రిషీని ప్రేమిస్తున్నానని చెప్పిన వసుధార !

వసుధారను క్లాస్ లోకి రమ్మని చెప్పకపోయేసరికి క్లాస్ మొత్తం గుసగుసలాడుకుంటుంది. వెంటనే కోపంతో రుషి సైలెన్స్ అని అరుస్తాడు. కాలేజీకి టైంకి రావాలి. దాన్నే మేనర్స్ అంటారని గట్టిగా చెప్తాడు. ఇంతలో క్లాస్ ఐపోతుంది. వసుధార బాధతో వెళ్ళిపోతుంది. రిషి మనసులో వసు జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఇంట్లో జగతి రిషి ప్రేమను వసుధార రిజెక్ట్ చేసిందని మహేంద్రకి చెప్తుంది. ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ విషయం చాటుగా విన్న గౌతమ్ కూడా ఆశ్చర్యపోతాడు. వెంటనే కాలేజీకి వెళ్తాడు. అక్కడ రిషి సర్ తనను ఎందుకు క్లాస్ లోకి రాన్నివ్వలేదో తేల్చుకుందామని క్లాస్ కి వెళ్లబోతుంది వసుధార. ఇంతలో గౌతమ్ వసుని పిలిచి మాట్లాడదామని పిలుస్తాడు. గౌతమ్ అడిగిన అన్ని ప్రశ్నలకు నో చెప్తుంది చెప్తుంది వసు. అప్పుడు గౌతమ్ సీరియస్ గా వసుధార బొమ్మ గీసింది, ప్రేమలేఖ రాసింది రుషి అనే నిజాల్ని చెప్పేస్తాడు. వసు ఒకింత ఆశ్చర్యపడినా మళ్ళీ మాములుగా " అవును సర్ నేను ప్రేమిస్తున్నాను" అంటూ గట్టిగా చెప్తుంది. ఈ విషయాలన్నీ రుషి చాటుగా వింటాడు. వసు అన్న ఆ మాటతో రుషి హ్యాపీనెస్ ఫేస్ లో తెలుస్తుంది. కానీ అంతలో మళ్ళీ మాట మార్చి "నా లక్ష్యాన్ని ప్రేమిస్తున్నా, నా గోల్ ని ప్రేమిస్తున్నా" అని చెప్పేసరికి రిషి ముఖం మారిపోతుంది. ఇంతలో రిషి సెల్ రింగ్ అయ్యేసరికి గౌతమ్ , వసు అటువైపు చూస్తారు. రిషీ వాళ్ళను చూసి వెళ్ళిపోతాడు. మరో పక్కన సాక్షి మనసులో దేవయాని గురుంచి చెడుగా ఆలోచిస్తూ ఉంటుంది. " రుషిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఈమెకు సేవలు చేయడానికి నన్ను తోలుబొమ్మను చేసి ఆడిద్దామనుకుంటోంది. కానీ నా గోల్స్ వేరు..వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టాను. మెయిన్ గోల్ తన ప్రేమను కాదన్న రిషిని పెళ్లి చేసుకోవడమే అనుకుంటూ ఒక విలనీ నవ్వు నవ్వుతుంది. ఇవి ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ అప్ డేట్స్.  

లాస్యకు ఫంక్షన్ లో ఘోర అవమానం...

బర్త్డే పార్టీకి అంకిత తులసి తెచ్చిన శారీ కట్టుకుని వచ్చేసరికి అక్కడ అందరూ షాక్ ఐపోతారు. ఆ శారీని ఎలాగైనా మార్పించి లాస్య తెచ్చిన చీర కట్టిద్దామని గాయత్రి అనుకుని ఒక ప్లాన్ వేస్తుంది. జ్యూస్ గ్లాస్ తీసుకెళ్లి అంకితతో ఫోర్స్ గా తాగిద్దామనుకునేసరికి జ్యూస్ శారీ మీద ఒలికిపోతుంది. దాంతో శారీ పాడైపోయింది కదా వెళ్లి లాస్య తెచ్చిన చీర కట్టుకో అంటుంది. కానీ అంకిత ఒప్పుకోదు. తులసి అప్పుడు చెప్తుంది ఆ చీర మీద మరక పడినా పైకి కనిపించదు అంటూ ఆ చీర స్పెషాలిటీ  గురుంచి చెప్పుకొస్తుంది. తర్వాత అంకిత కేక్ కట్ చేసి తులసికి తినిపిస్తుంది. దాంతో లాస్య చాలా ఫీల్ అవుతుంది. తులసికి అంత ప్రిఫెరెన్స్ ఇచ్చేసరికి గాయత్రి, నందు, లాస్య, అందరూ కూడా షాక్ ఐపోతారు. గాయత్రీ ఈ విషయంగా అంకితను గట్టిగా నిలదీస్తుంది. అసలు పార్టీ నేను చేయమని అడగలేదు కదా అంటూ కౌంటర్ ఇస్తుంది. తర్వాత లాస్యకు కేక్ పీస్ ఇస్తుంది అంకిత. కానీ లాస్య విసురుగా లాక్కుంటుంది అసహ్యంగా ముఖం పెడుతుంది.   ఆ తర్వాత తులసిని ఒక పాట పాడమని అడుగుతుంది అంకిత. "గాలి చిరుగాలి" అంటూ మంచి సాంగ్ పాడుతుంది. మరో పక్క లాస్య నందు మేడ మీదకు వెళ్లి తీరిగ్గా బాధపడుతూ ఉంటారు. అభి వచ్చి అంకిత తరపున సారీ చెప్తాడు. లాస్య నటించడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో అక్కడికి గాయత్రి వచ్చి తన కూతురు మొండిదని తెలుసు కానీ ఇంత జగమొండి అని తెలీదని లాస్యతో అంటుంది. అభి ఇదంతా మీ అమ్మ వల్లే వచ్చింది ...దొంగచాటుగా అంకితతో ఫంక్షన్ కి పిలిపించుకుని ఇంత రాద్ధాంతం చేసింది అంటూ తులసిని నిష్ఠూరాలు ఆడుతుంది. ఆ విషయాలన్నీ అటుగా వెళ్తున్న తులసి వినేస్తుంది. వెంటనే బాధపడుతూ అంకిత దగ్గరకు వచ్చి ఇక ఎప్పటికి తన ఇంటి గుమ్మం తొక్కనని ప్రమాణం చేయమని అడుగుతుంది. అంకిత షాక్ అయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఈ హైలెట్స్ అన్ని ఈరోజు సాయంత్రం ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

శ్రీ‌రామ్‌-శివ‌బాలాజీ-ఎస్త‌ర్‌.. జీ5లో స‌రికొత్త వెబ్ సిరీస్ 'రెక్కీ'

  దేశంలోని టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఒక‌టైన జీ5 నుంచి మ‌రో వెబ్ సిరీస్ రాబోతోంది. శ్రీ‌రామ్‌, ఎస్త‌ర్ నోరోన్హ‌, శివ‌బాలాజీ, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఆ సిరీస్.. రెక్కీ. జూన్ 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ది. రాధిక‌, సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఇటీవ‌ల స్ట్రీమింగ్ అయిన గాలివానకు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో, ఇనుమ‌డించిన ఉత్సాహంతో రెక్కీని అందిస్తోంది జీ5. రెక్కీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 1990ల నాటి క‌థ‌తో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్ల‌ర్‌గా రెక్కీ రూపొందిన‌ట్లు ద‌ర్శ‌కుడు పోలూరు కృష్ణ‌ తెలిపారు. ఒక్కొక్క‌టి 25 నిమిషాల నిడివి ఉంటే 7 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ది. దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్తగా నియమించబడిన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్, 'రెక్కీ'లో ఎక్స్‌ప‌ర్ట్ అయిన పరదేశి మధ్య ఈ కథ నడుస్తుంది. 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు? ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదించాడు.. అనేది ప్రధానాంశం. అని చెప్పారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన డ్రామా, ఉత్తేజ‌క‌ర‌మైన మ‌లుపుల‌తో రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సిరీస్ కుర్చీల‌పై మునివేళ్ల‌పై కూర్చోబెడుతుంద‌ని యూనిట్ చెబుతోంది. తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ హ‌త్య విష‌యంలో హంత‌కులు రాజ‌కీయంగా ప్రేరేపించ‌బ‌డ్డారా, లేక అది పాతక‌క్ష‌ల నేప‌థ్యంలో జ‌రిగిందా, ఇంకేదైనా చీక‌టి కోణం ఉందా? అనే విష‌యాలు ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. లెనిన్ ప‌రిశోధ‌న‌లో బ‌య‌ట‌పడే ర‌హ‌స్యాలు షాక్‌ను క‌లిగిస్తాయి. శ్రీరామ్, శివబాలాజీ ఇంతవరకూ చేయని పాత్రలు ఇందులో చేశారు. సీరీస్‌లోని ప్రధాన భాగాలను అనంతపురంలో చిత్రీకరించారు.  పాత్ర‌లు - పాత్ర‌ధారులు లెనిన్ - శ్రీ‌రామ్‌ చ‌ల‌ప‌తి - శివ‌బాలాజీ గౌరి - ధ‌న్య బాల‌కృష్ణ‌ రేఖ - ఎస్త‌ర్ నోరోన్హ‌ వ‌ర‌ద‌రాజులు - ఆడుకాల‌మ్ న‌రేన్‌ ఎమ్మెల్యే - జీవా బుజ్జ‌మ్మ - శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌ దేవ‌క‌మ్మ - రాజ‌శ్రీ నాయ‌ర్‌ రంగ‌నాయ‌కులు - రామ‌రాజు కుళ్లాయ‌ప్ప - తోట‌ప‌ల్లి మ‌ధు  పోలీసాఫీస‌ర్ - స‌మీర్‌ ప‌ర‌దేశి - స‌మ్మెట గాంధీ

సుధా రాజ్ పుత్ గుట్టు తెలుసుకున్న ఆర్య‌వ‌ర్థ‌న్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మ‌రాఠీ సీరియల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. `బొమ్మ‌ల‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వమోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత, అనూషా సంతోష్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, సందీప్‌, జ్యోతిరెడ్డి, మ‌ధుశ్రీ న‌టించారు. ర‌ఘుప‌తి త‌ను మీడియాకు ఇచ్చిన సీడీ ఎక్క‌డ త‌న మెడ‌కు చుట్టుకుంటుందో న‌ని తాను ఆ త‌ప్పు చేయ‌లేద‌ని సుధా రాజ్ పుత్ ఇదంతా చేస్తోంద‌ని ఆర్య వ‌ర్ధ‌న్ కు చెప్పాల‌ని ఆర్య ఇంటికి బ‌య‌లుదేర‌తాడు. మార్గ‌మ‌ధ్యంలో కొబ్బ‌రి బోండాం తాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే రాగ‌సుధ మ‌నిషి వ‌శిష్ట అత‌నికి కొబ్బ‌రినీళ్ల బాటిల్ లో ఏదో మందు క‌ల‌పి ఇస్తాడు. అది తాగుతూ ఆర్య ఇంటికి చేరుకున్న ర‌ఘుప‌తికి మాట ప‌డిపోతుంది. ఎంత ప్ర‌య‌త్నించినా ఆర్య వ‌ర్ధ‌న్ ముందు సుధా రాజ్ పుత్ బండారం బ‌య‌ట‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం వుండ‌దు. త‌ను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని పెన్ను పేప‌ర్ ఇస్తే రాస్తాన‌ని ర‌ఘుప‌తి సైగ చేయ‌డంతో అందుకు అను రెడీ అవుతుంది. కానీ సుధా రాజ్ పుత్ వేశంలో వున్న రాగ‌సుధ అడ్డుత‌గిలి ర‌ఘుప‌తి ఏం చెబుతున్నాడో త‌న‌కు తెలుసు అని చెప్పి మాట మారుస్తుంది. అక్క‌డి నుంచి ర‌ఘుప‌తి వెళ్లిపోయేలా చేస్తుంది. క‌ట్ చేస్తే.. ఆర్య‌కు సంబంధించిన సీడీని మార్చి మీడియా ఛాన‌ల్ వాళ్లు బ్రేకింగ్ న్యూస్ కింద న్యూసెన్స్ ని క్రియేట్ చేయ‌బోతున్నార‌ని జెండే కు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని ఆర్య‌కు వివ‌రించి స‌ద‌రు ఛాన‌ల్ లో న్యూస్ టెలీకాస్ట్ కాకుండా చేస్తారు. ఆ త‌రువాత స‌ద‌రు ఛాన‌ల్ వారి నుంచి సీడీని మ‌రొక‌రు ఎత్తుకెళ్లార‌ని తెలియ‌డంతో జెండే మిగ‌తా ఛాన‌ల్ ల‌ని హెచ్చిరించే ప‌నిలో వుంటాడు. ఇదే స‌మ‌యంలో సుధా రాజ్ పుతే రాగ‌సుధ అనే విష‌యం త‌న‌కు తెలిసింద‌ని ఆర్య వ‌ర్ధ‌న్ చెప్ప‌డం తో జెండే షాక్ గుర‌వుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. అనుని రాగ‌సుధ పోలీస్టేష‌న్ కి ఎందుకు ర‌మ్మంది?.. త‌న‌ని అడ్డు పెట్టుకుని ఏం చేయ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

కామెడీ స్టార్స్ ధ‌మాకాలో కెఏ పాల్ వ‌ర్సెస్ వ‌ర్మ‌

హాస్య ప్రియుల్నిక‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `కామెడీ స్టార్స్ ధ‌మాకా`. గ‌త కొన్ని నెల‌లుగా స్టార్ మాలో ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్నఈ షో మంచి ఆద‌ర‌ణ పొందుతూ రేటింగ్ ప‌రంగానూ దూసుకుపోతోంది. ఈ షోకు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ వీజే న్యాయ నిర్ణేత‌లుగా, ఇక యాంక‌ర్ గా దీపిక పిల్లి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీమ్ లీడ‌ర్లుగా ముక్కు అవినాష్‌, హ‌రి, అదిరే అభి, ధ‌న్ రాజ్‌, టిల్లు వేణు, అప్పారావు టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఆదివారం జూన్ 5న ప్ర‌సారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ ఎపిసోడ్ లో అప్పారావు, అదిరే అభి, స‌త్య‌, ధ‌న్ రాజ్‌, టిల్లు వేణు, హ‌రి, యాద‌మ్మ‌రాజులు  కామెడీ స్కిట్ ల‌తో అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ అంద‌రి కంటే ముక్కు అవినాష్ చేసిన `కెఏ పాల్ వ‌ర్సెస్ వ‌ర్మ స్కిట్ ఓ రేంజ్ ఓ పేలిన‌ట్టుగా తెలుస్తోంది. హ‌రి డైరెక్ట‌ర్ గా యాద‌మ్మ రాజు హీరోగా చేసిన స్కిట్ కూడా న‌వ్వులు పూయించింది. ఇక ధ‌న్ రాజ్‌, టిల్లు వేణు క‌లిసి చేసిన స్కిట్ కూడా ఆక‌ట్టుకుంది. అయితే ముక్కు అవినాష్ చేసిన కెఏ పాల్ వ‌ర్సెస్ వ‌ర్మ స్కిట్ షోకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది. వ‌ర్మ డైరెక్ట‌ర్ గా కేఎ పాల్ హీరోగా సినిమా చేస్తే ఎలా వుంటుంద‌ని ముక్కు అవినాష్ స్కిట్ చేశాడు. 'ఈ మ‌ధ్య డేంజ‌ర‌స్ అనే సినిమా తీశాను చూశావా?' అని ముక్కు అవినాష్ అడిగితే కేఏ పాల్ పాత్ర‌లో క‌నిపించిన జ‌బ‌ర్ద‌స్త్ రాము `నువ్వు తీసిన సినిమాలే డేంజ‌ర‌స్ ఇంకా చూట్ట‌మేంటీ?.. నేనే కాదు నువ్వు కూడా చూడ‌వు' అంటూ పంచ్ వేశాడు. ఆ త‌ర్వాత‌, `మొన్న‌టికి మొన్న రాజ‌మౌళి గారు ఫోన్ చేశారు. స‌ర్ `ట్రిపుల్ ఆర్` త‌రువాత ఫోర్ ఆర్ తీస్తున్నా అన్నారు. నేను ఒక విష‌యం స్ప‌ష్టంగా చెప్పా.. ఫోర్ ఆర్ తీస్తే మాత్రం ర‌ష్యా ప్ర‌ధాన మంత్రి, చైనా ప్ర‌ధాన మంత్రి, ఉత్త‌ర కొరియా ప్ర‌ధాన మంత్రిని పెట్టండి నేను కూడా చేస్తా అని చెప్పా` అన‌గానే 'నాలుగు రాడ్లు' అని అవినాష్ అన‌డం.. 'మీరు కూడా చేయండి, అప్ప‌డు ఐదు రాడ్లు' అని మ‌రో వ్య‌క్తి అన‌డం న‌వ్వులు పూయిస్తోంది.

అభిమన్యు చేతిలో యశ్ ఓటమికి వేద కారణమా ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగుతున్న ఈ సీరియ‌ల్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది. రేటింగ్ ప‌రంగానూ మంచి ప్లేస్ లో కొన‌సాగుతోంది. ఏడేళ్ల క్రితం స్టార్ ప్ల‌స్ లో ప్ర‌సారం అయి సూప‌ర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహ‌బ్బ‌తే` సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. క‌న్న‌డ న‌టీన‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. నిరంజ‌న్‌, కోల్ క‌తా న‌టి డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, బేబి మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌నులు న‌టించారు. బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత కీల‌క ట‌ర్న్ తీసుకోబోతోంది. కోట్లు విలువ చేసే ప్రాప‌ర్టీ వేలానికి వ‌స్తుంది. అయితే ఆ వేలం పాట‌కు వెళ్ల‌డానికి, అందులో పాట పాడ‌టానికి య‌ష్ ఇబ్బందిప‌డుతుంటాడు. గొంతు ఇన్ ఫెక్ష‌న్ కార‌ణంగా య‌ష్ బాధ‌ప‌డుతుంటాడు. అయితే త‌న‌తో క‌లిపి వేలం పాట‌కు వెళ్ల‌డానికి ఎవ‌రు వెళ్లాల‌నేది స‌మ‌స్య‌గా మారుతుంది. వ‌సంత్ ని తీసుకెళ్లాలంటే త‌న‌కు ఆఫీస్ లో ప్ర‌త్యేక మీటింగ్ వుందంటాడు య‌ష్. అయితే డాక్ట‌ర్ ని పిలిస్తే స‌మ‌స్య తీరుతుంద‌ని య‌ష్ తండ్రి చెబుతాడు. వెంట‌నే వ‌సంత్ ఓ డాక్ట‌ర్ ని పిలిచి య‌ష్ ప‌రిస్థితిని వివ‌రిస్తాడు. అయితే త‌న‌కు గొంతు ఇన్ ఫెక్ష‌న్ బాగా వుంద‌ని, మూడు రోజుల నుంచి వారం పాటు త‌ను రెస్ట్ తీసుకోవాల‌ని షాకిస్తాడు. ఇప్ప‌డు ఎలా?  వేలం పాట‌కు వెళ్లాలి అని య‌ష్ ఫీల‌వుతుంటాడు. ఈలోగా వేద వుందిగా త‌న‌ని తీసుకెళ్లు. నువ్వు పేప‌ర్ పై రాసింది వేద అక్క‌డ చెబుతుంది ప్రాబ్ల‌మ్ సాల్వ్ అని మాలిని చెబుతుంది. అయిష్టంగానే వేద‌ని య‌ష్ వేలం పాట‌కి తీసుకెళ‌తాడు. అక్క‌డికి అభిమ‌న్యు, మాళ‌విక కూడా వ‌చ్చి య‌ష్ తో పోటీప‌డ‌తారు. అయితే చివ‌ర్లో 60 కోట్ల‌కు మించి పాట పాడ‌మ‌నడంతో వేద ఇంత పెట్టి కొన‌డం అవ‌స‌ర‌మా? అని య‌ష్ చెప్పింది విన‌దు. దీంతో వేలం పాట‌లో కోట్ల ప్రాప‌ర్టీ అభిమ‌న్యు సొంతం అవుతుంది. దాన్ని ఆదిత్య‌కు గిఫ్ట్ గా ఇస్తానంటాడు అభిమ‌న్యు. వేలం పాట‌లో ఓడిపోవ‌డంతో య‌ష్ ఫీల‌వుతుంటాడు. అది గ‌మ‌నించి నీ భార్యే నిన్ను నా చేతిలో ఓట‌మి పాల‌య్యేలా చేసింద‌ని అభిమ‌న్యు అంటాడు. దీంతో య‌ష్ - వేద‌ల మ‌ధ్య మ‌ళ్లీ దూరం మొద‌ల‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

లాస్యకి, తులసికి మధ్య టగ్ ఆఫ్ వార్

అంకిత బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి. లాస్య చాలా కాస్టలీ సారీ ఒకటి అంకితకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఇంతలో తులసి వాళ్ళ ఫామిలీ, ప్రేమ్ వాళ్ళ ఫామిలీ మొత్తం ఆ పార్టీకి వస్తారు. వాళ్ళను అసలు ఎవరు ఇన్వైట్ చేశారో తేలిక ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉంటారు. చివరికి తానె ఇన్వైట్ చేసినట్టు అంకిత చెప్తుంది. హైఫై సెలెబ్రేషన్స్ లో ఇలాంటి వాళ్ళు వస్తే ఏం బాగుంటుంది అంటూ అంకితను వాళ్ళ అమ్మ తిడుతుంది. వాళ్ళుంటేనే ఫంక్షన్ జరుగుతుందని అంకిత కూడా వార్నింగ్ ఇస్తుంది. తులసి చేత్తో కుట్టిన శారీని అంకితకు గిఫ్ట్ గా ఇస్తుంది. కేక్ కటింగ్ కి ఆ సారీ కట్టుకుంటానంటుంది అంకిత. లాస్యకి బాగా కోపం వస్తుంది. అప్పు చేసి మరీ కాస్టలీ సారీ ఇస్తే తులసి ఇచ్చిన ఆఫ్ట్రాల్ సారీ కట్టుకుంటానంటుంది ఏమిటి అని నందుని అడుగుతుంది. ఫంక్షన్ కి పిలిపించుకుని మరీ వచ్చావా తులసి అంటూ లాస్య వెటకారమాడుతుంది. పిలుపు అందుకుని మరీ వచ్చాను.. ఏం లాస్య నీ కడుపు మండుతోందా అంటూ కౌంటర్ ఇస్తుంది తులసి. ప్రేమ్ అభి ఇద్దరూ మనసి విప్పి మాట్లాడుకుని ఆనందంగా ఉంటారు. కలిసున్నప్పుడు కంటే విడిపోయినప్పుడే ప్రేమ్ మీ  గురుంచి ఎక్కువగా ఆలోచిస్తున్నాడంటూ తులసికి శృతి చెప్తుంది. తులసి ఫంక్షన్ లో పాట పాడి అందరినీ ఆకట్టుకుంటుంది. గాయత్రీ మాత్రం తులసి మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. అభికి ఆస్తి వచ్చిన విషయం తెలిస్తే అంకితను పిచ్చిదాన్ని చేసి తులసి ఆస్తి నొక్కేస్తుందని భయపడుతూ ఉంటుంది గాయత్రీ. ఐతే మరో వైపు తన తల్లి అలాంటిది కాదని ఒక్క మాటన్నా చెప్తే బాగుండు అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది గృహలక్ష్మి సీరియల్ లో ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే అప్ డేట్స్.

కార‌ణం చెప్ప‌మ‌ని హిమ‌ని నిల‌దీసిన నిరుప‌మ్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా స‌రికొత్త మ‌లుపులు తిరుగుతూ ఆస‌క్తిక‌ర ట్విస్ట్ ల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జూన్ 1 బుధ‌వారం తాజా ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. హిమ పెళ్లి చూపుల కోసం వ‌చ్చిన వారిన నిరుప‌మ్ ఎందుకు బెదిరించాడు?.. ఈ విష‌యం తెలిసి సౌంద‌ర్య, ఆనంద‌రావులు ఎలా రియాక్టయ్యార‌న్న‌ది ఈ రోజు ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌రం. బుధ‌వారం ఎపిసోడ్ లో హిమ‌కు పెళ్లి ఫిక్స‌యింద‌ని నిరుప‌మ్ తో స్వ‌ప్న చెబుతుంది. ఆ మాట‌లు విన్న వెంట‌నే నిరుప‌మ్ కుప్ప‌కూలిపోతాడు. ఈ పెళ్లి ఎలా జ‌రుగుతుందో నేనూ చూస్తాన‌ని మ‌న‌సులో అనుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. క‌ట్ చేస్తే.. జ్వాల‌ .. నాన‌మ్మ‌కు నేనే శౌర్య‌ని అని చిన్న చిన్న క్లూలు ఇస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు అని ఆలోచిస్తూ వుంటుంది. ఒక వైపు నిరుప‌మ్‌.. హిమను క‌లిసి వేరే వాడితో పెళ్లికి అంగీక‌రించ‌డం ఏంట‌ని మండిప‌డ‌తాడు. అంతే కాకుండా ఈ పెళ్లి మ‌న ఇద్ద‌రికే జ‌రుగుతుంది అంటాడు. ఈలోగా అక్క‌డికి జ్వాల వ‌స్తుంది. త‌ను రావ‌డాన్ని గ‌మ‌నించిన నిరుప‌మ్ , హిమ టాపిక్ మార్చేస్తారు. విష‌యం గ‌మ‌నించిన జ్వాల ఏం జ‌రుగుతోంద‌ని అడిగితే ఆ విష‌యం ఏంటో నేను చెబుతాను అంటాడు నిరుప‌మ్.. ఇదిలా వుంటే మాట మార్చిన హిమ విష‌యం చెప్ప‌కుండా అక్క‌డి నుంచి నిరుప‌మ్ ని ఇంటికి పంపిస్తుంది. ఆ త‌రువాత సౌంద‌ర్య .. ఆనంద‌రావు ద‌గ్గ‌రికి వ‌చ్చి నిరుప‌మ్ విజ‌య‌వాడ సంబంధం వారికి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమ‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ని చెబుతుంది. ఇంత జ‌రిగినా వాడు హిమ‌నే ప్రేమిస్తున్నాడు అంటుంది. అయితే హిమ ప్ర‌వ‌ర్త‌న‌కు కార‌ణం  ఏంటీ? త‌ను ఎందుకిలా చేస్తోంది? అని సౌంద‌ర్య‌, ఆనంద‌రావు ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. నిరుప‌మ్ కూడా ఇదే ఆలోచ‌న‌తో హిమ‌ని నిల‌దీస్తాడు. కానీ హిమ మాత్రం అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్ట‌దు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

జగతికి ప్రశ్నించే అధికారం లేదన్న వసుధార

వసుధార అనే స్టూడెంట్ కి, రిషి అనే ఒక లెక్చరర్ కి మధ్య తలెత్తిన ఒక ప్రేమ కథ ఈ గుప్పెడంత మనసు. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ ని యూత్ చాలామంది ఫాలో అవుతున్నారు. వసుధార రిషి ప్రేమను రిజెక్ట్ చేసేసరికి జగతి అసలు విషయం అడుగుదామని వసుధార దగ్గరకు వస్తుంది. ఎంత అడిగినా వసుధార అసలు విషయం చెప్పదు. దీంతో జగతి ఇలా అంటుంది "నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ ఇంత తెలివైన దానివని తెలీదు. చిన్నప్పుడు కొన్ని కారణాల వలన నేను రిషిని వదిలి వెళ్లాను. ఇప్పుడు నువ్వు రిషి మనసు ముక్కలు చేసి అంతకంటే ఎక్కువ బాధను మిగిల్చావు" అంటూ బాధ పడుతుంది. ఈ విషయం నాకు రిషి సర్ కి మధ్యన జరిగింది అంటూ వసుధార సీరియస్ గా సమాధానం ఇస్తుంది. అంటే ప్రశ్నించే అధికారం నాకు లేదంటావా వసుధార అని జగతి అడుగుతుంది. మరో పక్క రిషి, మహేంద్ర ఒకే కారులో కాలేజీకి వస్తారు. కానీ రిషి ముందు వెళ్ళిపోతాడు. మహేంద్ర పిలిచి ఇద్దరం ఒకే కారులో కదా వచ్చింది అలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతాడు. " మీరు క్లాస్ కి వస్తారా నాలా లెసన్స్ చెప్తారా " అంటూ సీరియస్ అవుతాడు. కాదు మనసులో బాధ ఉంటె చెప్పుకుంటే తగ్గుతుంది కదా అని గుటకలు వేస్తాడు మహేంద్ర. మరో పక్క కొద్దీ రోజులనుంచి డల్ గా ఉంటున్న గౌతమ్ ని విషయం ఏమిటి అని ధరణి అడుగుతుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వదిన అంటూ కామెడీ చేస్తాడు. ఇంతలో కాలేజీలోకి వస్తున్న వసుధారను పుష్ప పిలిచి ఎగ్జామ్ ఎలా రాసావ్. నువ్ రాసావంటే ఫస్ట్ రాంక్ నీదే కదా అంటుంది. రిషి బోర్డు మీద లెస్సన్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వసుధార "మే ఐ కమిన్ సర్ " అంటూ తలుపు దగ్గరనుంచి అడుగుతుంది. రిషి ఏం సమాధానం చెప్పకపోయేసరికి క్లాస్ మొత్తం గుసగుసలాడుకుంటూ ఉంటుంది. ఇది ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ అప్డేట్స్.

రేడియోజాకీ పోస్ట్ కి రాజీనామా చేసిన కృష్ణతులసి

జీ తెలుగులో కృష్ణతులసి సీరియల్ ప్రతీ వారం టాప్ టు ప్లేసెస్ లో నిలుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గురవమ్మ అప్పు తీర్చడానికి ఆమె కూతురు రూపారాణికి శ్యామా ఘోస్ట్ సింగర్ గా  పాటలు పాడుతూ ఉంటుంది. శ్యామా భర్త అఖిల్ వాళ్ళ తాతయ్యకు ఆక్సిడెంట్ జరుగుతుంది. అతను కోమా స్టేజిలోకి వెళ్లిపోయేసరికి మ్యూజిక్ థెరఫీ వల్ల అతన్ని బతికించుకోవచ్చని డాక్టర్ చెప్తారు. అలా శ్యామా పాటతో వల్ల తాతయ్య బతుకుతాడు. ఈ నేపథ్యంలో శ్యామా గురవమ్మ అప్పు తీర్చడానికి బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ లో పని చేస్తోందని వసంతకు తెలుస్తుంది. ఇంతలో ఐశ్వర్యకి గురవమ్మకు మధ్య తలెత్తిన మనస్పర్థలు కారణంగా  తెలివిగా ఐశ్వర్య తన సెల్ లో రికార్డు చేసిన ఆధారాలను  వసంతకు చూపించి ఆమెను , రూపారాణిని ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. బ్యూటీ కాంటెస్ట్ పోటీకి ఐశ్వర్యకు జడ్జిగా రమ్మంటూ ఆహ్వానం వస్తుంది. కానీ వెళ్లలేకపోతుంది. తాను వెళ్లలేనప్పుడు శ్యామా కూడా జాబ్ చేయడం కరెక్ట్ కాదు అని మనసులో కుళ్లిపోతుంది. వసంతతో చెప్పించి జాబ్ రిజైన్ చేసేలా ప్లాన్ చేసి ఆమెతో అదే విషయాన్ని చెప్పేస్తుంది. శ్యామా ఆ బాధను భరించలేక కన్నయ్య విగ్రహం దగ్గర తన బాధ చెప్పుకుంటుంది. అది విన్న అఖిల్ వెళ్లి వాళ్ళ అమ్మ వసంతకు నచ్చ జెప్తాడు. దాంతో వసంత కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అక్కడితో ఆ సమస్య తీరుతుంది. మరో పక్క బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ హెడ్ అమెరికా వెళ్లాల్సి వస్తుంది. ఇక స్టేషన్ బాధ్యతలను చూసుకోవాలంటూ సౌజన్యకు చెప్తాడాయన. కృష్ణ తులసిని పిలిచి "మాట పాట విత్ కృష్ణ తులసి " ప్రోగ్రాం ఎలా సక్సెస్ అయ్యిందో అంతకు మించి మరో ప్రోగ్రాం ని డిజైన్ చేసే బాధ్యతను శ్యామాకి అప్పగిస్తాడు. ఇక ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలను ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణతులసి సీరియల్ లో చూడొచ్చు.

త్వరలో కొత్త సీరియల్ "ముక్కుపుడక"

జీ తెలుగు ఛానెల్ లో త్వరలో ముక్కుపుడక అనే సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందులో ఐశ్వర్య పిస్సే నటిస్తోంది. ఈమె అగ్నిసాక్షి, కస్తూరి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బేసిక్ గా ఈమె కన్నడ నటి ఐనప్పటికీ తెలుగులోనూ నటిస్తూ అటు కన్నడలో, ఇటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సర్వమంగళ మాంగళ్య అనే సీరియల్ తో కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ని సాక్షి సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఐష్. ఐతే మరో సీరియల్ ఆక్టర్ నవ్య స్వామి వాళ్ళ అన్నయ్యని ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆమె నటించిన కొత్త సీరియల్ ముక్కుపుడక త్వరలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ సీరియల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఐశ్వర్య అవని అనే పాత్రలో నటిస్తోంది. ఈమె ఇందులో ఒక టూరిస్ట్ గైడ్ గా డిఫరెంట్ రోల్ లో నటిస్తోంది. ఐశ్వర్యకు జోడీగా రాకేష్ యాక్ట్ చేస్తున్నారు. అతనికి తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్. ఐతే హీరో రాకేష్ అవనితో ప్రేమలో పడతాడు. ఐతే అవనికి ఒక చెడ్డ బావ కూడా ఉంటాడు. ఆమె జీతాన్ని దోచుకు తింటూ ఉంటాడు. మరో పక్క హీరో తల్లి అన్నపూర్ణ దేవి భక్తురాలు. అమ్మవారికి  నైవేద్యంగా సమర్పించే ప్రసాదం తయారీ రహస్యం తెలుసుకుని ఆ ఊరిని సస్యశ్యామలం చేసి ముందుకు నడిపే కోడలు ఎవరు అంటూ ఆ తల్లిని అడుగుతూ ప్రార్థిస్తుంది. అమ్మవారి ముక్కుపుడకకు హీరో ఫామిలీ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇంతకు ఆ ఇంటికి అవని కోడలిగా వెళ్లబోతోందా ? అత్తగారి నమ్మకాన్ని ఆమె నిలబడుతుందా..? మహాప్రసాదం తయారీ రహస్యాన్ని తెలుసుకుంటుందా ? ఈ విషయాలన్నీ తెలియాలంటే ముక్కుపుడక సీరియల్ కోసం మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

హైపర్ ఆది ఇంట్లో మర్డర్

అనుకోకుండా హైపర్ ఆది ఇంట్లో మర్డర్ జరిగేసరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని అతని భార్యని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ వస్తారు. ఆదిని హోస్ట్ ప్రదీప్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అసలు మర్డర్ ఎలా జరిగింది ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆదిని కన్ఫ్యూస్ చేస్తూ ఉంటారు. ఆది ఆన్సర్ తప్పు చెప్తే చాలు చేతికి, కాలికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. నీ ఫోన్ లో ఎక్కువగా లేడీస్ నంబర్స్ ఉన్నాయి కదా ? అని అడివి శేష్ అడిగేసరికి అలాంటివేమి ఉండవ్ అని చెప్తాడు ఆది. వెంటనే షాక్ తగులుతుంది ఆదికి. దాంతో ఒక్కసారిగా కెవ్వు మంటాడు. ఇంతకు ఎంతమంది అమ్మాయిల నంబర్లు ఉన్నాయో చెప్పు అంటూ జానీ మాస్టర్ అడిగేసరి 2 , 6 అంటూ తప్పులు చెప్తుంటాడు ఆది. నీ వయసెంత అనే ప్రశ్నకు 16 అంటూ తప్పు చెప్పేసరికి మళ్ళీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆది వైఫ్ ని కూడా ఇంటరాగేట్ చేస్తారు ఆఫీసర్స్.  తర్వాత ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న ఒక టీం నా పేరు సూర్య.. నా ఇల్లే ఇండియా అనే మూవీలో ఓ సైనిక అనే పాటతో దుమ్ము రేపుతుంది. ఇక ఈ హైలెట్స్ అన్నిటిని కూడా జూన్ 1 న ప్రసారం కాబోయే ఢీ షోలో చూడొచ్చు.

26 వసంతాలు పూర్తి చేసుకున్న 'ఋతురాగాలు'

ఏ సీరియల్ అంటే ఇష్టం అని అమ్మా వాళ్ళను అడిగితే ఇప్పటికీ చెప్పే పేరు ఋతురాగాలు. రూపాదేవి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా నటించిన అద్భుతమైన ధారావాహిక ఇది. ఇదొక ఫామిలీ ఓరియెంటెడ్ డైలీ సీరియల్ గా అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రతీ పల్లెనూ, ప్రతీ గడపను పలకరించింది. 1996 లో మొదలైన ఈ సీరియల్ 1999 వరకు సాగింది. దూరదర్శన్ రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఎంతో కొత్తదనంతో సరికొత్త ప్రేమ కథతో అందరినీ ఆకట్టుకుని టాప్ రేటింగ్స్ ని సంపాదించుకుంది. సాయంత్రం 4 .30 ఐతే చాలు అప్పటివరకు ఇంటి గుమ్మాల్లో ఉన్నవారంతా టీవీల ముందు వాలిపోయేవారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రతి రోజు సరికొత్తగా సాగిన సీరియల్ గా ఇప్పటికి చెప్పుకుంటారు. బిందునాయుడు, మంజుల నాయుడు కంబినేషన్ లో వచ్చిన ఈ డైలీ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సీరియల్ తర్వాత వీరిద్దరి పేర్లు ఏపీలో మారుమోగాయి. ఇప్పటికి కూడా ఋతురాగాలు అని పేరు చెప్తే చాలు వీళ్ళ పేర్లు కూడా టక టక చెప్పేస్తారు అప్పటి జెనెరేషన్ వాళ్ళు. ఇక ఈ సీరియల్ కోసం ప్రత్యేకంగా రాసిన టైటిల్ సాంగ్ 'వాసంత సమీరంలా ' ఇప్పటికి ఎంతో మంది పాడుకుంటూనే ఉంటారు. ఆ పాట సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్ ల్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూ ఆనాటి రోజుల్ని గుర్తుచేస్తోంది. యుద్ధనపూడి సులోచనరాణి గారు కథను అందించగా,  పెద్ది రామారావు గారు స్క్రీన్ ప్లే అందించారు. ఆ కథకి జీవం పోసి, ఎందరో మంచి నటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన వన్ అండ్ ఓన్లీ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మంజుల నాయుడు. ఈ సీరియల్ లో కావేరి , శ్రీధర్ పాత్రలకు నటులు జీవం పోశారని చెప్పొచ్చు. ఈ పాట ఎప్పుడు విన్నా అందులోని యాక్టర్స్ అంతా కళ్ళ ముందే కదలాడతారు. ఈ సీరియల్ ఇప్పుడు 26 వసంతాలు పూర్తి చేసుకుంది.

ఇమ్మానుయేల్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పూర్ణ

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. సుధీర్ యాంకరింగ్ సరదాగా సాగిపోతుంటే, జబర్దస్త్ నటీనటుల స్కిట్స్, డ్యాన్సులు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం చక్కగా ఎంటర్టైన్ చేస్తోంది.  ప్రతీ వారం ఏదో ఒక స్పెషలిటీ అనేది ఈ సీరియల్ లో కనిపిస్తుంది. మ‌ల్లెమాల సంస్థ ద్వారా ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి సక్సెస్ ని కూడా అందుకుంది. ఎంతో మంది సామాన్యులను కూడా ఈ వేదిక ద్వారా ప్రతీ వారం పరిచయం చేస్తూ వాళ్లలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆనాటి అందాల నటి ఇంద్రజ ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ షోలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. స్టేజిపై యాంకర్ రష్మీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అంతకుముందు పూర్ణ స్టేజి మీద మాట్లాడుతుండగా ఇమ్మానుయేల్ వచ్చి భుజం మీద చేయి వేస్తాడు. అంతే ఒక్కసారిగా అదిరిపడిన పూర్ణ " ఏం చేస్తున్నావ్ నువ్వు...? అసలు నన్ను అలా ఎలా ముట్టుకుంటావ్ ..? " అంటూ ఫైర్ అయ్యింది. అసలు షోలో ఏం జరుగుతోంది అనేది ఒక క్షణం ఎవ్వరికి అర్ధం కాలేదు. ఇమ్మానుయేల్ చేసిన ఆ పనికి పూర్ణ సీరియస్ గా మైక్ ఇచ్చేసి స్టేజి దిగి వెళ్ళిపోతుంది. అంతలో రష్మీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆమె అలా పడిపోవడాన్ని గమనించిన ఆటో రాంప్రసాద్ రష్మీని పట్టుకుని స్టేజి మీద కూర్చోబెడతాడు. ఈ అంశాలతో ఉన్న ఎపిసోడ్ ప్రోమోని శ్రీదేవి డ్రామా కంపెనీ రిలీజ్ చేసింది. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు పూర్ణ ఎందుకు హర్ట్ అయ్యింది ? రష్మీ కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది అనే విషయాన్ని జూన్ 5 న ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో చూడొచ్చు.

పెళ్లి చేసుకున్న బాహుబలి 'కట్టప్ప'

మనసు బాగోలేదంటే చాలు చాలా మంది జంధ్యాల మార్క్ మూవీస్ చూసి మనసారా నవ్వుకుని హ్యాపీగా రిలాక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాదు కాదు బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేసింది జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇందులో వస్తున్న కామెడీకి ప్రతీ ఒక్కరూ ఫిదా ఐపోతున్నారు.   జబర్దస్త్ షో కన్నా కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ కే ప్రేక్షకులు ఎక్స్ట్రా వోటింగ్ వేసి మంచి రేటింగ్స్ తో దూసుకుపోయేలా చేస్తున్నారు. కొత్తకొత్త వాళ్ళు కూడా ఈ షోలో ఎంట్రీ ఇస్తూ కామెడీని చక్కగా పండిస్తున్నారు. రాజమౌళి మార్క్ మూవీ బాహుబలి ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఆ మూవీలో కట్టప్ప పాత్ర ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మూవీలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన  కట్టప్పను చూసాం. కానీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే కామెడీ కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ షో రెడీ అయ్యింది. దీనికి సంబందించిన ప్రోమోని మల్లెమాల రిలీజ్ చేసింది. ఇందులో కట్టప్పగా ఇమ్మానుయేల్, కట్టప్పను పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఫైమా నటించారు. శివగామిగా రోహిణి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సీరియల్ కి జడ్జెస్ గా సదా, ఇంద్రజ వ్యవహరించారు. "వెళ్ళవయ్యా వెళ్ళు" అనే రాజ్యానికి సదా మహారాణి అని, హోస్ట్ రష్మీ ఆమె చెలికత్తె అని ఇమ్మానుయేల్ చెప్పే పంచ్ డైలాగ్ అద్భుతంగా పేలింది. ఇక బులెట్ భాస్కర్ ని, రోహిణిని ఫైమా పిచ్చికొట్టుడు కొట్టేసరికి ఇద్దరూ ఏడ్చేస్తారు. ఆ సీన్ తో కడుపు చెక్కలైపోతుంది. ఇక మరో స్కిట్ లో  రష్మీ పెళ్లికూతురిగా పెళ్ళిపీటల మీద కూర్చుంటుంది. రష్మీకి అన్నయ్య పాత్రలో ఆటో రాంప్రసాద్ నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రష్మీని పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ స్కిట్స్ ని ఎంజాయ్ చేస్తే చాలు మంచి ఎనర్జీ వస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ జూన్ 3 న టీవిలో ప్రసారం కాబోతోంది.

రిషిని దేవ‌దాసుని చేసిన వ‌సుధార‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. గ త‌కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో జ‌గ‌తి, మ‌హేంద్ర‌లు రిషి గురించి ఆలోచిస్తూ వుంటారు. త‌న‌కి ఏమైందా అని భ‌య‌ప‌డుతూ వుంటారు. ఇంత‌లో ధ‌ర‌ణి అక్క‌డికి వ‌చ్చి 'చిన్న మామ‌య్య.. దేవ‌యాని అత్త‌య్య పిలుస్తున్నారు' అని చెబుతుంది. మ‌రో వైపు రిషి కారులో వ‌స్తూ జ‌రిగిన విష‌యం గురించి త‌ల‌చుకుని బాధ‌ప‌డుతూ ఉంటాడు. మ‌రో వైపు దేవ‌యాని, రిషి విష‌యం గురించి జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌ను నిల‌దీస్తూ 'ప్రేమ వుంటే స‌రిపోదు, బాధ్య‌త ఉండాలి' అంటుంది. ఇంత‌లో 'ఇప్పుడు జ‌గ‌తి అక్క‌య్య మేము బాధ‌ప‌డుతుంటే మీకు సంతోషంగా వుందా?' అంటుంది. అప్పుడు దేవ‌యాని 'నువ్వు ఇంట్లోకి వ‌చ్చిన త‌ర్వాతే రిషి అదుపు త‌ప్పిపోతున్నాడు' అని అన‌గా అప్పుడు జ‌గ‌తి.. దేవ‌యానికి స్ట్రాంగ్ గా బుద్ది చెబుతుంది. ఇంత‌లోనే రిషి వ‌స్తాడు. రిషిని ఎక్క‌డికి వెళ్లావ‌ని ఎంత మంది అడిగినా ఏమీ చెప్ప‌కుండా లోప‌లికి వెళ్లిపోతాడు. మ‌రో వైపు వ‌సుధార జ‌రిగిన విష‌యం గుర్తుచేసుకుని బాధ‌ప‌డుతూ వుంటుంది. క‌ట్ చేస్తే.. జ‌గ‌తి .. వ‌సుధార ద‌గ్గ‌రికి వెళ్తుంది. 'నేను జ‌గ‌తి మేడ‌మ్ లా రాలేదు. రిషీకి త‌ల్లిలా వ‌చ్చాను' అంటుంది. 'ఏం జ‌రిగింది?' అని వ‌సుని నిల‌దీస్తుంది. 'రిషి గుండెను ముక్క‌లు చేశావు, దేవ‌దాసుని చేశావ్‌ వ‌సుధార' అంటూ నిట్టూరుస్తుంది జ‌గ‌తి. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రిషి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? .. వ‌సుధార ఎందుకు రిషి ప్రేమ‌ని రిజెక్ట్ చేసింది?.. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

కుప్పకూలిన ర‌ష్మీగౌత‌మ్‌!

గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య‌వంతంగా సాగుతోంది `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`. అయితే ఈ షోలో తాజాగా వివాదం చోటు చేసుకుంది. ఇమ్మానుయేల్‌ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ హీరోయిన్ పూర్ణ‌ని తాకాడు. దీంతో త‌ను హ‌ర్ట్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ప‌క్క‌న వుంటే అడ్వాంటేజ్ గా తీసుకుని తాకేస్తావా? అంటూ పూర్ణ ఫైర‌యింది. వెంట‌నే స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఇదిలా వుంటే ఈ గొడ‌వ‌ని చూస్తూ షాక్ కు గురైన యాంక‌ర్‌ ర‌ష్మీ గౌత‌మ్ వున్న‌ట్టుండి వేదిక‌పైనే కుప్ప‌కూలిపోయింది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ క‌నిపించ‌లేదు. జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇంద్ర‌జ కూడా క‌నిపించ‌లేదు. కొత్త‌గా ఇందులో పూర్ణ ఎంట్రీ ఇచ్చింది. త‌న‌తో పాటు ర‌ష్మీ గౌత‌మ్ కూడా షోలోకి ఎంట‌రైంది అయితే ఎంట‌రైన తొలి షోలోనే ర‌ష్మీ గౌత‌మ్ సొమ్మ‌సిల్లి వేదిక‌పైనే కుప్ప‌కూల‌డం ప‌లువురిని షాక్ కు గురి చేస్తోంది. ఫ‌స్ట్ టైమ్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ‌ని హైప‌ర్ ఆది హ‌గ్గు అడిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పూర్ణ 'ఆ హ‌గ్గులు ఇవ్వ‌లేకే ఢీ మానేశాను. మ‌ళ్లీ ఇక్క‌డ కూడా హ‌గ్గులంటే ఇది కూడా మానేస్తాను' అంటూ సెటైర్ వేసింది. ఆ వెంట‌నే ఒరియా యాంక‌ర్‌, మ‌ల‌యాళీ జ‌డ్జ్ తో షో అదిరిపోతుందిప్పుడు అంటూ హైప‌ర్ ఆది యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌, పూర్ణ‌ల‌పై పంచ్ వేశాడు. ఇక ఆ త‌రువాత ర‌ష్మీ చేసిన డ్యాన్స్ షోకి హైలైట్ గా నిలిచింది. ఆ త‌రువాత ర‌ష్మీ తో యాంక‌ర్ గా 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' టీమ్ మెంబ‌ర్స్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. జూన్ 5న ఆదివారం మ‌ధ్యాహ్నం ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

జ్వాల‌కు షాకిచ్చిన నిరుప‌మ్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌కు విషాదాంతపు ఎండింగ్ ని ఇచ్చేసిన ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర వారి పిల్ల‌లు పెద్ద‌వాళ్లు కావ‌డం నుంచి సీరియ‌ల్ ని కొత్త మ‌లుపు తిప్పి న‌డిపిస్తున్నారు. ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోతున్నా కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపిస్తూ స్టార్ మా లో ప్ర‌సారం అవుతోంది. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ఈ మంగ‌ళ‌వారం స‌రికొత్త ట‌ర్న్ తీసుకోబోతోంది. నిరుప‌మ్ ఈ రోజు జ్వాల‌కు షాక్‌ ఇవ్వ‌బోతున్నాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోందంటే.. నిరుప‌మ్ జరిగిన విష‌యాన్ని త‌లుచుకుంటూ బాధ‌ప‌డుతుంటాడు. ఇంత‌లోనే అక్క‌డికి హిమ వ‌చ్చి డాక్ట‌ర్ నిరుప‌మ్ అని పిల‌వ‌డంతో వెంట‌నే నిరుప‌మ్ కోపంతో ర‌గిలిపోతూనే ఏమ‌యింది హిమ బావ అనే పిలుపు కూడా మ‌ర్చిపోయి డాక్ట‌ర్ నిరుప‌మ్ అని పిలుస్తున్నావు అంంటూ ఆగ్ర‌హంతో ఊగిపోతాడు. అప్పుడు హిమ `నేను నీకు క‌రెక్ట్ కాదు అనుకుంటున్నాను` అంటుంది. నువ్వు అనుకుంటే కాదు నేను కూడా అనుకోవాలి` అంటాడు. అంత‌లోనే అక్క‌డికి శోభ వ‌స్తుంది. హిమ‌పై కోపంతో నిరుప‌మ్ శోభ‌ని తీసుకుని బ‌య‌టికి వెళ‌తాడు. క‌ట్ చేస్తే.. సౌంద‌ర్య ఇంట్లో హిమ పెళ్లిచూపులు జ‌రుగుతుంటాయి. ఈ విష‌యాన్ని స్వ‌ప్న త‌న త‌న‌యుడు నిరుప‌మ్ కు చెబుతుంది. ఇక హిమ‌ని మ‌ర్చిపో అంటుంది. కానీ నిరుప‌మ్ మాత్రం హిమ‌నే త‌లుచుకుంటూ చీక‌టి గ‌దిలో కూర్చుని ఎమోష‌న‌ల్ అవుతుంటాడు. ఇదే స‌మ‌యంలో స్వ‌ప్న‌.. శోభ గురించి చెబుతుంది. త‌నే నా పెద్ద కోడ‌ల‌ని ఫిక్స‌య్యానంటుంది. అంతే కాకుండా హిమ పెళ్లికి రెడీ అవుతుంటే నువ్వు ఇంకా త‌న‌నే గుర్తు చేసుకుంటూ వుంటావా? అంటుంది. ఆ త‌రువాత హిమ‌ని క‌లిసిన నిరుప‌మ్ నీకు పెళ్లంటూ జ‌రిగితే అది నాతోనే అన‌డంతో ఆ మాట‌లు చాటుగా విన్న జ్వాల (శౌర్య) షాక‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

యాంకర్ సుమ సీక్రెట్ చెప్పేసిన జోగీ బ్రదర్స్

బుల్లితెరపై యాంకర్ గా సుమకున్న ట్రాక్ రికార్డ్ అందరికి తెలిసిందే. అయితే అమె పంచ్ ల వెనకున్న అసలు సీక్రెట్ ఒకటి వుందట. ఆ విషయాన్ని జోగీ బ్రదర్స్ తాజాగా బయట పెట్టేసి షాకిచ్చారు. ప్రతీ శనివారం ఈటీవీలో సుమ యాంకర్ గా నిర్వహిస్తున్న `క్యాష్ .. దొరికినంత దోచుకో` బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతీ వారం ఈ షోలో సెలబ్రిటీలని, టీవీ నటుల్ని యాంకర్ సుమ ఆహ్వానిస్తూ వారితో కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో నలుగురు గెస్ట్ లని తన షోకి ఆహ్వానించింది. జూన్ 4న శని వారం ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ కి నటి రాగిణి, కాదంబరి కిరణ్, జోగీ బ్రదర్స్ కృష్ణంరాజు, జోగి నాయుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.  ఈ షోలో జోగీ బ్రదర్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డీజే టిల్లు పాటకు కృష్ఱంరాజు స్టెప్పులేస్తే ఆ స్టెప్పులపై సుమ `ఇన్నేళ్లైనా కూడా అవే స్టెప్పులు ఏమీ మారలేదు అంటూ అదిరే పంచ్ వేసింది. దీనికి `నువ్వు యాంకరింగ్ ఏమైనా మార్చావేంటీ? అంటూ కృష్ఱంరాజు కౌంటరిచ్చాడు. ఆ తరువాత జోగీ బ్రదర్స్ కృష్ణంరాజు, జోగి నాయుడు ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తుంటే ఎవరికి ఆ ముద్దులు.. రాత్రి 9:30 షో ఇది.. ఫ్యామిలీ షో ఇది అని పంచ్ విసిరింది సుమ‌. దీనికి జోగినాయుడు `అయితే మా ఫ్యామిలీస్ ని ఎందుకు పిలవలేదు అంటూ కౌంటరిచ్చాడు. ఆ తరువాత జోగీ బ్రదర్స్ ఇద్దరు కూర్చుని సుమపై కౌంటర్లు వేయడం మొదలు పెట్టారు. అన్నయ్యా సుమ తెలుసుకదా అని జోగి నాయుడు అంటే `నాకెందుకు తెలియదురా నేను చిన్నప్పుడు సుమ యాంకరింగ్ చూసేవాడిని అంటూ కృష్ణంరాజు స్ట్రాంగ్ పంచ్ వేశాడు. దీంతో సుమ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసింది. ఆ వెంటనే జోగి నాయుడు అందుకుని `సుమ అనుకుని పంచ్ వేస్తదంటవా లేక స్పాంటెనియస్ గా వేస్తదంటవా? అని అడిగాడు. `పడుకోదూ.. రాత్రి అంతా పంచ్ లు ప్రాక్టీస్ చేసి పొద్దున్నే వేసేస్తది` అని కృష్ణంరాజు పంచ్ వేశాడు. ఈ పంచ్ కి సుమతో సహా కాదంబరి, రాగిణి పగలబడి నవ్వేశారు. జూన్ 4న శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న `క్యాష్` ప్రోగ్రామ్ తాజా ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సందడి చేస్తోంది.