హిమ పెళ్లికి సౌంద‌ర్య ప్లాన్‌.. ర‌గిలిపోతున్న‌ స్వ‌ప్న‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నఈ సీరియ‌ల్ ని తాజాగా కొత్త త‌రంతో మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని వారాలుగా గాడి త‌ప్పిన ఈ సీరియ‌ల్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లో కి వ‌స్తోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. హిమ మామిడితోట‌లో మామిడి కాయ‌లు కోయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన నిరుప‌మ్ .. హిమ‌ని ఎత్తుకుని మామిడి కాయ‌లు కోయిస్తాడు. నిరుప‌మ్ చేసిన ప‌నికి హిమ ఆశ్చ‌ర్య‌పోతుంది. ఇదంతా చాటుగా చూసిన స్వ‌ప్న వీరి ఆగ‌డాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయ‌ని వెంట‌నే వెళ్లి హిమ‌పై సీరియ‌స్ అవుతుంది. క‌ట్ చేస్తే ఆనంద‌రావు, సౌంద‌ర్ క‌లిసి కారులో వెళుతుండ‌గా నాకు శౌర్య దొరికిన‌ట్టు క‌ల వ‌చ్చింది అని చెబుతాడు. ఈ క‌ల నిజ‌మైతే ఎంత బాగుండు అని అనడంతో సౌంద‌ర్య కూడా అవును అంటుంది. ఇంత‌లో జ్వాల (శౌర్య‌) వెన‌క‌వైపు నుంచి వ‌చ్చి కారుని ఢీ కొడుతుంది. అది చూసిన సౌంద‌ర్య చూసుకుని న‌డ‌ప‌వ‌చ్చుక‌దా అని సీరియ‌స్ అవుతుంది. ఆ మాట‌ల‌కు జ్వాల `సీనియ‌ర్ సిటిజ‌న్స్ అని కౌంట‌ర్ వేయ‌డంతో ఆనంద‌రావు న‌వ్వేస్తాడు. క‌ట్ చేస్తే ఆటో డ్యామేజీకి ఎంత‌వుతుందో చెప్పు ఇస్తా అని సౌంద్య అంటుంది. నీ కారు కైన డ్యామేజీ ఎంతో చెప్పు నేనూ ఇస్తాన‌ని జ్వాల ఎదుఉ ప్ర‌శ్నిస్తుంది. అప్పుడు జ్వాల‌ని చూసి నిన్ను చూస్తే నా మ‌న‌వ‌రాలిని చూసిన‌ట్టుగానే వుంద‌ని ఆనంద‌రావు ఫీల‌వుతాడు. క‌ట్ చేస్తే స్వ‌ప్న జ‌రిగింది త‌లుచుకుని కోనంతో ర‌గిలిపోతూ వుంటుంది. అదే స‌మ‌యంలో ఆనంద‌రావు రావ‌డంతో నా బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో .. ఎవ‌రిపై చూపించాలో అర్థం కావ‌డం లేదు డాడీ అంటుంది. ఇదిలా వుంటే హిమ‌కు పెళ్లి చేయాల‌ని సౌంద‌ర్య ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. స్వ‌ప్న ఎలా రియాక్ట్ అయింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

నామినేష‌న్స్ లో బిందు బాత్రూమ్ టాపిక్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ నామినేష‌న్స్ ర‌చ్చ మ‌ళ్లీ మొద‌లైంది. అయితే ఈ సారి జ‌రిగిన 9వ వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ మాత్రం మ‌రీ దారుణంగా వుంది. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో పాటు బిందు మాధ‌వి బాత్రూమ్ ర‌చ్చ ఓ రేంజ్ లో నామినేష‌న్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఇంటి స‌భ్యులంద‌రూ వారు నామినేట్ చేయాల‌నుకుంటున్న ఇద్ద‌రు స‌భ్యుల దిష్టిబొమ్మ‌ల‌పై ఒక్కో కుండ‌ని పెట్టి త‌గిన కార‌ణాలు చెప్పిన త‌రువాత ఆ కుండ‌ను ప‌గ‌ల‌గొట్టాల్సి వుంటుంది అంటూ 9వ వారం నామినేష‌న్స్ టాస్క్ ని బిగ్‌బాస్ ప్రారంభించాడు. ముందుగా రంగంలోకి దిగిన శివ.. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ దిష్టిబొమ్మ‌పై కుండ‌ని బోర్లించి ప‌గ‌ల‌గొట్టేశాడు. ఈ స‌మ‌యంలోఒ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నేను కెప్టెన్ గా వున్న‌ప్పుడు మీద‌మీద‌కొచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకోసారి మీద మీద‌కొచ్చి మాట్లాడ‌కూడ‌ద‌ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు శివ‌. దీంతో త‌ను చెప్పిన రీజ‌న్ కు ఆగ్ర‌హించిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఓ రేంజ‌ప్ లో శివ‌కు క్లాస్ పీకాడు. నువ్వు కెప్టెన్ కాక‌పోతే ఏం చేసినా చెల్లుద్ది.. అంటూ సీరియ‌స్ అయ్యాడు. ఆ త‌రువాత లైన్ లోకి వ‌చ్చిన అఖిల్ .. అంతా అనుకున్న‌ట్టే శివ‌ని నామినేట్ చేయ‌డానికొచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రిగింది. సెకండ్ టైమ్ వ‌చ్చింది రిమార్క్ లు తీసుకోవ‌డానికి కాదు అంటూ అఖిల్ రెచ్చిపోయాడు.. `అస‌లు నామినేష‌న్స్ పాయింట్ లో అమ్మాయి బాత్రూమ్ టాపిక్ ఎత్త‌డ‌మే ..అంటూ శివ .. అఖిల్ ని రెచ్చ‌గొట్టాడు.. దీంతో అఖిల్ ..ఆగూ వ‌ద్దూ.. నాద‌గ్గ‌రొద్దూ అంటూ అరిచాడు. శివ కూడా తానేమీ త‌క్కువ కాదు అన్న‌ట్టుగా నాద‌గ్గ‌ర కూడా వ‌ద్దు అంటూ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో అఖిల్ సైలెంట్ అయిపోయాడు. ఇక అరియానా - న‌ట‌రాజ్‌.. అరియానా - హమీదాల మ‌ధ్య జరిగిన నామినేష‌న్స్ ఓ రేంజ్ లో హౌస్ ని హీటెక్కించేసింది. 

రాగ‌సుధ సీడీ రాధాకృష్ణ చేతికి.. ఏం జ‌ర‌గ‌నుంది?

మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌ఠేరే`. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో నిర్మించిన సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్‌, వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, మ‌ధుశ్రీ‌, అనూషా సంతోష్‌, కావ్య‌శ్రీ‌, సందీప్‌, రాజీవ్ చంద్ర‌, శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఏ మలుపు తిర‌గ‌నుందో ఓ సారి చూద్దాం. రాగ‌సుధ తన అక్క చావు ర‌హ‌స్యం కోసం వెతుకుతున్న సీడీ అనుకి దొరుకుతుంది. అయితే అది చూడాల‌ని ప్లాన్ చేసుకున్న అను, ఆర్య వ‌ర్థ‌న్  జంట మాన్సీ కార‌ణంగా చూడ‌లేక‌పోతారు. ఆ త‌రువాత రోజు ఆఫీస్ కు వెళ్లిన అను ఆ సీడీని కావాల‌నే డ‌స్ట్ బీన్ లో ప‌డేస్తుంది. అది కాస్తా అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న రాధాకృష్ణకు దొరుకుతుంది. దాన్ని ల్యాప్ టాప్ లో వేసి ఆడియో అందులో రాజ‌నందిని వ‌ద్దు ఆర్య అంటూ అరుస్తున్న అరుపులు వింటాడు. వెంట‌నే ఆర్య క్యాబిన్ కి వెళ్లి అక్క‌డ ఎవ‌రున్నారో కూడా గ‌మ‌నించ‌కుండా ఆర్య వ‌ర్థ‌న్ మ‌నిషే కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు.. ఆర్య వ‌ర్థ‌న్ ఏ మాత్రం జాలీ, ద‌యా లేకుండా ఓ ఆడ‌దాన్ని దారుణంగా చంపేసిన శాడిస్టు అని రంకెలేస్తాడు. ఇదంతా ఆర్య ప‌క్క‌నే వుండి వింటున్న అను షాకవుతుంది. ఆర్య కు ఏం జ‌రుగుతోందో అర్థం కాదు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  రాధాకృష్ణ‌కు ఆర్య వ‌ర్థ‌న్ - జెండే ఎలాంటి స‌న్మానం ఏర్పాటు చేశారు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

హ్యంగోవ‌ర్ లో వేద‌.. ఆడుకుంటున్న య‌ష్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్ తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మంచి ఆద‌ర‌ణ‌తో సాగుతోంది. వేద పేరెంట్స్ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ కి స‌ర్ ప్రైజ్ ఇవ్వాల‌నుకున్న య‌ష్ ప్లాన్ బెడిసికొడుతుంది. వేద తండ్రికి మందు బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చి త‌న దృష్టిలో మంచి అల్లుడు అనిపించుకోవాల‌ని ప్లాన్ చేస్తాడు. అయితే అది కాస్తా బెడిసికొట్టి వేద ఆ బాటిలో వున్న మందు తాగేసి ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. మైకం క‌మ్మ‌డంతో త‌ల్లి సులోచ‌న‌తో పాటు ఆత్త మాల‌బార్ మాళినితోనూ హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తుంది. దీంతో వేద‌ని బాత్రూమ్ కి తీసుకెళ్లి ష‌వ‌ర్ కింద నిల‌బెడతాడు య‌ష్ .. క‌ట్ చేస్తే ఈ విస‌యంలో య‌ష్ ని అత‌ని త‌మ్ముడు ఆనంద్ నిల‌దీస్తాడు. ఎంతో డిగ్నిటిగా వుండే వ‌దిన నీ వ‌ల్ల ఈ రోజు ఇలా అంద‌రి ముందు అవ‌మాన ప‌డింద‌ని, నువ్వు మందు క‌లిపి ఇవ్వ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు. ఈ మాట‌లు విన్న వేద ఆగ్ర‌హంతో ఊగిపోతుంది. ఎంత త‌ప్పుచేశాన‌ని కుమిలిపోతూనే య‌ష్ చేసిన ప‌నికి అత‌నికి బుద్ధి చెప్పాల‌ని వెంట‌నే బాత్రూమ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి య‌ష్ చెంప ప‌గ‌ల‌గొడుతుంది. దీంతో య‌ష్ అహం దెబ్బ‌తింగుంది. ఇంత వ‌ర‌కు త‌న‌ని ఎవ‌రు ఇలా కొట్ట‌లేద‌ని, త‌న‌ని ఇలా కొట్టిన ఫ‌స్ట్ అండ్ లాస్ట్ ఉమెన్ నువ్వేన‌ని ర‌గిలిపోతాడు. మ‌త్తులో వున్న వేద వెళ్లి ప‌డుకుంటుంది. తెల్లారినా లేవ‌క‌పోవ‌డంతో య‌ష్ టెడ్డీ బేర్ తో వేద‌ని కొట్టి లేస్తుందోమోన‌ని దాక్కుంటాడు. వేద లేవ‌గానే ఏమీ తెలియ‌న‌ట్టే గ‌దిలోకి వ‌చ్చి షెల్ఫ్ ఓపెన్ చేసి ఏదో వెతికిన‌ట్టుగా చూస్తుంటాడు. వేద న‌న్ను ఎవ‌రు కొట్టారు .. అబ్బా త‌ల‌ప‌గిలిపోతోంది అంటూ అరుస్తుంది. దీంతో నిమ్మ‌ర‌సం తాగు దిగుతుంది అని చెబుతాడు య‌ష్‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సుమ `క్యాష్` షో లో పృథ్వీ ర‌చ్చ ర‌చ్చ‌

యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్యాష్ షో ఈటీవీలో పాపుల‌ర్ షోగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ వారం తాజాగా ఎపిసోడ్ ముగ్గురు హీరోలు, ఓ హీరోయిన్ ఈ షోలో ర‌చ్చ ర‌చ్చ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఏప్రిల్ 30న రాత్రి 9:30 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సారం కానుంది. ఈ వారం గ‌తంలో హీరోలుగా ఓ వెలుగు వెలిగిన `పెళ్లి` ఫేమ్‌ పృథ్వీ, `6టీన్స్‌` ఫేమ్‌ రోహిత్, సీతారాముల కల్యాణం చూత‌మురారండి` ఫేమ్  వెంక‌ట్‌, హీరోయిన్ ప్రేమ అతిథులుగా హాజ‌ర‌య్యారు.   ఈ నలుగురు క్యాష్ షోలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. వెంక‌ట్‌, రోహిత్‌, ప్రేమ‌ల‌ని మించి పృథ్వీ చేసిన ర‌చ్చ న‌వ్వులు పూయిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో ప్రేమ‌ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. సుమ ఈ న‌లుగురికి చిన్న టాస్క్ ఇచ్చింది. సినిమాలో హీరోయిన్ ప్రేమ కూర‌గాయ‌లు కోస్తుంటే వేలు తెగుతుంది. అప్పుడు హీరో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది టాస్క్‌. ముందు వెంక‌ట్ ని రంగంలోకి దించేస్తుంది సుమ.. చాలా రోజుల త‌రువాత హీరోయిన్ క‌నిపించ‌డంతో వెంక‌ట్ ఓ రేంజ్ లో సీన్ ని రొమాంటిక్ గా ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ద‌శ‌లో ప్రేమ వేలుని నోట్లో పెట్టుకుని జుర్రేశాడు. ఇక హార‌ర్ క‌థ అయితే అని సుమ అన‌గానే పృథ్వీ ఎంట్రి ఇచ్చాడు. దెయ్యంలా ప్ర‌వ‌ర్తిస్తూ ప్రేమ‌ని భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అదే ఫ్యాక్ష‌న్ సినిమా అయితే అంటూ సుమ అన‌డంతో సీన్‌లోకి రోహిత్ వ్చేశాడు. ప్రేమ వేలు తెగింద‌ని బాధ‌ప‌డుతుంటే ఆ వేలు ర‌క్తంతో తిల‌కం దిద్దుకున్న‌ట్టుగా రోహిత్ న‌టించి షాకిచ్చాడు. ఆ త‌రువాత పృథ్వీకి స‌ర‌దాగా కొన్ని ప్ర‌శ్న‌లు అడిగింది సుమ‌. వెంట‌నే రెడీ అయిపోయి ట‌క ట‌క స‌మాధానాలు చెప్పేశాడు. వెంక‌టేష్‌, నాగార్జు ఇద్ద‌రిలో ఎవ‌రికి కో స్టార్ గా న‌టించ‌డం ఇష్టం అని అడిగితే నాగార్జున అని చెప్పేశాడు. అంతే కాకుండా నేనే నాగార్జున‌ని ల‌వ్ చేశాన‌ని, త‌ను అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేవాడిన‌ని షాకిచ్చాడు.   ఆ త‌రువాత త‌న జీవితంలో జ‌రిగిన ఓ విషాద‌క‌ర సంఘ‌ట‌న‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నాడు పృథ్వీ. న‌టుడిగా బిజీగా వున్న స‌మ‌యంలో త‌న‌కు బాబు పుట్టాడ‌ని, ఒక రోజు త‌న‌కి బాగాలేకుంటే హాస్పిట‌ల్ కు తీసుకెళితే పిల్లాడి మెంట‌ల్ కండీష‌న్ బాగాలేద‌న్నారుని అది విన్న త‌రువాత ఈ సినిమాలు, డ‌బ్బు, అవార్డులు ఎందుక‌నిపించింద‌ని, ఆ త‌రువాత కొన్ని రోజుల పాటు డిప్రెష‌న్ కు లోన‌య్యాన‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు పృథ్వీ. ఈ ఎపిసోడ్ ఏప్రిల్ 30న రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.  

అషురెడ్డి పిచ్చిది.. అఖిల్ కు అజ‌య్ స‌ల‌హా

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో ఊహించిన‌ట్టుగానే అజ‌య్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ముమైత్ ఖాన్ నుంచి అజ‌య్ వ‌ర‌కు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. అజ‌య్ ఎలిమినేట్ అని తేల‌డంతో అషురెడ్డి ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. వున్న‌చోటే కుప్ప‌కూలిపోయింది. అజ‌య్ ని ప‌ట్టుకుని బోరున ఏడ్చేసింది. ఇక ఎలిమినేట్ అయిన త‌రువాత స్టేజ్ పైకి వెళ్లిపోయిన అజ‌య్ ఇంటి స‌భ్యుల‌కు ఒక్కొక్క‌రికి ఒక్కొ సింబ‌ల్ ఇచ్చేశాడు. బ్రోకెట్ హార్ట్‌..ఫుల్ హార్ట్ ల‌ని ఇచ్చేశాడు. అఖిల్‌, అషురెడ్డి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్, మిత్రా, బిందుల‌కు ఫుల్ హార్ట్ ఇచ్చేశాడు. ఇక మిగ‌తా వాళ్ల‌కు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. అఖిల్ త‌న‌కు వెన్నుపోటు పొడిచినా అజ‌య్ మాత్రం త‌న‌కు ఫుల్ హార్ట్ ఇచ్చేశాడు. అంతే కాకుండా స్ట్రాంగ్ గా వుండు.. అంటూ జాగ్ర‌త్త‌లు చెప్పాడు. ఇంకా అషు రెడ్డిని చూసుకోమ‌ని, త‌ను కొంచెం పిచ్చిద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌తో ఎలా ప‌రిచ‌యం మొద‌లైందో వివ‌రించాడు. ఇదే సంద‌ర్భంగా అషురెడ్డిని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఇంటి స‌భ్యుల గురించి మాట్లాడ‌టం మొద‌లుపెట్టాడు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు కోపం, ప్రేమ స‌మానంగా వుంటాయ‌న్నాడు. మిత్రా గురించి మాట్లాడిన అజ‌య్ .. బిందు గురించి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. త‌ను ఎవ‌రు ఏమి అనుకున్నా ప‌ట్టించుకోద‌ని.. కానీ నేను అంటే మాత్రం ప‌ట్టించుకుంటుంద‌ని. డ్రామా త‌గ్గించుకుంటే మంచిద‌ని స‌ల‌హా ఇచ్చాడు.   ఇక బ్రోకెన్ హార్ట్ సింబ‌ల్స్ ని అరియానా, అనిల్ , హ‌మీద‌, శివ‌, బాబా భాస్క‌ర్ ల‌కు ఇచ్చాడు. అరియానా ఫ‌స్ట్ బాగానే వుంది.. కానీ ఎమోష‌న‌ల్ గా వీక‌వుతోంద‌ని త‌ను స్ట్రాంగ్ గా వుండాల‌న్నాడు.. ఇక హ‌మీదా గురించి మాట్లాడుతూ షుగ‌ర్ తిను అంటూ కౌంట‌ర్ వేశాడు. చివ‌ర్లో బాబా భాస్క‌ర్ గురించి ఓపెన్ అయ్యాడు. మీరు సూపర్ ప‌వ‌ర్ ని నా కోసం వాడి వుంటే నేను ఇక్క‌డ వుండేవాడిని కాదంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు.  దీంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అజ‌య్ జ‌ర్నీ ముగిసింది.   

బ్యాంకాక్‌లో త‌ల్లీ కూతుళ్ల హంగామా

వెండితెర‌పై సంద‌డి చేసే సురేఖా వాణి త‌న కూతురు సుప్రీత‌తో క‌లిసి సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తుంటారు. స‌క్ష‌స‌ల్ మీడియాలో వ‌రుస‌గా పోస్ట్ లు పెడుతూ సంద‌డి చేస్తుంటారు. బ‌ర్త్ డే పార్టీలు.. స్పెష‌ల్ అకేష‌న్ ల‌క సంబంధించిన వీడియోలు, ఫొటోల‌తో అభిమానుల‌ని అల‌రిస్తుంటారు. గ‌త రెండేళ్లుగా ఎలాంటి వెకేష‌న్ ల‌కు వెళ్ల‌ని ఈ ఇద్ద‌రు త‌ల్లీ కూతుళ్లు తాజాగా బ్యాంకాక్ కు వెకేష‌న్ కు వెళ్లారు. క‌రోనా కార‌ణంగా బ‌య‌టి దేశాల‌కు వెళ్ల‌డానికి కాస్త ఇబ్బంద‌ప‌డిన సురేఖా వాణి, సుప్రీత బ్యాంకాక్ కు వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు వెల్ల‌డించారు. బ్యాంకాక్ తో పాటు థాయ్ లాండ్ లోనూ సంద‌డి చేయ‌బోతున్నారీ త‌ల్లీ కూతుళ్లు. అక్క‌డి వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతూ స్పాలో ధాయ్ మ‌సాజ్ చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని సురేఖా వాణి కూతురు సుప్రీత సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట సంద‌గ‌డి చేస్తున్నాయి. థాయ్ లో సుప్రీత థాయ్ మ‌సాజ్ చేయించుకుంటున్న ఫొటోల‌ని కూడా పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్ లు కామెంట్ ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఫ్లైట్ లో త‌ల్లీ కూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందు గ్లాసుల‌తో చీర్స్ చెబుతూ ఇద్ద‌రూ క‌నిపించారు. ఆ ఫొటోల‌ని కూడా అభిమానుల‌తో పంచుకున్నారు. రెండేళ్లుగా విదేశాల‌కు వెళ్ల‌ని ఈ త‌ల్లీ కూతుళ్లు ఈ ట్రిప్ ని మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌ల గోవాలో సంద‌డి చేసిన త‌ల్లీ కూతుళ్లు ఇప్ప‌డు బ్యాంకాక్, థాయ్ లాండ్ ల‌లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండ‌టం విశేషం. ఇటీవ‌ల ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్ కు సంబంధించిన సాంగ్ ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్రేమికుడు, పెళ్లి అంటూ ప‌బ్లి సిటీ స్టంట్ చేసి సురేఖా వాణి కూతురు సుప్ర‌తీ వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

సొంతూరి క‌ష్టం తీర్చిన బిగ్ బాస్ గంగ‌వ్వ

గంగ‌వ్వ త‌న‌దైన యాస‌తో మై  విలేజ్ షో, బిగ్‌బాస్ షోల‌తో పాపుల‌ర్ గా మారిన విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ షో త‌రువాత త‌న సొంత ఇంటి క‌ల‌ని నిజం చేసుకున్న గంగ‌వ్వ త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తోంది. త‌న యాస‌తో, కామెడీ టైమింగ్ తో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ స్టార్ గా మారిన గంగ‌వ్వ ఇప్ప‌డు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. బిగ్ బాస్ నాలుగ‌వ‌ సీన్ త‌రువాత ఇంటి నిర్మాణ ప‌నుల్లో బిజీగా వుండిపోయిన గంగ‌వ్వ టీవీ షో ల్లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అయితే తాజాగా సొంత గ్రామం కోసం చేసిన ప‌నికి మ‌రోసారి గంగ‌వ్వ వార్త‌ల్లో నిలిచింది. ఇటీవ‌లే సొంతింటి క‌ల‌ని నిజం చేసుకున్న గంగ‌వ్వ తన సొంత గ్రామానికి బ‌స్సు స‌ర్వీసును పున‌రుద్ధ‌రించి రెండేళ్లుగా త‌న గ్రామ వాసులు ప‌డుతున్న క‌ష్టాల‌ని పోగొట్టింది. వివ‌రాల్లోకి వెళితే... గంగ‌వ్వ‌ది తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా మ‌ల్యాల మండ‌లంలోని లంబాడిప‌ల్లి గ్రామం. ఈ గ్రామానికి ఈ గ్రామ జ‌నాభా రెండు వేలు పైనే. ఈ గ్రామానికి బ‌స్సు స‌ర్వీసు వుండేది. క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా బ‌స్సు స‌ర్వీసును ఆర్టీసీ నిలిపివేసింది. దీంతో గ్రామ‌స్తులు గ‌త రెండేళ్లుగా జిల్తా కేంద్రానికి వెళ్ల‌డానికి నానా యాత‌న ప‌డుతున్నారు. విద్యార్థుల‌తో పాటు గ్రామంలోని అన్ని వ‌ర్గాల వారు బ‌స్సు సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్ల‌డానికి ప్రైవేట్ వాహ‌నాల‌ని ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది. దీంతో గ్రామ‌స్తులంతా మళ్లీ బ‌స్సు స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని గంగ‌వ్వ స‌హ‌యం కోరారు. ఇందుకు ముందుకొచ్చిన గంగ‌వ్వ గ్రామ పెద్ద‌ల‌తో క‌లిసి ఆర్టీసీ అధికారుల్ని సంప్ర‌దించింది. గంగవ్వ అభ్య‌ర్థ‌న‌తో క‌దిలిన ఆర్టీసీ యంత్రాంగం లంబాడిప‌ల్లికి బ‌స్సు స‌ర్వీసును తిరిగి పున‌రుద్ధ‌రించారు. ప్ర‌స్తుతం ఈ గ్రామానికి జ‌గిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఊదు ట్రిప్పులుగా ఆర్టీసి సేవ‌లు అందిస్తోంది. లంబాడీప‌ల్లికి తిరిగి బ‌స్సు రావ‌డంతో గ్రామ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

అజ‌య్ ఎలిమినేట్‌.. న‌మ్మినోడే ముంచేశాడు

న‌మ్మిన‌వాడే న‌ట్టేట ముంచేస్తాడ‌ని అఖిల్ నిరూపించాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అత‌ని కార‌ణంగా మ‌రో వికెట్ ప‌డింది. మ‌హేష్ విట్టా, స్ర‌వంతి, ముమైత్ ఖాన్‌, తేజ‌స్వీ, స‌ర‌యు, ఆర్జే చైతు, శ్రీ‌రాపాక‌. ఇక రెండ‌వ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ వ‌రుస‌గా నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురు ఎలిమినేట్ అయిన త‌రువాత హౌస్ లో మొత్తం వున్న స‌భ్యులు 10 మంది. వీరికి ఝ‌ల‌క్ ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ బాబా భాస్క‌ర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. హౌస్ లోకి త‌న ఎంట్రీతో ఒక్క‌సారిగా అంద‌రి గేమ్ మారిపోయింది. ఓ భ‌యం మొద‌లైంది. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వ‌చ్చేసిన బాబా భాస్క‌ర్ వ‌చ్చీ రాగానే నామినేష‌న్స్ లో వున్న లేడీ అర్జున్ రెడ్డి` బిందు మాధ‌విని సేవ్ చేశాడు. దీంతో ఇంటి స‌భ్యులు అంతా షాక్ కు గుర‌య్యారు. ఏంటీ ఏం జ‌ర‌గ‌బోతోంది.. గేమ్ ఎలాంటి ట‌ర్న్ తీసుకోబోతోంద‌ని ఆలోచ‌న‌లో పడ్డారు. బిందు మాధ‌విని నామినేష‌న్స్ నుంచి త‌ప్పించ‌డంతో నామినేష‌న్స్ లో అఖిల్‌, అజ‌య్ , అషురెడ్డి, హ‌మీదా వుండిపోయారు. ప్ర‌తీ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై ముందు స‌స్పన్స్ వుండేది. కానీ మ‌హేష్ విట్టా అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్ట‌డంతో బిగ్ బాస్ కు ఎవ‌రు న‌చ్చ‌క‌పోతే వారినే నామినేట్ చేస్తాడ‌ని స్ప‌ష్ట‌మైంది.   అంతే కాకుండా ఎలిమినేష‌న్స్ అనేవి ఓటింగ్ ప్ర‌కారం జ‌ర‌గ‌డం లేద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరింది. అయితే ఈ వారంలో ఒకే గ్రూప్ స‌భ్యులు అఖిల్, అషురెడ్డి, అజ‌య్ నామినేష‌న్స్ లో వున్నారో ఖ‌చ్చితంగా ఈ గ్రూప్ నుంచే అ వారం ఎలిమినేష‌న్ వుంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.  ఇందులో అజ‌య్ ఎలిమినేట్ అవుతాడ‌ని స్పష్టం అవుతోంది. కార‌ణం అత‌న్ని అఖిల్ ప‌క్క‌న పెట్ట‌డ‌మే. గ‌త కొంత కాలంగా అఖిల్ కార‌ణంగా అజ‌య్ సేవ్ అవుతూ వ‌స్తున్నాడు. అత‌నికి ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు.. ఇటీవ‌ల క‌నెక్ట్ కావ‌డంలేద‌ని అఖిల్ .. అజ‌య్ ని ప‌క్క‌న పెట్టేశాడు. దీంతో అత‌ని ఓటింగ్ శాతం క్ర‌మంగా త‌గ్గిపోయింది. బిందు మాధ‌విని ఎప్పుడైతే బాబా భాస్క‌ర్ ఎంట్రీ ఇచ్చి సేఫ్ చేశాడో అప్పుడే అఖిల్ కి బ‌య‌టి ప‌రిస్థితి తెలిసిపోయింది. గ్రూప్ గా గేమ్ ఆడి వేష్ట‌ని తెలుసుకున్న అఖిల్ .. వెంట‌నే అజ‌య్ ని ప‌క్క‌న పెట్ట‌డంతో అజ‌య్ ఈ వారం ఎలిమినేట్ కావ‌డం గ్యారెంటీ అని తెలిసిపోయింది. అఖిల్ వున్న ఫ‌లంగా అజ‌య్ కి వెన్నె పోటు పొడ‌వ‌డంతో అజ‌య్ ఎలిమినేష‌న్ దాదాపుగా ఖ‌రారైపోయింది.

'జ‌బ‌ర్ద‌స్త్'లోకి రోజా రీఎంట్రీ ఇచ్చారా?

'జ‌బ‌ర్ద‌స్త్' కామెడీ షోకు గ‌త కొంత కాలంగా మ‌నోతో క‌లిసి రోజా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఆమెకు ఏపీ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌డంతో `జ‌బ‌ర్ద‌స్త్‌` కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. చాన్నాళ్లుగా టీమ్ తో కొన‌సాగుతూ అనుబంధం ఏర్ప‌డ‌టంతో చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు కూడా. అయితే ఈ స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్ కూడా రోజాను ప్ర‌త్యేకంగా స‌త్క‌రించి టీమ్ మెంబ‌ర్స్ తో వీడ్కోలు చెప్పించింది. క‌ట్ చేస్తే.. తాజా ప్రోమోలో రోజా టీమ్ మెంబ‌ర్స్ పై పంచ్ లు వేస్తూ న‌వ్వులు పూయించ‌డం ఇప్ప‌డు ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి రోజా త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలోకి ఇంద్ర‌జ వచ్చి చేరింది. కానీ తాజా ప్రోమోలో ఇంద్ర‌జ క‌నిపించ‌కుండా రోజానే క‌నిపించ‌డం ఏంట‌ని, రోజా అలా వెళ్లి మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చేసిందా అని ఆరా తీస్తున్నారు. వ‌చ్చే వారం అంటే ఈ నెల 28న  రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.   అయితే కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసిన ప్రోమోలో మ‌నో తో క‌లిసి రోజా జ‌బ‌ర్ద‌స్త్ షోలో సంద‌డి చేస్తూ క‌నిపించారు. జ‌డ్జి సీట్ లో రోజా ఎప్ప‌టిలాగే క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేశారు. ఎప్ప‌టి లాగే టీమ్ మెంబ‌ర్స్ పై పంచ్ లు వేస్తూ న‌వ్వులు పూయించారు. రాకెట్ రాఘ‌వ‌, తాగుబోతు ర‌మేష్ లు చేసిన స్క‌ట్ ల‌పై రోజా పంచ్ లు వేశారు. ఓ ద‌శ‌లో కామెడీ కావాలంటూ రోజా వేసిన పంచ్ ల‌కు టీమ్ మెంబ‌ర్స్ బిక్క మొహం వేశారు. అయితే తాజా ప్రోమో రోజా `జ‌బ‌ర్ద‌స్త్ ` కి గుడ్ బై చెప్ప‌డానికి ముందు షూట్ చేసింద‌ని, ఇదే చివ‌రి ఎపిసోడ్ అని చెబుతున్నారు. రోజా అదిర‌పోయే పంచ్ ల‌తో న‌వ్విస్తున్న తాజా ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

ప్రేమ ఎక్క‌డైనా పుట్టొచ్చు - అషురెడ్డి

బిగ్‌బాస్ ఓటీటీ లో బోల్డ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అషురెడ్డి ఏ ఒక్క ఛాన్స్ ల‌భించినా దాన్ని వాడేస్తోంది. ఓటీటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌రి నుంచి అఖిల్ బ్యాచ్ తో మింగిల్ అయిపోయిన ఈ యూట్యూబ్ స్టార్ గేమ్ మాత్రం ఆడ‌కండా అఖిల్ స‌హాయంతో నెట్టుకొచ్చేస్తోంది. ఇటీవ‌ల అఖిల్ కార‌ణంగానే సునాయ‌సంగా కెప్టెన్ అనిపించుకున్న అషు రెడ్డి హౌస్ లోకి రావ‌డానికి ముందు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇందులో త‌న‌కు కాబోయే వాడు ఎలా వుండాలి? . త‌న‌కు ఎలాంటి క్వాలిటీస్ వుండాలో చెప్పేసింది. అయితే హౌస్ లో మాత్రం బిగ్ బాస్ .. అఖిల్ కి అషుకి మ‌ధ్య దూరం త‌గ్గించేసి ఇద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ మొద‌ల‌య్యింద‌నేలా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. కానీ పెద్ద‌గా అది వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే బిగ్ బాస్ లో బాయ్ ఫ్రెండ్ ని వెతు్కోవ‌డం కోస‌మే అడుగుపెట్టాన‌ని చెప్పేసింది అషురెడ్డి. అయితే పెళ్లి మాత్రం ఇప్ప‌ట్లో చేసుకునే ఉద్దేశ్యం త‌న‌కు లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది. త‌న‌కు కాబోయే వాడిలో ఫైవ్ క్లాలిటీస్ వుండాల‌ని లిస్ట్ చెప్పింది. త‌న‌కు డ్రైవింగ్ వ‌చ్చి వుండాలంది. అదేంటీ డ్రైవ‌ర్ ని పెళ్లాడ‌తావా? అంటూ ఏ డ్రైవ‌ర్ ని పెళ్లి చేసుకోకూడ‌దా? .. ప్రేమ ఎప్పుడైనా ఎక్క‌డైనా పుట్టొచ్చు అంటూ రివ‌ర్స్ కౌంట‌ర్ వేసింది. తాను కోరుకునే క్వాలిటీస్ వున్న అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లో ప‌రిచ‌యం అయితే దాన్ని ల‌వ్ గా అంగీక‌రించ‌ను. బ‌య‌టికి వ‌చ్చాక కూడా త‌ను ల‌వ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా..నాకు న‌చ్చితే అమ్మ‌కు చెప్పి పెళ్లి చేసుకుంటా` అంటూ షాకిచ్చింది అషురెడ్డి.   

య‌ష్ అత్యుత్సాహం.. చెంప ప‌గ‌ల‌గొట్టిన వేద‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పిల‌క‌ల‌లు పుట్ట‌ర‌ని పెళ్లికి దూర‌మైన ఓ యువ‌తి.. త‌ల్లి దూర‌మైన ఓ పాప‌.. ఆ పాప కోసం మ‌రో పిల్ల‌లే పుట్ట‌ని యువ‌తిని పెళ్లాడిన యువ‌కుడు.. ఈ ముగ్గురి అనుబంధం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్నివారాలుగా విజ‌య‌వంగంతా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా కీల‌క మ‌లుపులు తిరుగుతూ మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, అనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శుక్ర‌వారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. ఆఫీసులో వున్న య‌ష్ .. వేద తండ్రి వ‌ర‌ద‌రాజులుకు ఫోన్ చేసి అత్త‌య్య గ్రీటింగ్స్ చెప్పేదాకా చెప్పొద్ద‌ని రెచ్చ‌గొట్టేస్తుంటాడు. ప‌క్క‌నే వున్న వేద ఇదంతా స్పీక‌ర్ ఆన్ చేసి వింటుంది. ప‌క్క‌కు వెళ్లి య‌ష్ ని నిల‌దీస్తుంది. వేద లైన్ లోకి వ‌చ్చేసింద‌ని గ్ర‌హించిన  య‌ష్ రోమాంటిక్ గా మాట్లాడుతూ వేద‌ని డైవ‌ర్ట్ చేయాల‌ని ఫోన్ లోనే కిస్ ఇస్తాడు. క‌ట్ చేస్తే వేద పేరెంట్స్ మ్యారేజ్ యానివ‌ర్స‌రీని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఇదే అద‌నుగా య‌ష్ అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. త‌న మామ‌కు మందు బాటిల్ ని గిఫ్ట్ గా ఇచ్చేసి కూల్ చేసి త‌న వైపు తిప్పుకోవాల‌ని ప్లాన్ చేస్తాడు. థ‌మ్స్ అప్ బాటిల్ లో మందు క‌లిపి తాగించాల‌ని చూస్తాడు. అదే టైమ్ లో వేరే వాళ్లు రావ‌డంతో ఆ బాటిల్ అక్క‌డే వుంటుంది. దాహం గా వుంద‌ని బాటిల్ కోసం వెతుకుతున్న వేద మందు క‌లిపిన థ‌మ్స్ అప్ ని తాగేస్తుంది. ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. చివ‌రికి ఇది య‌ష్ చేసిన ప‌ని అని తెలియ‌డంతో చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్.. మందేసి చిందేసిన వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సార‌మ‌వుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కొత్త‌గా మొద‌లైన ఈ సీరియల్ వారాలు గ‌డిచే కొద్దీ వీవ‌ర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. అమ్మా - నాన్నా - ఓ పాప క‌థ అనే కాన్సెప్ట్ తో ఈ ముగ్గురి మ‌ధ్య పెన‌వేసిన బంధం క‌థ‌గా ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగూతూ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక న‌టించారు. వేద పేరెంట్స్ సులోచ‌న - వ‌ర‌ద‌రాజుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ. అయితే ఇందు కోసం మ‌ల్లెపూలు తీసుకొచ్చిన వ‌ర‌ద‌రాజులు ఈ విష‌యాన్ని య‌ష్ కు చెప్ప‌డం.. మీరు ఎక్క‌డ త‌గ్గొద్ద‌ని త‌న‌ని రెచ్చ‌గొడ్డంతో సులోచ‌న‌కు విషెస్ చెప్ప‌కుండా బెట్టుని ప్ర‌ద‌ర్శిస్తాడు వ‌ర‌ద‌రాజులు. త‌ను కూడా త‌క్కువ తిన్నానా ఏంటీ అనే రేంజ్ లో వ‌ర‌ద‌రాజులుతో ఆడుకుంటుంది. క‌ట్ చేస్తే ఇదంతా త‌న‌తో పాటు య‌ష్ వ‌ల్ల జ‌రిగింద‌ని గ‌మ‌నించిన వేద చివ‌రికి ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌లిపేస్తుంది. ఇదే స‌మయంలో సులోచ‌న - వ‌ర‌ద‌రాజుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ ని ప్లాన్ చేస్తారు. ఈ సంద‌ర్భంగా య‌ష్ త‌న గిఫ్ట్ గా మామ వ‌ర‌ద‌రాజులుకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాన్ని కూల్ డ్రింక్ లో క‌లిపి వ‌ర‌ద‌రాజులు కోసం రెడీ చేస్తారు. అయితే పొర‌పాటున ఆ డ్రింక్ ని వేద తాగేస్తుంది. దీంతో య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్  అవుతుంది. ఇక ర‌చ్చ మొద‌ల‌వుతుంది. య‌ష్ కి చుక్క‌లు చూపిస్తుంది. మ‌గాళ్లు వ‌ట్టి మాయ‌గాళ్లే .. అంటూ వీడుకూడ ఇంతే అని య‌ష్ పై వీరంగం వేస్తుంది. ఈ క్ర‌మంలో వేద ని చూసిన కొంత మంది గెస్ట్ లు అవ‌మాన‌క‌రంగా మాట్లాడ‌తారు. ఆ స‌మ‌యంలో య‌ష్ ఎలా రియాక్ట్ అయ్యాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

`కార్తీక‌దీపం`ని క్యాష్ చేసుకునే ప‌నిలో `వంట‌ల‌క్క‌`

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక‌దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగి ఈ సీరియ‌ల్ వంట‌ల‌క్క కార‌ణంగా టాప్‌లోకి వెళ్లి పాపుల‌ర్ అయింది. అంతే కాకుండా `కార్తీక‌దీపం` టైటిల్ ఎంత పాపుల‌ర్ అయిందో `వంట‌ల‌క్క‌` పేరు కూడా అంతే పాపుల‌ర్ అయింది. దీంతో ఇదే పేరుని త‌మ త‌దుప‌రి సీరియ‌ల్ కి వాడేసుకుంటూ కొత్త సీరియ‌ల్ ని ప్రారంభించ‌బోతున్నారు `కార్తీక‌దీపం` నిర్మాత గుత్తా వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈ సీరియ‌ల్ కూడా స్టార్ మా లో ప్ర‌సారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. అత్యాశ‌కు మంచి త‌నానికి మంచిత‌నం అవ‌కాశంగా మార‌నుందా? అంటూ తాజాగా `వంట‌ల‌క్క‌` ప్రోమోని విడుద‌ల చేశారు. ఓ ఇంటికి లైటింగ్ చేసుకునే ఓ యువ‌కుడు అదే ఇంటి య‌జ‌మాని కూతురిని న‌మ్మించి బుట్ట‌లో వేస్తాడు.. డ‌బ్బు, ఆస్తీ, హోదా కోసం త‌న ట్రాప్ లో ప‌డిన‌ ఆ అమ్మాయి ఎలా వంట‌ల‌క్క‌గా మారింది?.. లేక వంట‌ల‌క్క‌కు, ఈ సీరియ‌ల్ కు ఏదైనా సంబంధం వుందా? అన్న‌ది తెలియాలంటే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ సీరియ‌ల్ చూడాల్సిందే. అత్య‌ధిక భాగం త‌మిళ న‌టులు న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ `వంట‌ల‌క్క‌` పేరుని ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలి. ఈ సీరియ‌ల్ ప్రోమోని `కార్తిక‌దీపం` ఫేమ్ శోభాశెట్టి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. అమాయ‌కురాలైన వ‌ర‌ల‌క్ష్మీకి.. డ‌బ్బు కోసం లైటింగ్ లు సెట్ చేసే యువ‌కుడికి మ‌ధ్య ఎలా ప్రేమ క‌థ పుట్టింది. అది ఆమె జీవితాన్ని ఏ మ‌లుపు తిప్పింది అన్న‌ది తెలియాలంటే ఈ సీరియ‌ల్ చూడాల్సిందే. త‌మిళ న‌టుడు ధీర‌వం రాజ్ కుమార‌న్ హీరోగా, శిరీన్ శ్రీ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళ న‌టుడు నీళ‌ల్ గ‌ళ్ ర‌వి త‌దిత‌రులు క‌నిపించ‌నున్నారు.

బాబా భాస్క‌ర్ ఎంట్రీ.. నువ్వు బిగ్ బాసా..? అరియానా ఫైర్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి బాబా భాస్క‌ర్ మాసీవ్ ఎంట్రీ ఇచ్చేశాడు. వ‌చ్చీ రాగానే కంటెస్టెంట్ ల‌ని స‌ర్ ప్రైజ్ పెరుతో టెన్ష‌న్ పెట్టాడు. గెస్ట్ లా వ‌చ్చాడ‌ని భావించిన ఇంటి స‌భ్యుల‌కు తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానంటూ దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. ఎంట్రీ ఇస్తూనే గేటు దూకి మ‌రీ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. ఇదేంటీ ఇలా వ‌చ్చాడ‌ని అంతా షాక్ కు గురైపోయారు. ఇత‌నేంటీ ఇలా ఎంట్రీ ఇచ్చాడ‌ని అంతా విస్తూ పోయారు. అయితే వారిని ఆట ఆడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న బాబా భాస్క‌ర్ త‌న‌కు బిగ్ బాస్ సూప‌ర్ ప‌వర్ ఇచ్చాడ‌ని, వీర లెవెల్లో బిల్డ‌ప్ ఇచ్చేశాడు. అప్ప‌టి వ‌ర‌కు వెలిగిపోయిన ఇంటి స‌భ్యులు ముఖాలు ఒక్క‌సారిగా మాడిపోయాయి. ఏం జ‌రుగుతోంది? .. బాబా భాస్క‌ర్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ... ఏంటీ అత‌ని గొప్ప అనే విధంగా అరియానా ఫీలైపోయింది.  'నామినేష‌న్స్ లో వున్న ఆరుగురు రండి' అంటూ ఏదో చేయ‌బోతున్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇచ్చాడు బాబా భాస్క‌ర్. 'ఏకాభిప్రాయం తీసుకుని చెప్పండి' అని అన‌గానే అరియానా అందుకు సిద్ధ‌మైంది. ఇంత‌లో టైమ్ వేస్ట‌వుతోంద‌ని మ‌రీ రెచ్చిపోయాడు బాబా భాస్క‌ర్‌. 'మీరు అలా అంటే ఏమీ చేయ‌లేము' అని అరియానా అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించింది. 'అయినా మీరెవ‌రు అడ‌గ‌డానికి?.. మీకు ఎందుకు చెప్పాలి?.. అలా అని బిగ్ బాస్ వాయిస్ వినిపించ‌మ‌ని చెప్పండి' అని గ‌ట్టిగానే నిల‌దీసింది అరియానా.. 'ఈయ‌న బిగ్ బాస్ రా చెప్ప‌డానికి.. గెస్ట్ గా వ‌స్తే ఏది చెప్ప‌మంటే అది చెప్పాలా?' అంటూ చిందులేసింది. వెంటనే 'స‌ర్‌ప్రైజ్‌ అని చెబుతున్నాను క‌దా?' అన్నాడు బాబా భాస్క‌ర్‌. ఇదంతా సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంటోంద‌ని గ‌మ‌నించిన బాబా భాస్క‌ర్ త‌నేంటో చెప్పేశాడు. త‌న వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి పంపించార‌ని చెప్పేశాడు. 'రెండు రోజుల్లో మీతో క‌లిసి పోతాను `అంటూ షాకిచ్చాడు. దీంతో హౌస్ లో వున్న వాళ్ల లెక్క‌ల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.

భార్య‌పై చేయెత్తిన అభిమ‌న్యు కు య‌ష్ దిమ్మ‌దిరిగే వార్నింగ్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇందులో నిరంజ‌న్‌, డిబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, మిన్ను నైనిక‌, ప్రణ‌య్ హ‌నుమండ్ల తదిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఖుషీ త‌న కూతురే అనే విష‌యాన్ని క్లియ‌ర్ చేసి డీఎన్ ఏ టెస్ట్ ద్వారా య‌ష్ క‌ళ్లు తెరిపిస్తుంది వేది. ఆ విష‌యం ఇంట్లో వాళ్లకి తెలియ‌డంతో ఒక్క‌సారిగా షాక‌వుతారు. ఇదే విష‌యంపై య‌ష్‌ని నిల‌దీస్తారు. నీలోప‌ల ఇంత బాధ‌పెట్టుకుని మాకు క‌నీసం చెప్ప‌లేక‌పోయావ్ అంటారు. ఇదే స‌మ‌యంలో వేద చేసిన ప‌నికి త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తారు. అభిమ‌న్యు చేసిన కుట్ర‌ని వేద తిప్పికొట్టి నీకు అండ‌గా నిల‌బ‌డింది. మేము ఈరోజు హాయిగా నిద్ర‌పోతున్నామంటే అందుకు కార‌ణం వేద‌. భ‌ర్త ప‌ట్ల ఎంత మ‌ర్యాద‌గా వుంటుందో మా ప‌ట్ల కూడా అంతే మ‌ర్యాద‌గా వుంటూ నీ గౌర‌వాన్ని కాపాడుతోంది. ఇలాంటి భార్య‌ని ఇచ్చి ఆ దేవుడు నీకు గొప్ప మేలు చేశాడంటుంది య‌ష్ త‌ల్లి మాలిని. క‌ట్ చేస్తే .. త‌న ప్లాన్ పార‌క‌పోవ‌డం, వేద తెలివిగా డీఎన్ ఏ టెస్ట్ చేసింది అభిమ‌న్యు కుట్ర‌ని భ‌గ్నం చేయ‌డంతో ర‌గిలిపోతుంటాడు. ఎలాగైనా య‌ష్ ని దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తూ అదే విషయాన్ని మాళ‌విక తో చెబుతుంటాడు. ఇదే స‌మ‌యంలో స‌డ‌న్ ఎంట్రీ ఇస్తుంది వేద‌. ఇలాంటి నీచ‌మైన బ్ర‌తుకు నీకు అవ‌స‌ర‌మా. ఇలాంటి నీచుడితో క‌లిసి వుండ‌టం అవ‌స‌ర‌మా అని మాళ‌విక‌ని నిల‌దీస్తుంది. దీంతో ఆగ్ర‌హించిన అభిమ‌న్యు ఆవేశంతో ఊగిపోతే వేద‌పై చేయిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.. ఇంత‌లో మ‌ధ్య‌లోకి ఎంట్రీ ఇచ్చిన య‌ష్ .. అభిమ‌న్యు చేయి ప‌ట్టుకుని ప‌క్క‌కు తోసేసి త‌న ధైర్యం వేద అని, త‌న భార్య జోలికి వ‌స్తే పాతేస్తాన‌ని అభిమ‌న్యుకు వార్నింగ్ ఇస్తాడు. క‌ట్ చేస్తే ...వేద త‌ల్లిదండ్రుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ జ‌రుగుతుంది. అందులో పొర‌పాటున మందు క‌లిపిన కూల్ డ్రింక్ దాగుతుంది వేద‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  వేద‌కు జ‌రిగిన అవ‌మానానికి య‌ష్ ఎలా రియాక్ట్ అయ్యాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

పూర్ణ బుగ్గ కొరికిన సుధీర్‌.. వార్నింగ్ ఇచ్చిన‌ ర‌ష్మీ

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం లో చోటు ద‌గ్గ‌ర‌డంతో గుడ్ బై చెప్పేసిన విష‌యం తెలిసిందే. వెళ్లిపోతున్న స‌మ‌యంలో రోజా ఎమోష‌న‌ల్ అయింది కూడా. అయితే ఆమె స్థానంలో ఎవ‌రు వ‌స్తారు? .. ఎలా వుండ‌బోతోంది షో అన్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అంతా ఊహించిన‌ట్టుగానే ఈ షోలోకి పూర్ణ ఎంట్రీ ఇచ్చేసింది. వ‌చ్చి రాగానే ర‌ష్మీ గౌత‌మ్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. కొత్త జ‌డ్జిగా రోజా స్థానంలో పూర్ణ ఎంట్రీ ఇవ్వ‌డంతో టీమ్ లీడ‌ర్లు రెచ్చిపోయారు. ముందు ఇమ్మానుయేల్ ముద్దు అడిగాడు. స్కిట్ అనంత‌రం ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టేసి కొత్త ర‌చ్చ‌కు తెర‌లేపింది. ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టే స‌మ‌యంలో వ‌ర్ష ఫీలైంది. ముద్దు పెట్టిన వెంట‌నే పూర్ణ .. ఇమ్మానుయేల్ విగ్గుని తొల‌గించేసింది. దీంతో వ‌ర్ష న‌వ్వుల్లో మునిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సుడిగాలి సుధీర్‌.. ఓ కొంటె కోరిక కోరాడు. 'గ‌తంలో మీరు ఎంతో మందికి అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌డు నేను హీరోని కూడా. నాకు మీ బుగ్గ కొరికే అవ‌కాశం ఇవ్వండి' అంటూ ఠ‌క్కున అడిగేశాడు. వెంట‌నే `ఏంటీ సుధీర్ మీకు నా బుగ్గ కొర‌కాల‌ని వుందా?' అంటూ పూర్ణ అడిగింది. దానికి సుధీర్ అవున‌ని స‌మాధానం చెప్పాడు. వెంట‌నే 'అయితే రండి' అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది పూర్ణ‌. త‌ను అలా అన్న వెంట‌నే సుధీర్ .. పూర్ణ ద‌గ్గ‌ర వాలిపోయాడు.. ఇది గ‌మ‌నించిన ర‌ష్మీ ఒక్క‌సారిగా షాక్ అయి పూర్ణ‌కు వార్నింగ్ ఇచ్చింది. "పూర్ణ గారు మీరు ఇలా చేయ‌డానికి వీళ్లేదు. దీనికి నేను ఒప్పుకోను" అంటూనే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఆ త‌రువాత సుధీర్ ని చూసి త‌ల కింద‌కి దించి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో ఏం జ‌రిగిందో తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

శివాలెత్తిన శివ‌జ్యోతి.. వ‌దిలే ప్ర‌స‌క్తిలేదంటూ వార్నింగ్‌

బిగ్ బాస్ సీజ‌న్ 5 లో సంద‌డి చేసిన శివ‌జ్యోతి ఆ త‌రువాత బుల్లితెర‌పై బిజీగా మారిపోయింది. వ‌రుస షోల‌లో పాల్గొంటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే తాజాగా శివ‌జ్యోతి ప్రెగ్నెంట్ అంటూ సోష‌ల్ మీడియా లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. దీంతో ఆమెకు అంతా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజా వార్త‌ల‌పై శివజ్యోతి మండిప‌డింది. తాను ప్రెగ్నెంట్ అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, త‌న‌పై యూట్యూబ్ లో త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డింది. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపిన స‌ద‌రు యూట్యూబ్ ఛాన‌ల్ కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఓ వీడియోని కూడా విడుద‌ల చేసింది.   `మీ అంద‌రికి ఓ ముచ్చ‌ట చెప్పాలి. నా గురించి నాకు తెలియ‌ని విష‌యాలు చాలా స‌ర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకు నాపై ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయో తెలియ‌దు. స్టార్టింగ్ లో ఎందుకు లే రియాక్ట్ కావ‌డం అని వ‌దిలేశా. ఇవ‌న్నీ ఎందుకు వ‌స్తున్నాయంటే ఇటీవ‌ల ఓ ఈవెంట్ కోసం వెళ్లిన‌ప్పుడు మామిడికాయ ప‌ట్టుకుని ఓ ఫొటో దిగా. దాన్ని ప‌ట్టుకుని ఇంత ర‌చ్చ చేస్తున్నారు.' అని శివాలెత్తింది శివ‌జ్యోతి. అంతే కాకుండా త‌ను లావు అయ్యాన‌ని, 30 ఏళ్లు వ‌చ్చాయి. శ‌రీరంలో మార్పులు వ‌స్తాయి. మీకేంటీ బాధ‌?  దీన్ని ప‌ట్టుకుని ప్రెగ్నెంట్ అవుతుంది. త‌ల్లి కాబోతోంది అంటూ టైటిల్స్ పెడుతున్నారు. నా ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాన్ని లేవ‌నెత్తారు వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు. వ్యూస్ కోసం ఇంత క‌క్కుర్తిప‌డ‌తారెందుకు? నాకు పెళ్లై చాన్నాళ్లే అవుతోంది. నా పేరెంట్స్‌ పిల్ల‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అంద‌రూ ఫోన్ లు చేసి న‌న్ను అడుగుతున్నారు. మీరు రాసిన రాత‌ల వ‌ల్ల నాకు ఈవెంట్లు కూడా రావ‌డం లేదు. ప్రెగ్నెంట్ క‌దా.. ఆమె చేయ‌దులే అని నాకు ప‌రి ఇవ్వ‌డం లేదు. నా ఫ్రెండ్స్ అంద‌ర్నీ ఇందులో ఇన్ వాల్వ్ చేస్తున్నారు. నా జీవితంలో ఇది చాలా పెద్ద విష‌యం. నా టైం వ‌చ్చిన‌ప్పుడు నిజంగా అది జరిగిన‌ప్పుడు నేను చెప్తా. నా వ్య‌క్తిగ‌త విష‌యాలు నేనే చెప్తా. యూట్యూబ్ ఛాన‌ల్ లో నా ఫ్యామిలీ మ్యాట‌ర్ లాగారు కాబ‌ట్టి విడిచి పెట్ట‌ను. ఇది రిక్వెస్ట్ అనుకుంటావో బెదిరింపు అనుకుంటావో నీ ఇష్టం. నేను ఏది చేయాలో అది చేస్తా.. విన‌క‌పోతే మీ క‌ర్మ‌. ఇక్క‌డితో వ‌దిలేద్దాం` అని ఓ ర‌కంగా రిక్వెస్ట్ చేసింది శివ‌జ్యోతి.

లేడీ అర్జున్ రెడ్డి బిందు మ‌ళ్లీ రెచ్చిపోయింది

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఏడ‌వ వారం పూర్తి చేసుకుని ఎనిమిద‌వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. గ‌త కొన్ని వారాలుగా ఈ సీజ‌న్ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. టెలివిజ‌న్ వేదిగా ప్ర‌సారం అయ్యే బిగ్ బాస్ కంటే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ చాలా దారుణంగా వుంద‌ని, స‌భ్యులు హ‌ద్దులు మ‌రిచి చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇవే కామెంట్ ల‌ని హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి న వారు కూడా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఎనిమిద‌వ వారం నామినేష‌న్ ల ప్ర‌క్రియ మొద‌లైంది. ఇందులో భాగంగా ఇంటి స‌భ్యులంద‌రూ త‌గిన కార‌ణాలు చెప్పిన త‌రువాత వారు నామినేట్ చేయాల‌నుకుంటున్న ఇద్ద‌రు స‌భ్యుల ముఖంపై ఫోమ్ ని పూర్తిగా పూయాల్సి వుంటుంది అంటూ బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ని అరియానా, అశోక్ ల‌తో మొద‌లుపెట్టారు. శివ తింటుంటే అత‌ని నోటి నుంచి లాక్కోవ‌డం ఎమోష‌న్ కాదా? అంటూ అరియానా ర‌చ్చ మొద‌లుపెట్టింది. ఆ పాయింట్ ని ప‌ట్టుకుని నామినేష‌న్ లోకి వ‌చ్చిన అఖిల్ ... నువ్వు మా ఫుడ్ ని వేస్ట్ చేశావ్ దాంతో మేము చాలా హ‌ర్ట్ అయ్యాం.. అంటూ అరియానాని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు అఖిల్‌. ఇక వెళ్లిపోయిన స్ర‌వంతిని పాయింట్ చేస్తూ మాట్లాడుతున్నార‌ని అఖిల్ అన‌డంతో వెంట‌నే బిందు మాధ‌వి లైన్ లోకి వ‌చ్చేసింది. స్ర‌వంతి గేమ్ కాదా? అంటూ చుర‌క‌లంటించింది. స్రవంతి గేమ్ లో లేదా?.. మీకు ఊరికే సేవ‌లు చేసుకోవ‌డానికే వ‌చ్చిందా? .. అరియానాని చూపిస్తూ `ఎమోష‌న‌ల్ గా వాడుతున్నావు క‌దా.. అంటూ అఖిల్ కి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన అఖిల్ `వాడుతున్నావ్ అంటే పిచ్చిదానిలా ఏం మాట‌లు మాట్లాడుతున్నావ్ .. ఫ‌స్ట్ నువ్వు గేమ్ ఆడు అని ని ఫ్రెండే చెబుతున్నాడు` అని ఫైర‌య్యాడు. బిందు ఊరుకుంటుందా?.. వెంట‌నే `నీగేమే వెన్నుపోటు పొడిచే గేమ్‌` అంటూ దిమ్మ‌దిరిగే పంచ్ వేసింది.. తాజాగా విడుద‌లైన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.