య‌ష్ అత్యుత్సాహం.. చెంప ప‌గ‌ల‌గొట్టిన వేద‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పిల‌క‌ల‌లు పుట్ట‌ర‌ని పెళ్లికి దూర‌మైన ఓ యువ‌తి.. త‌ల్లి దూర‌మైన ఓ పాప‌.. ఆ పాప కోసం మ‌రో పిల్ల‌లే పుట్ట‌ని యువ‌తిని పెళ్లాడిన యువ‌కుడు.. ఈ ముగ్గురి అనుబంధం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్నివారాలుగా విజ‌య‌వంగంతా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా కీల‌క మ‌లుపులు తిరుగుతూ మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, అనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శుక్ర‌వారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. ఆఫీసులో వున్న య‌ష్ .. వేద తండ్రి వ‌ర‌ద‌రాజులుకు ఫోన్ చేసి అత్త‌య్య గ్రీటింగ్స్ చెప్పేదాకా చెప్పొద్ద‌ని రెచ్చ‌గొట్టేస్తుంటాడు. ప‌క్క‌నే వున్న వేద ఇదంతా స్పీక‌ర్ ఆన్ చేసి వింటుంది. ప‌క్క‌కు వెళ్లి య‌ష్ ని నిల‌దీస్తుంది. వేద లైన్ లోకి వ‌చ్చేసింద‌ని గ్ర‌హించిన  య‌ష్ రోమాంటిక్ గా మాట్లాడుతూ వేద‌ని డైవ‌ర్ట్ చేయాల‌ని ఫోన్ లోనే కిస్ ఇస్తాడు. క‌ట్ చేస్తే వేద పేరెంట్స్ మ్యారేజ్ యానివ‌ర్స‌రీని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఇదే అద‌నుగా య‌ష్ అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. త‌న మామ‌కు మందు బాటిల్ ని గిఫ్ట్ గా ఇచ్చేసి కూల్ చేసి త‌న వైపు తిప్పుకోవాల‌ని ప్లాన్ చేస్తాడు. థ‌మ్స్ అప్ బాటిల్ లో మందు క‌లిపి తాగించాల‌ని చూస్తాడు. అదే టైమ్ లో వేరే వాళ్లు రావ‌డంతో ఆ బాటిల్ అక్క‌డే వుంటుంది. దాహం గా వుంద‌ని బాటిల్ కోసం వెతుకుతున్న వేద మందు క‌లిపిన థ‌మ్స్ అప్ ని తాగేస్తుంది. ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. చివ‌రికి ఇది య‌ష్ చేసిన ప‌ని అని తెలియ‌డంతో చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్.. మందేసి చిందేసిన వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సార‌మ‌వుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కొత్త‌గా మొద‌లైన ఈ సీరియల్ వారాలు గ‌డిచే కొద్దీ వీవ‌ర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. అమ్మా - నాన్నా - ఓ పాప క‌థ అనే కాన్సెప్ట్ తో ఈ ముగ్గురి మ‌ధ్య పెన‌వేసిన బంధం క‌థ‌గా ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగూతూ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక న‌టించారు. వేద పేరెంట్స్ సులోచ‌న - వ‌ర‌ద‌రాజుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ. అయితే ఇందు కోసం మ‌ల్లెపూలు తీసుకొచ్చిన వ‌ర‌ద‌రాజులు ఈ విష‌యాన్ని య‌ష్ కు చెప్ప‌డం.. మీరు ఎక్క‌డ త‌గ్గొద్ద‌ని త‌న‌ని రెచ్చ‌గొడ్డంతో సులోచ‌న‌కు విషెస్ చెప్ప‌కుండా బెట్టుని ప్ర‌ద‌ర్శిస్తాడు వ‌ర‌ద‌రాజులు. త‌ను కూడా త‌క్కువ తిన్నానా ఏంటీ అనే రేంజ్ లో వ‌ర‌ద‌రాజులుతో ఆడుకుంటుంది. క‌ట్ చేస్తే ఇదంతా త‌న‌తో పాటు య‌ష్ వ‌ల్ల జ‌రిగింద‌ని గ‌మ‌నించిన వేద చివ‌రికి ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌లిపేస్తుంది. ఇదే స‌మయంలో సులోచ‌న - వ‌ర‌ద‌రాజుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ ని ప్లాన్ చేస్తారు. ఈ సంద‌ర్భంగా య‌ష్ త‌న గిఫ్ట్ గా మామ వ‌ర‌ద‌రాజులుకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాన్ని కూల్ డ్రింక్ లో క‌లిపి వ‌ర‌ద‌రాజులు కోసం రెడీ చేస్తారు. అయితే పొర‌పాటున ఆ డ్రింక్ ని వేద తాగేస్తుంది. దీంతో య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్  అవుతుంది. ఇక ర‌చ్చ మొద‌ల‌వుతుంది. య‌ష్ కి చుక్క‌లు చూపిస్తుంది. మ‌గాళ్లు వ‌ట్టి మాయ‌గాళ్లే .. అంటూ వీడుకూడ ఇంతే అని య‌ష్ పై వీరంగం వేస్తుంది. ఈ క్ర‌మంలో వేద ని చూసిన కొంత మంది గెస్ట్ లు అవ‌మాన‌క‌రంగా మాట్లాడ‌తారు. ఆ స‌మ‌యంలో య‌ష్ ఎలా రియాక్ట్ అయ్యాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

`కార్తీక‌దీపం`ని క్యాష్ చేసుకునే ప‌నిలో `వంట‌ల‌క్క‌`

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక‌దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగి ఈ సీరియ‌ల్ వంట‌ల‌క్క కార‌ణంగా టాప్‌లోకి వెళ్లి పాపుల‌ర్ అయింది. అంతే కాకుండా `కార్తీక‌దీపం` టైటిల్ ఎంత పాపుల‌ర్ అయిందో `వంట‌ల‌క్క‌` పేరు కూడా అంతే పాపుల‌ర్ అయింది. దీంతో ఇదే పేరుని త‌మ త‌దుప‌రి సీరియ‌ల్ కి వాడేసుకుంటూ కొత్త సీరియ‌ల్ ని ప్రారంభించ‌బోతున్నారు `కార్తీక‌దీపం` నిర్మాత గుత్తా వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈ సీరియ‌ల్ కూడా స్టార్ మా లో ప్ర‌సారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. అత్యాశ‌కు మంచి త‌నానికి మంచిత‌నం అవ‌కాశంగా మార‌నుందా? అంటూ తాజాగా `వంట‌ల‌క్క‌` ప్రోమోని విడుద‌ల చేశారు. ఓ ఇంటికి లైటింగ్ చేసుకునే ఓ యువ‌కుడు అదే ఇంటి య‌జ‌మాని కూతురిని న‌మ్మించి బుట్ట‌లో వేస్తాడు.. డ‌బ్బు, ఆస్తీ, హోదా కోసం త‌న ట్రాప్ లో ప‌డిన‌ ఆ అమ్మాయి ఎలా వంట‌ల‌క్క‌గా మారింది?.. లేక వంట‌ల‌క్క‌కు, ఈ సీరియ‌ల్ కు ఏదైనా సంబంధం వుందా? అన్న‌ది తెలియాలంటే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ సీరియ‌ల్ చూడాల్సిందే. అత్య‌ధిక భాగం త‌మిళ న‌టులు న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ `వంట‌ల‌క్క‌` పేరుని ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలి. ఈ సీరియ‌ల్ ప్రోమోని `కార్తిక‌దీపం` ఫేమ్ శోభాశెట్టి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. అమాయ‌కురాలైన వ‌ర‌ల‌క్ష్మీకి.. డ‌బ్బు కోసం లైటింగ్ లు సెట్ చేసే యువ‌కుడికి మ‌ధ్య ఎలా ప్రేమ క‌థ పుట్టింది. అది ఆమె జీవితాన్ని ఏ మ‌లుపు తిప్పింది అన్న‌ది తెలియాలంటే ఈ సీరియ‌ల్ చూడాల్సిందే. త‌మిళ న‌టుడు ధీర‌వం రాజ్ కుమార‌న్ హీరోగా, శిరీన్ శ్రీ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళ న‌టుడు నీళ‌ల్ గ‌ళ్ ర‌వి త‌దిత‌రులు క‌నిపించ‌నున్నారు.

బాబా భాస్క‌ర్ ఎంట్రీ.. నువ్వు బిగ్ బాసా..? అరియానా ఫైర్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి బాబా భాస్క‌ర్ మాసీవ్ ఎంట్రీ ఇచ్చేశాడు. వ‌చ్చీ రాగానే కంటెస్టెంట్ ల‌ని స‌ర్ ప్రైజ్ పెరుతో టెన్ష‌న్ పెట్టాడు. గెస్ట్ లా వ‌చ్చాడ‌ని భావించిన ఇంటి స‌భ్యుల‌కు తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానంటూ దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. ఎంట్రీ ఇస్తూనే గేటు దూకి మ‌రీ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. ఇదేంటీ ఇలా వ‌చ్చాడ‌ని అంతా షాక్ కు గురైపోయారు. ఇత‌నేంటీ ఇలా ఎంట్రీ ఇచ్చాడ‌ని అంతా విస్తూ పోయారు. అయితే వారిని ఆట ఆడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న బాబా భాస్క‌ర్ త‌న‌కు బిగ్ బాస్ సూప‌ర్ ప‌వర్ ఇచ్చాడ‌ని, వీర లెవెల్లో బిల్డ‌ప్ ఇచ్చేశాడు. అప్ప‌టి వ‌ర‌కు వెలిగిపోయిన ఇంటి స‌భ్యులు ముఖాలు ఒక్క‌సారిగా మాడిపోయాయి. ఏం జ‌రుగుతోంది? .. బాబా భాస్క‌ర్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ... ఏంటీ అత‌ని గొప్ప అనే విధంగా అరియానా ఫీలైపోయింది.  'నామినేష‌న్స్ లో వున్న ఆరుగురు రండి' అంటూ ఏదో చేయ‌బోతున్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇచ్చాడు బాబా భాస్క‌ర్. 'ఏకాభిప్రాయం తీసుకుని చెప్పండి' అని అన‌గానే అరియానా అందుకు సిద్ధ‌మైంది. ఇంత‌లో టైమ్ వేస్ట‌వుతోంద‌ని మ‌రీ రెచ్చిపోయాడు బాబా భాస్క‌ర్‌. 'మీరు అలా అంటే ఏమీ చేయ‌లేము' అని అరియానా అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించింది. 'అయినా మీరెవ‌రు అడ‌గ‌డానికి?.. మీకు ఎందుకు చెప్పాలి?.. అలా అని బిగ్ బాస్ వాయిస్ వినిపించ‌మ‌ని చెప్పండి' అని గ‌ట్టిగానే నిల‌దీసింది అరియానా.. 'ఈయ‌న బిగ్ బాస్ రా చెప్ప‌డానికి.. గెస్ట్ గా వ‌స్తే ఏది చెప్ప‌మంటే అది చెప్పాలా?' అంటూ చిందులేసింది. వెంటనే 'స‌ర్‌ప్రైజ్‌ అని చెబుతున్నాను క‌దా?' అన్నాడు బాబా భాస్క‌ర్‌. ఇదంతా సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంటోంద‌ని గ‌మ‌నించిన బాబా భాస్క‌ర్ త‌నేంటో చెప్పేశాడు. త‌న వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి పంపించార‌ని చెప్పేశాడు. 'రెండు రోజుల్లో మీతో క‌లిసి పోతాను `అంటూ షాకిచ్చాడు. దీంతో హౌస్ లో వున్న వాళ్ల లెక్క‌ల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.

భార్య‌పై చేయెత్తిన అభిమ‌న్యు కు య‌ష్ దిమ్మ‌దిరిగే వార్నింగ్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇందులో నిరంజ‌న్‌, డిబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, మిన్ను నైనిక‌, ప్రణ‌య్ హ‌నుమండ్ల తదిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఖుషీ త‌న కూతురే అనే విష‌యాన్ని క్లియ‌ర్ చేసి డీఎన్ ఏ టెస్ట్ ద్వారా య‌ష్ క‌ళ్లు తెరిపిస్తుంది వేది. ఆ విష‌యం ఇంట్లో వాళ్లకి తెలియ‌డంతో ఒక్క‌సారిగా షాక‌వుతారు. ఇదే విష‌యంపై య‌ష్‌ని నిల‌దీస్తారు. నీలోప‌ల ఇంత బాధ‌పెట్టుకుని మాకు క‌నీసం చెప్ప‌లేక‌పోయావ్ అంటారు. ఇదే స‌మ‌యంలో వేద చేసిన ప‌నికి త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తారు. అభిమ‌న్యు చేసిన కుట్ర‌ని వేద తిప్పికొట్టి నీకు అండ‌గా నిల‌బ‌డింది. మేము ఈరోజు హాయిగా నిద్ర‌పోతున్నామంటే అందుకు కార‌ణం వేద‌. భ‌ర్త ప‌ట్ల ఎంత మ‌ర్యాద‌గా వుంటుందో మా ప‌ట్ల కూడా అంతే మ‌ర్యాద‌గా వుంటూ నీ గౌర‌వాన్ని కాపాడుతోంది. ఇలాంటి భార్య‌ని ఇచ్చి ఆ దేవుడు నీకు గొప్ప మేలు చేశాడంటుంది య‌ష్ త‌ల్లి మాలిని. క‌ట్ చేస్తే .. త‌న ప్లాన్ పార‌క‌పోవ‌డం, వేద తెలివిగా డీఎన్ ఏ టెస్ట్ చేసింది అభిమ‌న్యు కుట్ర‌ని భ‌గ్నం చేయ‌డంతో ర‌గిలిపోతుంటాడు. ఎలాగైనా య‌ష్ ని దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తూ అదే విషయాన్ని మాళ‌విక తో చెబుతుంటాడు. ఇదే స‌మ‌యంలో స‌డ‌న్ ఎంట్రీ ఇస్తుంది వేద‌. ఇలాంటి నీచ‌మైన బ్ర‌తుకు నీకు అవ‌స‌ర‌మా. ఇలాంటి నీచుడితో క‌లిసి వుండ‌టం అవ‌స‌ర‌మా అని మాళ‌విక‌ని నిల‌దీస్తుంది. దీంతో ఆగ్ర‌హించిన అభిమ‌న్యు ఆవేశంతో ఊగిపోతే వేద‌పై చేయిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.. ఇంత‌లో మ‌ధ్య‌లోకి ఎంట్రీ ఇచ్చిన య‌ష్ .. అభిమ‌న్యు చేయి ప‌ట్టుకుని ప‌క్క‌కు తోసేసి త‌న ధైర్యం వేద అని, త‌న భార్య జోలికి వ‌స్తే పాతేస్తాన‌ని అభిమ‌న్యుకు వార్నింగ్ ఇస్తాడు. క‌ట్ చేస్తే ...వేద త‌ల్లిదండ్రుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ జ‌రుగుతుంది. అందులో పొర‌పాటున మందు క‌లిపిన కూల్ డ్రింక్ దాగుతుంది వేద‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  వేద‌కు జ‌రిగిన అవ‌మానానికి య‌ష్ ఎలా రియాక్ట్ అయ్యాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

పూర్ణ బుగ్గ కొరికిన సుధీర్‌.. వార్నింగ్ ఇచ్చిన‌ ర‌ష్మీ

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం లో చోటు ద‌గ్గ‌ర‌డంతో గుడ్ బై చెప్పేసిన విష‌యం తెలిసిందే. వెళ్లిపోతున్న స‌మ‌యంలో రోజా ఎమోష‌న‌ల్ అయింది కూడా. అయితే ఆమె స్థానంలో ఎవ‌రు వ‌స్తారు? .. ఎలా వుండ‌బోతోంది షో అన్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అంతా ఊహించిన‌ట్టుగానే ఈ షోలోకి పూర్ణ ఎంట్రీ ఇచ్చేసింది. వ‌చ్చి రాగానే ర‌ష్మీ గౌత‌మ్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. కొత్త జ‌డ్జిగా రోజా స్థానంలో పూర్ణ ఎంట్రీ ఇవ్వ‌డంతో టీమ్ లీడ‌ర్లు రెచ్చిపోయారు. ముందు ఇమ్మానుయేల్ ముద్దు అడిగాడు. స్కిట్ అనంత‌రం ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టేసి కొత్త ర‌చ్చ‌కు తెర‌లేపింది. ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టే స‌మ‌యంలో వ‌ర్ష ఫీలైంది. ముద్దు పెట్టిన వెంట‌నే పూర్ణ .. ఇమ్మానుయేల్ విగ్గుని తొల‌గించేసింది. దీంతో వ‌ర్ష న‌వ్వుల్లో మునిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సుడిగాలి సుధీర్‌.. ఓ కొంటె కోరిక కోరాడు. 'గ‌తంలో మీరు ఎంతో మందికి అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌డు నేను హీరోని కూడా. నాకు మీ బుగ్గ కొరికే అవ‌కాశం ఇవ్వండి' అంటూ ఠ‌క్కున అడిగేశాడు. వెంట‌నే `ఏంటీ సుధీర్ మీకు నా బుగ్గ కొర‌కాల‌ని వుందా?' అంటూ పూర్ణ అడిగింది. దానికి సుధీర్ అవున‌ని స‌మాధానం చెప్పాడు. వెంట‌నే 'అయితే రండి' అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది పూర్ణ‌. త‌ను అలా అన్న వెంట‌నే సుధీర్ .. పూర్ణ ద‌గ్గ‌ర వాలిపోయాడు.. ఇది గ‌మ‌నించిన ర‌ష్మీ ఒక్క‌సారిగా షాక్ అయి పూర్ణ‌కు వార్నింగ్ ఇచ్చింది. "పూర్ణ గారు మీరు ఇలా చేయ‌డానికి వీళ్లేదు. దీనికి నేను ఒప్పుకోను" అంటూనే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఆ త‌రువాత సుధీర్ ని చూసి త‌ల కింద‌కి దించి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో ఏం జ‌రిగిందో తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

శివాలెత్తిన శివ‌జ్యోతి.. వ‌దిలే ప్ర‌స‌క్తిలేదంటూ వార్నింగ్‌

బిగ్ బాస్ సీజ‌న్ 5 లో సంద‌డి చేసిన శివ‌జ్యోతి ఆ త‌రువాత బుల్లితెర‌పై బిజీగా మారిపోయింది. వ‌రుస షోల‌లో పాల్గొంటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే తాజాగా శివ‌జ్యోతి ప్రెగ్నెంట్ అంటూ సోష‌ల్ మీడియా లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. దీంతో ఆమెకు అంతా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజా వార్త‌ల‌పై శివజ్యోతి మండిప‌డింది. తాను ప్రెగ్నెంట్ అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, త‌న‌పై యూట్యూబ్ లో త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డింది. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపిన స‌ద‌రు యూట్యూబ్ ఛాన‌ల్ కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఓ వీడియోని కూడా విడుద‌ల చేసింది.   `మీ అంద‌రికి ఓ ముచ్చ‌ట చెప్పాలి. నా గురించి నాకు తెలియ‌ని విష‌యాలు చాలా స‌ర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకు నాపై ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయో తెలియ‌దు. స్టార్టింగ్ లో ఎందుకు లే రియాక్ట్ కావ‌డం అని వ‌దిలేశా. ఇవ‌న్నీ ఎందుకు వ‌స్తున్నాయంటే ఇటీవ‌ల ఓ ఈవెంట్ కోసం వెళ్లిన‌ప్పుడు మామిడికాయ ప‌ట్టుకుని ఓ ఫొటో దిగా. దాన్ని ప‌ట్టుకుని ఇంత ర‌చ్చ చేస్తున్నారు.' అని శివాలెత్తింది శివ‌జ్యోతి. అంతే కాకుండా త‌ను లావు అయ్యాన‌ని, 30 ఏళ్లు వ‌చ్చాయి. శ‌రీరంలో మార్పులు వ‌స్తాయి. మీకేంటీ బాధ‌?  దీన్ని ప‌ట్టుకుని ప్రెగ్నెంట్ అవుతుంది. త‌ల్లి కాబోతోంది అంటూ టైటిల్స్ పెడుతున్నారు. నా ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాన్ని లేవ‌నెత్తారు వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు. వ్యూస్ కోసం ఇంత క‌క్కుర్తిప‌డ‌తారెందుకు? నాకు పెళ్లై చాన్నాళ్లే అవుతోంది. నా పేరెంట్స్‌ పిల్ల‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అంద‌రూ ఫోన్ లు చేసి న‌న్ను అడుగుతున్నారు. మీరు రాసిన రాత‌ల వ‌ల్ల నాకు ఈవెంట్లు కూడా రావ‌డం లేదు. ప్రెగ్నెంట్ క‌దా.. ఆమె చేయ‌దులే అని నాకు ప‌రి ఇవ్వ‌డం లేదు. నా ఫ్రెండ్స్ అంద‌ర్నీ ఇందులో ఇన్ వాల్వ్ చేస్తున్నారు. నా జీవితంలో ఇది చాలా పెద్ద విష‌యం. నా టైం వ‌చ్చిన‌ప్పుడు నిజంగా అది జరిగిన‌ప్పుడు నేను చెప్తా. నా వ్య‌క్తిగ‌త విష‌యాలు నేనే చెప్తా. యూట్యూబ్ ఛాన‌ల్ లో నా ఫ్యామిలీ మ్యాట‌ర్ లాగారు కాబ‌ట్టి విడిచి పెట్ట‌ను. ఇది రిక్వెస్ట్ అనుకుంటావో బెదిరింపు అనుకుంటావో నీ ఇష్టం. నేను ఏది చేయాలో అది చేస్తా.. విన‌క‌పోతే మీ క‌ర్మ‌. ఇక్క‌డితో వ‌దిలేద్దాం` అని ఓ ర‌కంగా రిక్వెస్ట్ చేసింది శివ‌జ్యోతి.

లేడీ అర్జున్ రెడ్డి బిందు మ‌ళ్లీ రెచ్చిపోయింది

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఏడ‌వ వారం పూర్తి చేసుకుని ఎనిమిద‌వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. గ‌త కొన్ని వారాలుగా ఈ సీజ‌న్ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. టెలివిజ‌న్ వేదిగా ప్ర‌సారం అయ్యే బిగ్ బాస్ కంటే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ చాలా దారుణంగా వుంద‌ని, స‌భ్యులు హ‌ద్దులు మ‌రిచి చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇవే కామెంట్ ల‌ని హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి న వారు కూడా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఎనిమిద‌వ వారం నామినేష‌న్ ల ప్ర‌క్రియ మొద‌లైంది. ఇందులో భాగంగా ఇంటి స‌భ్యులంద‌రూ త‌గిన కార‌ణాలు చెప్పిన త‌రువాత వారు నామినేట్ చేయాల‌నుకుంటున్న ఇద్ద‌రు స‌భ్యుల ముఖంపై ఫోమ్ ని పూర్తిగా పూయాల్సి వుంటుంది అంటూ బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ని అరియానా, అశోక్ ల‌తో మొద‌లుపెట్టారు. శివ తింటుంటే అత‌ని నోటి నుంచి లాక్కోవ‌డం ఎమోష‌న్ కాదా? అంటూ అరియానా ర‌చ్చ మొద‌లుపెట్టింది. ఆ పాయింట్ ని ప‌ట్టుకుని నామినేష‌న్ లోకి వ‌చ్చిన అఖిల్ ... నువ్వు మా ఫుడ్ ని వేస్ట్ చేశావ్ దాంతో మేము చాలా హ‌ర్ట్ అయ్యాం.. అంటూ అరియానాని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు అఖిల్‌. ఇక వెళ్లిపోయిన స్ర‌వంతిని పాయింట్ చేస్తూ మాట్లాడుతున్నార‌ని అఖిల్ అన‌డంతో వెంట‌నే బిందు మాధ‌వి లైన్ లోకి వ‌చ్చేసింది. స్ర‌వంతి గేమ్ కాదా? అంటూ చుర‌క‌లంటించింది. స్రవంతి గేమ్ లో లేదా?.. మీకు ఊరికే సేవ‌లు చేసుకోవ‌డానికే వ‌చ్చిందా? .. అరియానాని చూపిస్తూ `ఎమోష‌న‌ల్ గా వాడుతున్నావు క‌దా.. అంటూ అఖిల్ కి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన అఖిల్ `వాడుతున్నావ్ అంటే పిచ్చిదానిలా ఏం మాట‌లు మాట్లాడుతున్నావ్ .. ఫ‌స్ట్ నువ్వు గేమ్ ఆడు అని ని ఫ్రెండే చెబుతున్నాడు` అని ఫైర‌య్యాడు. బిందు ఊరుకుంటుందా?.. వెంట‌నే `నీగేమే వెన్నుపోటు పొడిచే గేమ్‌` అంటూ దిమ్మ‌దిరిగే పంచ్ వేసింది.. తాజాగా విడుద‌లైన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.  

ఇంద్రుడు ఉగ్ర‌రూపం.. సౌంద‌ర్య సీరియ‌స్‌..

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్నేళ్లుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ ధారావాహిక గ‌త కొన్ని వారాలుగా గ‌తి త‌ప్పింది. ఒక ద‌శ‌లో ఇండియాలోనే టాప్ టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుని రికార్డు సాధించిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్నివారాలుగా సాగ‌దీత ధోర‌ణితో సాగుతూ వీక్ష‌కుల‌కు విసుగుపుట్టించింది. మ‌ల‌యాళ సీరియ‌ల్ `క‌రుత‌ముత్తు` ఆధారంగా రీమేక్ చేసిన ఈ సీరియ‌ల్ గ‌తి త‌ప్ప‌డంతో కీల‌క పాత్ర‌ల‌ని ఎండ్ చేసిన ద‌ర్శ‌కుడు ప్రస్తుతం ఇదే క‌థ‌ను కొత్త త‌రంతో మొద‌లుపెట్టాడు. హిమ‌, శౌర్య‌ల క‌థ‌గా మ‌ళ్లీ రీస్టార్ట్ చేశాడు. మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌స్తున్న ఈ సీరియ‌ల్ సోమ‌వారం ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. జ్వాల‌గా మారిన శౌర్య‌కు నిరుప‌మ్ తో పాటు అంతా అధిక ప్రాధాన్య‌త‌ నివ్వ‌డంతో స్వ‌ప్నకు మండిపోతూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో స్వ‌ప్న‌కు, శౌర్య‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్వ‌ప్న‌.. జ్వాల‌ (శౌర్య) ఆటోకు నిప్పుపెట్టి త‌న ఆగ్ర‌హాన్ని చూపిస్తుంది. దీంతో ఒక్క‌సారిగా అంతా షాక్ అవుతారు. మండుతున్న ఆటోని చూస్తూ జ్వాల‌ (శౌర్య) క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసింద‌ని బోరున విల‌పిస్తుంది. విష‌యం తెలిసి ఇంద్రుడు ఉగ్ర‌రూపం దాలుస్తాడు. ఎంత పొగ‌రు త‌న అంతు చూస్తా అని ఊగిపోతాడు. క‌ట్ చేస్తే విష‌యం తెలుసుకున్నసౌంద‌ర్య .. స్వ‌ప్న ఇంటికి వెళ్లి అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంది. ఒక‌రి పొట్ట‌మీద కొట్టావు ఆ పాపం ఊరికే పోదు అంటూ స్వ‌ప్న‌కు వార్నింగ్ ఇస్తుంది. క‌ట్ చేస్తే నిరుప‌మ్‌, హిమ క‌లిసి జ్వాల‌కు కొత్త ఆటోని కొనిస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

నో ఓటింగ్ .. వెళ్ల‌మంటే వెళ్లిపోవాల్సిందే - మ‌హేష్ విట్టా

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎలిమినేష‌న్ పై చాలా రోజులుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వీక్ష‌కుల ఓటింగ్ ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఇంటి స‌భ్యుల్లో నిర్వాహ‌కుల‌కు ఎవ‌రు న‌చ్చ‌డం లేదో వారిని మాత్ర‌మే ఎలిమినేట్ చేస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని తాజాగా మ‌హేష్ విట్టా వెల్ల‌డించి షాకిచ్చాడు. అనూహ్యంగా ఏడ‌వ వారం మ‌హేష్ విట్టా ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ ఓటీటీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన మ‌హేష్ విట్టా సంచ‌ల‌న‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్ట‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.   ఎలిమినేష‌న్ గురించి మాకు ముందే హింట్ ఇచ్చేశారు. ఎవ‌రైనా ఎప్పుడైనా ఎలిమినేట్ కావొచ్చు అని బిగ్ బాస్ టీం వాళ్లు ముందే చెప్పారు. వీకెంట్ ఎలిమినేష‌న్ తో పాటు మిడ్ వీక్ ఎలిమినేష‌న్స్ కూడా ఉంటాయ‌ని చెప్పార‌ని, వాళ్ల ప్లాన్ లు ఎలా వున్నాయో తెలియ‌డం లేద‌న్నాడు. బిగ్‌బాస్ టీమ్ ఎవ‌రిని ఉంచాలంటే వాళ్ల‌ని ఉంచుతున్నారు. మ‌న చేతుల్లో కానీ, ఓటింగ్ వేసే ప్రేక్ష‌కుల చేతుల్లో కానీ ఏమీ లేద‌ని తేల్చి చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `నాకు పీఆర్ టీమ్ ఏమీ లేదు. ఆ అవ‌స‌రం కూడా నాకు లేదు. షోలోకి వెళ్లే ముందు నా త‌మ్ముడికి ఫోన్ ఇచ్చి వెళ్లాను. వాడే అంతా చూసుకున్నాడు. పీఆర్ టీమ్ అనేది కొత్తగా వ‌చ్చేవాళ్ల‌కు.. అది నాకు అవ‌స‌రం లేదు. నేను ఏంటో అంద‌రికి తెలుసు. ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్లుగా వున్నాను. క‌ప్పుకొట్టాలి.. క‌సిగా ఆడి చివ‌రి వ‌ర‌కు ఉండాలి అంటే గేమ్ ఎలాగైనా ఆడొచ్చు. మ‌హేష్ విట్టా రియాలిటీ ఏంట‌న్న‌దే చూపించాల‌ని నేను హౌస్ లోకి వెళ్లాను. లాస్ట్ టైమ్ 12 వారాలు వుంటే ఈ సారి ఏడు వారాలే ఎక్కువ అనిపించింది. నేను పాపుల‌ర్ కావాల‌ని ఒక‌రిని బ్యాడ్ చేయాల‌నుకోలేదు` అని చెప్పుకొచ్చాడు మహేష్ విట్టా. 

అలియా పెళ్లిపై బిగ్ బాస్ విన్న‌ర్ షాకింగ్ పోస్ట్‌!

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణ్ బీర్ క‌పూర్ - అలియా భ‌ట్ ఐదేళ్ల నిరీక్ష‌ణ త‌రువాత ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న క్యూట్ జోడీ ఎట్ట‌కేల‌కు ఒక్క‌ట‌య్యారు. దాదాపు గ‌త రెండేళ్లుగా క‌రోనా తో పాటు వివిధ కార‌ణాల వ‌ల్ల వీరి వివాహం వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. చివ‌రికి ప‌రిస్థితులు అనుకూలించ‌డం తో వివాహ బంధంతో మొత్తానికి ఒక్క‌ట‌య్యారు. ముంబైలోని బాంద్రాలో జ‌రిగిన వీరి వివాహానికి క‌పూర్ ఫ్యామిలీ తో పాటు మ‌హేష్ భట్ ఫ్యామిలీ.. బాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు.   మొత్తానికి ఐదేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత ల‌వ్ బ‌ర్డ్స్ పెళ్లిబంధంతో ఒక్క‌టి కావ‌డంతో అభిమానులు, సెల‌బ్రిటీలు ఈ జంటకు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ వీజే స‌న్ని మాత్రం ఫీల‌వుతున్నాడు. త‌ను ఐల‌వ్ యూ చెప్పిన‌ అలియా పెళ్లైపోవ‌డంతో విచారాన్ని వ్య‌క్తం చేస్తూ త‌ల ప‌ట్టుకుంటున్నాడు. కొత్త జంట అలియా - ర‌ణ్ బీర్ ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూనే త‌నకు అన్యాయం చేశారంటూ త‌ల ప‌ట్టుకున్న ఎమోజీని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి షాకిచ్చాడు స‌న్నీ. అలియా భ‌ట్ కు స‌న్నీ వీరాభిమాని. అంతే కాకుండా స‌న్నీకి అలియా డ్రీమ్ గాళ్ కూడా. జ‌ర్న‌లిస్టుగా వున్న స‌మ‌యంలో అలియాని క‌లిసి ఆమెతో `ద‌బిడిదిబిడే` అనే బాలయ్య ఫేమ‌స్ డైలాగ్ ని కూడా చెప్పించాడ‌ట‌. అంతే కాకుండా బిగ్ బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలో లో అలియాభ‌ట్ - ర‌ణ్ బీర్ క‌పూర్, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ పాల్గొన్నారు. ఆ త‌రువాత రాజ‌మౌళి కూడా షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అలియా భ‌ట్ .. స‌న్నీ గురించి తెలుసుకుని స్టేజ్ మీదుగా అత‌నికి ఐ ల‌వ్ యూ చెప్పేసింది కూడా. దీంతో ఒక్క సారిగా స‌న్నీ షాక్ అయ్యాడు. అలా త‌న‌కు ఐ ల‌వ్ యూ చెప్పిన అలియా తాజాగా పెళ్లి చేసుకోవ‌డంతో స‌న్నీ త‌ల‌ప‌ట్టుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం స‌న్నీ పెట్టిన పోస్ట్  నెట్టింట వైర‌ల్ గా మారింది.  

కొత్త కుట్ర‌కు తెర‌లేపిన అభిమ‌న్యు, మాళ‌విక‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప చుట్టూ ప్ర‌ధానంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది. పాప ఖుషీని న‌త‌కు కాకుండా చేయ‌డంతో అభిమ‌న్యుని ఎలాగైనా మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌ని ప్లాన్ వేసిన అభిమ‌న్యు త‌ను నా కూతురేన‌ని, త‌న‌కు , మాళవిక‌కు పుట్టిన పాప అని కొత్త నాట‌కం మొద‌లుపెడ‌తాడు. దీంతో య‌ష్ లో అనుమానాలు మొద‌ల‌వుతాయి. ఈ విష‌యం తెలిసిన వేద డీఎన్ ఏ టెస్ట్ చేయించుకుంటే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, దీంతో అభిమ‌న్యుకి బుద్దిచెప్పొచ్చ‌ని చెబుతుంది. క‌ట్ చేస్తే య‌ష్‌, వేద ఫ్యామిలీస్ సీతారాముల క‌ల్యాణం కోసం గుడికి వెళ‌తారు. అక్క‌డ వైభ‌వంగా సీతారాముల క‌ల్యాణం జ‌రిపిస్తారు. అక్క‌డికి ఎవ‌రికీ తెలియ‌కుండా ఎంట్రీ ఇచ్చిన మాళ‌విక .. ఖుషీని అడ్డంపెట్టుకుని అభిమ‌న్యు ఇచ్చిన లెట‌ర్ ని య‌ష్ కు చేర‌వేస్తుంది. అది చ‌దివిన య‌ష్ .. ఖుషీని దూరం పెడ‌తాడు. అది త‌ట్టుకోలేని ఖుషీ ఎలాగైనా త‌న తండ్రి మ‌న‌సు మార్చ‌మంటూ అక్క‌డే వున్న హ‌నుమాన్ విగ్ర‌హం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంది. ఇది గ‌మ‌నించిన వేద డీఎన్ ఏ రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని, ఖుషీ తండ్రి మీరే అని చెబుతుంది. ఆ మాట‌లు విన్న య‌ష్ ఆనందంగా ఖుషీ ద‌గ్గ‌రికి వెళ్లి త‌నని ఎత్తుకుని ముద్దాడ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ... ఇంత‌కీ వేద నిజంగానే డీఎన్ ఏ రిపోర్ట్ ని తెప్పించిందా? .. అభిమ‌న్యు, మాళ‌విక‌ల రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

ఆర్య‌వ‌ర్థ‌న్ చాంబ‌ర్‌ లోకి రాగ‌సుధ‌.. ఏం చేయ‌బోతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌త‌ని రేకెత్తిస్తోంది. గ‌త జ‌న్మ జ్ఞాప‌కాల‌తో ఆర్య ని వ‌దిలి వెళ్లలేక.. ఆర్య‌పై మ‌న‌సు చావ‌క మ‌రో రూపంలో వ‌చ్చిన ఓ అమ్మాయి క‌థ అంటూ ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. త‌న అక్క హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని చేధించే క్ర‌మంలో రాగ‌సుధ అను స‌హాయంతో ఆర్య వ‌ర్థ‌న్ సామ్రాజ్యం లోకి అడుగుపెడుతుంది. ఈ రోజు ఏం జ‌రిగ‌నుంద‌న్న‌ది ఓ సారి చూద్దాం. పేరు మార్చుకుని, వేషం మార్చుకుని ఆర్య వ‌ర్థ‌న్ ఆఫీసులో చేరిన రాగ‌సుధని గ‌మ‌నించిన మాన్సి అంద‌రి ముందు త‌న గుట్టు బ‌య‌ట‌పెట్టాల‌ని, త‌ను ప‌ని మ‌నిషి అని ఏదో కుట్ర‌లో భాగంగానే ఇందంతా చేస్తోంద‌ని, త‌న‌ని ఇక్క‌డి నుంచి బ‌య‌టికి పంపించాల‌ని మాన్సీ ప్ర‌య‌త్నిస్తుంది. రాగ‌సుధ‌ని గ‌మ‌నించిన వెంట‌నే త‌న‌ని నిల‌దీస్తుంది. త‌న‌కు జాబ్ ఎవ‌రిచ్చార‌ని మీరాపై విరుచుకుప‌డుతుంది. త‌న మాట ఎవ‌రూ న‌మ్మ‌క‌పోయే స‌రికి చివ‌రికి నీర‌జ్ ని ర‌మ్మ‌ని ఆ రోజు ప‌ని మ‌నిషిగా మ‌న ఇంటికి వ‌చ్చింది త‌నే అని చెబుతుంది. రాగ‌సుధ ముఖం చూపిస్తే అస‌లు విష‌యం తెలిసిపోతుంద‌ని త‌న ముసుగును బ‌ల‌వంతంగా తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఇదే స‌మ‌యంలో అక్క‌డికి చేరుకున్న అను .. రాగ‌సుధ దొరికిపోకుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. ఆర్య కూడా ఎవ‌రో అనుకుని పొర‌పాటు ప‌డిన‌ట్టున్నావ‌ని మాన్సీని నిల‌దీస్తాడు. అంతా కూల్ అయిపోవ‌డంతో ఆర్య - అను త‌న చాంబ‌ర్ లో స్వీట్ లు తినిపించుకుంటూ వుంటారు. అదే స‌మ‌యంలో రాగ‌సుధ చాంబ‌ర్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అనుతో సంత‌కాలు చేయించుకోవాల‌ని చెప్పి ఆర్య చాంబ‌ర్ లో సీడీని గాలించ‌డం మొద‌లుపెడుతుంది. ఈ క్ర‌మంలో ఆర్య టేబుల్ కింద వున్న సీడీ రాగ‌సుధ కంట‌ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఆర్య‌కు తెలియ‌కుండానే సీడీని రాగ‌సుధ లేపేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

అషురెడ్డి కి రంగుప‌డింది.. న‌ట‌రాజ్ ప‌గ‌ల‌గొట్టేస్తాడ‌ట‌

అఖిల్ కార‌ణంగా అత‌ని గ్రూప్ కార‌ణంగా అషురెడ్డి హౌస్ లో కెప్టెన్ అయిన విష‌యం తెలిసిందే. త‌న‌కే రంగుప‌డింది. ఇంటి స‌భ్యుల్లో ఎవ‌రు వ‌ర‌స్ట్ పెర్ఫార్మ‌ర్ అని అనుకుంటున్నారో వారి ముఖంపై స్టాంపు వేసి త‌గిన కార‌ణాలు చెప్పాల‌ని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. వెంట‌నే రంగంలోకి దిగిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ "ఈ స్టాంప్ ని నాకు నేను వేసుకోవాలి" అన్నాడు. "అట్లుండ‌ది మాస్ట‌ర్ తోని" అని అఖిల్ అన‌డంతో "అది వుండ‌దు కాబ‌ట్టి అషురెడ్డికి వేస్తున్నా" అనేశాడు. దీంతో "ఇదేం ట్విస్ట్" అని మిగ‌తా ఇంటి స‌భ్యులు న‌వ్వేశారు. ఇక ఆ త‌రువాత లైన్ లోకి వ‌చ్చిన అరియానా తాను రేష‌న్ మేనేజ‌ర్ గా ఫెయిల‌య్యాన‌ని, దానికి కార‌ణాలు ఇవే అంటూ అషురెడ్డి వైపు చూసింది. నువ్వు రేష‌న్ ఫాలో అవ్వ‌లేద‌ని, టేకిట్ ఈజీ తీసుకున్నావ‌ని అషురెడ్డి అనేసింది. దీంతో "అవును చాలా టేకిట్ ఈజీగా తీసుకున్నాను" అంటూనే అషు రెడ్డికి స్టాంప్ వేసి షాకిచ్చింది. ఆ త‌రువాత అఖిల్‌, మ‌హేష్ విట్టా వెంట వెంట‌నే అషుకు స్టాంప్ లు వేసేశారు. ఇక క్లారిటీ, విజ‌న్‌, లాట్ ఆఫ్ క‌న్‌ఫ్యూజ‌న్ అంటూ స్టాంప్ ని గుద్దిప‌డేసింది మిత్రా. దీంతో అషురెడ్డి వ‌ర‌స్ట్ పెర్ఫార్మ‌ర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచింది. ఇక త‌న వంతు వ‌చ్చేస‌రికి అషురెడ్డి.. అనిల్ ని టార్గెట్ చేసింది. ఫ్లాగ్ టాస్క్ లో 'ద‌మ్ముంటే నువ్వు రావాలి కానీ ఆడ‌పిల్ల‌ని పంపించ‌డం ఏంటీ?' అని అన్నాడని అషు స్టేట్‌మెంట్ ఇవ్వ‌డంతో అనిల్ వెంట‌నే క‌ల‌గ‌జేసుకుని తాను అలా అన‌లేద‌ని వాదించాడు. అయినా అషు ప‌దే ప‌దే వాదిస్తుండ‌టంతో ఈ సారి వ‌స్తే ప‌గ‌ల‌గొట్టి చూపిస్తాన‌ని, త‌న‌కు గేమ్ లేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌ని, గ్యారెంటీగా ప‌గ‌ల‌గొట్టే వెళ‌తాన‌ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అనడంతో 'ఎవ‌రిని మాస్ట‌ర్?' అని అనిల్ అందుకున్నాడు. 'ఎవ‌రిని అనేది పేరు తియ్య‌లేదు క‌దా నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్' అని అఖిల్ అన‌డం.. న‌ట‌రాజ్‌.. అనిల్ సై అంటే సై అన‌డం నానా ర‌చ్చ‌కు దారితీసింది.

చాలా మిస్స‌వుతానంటూ రోజా ఎమోష‌న‌ల్

  ఈటీవీ లో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ షోలో దాదాపు ప‌దేళ్ల పాటు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు రోజా. 2013 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షో నుంచి నాగ‌బాబు ఎగ్జిట్ అయ్యాక అన్నీ తానై న‌డిపిస్తూ టీమ్ లీడ‌ర్ ల‌ని ఎంట‌ర్‌టైన్‌ చేస్తూ వ‌చ్చారు. తాజాగా ఆమె ఏపీ మంత్రి వ‌ర్గంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ షో జ‌డ్జి బాధ్య‌త‌ల నుంచి తప్పుకున్నారు. అయితే ప‌దేళ్లుగా క‌లిసి ప్ర‌యాణించిన రోజా ఈ సంద‌ర్భంగా జ‌బ‌ర్ద‌స్త్ టీమ్‌ని వ‌దిలి వెళ్లిపోతున్న నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ అయ్యారు.   రోజా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన చివ‌రి `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్` ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు. రెండు నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమోలో రోజా ఏడుస్తూ క‌నిపించారు. త‌ను ఏడుస్తూ అంద‌రిని ఏడిపించారు. ఈ సంద‌ర్భంగా లీడ‌ర్ లీడ‌ర్  అంటూ జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ మంత్రి రోజాను ప్ర‌త్యేకంగా స‌న్మానించి వీడ్కోలు ప‌లికారు. ప్రౌడ్ మూవ్‌మెంట్ అంటూ యాంక‌ర్ ర‌ష్మీ కంగ్రాట్స్‌ చెప్ప‌గా.. సుడిగాలి సుధీర్ వెళ్లి రోజాని తీసుకుని రావ‌డం.. తను మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వీడియోని ఆమెకు మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రోజా భావోద్వేగానికి గుర‌య్యారు. `నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్క‌డి నుంచే అయ్యాను. మినిస్ట‌ర్ కూడా ఇక్క‌డే అవ్వాల‌నుకున్నా..మ‌నస్ఫూర్తిగా నేను న‌మ్మాను కాబ‌ట్టే ఇక్క‌డికి వ‌చ్చాను. ఇక నుంచి ఈ షో చేయ‌డం క‌ష్ట‌మే. అంద‌ర్నీ మిస్ అవుతున్నాను. ఆ బాధ నాకు చాలా వుంది. నాకు ఇష్ట‌మైన‌వి కూడా వ‌దులుకోవాల్సి వ‌స్తుంది. నా లైఫ్ లో నేను కోరుకున్న గోల్ రీచ్ అయ్యేలా చేశారు. ఈ విష‌యంలో ఈటీవీకి థ్యాంక్స్ అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. 

'ఢీ'లో మొదలైన రవికృష్ణ - నవ్య స్వామి ప్రేమ రచ్చ

బుల్లితెర జంట‌ న‌వ్య స్వామి, ర‌వికృష్ణ‌లు తొలిసారి క‌లిసి చేసిన `ఆమె క‌థ‌` సీరియ‌ల్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఈ సీరియ‌ల్ నుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ మొద‌లైంది. ఆన్ స్క్రీన్ లో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర‌డంతో వీరిపై అంద‌రి దృష్టిప‌డింది. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం మ‌రింత పెర‌గ‌డం.. ప‌లు టీవీషోల్లో ఇద్ద‌రు మ‌రింత క్లోజ్ గా మూవ్ కావ‌డంతో ర‌క ర‌కాల రూమ‌ర్ లు మొద‌ల‌య్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?.. అనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. న‌వ్య స్వామి కంటే ర‌వికృష్ణ ప్ర‌తీ ఈవెంట్ లోనూ న‌వ్య గురించి రియాక్ట్ కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ న‌డుస్తోంద‌ని, వీరు త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నార‌నే వార్త‌లు జోరుగా వినిపించాయి. దీంతో ఇద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని, మా మ‌ధ్య అలాంటిది ఏమీ లేద‌ని ఇద్ద‌రూ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. బ‌య‌టికి స్నేహితుల‌మే అని చెబుతున్నా ఏదైనా షోలోకి ఎంట్రీ ఇచ్చారా..ఆ వేదిక‌పై వీరు చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌టం లేదు. ల‌వ‌ర్స్ త‌ర‌హాలో రెచ్చిపోయి జీవించేస్తున్నారు. సుమ నిర్వ‌హిస్తున్న `క్యాష్‌` షో లో అయితే ఏకంగా ముద్దులు కూడా పెట్టేసుకుని షాకిచ్చారు. హ‌గ్గులు, ముద్దులు చూసి సుమ స్టేజ్ పై ఏం జ‌రుగుతోంద‌నే షాక్ కు గురికావాల్సివ‌చ్చింది. అంత‌లా సుమ‌ని ఈ జంట భ‌య‌పెట్టేసింది. తాజాగా ఈ జంట ఢీ షోలో సంద‌డి చేస్తున్నారు. ఈ షోలో వీరిద్ద‌రి మ‌ధ్య వున్న అనుబంధాన్ని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు ప్ర‌దీప్. మీకు ర‌వికృష్ణ ఇచ్చిన మొద‌టి గిఫ్ట్ ఏంటో గుర్తుందా? అని అడిగాడు. హైద‌రాబాద్ లో షాపింగ్ చేసిన‌ప్ప‌డు ఓ జాకెట్ నాకు న‌చ్చింది. అయితే అది నా సైజ్ కాదు. దీంతో ఎందుకులే అని వ‌దిలేశాను. దాన్ని గుర్తు పెట్టుకున్న ర‌వికృష్ణ అంత‌టా వెతికి చివ‌రికి బెంగ‌ళూరులో దాన్ని సాధించాడు. అదే నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. తాజాగా ఢీ ప్రోమోలో న‌వ్వ స్వామి చెప్పిన‌ మాట‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.  

నిరుద్యోగులకు వంటలక్క బంపర్ ఆఫర్

`కార్తీక దీపం` సీరియల్ తో అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్. గ‌త కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో వంట‌ల‌క్క‌గా నిలిచిపోయిన ప్రేమి విశ్వ‌నాథ్ ఈ సీరియ‌ల్ లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌ని డైరెక్ట‌ర్‌ ఎండ్ చేయ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దూర‌మైంది. గ‌త కొన్ని రోజులుగా ఎవ‌రికీ క‌నిపించ‌ని, వినిపించ‌ని ప్రేమి ఇప్ప‌డు మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా వంట‌ల‌క్క హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. `కార్తీక‌దీపం`లో త‌న పాత్ర ఎండ్ కావ‌డం.. కొత్త జ‌న‌రేష‌న్ తో క‌థ స్టార్ట్ కావ‌డంతో తెలుగు వాతావర‌ణానికి గ‌త కొన్ని రోజులుగా దూరంగా వుంటోంది వంట‌ల‌క్క‌. అయితే తాజాగా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా నిరుద్యోగుల కోసం ప్ర‌క‌ట‌న చేసి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. "నేను కొంత మందిని హైర్ చేసుకుంటున్నాను. నా ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డానికి ఆస‌క్తివున్న వారు అప్లై చేసుకోండి" అంటూ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో చాలా రోజుల త‌రువాత వంట‌ల‌క్క మ‌ళ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో నెటిజ‌న్స్ వంటల‌క్క పోస్ట్ పై కామెంట్ లు పెడుతున్నారు. అన్ని ర‌కాల ఫోర్ వీల‌ర్‌ (ఆటోమేటిక్‌, మ్యానువ‌ల్ ) వాహ‌నాలు న‌డుపుట‌కు డ్రైవ‌ర్లు కావ‌లెను. అలాగే అకౌంటెంట్ ఉద్యోగాల‌కు tally వ‌చ్చిన అభ్య‌ర్థులు కావ‌లెను. ఈ ఉద్యోగానికి రెండు సంవ‌త్స‌రాల అనుభ‌వం వుండాలి. అయితే ఎంపికైన వారు మాత్రం వంట‌ల‌క్క సొంత ఊరైన కేర‌ళ‌ కొచ్చిలోని ఎర్నాకులంలో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని వంట‌ల‌క్క చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ వ‌ర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్ లు కామెంట్లు పెడుతున్నారు. వీ మీడియా ఎంట‌ర్‌టైన్ మెంట్ ని ప్రారంభించిన వంట‌ల‌క్క దీనిపై  నిర్మాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఆమె ఓ ఫిల్మ్ స్టూడియోని కూడా ప్రారంభించింది. ఇందు కోస‌మే ఉద్యోగాలు ప్ర‌క‌టించింది. మ‌ల‌యాళంలో `క‌రుత‌ముత్తు` సీరియ‌ల్ లో కెరీర్ ప్రారంభించిన ప్రేమి విశ్వ‌నాథ్ అదే సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో రూపొందిన `కార్తీక‌దీపం`తో టాప్ సెల‌బ్రిటీగా మారిపోయింది. ఈ రెండు సీరియ‌ల్ ల‌తో ఉత్త‌మ న‌టిగా అవార్డులు సొంతం చేసుకుంది. 

ఫ్యామిలీ ముందు యష్ ని ఆడుకున్న వేద

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాల క్రితమే మొదలైన ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. తల్లి కాలేని తల్లి.. పాప కోసం తపించే తండ్రి.. ఈ ఇద్దరి ప్రేమలో తడిసిముద్దవుతున్న ఓ కూతురు కథగా ఈ సీరియల్ ని దర్శకుడు రూపొందించాడు. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, అనంద్ తదితరులు నటించారు. యష్ డీఎన్ ఏ టెస్ట్ కి అడ్డుచెప్పడంతో ఎలాగైనా అతనికి తెలియకుండానే అతని హెయిర్ ని సంపాదించి డీఎన్ ఏ టెస్ట్ కి పంపించాలని ప్లాన్ చేస్తుంది వేద‌. యష్ ఆఫీస్ కి రెడీ అవుతూ క్రాఫ్ దువ్వుకుంటుంటే యష్ తో సరసాలు మొదలుపెడుతుంది. దీంతో యష్ .. ఏంటీ ఇలా ప్రవర్తిస్తోంది? అని ఆలోచనలో పడతాడు. యష్ ఆఫీస్ కి బయలుదేరగానే తను క్రాఫ్ దువ్వుకున్న దువ్వెనకున్న వెంట్రుకల్ని తీసుకోవాలని అనుకుంటుంది.. ఇంత‌లో యష్ తల్లి మాళిని ఎంట్రీ ఇచ్చి ఆ దువ్వెనకున్న యష్ వెంట్రుకల్ని తీసేస్తూ దువ్వెన కావాలా? అని వేదని అడుగుతుంది. చేసేది లేక వేద అవును అంటుంది. కట్ చేస్తే ... అభిమన్యు .. వేద అన్న మాటలకు అవమాన భారంతో తనకు ఎంత ధైర్యం నన్ను ఒక ఆడది అవమానిస్తుందా? .. ఎలాగైనా వేద నోరుమూయించాలి. ఇందుకు ఏదో ఒకటి చేయాలని క్రూరంగా ఆలోచిస్తూ వుంటాడు. మాళవిక కూడా వేదపై విషాన్ని కక్కుతుంది. కట్ చేస్తే.. తల వెంట్రుకలు మిస్సయిపోవడంతో బ్లడ్ షాంపిల్స్ అయినా తీసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తుంది వేద. ఇందుకు కొత్త నాటకం మొదలుపెడుతుంది. ఇంతకీ వేద నాటకానికి యష్ సరెండర్ అయ్యాడా?.. ఫ్యామిలీ ముందు వేద .. యష్ ని ఎలా ఆడుకుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.     

అభిమ‌న్యుని దెబ్బ‌కొట్టేందుకు వేద మాస్ట‌ర్ ప్లాన్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కూతురు కోసం త‌పించే ఓ తండ్రిక‌థ‌, కూతురు కానీ ఓ పాప కోసం త‌ల్లికానీ త‌ల్లి తాప‌త్ర‌య‌ప‌డే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు రూపొందించాడు. స్టార్ మా లో కొత్త‌గా మొద‌లైన ఈ సీరియ‌ల్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోందో ఒక సారి చూద్దాం. య‌శోధ‌ర్ ప‌డుతున్న న‌ర‌క‌యాత‌న‌కు ఎండ్ కార్డ్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్న వేద మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. అనుకున్న వెంట‌నే య‌ష్ కు ఆ విష‌యం చెప్ప‌డానికి అత‌ని ఆఫీస్ కి వెళుతుంది. అప్ప‌టికే అభిమ‌న్యు కార‌ణంగా డిస్ట్ర‌బ్ అవుతున్న అభిమ‌న్యు చిరాగ్గా వుంటాడు. అది గ‌మ‌నించిన వేద మీ మ‌నోవేద‌న‌కు ప‌రిష్కారం వుంది. నేను డాక్ట‌ర్ తో మాట్లాడాను. డీఎన్ ఏ టెస్ట్ చేస్తే అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని య‌ష్ తో అంటుంది. అందుకు య‌ష్ అంగీక‌రించ‌డు. ఒక వేళ రిపోర్ట్ పాజిటివ్ గా రాకుంటే ఖుషీని వ‌దులుకోవాలా? అని వేద‌ని నిల‌దీస్తాడు. ఈ విష‌యంలో నీ జోక్యం అవ‌స‌రం లేదంటూ వేద‌కు వార్నింగ్ ఇస్తాడు. అయినా స‌రే త‌న‌కు ప్రాణమైన ఖుషీ కోసం తాను ఎంత దూర‌మైనా వెళ‌తాన‌ని, ఎవ‌రినైనా ఎదిరిస్తాన‌ని అంటుంది వేద‌. అక్క‌డి నుంచి నేరుగా అభిమ‌న్యు ఇంటికి వెళ్లిన వేద .. అభిమ‌న్యుకు, మాళ‌విక‌కు చుక్క‌లు చూపిస్తుంది. య‌ష్ కు తోడుగా నేనున్నాన‌ని, త‌న భ‌ర్త‌ని ఎలా గెలిపించుకోవాలో త‌న‌కు తెలుస‌ని, ఖుషీ జోలికి వ‌స్తే తాను ఎంత దూర‌మైనా వెళ‌తాన‌ని వార్నింగ్ ఇస్తుంది. డీఎన్ ఏ టెస్ట్ కు య‌ష్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌నికి తెలియ‌కుండానే అత‌ని హెయ‌ర్ సేర‌నించే పనిలో ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.