భార్య బ‌ర్త్‌డేకి డాక్ట‌ర్ బాబు క‌విగా మారాడు

బుల్లితెరపై నిరుప‌మ్ `కార్తీక‌దీపం`లోని డాక్ట‌ర్ బాబు పాత్రతో పాపులారిటీని సొంత చేసుకుని సెల‌బ్రిటీగా మారిన విష‌యం తెలిసిందే. బుల్లితెర శోభ‌న్ బాబుగా అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొంతుదున్న నిరుప‌మ్ `కార్తీక దీపం` సీరియ‌ల్ నుంచి త‌ప్పుకున్నా ఇంకా కొత్త సీరియ‌ల్ ని ప్రారంభించ‌లేదు. త‌ను మ‌ళ్లీ బుల్లితెర‌పై ఎప్పుడు మెరుస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీరియ‌ల్స్ లో క‌నిపించ‌ని డాక్ట‌ర్ బాబు సోష‌ల్ మీడియాలో మాత్రం య‌మ యాక్టీవ్ గా వుంటున్నాడు. ప్ర‌తీ అకేష‌న్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుపుకుంటూ అభిమానుల‌కు అందుబాటులో వుంటున్నాడు. డాక్ట‌ర్ బాబు పాత్రతో పాటు వంట‌ల‌క్క పాత్ర‌ని కూడా సీరియ‌ల్ నుంచి తొల‌గించ‌డంతో సీరియ‌ల్ గ‌తి త‌ప్పి ప‌క్క‌దారులు ప‌ట్టి చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. ఇదిలా వుంటే నిరుప‌మ్ మాత్రం సీరియ‌ల్స్ లో క‌నిపించ‌కుండా సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. భార్య మంజుల‌తో క‌లిసి యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోలు చేస్తున్నాడు. ఇద్ద‌రు క‌లిసి చేస్తున్న వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అతి త‌క్కువ కాలంలోనే ఆ చాన‌ల్ ఫేమ‌స్ అయ్యింది. తాజాగా నిరుపమ్ త‌న భార్య మంజుల పుట్టిన రోజు సంద‌ర్భంగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది. పుట్టిన రోజు సంద‌ర్భంగా మంజుల‌పై ఏకంగా ఓ క‌విత రాశాడు. ఆగ‌ని అల‌.. క‌ర‌గ‌ని క‌ల‌.. అనుబంధాల వ‌ల‌.. త‌ర‌గ‌ని నావ‌లా... ఇది దేవుడి లీల‌.. హ్యాపీ బ‌ర్త్ డే మంజుల‌.. అని చెప్పేస్తూ క‌విత రాశాడు నిరుప‌మ్‌. అత‌డి క‌విత్వాన్ని చూసి నెటిజ‌న్ లు మురిసిపోతూ కామెంట్ లు పెడుతున్నారు.

అఖిలే నెం.1.. హ‌గ్గంటే పారిపోయిన షణ్ముఖ్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ముందు వారంలో జ‌రుగుతున్న `టికెట్ టు ఫినాలే` టాస్క్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇది మంచి ర‌స‌ప‌ట్టుగా సాగుతోంది. యాంక‌ర్ ర‌వి, మాన‌స్‌, సిరి హ‌న్మంత్‌, తాజాగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్  ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసి చేయాల్సిన ర‌చ్చ చేస్తున్నారు. ఇప్ప‌టికే యాంక‌ర్ ర‌వి, మాన‌స్‌, సిరి హ‌న్మంత్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ అంటూ భౌస్ లోకి వచ్చి వెళ్లారు. తాజాగా యూట్యూబ‌ర్ ష‌ణ్మ‌ఖ్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆట దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. అంతా స‌ర‌దా మోడ్ లోకి వ‌చ్చేశారు. సూర్య పాట‌కు స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ణ్ముఖ్ మోజ్ రూం చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. అందులోకి వెళ్ల‌మ‌ని అరియానా అడిగితే వామ్మో నేను వెళ్ల‌నంటూ వెన‌క్కి వ‌చ్చేశాడు. ఆ త‌రువాత ఇంటి స‌భ్యుల గురించి మాట్లాడుతూ హౌస్ లో నిత్యం గొడ‌వ‌ప‌డుతున్న అఖిల్‌, బిందుల గురించి చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. బ‌య‌టికి వెళ్లాక అఖిల్ , బిందు క‌ల‌వ‌లేర‌ని ష‌ణ్ముఖ్ పంచ్ వేయ‌డంతో లేదు లేదు క‌లుస్తాం అని చెప్పాడు అఖిల్. బిందు కూడా క‌లుస్తాం అని చెప్పింది. ఇక ఇంటి స‌భ్యుల పాజిటివ్ పాయింట్స్ గురించి అషురెడ్డి అడ‌గ‌డంతో ఒక్కొక్క‌రి గురించి చెప్ప‌డం మొద‌లు పెట్టాడు.   ముందు గా అఖిల్ గురించి మాట్లాడుతూ త‌నే ఫ‌స్ట్ అనేశాడు. బిందు గారు లేడీ టైగ‌ర్ లేడీ టైగ‌ర్ అంటే బ‌య‌ట‌కు వెళ్లిన త‌రువాత తెలుస్తుంద‌ని పంచ్ వేశాడు. శివ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆడుతున్నాడు. ఒక్క నోటిదూల త‌గ్గించుకుంటే మ‌రింత గ‌ర్వంగా వుంటుందన్నాడు. మిత్రా నాకు ఇదంతా ముందే తెలుస‌ని గేమ్ బాగా ఆడుతున్నార‌ని చెబుతుంటే హ‌గ్ కోసం వెళ్లింది. దీంతో షాకై సిరిని కార‌ణంగా బ్యాడ్ అయిన విష‌యాన్ని గుర్తు చేసుకున్న ష‌న్ను ప్లీజ్ నాకు హ‌గ్ వ‌ద్దు.. ఈ బిగ్ బాస్ లో హ‌గ్ లు వ‌ద్దురా బాబోయ్ అంటూ దండం పెట్టాడు.

నిధి కోసం వేద‌ని ఏడిపిస్తున్న య‌ష్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మీనాక్షి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. పిల్ల‌లే పుట్ట‌న ఓ యువ‌తి.. త‌ల్లి ఆద‌ర‌ణ లేని ఓ పాప మ‌ధ్య పెన‌వేసుకున్న అనుబంధం విధి ఆడిన వింతాట‌లో ఇద్ద‌రిని త‌ల్లీకూతుళ్ల‌ని చేసింది. అనే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్ తో `స్టార్ మా`లో కొన‌సాగుతోంది. ఈ శ‌నివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ దామోద‌ర్ త‌న ముద్దుల చెల్లెలు నిధిని వ‌సంత్ కిచ్చి పెళ్లి చేసి బిజినెస్ బంధాన్ని కాస్తా బంధుత్వంగా మార్చుకోవాల‌ని వుందని య‌ష్ తో చెప్ప‌డంతో త‌న‌కు కొంత టైమ్ కావాల‌ని చెబుతాడు య‌ష్ . అయితే ఈ లోగా నిధిని య‌ష్‌ ఇంటికి గెస్ట్ గా కొన్ని రోజులు వుంటుంద‌ని పంపిస్తాడు దామోద‌ర్‌. అయితే య‌ష్ నిధిని వేద వాళ్ల ఇంట్లో గెస్ట్ గా వుండేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఈ లోగా నిధి ఎంట్రీ ఇస్తుంది. వేద ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. త‌న‌కు తానే ప‌రిచ‌యం చేసుకుంటుంది. ఈలోగా య‌ష్ ఎంట్రీ ఇస్తాడు. ఇంతలో నిధి చేసే అతి చేష్ట‌ల‌కు వ‌సంత్ ని ప్రేమించిన వేద చెల్లెలు చిత్ర వ‌సంత్‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతూ వుంటుంది.  నిధిని వేద త‌న గ‌దిలోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించ‌గా ఏదో ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వుంద‌ని య‌ష్ వెంట‌నే మా ఇంటికి వెళ‌దాం.. మా ఫ్యామిలీని ప‌రిచ‌యం చేస్తానంటూ నిధిని తీసుకెళ‌తాడు. క‌ట్ చేస్తే వంట‌లు చేసే క్ర‌మంలో వేద‌ని ఏడిపించ‌డం మొద‌లు పెడ‌తాడు య‌ష్‌. కూర‌గాయ‌లు మొత్తం వేద‌తో క‌ట్ చేయించి నీలాంటి పొగ‌రుబోతు పొగ‌రు దించితే ఆ కిక్కే వేరంటాడు. దీంతో వేద ఏడ్చుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  య‌ష్ - వేద‌ల కాపురంలో నిధి ఎలాంటి ప్ర‌కంప‌ణ‌లు సృసష్టించింది అన్న‌ది తెలియాలంటే ఈ  రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ల‌క్కీపై చెయ్యెత్తిన లాస్య‌..తుల‌సి ఉగ్ర‌రూపం

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ ఇంటింటి గృహల‌క్ష్మి. ఒక‌నాటి హీరోయిన్ తుల‌సి ఇందులో టైటిల్ పాత్ర‌ని పోషించారు. గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ సితార ఎంట్రీతో కొత్త మ‌లుపు తిరిగింది. త‌ను తుల‌సికి మోర‌ల్ స‌పోర్ట్ గా నిలిచి మొత్తానికి మార్చేసింది. తుల‌సి ముందులా లేదు. పూర్తిగా మారిపోయింది. అయితే అవే ఎమోష‌న్స్‌, అవే ప్రేమ‌లు. క‌ట్టుబొట్టు మాత్రం మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మ‌ద‌ర్ థెరిసా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మాతృదినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతుంటాయి. అక్క‌డికి తుల‌సి వ‌స్తుండ‌టంతో బ‌య‌ట ప్ర‌వ‌ళిక‌, దివ్య త‌న కోసం ఎదురుచూస్తూ వుంటారు. ఈలోగా తుల‌సి రానే వ‌చ్చేస్తుంది. ఆటోలోంచి దిగుతూ వుంటుంది. త‌న‌తో పాటు అత్తా మామ‌లు అన‌సూయ‌, ఆమె బ‌ర్త కూడా వ‌స్తారు. ఇదే వేడుక‌కు లాస్య‌, నందు కూడా వ‌స్తారు. కారు అప్పుడే వ‌చ్చి ఆగుతుంది. తుల‌సి వాళ్లు చూస్తుండ‌గానే లాస్య‌, నందు తో పాటు లాస్య కొడుకు ల‌క్కీ కూడా కారు దిగుతాడు. ద‌గ‌డం దిగ‌డ‌మే తుల‌సిని చూసి `ఆంటీ` అంటూ ప‌రుగుతీస్తాడు. తుల‌సి కూడా అంతే ప్రేమ‌తో ల‌క్కీని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దులు పెడుతుంది. అది చూసిన లాస్య ర‌గిలిపోతుంది. కొడుకు ల‌క్కీ ని `నిన్ను హాస్ట‌ల్ నుంచి తీసుకొచ్చింది నాతో వుండ‌టానికి అంటుంది కోపంగా. తుల‌సి అంటీ అంటే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేక‌పోతే మాట్లాడ‌కు. అంటాడు ల‌క్కీ. దాంతో లాస్య ఈగో దెబ్బ‌తింటుంది. ఏంట్రా పొగ‌రు అంటూ ల‌క్కీపై చెయ్యెత్తుతుంది. అది గ‌మ‌నించిన తుల‌సి ఆగ్ర‌హంతో ఊగిపోతూ.. లాస్య‌పై అరుస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

సౌంద‌ర్య‌కు శౌర్య ఫొటో దొరికిన‌ట్టేనా?

బుల్లితెర పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌యవంతంగా టాప్ రేటింగ్ తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ఇటీవ‌లే మ‌రో కొత్త మ‌లుపు తిరిగింది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌ల కొత్త త‌రంతో ఈ సీరియ‌ల్ ని న‌డిపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ పుంజుకుంటోంది. ఇక ఈ రోజు 1344 వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. అమ్మా నాన్న క‌లిస్తే హిమ‌ని పెళ్లి చేసుకోవ‌డం ఈజీ అవుతుంద‌ని ప్రేమ్ అనుకుంటాడు. ఆ వెంట‌నే హిమ‌కు ఫోన్ చేసి ర‌మ్మంటాడు ప్రేమ్‌. క‌ట్ చేస్తే.. సౌంద‌ర్య‌.. డాక్ట‌ర్ బాబు,దీప‌ల ఫొటో ముందు నిల‌బ‌డి స‌త్యం - స్వ‌ప్న‌ల గురించి బాధ‌ప‌డుతూ వుంటుంది. ఆ త‌రువాత నిరుప‌మ్‌, ప్రేమ్‌, హిమ తింటుంటే జ్వాల వారికి వ‌డ్డిస్తూ వుంటుంది. ఈ క్ర‌మంలో మ‌నం అంతా క‌లిసి కూర్చుని భోజ‌నం చేస్తున్న‌ట్టే మ‌మ్మీ డాడీ క‌లిసి భోంచేయాలి అంటాడు ప్రేమ్‌. ఈలోపు స‌త్య వ‌చ్చేసి జ్వాల అన్నంపెడుతోందిరా బంగారం అంటాడు. ఎక్కువైందా ఏంటీ బంగారం బంగారం అంటున్నావ్ అంటాడు ప్రేమ్‌. క‌ట్ చేస్తే చిత్తు కాగితాలు జ్వాల వెళుతుంది. అక్క‌డొక‌డు జ్వాల డ‌బ్బులు కొట్టేస్తాడు. అది గ‌మ‌నించిన సౌంద‌ర్య డ‌బ్బు లాక్కుని జ్వాల‌కు చెబుతుంది. వెంట‌నే వాడి చెంప ప‌గ‌ల‌గొడుతుంది జ్వాల‌. ఆ త‌రువాత చిత్తు కాగితాల్లో హిమ - శౌర్య ఫొటోలు క‌నిపిస్తాయి. అవి సౌంద‌ర్య కంట ప‌డ్డాయా? ప‌డ‌కుండా శౌర్య ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

జ‌బ‌ర్ద‌స్త్‌కి బిగ్‌ షాక్‌.. రోజా దారిలో అత‌ను కూడా!

గ‌త కొంత కాలంగా బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్‌'. న‌వ్వులు పూయిస్తూ కంటెస్టెంట్ ల స్కిట్ ల‌తో హాస్య ప్రియుల‌కు కావాల్సిన వినోదాన్ని అందిస్తూ వ‌స్తోంది. బుల్లితెర కామెడీ షోల్లో టాప్ రేటింగ్ తో సాగుతూ ఎంతో మందికి అవ‌కాశాల్ని అందిస్తూ వారిని స్టార్లుగా మార్చి పాపులారిటీని అందించింది. అలాంటి షో ప్ర‌స్తుతం ఆ ప‌ట్టుని కోల్పోతున్న‌ట్టుగా తెలుస్తోంది. త‌న వైభ‌వాన్ని కోల్పోతున్న‌ట్టుగా ఒక్కొక్క‌రు ఈ షో నుంచి వెళ్లిపోతున్నారు. గ‌త కొన్నేళ్లుగా టాప్ రేటింగ్ తో సాగుతున్న ఈ షో  ఇప్ప‌డు ఆ క్రేజ్ ని కోల్పోతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ కంటెస్టెంట్ ల స్కిట్ ల‌తో న‌వ్విస్తూ గ‌త కొన్నేళ్లుగా విజ‌య‌వంతంగా సాగుతున్న జ‌బ‌ర్ద‌స్త్ షో కు కోట్ల‌ల్లో అభిమానులున్నారు. యూట్యూబ్ లో ఈ షోకు తిరుగేలేదు. రికార్డ్ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఎపిసోడ్ ప‌రంగా ఈటీవిలో టాప్ రేటింగ్ తో సాగుతున్న ఈ కామెడీ షో నుంచి ఇటీవ‌ల మంత్రి రోజా నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. నాగ‌బాబు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన కాలం నుంచి ఈ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు రోజా. ఇటీవ‌ల ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో జ‌బ‌ర్త‌స్త్ షోని ఆమె వీడాల్సి వ‌చ్చింది. ఆమె వెళ్లిపోవ‌డం జ‌బ‌ర్ద‌స్త్ కు బిగ్ షాక్ గా మారింది. టీమ్ లీడ‌ర్ లు స్కిట్ లు చేస్తుంటే మ‌ధ్య‌లో అదిరిపోయే పంచ్ లు వేస్తుంటారు రోజా. దీంతో మ‌రింత ఫ‌న్‌ జ‌న‌రేట్ అయ్యేది. ఇప్ప‌డు ఆ పంచ్‌లు వేసేవారు లేరు. ఇది ఈ షోకు పెద్ద లోటుగా మారింది. తాజాగా ఈ షోకు ఆయువు ప‌ట్టుగా నిలిచిన హైప‌ర్ ఆది కూడా బ‌య‌టికి వ‌చ్చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాల్లో వ‌రుస అవ‌కాశాలు, మ‌రో ఛాన‌ల్ కొత్త షోలో అవ‌కాశం రావ‌డంతో హైప‌ర్ ఆది జ‌బ‌ర్త‌స్త్ ని వీడిన‌ట్టుగా తెలుస్తోంది. ఇది నిజ‌మైతే ఈ షోకు బిగ్ షాక్ అని అంటున్నారు. 

ఆ రామ్ గోపాల్ వ‌ర్మ చ‌చ్చిపోయాడా?

వివాదాస్ప‌ద అంశాల‌కు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. వివాదాల‌నే త‌న సినిమాల‌కు క‌థా వ‌స్తువుగా చేసుకుంటూ గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌ని సినిమాలుగా తీస్తుంటాన‌ని, వాటిని థియేట‌ర్ ల‌ కు వెళ్లి చూడాలా వ‌ద్దా? అన్న‌ది ప్రేక్ష‌కుల ఇష్ట‌మంటున్నారాయ‌న‌. తాజాగా లెస్బియ‌న్ ల క‌థ‌తో వ‌ర్మ రూపొందించిన చిత్రం `మా ఇష్టం`. ఈ మూవీ విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో న‌టుడు ఆలీ నిర్వ‌హిస్తున్న‌ `ఆలీతో స‌ర‌దాగా` కార్య‌క్ర‌మంలో `మా ఇష్టం` హీరోయిన్ లు నైనా గంగూలీ, అప్స‌రా రాణితో క‌లిసి సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ సంద‌ర్భంగా అలీ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. 'శివ‌, క్ష‌ణ‌క్ష‌ణం, స‌త్య‌, గోవిందా గోవిందా, రంగీలా.. సినిమాలు తీసిన ఆ రామ్ గోపాల్ వ‌ర్మ మీకు ఏమౌతారండీ?' అని అలీ.. వ‌ర్మ‌ని ప్ర‌శ్నిస్తే.. 'ఆ రామ్ గోపాల్ వ‌ర్మ చ‌చ్చిపోయాడు.. సినిమా సినిమాకు నేను మారిపోతూ వుంటాను` అని స‌మాధానం చెప్పాడు వ‌ర్మ‌. 'అయితే మీరే చ‌చ్చిపోతారా?  లేక ఎవ‌రైనా చంపేస్తారా?' అని మ‌ళ్లీ అడిగాడు అలీ. దీంతో 'ఎవ‌రో కాదు నేనే' అంటూ వ‌ర్మ స్ట్రెయిట్ గా స‌మాధానం చెప్ప‌డంతో అలీ ఫ‌క్కున న‌వ్వేశాడు.   'మీ ఇష్టంగా మీరు ఏదైనా తీయోచ్చు.. మీ ఇష్టంగా రిలీజ్ చేయొచ్చు.. కానీ ఇష్టంగా థియేట‌ర్ కి ఆడియ‌న్స్ వ‌స్తారా?' అని అడిగితే .. 'అది వాళ్ల ఇష్టం' అనేశారు. ఇక‌ 'నేను ట్వీట్ చేయ‌డం వ‌ల్ల ఎదుటి వాళ్లు బాధ‌ప‌డ‌తార‌ని మీకు అనిపించ‌దా?' అని అలీ అడిగితే 'మ‌నం ఏదైనా అంటే ఎదుటి వారు ఫీల్ అవుతార‌నుకుంటే అంద‌రూ నోరుమూసుకుని ఇంట్లోనే కూర్చోవాల్సి వుంటుంది. నేను గ‌త‌ 20 ఏళ్ల నుంచి మెయింటైన్ చేస్తుంది ఒక్క‌టే.. నా ఇష్టం వ‌చ్చిట్టు బతుకుతా, మీకు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మీరు చావండి' అన్నారు. ఇక ఎల‌క్ష‌న్స్ లో నిల‌బ‌డితే మీకు ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌ని అడిగితే ఒక్క ఓటు కూడా రాద‌ని, ఎందుకంటే బుద్ధివున్న వాడు త‌న‌కు ఓటు వేయ‌డ‌ని చెప్పేశాడు. అలాగే తాను ముఖ్య‌మంత్రి అయితే మ‌రుక్ష‌ణం డ‌బ్బంతా తీసుకుని విదేశాల‌కు చెక్కేస్తాన‌ని చెప్ప‌డంతో అలీ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ న‌వ్వులు పూయిస్తోంది. 

అనసూయని తగులుకున్న కరాటే కల్యాణీ

  త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం హీరో విశ్వ‌క్ సేన్ చేసిన ప్రాంక్ వీడియోపై దుమారం మొద‌లైంది. ప‌బ్లిక్ లో న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్న పాగ‌ల్ సేన్ అంటూ దీనిపై టీవి 9 ఛాన‌ల్ డిబేట్లు పెట్ట‌డంతో వివాదం మ‌రింత ముద‌రింది. అయితే ఈ డిబేట్ కి ఆహ్వానించ‌డంతో వెళ్లిన విశ్వ‌క్ సేన్ కు డిబేట్ ని నిర్వ‌హిస్తున్న యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లికి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. డిబేట్ లో పాల్గొన్న విశ్వ‌క్ సేన్ ని డిప్రెస్డ్ ప‌ర్స‌న్ అని, అందుకే అత‌న్ని పాగ‌ల్ సేన్ అంటారంటూ అవ‌మానించ‌డంతో విశ్వ‌క్ సేన్ లైవ్ లోనే త‌న‌పై సీరియ‌ల్ అయ్యాడు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగి వివాదానికి దారితీసింది. వెంట‌నే గెటౌట్ ఆఫ్ మై స్టూడియో అంటూ విశ్వ‌క్‌సేన్ ని ప‌దే ప‌దే అన‌డంతో అత‌ని డిబేట్ కోసం స్టూడియోకు పిలిచి ఇప్పుడు గెట్ ఔట్ అంటారా అంటూ `ఎఫ్` అనే ప‌దం వాడాడు. ఇప్ప‌డు ఇదే అత‌న్ని ఇర‌కాటంలో ప‌డేసింది. ఆ త‌రువాత త‌న తొంద‌ర పాటుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పినా ఈ వివాదం స‌ద్దుమ‌న‌గ‌డం లేదు. అయితే దీనిపై పూర్తి మ‌ద్ద‌తు విశ్వ‌క్ సేన్ కే లభిస్తోంది. నెటిజ‌న్ ల‌తో పాటు చాలా మంది సెల‌బ్రిటీలు కూడా విశ్వ‌క్ సేన్ కే మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి` ఫేమ్ క‌స్తూరి మ‌ద్దుతు తెల‌ప‌గా న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ ట్విట్ట‌ర్ వేదిక‌గా టివి9 పై వారి స్టాండ్ పై నిప్పులు చెరిగాడు. డ‌బ్బుల కోస‌మే అంతా చేస్తుంటారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ విశ్వ‌క్ సేన్ కు అండ‌గా నిలిచాడు. తాజాగా క‌రాటే క‌ల్యాణి కూడా ఈ జాబితాలో చేరింది. ఫేస్ బుక్ వేదిక‌గా క‌రాటే క‌ళ్యాణి .. విశ్వ‌క్ సేన్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తూనే యాంక‌ర్‌, న‌టి అన‌సూయ‌ని త‌గులుకుంది. ఈ వివాదంలోకి అన‌సూయ‌ని కూడా లాగేసింది. టీవీ వ‌ర్సెన్ సేన్ లో పూర్తిగా టీవీ వాళ్ల‌దే త‌ప్పు. నేను ఆ హీరోకే స‌పోర్ట్ చేస్తా. అన‌సూయ ఎన్నోసార్లు `ఎఫ్‌` అనే ప‌దం వాడిన‌ప్పుడు ప‌క్క‌నే వున్న నువ్వు మెలిక‌లు తిరుగుతూ ఆనందించావు క‌దా? అంటూ యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లికి, అన‌సూయ‌కు చుర‌క‌లంటించింది క‌రాటే కల్యాణి.

య‌ష్ - వేద‌ల మ‌ధ్య చిత్ర ప్రేమ ర‌గ‌డ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఏడేళ్ల క్రితం వ‌చ్చిన హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్  `యోహే మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించగా కీల‌క పాత్ర‌ల్లో బేబీ మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, రాజా శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్, మీనాక్షి త‌ద‌త‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ త‌న చెల్లెలిని మీ త‌మ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటున్నాన‌ని అంటాడు. ఇందుకు య‌ష్ నాకు కొంచెం టైమ్ కావాలి అంటాడు. అలాగే వ‌సంత్ ని కూడా క‌నుక్కుంటాన‌ని చెబుతాడు. దీంతో హ్యాపీగా ఫీలైన దామోద‌ర్ రావు బిజినెస్ లో య‌ష్ కు మ‌రింత అండ‌గా వుంటానంటాడు. దాంతో య‌ష్ ఎలాగైనా ఆనంద్ ని పెళ్లికి ఒప్పించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. క‌ట్ చేస్తే ...వేద మాత్రం వ‌సంత్ కు చిత్ర కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని య‌ష్ తో చెబుతుంది. అది ఎట్ట‌ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌ద‌ని య‌ష్ అంటే జ‌రిగేలా చేస్తాన‌ని వేద ఛాలెంజ్ చేస్తుంది. ఇద్ద‌రి ప్రేమ‌ను మీ బిజినెస్ కోసం బ‌లిచేయ‌వ‌ద్దంటుంది. అయినా నువ్వెరు నాకు చెప్ప‌డానికి గెట్ ఔట్ అంటూ వేద‌పై అరుస్తాడు య‌ష్‌. ఆ త‌రువాత జ‌రిగిన విష‌యాన్ని వ‌సంత్ కు చెబుతాడు. అంతే కాకుండా దామోద‌ర్ రావు చెల్లెలిని క‌ల‌వ‌మంటాడు. ఆ త‌రువాత వేద త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రికి వెళ్లి ఓ బిజినెస్ ప‌ని మీద నా బిజినెస్ పార్ట్న‌ర్ చెల్లెలు ఇక్క‌డికి వ‌స్తోంద‌ని, అమెని కొన్ని రోజుల పాటు మీ ఇంట్లో వుండ‌నివ్వాల‌ని చెబుతాడు. ఇది గ‌మ‌నించిన వేద .. చిత్ర నువ్వు ఏ విష‌యంలో వెన‌క్కి త‌గ్గొద్ద‌ని నీ ప్రేమ‌కు నేనున్నాన‌ని చెబుతుంది. దీంతో వేద - య‌ష్ ల మ‌ధ్య చిత్ర ప్రేమ ర‌గ‌డని సృష్టిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

`ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`  ఫుల్ సపోర్ట్ విశ్వక్‌సేన్ కే

గెటౌట్ అంటూ టీవీ 9 స్టూడియో నుంచి గెంటివేయ‌బ‌డ్డ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ కు నెటిజ‌న్ ల నుంచి మ‌ద్దుతు పెరుగుతోంది. ఐ స‌పోర్ట్ విశ్వ‌క్ సేన్ అంటూ ట్వ‌ట్ట‌ర్ లో ఈ యువ హీరోకు చాలా మంది నెటిజ‌న్స్ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇదే సంద‌ర్భంగా బ్యాన్ యాంక‌ర్ దేవి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అంతే కాకుండా స‌ద‌రు యాంక‌ర్ పై వ్య‌క్తిగ‌తంగా దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఇదేనా జ‌ర్న‌లిజం అంటే స్టూడియోకి పిలిచి అవ‌మానిస్తారా? అంటూ మండిప‌డుతున్నారు. ఈ జాబితాలో `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి` క‌స్తూరి చేరింది. న‌టిగా వెండితెర‌పై అల‌రించిన క‌స్తూరి ఇటీవ‌లే `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న ఇంటింటి గృహ ల‌క్ష్మి సీరియ‌ల్ తో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గ‌త కొన్ని నెల‌లుగా ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్ లోకి మ‌రో న‌టి సితార కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు. ఇదిలా వుంటే తాజాగా విశ్వ‌క్ సేన్ పై టీవీ ఛాన‌ల్ యాంక‌ర్ లైవ్ టిబేట్ కి పిలిచి అవ‌మానించ‌డం గ‌మ‌నించిన క‌స్తూరి దీనిపై మండిప‌డింది. విశ్వ‌క్ సేన్ కు మ‌ద్ద‌తుగా నిలిచింది. నేను హిట్ సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి విశ్వ‌క్ సేన్ ను ఇస్ట‌ప‌డుతున్నాను. ఈ రోజు ఓ వీడియో చూశాను. దాంతో అత‌నిపై మ‌రింత గౌర‌వం పెరిగింది. అస‌లు ఏ ప్రాంక్ చేసినా కూడా రానంత ప‌బ్లిసిటీ టీవి9 క్రియేట్ చేసింది. ఆల్ ది బెస్ట్ సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వ‌క్ సేన్.. నీ కొత్త సినిమా `అశోకవ‌నంలో అర్జున క‌ల్యాణం` చిత్రానికి కూడా ఆల్ ది బెస్ట్` అంటూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విశ్వ‌క్ సేన్ కు మ‌ద్ద‌తుగా నిలిచింది `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి` క‌స్తూరి.  

రాకింగ్ రాకేష్‌.. జోర్దార్ సుజాత.. ఏం జ‌రుగుతోంది?

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ప్రేమ జంట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ గౌత‌మ్ క్రేజీ జోడీగా పాపుల‌ర్ అయ్యారు. ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ స్టేజ్ పై సుడిగాలి సుధీర్ - ర‌ష్మీల మ‌ధ్య స్కిట్ అంటే అది నెట్టింట ఓ రేంజ్ లో పేలుతూ వ‌స్తోంది. తాజాగా ఈ షో లో మ‌రో జంట వార్త‌ల్లో నిల‌వ‌డం మొద‌లైంది. అదే జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్‌. ఈ మ‌ధ్యే వీరిద్ద‌రు క‌లిసి స్కిట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. కామెడీ స్టార్స్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన సుజాత ఫైన‌ల్ గా రాకింగ్ రాకేష్ తో క‌లిసి స్కిట్ లు చేస్తోంది. ఇక్క‌డే వీరి మ‌ధ్య మంచి స్నేహం మొద‌లైంది. తాజాగా రాకేష్ కోసం సుజాత కాస్ట్లీ గిఫ్ట్ ని ఇవ్వ‌డం ఇప్ప‌డు ఆక్తిక‌రంగా మారింది. ఈ జంట గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగితేలుతున్నారు. జ‌బ‌ర్త‌స్త్ వేదిక సాక్షిగా త‌మ ప్రేమ బంధాన్ని, ల‌వ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టి షాకిచ్చారు. అప్ప‌టి నుంచి వీరి ర‌చ్చ ఓ రేంజ్ లో సాగుతూనే వుంది. స‌ర‌దాగా వుంటూనే ఒక‌రిపై ఒక‌రికి వున్న ప్రేమ‌ని తెలియ‌జేస్తున్నారు. తాజాగా రాకింగ్ రాకేష్ కి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి సుజాత స‌ర్ ప్రైజ్ చేసింది. ల‌క్ష రూపాయ‌ల విలువైన స్మార్ట్ ఫోన్ ని అత‌నికి గిఫ్ట్ గా ఇచ్చింది. గిఫ్ట్ చూసి ఎమోష‌న‌ల్ అయిన రాకింగ్ రాకేష్ న‌మ్మ‌లేక‌పోన్నానంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. సుజాత ఫోన్ గిప్ట్ గా ఇవ్వ‌డాన్ని మొద‌ట రాకేష్ న‌మ్మ‌లేద‌ట‌. జోక్ చేస్తుంద‌ని భావించాడ‌ట‌. కానీ ఆమె సీరియ‌స్ గానే ఇస్తున్న‌ట్టు చెప్ప‌డంతో రాకేష్ నోట మాట రాద‌ట‌. అలాగే త‌న‌ని, ఫోన్ ని చూస్తూ వుండిపోయాడ‌ట‌. ల‌క్షా 20 వేల రూపాయ‌ల విలువ చేసే సామ్ సాంగ్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వ‌డాన్ని తాను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నాడ‌ట‌. ఇదే ఫోన్ ను సుజాత త‌న‌కోసం కొనుక్కుంటానంటే వ‌ద్ద‌ని వారించిన రాకింగ్ రాకేష్ ఏకంగా ఆ ఫోన్ ని త‌న‌కే ఇవ్వ‌డంతో మ‌రింత షాక్ కు గుర‌య్యాడ‌ట‌. షాక్ నుంచి తేరుకున్న రాకేష్ .. సుజాత త‌న‌కు బెంజికారు కొనిచ్చే స్థాయికి ఎద‌గాల‌ని కోరుకున్నాడ‌ట‌.

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ లోడింగ్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే టాప్ 5 ఫైన‌ల్ కాబోతోంది. అంతే కాకుండా మ‌రో మూడు వారాల్లో ఓటీటీ సీజ‌న్ కి ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోంది. ప్ర‌స్తుతం హౌస్ లో వున్న 9 మంది కంటెస్టెంట్ ల‌లో బిందు మావి టైటిల్ రేస్ లో దూసుకుపోతోంది. అఖిల్ సీజ‌న్ 4 లో ర‌న్న‌ర్ గా మిగిలిన‌ట్టే ఈ ఓటీటీ వెర్ష‌న్ లోనూ వెన‌క‌బ‌డే వున్నాడు. ఈ సారి కూడా త‌ను విజేత కాలేడ‌న్న‌ది తేలిపోయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ ని ప్ర‌క‌టించ‌కుండానే సీజ‌న్ 6 కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే కంటెస్టెంట్ ల వేట కూడా మొద‌లైన‌ట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా దాదాపుగా కంటెస్టెంట్స్ ని కూడా సైలెంట్ గా ఫైన‌ల్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలే వేదిక‌గా నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారో అదే విధంగా ఈ నాన్ స్టాప్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే వేదిక‌గా సీజ‌న్ 6 ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. సీజ‌న్ 6 ఎప్పుడు ప్రారంభించ‌బోతున్నార‌నే విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జున వెల్ల‌డించనున్నార‌ట‌. ఇక సీజ‌న్ 6 కి కూడా నాగార్జ‌న‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ట‌. ఇంత‌కీ సీజ‌న్ 6 కంటెస్టెంట్స్ గా ఎవ‌రు రాబోతున్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిగా మారింది. బ‌గ్ బాస్ నాన్ స్టాప్ లో ఇప్ప‌టికే బెస్ట్ పెర్ఫార్మార్ గా పేరు తెచ్చుకున్న యాంక‌ర్ శివ సీజ‌న్ 6 లోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ట‌. ఇక అఖిల్, అషురెడ్డి, బాబా భాస్క‌ర్ ఇప్ప‌టికే బిగ్ బాస్ లోకి వ‌చ్చి వెళ్లారు కాబ‌ట్టి వారికి ఛాన్స్ లేదు. అయితే ఇక మిగిలిన కంటెస్టెంట్ లు ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సుమ‌న్ టీవి యాంక‌ర్లు రోష‌న్, మంజూష ఫిక్స్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు చాలా మంది యూట్యూబ్ స్టార్లు, యాంక‌ర్ల పేర్లు ప్ర‌చారంలో వున్నాయి. అంతే కాకుండా ఈ సీజ‌న్ లో ఓ కామ‌న్ మెన్ కి కూడా అవ‌కాశం ఇవ్వ‌బోతున్నార‌ని తెలిసింది. ఆ కామ‌న్ మెన్ ఎవ‌రుంటారో చూడాలి.

ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌తో సిరి ఎంట్రీ.. మ‌ళ్లీ అవే ముచ్చ‌ట్లు

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎండింగ్ కి ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రో మూడు వారాలే వుండ‌టంతో టాప్ 5 లో ఎవ‌రుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ఇప్పుడు కీల‌కంగా మారింది. టాప్ 5కి డైరెక్ట్ గా నామినేట్ అయ్యే అవ‌కాశాన్ని ఈ పాస్ క‌ల్పిస్తుంది. అయితే ఈ పాస్ ని అందించ‌డానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ సిరి హ‌న్మంత్‌. బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరి హ‌న్మంత్ -ష‌ణ్ముఖ్ చేసిన ర‌చ్చ‌ అంతా ఇంతా కాదు. మోజ్ రూంలో ముచ్చ‌ట్లు.. అల‌క‌లు.. ఏడుపులు.. బెడ్ రూం విన్యాసాలు.. హ‌గ్గులు, కిస్సులు.. దీంతో వీరి ఇమేజ్ డ్యామేజ్ కావ‌డం.. ష‌ణ్ముఖ్ కు ఏకంగా టైటిల్ మిస్స‌వ‌డం తెలిసిందే. అయితే టాప్ 5 కంటెస్టెంట్ కి  బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ ని డిసైడ్ చేసే బాధ్య‌త‌ను అప్ప‌గించింది బిగ్ బాస్ టీమ్. బిగ్‌బాస్ నాన్ స్టాప్ చివ‌రి అంకానికి చేర‌డంతో కీల‌క‌మైన ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ని కంటెస్టెంట్ కి అందించ‌డానికి హౌస్ లోకి అడుగుపెట్టింది సిరి. ఇంటి స‌భ్యుల‌తో పాత ముచ్చ‌ట్లు చెప్పుకుంటూ వ‌చ్చింది. అయితే ఈ ముచ్చ‌ట్లలో ష‌ణ్ముఖ్ టాపిక్ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అంతా ఊహించారు. అనుకున్న‌ట్టే ష‌ణ్ముఖ్ ముచ్చ‌ట్లు  చెప్ప‌డం మొద‌లు పెట్టింది సిరి. ష‌న్ను, త‌ను క‌లిసి వున్న మోజ్ రూం, బెడ్ రూం ల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని మ‌రోసారి గుర్తు చేసుకుంది. మోజ్ రూం కి వెళ్లి ష‌న్ను, జెస్సీల‌తో తాను ఇక్క‌డే వుండేదాన్న‌ని చెప్పుకొచ్చింది. బెడ్ గురించి జెబుతుంటే న‌ట‌రాజ్ మాస్ట‌ర్ దీనిపై మీ ఇద్ద‌రితో పాటు ఇంకొక‌రు కూడా వుండేవారే అంటూ సెటైర్ వేశాడు. అది గ‌మ‌నించిన సిరి `అవును ముగ్గురం వుండే వాళ్లం. నేను చెప్ప‌క‌పోయినా మీరు ఆగ‌రు క‌దా? అంటూ పంచ్ వేసింది. ఇక చివ‌ర్లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, బాబా భాష్క‌ర్ ల మ‌ధ్య కుకింగ్ విష‌యంలో గొడ‌వ జరిగింది. స‌హ‌నం కోల్పోయిన బాబా భాస్క‌ర్ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు షాకిచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

కొంప ముంచిన‌ య‌ష్‌..వ‌సంత్‌కు చిత్ర బ్రేక‌ప్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ఏడేళ్ల క్రితం వ‌చ్చిన హిందీ సీరియ‌ల్ `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మీనాక్షి, ఆనంద్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్రసారం అవుతోంది. త‌ల్లి కాలేని ఓ యువ‌తికి త‌ల్లి వదిలేసిన ఓ పాప‌కు, ఆ పాప కోసం ఎంత దూర‌మైనా వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డే ఓ తండ్రి.. ఇలా ఈ మూడు పాత్ర‌ల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది. రౌడీల‌తో నేను ఫైట్ చేసినందుకు డిజప్పాయింట్ అయ్యావా అని వేద‌ని య‌ష్ అగుడుతాడు. అంతే కాకుండా వాళ్లు న‌న్ను చిత‌క్కొట్టి వుంటే హ్యాపీగా ఫీల‌య్యే దానివా అంటాడు. దాంతో మండిన వేద అవును అంటుంది. క‌ట్ చేస్తే.. వ‌సంత్ కోసం చిత్ర పార్క్ లో ఎదురుచూస్తూ వుంటుంది. ఫోన్ చేసినా అనంద్ ఆన్స‌ర్ చేయ‌క‌పోవ‌డంతో ఆవేశంతో ఊగిపోతూ వుంటుంది. అయితే య‌ష్ ప‌క్క‌న వుండ‌టంతో చిత్ర ఫోన్ ని ఆనంద్ అటెండ్ చేయ‌లేక‌పోతాడు. రెండు గంటల త‌రువాత ఆనంద్ చిత్ర ద‌గ్గ‌రికి వెళ‌తాడు. అదే స‌మ‌యంలో ఆనంద్ , చిత్ర‌ల‌ని గ‌మ‌నిస్తూ య‌ష్ దూరంగా నిల‌బ‌డి వుంటాడు. వ‌సంత్ సారీ అని చెబుతుండ‌గానే కోపంతో ర‌గిలిపోతున్న చిత్ర చెంప ప‌గ‌ల‌గొడుతుంది. అది చూసి య‌ష్ షాక‌వుతాడు. ఏంటీ పిల్ల ఇలా రెచ్చిపోతోంద‌ని ఫైర‌వుతాడు. వ‌సంత్ లేట్ కావ‌డానికి కార‌ణం అంటూ వివ‌రిస్తుంటే జాబ్ ముఖ్య‌మైన‌ప్పుడు నీకు ల‌వ్ ల‌వ‌ర్ ఎందుక అని చిత్ర‌ నిల‌దీస్తుంది. నేనంటే ఇష్టం లేని వాడివి నీకు నేను అవ‌సరం లేన‌ప్పుడు నువ్వు నాకు అవ‌స‌రం లేదంటూ బ్రేక‌ప్ చెబుతుంది. అది త‌ట్టుకోలేని వ‌సంత్ ప్లీజ్ అలా అనొద్దు అంటూ చిత్ర కాళ్లు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన య‌ష్ .. ఐదు నిమిషాలే ఆగ‌లేనిది లైఫ్ అంతా నీతో ఎలా వుంటుంది అంటూ వ‌సంత్ ని అక్క‌డి నుంచి తీసుకెళ‌తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. వేద .. య‌ష్ పై ఎందుకు సీరియ‌స్ అయింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

జ్వాల‌పై శివాలెత్తిన సౌంద‌ర్య

బుల్లితెర‌పై ప్ర‌సారం అవ‌తున్న సీరియ‌ల్ `కార్తిక‌దీపం`. గ‌త కొన్ని నెల‌లుగా గాడి త‌ప్పిన ఈ సీరియ‌ల్ తాజాగా మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేస్తోంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌ని ఎండ్ చేసిన ద‌ర్శ‌కుడు వారి పిల్ల‌లతో కొత్త కథ మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ విశేషాలేంటో ఒక‌సారి చూద్దాం. పార్శిల్స్ డెలివ‌రీ కోసం వ‌చ్చిన జ్వాల .. సౌంద‌ర్య క‌నిపించ‌గానే మీ మ‌న‌వ‌రాలు బొమ్మ సంగ‌తి ఎక్క‌డి దాకా వ‌చ్చింది అని అడుగుతుంది. ఆర్టిస్ట్ ఫోన్ చేస్తే ఎత్త‌డం లేదు. నేనే స్వ‌యంగా వెళ్లి తీసుకురావాలి అంటుంది. ఆ మాట‌లు విన్న జ్వాల‌.. నేను మీ మ‌న‌వ‌రాల‌ని నాకు చెప్పాల‌ని అనిపించిన‌ప్పుడే నీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాను అని మ‌నసులో అనుకుంటుంది. ఇక సౌంద‌ర్య అక్క‌డి నుంచి ఆర్టిస్ట్ ద‌గ్గ‌ర బొమ్మ క‌లెక్ట్ చేసుకోవ‌డానికి వెళ్తుంది. దాంతో జ్వాల నాన‌మ్మ నా బొమ్మ‌ను ఎక్క‌డ చూస్తుందో అనే భ‌యంతో త‌ను కూడా వెళుతుంది. సౌంద‌ర్య నువ్వు ఎందుకు వ‌చ్చావు ఇక్క‌డికి అని అడ‌గ‌గా.. మేము కూడా బొమ్మ గీయిస్తున్నాం అని జ్వాల అంటుంది. ఆ త‌రువాత సౌంద‌ర్య .. గీత కోసం వెళ్ల‌గా గీత అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయింది అని తెలుస్తుంది. ఇక మ‌న‌వ‌రాలి మీద ప్రేమ క‌న్నా మ‌న‌వ‌రాలి బొమ్మ‌తోనే ఎక్కువ అవ‌స‌రం ఉన్న‌ట్టుంది అని జ్వాల‌ అంటుంది. దాంతో సౌంద‌ర్య .. జ్వాల‌పై మండిప‌డుతుంది. నా ముందు నుంచి వెళ్లిపో అంటూ శివాలెత్తుతుంది. క‌ట్ చేస్తే జ్వాల ఇంట్లో త‌న కోసం హిమ ఎదురుచూస్తూ వుంటుంది. ఇంటికి చేరుకున్న జ్వాల‌.. ఆ ఆర్టిస్ట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింద‌ట ఇక పాత కాగితాలు అన్నీ చెత్త పేప‌ర్లు కొనే వాడికి ఇచ్చేశారు అని చెబుతుంది. దీంతో హిమ ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకుంటుంది. సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది. మ‌రో వైపు నిరుప‌మ్ .. హిమ‌కు త‌న ప్రేమని చెప్పే విష‌యంలో జ్వాల స‌హాయం తీసుకోవాల‌నుకుంటాడు. అనుకున్న వెంట‌నే జ్వాల‌కు కాల్ చేస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌థ ఏ మ‌లుపు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

టార్గెట్ అరియానా.. బుద్ది చూపించిన అఖిల్‌

రేస్ టు ఫినాలే ముందు జ‌రిగే చివ‌రి నామినేష‌న్స్ సోమ‌వారం మొద‌ల‌య్యాయి. దీని హీట్ మామూలుగా లేదు. ఫైన‌ల్ కి మ‌రో మూడు వారాలే వుండ‌టంతో టాప్ 5 లో నిలిచేది ఎవ‌రు? టైటిల్ విన్న‌ర్ గా క‌ప్పుని సొంతం చేసుకునేది ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం నామినేష‌న్స్ కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో అఖిల్, అరియానాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. నిజానికి ఫ్యామిలీ మెంబ‌ర్స్ హౌస్ లోకి వ‌చ్చి వెళ్ల‌డంతోనే ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయింది. అషురెడ్డిని బ‌య‌ట నుంచి సపోర్ట్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ సైతం బిందు మాధ‌వికి టాప్ ప్లేస్ ఇవ్వ‌డంతో త‌నే టైటిల్ విన్న‌ర్ అనే సంకేతాలు ఇంటి స‌భ్యుల‌కు క్లియ‌ర్ గా వెళ్లిపోయాయి. హౌస్ లోకి వ‌చ్చిన అనీల్ అక్క కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. అయితే హౌస్ లో వున్న అరియానా కూడా ఈ సారి ఉమెన్ బిగ్ బాస్ విన్న‌ర్ కావాల‌ని గ‌ట్టిగా వాదించింది. దీంతో అఖిల్ ఎప్ప‌టిలాగే త‌న బుద్ధి చూపించేశాడు. ఈసారి తానే విన్న‌ర్ అనే భ్ర‌మ‌ల్లో వున్న అఖిల్ నామినేష‌న్స్ లో ఈ విషయంపై అరియానాని టార్గెట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా హౌస్ లో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అరియానా `ఉమెన్ కార్డ్` తీసుకురావ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని మొఖం మీదే చెప్పేశాడు. అమ్మాయిలు గెలవాల‌ని కోరుకుంటున్నా అని అన్నావ్ అమ్మాయి గెల‌వాల‌ని అనుకున్న నువ్వు దానికి త‌గ్గ‌ట్టుగా గేమ్ ఎందుకు ఆడ‌లేదు` అని అఖిల్ అరియానాపై మండిప‌డ్డాడు. దీంతో అరియానా బ‌య‌ట టాక్ అదే వుంది. దాన్నే నేను కోరుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసింది. అది రాంగ్ అని అకిల్ అన‌డంతో `నేను గెలిచినా గెల‌వ‌క‌పోయినా ఒక స్ట్రాంగ్ ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ గెల‌వాలి అంటూ గ‌ట్టిగా అరిచి చెప్పింది అరియానా. దీంతో అఖిల్ ఎవ‌రు బాగా ఆడితే వాళ్లే టైటిల్ విన్న‌ర్ అవుతారంటూ మ‌ళ్లీ ఫైర‌య్యాడు.

అభిమ‌న్యుకి వేద సీరియ‌స్‌ వార్నింగ్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఏడేళ్ల క్రితం హిందీలో రూపొంది విజ‌య‌వంత‌మైన సీరియ‌ల్ `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. దివ్యాంక టి. ద‌హియా, క‌ర‌ణ్ ప‌టేల్ జంట‌గా న‌టించారు. ఇదే సీరియ‌ల్ తెలుగు రీమేక్ లో నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల ఇత‌ర పాత్ర‌లు పోషించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఓ పాప కోసం ఓ త‌ల్లి కాని త‌ల్లి ప‌డే ఆరాటం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ వివ‌రాలేంటో ఒక‌సారి చూద్దాం. ఖుషీ కోసం వేద‌తో క‌లిసి స్కూల్ కి వెళ్లిన య‌ష్ అక్క‌డ పేరెంట్స్ కి స్కూల్ టీమ్ పెట్టిన ఓ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. త‌మ భార్య‌ల‌ని అందంగా భ‌ర్త‌లు అలంక‌రించాల‌న్న‌ది టాస్క్‌. ఈ టాస్క్ లో య‌ష్‌, వేదని అందంగా అలంక‌రించి ముస్తాబు చేస్తాడు. ఇది అంద‌రికి న‌చ్చుతుంది. దీంతో య‌ష్ - వేద‌ల జంట ఈ టాస్క్ లో విన్న‌వుతారు. గెలిచిన ఆనందంలో తిరిగి ఇంటికి వ‌స్తున్న వీరిని కొంత మంది అగంత‌కులు దాడికి దిగుతారు. కార్ కి అడ్డంగా ప‌డుకుని ఓ దొంగ డ్రామాలాడుతుంటే నిజ‌మ‌ని న‌మ్మి య‌ష్ అత‌ని ద‌గ్గ‌రికి వెళ‌తాడు. అద‌ను చూసి ఆ వ్య‌క్తి క‌త్తితో య‌ష్ ని ఎటాక్ చేస్తూ డ‌బ్బు, ఒంటిపై వున్న చైన్ రింగ్ ఇచ్చేయ‌మంటాడు. ఇంత‌లో మ‌రి కొంత మంది గ్యాంగ్ య‌ష్ ని చుట్టుముడ‌తారు. విష‌యం అర్థం చేసుకున్న య‌ష్ .. వేద‌కు ఖుషీ జాగ్ర‌త్త అని చెప్పి రౌడీల‌ని చెడుగుడు ఆడేస్తాడు. ఈ క్ర‌మంలో య‌ష్ చేతికి గాయం అవుతుంది. ఇంటికి వెళ్లాక క‌ట్టు క‌ట్టిన వేద య‌ష్ కి టాబ్లెట్స్ ఇస్తుంది. కొంచెం ఓవ‌ర్ గా లేదూ అని య‌ష్ అన‌డంతో నా భ‌ర్త గురించి ఆ మాత్రం వుంటుంది లే అంటుంది. క‌ట్ చేస్తే ఈ దాడికి కార‌ణం అభిమ‌న్యు అని తెలుస్తుంది. విష‌యం తెలిసిన వెంట‌నే అభిమ‌న్యుకు వార్నింగ్ ఇస్తుంది వేద‌. అన‌వ‌స‌రంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నావ్ అంటాడు అభిమ‌న్యు. ఇలాంటి నీచుడి కోస‌మా నీ భ‌ర్త‌కు ద్రోహం చేస్తున్నావ్ మాళ‌విక. నీ జీవితం ఎంత అంధ‌కారం అవుతుందో నీకు ఇప్ప‌డు తెలియ‌దు.. క‌నీసం నిన్ను పెళ్లి చేసుకుంటాన‌ని కూడా ఈ అభిమ‌న్యు అన‌డం లేదు.. ఆ టాప‌కే తీసుకురావ‌డంలేదు. అని మాళ‌విక క‌ళ్లు తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తుంది వేది.. వేద మాట‌లు విన్న మాళ‌విక వెంట‌నే ఆలోచ‌న‌లో ప‌డి నిజ‌మే క‌దా అని అభిమ‌న్యు కాల‌ర్ ప‌ట్టుకుంటుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అభిమ‌న్యు మ‌ళ్లీ ఎలాంటి మాయ చేశాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

నామినేష‌న్స్ లో బిందు మాధ‌వి వింత‌ ప్ర‌వ‌ర్త‌న‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో మ‌రో మూడు వారాల్లో ముగియ‌బోతోంది. అయితే ఈ షోలో విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది గ‌త కొన్ని వారాలుగా క్లారిటీ వ‌చ్చేసింది. ఎవ‌రిని అడిగిన ట‌క్కున్న బిందు మాధ‌వి పేరునే చెప్పేస్తున్నారు. ఇటీవ‌ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంద‌ర్బంలోనూ ఇదే విష‌యాన్ని అంతా ఇండైరెక్ట్ గా వెల్ల‌డించారు. అయితే సోమ‌వారం నామినేష‌న్స్ సమ‌యంలో బిందు మాధ‌వి ప్ర‌వ‌ర్తించిన దీరు మాత్రం విన్న‌ర్ అవుతుందా? అనే అనుమానాల్ని క‌లిగిస్తోంది. మూడు వారాలు.. రెండు నామినేష‌న్స్ .. ఈ గండం గ‌ట్టెక్కితే బిందునే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ కానీ బిందు వింత ప్ర‌వ‌ర్త‌న ఇప్ప‌డు అమెని రేస్ నుంచి వెన‌క్కి నెట్టేలా క‌నిపిస్తోంది. ఎప్ప‌టిలాగే సోమ‌వారం నామినేష‌న్స్ రౌండ్ మొద‌లైంది. బాబా భాస్క‌ర్ కెప్టెన్ కావ‌డంతో ఈ వారం నామినేష‌న్స్ ఆయ‌న‌తో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శివ‌, అఖిల్ మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రిగింది. వీరిద్ద‌రి నామినేష‌న్స్ లో బిందు మాధ‌వి బాత్రూమ్ టాపిక్ మొద‌లై చిచ్చు పెట్టింది. బాత్రూమ్ టాపిక్ నువ్వు ఎందుకు ఎత్తావ్ అని శివ‌.. నువ్వు న‌వ్వ‌లేదా?.. ఆ టాపిక్ తీయ‌డానికి నీకు సిగ్గులేదా? అని అఖిల్ .. ఒకరిపై ఒక‌రు దారుణంగా సెటైర్లు వేసుకున్నారు. ఇక అరియానాని నామినేట్ చేస్తూ అషురెడ్డి లేని విష‌యాన్ని ఉంద‌ని ఊహించుకుంటోందంటూ చుర‌క‌లు అంటించింది. ఇక ఈ నామినేష‌న్స్ లో బిందు మాధ‌వి చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది. మిత్ర‌ని నామినేట్ చేస్తూ.. చేతిలో చేదు ల‌డ్డూ పెడుతూ చేతిని త‌గిలించి బిగ్ బాస్ ఆమె న‌న్ను ట‌చ్ చేసింది. ఫిజిక‌ల్ అబ్యూస్ అంటూ మిత్ర‌ని రెచ్చ‌గొట్ట‌డం మొద‌లు పెట్టింది. మిత్ర ఎదురుదాడికి దిగ‌డంతో త‌నని ఇమిటేట్ చేస్తూ పిచ్చి పిచ్చి చేష్ట‌ల‌తో విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది బిందు. దీంతో మిత్ర‌కు ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేసింది. బిందు టైటిల్ విన్న‌ర్ అని ఒక‌వేళ ఎవ‌రైనా అనుకుంటున్నారంటే అది బిందు మాధ‌వి ఆడుతున్న హ్యాష్ ట్యాగ్ డ్రామా అంటూ బిందుకు దిమ్మ‌దిరిగే పంచ్ ఇవ్వడం విశేషం.

స్టేజ్ పై ష‌ణ్ముఖ్ ప‌రువు తీసిన నాగార్జున

  బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ మొత్తానికి ఎండింగ్ ద‌శ‌కు చేరుకుంది. కంటెస్టెంట్ ల అల‌క‌లు, ఏడుపులు... గిల్లిక‌జ్జాల‌తో సాగిన ఈ షో మొత్తానికి చివ‌రి అంకానికి చేరుకుంది. ఇదిలా వుంటే  బిగ్‌బాస్ కంటెస్టెంట్ ల‌కు ఈ వారం స‌ర్ ప్రైజ్ ల మీద స‌ర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబ‌ర్స్ ను హౌస్ లోకి పంపి ఇంటి స‌భ్యుల‌లో ఆనందాన్ని నించాడు. వీక్ ఎండ్ లో బిగ్ బాస్ ఏకంగా ఈ సారి హౌస్ మేట్ ల క్లోజ్ ఫ్రెండ్స్ ని రంగంలోకి దించేశాడు. అంతే కాకుండా పేరెంట్స్, బందువుల‌ని కూడా స్టేజ్ పైకి తీసుకురావ‌డంతో ఇంటి స‌భ్యులు తెగ హ్యాపీ ఫీల‌య్యారు. ఊహించిన వారు స్టేజ్ పై కి రావ‌డంతో ఇంటి స‌భ్యులు స‌ర్ ప్రైజ్ ఫీల‌య్యారు. వారిని చూసి అనందంతో గెంతులేశారు. కొంత మంది మురిసిపోయి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. అఖిల్ కోసం సోహైల్ స్టేజ్ పైకి రాగా అఖిల్ గురించి పొగ‌డ‌టం మొద‌లుపెట్టాడు. దీంతో మ‌ధ్య‌లో దూరిన అరియానా నా గురించి పొడ‌రా అని అడిగింది. దీంతో సోహైల్ .. నేను అన్నీ విన్నాలే.. కూర్చో అన్న‌ట్టుగా పంచ్ వేశాడు. త‌రువాత అరియానా కోసం అమె సోద‌రి, దేవి నాగ‌వ‌ల్లి, యాంక‌ర్ శివ కోసం అత‌ని ఫ్రెండ్స్ ధ‌నుష్‌, షణ్ముఖ్ వ‌చ్చారు. ష‌న్నుని చూసిన నాగార్జున బిగ్ బాస్ త‌రువాత ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు అన్నాడు . దీనికి `ప్రిపేర్ అవుతున్నాను స‌ర్ ` ని ష‌ణ్ముఖ్  అన‌గానే..`అంటే బ్రేక‌ప్ తో బిజీగా వున్నావా? అంటూ దిమ్మ‌దిరిగే పంచ్ వేశాడు. . దీంతో ఏం మాట్లాడాలో అర్థం కాక ష‌న్ను సైలెంట్ అయిపోయాడు. ఛాన్స్ దొరికింది క‌దా అని వెంట‌నే అషురెడ్డి లేచి దీప్తి ఎలా వుంది అంటూ అడిగేసింది. వెంట‌నే `అషుకి నోటి దుర‌ద‌` అంటూ షన్ను రిట‌ర్న్ పంచ్ వేశాడు. దీంతో అక్క‌డున్న వారంతా న‌వ్వేశారు. ఆ త‌రువాతే మిత్ర కోసం సిరి ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.