. నిద్ర‌మాత్రలు మింగేసి సూసైడ్ చేసుకుంటాన‌ని షాకిచ్చింది. మ‌న‌సుకు న‌చ్చిన వారు ప‌క్క‌న లేకుంటే ఆ బాధ ఎలా వుంటుందో నీకు తెలుసా? అంటూ ఇండైరెక్ట్ గా సుడిగాలి సుధీర్ ని గుర్తు చేసింది. ర‌ష్మీ చేసిన సూసైడ్ హంగామాకు సంబంధించిన `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` ప్రోమో తాజా గా విడుద‌లై నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇందులో ర‌ష్మీ చేసిన సూసైడ్ హంగామాతో పాటు ఇమ్మానుయేల్‌, వ‌ర్ష‌, రోహిణి, బుల్లెట్ భాస్క‌ర్ చేసిన `బాహుబ‌లి` పేర‌డీ స్కిట్ కూడా న‌వ్వులు పూయిస్తోంది.

వ‌ర్షంలో వేద‌కు హ‌గ్గిచ్చి షాకిచ్చిన య‌ష్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నె జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా` లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. స్టార్ ప్ల‌స్ లో ఏడేళ్ల క్రితం ప్రసార‌మై సూప‌ర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహ‌బ్బ‌తే` కు రీమేక్ గా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రూపొందించారు. క‌న్న‌డ‌, కోల్ క‌తా న‌టుల క‌ల‌యిక‌లో రూపొందిన ఈ సీరియ‌ల్ టాప్ లో ట్రెండ్ అవుతూ ఆక‌ట్టుకుంటోంది. క‌న్న‌డ న‌టుడు నిరంజ‌న్‌, కోల్ క‌తా న‌టి డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సుమిత్ర పంప‌న ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. స్టార్ మా తో పాటు ఈ సీరియ‌ల్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పాప కోసం పెళ్లి చేసుకున్న ఓ డాక్ట‌ర్ క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఖుషీ స్కూల్ లో స్కూల్ డేని నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి వేద‌, ఖుషీ క‌లిసి వెళ‌తారు. అయితే వేద‌ని స‌ర్ ప్రైజ్ చేయాల‌ని య‌ష్ ఇంటికి వ‌చ్చిన వాడ‌ల్లా వెన‌క్కి తిరికి వెళ్లి ఆల‌స్యంగా స్కూల్ కి వెళ‌తాడు. అయితే అప్ప‌టికే ప్రోగ్రామ్ స్టార్ట్ కావ‌డంతో స్కూల్ సిబ్బంది య‌ష్ ని ముందు సీట్ల వ‌ర‌కు వెళ్ల‌నివ్వ‌కుండా వెన‌కాలే ఆపేస్తారు. అక్క‌డి నుంచే త‌న కూతురుని చూస్తూ మురిసిపోతాడు య‌ష్‌. అయితే అప్ప‌టికే అక్క‌డికి చేరుకున్న అభిమ‌న్యు బెస్ట్ స్టూడెంట్ కి త‌న చేతుల మీదుగా స్కాల‌ర్ షిప్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించి స్కూల్ ఫ‌స్ట్ గా నిలిచిన ఖుషీకి షీల్డ్ తో పాటు స్కాల‌ర్ షిప్ ఇవ్వ‌డానికి స్టేజ్ పైకి వెళ‌తాడు. ఖుషీ .. అభిమ‌న్యు అందించే షీల్డ్ ని , స్కాల‌ర్ షిప్ ని అందుకోవ‌డానికి నిరాక‌రిస్తుంది. అది గ‌మ‌నించిన వేద వెళ్లి స‌ర్ది చెప్ప‌డంతో తీసుకుంటుంది. ఆ త‌రువాత త‌న త‌ల్లి వేద గురించి, తండ్రి య‌ష్ గురించి గొప్ప‌గా చెబుతూ మురిపిపోతుంది. అది భ‌రించ‌లేని మాళ‌విక అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. వేద‌, - య‌ష్ ల కోసం వారి అపార్ట్ మెంట్ కు బ‌య‌లుదేరుతుంది. వ‌ర్షం ప‌డుతుంటే ఆ వ‌ర్షంలో వేద‌, య‌ష్ త‌డుస్తూ వుంటారు. వెంట‌నే వేద‌ని కౌగిలించుకుని ఐ ల‌వ్ యూ చెప్పి షాకిస్తాడు య‌ష్‌. ఇదంతా కారులో కూర్చుని గ‌మ‌నించిన అభిమ‌న్యు, మాళ‌విక ర‌గిలిపోతుంటారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

సామాన్యుల‌కు బిగ్ బాస్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్ర‌తీ సీజ‌న్ చేస్తున్న ర‌చ్చ‌, వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా బిగ్ బాస్ సీజ‌ప్ మాత్రం ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న‌ట్టుగా సాగుతోంది. ఇటీవ‌ల బిగ్ బాస్ సీజ‌న్ 5 విజ‌య‌వంతంగా పూర్త‌యి ఓటీటీ వెర్ష‌న్ రీసెంట్ గా మొద‌ల‌వ‌డం.. విజ‌య‌వంతంగా పూర్తి కావ‌డం తెలిసిందే. ఓటీటీ వెర్ష‌న్ లో మ‌హిళా కంటెస్టెంట్ బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింది. దీంతో ఓటీటీ లేటెస్ట్ సీజ‌న్ ముగిసింది. ఇక మ‌రో సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ సీజ‌న్ 5 డిసెంబ‌ర్ 19న పూర్త‌యింది. వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. త్వ‌ర‌లో సీజ‌న్ 6 ప్రారంభం కాబోతోంది. ఇటీవ‌ల బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ముగిసిపోయింది. దీంతో సీజ‌న్ 6కి నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజ‌న్ 2 లో సామాన్యుల‌కు అవ‌కాశం క‌ల్పించిన విష‌యం తెలిసిందే కానీ ఆ త‌రువాత సీజ‌న్ ల‌లో సామాన్యుడి ఊసు లేదు. జ‌ర్నిలిస్ట్ విభాగం నుంచి ఒక‌రిని, ట్రాన్స్ జెండ‌ర్స్ నుంచి ఒక‌రిని, డ్యాన్స్ మాస్ట‌ర్‌, క‌మెడియ‌న్‌.. యూట్యూబ‌ర్ .. ఇలా ఒక్క రంగం నుంచి ఒక్కొక్క‌రిని ఎంపిక చేస్తూ కంటెస్టెంట్ ల‌ని హౌస్ లోకి ఆహ్వానిస్తున్న బిగ్ బాస్ నిర్వాహ‌కులు సీజ‌న్ 6 కోసం మ‌ళ్లీ సామార్యుడి రాగం అందుకున్నారు. సీజ‌న్ 6 ఓ యాంక‌ర్ శివ‌, శ్రీ రాపాక తో పాటు కొంత మంది యాంక‌ర్ ల‌కు కూడా చోటు క‌ల్పించ‌బోతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా బిగ్ బాస్ నిర్వాహ‌కులు విడుద‌ల చేసిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. `బిగ్‌బాస్ సీజ‌న్ 6 లో సామాన్యుల‌కు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్ బాస్ షోను చూశారు. ఆనందించారు. ఇప్పుడు మీరు కూడా ఆ ఇంట్లో వుండాల‌నుకుంటున్నారు క‌దూ?.. అందుకే స్టార్ మా ఇస్తోంది ఆకాశాన్ని అందుకునే అవ‌కాశం.. వ‌న్ టైమ్ గోల్డెన్ అపార్చునిటీ..గ్రాబ్ టికెట్ టు బిగ్ బాస్ సీజ‌న్ 6` అంటూ నాగార్జున చెప్పిన న్యూస్ సామాన్యుల‌ని స‌ర్ ప్రైజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ వైర‌ల్ గా మారింది.

బిందుకు ల‌భించిన ఫైన‌ల్ అమౌంట్ ఎంత‌?

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ కి మొత్తానికి ఎండ్ కార్డ్ ప‌డింది. అనేక విమ‌ర్శ‌లు.. కంటెస్టెంట్ ల గొడ‌వ‌ల మ‌ధ్య తొలి ఓటీటీ వెర్ష‌న్ అనుకున్న‌ట్టుగాపే విజ‌య‌వంతంగా ముగిసింది. ఇక గ‌త కొంత కాలంగా మ‌హిళా కంటెస్టెంట్ కప్ గెల‌వ‌డం లేదు. కావాల‌నే ఫిమేల్ కంటెస్టెంట్ ల‌ని తొక్కేసి మేల్ కంటెస్టెంట్ ల‌ని విజేత‌ల‌ని చేస్తున్నారంటూ బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌పై గ‌త కొంత కాలంగా విమర్శ‌లు వినిపిస్తూనే వున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ తొలి ఓటీటీ బిగ్ బాస్ వెర్ష‌న్ విజేత‌గా బిందు మాధ‌వి నిలిచిందింది. ఇంత‌కీ ప్రైజ్‌మ‌నీ కింద త‌న‌కు ద‌క్కింది ఎంత‌?.. 12 వారాల‌కు అమెకు ఎంత ఇచ్చారు?  ప్రైజ్ మ‌నీ ప్ల‌స్ 12 వారాలు మొత్తం క‌లిపి బిందు మాధ‌వి ఎంత సొంతం చేసుకుంది? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. బింగ్ బాస్ నాన్ స్టాప్ విజేత‌గా బిందు మాధ‌వికి ద‌క్కిన ప్రైమ్ మ‌నీ రూ. 40 ల‌క్ష‌లు మాత్ర‌మే. నిజానికి అస‌లు ప్రైజ్ మ‌నీ 50 ల‌క్ష‌లు. కానీ గ్రాండ్ ఫినాలే రోజు అరియానా గ్లోరీ రూ. 10 ల‌క్ష‌లు ద‌క్కించుకుంది. రేసు నుంచి తెలివిగా త‌ప్పుకుంది. దీంతో బిందు ప్రైజ్ మ‌నీలో ఆ రూ. 10 ల‌క్ష‌లని క‌ట్ చేశారు. అలా బిందుకు ప్రైజ్ మ‌నీ కింద ద‌క్కింది రూ. 40 ల‌క్ష‌లే. అయితే 12 వారాలు షోలో కంటిన్యూ అయినందుకు గానూ రోజు పారితోషికం లెక్క‌న బిందు మాధ‌వికి భారీగానే అందిన‌ట్టుగా తెలుస్తోంది. 12 వారాల‌కు గానూ బిందు మాధ‌వికి 55 నుంచి 60 ల‌క్ష‌ల వ‌ర‌కు అందిన‌ట్టుగా చెబుతున్నారు. అంటే ప్రైజ్ మ‌నీతో క‌లిపి మొత్తం బిందు సొంతం చేసుకున్న మొత్తం కోటి రూపాయ‌లు అన్న‌మాట‌. అయితే ఇందులో 10 ల‌క్ష‌లు ట్యాక్స్ రూపంలో క‌ట్ అవుతుంది కాబ‌ట్టి బిందుకు మొత్తంగా ద‌క్కిన అమౌంట్ రూ. 90 ల‌క్ష‌లు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తోంది.

హైప‌ర్ ఆదికి హ‌గ్గులు...సుధీర్ కు ఫ్లైయింగ్ కిస్సులు

సుడిగాలి సుధీర్ బుల్లితెర కామెడీ షోల‌లో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. జ‌బ‌ర్ద‌స్త్ తో క‌నిపించ‌డం మానేసిన సుడిగాలి సుధీర్ `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ`లో రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తూ ఈ షోని మ‌రింత‌గా పాపుల‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ షోలో హీరోయిన్ హెబ్బా ప‌టేల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నానా ర‌చ్చ చేసింది. ఏకంగా ర‌చ్చ‌కే మారుపేరు అయిన‌టువంటి సుడిగాలి సుధీర్ కె ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ హెబ్బా ప‌టేల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. సుడిగాలి సుధీర్ యాంక‌ర్ గా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` కామెడీ షో ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. ఆదివారం ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ని తాజాగా విడుద‌ల చేశారు. తాజా ఎపిసోడ్ కి హీరోయిన్ హెబ్బా ప‌టేల్ గెస్ట్ గా విచ్చేసింది. హాట్ హాట్ అందాల‌తో క్యూట్ క్యూట్ లుక్స్ లో క‌నువిందు చేసింది. సుడిగాలి సుధీర్ తాను హీరోగా ఓ సినిమా చేస్తున్నాన‌ని, అందుకు హీరోయిన్ కావాల‌ని హేబ్బా ప‌టేల్ ని అడుగుతాడు. అయితే అందుకు అంగీక‌రించ‌ని హెభా పెద‌వి విరుస్తుంది. దీంతో ఆమ‌ని క‌ల్పించుకుని నువ్వు ఆమెకు న‌చ్చ‌లేదేమో సుధీర్ అంటుంది. ఆ మాట‌లు విన్న హెభా వెంట‌నే `బాగా న‌చ్చాడు` అంటూ సుధీర్ కు ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వ‌డం మొత‌లు పెడుతుంది. అనంత‌రం తాగుబోతు ర‌మేష్‌, ఇమ్మాన్యుయేల్ క‌లిసి చేసిన హంగామా న‌వ్వులు పూయించింది. ఆ త‌రువాత హైప‌ర్ ఆది, రామ్ ప్ర‌సాద్ రంగంలోకి దిగారు. ఈ సంద‌ర్భంగా హైప‌ర్ ఆది కి హెబ్బా ప‌టేల్ వ‌రుస‌గా హ‌గ్గులు ఇస్తూ నానా ర‌చ్చ చేసింది. ఆట‌లో రాంప్ర‌సాద్ కూడా నాకూ అంటూ పోటీప‌డ్డాడు. `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` కి ఎవ‌రైనా వ‌స్తే ఒక ఆన‌వాయితీ వుంద‌ని, ముందుగా బావ‌ల‌కు హ‌గ్గు ఇవ్వాలంటాడు ఆది అది విన్న వెంట‌నే హెబ్బా ప‌టేల్ . ఆదికి టైట్ హ‌గ్గ్ ఇవ్వ‌డంతో అంతా అవాక్క‌య్యారు. ప‌క్క‌న వున్న ఆటొ రామ్ ప్ర‌సాద్ అయితే నాకూ అంటూ షాకుతో నోరెళ్ల‌బెట్టాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది.

జ‌బ‌ర్ద‌స్త్ కు హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ గుడ్ బై

జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలు గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్ట‌కుంటున్నాయి. ఈ సోలో ప్ర‌ధానంగా హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను త‌మ‌దైన శైలి స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ ఈ షోల‌కు ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకొచ్చారు. అంతే కాకుండా ఈ రెండు షోల‌కు సుడిగాలి సుధీర్ - ర‌ష్మీల ల‌వ్ ట్రాక్ మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చింది. షోల‌ని మ‌రింత పాపుల‌ర్ చేసింది. వీళ్ల కోస‌మే ఈ షోల‌ని ప్ర‌త్యేకంగా చూసే వారున్నారు. ఇక ఈ షోల‌లో సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను ఓ టీమ్ గా , హైప‌క్ ఆది త‌దిత‌రులు మ‌రో టీమ్ గా ఏర్ప‌డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ముందు నుంచి వున్న టీమ్ మెంబ‌ర్స్ ఒక్కొక్క‌రుగా జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌ని వీడుతూ వ‌స్తున్నారు. ముక్కు అవినాష్, అదిరే అభి, చ‌మ్మ‌క్ చంద్ర‌, కిరాక్ ఆర్పీ, అప్పారావు షోని వీడారు. వారి త‌రువాత సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్, హైప‌ర్ ఆది త‌మ టీమ్ లతో ఆ లోటు క‌నిపించ‌కుండా ఇంత కాలం ఎంట‌ర్ టైన్ చేస్తూ వ‌చ్చారు. దాదాపు ప‌దేళ్ల ప్ర‌యాణంలో ఎక్క‌డా ఈ షోకు బ్రేకులు ప‌డ‌లేదు. అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకున్న షోలుగా జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ రికార్డులు సాధించాయి. అయితే ఇప్ప‌డు జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లు క్రమ క్ర‌మంగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్క‌రుగా షోని వీడుతున్న నేప‌థ్యంలో తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ కు ఆది, సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ సినిమాల‌తో పాటు ఇత‌ర టీవీ షోల్లో బిజీగా మారిపోవ‌డంతో ఈ ఇద్ద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

బిందు మాధ‌వి హౌస్ లో స్మోకింగ్ చేసిందా?

బాగ్‌బాస్ నాన్ స్టాప్ టైటిల్ ముందు నుంచి అంతా ఊహిస్తున్న‌ట్టుగానే ఆడ‌పులి బిందు మాధ‌వి సొంతం చేసుకుంది. మ‌ధ్య‌లో కొంత త‌డ‌బడినా న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, అఖిల్ ల కార‌ణంగా బిందు మాధ‌వి ఫైన‌ల్ విజేత‌గా నిలిచింది. అనుకున్న‌ట్టుగానే అఖిల్ మ‌ళ్లీ ర‌న్న‌ర‌ప్ గానే మిగిలిపోయాడు. ఈ ఫైన‌ల్ లో విజేత‌గా నిల‌వ‌డంతో బిందు మాధ‌వి 40 ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీని గెలుచుకుంది. ఇక ఇప్ప‌టి నుంచైనా హీరోయిన్ గా తెలుగులో అవ‌కాశాలు రావాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేసేలా క‌నిపిస్తోంది బిందు. ఇదిలా వుంటే బిందు మాధ‌వి బిగ్ బాస్ హౌస్ లో ద‌మ్ముకొట్టిందంటూ ప్ర‌చారం మొద‌లైంది. బిగ్ బాస్ సీజ‌న్ తో పోలిస్తే నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ ని 24 గంట‌ల లైవ్ స్ట్రీమింగ్ ఫార్మాట్ లో రూపొందించారు. ఇక్క‌డ కంటెస్టెంట్స్ ఏం చేసినా ఎలాంటి ప‌నులు చేసినా ఇట్టే కెమెరాకు చ‌క్కుతారు. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోయిన చాలా మంది కంటెస్టెంట్స్ కెమెరా వుంద‌ని కూడా మ‌ర్చిపోయి బాత్రూమ్ ల‌లో సిగ‌రేట్ లు లాగించేశారు. అషురెడ్డి బాత్రూవ్ వ‌ద్ద ద‌మ్ము కొడుతుంటే త‌న‌కు సెంట్రిగా అఖిల్ కాప‌లా కాసాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. ఇదే త‌ర‌హాలో బాత్రూమ్ వ‌ద్ద బిందు మాధ‌వి ద‌మ్ము లాగించేసిందంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై బిందు క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ తో సోష‌ల్ మీడ‌యాలో స‌ర‌దాగా చిట్ చాట్ నిర్విహించింది బిందు ఈ సంద‌ర్భంగా కొంత మంది అభిమానులు `నువ్వు స్మోకింగ్ చేస్తున్నావ‌ని స్ర‌వంతి ..అఖిల్ తో పాటు అత‌డి ఫ్రెండ్స్ కు చెప్పింది. అది నిజ‌మేనా?. అని అడిగారు. దీనికి బిందు త‌న‌దైన స్టైల్లో స్పందించింది. తాన‌స‌లు సిగ‌రేట్ తాగ‌నే లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కా అల‌వాటు వుంటే ఓపెన్ గానే స్మోకింగ్ చేసేదాన్న‌ని చెప్పుకొచ్చింది.

బిందుని అంత‌గా ఇరిటేట్ చేశాడా?

ప‌క్కా గేమ్ ప్లాన్‌తో బిగ్ బాస్ నాన్ స్టాప్ బ‌రిలోకి దిగిన‌ బిందు బాధ‌వి ఫైన‌ల్‌గా త‌న గేమ్ ప్లాన్‌తో టైటిల్‌ని సొంతం చేసుక‌ని విజేత‌గా నిలిచింది. మాట‌కు మాట‌.. దెబ్బ‌కు దెబ్బ అన్న‌ట్టుగా ఎవ‌రి ముందు త‌గ్గ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని యాటిట్యూడ్‌తో త‌న‌ని టార్చ‌ర్ చేయాల‌నుకున్న వాళ్ల‌కే చుక్క‌లు చూపిస్తూ ముందుకు సాగింది. ఎవ‌రు ఎలా అనుకున్నా ఎన్ని రకాలుగా విమ‌ర్శ‌లు చేసినా త‌న‌దైన గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. క‌ప్పుని ఎగ‌రేసుకుపోయింది. ఇంత వ‌ర‌కు ఫిమేల్ కంటెస్టెంట్ల‌కు ద‌క్క‌ని కప్‌ని, విక్ట‌రీని ద‌క్కించుకుని బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిలిచిన ఫ‌స్ట్‌ ఫిమేల్ గా రికార్డు సాధించింది. `మ‌స్తీ` హ్యాష్ ట్యాగ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బిందు ఆ త‌రువాత ఆడ‌పులిగా మారి సెట్టింట హ‌ల్ చ‌ల్ చేసింది. తాజాగా టైటిల్ విన్న‌ర్ అయిన త‌రువాత యాంక‌ర్ ర‌వి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ `బిగ్ బాస్ బ‌జ్‌` కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ర‌వి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప‌లు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది. `బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్ గా నిల‌వ‌డం నా తొలి విజ‌యంగా భావిస్తున్నా. విన్నింగ్ స్టార్ట‌యింది. ఇక నుంచి విజ‌య‌వంతంగా ముందుకు సాగుతాన‌ని అనుకుంటున్నా` అని బిందు చెప్పుకొచ్చింది. అయితే 'బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్ అయ్యావు కానీ ఒక్క‌సారి కూడా ఎందుకు కెప్టెన్ కాలేక‌పోయావ్?' అని యాంక‌ర్ ర‌వి అడిగితే ఎందుకో త‌న‌కు తెలియ‌ద‌ని సిగ్గుల మొగ్గ‌యింది. ఇక 'హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింట్ కంటెస్టెంట్ ఎవ‌రు?' అని అడిగితే, 'న‌ట‌రాజ్ మాస్ట‌ర్' అంటూ ట‌క్కున చెప్పేసింది. అంటే త‌న‌ని అంత‌లా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇరిటేట్ చేయాడ‌న్న‌మాట‌. సీజ‌న్ ఎండింగ్ లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ .. బిందుని శూర్ప‌ణ‌ఖ‌ అని, నీ ముక్కు చెవులు కోసేస్తాన‌ని చెప్ప‌డం తెలిసిందే. అదే బిందుని ఇరిటేట్ చేసింద‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే బిగ్ బాస్ విన్న‌ర్ గా బిందు బాధ‌వికి ప్రైజ్ మ‌నీ కింద రూ. 40 ల‌క్ష‌లు ద‌క్కింది.

పెళ్లిపీట‌లెక్కిన యాంక‌ర్ ర‌ష్మీ.. వ‌రుడు..?

బుల్లితెర బ్యూటీ యాంక‌ర్ ర‌ష్మీ జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గ‌తంలో సుడిగాలి సుధీర్ తో క‌లిసి ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తూ పాపుల‌ర్ అయిన ర‌ష్మీ గౌత‌మ్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట కెమిస్ట్రీని చూసిప జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ వీరికి రెండు మూడు సార్లు స్టేజ్ పై ఉత్తుత్తి పెళ్లి చేసి మురిసిపోయింది. ఇది నిజ‌మేనా అనే రేంజ్ లో అంద‌రికి షాకిచ్చింది కూడా. అయితే గ‌త కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్ జబ‌ర్ద‌స్త్ ని వీడి సినిమాల‌తో పాటు ఇత‌ర టీవీ షోల్లో బిజీ అయిపోయాడు. దీంతో ఈ షోకి దూర‌మ‌య్యాడు. సుధీర్ లేక పోవ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ షో చ‌ప్ప‌గా సాగుతోంది. ఇదిలా వుంటే ర‌ష్మీగౌత‌మ్ పెళ్లిపీట‌లెక్కింది. వరుడి ప‌క్క‌న కూర్చుని మురిసిపోయింది. ఇంత‌కీ ర‌ష్మీ ప‌క్క‌న కూర్చుకున్న పెళ్లి కొడుకు ఎవ‌రన్న‌ది స‌స్పెన్స్ లో పెట్టేసింది. అస‌లు ర‌ష్మీ ప‌క్క‌న కూర్చున్న పెళ్లి కొడుకు సుడిగాలి సుధీరేనా లేక మ‌రొక‌ర అన్న‌ది స‌స్పెన్స్ గా మాంది. ఇంత‌కీ ర‌ష్మీ పెళ్లి పీట‌లెక్క‌డం ఏంటీ? .. ప‌క్క‌న పెళ్లి కొడుకు ముఖం క‌నిపించకుండా కూర్చోవ‌డం ఏంటీ? .. వివ‌రాల్లోకి వెళితే.. జ‌బ‌ర్ద‌స్త్ షో లో యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్మీ అప్పుడ‌ప్పుడు టీమ్ లీడ‌ర్ల‌తో క‌లిసి స్కిట్ ల‌లో పాల్గొంటోంది. తాజాగా అలాంటి ఓ స్కిట్ లో ఏకంగా పెళ్లి కూతురుగా ముస్తాబై పెళ్లి పీట‌లెక్కి షాకిచ్చింది. అయితే త‌న ప‌క్క‌న కూర్చున్న వ‌రుడు ఎవ‌ర‌న్న‌ది చూపించ‌కుండా సస్పెన్స్ లో పెట్టారు. ర‌ష్మీ ప‌క్క‌న పెళ్లి పీట‌లపై కూర్చున్న వ్య‌క్తి ముఖం క‌నిపించ‌కుండా మ‌ల్లెపూల మాల‌తో క‌వ‌ర్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టంట సంద‌డి చేస్తోంది. ఈ షో తాజా ఎపిసోడ్ కు గెస్ట్ గా డా. రాజ‌శేఖ‌ర్ హాజ‌రు కాగా శ్ర‌ద్దా దాస్ జ‌డ్జిగా ఎంట్రీ ఇచ్చింది. ఎప్ప‌టి లాగే ఇంద్ర‌జ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. తాజా ఎపిసోడ్ త్వ‌ర‌లోనే టెలికాస్ట్ కాబోతోంది.

గేట్ ఓపెన్ చేస్తే వెళ్లిపోతా..బిగ్ బాస్ కు షాకిచ్చిన బాబా భాస్క‌ర్

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ మొత్తానికి గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. 18 మంది కంటెస్టెంట్ ల‌తో మొద‌లైన ఈ ఓటీటీ షోలో చివ‌రికి 7గురు స‌భ్యులు మిగిలారు. బాబా భాస్క‌ర్‌, అఖిల్‌, బిందు మాధ‌వి, అరియానా, మిత్ర‌, అనిల్‌, యాంక‌ర్ శివ మిగిలారు. ఈ వారం మ‌ధ్య‌లో ఒక‌రు ఇంటి దారి ప‌ట్ట‌నుండ‌గా వారాంతానికి ముందే మ‌రో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఇదిలా వుంటే బుధ‌వారం నాటి ఎపిసోడ్ లో బాబా భాస్క‌ర్ ఫినాలేకి చేరుకోవ‌డంతో అత‌నికి సంబంధించిన స్పెష‌ల్ వీడియోను ప్లే చేశారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే బాబా భాస్క‌ర్ వీడియో ఓ రేంజ్ లో వుంది. ఆర్ ఆర్‌, విజువ‌ల్స్‌, లైటింగ్ ఎఫెక్ట్స్ తో ఓ రేంజ్ లో బాబా భాస్క‌ర్ కు బిగ్ బాస్ వీర లెవెల్లో ట్రీట్ ఇచ్చేశాడు. దీంతో బాబా భాస్క‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. 35 నిమిషాల పాటు సాగిన బాబా వీడియో అత‌న్ని స‌ర్ ప్రైజ్ చేసింది. ఓ రేంజ్ లో ఈ వీడియోతో బాబా భాస్క‌ర్ కు బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేష‌న్ అంతా ఇంతా కాదు. త‌నే ఫైన‌లిస్టా అనే స్థాయిలో బాబా భాస్క‌ర్ వీడియోను రూపొందించ‌డం విశేషం.   ఈ వీడియో చూసిన బాబా ఆనందంతో ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాడు. ఇంత బాగా చూపిస్తార‌ని తాను ఊహించ‌లేద‌న్నాడు. వేరే లెవెల్ లో వుంది. త్రీ వీక్స్ ఫుటేజ్ లా కాకుండా 87 డేస్ ఫుటేజ్ వీడియోలా వుంద‌ని సంబ‌ర‌ప‌డ్డాడు. 'నా లైఫ్ లో ఈ వీడియో చాలు.. ఈ క‌ప్పు వ‌ద్దు .. డ‌బ్బు వ‌ద్దు... ఇప్ప‌డు గేట్ ఓపెన్ చేస్తే వెళ్లిపోతా'.. అంటూ బిగ్ బాస్ కు షాకిచ్చినంత ప‌ని చేశాడు బాబా భాస్క‌ర్. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.