భీమ్ పాటని మందు పాటగా మార్చేసిన చలాకీ చంటి

హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ క‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా ఈటీవిలో ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో టాప్ టీఆర్పీ రేటింగ్ తో కొన‌సాగుతోంది. ఈ షోకు ప్ర‌ముఖ గాయ‌కుడు మ‌నో, న‌టి ఇంద్ర‌జ జడ్జిలుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక టీమ్ లీడ‌ర్స్ గా తాగుబోతు ర‌మేష్‌, రాకెట్ రాఘ‌వ‌, చ‌లాకీ చంటి, సునామీ సుధాక‌ర్‌, రైజింగ్ రాజు, శాంతి స్వ‌రూప్‌ ప్ర‌స్తుతం జ‌బ‌ర్త‌స్త్ షోలో స్కిట్ లు చేస్తున్నారు. ఈ గురువారం రాత్రి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. రాకెట్ రాఘ‌వ `వాన జ‌ల్లు గిల్లుతుంటే..` అనే పాట‌తో ప్రోమో మొద‌లైంది. బామ్మ‌గా తాగుబోతు ర‌మేష్ చేసిన ఫీట్లు న‌వ్వులు పూయిస్తున్నాయి. రాకెట్ రాఘ‌వ రెయిన్ సాంగ్ చేసి వ‌స్తే అత‌ని భార్య ప్లేట్ తో ఎంట్రీ ఇస్తుంది. 'ఏంటీ నువ్వు దిష్టి తీయ‌డానికి రాలేదా?' అంటే 'నీ బెండు తీయ‌డానికి వ‌చ్చాను రా?' అంటూ రాఘ‌వ‌ని చెడుగుడు ఆడుకోవ‌డం... త‌న ఫ్రెండ్ పెళ్లి కోసం బామ్మ‌గా మారిన తాగుబోతు ర‌మేష్ చేసిన ఫీట్లు.. వేసిన వేషాలు న‌వ్వులు పూయించేలా వున్నాయి. ఇక వీళ్ల త‌రువాత స్టేజ్ పై కొచ్చిన చ‌లాకీ చంటీ తాగుబోతుల స్కిట్ తో న‌వ్వులు పూయించాడు. 'మందేస్తూ చిందెయ్ రా'.. అనే సాంగ్ తో త‌న టీమ్ తో ఎంట్రీ ఇచ్చిన చ‌లాకీ చంటీ 'అంద‌రికీ ఓ దిన‌ముంది.. మాక్కూడా ఓ దినం కావాలే' అంటాడు. దీంతో చంటి ప‌క్క‌నే వున్న వ్య‌క్తి 'తాగుబోతుల దినోత్స‌వ‌మా?' అన‌గానే అత‌ని చెంప ప‌గ‌ల‌గొట్టిన చలాకీ చంటి.. 'తాగుబోతు అంటావుర‌ న‌న్ను.. ఎంపీపీ మ‌ధ్య పాన ప్రియుడు అనాల‌'న్నాడు.  ఆ త‌రువాత `ఆర్ ఆర్ ఆర్‌` సినిమాలోని `కొమురం భీముడో..` పాట‌ని మందు పాట‌గా మార్చేశాడు.  `విస్కీదేవాలా బ్రాండీ దేవాలా... గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట ప‌క్క‌నా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్క‌కీ ముక్క ముక్క‌తో జుర్రుకోవాలా... దొబ్బితాగాలా..` అంటూ కొమురం భీముడో పాట‌ని చ‌లాకీ చంటి తాగుబోతుల పాట‌గా మార్చేశాడు. దీంతో ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ వైర‌ల్ గా మారింది.

హైప‌ర్ ఆదికి ల‌వ్‌ ప్ర‌పోజల్‌.. చెంప ప‌గ‌ల‌గొట్టిన ర‌ష్మీ!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో పాపుల‌ర్ అయిన వారు సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, ఆటో రామ్ ప్ర‌సాద్‌, హైప‌ర్‌ ఆది, గెట‌ప్ శ్రీ‌ను. వీళ్ల‌తో పాటు వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌, తాగుబోతు ర‌మేష్‌, రాకింగ్ రాకేష్.. ఇలా చాలా మందే వున్నారు. వీళ్ల‌లో సుడిగాలి సుధీర్ కంప్లీట్ గా ఈ షోని వ‌దిలేశాడు. ర‌ష్మీ గౌత‌మ్‌, ఆటో రామ్ ప్ర‌సాద్ తో పాటు కొంత మంది వున్నారు. ఈ షో నుంచి బ‌య‌టికి వెళ్లిన సుడిగాలి సుధీర్ ఈటీవీ ఛాన‌ల్ లో ప్ర‌సారం అవుతున్న మ‌రో షో `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`కి యాంక‌ర్ గా, టీమ్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే గ‌త కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్ ఈ షోలోనూ క‌నిపించ‌డం లేదు. అత‌ని స్థానంలో కొత్త‌గా ర‌ష్మీ గౌత‌మ్ షోలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక్క‌డ కూడా ఆటో రామ్‌ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది అండ్ కోతో క‌లిసి స్కిట్ ల‌లో పాల్గొంటూ మ‌ధ్య మ‌ధ్య‌లో యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది ర‌ష్మి. ఈ షోకు పూర్ణ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇంద్ర‌జ లేక‌పోవ‌డంతో జ‌డ్జిగా పూర్ణ‌ని రంగంలోకి దించేశారు. తాజాగా ఆదివారం ప్ర‌సార‌మైన ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టేజ్ పై క‌ళ్లు తిరిగిప‌డిపోయిన‌ట్టుగా యాక్ష‌న్ చేసి అంద‌రిని హ‌డ‌లెత్తించిన ర‌ష్మీ.. ఏమైంది అని అంతా అడిగితే స్టంటు అంటూ న‌వ్వేసింది. ఇక ఆ త‌రువాత 'నువ్వు ఎవ‌రిని ల‌వ్ చేస్తున్నావో తెలుసుకోవ‌చ్చా?' అని నూక‌రాజు యంగ్ బ్యూటీ రీతూ చౌద‌రిని అడిగితే `నాకు ఒక‌త‌నంటే ఇష్టం.. అది అత‌నికి కూడా తెలుసు. అత‌ను ఇక్క‌డే వున్నా'డంటూ హైప‌ర్ ఆదిని స్టేజ్ పైకి తీసుకెళ్లి 'ఐ ల‌వ్ యూ' అంటూ షాకిచ్చింది. ఏం జ‌రుగుతోందో తెలుసుకోలేక హైప‌ర్ ఆది షాక్ లో వుండిపోయాడు. 'త‌ను చెప్పింది మ‌రి నీ స‌మాధానం ఏంటీ?' అని పూర్ణ .. హైప‌ర్ ఆదిని అడిగింది. 'నాకు నిజంగా అలాంటి ఉద్దేశ్యం లేదు' అని చెప్ప‌గానే రీతూ స్టేజ్ దిగి సీరియ‌స్ గా వెళ్లిపోయింది.  ఆ వెంట‌నే ఆది ద‌గ్గ‌రికి వ‌చ్చిన ర‌ష్మీ చెంప ఛెళ్లుమ‌నిపించేసింది. 'ఒక‌మ్మాయి మ‌న‌సుని విర‌గ్గొట్టావు నువ్వు మ‌నిషివా ప‌శువువా?' అని ర‌ష్మీ .. ఆది పై ఫైర్ అయింది. `ఇదే మాట‌ బాబు (సుధీర్‌)ని అడుగుతావా?' అని హైప‌ర్ ఆది అన‌డంతో న‌వ్వులు విరిశాయి. ర‌ష్మీ, ఆదిని కొట్ట‌డం అనేది ఓ డ్రామా అని తేలిపోవ‌డంతో అక్క‌డున్న‌వారంతా న‌వ్వుల్లో మునిగిపోయారు.

సుమ.. వచ్చి కాళ్ళు పట్టు!

'దొరికినంత దోచుకో'అనే టాగ్ లైన్ తో ప్రసారమవుతున్న'క్యాష్' ప్రోగ్రాం ఏ వారానికి ఆ వారం మంచి ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యాంకర్ సుమక్క కాబట్టి. అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఈ ప్రోగ్రాంని వేరే లెవెల్ కి తీసుకెళ్తోంది. ఐతే ఇంత సందడిగా సాగే ఈ సీరియల్ లో సుమ ఒక విషయంలో చాలా హర్ట్ అయ్యింది. ఈ ప్రోగ్రాంకి జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ళ ఫామిలీస్ వచ్చాయి. భార్యలు భర్తల కాళ్ళు పట్టి అందరికంటే సూపర్ వుమన్ అనిపించుకోవాలనే కాన్సెప్ట్ తో చాలా కామెడీగా సాగుతున్న ఈ ప్రోగ్రాంలో సుమకు కోపం వచ్చింది. ఎందుకు అంటే జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ ఒక్కసారిగా "సుమ.. వచ్చి కాళ్ళు పట్టు" అంటాడు. అంతే సుమ ఒక్కసారిగా అతని మీద  ఫైర్ అయ్యింది. "ఈ సెట్ లో నన్నింత ధైర్యంగా ఎవ్వడు పిలవలేదు" అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. "అయ్యో మిమ్మల్ని కాదండి" అంటూ శాంతికుమార్ సారీ చెప్తాడు. అసలు ట్విస్ట్ ఏమిటంటే జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ భార్య పేరు కూడా సుమనే. స్కిట్ లో భాగంగా సుమ అని పిలిచేసరికి సుమక్క ఇన్వాల్వ్ అయ్యి కాస్త ఫన్ క్రియేట్ చేసింది. ఈ స్కిట్ వచ్చే వారం అంటే జూన్ 11న ప్రసారం కాబోయే కాష్ ప్రోగ్రాంలో రానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ వారం క్యాష్ లో ఆనంద్ - మంజుల, కొమరం - రజిత, శాంతికుమార్ - సుమ, నాగమాంబ - సత్తిపండు జంటలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. వీళ్లంతా జబర్దస్త్ కమెడియన్స్. ఈ వారం క్యాష్ షోలో ఫన్ అండ్ మస్తీ చేయడానికి వీళ్లంతా రాబోతున్నారు.

అక్సా ఖాన్ ఎంత ప‌నిచేసింది.. 'ఢీ' ప‌రిస్థితేంటి?

'ఢీ' షో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు అక్సా ఖాన్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నడుము తిప్పిందంటే చాలు.. ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. అందాల అక్సా ఖాన్ కి చాలా మంది కూడా ఫాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు కామెడీటీ షోస్ లో కూడా మెరుస్తుంది అక్సా ఖాన్. జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో అప్పుడప్పుడు కనిపించేది కూడా. అలా బుల్లితెర పై చాలా తొందరగానే ఒక క్రేజ్ సంపాదించుకుంది. ఇక తనకు సంబందించిన విషయాలు,   మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియోస్ అప్ డేట్స్ అన్నిటినీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అక్సా ఖాన్ ముంబైలో 1996 లో పుట్టింది. ముంబైలోని క్వీన్ మేరీ స్కూల్ లో చదువుకుంది. హెచ్ఆర్ కాలేజీ అఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీ లో హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసింది. ఐతే ఆమెకు బాగా ఇష్టమైన డాన్సర్ ప్రభుదేవా. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అక్సా. ఇప్ప‌టికే 'ద‌ర్జా' అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అది త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. అలాగే 'సన్ ఆఫ్ ఇండియా' డైరెక్టర్ డైమండ్ రత్నబాబుతో ఓ సినిమా చేస్తోంది.  ఈ చిత్రంలో బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా, అక్సా హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి 'అన్‌స్టాప‌బుల్' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇక అక్సా ఖాన్, వీజే సన్నీ పెయిర్ కలిసి ఇంతకుముందు జీ తెలుగులో వచ్చిన డాన్స్ జోడి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మూవీలో కలిసి న‌టిస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన కామెడీ మూవీస్ కంటే కూడా ఈ మూవీలో అద్దిరిపోయే రేంజ్ లో కామెడీ ఉంటుందని చెప్తోంది అక్సా. మరి ఇంకా ఈ మూవీ అప్ డేట్స్ కోసం కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అక్సా సినిమాల్లోకి వెళ్లిపోవ‌డంతో 'ఢీ'లో ఆమె లేని లోటు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

సుధీర్‌ని త‌ప్పించారా? త‌నే త‌ప్పుకున్నాడా?

జబర్దస్త్ కి క్రేజ్ ని, ఇమేజ్ ని తీసుకొచ్చాడు సుడిగాలి సుధీర్. మల్లెమాలకు దొరికిన పెద్ద అసెట్ గా సుధీర్ టీమ్ ని చెప్పుకుంటారు. ఎవరి అండదండ లేకుండా కష్టపడుతూ ఎదిగిన సుధీర్ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్స్ చేసేవాడు. ఇక తన మార్క్ టైమింగ్ కామెడీతో ఎవరు ఎలాంటి పంచ్ జోక్స్ వేసిన ఓవర్ రియాక్ట్ కాకుండా సంయమనం పాటిస్తూ అన్ని విషయాలను లైట్ తీసుకుంటూ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ కి టాప్ యాంకర్, బెస్ట్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకుని అటు వైపు కూడా వెళ్లి నటించి వచ్చాడు. ఐతే ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి హోస్ట్ గా చేస్తూ టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరిని ఈ స్టేజి ద్వారా పరిచయం చేసి వాళ్ళ హృదయాల్లోనూ స్థానం సంపాదించాడు. ఇక ఈ మధ్యలో రష్మీతో జోడీగా సుధీర్ చేసిన స్కిట్స్ టాప్ రేటింగ్స్ లో దూసుకుపోయేవి. వీళ్ళ పెయిర్ ఎవర్ గ్రీన్ అంటూ పొగిడిన వాళ్ళే చాలామంది ఉన్నారు.  వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ ని ఎన్నో షోస్ క్యాష్ చేసుకున్నాయి కూడా. ఐతే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టార్ట్ అయ్యాక 'జబర్దస్త్' నుంచి తప్పుకున్నాడు సుధీర్. ఆ తర్వాత కొద్ది రోజులకు 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి కూడా బయటికి వచ్చేసాడు. 'ఢీ' కొత్త సీజన్ నుంచి కూడా అతడిని పక్కకు తప్పించారు. అనిల్ రావిపూడి విచ్చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సుధీర్, గెటప్ శీను కనిపించకుండా పోయేసరికి ప్రేక్షకుల్లో చాలా అనుమానాలు వచ్చాయి. ఐతే ఈ వారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా సుధీర్ కనిపించలేదు. సుధీర్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ రష్మీ హోస్ట్ చేసింది. అలాగే జడ్జిగా ఇంద్రజ కూడా కనిపించలేదు. ఆమె ప్లేస్ లో పూర్ణ వచ్చి కూర్చుంది. ఐతే ఇప్పుడు సుడిగాలి సుధీర్ అనసూయతో కలిసి సూపర్ సింగర్ జూనియర్ షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. దీని కోసమే ఆ షోస్ నుంచి వచ్చేసాడా..? రష్మీ ప్లాన్ ప్రకారమే అవకాశాలు తగ్గుతున్నాయని ఇలా చేసిందా..? జనాల్లో జబర్దస్త్ షో పేరు కన్నా సుధీర్ పేరే పాపులర్ అవుతోందని మల్లెమాల వాళ్ళే సుధీర్ ని తప్పించారా.. పొమ్మన లేక పొగబెట్టారా? వీటికి సమాధానం సుధీర్ చెప్పాల్సి ఉంది. ఐతే మరో వైపు సుధీర్ ఫాన్స్ మాత్రం ఆయన షోస్ నుంచి వెళ్లిపోతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఐనా సరే ఆయన అభిమానులు ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు. కొంత మంది మాత్రం టాలెంట్ వున్న వాళ్లకు ఆఫర్స్ మస్త్ వస్తూనే ఉంటాయి అంటుంటే ఇంకొంతమంది నెటిజన్స్ మాత్రం స్మాల్ స్క్రీన్ ఐనా బిగ్ స్క్రీన్ ఐనా ఎవరి ప్లేస్ ఎక్కడా శాశ్వతం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుధీర్ ఈ సూపర్ సింగర్ జూనియర్ షోలో ఐనా ఎక్కువ కాలం కొనసాగుతాడా..? లేదా అనేది వేచి చూడాలి.

జూన్ 13 నుంచి న్యూ సీరియల్ 'కోడళ్ళు మీకు జోహార్లు'

జీ తెలుగులో ప్రసారం కాబోయే కొత్త సీరియల్ "కోడళ్ళు మీకు జోహార్లు " టైమింగ్, లాంచింగ్ డేట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు రాబోతోంది. దీపావళి కొందరిని విడదీసింది.. కొందరిని కలిపింది. ఐతే అందర్నీ విడదీసిన దీపావళి 14 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతుందా.. సంతోషాన్ని పంచుతుందా చూడాల్సిందే అనే సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. హీరోగా నాగార్జున యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు 'కస్తూరి' సీరియల్ లో పరం అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సీరియల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్స్ గా దుర్గశ్రీ, కౌస్తుభ మణి  నటిస్తున్నారు. దుర్గశ్రీ ఇది వరకు ఉదయ టీవీలో ప్రసారమైన 'నేత్రావతి' అనే సీరియల్ లో నటించారు. ఇక కౌస్తుభ మణి కలర్స్ కన్నడలో 'నన్నరాసి రాధే' అనే సీరియల్ లో ఇంచరా అనే పాత్రలో యాక్ట్ చేశారు.  ఈ సీరియల్ లో ఇంకా చరణ్ రాజ్ ఒక పాత్రలో కనిపించనున్నాడు. అతను 'వదినమ్మ' సీరియల్ లో భరత్ అనే పాత్రలో  యాక్ట్ చేశారు. 'నిన్నే పెళ్ళాడతా', 'స్వర్ణ పేలెస్' అనే సీరియల్స్ లో నటించిన జయరాం పవిత్ర ఈ సీరియల్ లో అత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సీరియల్ లో మెయిన్ గా ఆనాటి అందాల నటి రాగిణి తల్లి కేరెక్టర్ లో కనిపించనున్నారు. ఈమె గురుంచి చెప్పాలంటే ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక  ప్రేమ్ సాగర్ ఒక రోల్ లో నాగార్జునకు తల్లి పాత్రలో జానకి వర్మనటిస్తున్నారు.

రష్మీ తెలుగుకి ఆడియన్స్ కి మైండ్ పోయింది

శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మనెంట్ యాంకర్ లు లేరని చెప్పకనే చెప్పాడు ఆది. ముందు ఒకతను వచ్చాడు వెళ్ళిపోయాడు, తర్వాత సుధీర్ వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్. నువ్వన్నా పర్మనెంట్ గా ఉంటావో లేదోనని తెలీక ఈ ప్రమాణ స్వీకారం అంటూ శ్రీదేవి షో గురుంచి సీక్రెట్ చెప్పాడు.   వెంటనే కొంతమంది మధ్యలో రష్మీ ప్రమాణ స్వీటుకారం చేసింది. ఈ షోని మందుకు తీసుకెళతాను. అంటూ మొదలుపెట్టేసరికి ఆది బూందీ, లడ్డు లేదా..ఏ బార్ కి తీసుకెళ్తావ్ అంటూ పంచ్ వేసేసరికి రష్మీ ముఖం మాడిపోతుంది. "రష్మీ అనే నేను శాషణం ద్వారా నిర్మతమైన భూదేవి డ్రామా కంపెనీ పట్ల  న్యాయబద్దకంగా ఉంటానని., విశ్వక్ సేన్ ని చూపిస్తానని, కామెడీకి పెద్ద పైట వేస్తానని, భయం కానీ, పక్షవాతం కానీ లేకుండా చూసుకుంటానని మాటిస్తున్నా " అంటూ చెప్తుంది. అంటే నువ్వు కూడా భూదేవి డ్రామా కంపెనీ అనే షోకి వెళ్ళిపోతున్నావా అంటూ ఆది పంచ్ వేస్తాడు. నువ్వెప్పుడూ బద్దకంగా ఉంటావ్ గాని అది న్యాయబద్దంగా అని సరిచేస్తాడు. విశ్వక్ సేన్ కి కాదు తల్లి చూపించేది విశ్వసనీయతను అంటూ చెప్పేసరికి రష్మీ నవ్వేస్తుంది. కామెడీకి పైట వేస్తావా లంగా ఓణీ వేసి సమత్త బంతి చేయవా అంటూ ఫన్ క్రియేట్ చేసాడు. కానీ ఆది ఇలా అనకుండా ఉండాల్సింది కదా అంటున్నారు లేడీ ఆడియన్స్. డైలాగ్స్ కొంచెం చూసుకుని రాసుకోవాలి కదా అన్ని మాటలు ఫన్ క్రియేట్ చేయలేవు అని అంటున్నారు. అమ్మా రష్మీ పక్షవాతం, పెరాలిసిస్ ఏమిటమ్మా ఇవన్నీ అంటూ రాంప్రసాద్ పక్షపాతం అని చెప్పిస్తాడు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రష్మీ స్కిట్ వైరల్ అవుతోంది. కానీ ఇక్కడో విషయం గమనిస్తే ఎవరు కౌంటర్ వేసినా వెంటనే రీకౌంటర్ ఇచ్చే రష్మీ మాత్రం ఈ వారం ఎపిసోడ్ లో ఆది కానీ, ఆటో రామ్ ప్రసాద్ ఏం అన్నా నవ్వుతూ ఊరుకుంది తప్ప ఒక్క రివర్స్ పంచ్ అనేది వేయలేదు. ఐతే రష్మీ సుధీర్ అడుగుజాడల్లో నడుస్తుందేమో..ఎంతైనా బెస్ట్ పెయిర్ ఆన్ స్మాల్ స్క్రీన్ కదా, బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు సుధీర్ అంటున్నారు ఆడియన్స్. సుధీర్ చెప్పినట్టే రష్మీ సైలెంట్ గా ఉంటూ జనాల్లో క్రేజ్ తెచ్చుకోవడానికి తంటాలు పడుతుందేమో అనిపిస్తోంది. ఏదైమైనా నెక్స్ట్ వీక్ షో వరకు అన్నా రష్మీ ఉంటుందా..ఇంకో కొత్త యాంకర్ వస్తుందా ? అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి.  

`స్టార్ మా`లో నేటి నుంచే `వంట‌ల‌క్క‌` షురూ

ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ జంట‌గా న‌టించిన పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని ఈ ఇద్ద‌రినీ టాప్ సెల‌బ్రిటీలుగా మార్చేసింది. మ‌రీ ముఖ్యంగా ఇందులో వంట‌ల‌క్క పాత్ర‌లో దీప‌గా న‌టించిన‌ ప్రేమి విశ్వ‌నాథ్ ని స్టార్ గా మార్చి పాపుల‌ర్ అయ్యేలా చేసింది. ఇందులో ప్రేమి విశ్వ‌నాథ్ పోషించిన వంట‌ల‌క్క‌ పాత్ర సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ని సైతం ఆక‌ట్టుకుని అభిమానులుగా మారేలా చేసింది. అలా పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క పేరుతో కొత్తగా స్టార్ మాలో ఓ సీరియ‌ల్ ప్రారంభం అవుతోంది. ధీర‌వీయ‌మ్ రాజ‌కుమార‌న్‌, శిరీన్ శ్రీ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `వంట‌ల‌క్క‌`. ఇత‌ర పాత్ర‌ల్లో నీళ‌ల్ గళ్ ర‌వి, మౌనిక తదిత‌రులు న‌టించారు. ఈ సీరియ‌ల్ జూన్ 6 నుంచి మధ్యాహ్నం 2.30 ని.లకు ప్ర‌సారం కానుంది. బంగారు బొమ్మ‌లా చూసుకునే పెద్దింటి కుటుంబంలో పుట్టిన ఓ యువ‌తికి.. అత్యాశ‌కు పోయి ఎలాంటి భ‌యం లేకుండా ఊరు నిండా అప్పులు చేసే ఓ బాధ్య‌త‌లేని యువ‌కుడు ఆస్తి కోసం వ‌ల వేస్తాడు. చివ‌రికి పెళ్లి చేసుకుంటాడు. త‌న భ‌ర్త కోసం పుట్టింటి వారి నుంచి చిల్లి గ‌వ్వ కూడా త‌న‌కు వ‌ద్ద‌ని భ‌ర్త‌తో క‌లిసి ఆ యువ‌తి ఇంటిని, త‌న కుటుంబాన్ని కాద‌ని బ‌య‌టికి వ‌చ్చేస్తుంది.   వ‌స్తుంద‌నుకున్న ఆస్తి రాక‌పోగా భార్య చీప్ గా వంట‌లు చేస్తూ సంసారాన్ని సాగిస్తుండ‌టంతో త‌న‌ని చీద‌రించుకుంటూ హింసిస్తుంటాడు. ఈ క్ర‌మంలో వంట‌ల‌క్క జీవితం ఎలాంటి మ‌లువులు తిరిగింది? .. ఆత్మ‌గౌర‌వం వున్న యువ‌తి త‌న పుట్టింటి వారిని స‌హాయం అడిగిందా?  లేక త‌న భ‌ర్త‌ని మార్చుకుని విధి ఆడిన వింత నాట‌కంలో విజ‌యం సాధించిందా? అన్న‌దే ఈ సీరియ‌ల్ ప్ర‌ధాన క‌థ. జూన్ 6 సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న‌ఈ సీరియ‌ల్  సోమ వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తీ రోజు మధ్యాహ్నం 2.30 ని.లకు ప్ర‌సారం కాబోతోంది.

గాయ‌త్రీ దేవి హ‌త్యకు కీల‌కంగా మారిన తిలోత్త‌మ గాజు

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే ప‌సిగ‌ట్టే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. మ‌ర్డ‌ర్‌మిస్టరీ, ఆత్మ‌లు మ‌ళ్లీ రావ‌డం, త‌మ‌ని హ‌త్య చేసిన వారు ఎవ‌రో న‌య‌నికి హింట్ ఇవ్వ‌డం వంటి ఆస‌క్తిక‌ర అంశాల నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో, ట్విస్ట్ ల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ సాగుతోంది. క‌న్న‌డ న‌టీన‌టులు అషికా గోపాల్, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర‌, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య‌, నిహారిక న‌టించారు.   విశాల్ త‌ల్లి గాయ‌త్రిదేవి హ‌త్య‌కు గురైన ల‌క్ష్మీదేవి పురం లోనే ఆబ్దికాన్ని జ‌రిపించాల‌ని, అక్క‌డే తిలోత్త‌మ త‌న‌కు తెలియ‌కుండానే వ‌దిలిని బంగారు గాజుని సాక్ష్యంగా చూపించి త‌న‌కు ఉచ్చు బిగించాల‌ని న‌య‌ని ప్లాన్ చేస్తుంది. నువ్వు ఎక్క‌డైతే గాయ‌త్రీ దేవిని హ‌త్య చేయించావో అక్క‌డే సాక్ష్యాన్ని వ‌దిలావ‌ని, అదేంటో అక్క‌డికి వస్తే నిరూపిస్తాన‌ని తిలోత్త‌మ‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది న‌య‌ని. దీంతో ఎలాగైనా విశాల్ , న‌య‌నిల‌ని గాయ‌త్రిదేవి ఆబ్దికం రోజే చంపేయాల‌ని తిలోత్త‌మ క‌సితో క‌లిసి ప్లాన్ చేస్తుంది. కొబ్బ‌రి కాయ‌లో బాంబ్ ని పెట్టి అదే కొబ్బ‌రి కాయ విశాల్ కొట్టేలా ప్లాన్ చేస్తుంది క‌సి. కానీ ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాదు. అదే స‌మ‌యంలో న‌య‌ని అనుకున్న‌ట్టుగానే గాయ‌త్రిదేవి హ‌త్య‌కు గురైన చోటే తిలోత్త‌మ వ‌దిలిన బంగారు గాజుతో పాటు ఓ లెట‌ర్ ల‌భిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని త‌న త‌ల్లి హ‌త్య వెన‌క ఎవ‌రి కుట్ర వుందో ఛేదించ‌డం మొద‌లు పెడ‌తాడు విశాల్‌. అప్ప‌ట్లో అమ్మ‌కి బాగా ద‌గ్గ‌రైన వాళ్లు, న‌మ్మ‌క ద్రోహం చేసిన వాళ్లు ఎవ‌రైనా వుంటారా అని ఆలోచిస్తున్నాన‌ని విశాల్ అంటాడు.. దీనికి ఆ ప‌ని చేయండి.. వాళ్లు ఎవ‌రైనా స‌రే విడిచిపెట్ట‌కండి  అంటుంది న‌య‌ని.. వ‌ద‌లిపెట్టే ప్ర‌స‌క్తే లేదు న‌య‌ని.. ఆ పేప‌ర్లో భూష‌న్ రిసార్ట్ ప‌ని మీద ల‌క్ష్మీదేవి పురానికి గాయ‌త్రీదేవి వ‌స్తోంద‌ని రాసిన వాళ్లెవ‌రో? ఆ భూష‌న్ ఎవ‌రో క‌నుక్కో గ‌లిగితే.. మా అమ్మ‌ను నాకు శాశ్వ‌తంగా దూరం చేసిన ఆ రాక్ష‌సులు ఎవ‌రో తెలుస్తుంది. వాళ్ల జీవితం అక్క‌డితోనే ముగుస్తుంది` అంటాడు విశాల్. ఇదే స‌మ‌యంలో విశాల్ కు లెట‌ర్ తో పాటు  దొరికిన గాజుని ప‌ట్టుకున్న న‌య‌ని ` ఈ గాజు అయితే మిమ్మ‌ల్ని పెంచిన అమ్మ తిలోత్త‌మ‌గారిది.. మ‌రి ఇది ఆ క‌వ‌ర్ లో ఎందుకుందో ఏంటో నాకైతే తెలియ‌దు` అని న‌య‌ని అన‌డంతో విశాల్ లో అనుమానాలు మొద‌ల‌వుతాయి. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. తిలోత్త‌మ చిక్కిన‌ట్టేనా? అనే విష‌యాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

చంద్ర‌మ్మ‌, ఇంద్రుడిపై శోభ దొంగ‌త‌నం కేసు

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది.  జ్వాల‌ని, త‌న పిన్ని, బాబాయ్ చంద్ర‌మ్మ‌, ఇంద్రుడిల‌ని అవ‌మానించి త‌గిన బుద్ధి చెప్పాల‌ని శోభ ప్లాన్ చేస్తుంది. అనుకున్న‌ట్టుగానే పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఇక సోమ‌వారం ఏం జ‌రిగింది?.. శోభ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా?  లేదా అన్న‌ది ఒక‌సారి చూద్దాం. సీరియ‌ల్ ప్రారంభంలో పార్టీకి వ‌చ్చిన వారిని శోభ ఆహ్వానిస్తూ వుంటుంది. ఈ క్ర‌మంలో అక్క‌డికి నిరుప‌మ్‌, హిమ వ‌స్తారు. వీళ్ల‌తో జ్వాల క‌నిపించ‌క‌పోవడంతో త‌ను ఎక్క‌డా అంటూ శోభ హ‌డావిడీ చేస్తూ వుంటుంది. శోభ ఏంటీ ప‌దే ప‌దే జ్వాల గురించి అడుగుతోంది.. ఏదైనా కుట్ర చేయ‌బోతోందా? అని హిమ ఆలోచించ‌డం మొద‌లు పెడుతుంది. క‌ట్ చేస్తే.. శోభ‌.. నిరుప‌మ్ మ‌ద‌ర్ స్వ‌ప్న గురించి తెగ పొగిడేస్తూ వుంటుంది. ఇదే పార్టీలో శోభ అనుకున్న‌ట్టుగానే జ్వాల పిన్ని, బాబాయ్ చంద్ర‌మ్మ‌, ఇంద్రుడుల‌ని ర‌ప్పించి వారితో పార్టీలో కూల్ డ్రింక్స్ స‌ర్వ్ చేయిస్తూ వుంటుంది. జ్వాల కూడా ఎంట్రీ ఇస్తుంది. త‌న‌ని చూసిన స్వ‌ప్న దాన్ని ఎందుకు పిలిచావ్ అంటూ శోభ‌పై చిరాకు ప‌డుతుంది. నేనేంటో చూపిస్తాన‌ని శోభ చెబుతుంది. ఇదే స‌మ‌యంలో పార్టీ జ‌రుగుతుండ‌గా ఒక్క‌సారిగా క‌రెంట్ వ‌చ్చి పోతూ వుంటుంది. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న శోభ ముందు చేసుకున్న ప్లాన్ ప్ర‌కారం త‌న నెక్లెస్ పోయింద‌ని పెద్ద‌గా అరుస్తుంది. వెంట‌నే నిరుప‌మ్ పోలీసుల‌కు ఫోన్ చేస్తాడు. ఆ ప్ర‌దేశానికి వ‌చ్చిన పోలీసులు ఇంద్రుడి జేబులో నెక్లెస్ ని గుర్తిస్తారు. ఊహించ‌ని ప‌రిణామానికి ఇంద్రుడు ఒక్క‌సారిగా షాక్ అవుతాడు. వెంట‌నే స్వ‌ప్న వీళ్లంతా దొంగ‌ల బ్యాచ్ అని, గ‌తంలో కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించారని చెబుతుంది. దీంతో నిరుప‌మ్ ఆస‌హ్యంగా చూస్తాడు. విష‌యం గ్ర‌హించిన హిమ సీసీ టీవీ ద్వారా త‌ప్పు ఎవ‌రు చేశారో క‌నిపెడుతుంది. ఆ వ్య‌క్తిని లాగిపెట్టి కొడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  శోభ ఎలా రియాక్ట్ అయింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ఒంటిపై పెట్రోల్ పోసుకుని రాగ‌సుధ కొత్త ప్లాన్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌రాఠీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `తులా ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. శ్రీ‌రామ్ వెంక‌ట్, వర్ష హెచ్ కె ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, జ్యోతి రెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మెహ‌న్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, సందీప్‌, అనుషా సంతోష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అనుని పాపుగా వాడుకుని మాస్ట‌ర్ గేమ్ ఆడిన రాగ‌సుధ త‌న‌చేతే ఆర్య వ‌ర్థ‌న్ పై పోలీస్టేష‌న్ లో కేసు పెట్టిస్తుంది. విష‌యం తెలియ‌ని అను .. రాగ‌సుధ ఇచ్చిన పెన్‌ డ్రైవ్ లో ఏముందో చూడ‌కుండానే త‌ను చెప్పిన‌ట్టే కేసు పెడుతుంది. దీంతో అను కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆర్య‌వ‌ర్ధ‌న్ ని అరెస్ట్ చేయ‌డానికి అత‌ని ఆఫీస్ కి వెళ‌తారు. త‌న‌ని అరెస్ట్ చేస్తుండ‌గా ఆఫీస్ కు చేరుకున్న అను అస‌లు విష‌యం తెలిసి షాక్ అవుతుంది. త‌ను ఆర్య స‌ర్ పై కేసు పెట్ట‌లేద‌ని, ఆయ‌న‌ని అరెస్ట్ చేయ‌డానికి వీళ్లేదంటుంది. తెలివిగా రాగ‌సుధ.. అనుని అడ్డంపెట్టుకుని త‌నని ఇరికించిందని గ్ర‌హించిన ఆర్య‌వ‌ర్ధ‌న్.. దెబ్బ‌కు దెబ్బ తీయాల్సిందే అంటూ అనుని తీసుకుని పోలీస్టేష‌న్ కు బ‌య‌లుదేర‌తాడు. స్టేష‌న్ లో డీసీపీని క‌లిసిన ఆర్య‌వ‌ర్ధ‌న్ .. త‌న భార్య రాజ‌నందినిని హ‌త్య జ‌ర‌గ‌డం నిజం అని అయితే ఆ హ‌త్య చేసింది ఆమె చెల్లెలు రాగ‌సుధ అని ఆధారాలు అంద‌జేస్తాడు. దీంతో కేసు ఫైల్ చేసిన పోలీసులు రాగ‌సుధ కోసం వెత‌క‌డం మొద‌లు పెడ‌తారు. అనూహ్యంగా పోలీసుల వాహ‌నాల‌కే అడ్డుగా నిల‌బ‌డిన రాగ‌సుధ కొత్త ఎత్తుగ‌డ‌తో త‌న ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానంటూ వీరంగం వేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఆర్య వ‌ర్థ‌న్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయిందా?  లేక రాగ‌సుధ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా? అన్నది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

సుధీర్ జంప్‌.. ర‌ష్మీకి న్యాయం కావాల‌ట‌!

`ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` యాంక‌ర్ ర‌ష్మీ రోడ్డెక్కింది. త‌న‌కు న్యాయం కావాలంటూ టెంట్ వేసుకుని మ‌రీ ధ‌ర్నాకి దిగడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల `జ‌బర్ద‌స్త్`,`ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` కామెడీ షోల‌కు సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న‌కు న్యాయం కావాలంటూ ర‌ష్మీ రోడ్డెక్క‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` షోల‌లో గ‌త కొన్నేళ్లుగా సుడిగాలి సుధీర్ త‌న టీమ్ తో క‌లిసి న‌వ్వులు పూయించాడు. ఇదే స‌మ‌యంలో యాంక‌ర్ ర‌ష్మీతో సుధీర్ చేసే అల్ల‌రి, హంగామా ఈ షోకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి టాప్ రేటింగ్ ని అందించింది. సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ ల ల‌వ్ ట్రాక్‌, ఇద్ద‌రి మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ షోకి ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి షోని మ‌రింత పాపుల‌ర్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో వున్నార‌ని, డేటింగ్ న‌డుస్తోంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారానికి మ‌రింత ఆజ్యం పోస్తూ `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` వేదిక‌పై రోజా ప‌లు ద‌ఫాలుగా వీరికి ఉత్తుత్తి పెళ్లి చేసి త‌న ముచ్చ‌ట తీర్చుకోవ‌డంతో నిజంగానే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం మ‌రింత‌గా  ఎక్కువైంది. ఇటీవ‌ల ఓ షోలో సుధీర్ కు ఏ దిష్టీ త‌గ‌ల‌కూడ‌దంటూ ర‌ష్మీ దిష్టి తీయ‌డం వీరి మ‌ధ్య వున్న అనుబంధాన్ని మ‌రింత బ‌య‌ట‌పెట్టింది. అలా ర‌ష్మీతో బాగా క‌నెక్ట్ అయిపోయిన సుడిగాలి సుధీర్ ఇటీవ‌ల `జ‌బ‌ర్ద‌స్త్‌` `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` కి గుడ్ బై చెప్పేశాడు. సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం, అంతే కాకుండా `స్టార్ మా` లో `సూప‌ర్ సింగ‌ర్‌ జూనియ‌ర్‌` లో అన‌సూయ‌తో క‌లిసి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించే కాంట్రాక్ట్ ద‌క్క‌డంతో సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్ కి గుడ్ బై చెప్పేశాడు. అంతే కాకుండా గ‌త మూడు నాలుగు వారాలుగా `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` లోనూ క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మీ గౌత‌మ్ త‌న‌కు న్యాయం కావాలంటూ కొంత మందిని వెంటేసుకుని టెంటేసుకుని ధ‌ర్నాకు దిగ‌డం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 10న ఈటీవిలో ప్ర‌సారం కానున్న `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌` లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో ఆటో రాంప్ర‌సాద్ పై రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్‌, నూక‌రాజు లు ప్ర‌త్యేకంగా చేసిన స్కిట్ ఎమోష‌న‌ల్ గా సాగింది. గెట‌ప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వెళ్లిపోవ‌డంతో ఒంట‌రిగా మిగిలిపోయిన ఆటో రాంప్ర‌సాద్ అంత‌రంగాన్ని, అత‌ను ప‌డుతున్న బాధ‌ని వ‌ర్ణిస్తూ రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్‌, నూక‌రాజు లు చేసిన స్కిట్‌ అక్క‌డున్న వారిని భావోద్వేగానికి గుర‌య్యేలా చేసింది. ఇదే షోలో ర‌ష్మీ గౌత‌మ్ నాకు న్యాయం కావాలంటూ రోడ్డెక్క‌డం,  టెంట్ వేసుకుని కొంత‌ మందిని వెంటేసుకుని ధ‌ర్నాకు దిగ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇంత‌కీ ర‌ష్మీ గౌత‌మ్ ధ‌ర్నా ఎందుకు చేసింది?  ఎవ‌రి కోసం చేసింది? ఏమా క‌థ? అన్న‌ది తెలియాలంటే జూన్ 10న ప్ర‌సారం కానున్న ఈ షో చూడాల్సిందే.

జానకి కలగనలేదు vs మనసిచ్చిచూడు

ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు `స్టార్ మా`లోని పాపుల‌ర్ టెలివిజ‌న్ న‌టీన‌టుల‌తో యాంక‌ర్ ఝాన్సీ నిర్వ‌హిస్తున్న షో `స్టార్ మా ప‌రివార్ లీగ్‌`. గ‌త కొన్ని వారాలుగా రెండు పాపుల‌ర్‌ సీరియ‌ల్స్ కు సంబంధించిన న‌టీన‌టుల‌ని రెండు టీమ్ లుగా ఏర్పాటు చేసి వారి మధ్య‌ పోటీని నిర్వ‌హిస్తూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. గ‌త ఆదివారం 'దేవ‌త‌', 'రాఖీ పూర్ణిమ' సీరియ‌ల్ కు చెందిన న‌టీన‌టులు పోటీప‌డ్డారు. సెమీ ఫైన‌ల్ లో భాగంగా జ‌రిగిన ఈ పోటీలో 'దేవత' టీమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఇక ఈ ఆదివారం అంటే జూన్ 5న మ‌రో రెండు సీరియ‌ల్స్ టీమ్స్ పోటీప‌డ‌బోతున్నాయి. జూన్ 5న 'జానకి కలగనలేదు', 'మనసిచ్చిచూడు' టీమ్ లు పోటీప‌డుతున్నాయి. 'జానకి కలగనలేదు' టీమ్ నుంచి అమ‌ర్ దీప్ చౌద‌రి, అనిల్ అల్లం, విష్ణు ప్రియ‌, మ‌రోన‌టి పాల్గొన్నారు. ఇక `మనసిచ్చిచూడు` సీరియ‌ల్ నుంచి మ‌హేష్ (ఆది), కీర్తి భ‌ట్‌, త్రిష దంతాల‌, హ‌రితేష్ పోటీకి దిగారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. `ఈ టీమ్స్ ఎలాంటోళ్లంటే ఆడితే అద‌రిపోవాలి.. ఆడాక గుర్తుండిపోవాలి` అంటూ  ఝాన్సీ వాయిస్ తో ప్రోమో మొద‌లైంది. 'ఆది, రామా క‌లిసి గేమ్ ఆడితే ఎట్లుంట‌ది ఎస్ ఎమ్ పీఎల్ (స్టార్ మా ప‌రివార్ లీగ్‌) స్టేజ్ ద‌ద్ద‌ద్ద‌రిల్లిపోవాలి' అన్నాడు మ‌హేష్ (ఆది). ఇదిలా వుంటే ఈ రేసులో 'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' టీమ్ కు చెందిన అనిల్ అల్లం, 'మ‌న‌సిచ్చిచూడు' టీమ్ కు చెందిన త్రిష తెగ కామెడీ చేశారు. వీళ్ల‌పై పేలిన వాయిస్ పంచ్ లు న‌వ్వులు పూయిస్తున్నాయి. ఇక `మనసిచ్చిచూడు` నుంచి పాట‌పాడేందుకు వ‌చ్చిన హ‌రితేష్ 'రాములో రాములా' పాట‌ని ఖూనీ చేసేసి న‌వ్వులు పూయించాడు. ఆ త‌రువాత 'మనసిచ్చిచూడు' నుంచి `కాంచ‌న‌` సాంగ్ తో మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడు. ఇక 'జానకి కలగనలేదు' టీమ్ `కేజీఎఫ్ 2` ని పెర్ఫార్మ్ చేశారు. ఫైన‌ల్ గా 'మనసిచ్చిచూడు' టీమ్ నుంచి త్రిష, అమ‌ర్ దీప్ చౌద‌రి చేసిన `అమ్మా అమ్మా.. నీ వెన్నెలా.. ` అంటూ సాగే పాట‌కు అదిరిపోయే పెర్ఫార్మ్ చేసి క‌న్నీళ్లు తెప్పించి మార్కులు కొట్టేశారు. పోటా పోటీగా సాగిన వీరి పెర్ఫార్మెన్స్ ల‌తో ఏ టీమ్ పై చేయి సాధించిందో తెలియాలంటే ఆదివారం జూన్ 5న మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న 'స్టార్ మా ప‌రివార్ లీగ్' చూడాల్సిందే.

సాక్షి కారులో వెళ్లిన రిషీకి యాక్సిడెంట్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ర‌క్ష గౌడ‌, ముఖేష్ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో సాయి కిర‌ణ్‌, జ్యోతి రాయ్‌, మిర్చి మాధ‌వి, ఉష శ్రీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ వారం కీల‌క మ‌లుపులు తిరుగుతున్నఈ సీరియ‌ల్ ఈ శ‌నివారం స‌రికొత్త ట్విస్ట్ ల‌లో సాగ‌బోతోంది. ఇంత‌కీ శ‌నివారం 468వ ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోందో ఒక‌సారి చూద్దాం. వ‌సుధార త‌న పుస్త‌కం గురించి పుష్ప‌ను అడిగితే..రిషీ సార్ నీ బుక్ తీసుకుని అక్క‌డ పెట్టామ‌న్నార‌ని చెబుతుంది. అయ్యే ఎందుకిచ్చావ్ పుష్ప ఆ బుక్ లో.. అంటూ ఆగిపోతుంది వ‌సుధార‌. పుస్త‌కం తీసుకోవ‌డానికి వెళ్ల‌గా అప్పుడే రిషీ వ‌చ్చి పుస్త‌కాన్ని చూస్తాడు. ఆ పుస్త‌కంలో వ‌సు రిషీకి సారీ సార్ అని రాస్తుంది. అది చూసి పొగ‌రా ఏంటీ ఇలా చేస్తోంది ఒక వైపు ప్రేమ నాపై ప్రేమ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో వైపు త‌న‌కు ఇష్టం లేద‌ని చెబుతోంది. ఇప్ప‌డు నేను ఏమ‌ని అర్థం చేసుకోవాలి అనుకుంటాడు రిషీ.. వెంటనే ఆ పేప‌ర్ ని చించేసి త‌న జేబులో వేసుకుంటాడు. ఆ త‌రువాత వ‌సుకు త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన విష‌యాల‌ని గుర్తు చేసుకుంటాడు రిషి. ఇదిలా వుంటే సీన్ లోకి ధ‌ర‌ణి ఎంట్రీ ఇస్తుంది. రిషీకి కాఫీ ఇస్తుంది. అనంత‌రం ఇలా అడ‌గ‌కూడ‌దు అని నాకు తెలుసు కానీ త‌ప్ప‌డం లేదు అంటూనే ఏమైంది రిషీ ఎందుకింత బాధ‌ప‌డుతున్నావ్ అంటుంది. క‌ట్ చేస్తూ.. రిషీని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన సాక్షిని జ‌గ‌తి అడ్డుకుంటుంది. త‌న మూడ్ బాలేదని చెబుతుంది. అయితే రిషీ మూడు నేను వెళితే మారుతుంద‌ని సాక్షి చెబుతుంది. నిన్ను చూస్తేనే రిషీ మండిప‌డుతున్నాడ‌ని చెబుతుంది. ఇంత‌లో దేవ‌యాని ఎంట్రీ ఇచ్చి రిషీకి సాక్షి కాబోయే భార్య అంటుంది. నా కొడుకు గురించి మీరు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏంటీ అంటూ ఆగ్ర‌హిస్తుంది జ‌గ‌తి. ఆ మాట‌ల‌కు దేవ‌యాని, సాక్షి భ‌య‌ప‌డిపోతారు. క‌ట్ చేస్తే... రిషీ, మ‌హేంద్ర‌, జ‌గ‌తి రెస్టారెంట్ లో వుంటారు. అక్క‌డికి సాక్షి రావ‌డంతో న‌న్ను ఇంటి వ‌ద్ద డ్రాప్ చేస్తావా? అని రిషీ అడుగుతాడు. ఇద్ద‌రు కార్ లో ఇంటికి బ‌య‌లు దేర‌తారు... మార్గ మ‌ధ్యంలో యాక్సిడెంట్ కావ‌డంతో రిషీ కి త‌ల‌కు బ‌ల‌మైన గాయం అవుతుంది. త‌ను రోడ్డుపై ప‌డి వుండ‌టాన్ని వ‌సుధార గ‌మ‌నించి షాక్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

య‌ష్‌ ప్రయత్నం మిస్ ఫైర్..వేద‌కు లిప్ లాక్ !

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. హిందీలో సూప‌ర్ హిట్ అయిన సీరియ‌ల్ `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సుమిత్ర‌, వ‌ర‌దరాజులు ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టించారు. కోట్ల ప్రాప‌ర్టీని అగ‌ర్వాల్ కంపనీ వేలానికి పెడుతుంది. ఈ వేలం పాట‌లో చాలా మంది పాల్గొంటారు. అయితే య‌ష్ బ‌ద్ద శ‌త్రువు అభిమ‌న్యు కూడా పోటీకి దిగుతాడు. దీంతో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న య‌ష్ ఈ వేలం పాట‌లో వెన‌క్కి త‌గ్గేదిలేదంటూ త‌న గొంతు బాగాలేక‌పోవ‌డంతో త‌న త‌రుపున వేలం పాట పాడ‌టానికి వేద‌ని తీసుకెళ‌తాడు. అయిష్టంగానే వెళ్లిన వేద.. య‌ష్ చెప్పిన ప్ర‌తీ పాట పాడుతూ వుంటుంది. అయితే చివ‌రికి ప్రాప‌ర్టీ వేలం పాట రూ. 62 కోట్ల వ‌ర‌కు వెళ్ల‌డంతో ఇంత పెట్టి పాడ‌టం క‌రెక్ట్ కాద‌ని గ్ర‌హించిన వేద.. య‌ష్ చెప్పినా విన‌కుండా పాట ఆపేస్తుంది. దీంతో అభిమ‌న్యుకు 62 కోట్ల‌ ప్రాప‌ర్టీ సొంతమ‌వుతుంది. త‌నని అభిమ‌న్యు చేతిలో ఓడించావ‌ని ఆగ్ర‌హించిన య‌ష్ ఇంటికి వ‌చ్చాక ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముందు వేద‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తాడు.. కాఫీ క‌ప్పుని విసిరేస్తాడు. విష‌యం తెలిసిన వేద త‌ల్లిదండ్రులు, య‌ష్ త‌ల్లిదండ్రులు అంతా వేద‌ని నిల‌దీస్తారు. య‌ష్ చెప్పింది చేయాల్సింద‌ని వేద‌పై ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేస్తారు. దీంతో క‌ల‌త చెందిన వేద బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇదిలా వుంటే అప్పుడే వ‌సంత్ కి ఓ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. వెంట‌నే టీవీ ఆన్ చేస్తాడు.. టీవీలో అభిమ‌న్యు ఫోజు కొడుతూ కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నాన‌ని విర్ర‌వీగుతుంటాడు. ఇదే స‌మయంలో అక్క‌డికి వ‌చ్చిన ఓ ఎస్ ఐ మీరు మోస‌పోయారని, మీరు వేలం పాట‌లో సొంతం చేసుకుంది లిటిగేష‌న్ లో వున్న ప్రాప‌ర్టీ అని, దానిపై కోర్టులో కేసు న‌డుస్తోంద‌ని చెబుతాడు. దీంతో అభిమ‌న్యు షాక్ కు గుర‌వుతాడు. ఇదంతా టీవీలో చూస్తున్న య‌ష్ ఫ్యామిలీ, య‌ష్ ఒక్క‌సారిగా షాక్ అవుతారు. వేద లేకుంటే కోట్ల‌ల్లో న‌ష్ట‌పోయేవాళ్ల‌మ‌ని, అన‌వ‌స‌రంగా త‌న‌ని బాధ‌పెట్టావ‌ని య‌ష్ ని అత‌ని త‌ల్లి, తండ్రి మంద‌లిస్తారు. ఇప్ప‌టికైనా వేద గురించి తెలుసుకోమ‌ని, వెంట‌నే త‌న‌కు సారీ చెప్పాల్సిందేన‌ని య‌ష్ త‌ల్లి మాలిని అంటుంది. క‌ట్ చేస్తే.. అంతంగా ముస్తాబై త‌న‌ని తానే పొగుడుకుంటూ వుంటుంది వేద‌. అదే స‌మయంలో బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఇస్తాడు య‌ష్‌. త‌న‌ని తీక్ష‌ణంగా య‌ష్ చూస్తుండ‌టంతో వెంట‌నే వెళ్లి ప‌డుకుంటుంది. అది గ‌మ‌నించిన య‌ష్ త‌న‌కు సారీ చెప్ప‌డానికి ఇదే స‌మ‌యం అని త‌ను కూడా వేద ప‌క్క‌న ప‌డ‌కుంటాడు.  అది గ‌మ‌నించిన వేద ఏదో చేసేలా వున్నాడ‌ని భ‌య‌ప‌డుతూ ఓవ‌రాక్ష‌న్ చేస్తూ వుంటుంది. ఇలా కాదు గానీ సారీ అంటూ సెల్ఫీ వీడియో తీసి త‌న‌కు పంపిస్తే స‌రిపోతుంద‌ని ప్లాన్ చేస్తాడు. త‌న ప‌క్క‌కే వెళ్లి సెల్పీ వీడియో తీస్తుంటే వెంట‌నే వేద.. య‌ష్‌ వైపు తిరుగుతుంది.. అనుకోకుండా య‌ష్ లిప్ కిస్ పెట్టేస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? వేద రియాక్ష‌న్ తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సదాకి లిప్ లాక్ ఇచ్చిన నాటీ నరేష్!

నాటీ నరేష్ 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'లో ప్రతీ స్కిట్ లో తనని తానూ మెరుగుపరుచుకుంటూ కొత్త కొత్త పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని కదలనివ్వకుండా చేస్తున్నాడు. ఇంటికి తాళం వేసినా వేయకపోయినా సెల్ కి తాళం వేయకపోతే కాపురాలు కూలిపోతాయనే కాన్సెప్ట్ తో కొత్త స్కిట్ ట్రై చేసాడు. ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో కార్లు ఎలా మనుషుల్లా మాట్లాడతాయో ఈ స్కిట్ లో కూడా సెల్ ఫోన్, టీవీ అన్ని మాట్లాడతాయన్నమాట. ఇందులో సెల్ ఫోన్ వేషంలో నరేష్ వ‌స్తాడు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ స్కిట్ కి మంచి మార్క్స్ పడ్డాయి. ఎందుకంటే చాలా మంది ఇళ్లల్లో భర్తలు తమ సెల్స్ ని భార్యలు ఎక్కడ చూసేసి తమ సీక్రెట్స్ తెలుసుకుంటారో అని సెల్స్ ని కూడా తమతో పాటు బాత్ రూమ్ లోకి తీసుకెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే కాన్సెప్ట్ తో మంచి స్కిట్ రాసుకుని నాట్ బాడ్ అనిపించారు కెవ్వు కార్తీక్, నాటీ నరేష్. కార్తిక్ సెల్ పోవడంతో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో నరేష్ సెల్ ఫోన్ వేషంలో వచ్చి కార్తిక్ ని చితక్కొడతాడు. స‌సెల్ ఫోన్ ఉన్నది మాట్లాడుకోవడానికి, మెసేజ్ చేసుకోవటానికి అన్నప్పుడు బాత్ రూమ్ లోకి తీసుకెళ్లడమేంట్రా.. ఆ బాత్రూమ్ వాసన నేను భరించాలా?స‌ అంటూ నాటీ నరేష్ అంటాడు. సీరియస్ గా 'ప్రపంచంలో ఉన్న అందరికీ వార్నింగ్ ఇస్తున్నా.. సెల్ కి లాక్ వేయండి. లేదంటే కాపురాలు మటాష్' అంటూ ఊగిపోతూ డైలాగ్ చెప్తాడు నరేష్. 'ఇంత కోపంలోనూ చాలా హ్యాపీ గా ఉన్నారేంటి' అంటాడు కార్తిక్. 'నేను ఎక్కువగా సదా గారి దగ్గర చాలా సంతోషంగా ఉంటాను' అంటాడు నరేష్. 'ఎందుకంటే ఆమె ఫోన్ మాట్లాడినప్పుడల్లా పండగే నాకు. ఎన్ని సార్లు ఆమె బుగ్గ మీద లిప్ లాక్స్ ఇచ్చానో' అంటూ సిగ్గుపడతాడు. ఇక రష్మీ విషయం ఏమిటని కార్తీక్ అడిగేసరికి 'రష్మీతో సెల్ఫీ దిగినప్పుడల్లా సెల్ ఫోన్ డెడ్ ఐపోతుంది' అంటూ నాటీ ఆన్సర్ ఇస్తాడు.

బిగ్‌బాస్ 6 లిస్ట్ ఫైన‌ల్ అయిన‌ట్టేనా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ‌త ఏడాది డిసెంబ‌ర్ 19న ముగిసింది. ఈ సీజ‌న్ విజేత‌గా వీజే స‌న్నీ టైటిల్‌ని సొంతం చేసుకుని విజేత‌గా నిలిచాడు. ఫైన‌ల్ లో యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ టైటిల్ ఫేవ‌రేట్ అంటూ ముందు  నుంచి ప్ర‌చారం జరిగినా హౌస్ లో ష‌ణ్ముఖ్ - సిరి హ‌న్మంత్ ల మ‌ధ్య సాగిన ఓవ‌ర్ డోస్ రొమాన్స్ కార‌ణంగా ష‌ణ్ముక్ ఒక్క‌సారిగా విన్న‌ర్ స్థానం నుంచి ర‌న్న‌ర్ స్థానానికి జారిపోయాడు. నెటిజ‌న్ ల‌కు ష‌ణ్ముఖ్ - సిరి హ‌న్మంత్ ల రోమాన్స్ వెగ‌టు పుట్ట‌డంతో ఇద్ద‌రిని నెట్టింట ట్రోల్ చేశారు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసిందే. దీని కార‌ణంగానే ష‌ణ్ముక్ - దీప్తి సునయ‌న‌ల మ‌ధ్య దూరం పెరిగింది. ఫైన‌ల్ గా ఇద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇదిలా వుంటే ఇటీవ‌లే ఓటీటీ వెర్ష‌న్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించారు. ఫైన‌ల్ లో అఖిల్ కు షాకిచ్చి లేడీ కంటెస్టెంట్ బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింది. ఓటీటీ వెర్ష‌న్ కూడా ముగియ‌డంతో తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 6 కు స్టార్ మా వ‌ర్గాలు స‌న్నాహాలు చేస్తున్నాయి. ఇటీవ‌లే దీనికి సంబంధించిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు. నాగార్జున పై షూట్ చేసిన ఈ ప్రోమోలో సామాన్యుల‌కు సీజ‌న్ 6లో అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని, ఈ గోల్డెన్ ఛాన్స్ ని వినియోగించుకోండి అంటూ సామాన్యుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇదిలా వుంటే సీజ‌న్ 6 కు సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైన‌ల్ అయిందంటూ కొంత మంది పేర్లు తాజాగా తెర‌పైకొచ్చాయి. మొత్తం 16 మంది పేర్లు ఇప్ప‌డు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. `న్యూలీ మ్యారీడ్ ఫేమ్` సంజ‌నా చౌద‌రి, హీరోయిన్ ఆశా షైనీ, యూట్యూబ‌ర్ కుషిత క‌ల్ల‌పు, యాంక‌ర్ మంజుష‌, సింగ‌ర్ మోహ‌న్ భోగ‌రాజు, జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌, యాంక‌ర్‌ మంజూష (సుమ‌న్ టీవి),  పొప్పి మాస్ట‌ర్ (కొరియోగ్రాఫ‌ర్‌), సీరియ‌ల్ న‌టి క‌రుణ‌, యాంక‌ర్ రోష‌న్‌, ల‌క్ష్య చ‌ద‌ల‌వాడ‌, కౌశిక్  (టీవి న‌డుడు), శ్రీ‌హాన్‌, చైత‌న్య గ‌రిక‌పాటి ల పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

స్టేజి మీద నుంచి లేచి వెళ్లిపోయిన ఉషా ఉత్థుప్‌.. శ్రీరామ్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

తెలుగు ఇండియన్ ఐడల్ షోకి ఇప్పుడిప్పుడే ఒక మంచి పేరు అనేది వస్తోంది. ఐతే ఈ షోలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఈ షోలోంచి జడ్జ్ గా విచ్చేసిన ఉషా ఉత్థుప్‌ కోపంతో ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. దీనికి కారణం హోస్ట్ శ్రీ రామచంద్ర. పార్టిసిపెంట్స్ అంతా ఒక్కసారిగా ఏమయ్యిందో అర్ధం కాక షాక్ అయ్యారు. ప్రేక్షకులు కూడా అసలు షోలో అంత లెజెండరీ సింగర్ ని పట్టుకుని అంత చీప్ గా ఎలా మాట్లాడతారు అంటూ తిట్టుకున్నారు. ఆమె వయసుకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటూ తమన్ మీద, శ్రీరామ్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలింతకీ ఏమయ్యిందంటే.. షో మధ్యలో శ్రీరామ్ "ఉషా ఉత్థుప్‌ గారు ..మీ వాయిస్ గంభీరం .. మీ పాట అమృతం .. మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్లు.. అది వినిపిస్తుంది కొన్ని మైళ్ళు.. మీ నుదిటిన పెద్ద బొట్టు .. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు " అంటూ ఆమె  మీద  ఒక కవితను సంధించారు. 'నా మీద నేను జోక్స్ వేసుకుని నవ్వుకుంటాను. కానీ నువ్ ఈరోజు నన్ను గంభీరం అంటూ సంబోధించావ్. ఇలా అనడం నాకు నచ్చలేదు. ఈ షో కోసం నేను కోల్కతా నుంచి వచ్చాను. ఇన్ని వేల మంది చూస్తున్న ఈ షోలో నన్ను ఇలా అవమానించడం ఏం బాలేదు'  అంటూ శ్రీరామచంద్ర మీద ఫైర్ అయ్యి సీట్ లోంచి లేచి వెళ్లిపోయారు. స్టేజి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. శ్రీరామ్ కి కూడా అసలేం జరుగుతుందో అర్ధం కాక ఉషా ఉత్థుప్‌ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఐనా ఆమె క్షమించకపోయేసరికి అదే పనిగా సారీ చెప్తూనే ఉన్నాడు. 'మధురం అని కాకుండా  గంభీరం  అంటూ ఒక మగవాడిగా నన్ను అభివర్ణించావ్' అంటూ మండిపడ్డారు. ఏదైమైనా జోక్స్ అంటే నాకు ఇష్టం కానీ ఇది టూ మచ్ అంటూ కోప్పడ్డారు. "మీకు నా క్షమాపణలు. నేను కావాలని ఇలా చెప్పలేదు మీ ఆశీర్వాదాలు కావాలి అమ్మ " అంటూ ప్రాధేయపడ్డాడు శ్రీరామ్. చివరికి అందరూ నచ్చచెప్పాక ఆమె కొంచెం శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికి ఉష కూడా  నవ్వేసి 'నేను అలాంటి దాన్నా కాదా, అనేది ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. నా మీద నేనే జోక్స్ వేసుకుంటాను, నవ్వుకుంటాను. ఇదంతా లైట్' అనేసరికి శ్రీరామ్ కి ప్రాణం లేచొచ్చినట్టైంది. ఆ వెంటనే తమన్ స్టేజిని కూల్ చేయడానికి " ఉషా ఉత్థుప్‌ కాదు ఉషా షట్ అప్ " అని అనేసరికి అందరూ నవ్వేస్తారు. మామ్ ఇంత గ్రేట్ ప్రాంక్ చేసి నా దిమ్మ తిరిగేలా చేశారు అంటూ శ్రీరామ్ అనేసరికి ఉషా గారు న‌వ్వేశారు. ప్రాంకా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే 'ఇలా ఒక స్టేజి షో చేసేటప్పుడు అక్కడ ఉండే లెజండ‌రీస్‌ గురించి తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఏదేదో మాట్లాడేసి వాళ్ళను అవమానించడం కరెక్ట్ కాదు' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం తమన్, శ్రీరామ్ మీద ఫైర్ అవుతున్నారు.

ఆపుకోలేక స్టేజి మీద ఏడ్చేసిన ఆటో రాంప్రసాద్..

స్నేహం ఒక్కసారి  చేస్తే చాలు ఇక దాంపత్యమే. వాళ్ళు భార్యాభర్తలే అని మన ఎస్పీ బాలు గారు అన్నారు. అలాంటి గొప్ప ఫ్రెండ్ షిప్ సుడిగాలి సుధీర్ , ఆటో రాంప్రసాద్, గెటప్ సీనుది. 2013 లో సుడిగాలి సుధీర్ టీం లీడర్ అయ్యాడు. ఐతే అప్పట్లో వీళ్ళ ముగ్గురు కలిసి స్కిట్స్ రాసుకుని  పెర్ఫామ్ చేసుకుంటూ టీంని ఒక రేంజ్లోకి తీసుకెళ్లారు. జబర్దస్త్ అంటే వీళ్ళ ముగ్గురే గుర్తొచ్చేలా ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు కూడా. ఆ తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కూడా వీళ్లకు. ఐతే అప్పట్లో డబ్బుల్లేక, వచ్చేది సరిపోక ఇబ్బందులు పడేవారు ఈ స్నేహితులు. ఐనా సరే ఉన్న వాటిని సర్దుకుంటూ మంచి స్నేహాన్ని కొనసాగించారు. గెట్ అప్ శీనుకి అదే టైంలో పెళ్లవుతుంది. కానీ భార్యాభర్తలు కలిసి తిరగడానికి మంచి బైక్ కూడా లేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకోవడానికి కూడా ఆటో రాంప్రసాద్ దగ్గర మంచి సెల్ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో వీళ్ళ ముగ్గురూ కలిసి వీటిని కొనుక్కుని ఒకరికి ఒకరు ప్రెజెంట్ చేసుకుంటారు. ఇలా వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసిమెలిసి వుంటారు. ఇంతలో గెటప్ శీను కి మూవీ ఆఫర్ వచ్చేసరికి మూడు నెలలు జబర్దస్త్ ని రాను అంటూ చెప్తాడు. అంతే సుధీర్, రాంప్రసాద్ బాగా ఏడ్చేస్తారు. అక్కడ సినిమా హిట్ కొట్టు, వచ్చి ఇక్కడ స్కిట్ కొట్టు అంటూ రాంప్రసాద్ శీనుకి ధైర్యం చెప్పి టీం ని మేం కాపాడతామంటూ ధైర్యం ఇచ్చి పంపిస్తాడు. తర్వాత కొద్ది రోజులకు సుడిగాలి సుధీర్ కూడా ఆగిపోయేసరికి ఒక్కసారిగా ఆటో రాంప్రసాద్ కి ఒంటరి ఐపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే ఆపుకోలేక స్టేజి మీద ఏడ్చేస్తాడు. ఇంద్రజ, సదా, రష్మీ, అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వీళ్ళ ముగ్గురి స్కిట్స్ ని ఫాలో అయ్యేవాళ్లే ఉన్నారనుకుంటే వీళ్ళ గొప్ప స్నేహానికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే మాటలు కాదా. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్ళ ముగ్గిరిది అన్నట్టుగా ఉంటారు. ఫ్రెండ్ షిప్ డే ని పురస్కరించుకుని  ఇక ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో నూకరాజు, కెవ్వు కార్తిక్, రాకింగ్ రాకేష్ అద్దిరిపోయే స్కిట్ పెర్ఫామ్ చేశారు. జూన్ 9 న ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రసారం కాబోయే ఈ స్కిట్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యి చూసిన అందరి మనస్సులను బరువెక్కేలా చేస్తోంది.