బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ ఫేవరేట్ ఎవరు?
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. టాప్ రేంజ్ లో పాపులర్ షోగా నిలిచిని ఈ షో సీజన్ 6 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆడియన్స్ గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వీక్షకులకు బిగ్ బాస్ టీమ్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 'వెయిట్ ఈజ్ ఓవర్' అంటూ కింగ్ నాగార్జున పై చిత్రీకరించిన తాజా ప్రోమోని విడుదల చేసింది. ఇందులో బిగ్ బాస్ స్టేజ్.. హౌస్ లో కంటెస్టెంట్ లకు సంబంధించిన బెడ్ లు, ఇంటీరియర్ ని పరిచయం చేసింది.
ఇదిలా వుంటే ఈ సీజన్ లో హౌస్ లోకి వెళ్లనున్న కంటెస్టెంట్ ల ఫైనల్ లిస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల సామాన్యులకు ఎంట్రీ అంటూ ఓ ప్రోమోని వదిలిన మేకర్స్ తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఎలా డెకరేట్ చేశారో.. ఏ రేంజ్ లో గ్రాండ్ గా సీజన్ 6 లాంచ్ కాబోతోందో అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. తాజా ప్రోమోతో బిగ్ బాస్ లవర్స్ లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సీజన్ ఎలా వుండతోంది? కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ ఫేవరేట్ గా ఎవరు బరిలోకి దిగబోతున్నారు? అనే చర్చ మొదలైంది.
తాజాగా విడుదలైన గ్రాండ్ లాంచింగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సీజన్ లో హౌస్ లోకి వెళ్లే వాళ్లు వీళ్లే అంటూ ఓ పైనల్ లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇందులో పలువురి పేర్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయంటూ కూడా ప్రచారం మొదలైంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న యాంకర్ శివ, ఆర్జే చైతూ, మిత్రా శర్మలలో ఒకరు ఈ సీజన్ లో సందడి చేస్తారని అంటున్నారు. 'న్యూలీ మ్యారీడ్' ఫేమ్ సంజనా చౌదరి, హీరోయిన్ ఆశా శైనీ, యూట్యూబర్ కుషిత కల్లపు, యాంకర్ మంజూష, సింగర్ మోహన భోగరాజు, జబర్దస్త్ వర్ష, సుమన్ టీవి యాంకర్లు మంజూష, రోషన్, కొరియోగ్రాఫర్ పొప్పి మాస్టర్, సీరియల్ నటి కరుణ భూషణ్, నటుడు లక్ష్య్ చదలవాడ, సీరియల్ నటుడు కౌశిక్, శ్రీహాన్, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చైతన్య గరికపాటి తదితరుల పేర్లు వైరల్ అవుతున్నాయి.