త‌న పంతం కోసం వేద‌ని వేధిస్తున్న య‌శోధ‌ర్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొంత కాలంగా స్టార్ మా లో విజ‌య‌వంతంగా ప్ర‌సాం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. స్టార్ ప్లస్ లో ప్ర‌సారం అయిన `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, మీనాక్షి త‌దిత‌రులు న‌టించారు. బిజినెస్ పార్ట్న‌ర్ దామోద‌ర్ రావు కోరిక మేర‌కు ఆయ‌న సోద‌రిని వ‌సంత్ కిచ్చి వివాహం చేయాల‌ని య‌ష్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఇందు కోసం అప్ప‌టికే ప్రేమ‌లో వున్న వ‌సంత్ - చిత్ర‌ల మ‌ధ్య జ‌రిగిన చిన్న గొడ‌వ‌ని ఆయుధంగా వాడుకంటూ ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెంచే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇదే క్ర‌మంలో దామోద‌ర్ రావు సోద‌రి నిధిని వేద ఇంట్లోకి పెయింగ్ గెస్ట్ గా దించేస్తాడు య‌ష్. అక్క‌డి నుంచే య‌ష్ - వేద‌ల మ‌ధ్య దూరం మొద‌ల‌వుతుంది. గ‌త ఎపిసోడ్ లో వ‌సంత్ రాసిన ప్రేమ‌లేఖ చిత్ర‌కు కాకుండా వేద‌కు చేర‌డంతో అది య‌ష్ త‌నకే రాశాడ‌ని భ్ర‌మ‌ల్లో వున్న వేద ఆ త‌రువాతే అస‌లు విష‌యం తెలుసుకుంటుంది. య‌ష్ క‌డ‌పునొప్పి అంటూ త‌న హాస్పిట‌ల్ కి వ‌చ్చిన నేప‌థ్యంలో వేద‌కు అస‌లు విష‌యం తెలుస్తుంది. అయితే వ‌సంత్ కు చిత్ర‌పై ప్రేమ వుంది కాబ‌ట్టే లెట‌ర్ రాశాడ‌ని స్ప‌ష్ట‌మైంది కాబ‌ట్టి త‌న‌కు చిత్ర‌తో వివాహం చేయ‌డ‌మే క‌రెక్ట్ అని వాదిస్తుంది వేద. కానీ య‌ష్ అది మాత్రం ఎట్ట‌ప‌రిస్థితుల్లో కుద‌ర‌ద‌ని చెప్పి త‌న ప్ర‌య‌త్నాల‌కు అడ్డుప‌డుతుంటాడు. ఇదే స‌మ‌యంలో చిత్ర, వ‌సంత్ క్లోజ్ గా వుండ‌టాన్ని నిధి గ‌మ‌నిస్తుంది. ఇదేంటీ ఇంత క్లోజ్ గా వున్నార‌ని అడిగితే వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని అస‌లు నిజం చెప్పేస్తుంది. అయితే దాన్ని ఓ జోక్ గా మార్చి య‌ష్ క‌వ‌ర్ చేస్తాడు. ఆ త‌రువాత వ‌సంత్ ని కూడా మార్చేయ‌డంతో వేద వేద‌న‌తో ర‌గిలిపోతుంది. మ‌రి బుధ‌వారం ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోంది?. నిధికి అస‌లు విష‌యం తెలుస్తుందా? .. వ‌సంత్ మార‌తాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

మార‌ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌.. ర‌వి ద‌గ్గ‌ర కూడా అదే తీరు!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎండింగ్ స్టేజ్ కి వ‌చ్చేసింది. టైటిల్ ను గెలిచేందుకు హౌస్‌మేట్స్ గ‌ట్టి పోటీ ప‌డుతున్నారు. ఇక గ‌త వారం హౌస్‌మేట్స్ అంతా నామినేష‌న్స్ లో వున్నారు. బిందు మాధ‌వి, అఖిల్, బాబా భాస్క‌ర్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, అరియానా, మిత్ర‌, అనిల్, యాంక‌ర్ శివ నామినేష‌న్స్ లో వున్నారు. అయితే వీళ్ల‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యాడు. త‌క్కువ ఓట్ల కార‌ణంగా త‌ను హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ న‌ట‌రాజ్ మాస్ట‌ర్  బిగ్ బాస్ బ‌జ్ లో యాంక‌ర్ ర‌వితో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నాడు. అయితే ఇక్క‌డ కూడా హౌస్‌లో ప్ర‌ద‌ర్శించిన పంధాని కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన తాజా ప్రోమోని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ విడుద‌ల చేసింది. ఎంట్రీ ఇస్తూనే 'నా రాక కోస‌మే ఎదురుచూస్తున్న‌ట్టున్నావ్' అంటూ ర‌వికి కౌంట‌ర్ వేశాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌. అయితే ర‌వి కూడా వెంట‌నే న‌ట‌రాజ్ కు కౌంట‌ర్ ఇచ్చాడు. 'మీ కోసం ఎదురుచూస్తోంది నేను ఒక్క‌డినే అనుకుంటే మీ పొర‌పాటు' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ వెంట‌నే బిగ్ బాస్ హౌస్ నుంచి, నాన్ స్టాప్ హౌస్ నుంచి ఒక‌రి వ‌ల్లే బ‌య‌టికి వ‌చ్చాన‌ని అన‌డంతో 'అంత నెగెటివిటి ఎందుకు?' అంటూ క్లాస్ పీకాడు ర‌వి. 'చెన్నై త‌మిళ్..' అంటూ మ‌ళ్లీ న‌ట‌రాజ్ అందుకోవ‌డం.. త‌న‌కు స‌క్సెస్ అందుకే రాలేద‌న‌డంతో 'ఇక్క‌డ టాలెంట్‌.. టాలెంట్ కు బౌండ‌రీస్ లేవు' అన్నాడు ర‌వి. 'నువ్వు ఏదో లోప‌ల పెట్టుకుని పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్. ప్ర‌తి పాయింట్ అర్థ‌మ‌వుతుంది' అని ర‌విపై ఫైర్ అయ్యాడు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ కాస్త ఘూటుగానే సాగింది. 'నేను కాబ‌ట్టి కంట్రోల్ గా మాట్లాడుతున్నాను. బ‌య‌ట‌కి వెళ్లి చూడండి.. మీ మీద ఎలా వుందో అర్థ‌మ‌వుతుంది' అని ర‌వి అన‌డంతో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ లో సౌండ్ లేదు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ ర‌వి.. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ని ఎలా ఆడుకున్నాడు? .. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ర‌చ్చ ఏంటీ అన్న‌ది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.

ప్రేమ‌లేఖ తెచ్చిన తంటా..వేద‌కు య‌ష్ ఫుల్ క్లాస్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప‌, ఆ పాప కోసం త‌పించే ఓ యువ‌తి.. పాప కోసం త‌పించే యువ‌దిని పెళ్లాడిన పాప తండ్రి .. ఈ ముగ్గురు పాత్ర‌ల నేప‌థ్యంలో సాగే భావోద్వేగాల స‌మాహారంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది. స్టార్ ప్ల‌స్ లో ఏడేళ్ల క్రితం ప్ర‌సారం అయిన హిందీ సీరియ‌ల్ `ఏ హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మీనాక్షి, ఆనంద్ త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ మంగ‌ళ వారం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిర‌గ‌బోతోంది. ప్రేమ‌లేఖ ని వ‌సంత్ చిత్ర‌కు రాస్తే ఆ లెట‌ర్ వేద‌కు చేరుతుంది. అయితే అది రాసింది త‌న భ‌ర్త య‌ష్ అనుకుని పొర‌పాటు ప‌డిన వేద అప్ప‌టి నుంచి య‌ష్ క‌నిపించ‌గానే మెలిక‌లు తిరుగుతూ ఎక్క‌డ త‌న‌ని ఏదైనా చేస్తాడేమోన‌ని తెగ కంగారు ప‌డుతూ వుంటుంది. టిఫిన్ పెట్ట‌మంటే అష్ట‌వంక‌ర్లు తిరుగుతూ చివ‌రికి టిఫిన్ పెట్టేసి ట‌క్కున అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత య‌ష్ ఆఫీస్ కి వెళుతూ టాటా చెబుతుంటే అది కూడా త‌న‌నే అనుకుని పొర‌పాటు ప‌డుతుంది. ఈ మ‌నిషికి ఏమైంది. ప్రేమ‌లేఖ రాశాడు..అప్ప‌టి నుంచి చిత్ర విచిత్రంగా త‌న‌ని ద‌గ్గ‌ర చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని వేద త‌న‌తో తానే మాట్లాడుకుంటుంది. ఆఫీస్ కి వెళ్లిన య‌ష్ క‌డుపు నొప్పి అంటూ వేద హాస్పిట‌ల్ కు వ‌స్తాడు. ఇదొక వంక‌తో త‌న కోస‌మే వ‌చ్చాడ‌ని వేద ప్పులో కాలేస్తుంది. అప్పుడే త‌న‌కు ల‌వ్ లెట‌ర్ రాశావ‌ని య‌ష్ ని నిల‌దీస్తుంది. లెట‌ర్ తెచ్చి చూపించే స‌రికి అస‌లు విష‌యం య‌ష్ గ్ర‌హిస్తాడు. వ‌సంత్ రాసిన లెట‌ర్ ని త‌ను రాసిన‌ట్టుగా ఫీల‌వుతున్నావ‌ని, ల‌వ్ లెట‌ర్ ఈ జ‌న్మ‌లో నీకు రాయ‌న‌ని అంటాడు య‌ష్ దాంతో వేద య‌ష్ ముందు అడ్డంగా బుక్క‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  వేద‌, య‌ష్ ల మ‌ధ్య ఏం జ‌రిగింది? అన్న‌ది  తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

బిందు మాధ‌విని అడ్డంగా బుక్ చేసిన నాగార్జున‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ స‌న్ డే ఫ‌న్ డే కాస్త హాట్ అండ్ హీట్ డేగా మారింది. ప్ర‌తీ ఆదివారం స‌న్ డే ఫ‌న్ డే అంటూ ఎంట్రీ ఇచ్చే నాగార్జున ఈ సండే హౌస్ ని హీటెక్కించాడు. కంటెస్టెంట్ లు ఈ వీక్ లో ఎలాంటి త‌ప్పులు చేశారో ఎండ గ‌డుతూ క్లాస్ పీకే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఈ సీజ‌న్ ఓటీటీ ఫ‌స్ట్ వెర్ష‌న్ లో బిందు మాధ‌వి, అఖిల్ ల మ‌ధ్య గ‌త కొన్ని వారాలుగా కోల్డ్ వార్ నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్ లో బిందు, అఖిల్ ఒక‌రిని ఒక‌రు విల‌న్ లు గా చిత్రీక‌రించుకుంటూ నిత్యం గొడ‌వ‌లు ప‌డుతూనే వున్నారు. ఇక అఖిల్ స్లాంగ్ ని కించ‌ప‌రుస్తూ `ఆడ‌` అంటూ ఓ రేంజ్ లో ఇబ్బంది పెట్టింది కూడా. ఆడ అనే ప‌దాన్ని జెండ‌ర్ విష‌యంలో అఖిల్ మీద బిందు మాధ‌వి ప్ర‌మోగించ‌డం, దానికి అఖిల్ ఫీల‌వ‌డంతో బిందు తెలివిగా ఆ టాపిక్ ని ప‌క్క‌దారి ప‌ట్టించి ఎస్కేప్ అయింది. అంతే కాకుండా అందులో జెండ‌ర్ లేదు అంటూ బుకాయించింది కూడా. కానీ నాగ్ ఈ వారం అదే టాపిక్ ని ప‌ట్టుకుని ప‌ద‌కొండ‌వ వారం నామినేష‌న్ లో బిందుని అడ్డంగా బుక్ చేశాడు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్, బిందు మాధ‌వి హ‌ద్దులు దాటి గొడ‌వ‌కు దిగారు. ఆడ‌పిల్ల అని న‌ట‌రాజ్ అన్న ప‌దాన్ని బిందు వెంట‌నే అఖిల్ ని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చింది. ఇక్క‌డే నాగ్ కు అడ్డంగా దొరికిపోయింది. ఇదే పాయింట్ ని ప‌ట్టుకుని నాగార్జున .. బిందుని ఇరుకున పెట్టేశాడు. అంతే కాకుండా ఒరేయ్ అన్న డైలాగ్ ని కూడా చూపించి మ‌రి ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నావేంటీ అని గ‌ట్టిగానే క్లాస్ పీకాడు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ విష‌యంలో ఆడ అంటే అమ్మాయి అంటావు. అఖిల్ విష‌యంలో ఆడ అంటే అమ్మాయి కాదంటారు. ఇందులో ఏదో ఒక స్టాండ్ తీసుకో అని చుర‌క‌లంటించారు నాగార్జున‌.   

ఎమోష‌న‌ల్ అయిన ప్ర‌దీప్‌, నందితా శ్వేత‌

ఢీ14.. అబ్బుర పరిచే డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ షో తాజా ఎపిసోడ్ కొంత మందిని ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది. కంటెస్టెంట్ లు చేసిన ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్  నందిత శ్వేత‌, యాంక‌ర్ ప్ర‌దీప్ ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది. క‌న్నీళ్లు పెట్టుకునేలా చేసింది. ఈ షోకు ప్రియ‌మ‌ణి, గ‌ణేష్ మాస్ట‌ర్‌, నందితా శ్వేత న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యాంక‌ర్ ప్ర‌దీప్ ఈ షోకు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా హైప‌ర్ ఆది, ర‌వికృష్ణ, న‌వ్య స్వామి టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బుధ‌వారం ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. హైప‌ర్ ఆది, ర‌వికృష్ణ ... ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్ ల త‌ర‌హాలో కామెడీ చేసి న‌వ్వించారు. అనంత‌రం త‌మ‌ని పెంచి పెద్ద చేసిన త‌ల్లిదండ్రుల‌ను భారంగా భావించే వారికి క‌నువిప్పుక‌లిగేలా ఓ స్కిట్ ని ఈ షోలో ప్ర‌ద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో త‌న తండ్రిని త‌లుచుకుని న్యాయ‌నిర్ణేత‌ల్లో ఒక‌రైన నందితా శ్వేత కంట‌త‌డి పెట్టుకుంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన త‌న తండ్రి ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. మ‌రో వైపు త‌న తండ్రిని త‌లుచుకుని యాంక‌ర్ ప్ర‌దీప్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక ఇదే షోలో హైపర్ ఆది, ర‌వికృష్ణ `డీజే టిల్లు` పాట‌కు ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్ లా స్టెప్పులేసి న‌వ్వించారు. అంతే కాకుండా `నీలి నీలి ఆకాశం` పాట‌ని విచారంగా ఆల‌పించిన హైప‌ర్‌ ఆది అంద‌రిని న‌వ్వించాడు. హైప‌ర్ ఆది ఫ‌న్‌, యాంక‌ర్ ప్ర‌దీప్‌, నందితా శ్వేత‌ల ఎమోష‌న్ లతో నిండిపోయిన ఈ తాజా ఎపిసోడ్ బుధ‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ఈటీవిలో ప్ర‌సారం కానుంది.   

స్టార్ మా లో కొత్త సీరియ‌ల్ `నువ్వు నేను ప్రేమ‌`

బుల్ల‌తెర ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ స్టార్ మా ప‌లు విభిన్న‌మైన సీరియ‌ల్స్‌ని అందిస్తోంది. అందులో చాలా వ‌ర‌కు సీరియ‌ల్స్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. కార్తీక దీపం, ఇంటింటి గృహ‌ల‌క్ష్మి, దేవ‌త వంటి విభిన్న‌మైన సీరియ‌ల్స్ తో మ‌హిళా లోకాన్ని అల‌రిస్తున్న స్టార్ మా తాజా గా ఈ సోమ‌వారం నుంచి స‌రికొత్త సీరియ‌ల్ ని అందిస్తోంది. స్టార్ మా అందిస్తున్న కొత్త సీరియ‌ల్ నువ్వు నేను ప్రేమ‌`. ప్ర‌తీ సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం 6:30 నిమిషాల‌కు ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కానుంది. ఈ సోమ‌వారం నుంచి ఈ సీరియ‌ల్ ప్ర‌సారం ప్రారంభం కాబోతోంది. ఇందులో ప్రేమ మాత్ర‌మే కాకుండా రెండు కుటుంబాల బంధాలు, మమ‌తానురాగాలు, బాధ్య‌త‌ల నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ సాగ‌నుంది. ఓ యువ‌కుడి అహంకారానికి, ఓ యువ‌తి ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య సాగే అంద‌మైన క‌థ‌గా దీన్ని మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. కుటుంబ భారీన్ని మోయ‌డానికి ఉద్యోగంలో చేరిన ఓ యువ‌తికి, త‌న అహంకారంతో ఓ యువ‌కుడు ఎలాంటి ఇబ్బందుల్ని క‌లిగించాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. గొడ‌వ‌ల‌తో మొద‌లైన వీరి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? ..త‌రువాత వారి జీవితాల్ని ఎలా ఒక్క‌టి చేసింది? అన్న‌దే ఈ సీరియ‌ల్ ప్ర‌ధాన క‌థాంశంగా క‌నిపిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో ఆక‌ట్టుకుంటూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.  

పూర్ణ త‌న ల‌వ‌ర్ అంటూ షాకిచ్చిన‌ క‌మెడియ‌న్

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ న‌రేష్ ఉన్న‌ట్టుండి  షాకిచ్చాడు. త‌ను సింగిల్ కాద‌ని, న‌టితో ఎప్పుడో మింగిల్ అయ్యాన‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త‌న‌తో క‌లిసి పంచుకున్న ఫొటోలు కూడా వున్నాయంటూ ఏకంగా సాక్ష్యాల‌ని చూపించి అక్క‌డున్న వారిని షాక్ కు గురిచేశాడు. ఇంత‌కీ న‌రేష్ త‌నకు ల‌వ‌ర్ వుంద‌ని, ఆ ల‌వ‌ర్ కు సంబంధించిన సాక్ష్యాల‌ని చూపించి షాకిచ్చింది ఎవ‌రికో కాదు హీరోయిన్ పూర్ణ‌కు. రోజాకు మంత్రి ప‌దవి ద‌క్క‌డంతో త‌ను జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. త‌న స్థానంలో న‌టి పూర్ణ ఈ షోకు జ‌డ్జిగా ఎంట్రీ ఇచ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో లో న‌రేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. త‌న‌దైన స్కిట్ ల‌తో ఎంట‌ర్ టైన్ చేస్తూ మంచి త‌గుర్తింపుని సొంతం చేసుకున్న న‌రేష్ ఈ షోలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న వాళ్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ లో న‌రేష్ ఏకంగా పూర్ణ‌, ఇంద్ర‌, ర‌ష్మీ గౌత‌మ్ ల‌కు షాకిచ్చాడు. త‌ను సింగిల్ కాద‌ని, ఇప్ప‌టికే ఓ న‌టితో మింగిల్ అయిపోయాన‌ని షాకిచ్చాడు. ఆ న‌టి మ‌రెవ‌రో కాద‌ని, త‌ను పూర్ణ అని చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క సారిగా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. అంతే కాకుండా ఇద్ద‌రు క‌లిసి ఫొటోల‌కు పొజులిచ్చామంటూ ఫొటోల‌ని సాక్ష్యాలుగా చూపించాడు. రాధేశ్యామ్ లోని ట్రైయిన్ షాట్‌... బాహుబ‌లి లో అనుష్క‌, ప్ర‌భాస్ క‌లిసి బాణాలు సంధించే ఫొటో ని న‌రేష్‌, పూర్ణ హెడ్ ల‌ని మార్ఫింగ్ చేసి చూపించాడు. బాహుబ‌లి స్టిల్ చూసిన ఇదేంట‌ని కెవ్వు కేక కార్తీక్ ప్ర‌శ్నిస్తే `పూర్ణ‌బ‌లి` అంటే నరేష్ అన‌డంతో అంతా న‌వ్వేశారు. ఆ త‌రువాత `ఉప్పెన‌` చిత్రంలోని నీ క‌ళ్లు నీలి స‌ముద్రం` అంటూ సాగే పాట‌కు న‌రేష్‌, పూర్ణ క‌లిసి డ్యాన్స్ చేశారు. ఈ క్ర‌మంలో న‌రేష్ కు ముద్దు పెట్టిన‌ట్టు, బుగ్గ కొరికి న‌ట్టు పూర్ణ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

బిందు, అఖిల్‌లకు అన‌సూయ కౌంట‌ర్లు

వ‌రుస గెస్టుల‌తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో జిగేలు మంటూ ఆక‌ట్టుకుంటోంది. సీన్ ఎండింగ్‌కి వ‌చ్చేయ‌డంతో మొన్న‌టిదాకా బిగ్ బాస్ తెలుగు ఐదో సీజ‌న్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఒక్కొక్క‌రుగా వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇటీవ‌ల మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ `అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం` టీమ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హ‌ల్ చ‌ల్ చేసింది. తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి అన‌సూయ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టేసింది. అయితే అంద‌రిలా కాకుండా కంటెస్టెంట్ల‌పై ప్రశ్న‌ల తూటాలు వదిలింది. ముందు అరియానాను ఆడుకున్న అన‌సూయ ఆ త‌రువాత బిందు, అఖిల్‌ల‌కు కౌంట‌ర్లేసింది. ఈ సంద‌ర్భంగా అన‌సూయ‌కు హౌస్‌లో స్వాగ‌తం ప‌లుకుతూ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ లేడీ గెట‌ప్ ధ‌రించి `బావొచ్చాడోల‌ప్పా.. అంటూ ర‌చ్చ చేశాడు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌తో క‌లిసి బాబా భాస్క‌ర్ కూడా రెచ్చిపోయి చిందులేశాడు. ఆ త‌రువాత ప్రేక్ష‌కులు కంటెస్టెంట్ల‌కు రాసిన ప్ర‌శ్న‌ల‌ని కౌంట‌ర్లుగా మార్చి అన‌సూయ ఒక్కో కంటెస్టెంట్‌పై పంచుల్లా వేసింది. 'ఫ్యామిలీ వీక్ త‌రువాత బిందుకు క్లోజ్ అయ్యావు.. ఎందుకు ఉమెన్ కార్డ్ వాడుతున్నావు? స‌డ‌న్ గా ఎందుకిలా మారిపోయావ్?' అని అరియానాని ప్ర‌శ్నించింది. అనంత‌రం బిందు మాధ‌విని టార్గెట్ చేసిన అన‌సూయ, 'ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడే నువ్వు అఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడ‌ని నిందిస్తున్నావ్' అంటూ కౌంట‌ర్ వేసింది. దీంతో తాను ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడ‌లేద‌ని గ‌ట్టిగా చెప్పేసింది బిందు. ఆ త‌రువాత అఖిల్‌కి ప‌డింది కౌంట‌ర్‌. 'గ‌త కొన్ని రోజులుగా బిందు గురించి నెగటివ్‌గా మాట్లాడ‌ట‌మే పనిగా పెట్టుకున్నావు. మ‌రి ఫ్యామిలీ ఎపిసోడ్ త‌రువాత స‌డ‌న్‌గా నీ స్టాండ్ ఎందుకు మారింది.. బిందు గురించి పాజిటివ్‌గా మాట్లాడ‌టం మొద‌లు పెట్టావ్' అంటూ అఖిల్ కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ వేసింది అన‌సూయ‌. ప్ర‌స్తుతం దీనికి సంబందించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

బిగ్ బాస్ సిరిపై శ్రీ‌హాన్ షాకింగ్ కామెంట్స్‌

బిగ్‌బాస్ గ‌త సీజ‌న్‌లో సిరి హ‌న్మంత్‌ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ష‌ణ్ముఖ్‌తో క‌లిసి మోజో రూమ్‌, బాత్రూమ్‌ వ‌ద్ద వీళ్లు చేసిన హంగామా వీరిని సోష‌ల్ మీడియాలో విల‌న్లుగా మార్చింది. అంతే కాకుండా బిగ్ బాస్ అన్ని సీజ‌న్ల‌తో పోలిస్తే వ‌ర‌స్ట్ జోడీగా వీరిని నెటిజ‌న్లు నెట్టింట ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. హ‌గ్గులు, అంద‌రిని ప‌క్క‌న పెట్టి క్లోజ్‌గా వుండ‌టం, స‌న్నీని టార్గెట్ చేయ‌డం వంటి కార‌ణాల వల్ల చాలా వ‌ర‌కు త‌మ పాపులారిటీని పోగొట్టుకున్న ఈ జంట చివ‌రికి నెటిజ‌న్ల‌ దృష్టిలో విల‌న్లుగా మారింది. దీని కార‌ణంగా ష‌ణ్ముఖ్ - దీప్తి సున‌య‌న‌,  సిరి హ‌న్మంత్ - శ్రీ‌హాన్ మ‌ధ్య దూరం పెరిగిందంటూ వార్త‌లు వినిపించాయి. ష‌ణ్ముఖ్ - సున‌య‌న మాత్రం ఏకంగా బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. వీళ్ల లాగే విడిపోయార‌నుకున్న సిరి - శ్రీ‌హాన్ బిగ్ బాస్ సీజ‌న్ త‌రువాత క‌లిసి పార్టీలు చేసుకుంటూ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టారు. సిరి బ‌ర్త్ డేకి త‌న‌కు ప్ర‌త్యేకంగా విషేస్ తెలియ‌జేసిన శ్రీ‌హాన్‌ త‌మ మ‌ధ్య‌ ఎలాంటి అపోహ‌లు, అపార్థాలు లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా సిరి గురించి ఎవ‌రికీ తెలియని విష‌యాలు చెప్పి ఆమె ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ల‌తో యాంక‌ర్ ర‌వి స‌ర‌దాగా ఓ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇందులో సిరి గురించి శ్రీ‌హాన్ ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. సిరి గొప్ప‌తనం, త‌ను ఎవ‌రి అండ లేకుండా ఎదిగిన తీరుని వివ‌రించి సిరి ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశాడు. 'సిరిని అర్థం చేసుకోవ‌డానికి చాలా టైం ప‌డుతుంది. నాకిప్ప‌టికీ ప‌డుతూనే వుంది'. అంటూ చెప్పుకొచ్చాడు. 'సిరి ఏదైనా సాధించాలంటే ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చినా దేన్నీ పట్టించుకోదు. త‌ను వైజాగ్ లో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి కొన్ని సాధించాల‌నుకుంది. యాంక‌రింగ్ చేసుకుంటూ సీరియ‌ల్స్‌, సినిమాలు చేసింది. మొన్న‌టి బిగ్ బాస్ వ‌ర‌కు మొత్తం త‌న క‌ష్ట‌మే. ఎవ‌రూ సాయం చేసింది లేదు' అని శ్రీ‌హాన్ అన‌డంతో సిరి ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయింది.

'చందమామ' సినిమా నుంచి 'అడివి శేష్'ని తీసేశారు

చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన అడివి శేష్.. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈ టాలెంటెడ్ హీరో.. జూన్ 3న 'మేజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న శేష్.. తన కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆలీతో సరదాగా షోలో శేష్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో తనని ఓ సూపర్ హిట్ మూవీ నుంచి తీసేశారని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. 2000 నుంచే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన శేష్.. 2002 లో విడుదలైన 'సొంతం' సినిమాలో మెరిశాడు. నిజానికి ఆ సినిమాలో చాలా పెద్ద రోల్ అని చెప్పారట. కానీ తీరా తెరమీద చూస్తే కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించానని అప్పటి సంఘటనని గుర్తుచేసుకున్నాడు శేష్.  అలాగే 2007 లో విడులై సూపర్ హిట్ గా నిలిచిన కృష్ణ వంశీ మూవీ 'చందమామ'లో మొదట అడివి శేషే హీరోనట. నవదీప్ స్థానంలో మొదట తనని పెట్టి రెండు రోజులు షూట్ చేశారని, కానీ తర్వాత ఎందుకో తీసేశారని శేష్ చెప్పుకొచ్చాడు.

యూట్యూబ‌ర్ తాట తీసిన క‌రాటే క‌ల్యాణి

క‌రాటే క‌ల్యాణి నిత్యం ఏదో ఒక విష‌యం కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల విశ్వ‌క్‌సేన్ పై ఓ టీవీ ఛాన‌ల్ సృష్టించిన వివాదంపై ఘాటుగానే స్పందించి వార్త‌ల్లో నిలిచారు క‌రాటే క‌ల్యాణి. స‌ద‌రు టీవి ఛాన‌ల్ ని ఎండ‌గ‌డుతూ విశ్వ‌క్ సేన్ కు అండ‌గా నిలిచారు. ఇక తాజాగా మ‌రో వివాదంతో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నారు. వివాదాల‌పై నేరుగా స్పందిస్తూ వార్త‌ల్లో నిలిచే క‌రాటే క‌ల్యాణి ఈ ద‌ఫా ఓ యూట్యూబ‌ర్ తాట తీసి హ‌ల్ చ‌ల్ చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిపై సినీ న‌టి క‌రాటే క‌ల్యాణి దాడికి పాల్ప‌డింది. ప్రాంక్ వీడియోల పేరిట మ‌హిళ‌ల‌తో అస‌భ్యక‌ర వీడియోలు చేస్తున్నాడంటూ అత‌నిపై దాడికి దిగింది. యూసుఫ్ గూడా స‌మీపంలోని మ‌ధురాన‌గ‌ర్ రోడ్డుపై యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి, క‌రాటే క‌ల్యాణి ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్నారు. ప్రాంక్ వీడియోల విష‌యంలో శ్రీ‌కాంత్ రెడ్డిని నిల‌దీయ‌డంతో తాజా వివాదం చోటు చేసుకుంది. న‌టి క‌రాటే క‌ల్యాణి, మ‌రో ఇద్ద‌రు క‌లిసి యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిపై దాడికి దిగిన‌ట్టుగా తెలుస్తోంది. ముందు క‌రాటే క‌ల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం స్టార్ట్ కాగా ఆ వెంట‌నే ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకోవ‌డంతో గోడ‌వ మ‌రింత ముదిరింది. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్న త‌రువాత ఇద్ద‌రు ఎస్‌.ఆర్. న‌గ‌ర్ పోలీస్టేష‌న్ లో ప‌ర‌స్ప‌రం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్ రెడ్డి యూట్యూబ్ ఛాన‌ల్ ని నిషేధించాల‌ని క‌ల్యాణి డిమాండ్ చేశారు. ఇదే క్ర‌మంలో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి అకార‌ణంగా దాడి చేసిన క‌రాటే క‌ల్యాణిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీ‌కాంత్ రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

'న‌న్ను టాప్ 5లోకి తీసుకెళ్ల‌క‌పోతే చంపేయ్‌'.. దేవుడికి మొర పెట్టుకున్న‌ న‌ట‌రాజ్‌

'బిగ్‌ బాస్ నాన్ స్టాప్' చివ‌రి అంకానికి చేరుకుంది. దీంతో ఆట ర‌స‌వ‌త్త‌రంగా మారింది. హౌస్ లో వున్న ఇంటి స‌భ్యులు నువ్వా నేనా అనే స్థాయిలో ఒక‌రిని మించి ఒక‌రు మోసం చేసుకుంటూ టాప్ 5 కోసం నానా పాట్లు ప‌డుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అఖిల్ - న‌ట‌రాజ్ మాస్ట‌ర్ మ‌ధ్య చిచ్చు పెట్టింది. అఖిల్ అస‌లు రూపాన్ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు మ‌రోసారి చూపించింది. ఈ టాస్క్ లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఓడిపోవ‌డంతో వింత వింత‌గా ప్ర‌వ‌ర్తించాడు. 'బాద త‌ట్టుకోలేక‌పోతున్నా.. ఈ హౌస్ లో ఎవ‌రూ నాకు హెల్ప్ చేయ‌రు. న‌న్ను చంపేయ్‌. క‌నీసం ఆడియ‌న్స్ ఓట్లు అడుక్కునే అవ‌కాశం కూడా లేకుండా చేశావ్‌. ఆ ఆవ‌కాశం కూడా లాగేసుకున్నావే. ఇంకేమి చేస్తావ్‌. మెడ‌ప‌ట్టి చంపెయ్‌..' అంటూ ఆకాశం వంక చూస్తూ వింత వింత‌గా అరుస్తూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించాడు. అత‌ని వింత ప్ర‌వ‌ర్తన హౌస్ లో వున్న వాళ్ల‌ని షాక్ కు గురిచేసింది. బాబా భాస్క‌ర్ వ‌చ్చి 'ఏంట్రా న‌ట్టా.. ఎవ‌రితో మాట్లాడుతున్నావ్ రా న‌ట్టా.. నీ గురించి త‌ప్పుగా అనుకుంటార్రా..' అని చెప్తున్నా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ త‌గ్గ‌లేదు. "న‌న్ను టాప్ 5లో కి తీసుకుని వెళ్ల‌క‌పోతే చంపెయ్‌.. న‌న్ను చంపెయ్‌.. నాకు సుఖం ఇచ్చింది ఎప్పుడు.. నాకు హౌస్ లో స‌పోర్ట్ రాదే. ఆడియ‌న్స్ స‌పోర్ట్ కోసం ప‌రుగు పెడుతున్నాను. నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. నా కూతురు మొహం చూసి ఆడుతున్నా అంతే.. నాకు హౌస్ లో శ‌త్రువులు ఎక్కువే. నేను ఇలానే వుంటా. ఎన్ని సార్లు ఓడ‌గొడ‌తావో ఓడ‌గొట్టు.. నేను పోరాడుతూనే వుంటాను. చిన్న పాప‌ని వ‌దిలేసి వ‌చ్చి ఉన్నాను. 'నేను సాధించాను. టాప్ 5 లో వున్నాను. గెలిచాను.' అని గ‌ర్వంగా చెప్ప‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చాను. నాకు కోరిక లేదు.. నా కూతురు గురించే ఆడుతున్నాను. స‌గం చ‌చ్చిపోయి వున్నాను. 23 ఏళ్లుగా ఆడుతున్నాను. అలిసిపోయాను." అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చేశాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్.  ఇది గ‌మ‌నించిన అఖిల్ `మాస్ట‌ర్ ఇక ఆపుతారా?` అనడంతో `ప్లీజ్‌.. ప్లీజ్‌.. నాకు నీ స‌పోర్ట్ అవ‌స‌రం లేదు. నేను దేవుడితో మాట్లాడుకుంటా. నువ్వు నాకు స‌పోర్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు` అంటూ అఖిల్ కి కౌంట‌ర్ ఇచ్చాడు. అఖిల్ కూడా మాస్ట‌ర్ కు దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ వేశాడు. స‌క్సెస్ ఇలా అడిగితే రాదు అంటూ బ్రెయిన్ వాష్ చేశాడు.

య‌ష్ - వేద‌ల ఇంట్లో నిధి అంత్యాక్ష‌రి క‌చేరి

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సాం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పా కోసం ఓ యువ‌తి ప‌డే ఆరాటం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, మీనాక్షి త‌దిత‌రులు న‌టించారు. హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. బుధ‌వారం ఎపిసోడ్ విశేషాలేంటో ఒక‌సారి చూద్దాం. య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ దామోద‌ర్ త‌న సోద‌రి నిధిని య‌ష్ సోద‌రుడు వ‌సంత్ కిచ్చి పెళ్లి చేయాల‌ని చెబుతాడు. ఇందు కోసం నిధిని య‌ష్ ఇంటికి గెస్ట్ గా పంపిస్తాడు. గెస్ట్ గా య‌ష్ - వేద‌ల ఇంట సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టిన నిధి.. త‌న ప‌నుల‌తో వ‌సంత్ - చిత్ర ల మ‌ధ్య మంట పెడుతూ వుంటుంది. ఇంక త‌న కోస‌జం వంట ప్రిపేర్ చేయ‌మ‌ని ఆ బాధ్య‌త‌ల్ని య‌ష్ .. వేద‌కు అప్ప‌గిస్తాడు. ఉల్లిపాయ‌లు కోస్తూ ఏడుస్తున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తుంది వేద‌. అది నిజ‌మే అనుకుని య‌ష్ ఆ ప‌ని తానే చేస్తానంటాడు. స్పెట్స్ పెట్టుకుని ఉల్లిపాయ‌లు క‌ట్ చేస్తాడు. ఆ త‌రువాత ఇద్ద‌రు క‌లిసి వెజిటేరియ‌న్ కోసం అంతా రెడీ చేయ‌బోతున్న స‌మ‌యంలో నిధి త‌న‌కు వెజిటేరియ‌న్ కాదు.. నాన్ వెజ్ కావాలంటుంది. అది విని వేద బావురుమంటుంది. అది గ‌మ‌నించిన య‌ష్ త‌న‌కు నీ విష‌యం తెసుస‌ని, నాన్ వెజ్ ఆర్ట‌ర్ చేసి తెప్పిస్తానంటాడు. ఆ త‌రువాత అంతా భోజ‌నానికి కూర్చుంటారు. ఇదే టైమ్ లో భోజ‌నం త‌రువాత అంత్య‌క్ష‌రి ఆడ‌దాం అంటుంది నిధి. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది? .. వేద - య‌ష్ లు ఏం చేశార‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'శూర్ప‌ణ‌ఖా నీ ముక్కు కోసేస్తా'.. బిందుమాధ‌విపై న‌ట‌రాజ్ వీరంగం

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో రస‌వ‌త్త‌రంగా మారింది. మ‌రికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఫైన‌ల్ కు చేరుకునేది ఎవ‌రు? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధ‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, మిత్ర‌, యాంక‌ర్ శివ‌, అఖిల్‌, అనిల్‌, బాబా భాస్క‌ర్‌ మాస్ట‌ర్ ఉన్నారు. ఇందులో ఎవ‌రు ఫినాలేకు చేరుకోవ‌డానికి అర్హులో.. ఏ ముగ్గురు అన‌ర్హులో చెప్పాలంటూ బిగ్ బాస్ హౌస్ మేట్ ల‌కు టాస్క్ ఇచ్చారు. ఇదే ఇంటి సభ్యుల‌ మ‌ధ్య తీవ్ర చిచ్చుకు కార‌ణంగా నిలిచింది. బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చాడో లేదో వెంట‌నే రంగంలోకి దిగాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌. ఈ క్ర‌మంలో అరియానా, బిందు మాధ‌వి, బాబా భాస్క‌ర్ ఫినాలేకు చేరుకోవ‌డానికి అన‌ర్హుల‌ని తేల్చేశాడు. ఇక్క‌డి నుంచే అస‌లు ర‌చ్చ మొద‌లైంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ టాస్క్ లో బిందు మాధ‌విని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ టార్గెట్ చేయ‌డం క‌నిపించింది. 'నెగిటివిటి మాత్ర‌మే వున్న ఏకైక ప‌ర్స‌న్ నువ్వు మాత్ర‌మే' అంటూ ర‌చ్చ చేశాడు. దీనికి బిందు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చింది. 'నీ సైడ్ వ‌చ్చింది పాజిటివా?' అంటూ షంటింది. 'నీ బెస్ట్ గేమ్ ఏంటీ?' అని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అడిగితే.. 'ఐయామ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప‌ర్స‌న్ ఇన్ దిస్ హౌస్' అని చెప్పింది బిందు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. 'నీ బండారం బ‌య‌ట‌పెడ‌తా' అంటూ కెమెరా వైపు చూస్తూ న‌ట‌రాజ్ వెకిలి వేషాలు వేయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో బిందు ఆది ప‌రాశ‌క్తిగా ఫోజు పెట్టి నిల‌బ‌డింది. దీనికి కౌంట‌ర్ ఇస్తూ న‌ట‌రాజ్ 'శూర్ప‌ణ‌ఖ నీ టైమ్ అయిపోయింది. ఇదిగో ల‌క్ష్మ‌ణ బాణం.. నీ ముక్కు కోసేస్తా' అంటూ వీరంగం వేశాడు. ఆ త‌రువాత అఖిల్ - శివ, అఖిల్ - బిందు మాధ‌వి, న‌ట‌రాజ్ - బాబా భాస్క‌ర్ ల మ‌ధ్య ఇదే త‌ర‌హాలో మాట‌ల యుద్ధం జ‌రిగింది.

యశ్, వేదల కథ మళ్ళీ కొత్తగా మొదలవుతోందా ?

బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఏడేళ్ల క్రితం స్టార్ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మై ఆకట్టుకున్న `ఏ హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్, నిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, మీనాక్షి త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా కొత్త మ‌లుపు తిరుగుతోంది. దామోద‌ర్ సోద‌రి నిధి.. య‌ష్ ఇంట్లోకి గెస్ట్ గా రావ‌డంతో అస‌లు కథ మొద‌లైంది. నిధిని వ‌సంత్ కిచ్చి పెళ్లి చేయాల‌ని వుంద‌ని దామోద‌ర్ .. య‌ష్ కు తెలియ‌జేస్తాడు. అందు కోసం నిధిని య‌ష్ ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఇక్క‌డి ఉంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. య‌ష్ కార‌ణంగా వేద ఇంట్లో నిధి గెస్ట్ గా ఎంట్రీ ఇస్తుంది. వ‌చ్చీ రాగానే త‌న అల్ల‌రి తో అంద‌రిని ఆక‌ట్టుకున్న నిధి య‌ష్‌, వేద ఇళ్ల‌ల్లో కొత్త సంద‌డి తీసుకొస్తుంది. అయితే ఇది వేద సోద‌రి చిత్ర కు ఇష్టం వుండ‌దు. ఎలాగైనా నిధిని ఇంటి నుంచి పంపించాల‌ని ఆగ్ర‌హంతో ఊగిపోతూ వ‌సంత్ పై కారాలు మిరియాలు నూరుతూ వుంటుంది. ఈ క్ర‌మంలోనే వేద‌, య‌ష్ ల జంట మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ లా వుంద‌ని, య‌ష్ కు వేద ల‌భించ‌డం అత‌ని అదృష్టం అంటుంది. వేద ఏంజిల్ లా వుంద‌ని చెబుతుంది. ఈ క్ర‌మంలో వేద ఇంట్లో అంత్యాక్ష‌రి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లో య‌ష్, వేద క‌లిసి `కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెర‌పై చూశానే..` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య కొత్త ప్రేమ మొద‌ల‌వుతుంది. డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలోనే య‌ష్ .. వేద‌కు ఓ చిట్టి ఇస్తాడు. .జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. అదంతా మ‌ర్చిపోదాం. కొత్త‌గా మొద‌లు పెడదాం` అని రాసి వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఇది నిజ‌మా కలా? అని  షాక్ లో వున్న వేద త‌రువాత ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

బిందు మాధ‌వి పిచ్చి మొత్తం బ‌య‌టికి తీస్తాడ‌ట‌!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ మొత్తానికి ఎండింగ్ కి వ‌చ్చేసింది. సీజ‌ప్ ఎండింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ ఒక్కొక్క‌రి అస‌లు రూపం.. అసలు క్యారెక్ట‌ర్స్ మొత్తం బ‌య‌టికి వ‌చ్చేస్తున్పాయి. గ‌తంలో బిగ్ బాస్ హౌస్ నుంచి త‌న క్యారెక్ట‌ర్ కార‌ణంగానే బ‌య‌టికి వ‌చ్చేసిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఓటీటీ వెర్ష‌న్ లోనే అదే యాటిట్యూడ్ ని ప్రద‌ర్శిస్తూ మ‌ళ్లీ బుక్క‌య్యేలా క‌నిపిస్తున్నాడు. ఏకంగా అఖిల్ కోసం బిందు మాధ‌విని టార్గెట్ చేసి "పిచ్చిది" అంటూ రెచ్చిపోయాడు. ఎవ‌రు అర్హులో ప్రేక్ష‌కులే నిర్వ‌హిస్తార‌ని సీరియ‌స్ గా అంటూ పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లు పెట్టాడు. నామినేష‌న్స్ లో భాగంగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ పూన‌కం వ‌చ్చిన వాడిలా ప్ర‌వ‌ర్తించి షాకిచ్చాడు. "బిందు మాధ‌వికి ఎమోష‌న్స్ వాల్యూ తెలియ‌దు. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఒక్క‌సారి కూడా గేమ్ ఆడకుండా పిచ్చి పిచ్చిగా ఆడుతూ ముందుకు వెళ్తోంది బిందు మాధ‌వి. ఆమె ఫేక్.. ఫేక్.. పిచ్చివాళ్లు క‌రుస్తారు. నిద్ర‌పోతున్న సింహాన్ని లేపారు" అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు న‌ట‌రాజ్ మాస్టర్‌. దీంతో బిందు మాధ‌వి కూడా న‌ట‌రాజ్ మాస్టర్ కు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చేసింది. త‌న‌ని టార్గెట్ చేస్తూ 'ఇప్ప‌డు చూపిస్తా' అని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అంటుంటే 'ఇన్ని రోజులు ఎందుకు చెప్ప‌లేదు మాస్టర్?' అంటూ కౌంట‌రిచ్చింది. 'అంటే పిచ్చి ముదిరింద‌ని ఈ రోజే తెలిసింది. నీకు ఎమోష‌న‌ల్ వ్యాల్యూస్ లేవు' అంటూ కించ‌ప‌రిచే విధంగా మాట్లాడాడు. దీంతో బిందు 'మీకు ఒక్క‌రికే కూతురు లేదు, నాకు ఒక్క‌రికే నాన్న లేరు.' అంటుంటే కెమెరా ముందుకొచ్చి 'ఒక్క‌సారి కూడా గేమ్ ఆడ‌లేదు. గేమ్ ఆడ‌కుండా పిచ్చి పిచ్చిగా గేమ్ ఆడుతూ ముందుకు వెళుతున్న బిందు మాధ‌వీ' అన్నాడు. దీంతో బిందు మ‌రింత ఘాటుగా స్పందించింది. 'డైరెక్ట్ గా నా ఎదురుగా మాట్లాడే ద‌మ్ములేక కెమెరా ముందుకెళ్లి మాట్లాడుతున్న న‌ట‌రాజ్ మాస్ట‌ర్' అంటూ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య ఇలాంటి సంభాష‌ణ జ‌రుగుతుంటే దాన్ని ఆనందిస్తూ అఖిల్ విక‌టాట్ట‌హాసం చేయ‌డం కొస‌మెరుపు.

భార్య బ‌ర్త్‌డేకి డాక్ట‌ర్ బాబు క‌విగా మారాడు

బుల్లితెరపై నిరుప‌మ్ `కార్తీక‌దీపం`లోని డాక్ట‌ర్ బాబు పాత్రతో పాపులారిటీని సొంత చేసుకుని సెల‌బ్రిటీగా మారిన విష‌యం తెలిసిందే. బుల్లితెర శోభ‌న్ బాబుగా అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొంతుదున్న నిరుప‌మ్ `కార్తీక దీపం` సీరియ‌ల్ నుంచి త‌ప్పుకున్నా ఇంకా కొత్త సీరియ‌ల్ ని ప్రారంభించ‌లేదు. త‌ను మ‌ళ్లీ బుల్లితెర‌పై ఎప్పుడు మెరుస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీరియ‌ల్స్ లో క‌నిపించ‌ని డాక్ట‌ర్ బాబు సోష‌ల్ మీడియాలో మాత్రం య‌మ యాక్టీవ్ గా వుంటున్నాడు. ప్ర‌తీ అకేష‌న్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుపుకుంటూ అభిమానుల‌కు అందుబాటులో వుంటున్నాడు. డాక్ట‌ర్ బాబు పాత్రతో పాటు వంట‌ల‌క్క పాత్ర‌ని కూడా సీరియ‌ల్ నుంచి తొల‌గించ‌డంతో సీరియ‌ల్ గ‌తి త‌ప్పి ప‌క్క‌దారులు ప‌ట్టి చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. ఇదిలా వుంటే నిరుప‌మ్ మాత్రం సీరియ‌ల్స్ లో క‌నిపించ‌కుండా సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. భార్య మంజుల‌తో క‌లిసి యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోలు చేస్తున్నాడు. ఇద్ద‌రు క‌లిసి చేస్తున్న వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అతి త‌క్కువ కాలంలోనే ఆ చాన‌ల్ ఫేమ‌స్ అయ్యింది. తాజాగా నిరుపమ్ త‌న భార్య మంజుల పుట్టిన రోజు సంద‌ర్భంగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది. పుట్టిన రోజు సంద‌ర్భంగా మంజుల‌పై ఏకంగా ఓ క‌విత రాశాడు. ఆగ‌ని అల‌.. క‌ర‌గ‌ని క‌ల‌.. అనుబంధాల వ‌ల‌.. త‌ర‌గ‌ని నావ‌లా... ఇది దేవుడి లీల‌.. హ్యాపీ బ‌ర్త్ డే మంజుల‌.. అని చెప్పేస్తూ క‌విత రాశాడు నిరుప‌మ్‌. అత‌డి క‌విత్వాన్ని చూసి నెటిజ‌న్ లు మురిసిపోతూ కామెంట్ లు పెడుతున్నారు.

అఖిలే నెం.1.. హ‌గ్గంటే పారిపోయిన షణ్ముఖ్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ముందు వారంలో జ‌రుగుతున్న `టికెట్ టు ఫినాలే` టాస్క్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇది మంచి ర‌స‌ప‌ట్టుగా సాగుతోంది. యాంక‌ర్ ర‌వి, మాన‌స్‌, సిరి హ‌న్మంత్‌, తాజాగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్  ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసి చేయాల్సిన ర‌చ్చ చేస్తున్నారు. ఇప్ప‌టికే యాంక‌ర్ ర‌వి, మాన‌స్‌, సిరి హ‌న్మంత్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ అంటూ భౌస్ లోకి వచ్చి వెళ్లారు. తాజాగా యూట్యూబ‌ర్ ష‌ణ్మ‌ఖ్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆట దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. అంతా స‌ర‌దా మోడ్ లోకి వ‌చ్చేశారు. సూర్య పాట‌కు స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ణ్ముఖ్ మోజ్ రూం చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. అందులోకి వెళ్ల‌మ‌ని అరియానా అడిగితే వామ్మో నేను వెళ్ల‌నంటూ వెన‌క్కి వ‌చ్చేశాడు. ఆ త‌రువాత ఇంటి స‌భ్యుల గురించి మాట్లాడుతూ హౌస్ లో నిత్యం గొడ‌వ‌ప‌డుతున్న అఖిల్‌, బిందుల గురించి చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. బ‌య‌టికి వెళ్లాక అఖిల్ , బిందు క‌ల‌వ‌లేర‌ని ష‌ణ్ముఖ్ పంచ్ వేయ‌డంతో లేదు లేదు క‌లుస్తాం అని చెప్పాడు అఖిల్. బిందు కూడా క‌లుస్తాం అని చెప్పింది. ఇక ఇంటి స‌భ్యుల పాజిటివ్ పాయింట్స్ గురించి అషురెడ్డి అడ‌గ‌డంతో ఒక్కొక్క‌రి గురించి చెప్ప‌డం మొద‌లు పెట్టాడు.   ముందు గా అఖిల్ గురించి మాట్లాడుతూ త‌నే ఫ‌స్ట్ అనేశాడు. బిందు గారు లేడీ టైగ‌ర్ లేడీ టైగ‌ర్ అంటే బ‌య‌ట‌కు వెళ్లిన త‌రువాత తెలుస్తుంద‌ని పంచ్ వేశాడు. శివ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆడుతున్నాడు. ఒక్క నోటిదూల త‌గ్గించుకుంటే మ‌రింత గ‌ర్వంగా వుంటుందన్నాడు. మిత్రా నాకు ఇదంతా ముందే తెలుస‌ని గేమ్ బాగా ఆడుతున్నార‌ని చెబుతుంటే హ‌గ్ కోసం వెళ్లింది. దీంతో షాకై సిరిని కార‌ణంగా బ్యాడ్ అయిన విష‌యాన్ని గుర్తు చేసుకున్న ష‌న్ను ప్లీజ్ నాకు హ‌గ్ వ‌ద్దు.. ఈ బిగ్ బాస్ లో హ‌గ్ లు వ‌ద్దురా బాబోయ్ అంటూ దండం పెట్టాడు.

నిధి కోసం వేద‌ని ఏడిపిస్తున్న య‌ష్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మీనాక్షి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. పిల్ల‌లే పుట్ట‌న ఓ యువ‌తి.. త‌ల్లి ఆద‌ర‌ణ లేని ఓ పాప మ‌ధ్య పెన‌వేసుకున్న అనుబంధం విధి ఆడిన వింతాట‌లో ఇద్ద‌రిని త‌ల్లీకూతుళ్ల‌ని చేసింది. అనే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్ తో `స్టార్ మా`లో కొన‌సాగుతోంది. ఈ శ‌నివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ దామోద‌ర్ త‌న ముద్దుల చెల్లెలు నిధిని వ‌సంత్ కిచ్చి పెళ్లి చేసి బిజినెస్ బంధాన్ని కాస్తా బంధుత్వంగా మార్చుకోవాల‌ని వుందని య‌ష్ తో చెప్ప‌డంతో త‌న‌కు కొంత టైమ్ కావాల‌ని చెబుతాడు య‌ష్ . అయితే ఈ లోగా నిధిని య‌ష్‌ ఇంటికి గెస్ట్ గా కొన్ని రోజులు వుంటుంద‌ని పంపిస్తాడు దామోద‌ర్‌. అయితే య‌ష్ నిధిని వేద వాళ్ల ఇంట్లో గెస్ట్ గా వుండేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఈ లోగా నిధి ఎంట్రీ ఇస్తుంది. వేద ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. త‌న‌కు తానే ప‌రిచ‌యం చేసుకుంటుంది. ఈలోగా య‌ష్ ఎంట్రీ ఇస్తాడు. ఇంతలో నిధి చేసే అతి చేష్ట‌ల‌కు వ‌సంత్ ని ప్రేమించిన వేద చెల్లెలు చిత్ర వ‌సంత్‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతూ వుంటుంది.  నిధిని వేద త‌న గ‌దిలోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించ‌గా ఏదో ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వుంద‌ని య‌ష్ వెంట‌నే మా ఇంటికి వెళ‌దాం.. మా ఫ్యామిలీని ప‌రిచ‌యం చేస్తానంటూ నిధిని తీసుకెళ‌తాడు. క‌ట్ చేస్తే వంట‌లు చేసే క్ర‌మంలో వేద‌ని ఏడిపించ‌డం మొద‌లు పెడ‌తాడు య‌ష్‌. కూర‌గాయ‌లు మొత్తం వేద‌తో క‌ట్ చేయించి నీలాంటి పొగ‌రుబోతు పొగ‌రు దించితే ఆ కిక్కే వేరంటాడు. దీంతో వేద ఏడ్చుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  య‌ష్ - వేద‌ల కాపురంలో నిధి ఎలాంటి ప్ర‌కంప‌ణ‌లు సృసష్టించింది అన్న‌ది తెలియాలంటే ఈ  రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.