స్టేజి మీద నుంచి లేచి వెళ్లిపోయిన ఉషా ఉత్థుప్‌.. శ్రీరామ్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

తెలుగు ఇండియన్ ఐడల్ షోకి ఇప్పుడిప్పుడే ఒక మంచి పేరు అనేది వస్తోంది. ఐతే ఈ షోలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఈ షోలోంచి జడ్జ్ గా విచ్చేసిన ఉషా ఉత్థుప్‌ కోపంతో ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. దీనికి కారణం హోస్ట్ శ్రీ రామచంద్ర. పార్టిసిపెంట్స్ అంతా ఒక్కసారిగా ఏమయ్యిందో అర్ధం కాక షాక్ అయ్యారు. ప్రేక్షకులు కూడా అసలు షోలో అంత లెజెండరీ సింగర్ ని పట్టుకుని అంత చీప్ గా ఎలా మాట్లాడతారు అంటూ తిట్టుకున్నారు. ఆమె వయసుకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటూ తమన్ మీద, శ్రీరామ్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలింతకీ ఏమయ్యిందంటే.. షో మధ్యలో శ్రీరామ్ "ఉషా ఉత్థుప్‌ గారు ..మీ వాయిస్ గంభీరం .. మీ పాట అమృతం .. మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్లు.. అది వినిపిస్తుంది కొన్ని మైళ్ళు.. మీ నుదిటిన పెద్ద బొట్టు .. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు " అంటూ ఆమె  మీద  ఒక కవితను సంధించారు. 'నా మీద నేను జోక్స్ వేసుకుని నవ్వుకుంటాను. కానీ నువ్ ఈరోజు నన్ను గంభీరం అంటూ సంబోధించావ్. ఇలా అనడం నాకు నచ్చలేదు. ఈ షో కోసం నేను కోల్కతా నుంచి వచ్చాను. ఇన్ని వేల మంది చూస్తున్న ఈ షోలో నన్ను ఇలా అవమానించడం ఏం బాలేదు'  అంటూ శ్రీరామచంద్ర మీద ఫైర్ అయ్యి సీట్ లోంచి లేచి వెళ్లిపోయారు. స్టేజి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. శ్రీరామ్ కి కూడా అసలేం జరుగుతుందో అర్ధం కాక ఉషా ఉత్థుప్‌ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఐనా ఆమె క్షమించకపోయేసరికి అదే పనిగా సారీ చెప్తూనే ఉన్నాడు. 'మధురం అని కాకుండా  గంభీరం  అంటూ ఒక మగవాడిగా నన్ను అభివర్ణించావ్' అంటూ మండిపడ్డారు. ఏదైమైనా జోక్స్ అంటే నాకు ఇష్టం కానీ ఇది టూ మచ్ అంటూ కోప్పడ్డారు. "మీకు నా క్షమాపణలు. నేను కావాలని ఇలా చెప్పలేదు మీ ఆశీర్వాదాలు కావాలి అమ్మ " అంటూ ప్రాధేయపడ్డాడు శ్రీరామ్. చివరికి అందరూ నచ్చచెప్పాక ఆమె కొంచెం శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికి ఉష కూడా  నవ్వేసి 'నేను అలాంటి దాన్నా కాదా, అనేది ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. నా మీద నేనే జోక్స్ వేసుకుంటాను, నవ్వుకుంటాను. ఇదంతా లైట్' అనేసరికి శ్రీరామ్ కి ప్రాణం లేచొచ్చినట్టైంది. ఆ వెంటనే తమన్ స్టేజిని కూల్ చేయడానికి " ఉషా ఉత్థుప్‌ కాదు ఉషా షట్ అప్ " అని అనేసరికి అందరూ నవ్వేస్తారు. మామ్ ఇంత గ్రేట్ ప్రాంక్ చేసి నా దిమ్మ తిరిగేలా చేశారు అంటూ శ్రీరామ్ అనేసరికి ఉషా గారు న‌వ్వేశారు. ప్రాంకా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే 'ఇలా ఒక స్టేజి షో చేసేటప్పుడు అక్కడ ఉండే లెజండ‌రీస్‌ గురించి తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఏదేదో మాట్లాడేసి వాళ్ళను అవమానించడం కరెక్ట్ కాదు' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం తమన్, శ్రీరామ్ మీద ఫైర్ అవుతున్నారు.

ఆపుకోలేక స్టేజి మీద ఏడ్చేసిన ఆటో రాంప్రసాద్..

స్నేహం ఒక్కసారి  చేస్తే చాలు ఇక దాంపత్యమే. వాళ్ళు భార్యాభర్తలే అని మన ఎస్పీ బాలు గారు అన్నారు. అలాంటి గొప్ప ఫ్రెండ్ షిప్ సుడిగాలి సుధీర్ , ఆటో రాంప్రసాద్, గెటప్ సీనుది. 2013 లో సుడిగాలి సుధీర్ టీం లీడర్ అయ్యాడు. ఐతే అప్పట్లో వీళ్ళ ముగ్గురు కలిసి స్కిట్స్ రాసుకుని  పెర్ఫామ్ చేసుకుంటూ టీంని ఒక రేంజ్లోకి తీసుకెళ్లారు. జబర్దస్త్ అంటే వీళ్ళ ముగ్గురే గుర్తొచ్చేలా ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు కూడా. ఆ తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కూడా వీళ్లకు. ఐతే అప్పట్లో డబ్బుల్లేక, వచ్చేది సరిపోక ఇబ్బందులు పడేవారు ఈ స్నేహితులు. ఐనా సరే ఉన్న వాటిని సర్దుకుంటూ మంచి స్నేహాన్ని కొనసాగించారు. గెట్ అప్ శీనుకి అదే టైంలో పెళ్లవుతుంది. కానీ భార్యాభర్తలు కలిసి తిరగడానికి మంచి బైక్ కూడా లేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకోవడానికి కూడా ఆటో రాంప్రసాద్ దగ్గర మంచి సెల్ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో వీళ్ళ ముగ్గురూ కలిసి వీటిని కొనుక్కుని ఒకరికి ఒకరు ప్రెజెంట్ చేసుకుంటారు. ఇలా వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసిమెలిసి వుంటారు. ఇంతలో గెటప్ శీను కి మూవీ ఆఫర్ వచ్చేసరికి మూడు నెలలు జబర్దస్త్ ని రాను అంటూ చెప్తాడు. అంతే సుధీర్, రాంప్రసాద్ బాగా ఏడ్చేస్తారు. అక్కడ సినిమా హిట్ కొట్టు, వచ్చి ఇక్కడ స్కిట్ కొట్టు అంటూ రాంప్రసాద్ శీనుకి ధైర్యం చెప్పి టీం ని మేం కాపాడతామంటూ ధైర్యం ఇచ్చి పంపిస్తాడు. తర్వాత కొద్ది రోజులకు సుడిగాలి సుధీర్ కూడా ఆగిపోయేసరికి ఒక్కసారిగా ఆటో రాంప్రసాద్ కి ఒంటరి ఐపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే ఆపుకోలేక స్టేజి మీద ఏడ్చేస్తాడు. ఇంద్రజ, సదా, రష్మీ, అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వీళ్ళ ముగ్గురి స్కిట్స్ ని ఫాలో అయ్యేవాళ్లే ఉన్నారనుకుంటే వీళ్ళ గొప్ప స్నేహానికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే మాటలు కాదా. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్ళ ముగ్గిరిది అన్నట్టుగా ఉంటారు. ఫ్రెండ్ షిప్ డే ని పురస్కరించుకుని  ఇక ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో నూకరాజు, కెవ్వు కార్తిక్, రాకింగ్ రాకేష్ అద్దిరిపోయే స్కిట్ పెర్ఫామ్ చేశారు. జూన్ 9 న ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రసారం కాబోయే ఈ స్కిట్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యి చూసిన అందరి మనస్సులను బరువెక్కేలా చేస్తోంది.  

‘తంతా నా కొడకా..’ అంటూ బెదిరించిన నాగబాబు

జబర్దస్త్ ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఈ షోలో స్కిట్స్ చేసిన వాళ్లంతా బిగ్ స్క్రీన్ మీద కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాగే స్టేజి షోస్ , కామెడీ షోస్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. అవినాష్ స్కిట్ చేస్తే చాలు కడుపుబ్బా నవ్వుతారు ప్రేక్షకులు. మొదట్లో అవినాష్ స్కిట్స్ ఏమంత పేలకపోయినా తర్వాత్తర్వాత బాగా మెరుగుపరుచుకున్నాడు. బిగ్ బాస్ షో లో కూడా కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. దీనికి  కారణం ఎవరు అంటే నాగబాబు గారు అంటాడు అవినాష్. కొత్త కొత్త స్టోరీ లైన్స్ చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి అంటూ మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. పొరపాటున స్కిట్ లో తప్పు చేస్తే మాత్రం వెంటనే "తంతా నా కొడకా..ఇంకోసారి సరిగా చేయకపోతే " అంటూ బెదిరించేవారట. 'ఆయన వార్నింగ్‌ ఇస్తున్నందుకన్నా బాగా చేయాలి అని మేమంతా బాగా కష్టపడేవాళ్ళం' అంటాడు అవినాష్. 'ఈరోజు ఇంత నేం అండ్ ఫేమ్ వచ్చింది అంటే అదంతా నాగబాబు సర్ వ‌ల్లే. ఆయన అందరికి ఒక పెద్ద దిక్కుగా, ఒక తండ్రిగా ఉంటూ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేస్తాడని..నేను ఉన్నానంటూ ధైర్యం ఇస్తార'ని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అవినాష్. నాగబాబుకి తనకి మధ్యన చక్కని రాపో ఉందని ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఆయనే అంటూ ఆనందం వ్యక్తం చేసాడు.

`కార్తీక‌దీపం`లోకి `వంట‌లక్క` వ‌చ్చేసింది

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీనియ‌ల్  `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది. జ్వాల‌ని ఎలాగైనా అవ‌మానించాల‌ని ప్లాన్ చేసిన శోభ ప్ర‌త్యేకంగా పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీకి జ్వాల వ‌చ్చిందా?.. అస‌లు ఏం జ‌రిగింది? .. మ‌ధ్య‌లో `వంట‌ల‌క్క‌` హ‌డావిడి ఏంటీ? అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం. నిరుప‌మ్ గురించి ఆలోచిస్తూ జ్వాల ఆనందప‌డుతూ వుంటుంది. అదే స‌మ‌యానికి శోభ అక్క‌డి వ‌చ్చి జ్వాల‌ని పార్టీకి రావాల‌ని పిలుస్తుంది. ఇది న‌న్ను అవ‌మానించ‌డానికే పిలుస్తోంద‌ని జ్వాల మ‌న‌సులో అనుకుంటుంది. ఆ త‌రువాత పార్టీకి నేను రాన‌ని చెబుతుంది. త‌ను రాక‌పోతే ఎలా అని భావించిన శోభ నువ్వు ఎలాగైనా రావాలి అంటూ జ్వాల‌ని బ్ర‌తిమాలుతుంది. అయినా స‌రే జ్వాల నేను రానంటే రాను అని మొండిగా చెబుతుంది. దీంతో పార్టీకి నిరుప‌మ్ తో పాటు అంతా వ‌స్తున్నార‌ని చెబుతుంది శోభ‌. అయినా స‌రే నేను వాళ్ల‌ను బ‌య‌ట క‌లుస్తాను పార్టీకి మాత్రం రాను అని చెప్పేస్తుంది జ్వాల‌. నువ్వు రాక‌పోతే డాక్ట‌ర్ సాబ్ ఫీల‌వుతాడు. నువ్వు ఎలాగైనా రావాల్సిందే అని చెప్పి వెళ్లిపోతుంది శోభ‌. డాక్ట‌ర్ సాబ్, తింగ‌రి వ‌స్తున్నారా ఏదైతే అది అయింది అని హ్యాపీగా ఫీల‌వుతుంది. క‌ట్ చేస్తే...త్వ‌ర‌లో స్టార్ మా`లో ప్ర‌సారం కానున్న `వంట‌ల‌క్క‌` జోడీ  ముర‌ళీ (ధీర‌వీయం రాజ్ కుమార‌న్), మ‌హిలక్ష్మి (షిరీన్ శ్రీ‌) త‌మ సీరియ‌ల్ సీరియ‌ల్ ప్ర‌మోష‌న్స్ కోసం ఎంట్రీ ఇచ్చారు. ముర‌ళీకి.. సౌంద‌ర్య‌, వ‌ర‌ల‌క్ష్మికి జ్వాల సాయం చేస్తారు. క‌ట్ చేస్తే.. హిమ‌ని త‌లుచుకుని జ్వాల బాధ‌ప‌డుతూ వుంటుంది. ఆ త‌రువాత `వంట‌ల‌క్క‌` సీరియ‌ల్ ప్ర‌మోష‌న్ సాగింది. కార్తీక దీపం` టీమ్ అంతా `వంటల‌క్క‌` సీరియ‌ల్ ని చూడండి అంటూ ప్ర‌మోట్ చేశారు. ఇంత‌కీ శోభ పార్టీ ఇచ్చిందా?.. జ్వాల వెళ్లిందా? వెళితే ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

పెళ్లి కాలేదు కానీ నాన్నయ్యాడు..

  బుల్లి తెరపై టాప్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ తో బుల్లితెరపై కాలు పెట్టి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా మంచి స్కిట్స్ చేసేవాడు సుధీర్. మొదట్లో మాములుగా హాస్యం కోసం ఈ షో చూసేవాళ్ళు కాస్త ఇప్పుడు సుధీర్ కోసమే చూస్తున్నారు. ఇక ఇప్పడు  శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాడు. ఐతే సుధీర్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇంకా ఎప్పుడు చేసుకుంటావ్ పెళ్లి అంటూ నెటిజన్స్, లేడీ ఫాన్స్ అడుగుతుంటే సమధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఐతే ఇప్పుడు సుధీర్ పెళ్లి కాకుండానే తండ్రయ్యాడు. సుధీర్ కంటే ముందు తన తమ్ముడు రోహన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రోహన్ కూడా అప్పుడప్పుడు స్టేజి మీద కనిపిస్తూ పంచ్ డైలాగ్స్ తో అలరిస్తూ ఉంటాడు. ఐతే రోహన్ వైఫ్ ఇటీవలే డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ పెళ్లి కాకుండానే పెదనాన్నగా ప్రమోషన్ కొట్టేసాడు. ఇప్పుడు సుధీర్ ఫామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సుధీర్ కి విషెస్ చెప్తున్నారు.

అనుతో ఆర్య‌కు చెక్ పెట్టిన రాగ‌సుధ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతోంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ అనుక్ష‌ణం ఉత్కంఠ‌భ‌రిత మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంతోంది. ఇందులో `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్‌, రామ్ జ‌గ‌న్‌, జయ‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, అనుష సంతోష్‌, రాధాకృష్ణ‌, మ‌ధుశ్రీ‌, సందీప్‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు. అర్థ్రాంత‌రంగా చ‌నిపోయిన ఓ యువ‌తి మ‌ర్ద‌ర్ మిస్ట‌రీ చుట్టూ తిరిగే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ఉత్క‌ఠ‌భరిత మ‌లుపుల‌తో సాగుతోంది. ఆర్య‌వ‌ర్ధ‌న్ ని ఎలాగైనా లాక్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న రాగ‌సుధ అందుకు అనుని పావుగా వాడుకోవాల‌ని ఫిక్స‌వుతుంది. ఆర్య వ‌ర్థ‌న్.. రాజ‌నందినిని హ‌త్య‌ చేస్తున్న‌ట్టు.. అందుకు రాజ‌నందిని ఆర్య‌ని వ‌ద్దంటూ వారిస్తున్న‌ట్టు క్రియేట్ చేసిన ఓ వీడియోని పెన్ డ్రైవ్ లో కి ఎక్కించి దాన్ని పోలీసుల‌కు అను చేత‌ అప్ప‌గించేలా ప్లాన్ చేస్తుంది. ప‌థ‌కం ప్ర‌కారం అనుని న‌మ్మించి పెన్ డ్రైవ్ ని తీసుకుని పోలీస్టేష‌న్ లో అడుగుపెడుతుంది. దీంతో రాగ‌సుధ చెప్పిన‌ట్టుగానే అను పెన్ డ్రైవ్ ని సీఐకి అప్ప‌గించి దీని ఆధారంగా కేసు ఫైల్ చేయ‌మంటుంది. అయితే ఆర్య వ‌ర్ధ‌న్ కుటుంబ ప‌రువుకు సంబంధించిన వ్య‌వ‌హార‌మ‌ని, అంత త్వ‌ర‌గా కేసు ఫైల్ చేయ‌లేమని ఆయ‌న‌ని సంప్ర‌దించాకే కేసు ఫైల్ చేస్తామ‌ని సీఐ చెబుతాడు. దీంతో అల‌ర్ట్ అయిన రాగ‌సుధ‌... స్వ‌యంగా ఆర్య‌వర్ధ‌న్ వైఫ్ చెబుతుంటే మ‌ళ్లీ ఆర్య‌వ‌ర్ధ‌న్ ని సంప్ర‌దించ‌డం ఏంట‌ని చెప్పి అనుకు సైగ చేస్తుంది. దాంతో అనుమానంగానే అను నేను చెబుతున్నాను క‌దా కేసు ఫైల్ చేయండి స‌ర్ అని చెబుతుంది. దీంతో అన్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్న సీఐ ఎక్క‌డో లాజిక్ మిస్స‌వుతోందంటూ  అనుమానం వ్య‌క్తం చేస్తాడు. దీంతో మ‌ళ్లీ అలెర్ట్ అయిన రాగ‌సుధ లేట్ చేసే కొద్దీ హంత‌కుడు అలెర్ట్ అయ్యే అవ‌కాశం వుంద‌ని అనుతో చెప్పిస్తుంది. దీంతో స‌రే అంటూ కంప్లైంట్ తీసుకుంటాడు. క‌ట్ చేస్తే.. ఆర్య ఆఫీసుతో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. నేరుగా ఆర్య క్యాబిన్ లోకి వెళ్లడంతో జెండే అభ్యంత‌రం చెబుతాడు. సీఐ బ‌ల‌మైన ఆధారాల‌తో వ‌చ్చామ‌ని, కేసు పెట్టారు కాబ‌ట్టే వ‌చ్చామ‌ని చెబుతాడు. దీంతో ఆర్య‌పై కేసు పెట్టింది ఎవ‌రని జెండే నిల‌దీస్తాడు.. ఆర్యవ‌ర్ధన్ వైఫ్ అనునే కేసు పెట్టింద‌ని సీఐ చెప్ప‌డంతో ఆర్య‌, జెండే ఒక్క‌సారిగా షాక్ అవుతారు. అదే స‌మ‌యంలో అను ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  ఆర్యవ‌ర్ధ‌న్ ని పోలీసులు అరెస్ట్ చేశారా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

అంకితతో మాట్లాడని తులసి

అంకిత బర్త్ డే పార్టీ నుంచి తులసి వాళ్ళ ఫామిలీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇంటికి రాగానే తులసి వాళ్ళ అత్తయ్య అంకితను ఇంటికి రావద్దని ఎందుకు అన్నావంటూ నిలదీస్తుంది. సమాధానం చెప్పదు తులసి. వెంటనే తులసి మావయ్యగారు అందుకుని ఏ కారణం లేకుండా తులసి అలా మాట్లాడదు. కాబట్టి తులసిని తప్పు పట్టకు అంటూ చెప్తాడు. చివరకి అసలు విషయం చెప్తుంది తులసి. అభి అన్న మాటల గురుంచి అత్తగారికి చెప్పేస్తుంది. అందరూ చాలా బాధపడతారు. ఐనా అభి వాళ్ళ నాన్న పోలిక. తల్లితో ఏం మాట్లాడాలో, ఇలా మాట్లాడాలో అస్సలు తెలీదు అంటూ తలలు పట్టుకుంటారంతా. ఇంతలో అంకిత తులసికి ఫోన్ చేస్తుంది. కానీ తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు. చివరికి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. తనను తన అత్తగారింటికి రావద్దని చెప్పడం కరెక్ట్ కాదని ఏడుస్తూ చెప్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం ఎన్ని సార్లైనా చేస్తూనే ఉంటానని గట్టిగా చెప్తుంది. ఐనా ఆ ఇల్లు నాది అందులో ఉండేవాళ్ళు నా వాళ్ళు.. వాళ్ళే నా సొంత వాళ్ళు అంటూ బాధపడుతుంది అంకిత. తులసి హృదయం బరువెక్కిపోతుంది ఆ మాటలకు.  మరో వైపు లాస్య తులసిని ఆపి మరీ నిలదీస్తుంది. అంకితను ఇంటికి రానివ్వనని అలా ఇలా చెప్పావ్ అంటూ.. తులసి కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తుంది. ఇంతకు చివరికి ఏం అయ్యిందో తెలియాలంటే సాయంత్రం ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మిలో చూడాల్సిందే.

వసుని మర్చిపోని రుషి

వసుధార రిషి ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరో పక్క ఋషి తన మీద జాలి చూపించవద్దు అంటూ జగతికి దణ్ణం పెట్టి మరీ చెప్తాడు. ద్వేషం చూపించినా పర్లేదు కానీ జాలి చూపిస్తే మాత్రం తట్టుకోలేను అంటాడు. ప్రేమ విత్తనం లాంటిది అంటూ జగతి నచ్చచెప్పడానికి ట్రై చేస్తుంది. మేడం ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండని చెప్తాడు ఋషి. ఋషి వసూ గురుంచి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అనుకోకుండా తనకి ఫోన్ కాల్  వెళ్ళిపోతుంది. తన ప్రమేయం లేకుండా ఫోన్ కాల్ వెళ్లిపోయిందేమిటి  అనుకుని వెంటనే కాల్ కట్ చేసేస్తాడు. ఋషి సర్ మిస్స్డ్ కాల్ ఇస్తే నేను ఫోన్ చేస్తే తప్పేంటి అనుకుని వసూ కాల్ బ్యాక్ చేస్తుంది. కానీ ఆన్సర్ చేయదు ఋషి. తర్వాత కాలేజీకి బయల్దేరుతుంది.. ఆటోలో కాలేజీకి వెళ్తుంది వసుధార. ఇంతలో చున్నీ ఆటో బయటకి ఎగురుతూ ఉంటుంది. ఇలా చున్నీ బయటకివస్తే ప్రమాదం కదా అని ఆటో పక్కకి వచ్చి చున్నీ సరిచేసుకోమని ఆటో డ్రైవర్ కి చెప్తాడు. వసుధార వెంటనే చున్నీ లోపలి తీసుకుంటుంది. సర్ , సర్ అని పిలుస్తున్నా తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఇంతలో కాలేజీలో పుష్పను నోట్స్ కావాలని అడుగుతాడు ఋషి. వసుధారను అడిగే పరిస్థితి తీసుకురమ్మకు అని పుష్పకు గట్టిగా చెప్తాడు.  ఇక సాక్షి అదే టైంలో కాలేజీకి వచ్చి వసుధారను కార్నర్ చేస్తుంది. నువ్వింకా రిషి మనసులోనే ఉన్నావని సీరియస్ గా అంటుంది. అది నీ తప్పు అంటూ కౌంటర్ ఇస్తుంది వసూ. మిగతా ఎపిసోడ్ హైలెట్స్ కోసం ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో చూడొచ్చు.

తిలోత్త‌మ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న న‌య‌ని

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. త‌న భ‌ర్త త‌ల్లిని దారుణంగా హ‌త్య చేసి ఆమె స్థానాన్ని అక్ర‌మించి ఇంటిని, ఆస్తుల్ని త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకున్న తిలోత్త‌మ‌కు ప‌ల్లెటూరి యువ‌తి అయిన న‌య‌ని ఎలాంటి గుణ‌పాఠం చెప్పింది? చివ‌రికి త‌న ఆట ఎలా క‌ట్టించింద‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థనాల‌తో ఈ సీరియ‌ల్ సాగుతోంది. క‌న్న‌డ న‌టులు అషికా గోపాల్‌, చందు గౌడ ప్ర‌ధాన‌ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర‌, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, అనిల్ చౌద‌రి, శ్రీ స‌త్య‌, నిహారిక నటించారు. క‌సి మాట‌లు వింటూ గుడ్డిగా వెళుతున్నార‌ని, త‌న కార‌ణంగా కోట్ల‌ల్లో న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని, ఇదే కంటిన్యూ అయితే అంతా రోడ్డున ప‌డ‌టం గ్యారెంటీ అని హాసిని హెచ్చ‌రిస్తుంది. అయితే ఆ మాట‌లు వ‌ల్ల‌భ‌కు అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో హాసినిని హెచ్చ‌రిస్తాడు. ఇదే స‌మ‌యంలో అత‌ని త‌మ్ముడు విక్రాంత్ కూడా క‌సిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డంతో వ‌ల్ల‌భ అత‌నిపై చేయి చేసుకుంటాడు. అది భరించ‌లేని విక్రాంత్ వెంట‌నే వ‌ల్ల‌భ కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీస్తాడు. అది చూసిన తిలోత్త‌మ .. విక్రాంత్ పై చేయి చేసుకుంటుంది. క‌ట్ చేస్తే.. ఫ్యాక్ట‌రీ వ‌ర్కర్ల‌తో క‌లిసి న‌య‌ని, విశాల్ క‌లిసి భోజ‌నం చేస్తుంటారు. అంద‌రి టిఫిన్ బాక్స‌లు తెరిచి ఒకే అర‌టాకులో వేసుకుని న‌య‌ని క‌లిపి ముద్దులు అందిస్తుంటే విశాల్ తో పాటు వర్క‌ర్స్ క‌లిసి తింటుంటారు. అదే స‌మ‌యానికి వ‌ల్ల‌భ‌, క‌సితో క‌లిసి తిలోత్త‌మ అక్క‌డికి వ‌స్తుంది. క‌లిసి భోజ‌నం చేస్తుంటే క‌సి అవ‌మానిస్తుంది. అడుక్కునే వాడికి అర‌వై ఆరు కూర‌లు అంటూ విశాల్ ని దారుణంగా అవ‌మానిస్తుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన న‌య‌న ఎంగిలి చేతే క‌సి చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది. ఎక్కువ‌గా వాగితే మ‌ర్యాద‌గా వుండ‌ద‌ని హెచ్చ‌రిస్తుంది. భోజ‌నాల టైమ్ లో కుక్క‌ల్లా వ‌చ్చార‌ని ఫైర‌వుతుంది.. న‌య‌ని దూకుడు చూసిన తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ షాక్ అయి అక్క‌డి నుంచి వెళ్లిపోతారు. క‌ట్ చేస్తే.. గాయ‌త్రీ దేవి ఆబ్దికాన్ని జ‌రిపిస్తున్నామ‌ని, అయితే ఆ కార్యాన్ని ఊళ్లో జ‌రిపిస్తున్నామ‌ని చెబుతాడు విశాల్ .. ఊళ్లో అనే మాట‌లు విని తిలోత్త‌మ షాక్ అవుతుంది. ఆ త‌రువాత న‌య‌ని ఫోన్ తీసుకుని `గాయ‌త్ర‌మ్మ ప్రాణాలు వ‌దిలిన చోటే నువ్వు హ‌త్య చేశావ‌న్న ఆధారాల‌ని కూడా వ‌దిలి పెట్టిపోయావు` అంటూ తిలోత్త‌మ‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. న‌య‌ని మాట‌ల్లో త‌న‌కు ఉచ్చు బిగుస్తోంద‌ని గ్ర‌మించిన తిలోత్త‌మ ఏం చేసింది? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్   చూడాల్సిందే.

శ్యామా కోసం ఎఫ్ ఎం స్టేషన్

ఫేక్ రేటింగ్స్ క్రియేట్ చేసి ఆ చార్ట్ ను శ్యామాకు చూపిస్తుంది సౌజన్య. అది చూసి షాక్ అవుతుంది కృష్ణతులసి. ఎందుకిలా జరిగింది అని అడుగుతుంది. అనంతశయనం గారికి ఈ రేటింగ్స్ పంపించామని ఆయన ఇక తనని జాబ్ కి రావద్దన్నారని చెప్తుంది సౌజన్య. కృష్ణ తులసి చాలా బాధ పడుతుంది. వెంటనే రిజైన్ చేసి వెళ్లిపొమ్మన్నారని చెప్పి లెటర్ రాయించి సంతకం తీసుకుంటుంది. తర్వాత కృష్ణతులసి సెల్ లో ఉన్న ఆఫీస్ సిమ్ కూడా ఇచ్చేయమని చెప్పి తీసేసుకుంటుంది. ఏం చేయాలో తెలీక శ్యామా ఇంటికి దిగాలుగా వచ్చి కూర్చుంటుంది. ఐశ్వర్య శ్యామాను చూసి ఎందుకలా ఉన్నావంటూ ఆరా తీస్తుంది. కానీ మనసులో జాబ్ పోయిన విషయం తెలిసినా ఏమీ తెలియనట్టు అడుగుతుంది. జాబ్ పోయింది అని చెప్తుంది శ్యామా. ఐతే జాబ్ పోయిన విషయం తన మీద రాకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి అత్తగారు కానీ ఇలా చేసి ఉంటారా ? అనే అనుమానాన్ని బయట పెడుతుంది. అఖిల్ తో జాబ్ చేయమని చెప్పి వెనక నుంచి ఇలా జాబ్ తీయించేసారేమో అని అంటుంది.. అత్తగారు అలా చేయరని చెప్తుంది శ్యామా. ఇంతలో విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అనంతశయనంతో నేను మాట్లాడతాను అంటూ వర్మ అంటాడు. పోనీ జాబ్ పొతే పోయింది. నేనే నీకోసం ఒక ఎఫ్ ఎం స్టేషన్ పెట్టిస్తాను. చక్కగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నీకు నచ్చినట్టు నువ్వు వుండు అని శ్యామాకు అభయమిస్తాడు. ఇక మిగతా ఎపిసోడ్ అంతా ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణ తులసిలో చూడొచ్చు.

ప‌డుకుంటేనే ఆఫ‌ర్స్‌.. జ‌బ‌ర్ద‌స్త్ గీతూ షాకింగ్ కామెంట్స్‌

గ‌లాటా గీతూ అలియాస్ గీతూ రాయ‌ల్.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ లో ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌లే ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ లేడీది చిత్తూరు. అందుకే చిత్తూరు యాస‌కు ప్ర‌చారం చేస్తూ ఆ భాష‌లో అద్భుతంగా డైలాగులు చెబుతూ ఆక‌ట్టుకుంటోంది. చూడ్డానికి సినిమాల్లో న‌టిగా క‌నిపించే గీతూ రాయ‌ల్ కు మొద‌ట్లో చాలా సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అయితే న‌టిగా కొన‌సాగ‌డానికి తాను సిద్ధంగా లేక‌పోవ‌డంతో త‌నని వెతుక్కుంటూ వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ని గీతూ సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. చిన్న సినిమాల్లో ఆ త‌రువాత మెరిసిన గీతూ ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన యాస‌తో న‌వ్వులు పూయిస్తోంది. అయితే ఓ సంద‌ర్భంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాన్ని పంచుకుని మేనేజ‌ర్ ల‌తో ప‌డుకుంటేనే ఆఫ‌ర్లు అంటూ షాకిచ్చింది. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అవ‌కాశం కోసం తాను కూడా ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న గురించి వివరించింది. నాకు ఈవెంట్ ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డం అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన గీతూ ఓ స‌మ‌యంలో ఆస్ట్రేలియాలో నిర్వ‌హించే ఓ ఈవెంట్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. మంచి రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తార‌ని తెలియ‌డంతో వెంట‌నే ఆ ఈవెంట్ కు వెళ్ల‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. మూడు రోజుల పాటు జ‌రిగే ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ల‌డానికి రెడీ అయిపోయిన త‌న‌కు టికెట్ బుక్ చేసే వ్య‌క్తి ఫోన్ చేశార‌ట‌. మీకు ప‌ర్స‌న‌ల్ గా ఓకేనా అని అడిగార‌ట‌.. ఆ మాట‌లు అర్థం కాక ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ని పెడుతున్నారేమోన‌ని తాను ఓకే చెప్పింద‌ట‌. అయినా స‌రే స‌ద‌రు వ్య‌క్తి మ‌రో సారి మీకు మేనేజ‌ర్ తో ఓకేనా అని అడిగాడ‌ట. ఆ మాట‌ల‌తో త‌ను ఏం చెబుతున్నాడో త‌న‌కు అర్థ‌మైంద‌ని, మేనేజ‌ర్ తో ప‌డుకోవ‌డానికి మీకు ఓకేనా అని త‌ను ఇండైరెక్ట్ గా అడ‌గ‌డంతో వెంట‌నే ఫోన్ క‌ట్ చేసి ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంద‌ట గీతూ.

జ్వాల‌ను అవ‌మానించ‌డానికి శోభ పార్టీ ప్లాన్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `కార్తీక‌దీపం` సీరియ‌ల్ కుటుంబ నేప‌థ్యంలో సాగుతూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్ట‌కుంటూ విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. గ‌త కొంత కాలంగా రేటింగ్ ప‌రంగా టాప్ లో వున్న ఈ సీరియ‌ల్ ఇటీవ‌ల ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక కొంత డీలా ప‌డింది. అయితే తాజా ఎపిసోడ్ ల‌తో మ‌ళ్లీ కొంత వ‌ర‌కు పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ శుక్ర‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? .. ఎలాంటి ట్విస్ట్ ల‌కు వేదిక‌గా నిల‌వ‌బోతోంద‌న్న‌ది ఒక‌సారి తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో నిరుప‌మ్ వాళ్ల అమ్మ స్వ‌ప్న‌తో మాట్లాడుతుంటాడు. నీ జీవితం ఇది న‌ష్ట‌పోతావు అని స్వ‌ప్న తిరుడుతూ వుంటుంది. ఆటో వాళ్ల‌తో క‌లిసి తిర‌గ‌డం ఏంటి అని నిరుప‌మ్ ని నిల‌దీస్తుంది. ఆ మాట‌ల‌కు చిర్రెత్తుకొచ్చిన నిరుప‌మ్ నాకు న‌చ్చింది చేస్తాను.. ఆటో వాళ్ల‌తోనే తిరుగుతాను అంటూ త‌ల్లి స్వ‌ప్న‌కు షాకిస్తాడు. క‌ట్ చేస్తే.. జ్వాల గురించి శోభ నిజాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూ వుంటుంది. జ్వాల బాబాయ్ , పిన్నీ దొంగ‌లు అని తెలుసుకుని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. ఇదే స‌మ‌యంలో సౌంద‌ర్య‌.. హిమ‌ని తిడుతూ వుంటుంది. నిరుప‌మ్ ని ఎందుకు వ‌ద్ద‌న్నావ్.. నీ వ‌ల్ల నీ త‌ల్లిదండ్రుల‌కు మ‌న‌శ్శాంతి లేకుండా చేశావ్ అంటుంది. క‌ట్ చేస్తే.. ప్రేమ్.. హిమ‌ను ప్రేమిస్తున్నాన‌ని చెప్ప‌డానికి ఓ వీడియో పంపిస్తాడు. అది హిమ చూడ‌కుండానే సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌తో గొడ‌వ‌ప‌డుతూ కోపంలో ఫోన్ విసిరేస్తుంది. దీంతో ప్రేమ్ ఆనందం ఆవిరైపోతుంది. ఇదిలా వుంటే జ్వాల‌, నిరుప‌మ్ ఆటోలో వెళ్తూ వుంటారు. జ్వాల మాట్లాడుతుంటే నిరుప‌మ్ మాత్రం మౌనంగా హిమ గురించి ఆలోచిస్తూ వుంటాడు. త‌న మాట‌ల‌తో మొత్తానికి నిరుప‌మ్ ని జ్వాల కూల్ చేస్తుంది. మ‌రోప‌క్క ప్రేమ్ ... హిమ రిప్లై ఇస్తే బాగుండు అని ఆలోచిస్తూ వుంటాడు. క‌ట్ చేస్తే.. జ్వాల‌ని అవ‌మానించాల‌ని డిసైడ్ అయిన శోభ ఇందు కోసం పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఈ పార్టీకి హిమ‌, నిరుప‌మ్‌, జ్వాల ముగ్గురూ రావాల‌ని ఆహ్వానిస్తుంది. ఇదే పార్టీకి జ్వాల పిన్నీ, బాబాయ్ ల‌ని కూడా పిలిచి వారితో ప‌నిచేయించి జ్వాల‌ అవ‌మానించాలనుకుంటుంది శోభ‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

బిగ్‌బాస్ సీజ‌న్ 6 లో సిరి హ‌న్మంత్ ప్రియుడు?

బిగ్‌బాస్ సీజ‌న్ 6 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ఈ సారి సామాన్యుల‌కు ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తూ గోల్డెన్ ఆఫ‌ర్ ని ఇస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే తాజా సీజ‌న్ ని ప్రారంభించ‌బోతున్నామంటూ కింగ్ నాగార్జున తాజా ప్రోమోలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ పూర్త‌యిన వెంట‌నే సీజ‌న్ 6కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేయ‌డంతో ఈ సీజ‌న్ లో హౌస్ లోకి  ఎవ‌రు ఎంట్రీ ఇస్తున్నార‌నే చ‌ర్చ మొదలైంది. ఇప్ప‌టికే ప‌లువురు యూట్యూబ్ స్టార్స్, సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీలు, టీవీ స్టార్స్‌, సినీ సెల‌బ్రిటీలు రాబోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. కొంత మంది యూట్యూబ్ స్టార్ల పేర్లు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక కింగ్ నాగ్ చెప్పిన‌ట్టుగా సామాన్యుల కోటాలో ఇరిద్దరికి ఛాన్స్ ల‌భించే అవ‌కాశం వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్రాసెస్ ముగిసిన‌ట్టుగా తెలుస్తోంది. యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయి కూడా హౌస్ లోకి రాబోతున్నాడ‌ని చెబుతున్నారు. ఈ విష‌యం తెలిసి అత‌ని ఫ్యాన్స్ నెట్టింట అప్పుడే హంగామా మొద‌లు పెట్టారు కూడా. ఇదిలా వుంటే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సీజ‌న్ లో సిరి హ‌న్మంత్ ప్రియుడు శ్రీ‌హాన్ కు చోటు ద‌క్కింద‌ని తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సీజ‌న్ 5 లో సిరి హ‌న్మంత్ టాప్ 5 దాకా వెళ్లి వెనుదిరిగింది. గ‌త సీజ‌న్ లో యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ తో క‌లిసి సిరి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మితిమీరిన హ‌గ్గులతో వీరిద్ద‌రు హౌస్ లో చేసిన అతి కార‌ణంగా వీరిపై నెటిజ‌న్స్ ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంత నెగిటివ్ ప్ర‌చారం జ‌రుగుతున్నా శ్రీ‌హాన్ మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా సిరికి అండ‌గా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అలా అంద‌రిని దృష్టిని ఆక‌ర్షించిన శ్రీ‌హాన్ బిగ్ బాస్ సీజ‌న్ 6 కోసం ఎంపిక‌య్యాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. తొలి సీజ‌న్  లోనే శ్రీ‌హాన్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రిగినా అది జ‌ర‌గ‌లేదు. అయితే సీజ‌న్ 6 లో మాత్రం శ్రీ‌హాన్ ఖ‌చ్చితంగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఫైన‌ల్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన పూర్తి డిటైల్స్ ని స్టార్ మా వ‌ర్గాలు వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

సరిగమప v / s no .1 కోడలు

ఈ రెండు టీమ్స్ మధ్యన టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అలాగే కబాలి మూవీలో నటించిన సాయి ధన్సిక జీ సూపర్ ఫామిలీ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి ప్రదీప్ తో కలిసి డాన్స్ చేస్తుంది. తర్వాత   కర్రసాము చేసి ఆడియన్స్ తో ఔరా అనిపించుకుంది. మద్యమద్యలో సోహైల్ కామెడీ పంచ్ లు అందరికీ నవ్వు తెప్పించాయి. ఇక ఈ షోలో "నాలోనే పొంగెను నర్మదా" అంటూ ప్రణవ్ కౌశిక్ అద్భుతమైన గాత్రంతో పాట పాడాడు. ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ప్రణవ్ అతని ఫ్రెండ్ సుధాన్షు కలిసి డాన్స్ ఇరగదీస్తారు. ఆడియన్స్ అంతా లేచి వాళ్ళతో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు. " ఓ చెలియా నా ప్రియా సఖియా " అంటూ చక్కని పాట పాడి డాన్స్ మాత్రమే కాదు సాంగ్స్ కూడా మస్త్ పాడతానని నిరూపించాడు సుధాన్షు . తర్వాత no . 1 కోడలు సీరియల్ లో అత్తా కోడళ్ళుగా ఆక్ట్ చేస్తున్న మధుమిత, సుధాచంద్రన్ ఇద్దరూ కలిసి చక్కని డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి అందరిని అలరించారు. ఫైనల్ గా సుధాచంద్రన్ గారి 50 ఏళ్ల జర్నీ పూర్తైన సందర్భంగా ఆమెను స్టేజి పై ఘనంగా సత్కరిస్తారు రెండు టీమ్స్ సభ్యులు. ఈ సెలెబ్రేషన్స్ కి సంబంధించి ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరలవుతోంది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే జూన్ 5 th వరకు ఆగాల్సిందే.

`నెం.1 కోడలు` లోకి సీనియ‌ర్ న‌టి క‌విత ఎంట్రీ

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `నె.1 కోడ‌లు`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `మ‌యూరి` ఫేమ్ సుధా చంద్ర‌న్‌, సీనియ‌ర్ న‌టి క‌విత‌,  జై ధనుష్, మ‌ధుమ‌త, క్రాంతి చంద్‌, సాక్షి శివ‌, బాలాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ గురువారం కొత్త మలుపు తిరిగ‌బోతోంది. ఈ సీరియ‌ల్ లోకి కొత్త‌గా సీనియ‌ర్ న‌టి క‌విత ఎంట్రీ ఇస్తోంది. వాగ్ధేవి ముఖ్య‌మైన ప‌ని మీద టూర్ వెళ్ల‌డానికి రెడీ అవుతూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో అత్త పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి క‌విత త‌న మ‌న‌వ‌రాలితో ఎంట్రీ ఇస్తుంది. మ‌ధ్య‌లో కార్ ఆగిపోవ‌డంతో రాహుల్ కి ఫోన్ చేసి  పిక‌ప్ చేసుకోమని ద‌బాయిస్తుంది. ఆమె మాట‌ల‌కు హ‌డ‌లెత్తిపోయిన రాహుల్ వెళ్లి త‌న‌ని ఇంటికి తీసుకొస్తాడు. క‌విత‌ని చూసిన వాగ్ధేవి త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకుని హ‌డ‌లి పోతుంది. త‌ను ఇప్పుడు ఎందుకొచ్చిందంటూ లోలోన భ‌య‌ప‌డుతూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో భోజ‌నం చేద్దామ‌ని అంతా క‌విత‌ని డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌రికి తీసుకొస్తారు. అక్క‌డ వున్న వంట‌కాల‌ని చూసిన క‌విత ఏంటే ఇదంతా అంటూ వాగ్ధేవిని నిల‌దీస్తుంది. ఉడికీ ఉడ‌క‌ని కూర‌లు.. కాలీ కాల‌ని రొట్టెముక్క‌లు..ఇలాంటి తిండి తింటే నూరేళ్లు బ్ర‌త‌క‌డం కాదు యాభై ఏళ్ల‌లోనే అర్థ్రాయుష్సు అయిపోతుంది అంటుంది. ఈ వంటలు న‌చ్చ‌క‌పోవ‌డంతో `ఒక‌సారి నీ చేతి వంట రుచి చూడాల‌ని వుంది` అంటుంది. దాంతో కంగారు ప‌డ్డ వాగ్ధేవి నేనా అని ఆశ్చ‌ర్యంతో చూస్తుంది. అవును అంటూ క‌విత `మిర్చీలు గిర్చీలు వాడ‌కుండా..అన్నీ చేత్తో రుబ్బి.. కుదిరితే పాయ‌సం కూడా చేయి అని వాగ్ధేవికి ఆర్ధ‌ర్ వేస్తుంది క‌విత‌.. ఆ లిస్ట్ అంతా విని షాక్ అయిన వాగ్ధేవి త‌ను చెప్పిన‌ట్టే వంట ప్రిపేర్ చేసిందా? ... ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌విత .. వాగ్ధేవిని ఎలా ఆడుకుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

శ్యామా పై ఐశ్వర్య నిఘా

వసంతకు చెప్పి శ్యామా జాబ్ విషయం సెటిల్ చేస్తాడు అఖిల్. జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదని వసంత శ్యామాకు చెప్తుంది. ఈ విషయం విన్న ఐశ్వర్య ఇంకో ప్లాన్ వేస్తుంది. వెంటనే బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ కి ఫోన్ చేసి సౌజన్యతో మాట్లాడుతుంది. ఎలాగైనా కృష్ణతులసిని జాబ్ లోంచి తీసేయమని చెప్తుంది. సౌజన్య కూడా ఇది కరెక్ట్ టైం అని ఫేక్ రేటింగ్స్ క్రియేట్ చేస్తుంది. ఆ షీట్ ని రామారావుకి చూపిస్తుంది. అతను షాక్ ఐపోతాడు. ఎందుకు రేటింగ్స్ పడిపోయాయని సౌజన్యను అడుగుతాడు. అదంతా ఫేక్ తప్ప ఒరిజినల్ రేటింగ్స్ కాదని ఇది స్టేషన్ హెడ్ కి చూపించి కృష్ణతులసిని జాబ్ నుంచి తీసేసే ప్లాన్ అని చెప్తుంది. మరో పక్క అఖిల్ కి జాబ్ విషయమై థాంక్స్ చెప్తుంది శ్యామా. అంతా బానే ఉంది. నువ్వు నా గదిలోనే పడుకో అంటాడు. కాదు నా రూమ్ లో పడుకుంటా అంటుంది శ్యామా. ఎన్ని రోజులు ఇలా ఇద్దరం వేరే వేరే గదుల్లో ఉండాలి అంటూ సరసం ఆడతాడు అఖిల్. పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టేవరకు అంటుంది శ్యామా. ఈ విషయాలన్నీ అటుగా వెళ్తున్న వైదేహి విని వెళ్లి వసంతకు చెప్తుంది. ఇద్దరికీ మూహూర్తం త్వరలో పెట్టించి ఒకటి చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు శ్యామా మసాలా కంపెనీకి వెళ్లి సెపరేట్ గా స్టాక్ తీసి పక్కన పెట్టావా లేదా అంటూ వర్కర్ ని అడుగుతుంది. చెప్పినట్టే చేశానని చెప్తుంది ఆ వర్కర్. ఈ విషయం ఐశ్వర్యకు కానీ ఇంకా ఎవరికీ తెలియకూడదు.. తెలిస్తే ప్లాన్ వర్కౌట్ అవదు అంటుంది. సరే అని అభయమిస్తుంది వర్కర్. ఆ వెంటనే ఐశ్వర్య మసాలా కంపెనీకి వస్తుంది. స్టాక్ విషయంలో అనుమానం వచ్చి సెపరేట్ ఉన్న స్టాక్ గురించి ఆరా తీస్తుంది. తనకు ఎలాంటి విషయం తెలీదని శ్యామా మేడం పక్కన పెట్టించారని చెప్తుంది వర్కర్. ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇవి.

ఆర్య‌వ‌ర్ధ‌న్ ని అడ్డంగా బుక్ చేసిన రాగ‌సుధ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ప్ర‌తీ రోజు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతూ అల‌రిస్తోంది. మ‌రాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` దీనికి ఆధారం. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, అనూషా సంతోష్‌, రామ్ జ‌గ‌న్‌, సందీప్ త‌దిత‌రులు న‌టించారు. అర్య‌వ‌ర్ధ‌న్ ని చావు దెబ్బ కొట్టాల‌ని అత‌ని ఆఫీసులో అను సాయంతో సుధా రాజ్ పుత్ గా చేరిన రాగ‌సుధ అనుకున్న‌ట్టుగానే త‌న ప్లాన్ ని అంచెలంచెలుగా అమ‌లు చేస్తూ వుంటుంది. ప్ర‌తీ విష‌యంలో అనుని అడ్డుపెట్టుకుని త‌ప్పించుకుంటూ త‌న టార్గెట్ వైపు అడుగులు వేస్తూ వెళుతున్న రాగ‌సుధ ఈ రోజు ఎపిసోడ్ లో ఆర్య వ‌ర్ధ‌న్ కు ఊహించ‌ని షాకిస్తుంది. ఆర్య వ‌ర్ధ‌న్ వాయిస్ ని వాడుకుని తానే రాజ‌నందినిని హ‌త్య చేశాడ‌ని క్రియేట్ చేసిన న్యూస్ ఛాన‌ల్ దాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద టెలికాస్ట్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. విష‌యం తెలిసి ఆ ప్ర‌య‌త్నాన్ని జెండే తో క‌లిసి ఆపేస్తాడు ఆర్య‌. అయితే ఆ సీడీని స‌ద‌రు న్యూస్ ఛాన‌ల్ వారి నుంచి రాగ‌సుధ గ్యాంగ్ తీసుకెళ్లిపోవ‌డంతో ఆర్య‌లో కొత్త టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. సుధారాజ్ పుతే రాగ‌సుధ అని తెలుసుకున్న ఆర్య వ‌ర్ధ‌న్.. జెండేతో క‌లిసి త‌న ప్ర‌య‌త్నాల‌ని ఆపాల‌నుకుంటాడు రానీ ఈ లోగానే అనుని తీసుకుని ఆర్య వ‌ర్ధ‌న్ వాయిస్ వున్న పెన్ డ్రైవ్ తో పోలీస్టేష‌న్ కి వెళ్లిన రాగ‌సుధ అనుచేతే ఆర్య‌పై తెలివిగా కేసు పెట్టిస్తుంది. అదే స‌మ‌యానికి ఆర్య వ‌ర్ధ‌న్ ఆడియో వున్న వీడియోని వాట్స ప్ గ్రూపుల ద్వారా అంద‌రికి చేరేలా చేస్తుంది. ఇదే స‌మ‌యంలో ఆర్య వ‌ర్ధ‌న్, జెండే ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తారు. అది ప‌ట్టించుకోకుండా స్టాఫ్ అంతా మొబైల్స్ ఆన్ చేసి ఆర్య‌వ‌ర్ధ‌న్ వాయిస్ వున్న వీడియోని చూస్తూ షాక్ లో వుంటారు. ఏం జ‌రుగుతోంద‌ని అడిగిన జెండే విష‌యం తెలిసి షాక్ కు గుర‌వుతాడు. అదే విష‌యం ఆర్య‌కు చెప్ప‌డానికి వెళితే అప్ప‌టికే ఆర్య మొబైల్ కు ఆ వీడియో చేరుతుంది. ఈ షాక్ లో వుండ‌గానే పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఆర్య వ‌ర్ధ‌న్ అరెస్ట్ అయ్యాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

నా పెళ్లి నా ఇష్టం అని తేల్చేసిన హిమ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గురువారం ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో నిరుప‌మ్, హిమ దగ్గ‌రికి వెళ్లి నాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ రోజు రేపు కార‌ణం చెబుతావ‌ని అనుకున్నాను. కానీ ఇలా వేరే వాళ్ల‌తో పెళ్లికి రెడీ అవుతావు అని అనుకోలేదు అంటాడు. నిజం చెప్పు హిమ న‌న్ను నువ్వు ప్రేమిస్తున్నావు క‌దా? అని మ‌రోసారి అడుగుతాడు నిరుప‌మ్‌. దీంతో కొంత అస‌హ‌నానికి గురైన హిమ నా పెళ్లి సంబంధం ఎందుకు చెడ‌గొట్టావ్.. నా పెళ్లి నా ఇష్టం అని నిల‌దీస్తుంది. హిమ మాట‌ల‌కు నిరుప‌మ్ ఎమోష‌న‌ల్ అవుతాడు. ఆ త‌రువాత నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో బావా అంటుంది హిమ‌. ఆ మాట‌ల‌కు ఆగ్ర‌హంతో ఊగిపోయిన నిరుప‌మ్ ఏం మాట్లాడుతున్నావ్ హిమ అంటూ ఫైర్ అవుతాడు. ఇలా ఇద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా నిరుప‌మ్ కి ఫోన్ రావ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అదే స‌మ‌యంలో అక్క‌డికి శోభ ఎంట్రీ ఇస్తుంది. హిమ‌పై సీరియ‌స్ అవుతుంది. క‌ట్ చేస్తే జ్వాల‌, నిరుప‌మ్ క‌లిసి బ‌యటికి వెళ‌తారు. అది చూసిన శోభ కోపంతో ర‌గిలిపోతుంది. ఇదిలా వుంటే ప్రేమ్ త‌న మ‌న‌స‌లో మాట‌ని హిమ‌కు చెప్పాల‌ని ఎదురుచూస్తుంటాడు. త‌న‌కు ఎలా చెప్పాలా? అని ర‌క ర‌కాలుగా ప్లాన్ లు వేస్తుంటాడు. క‌ట్ చేస్తే నిరుప‌మ్‌, జ్వాల క‌లిసి అనాధాశ్ర‌మానికి వెళ‌తారు. ఇదే స‌మ‌యంలో నిరుప‌మ్ కు స్వ‌ప్న ఫోన్ చేస్తుంది. ఎక్క‌డున్నావ్ అని ఆరాతీస్తుంది. ఆటోవాళ్ల‌తో నీకు స్నేహ‌మేంట్రా అంటూ ఆగ్ర‌హిస్తుంది. ఆ మాట‌ల‌కు చిర్రెత్తుకొచ్చిన నిరుప‌మ్ నాకు ఆటో వాళ్లంటే ఇష్ట‌మ‌ని చెప్పి షాకిస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా మంచి సక్సెస్ అందుకుని సినిమాల్లో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే హోస్ట్ గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఈ జబర్దస్త్ షో స్టేజి ద్వారా పరిచయమైన ఒక కమెడియన్ వినోద్. లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను మెస్మోరైజ్ చేసాడు. శారీ కట్టి స్కిట్ చేస్తే చాలు అచ్చంగా అమ్మాయేనా అన్నట్టుంటాడు. ఐతే ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటి అంటే వినోద్ తండ్రి అయ్యాడు. ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. వినోద్ కన్నా కూడా వినోదినిగా చాలా ఫేమస్ అయ్యాడు. కొంత కాలం క్రితం యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి వినోద్ తో వినోదం పేరుతో వీడియోస్ అప్ లోడ్ చేస్తున్నాడు. ఇందులో తన ఫస్ట్ వీడియొలో అత్త కూతురు విజయలక్ష్మి వివాహం చేసుకుని తనని పరిచయం చేసాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డకు తండ్రిని ఆయనంటూ ఒక ఎమోషనల్ వీడియొ అప్ లోడ్ చేసాడు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయ్యేసరికి నెటిజన్లు అంత వినోద్ కి విషెస్ చెప్తున్నారు.