మా రిలేష‌న్ షిప్ అంత‌కు మించి అంటున్న జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌

బుల్లితెర హాస్య‌ప్రియుల్ని విశేషంగా అల‌రిస్తూ విజ‌య‌వంతంగా సాగుతున్న కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో వ‌ల్ల  ఎంతో మంది క‌మెడియ‌న్ లు స్థిర‌ప‌డ్డారు. చాలా మంది పాపుల‌ర్ అయ్యారు కూడా. కొంత మందికి సినిమాలలో న‌టించే అవ‌కాశాన్ని అందించింది. మ‌రి కొంత మందిని హీరోల‌ని చేసింది కూడా. ఈ షోలో జంట‌ల‌కు ఏ స్థాయి ఫాలోయింగ్ వుంటుందో ర‌ష్మీ గౌత‌మ్ - సుడిగాలి సుధీర్ లే ఇందుకు మంచి ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. వీరి స్థాయిలో కాక‌పోయినా ఓ రేంజ్ లో మ‌రో జంట పాపులారిటీని సొంతం చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. అదే వ‌ర్ష - ఇమ్మానుయేల్ జంట. వీరిద్ద‌రి స్క్రీన్ ప్ర‌జెన్స్ ఆక‌ట్టుకుంటోంది. షో లో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స్కిట్ లు ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్నాయి. దీంతో ఈ ఇద్ద‌రు పాపుల‌ర్ జోడీగా మారిపోయారు. వ‌ర్ష - ఇమ్మానుయేల్ క‌లిసి చేసిన ప్ర‌తీ స్కిట్ సూప‌ర్ హిట్ అనిపించుకుంటూనే వుంది. దీంతో సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ త‌ర‌హాలోనే వీరిద్ద‌రిపై కూడా లింక‌ప్ వార్త‌లు మొద‌ల‌య్యాయి. వ‌ర్ష‌, ఇమ్మానుయేల్ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్నారంటూ వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.     తాజాగా ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది వ‌ర్ష‌. ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. జ‌బ‌ర్దస్త్ కామెడీ షోలో నేను గ‌త రెండేళ్లుగా వ‌ర్క్ చేస్తున్నాను. ఒక్క స్కిట్ కోసం వ‌చ్చిన నేను ఇమ్మానుయేల్ తో క‌లిసి చేసిన స్కిట్ లో ఒకే ఒక్క డైలాగ్ తో హిట్ అయ్యాను. ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్ప‌లేను. మా ఇద్ద‌రి రిలేష‌న్ షిప్ ఏంటి అని నేను చెప్ప‌లేక‌పోతున్నా.  మా ఇద్ద‌రిది ఓ బాండింగ్ అంతే. అది స్కిట్ త‌రువాత కూడా వుంటుంది. భ‌విష్య‌త్తులో నిజ‌మ‌వ్వ‌చ్చు. అది ఇంకా ఏమైనా అవ్వొచ్చు. నేనంటే అత‌నికి చాలా అభిమానం. ఇమ్మూ అంటే నాక్కూడా అంతే. సెట్ లో ఒక్కోసారి నిజంగానే ఎమోష‌న‌ల్ అవుతాం` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది వ‌ర్ష‌.   

తులసి అందరినీ హిప్నోటైజ్ చేసి తనవైపు లాక్కుంటోంది అన్న లాస్య

తులసి వాళ్ళ ఫామిలీ హ్యాపీగా  ఉన్న టైంలో  అభి ఇంటికి వచ్చి తల్లిని పట్టుకుని నానా మాటలు అంటాడు. అసలు తానూ తన తల్లే కాదని ఫైర్ అవుతాడు. అభి వాళ్ళ నానమ్మ తాతయ్య అభిని తిడతారు. ఐనా ఊరుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసింది తల్లే అంటూ ఇంకా ఎప్పుడు ఆ ఇంటి గుమ్మం తొక్కను అంటాడు.  తల్లితో యుద్ధం ఇక్కడినుంచే స్టార్ట్ అయ్యిందని ఛాలెంజ్ చేస్తాడు. అభి మాటలకూ అందరూ షాక్ అవుతారు. అక్కడినుంచి నాన్న నందు దగ్గరకు వెళ్లి కోపంతో తులసిని తిడుతూ ఉంటాడు. లాస్య కూడా నాలుగు మాటలు కలిపి నూరి అభితో తిట్టిస్తుంది.  తాను బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి నీకు ఆస్తి వస్తే నేను తీసేసుకుంటానేమో అని భయపడి తులసి ఆస్తి నీ పేరు మీద రాయనివ్వకుండా అడ్డుపడిందేమో అని నందు అభితో అంటాడు. ఏదైమైనా నేను అంకిత దగ్గరకు వెళ్లి ఆస్తి తీసుకొస్తాను మీరు బిజినెస్ పెట్టండి డాడ్ అంటూ వెళ్ళిపోతాడు. మరో వైపు ప్రేమ్ అవకాశాల కోసం ముప్పీలహరి దగ్గర పని చేసాను అని చెప్పిన ఎవరూ నమ్మరు. ఇక శృతి పనమ్మాయిగా చేస్తున్న విషయం తులసి , అంకిత కంట బడుతుంది. తర్వాత ఏం జరిగింది. ? తెలియాలంటే స్టార్ మాలో సాయంత్రం వచ్చే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

ఢీ 14లో జడ్జెస్ ముద్దుల వర్షం!

ఢీ 14 దుమ్ము రేపే డాన్స్ షో ప్రతీ వారం అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఈ షో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయబోతోంది. అందులో ఆది మొదట నామినేషన్ వేస్తారు. హోస్ట్ ప్రదీప్.. ఆది వాళ్ళ పార్టీ పేరు, గుర్తు అడిగేసరికి "వేస్తె వెయ్ లేదంటే హై " అనేది పార్టీ పేరు, మైక్ పార్టీ గుర్తు అంటూ డబుల్ మీనింగ్ ఉన్న ఒక కుళ్ళు డైలాగ్ పేలుస్తాడు.  ఇక అలాగే రవికృష్ణని ప్రదీప్ అడుగుతాడు. ప్రెసిడెంట్ గా మీరు గెలిస్తే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు అని. "జెంట్స్ కి ఎవరికైనా హగ్ కావాలంటే మాత్రం మేం ప్రొవైడ్ చేస్తామంటూ " అతనొక కుళ్ళు జోక్ వేస్తాడు. 'ఇంతకు రవికృష్ణ ఏ యాంగిల్ లో ప్రెసిడెంటు' అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. 'మా పార్టీకే ఓటు వేయండి' అని  ఎవరికి వాళ్ళు ప్రాంప్ట్ చేసుకుంటూ ఉంటారు. జూన్ 15 న ప్రసారమయ్యే ఢీ-14 కుళ్లిపోయిన డైలాగ్స్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . నెటిజన్స్ మాత్రం ఈ స్టేజి మీద డాన్స్ పెరఫార్మెర్స్ కి విషెస్ చెప్పారు. ఇక ప్రసాద్ తన డాన్స్ తో అందరినీ మెప్పించేసరికి ప్రియమణి, నందిత శ్వేతా ఇద్దరూ కలిసి చెరో బుగ్గపై ముద్దులు వర్షం కురిపించేసారు. ఈ సీన్ చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా కూడా ఉంది. 'ఇలా ముద్దులు పెట్టి ఓవర్ యాక్షన్ చేయకండి. బాగుంటే మెచ్చుకోండి చాలు' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సుమకు అరుదైన గౌరవం

సుమ కనకాలకు  ప్రత్యేక పరిచయమే అవసరం లేదు. వండర్ఫుల్ ఆక్టర్, యాంకర్, స్పాంటేనియస్ హోస్ట్ ఇలా ఎన్నో  బిరుదులూ ఆమెకు ఆడియన్స్ ఇచ్చారు. ఆనాటి ఋతురాగాల నుంచి నేటి జయమ్మ పంచాయతీ వరకు ఆమె లేని షో కానీ స్టేజి కానీ లేదు. ఎంతో మందికి ఫేవరెట్ కూడా. ఐతే సుమ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అలుపు అనేది లేకుండా ఎంతోమందిని అలరిస్తున్నందుకు ఒక అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీ లోని ఎడిసన్ టౌన్ షిప్ మేయర్ ఐన సామ్ జోషి చేతుల మీదుగా "ప్రొక్లేమేషన్" పేరిట ఒక గౌరవాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. యుఎస్‌లోని అతి పిన్న వయస్కుడైన మేయర్ అలాగే భారత సంతతికి చెందిన మొదటి మేయర్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తాను చేసిన సేవలకు గాను ఈ గౌరవాన్ని పొందడం చాలా ఆనందంగా ఉంది అంటూ సుమ కనకాల విషెస్ చెప్పారు.   తాను  చేపట్టే అన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో.అండగా ఉంటూ ఈ గౌరవం దక్కడానికి ప్రధాన కారణమైన ఉజ్వల్ కస్తాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఎవరైనా ఏదైనా సాధించిన సమయంలో వాళ్ళ సేవలకు గాను గౌరవార్థంగా ఇచ్చే ఒక ప్రత్యేక పత్రం అన్నమాట. ఈ గౌరవం దక్కినందుకు ఆమెకు సోషల్ మీడియాలో ప్రశంసల వరద కురుస్తోంది. జయమ్మ పంచాయతీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లాంగ్ ఎపిసోడ్ "క్యాష్" నిర్వహించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది కూడా. ఐతే త్వరలో "బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్" స్పెషల్ షో ను హోస్ట్ చేయబోతోంది సుమ. ఈ షోలో పార్టిసిపేట్ చేసే ఎంతోమంది ఫేమస్ టీవీ స్టార్స్ తో ఈ బీబీ హౌస్ లో టాస్కులు ఇచ్చి ఆడించబోతోంది. ఇక భర్త రాజీవ్ కానుకలతో విడాకులు అంటూ వచ్చిన పుకార్లపై సుమ అలీతో సరదాగా షోలో క్లారిటీ ఇచ్చేసింది. జంటగా విడాకులు తీసుకోవడం చాలా ఈజీ కానీ తల్లితండ్రులుగా విడాకులు తీసుకోవడం కష్టం అంటూ మనసులో మాటను చెప్పింది . ఏదేమైనా సుమకు అరుదైన గౌరవం దక్కడంపై సోషల్ మీడియాలో విషెస్ వరద ప్రవహిస్తోంది.

ఓటిటిలోకి ఓంకార్ ఎంట్రీ

పాపులర్ టీవీ హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా, ఫిలిం మేకర్ ఐన ఓంకార్ ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు ఇండియన్ ఐడల్ ని ప్రసారం చేస్తున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం పై అతను తన కొత్త డాన్స్ షో ఒకటి ప్లాన్ చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఓంకార్ గతంలో ఆట, ఛాలెంజ్ వంటి డాన్స్ షోస్ చేసాడు. అవి తర్వాత కాలంలో కొంత కాంట్రావర్సీని మూట గట్టుకున్నాయి. ఆ తర్వాత ఆట జూనియర్స్, డాన్స్ ప్లస్ షోస్ కూడా కండక్ట్ చేసాడు. ఆ షోస్ మీద కూడా రూమర్స్ వచ్చేసరికి వాటికి బైబై చెప్పి  ఇష్మార్ట్ జోడి, సిక్స్త్ సెన్స్, కామెడీ స్టార్స్ ధమాకా అనే షోస్ తో ఫుల్ బిజీ ఐపోయాడు. ఇష్మార్ట్ జోడి సీజన్ 2  తర్వాత ఓటిటి పై ద్రుష్టి పెట్టాడు ఓంకార్ . ఐతే ఓటిటిలో ఒక షోని జులైలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓటిటి వెర్షన్ లో వస్తున్న బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక వారం హౌస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త ప్రోగ్రాం దాని విషయాలు విశేషాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. 

‘బాలయ్య బాలయ్య’ అంటూ కిర్రాక్ సాంగ్ తో అల్లాడించిన ఉష ఉత్తుప్

ఇండియన్ ఐడల్ తెలుగు పోటీలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రేక్షకులు కూడా వాళ్ళ వాళ్ళ వోటింగ్ ఇచ్చేసారు. ఇక జూన్ 10 న సెమీ ఫైనల్స్ జరగబోతున్నాయి .  బాలయ్య బర్త్ డే కూడా ఇదే రోజు కావడం విశేషం. ఐతే ఈ షోలో శ్రీనివాస్ పాటకి అఖండ పాట పాడి స్టేజిని ఒక్కసారిగా డివోషనల్ ప్లేస్ గా మార్చేశాడు. ఇక ఈ పాట ఐపోగానే బాలయ్యబాబు, ఉష ఉత్తుప్, నిత్యామీనన్, కార్తిక్, థమన్ అంతా నిలబడి చప్పట్లు కొట్టారు శ్రీనివాస్ కి. థమన్ లో ఆ సదాశివుడు పూనాడేమో అనిపిస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా థ్యాంక్యూ తమ్ముడు అంటూ తమన్ కి చెప్తాడు. జై బాలయ్య అంటూ శ్రీరామచంద్ర గట్టిగా అరిచేసరికి స్టేజి మొత్తం మంచి జోష్ తో నిండిపోయింది. వెంటనే ఉష ఉత్తుప్ మైక్ అందుకుని " ఎవ్రీబడీ క్లాప్ యువర్ హాండ్స్ .. ఆల్రైట్, బాలయ్య, బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయా, ఐ లవ్ యూ అనేసరికి "ఉషమ్మ ఉషమ్మ ఒళ్ళంతా ఊపమ్మా , సై అంటానులే " అంటూ బాలయ్య కోరస్ పాడారు. ఈ పాటకు స్టేజి అంతా షేకాడిపోయింది. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సంపాదిస్తోంది. హ్యాపీ బర్త్ డే బాలయ్య అంటూ ఆయనకు విషెస్ చెప్పారు. శ్రీనివాస్ పడుతున్నాడా ఇంకెవరైనా పడుతున్నారా ? అతన్నెందుకు హైలైట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జ్వాల‌ని పెళ్లిచేసుకోవాలంటూ హిమ కండీష‌న్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఇటీవ‌ల కొంత క్రేజ్ ని కోల్పోయింది. కొత్త త‌రంతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన ఈ సీరియ‌ల్ ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ట్విస్ట్ లు, ట‌ర్న్ ల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ శుక్ర‌వారం ఈ సీరియ‌ల్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం. హిమ త‌న‌కు క్యాన్స‌ర్ అని చెప్ప‌డంతో నిరుప‌మ్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌వుతాడు. అమెరికాకు వెళ్లాల‌న్న త‌న ఆలోచ‌న‌ని విర‌మించుకుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో... ఓ పార్కులో కూర్చుని వున్న నిరుప‌మ్ .. హిమ‌కు ఏం కాద‌ని, త‌న‌ని తాను ర‌క్షించుకుంటాన‌ని ఆలోచిస్తుంటాడు. క‌ట్ చేస్తే.. జ్వాల జ్యోతీష్యం చెప్పించుకుంటూ వుంటుంది. జ్వాల చేయి చూసిన జ్యోతీష్యుడు .. నీ చేయి చూస్తే మ‌తిపోతోంద‌మ్మా.. `అంటాడు. అదే స‌మ‌యంలో అక్క‌డికి శోభ వ‌స్తుంది. ఆఖ‌రికి జాత‌కం చెప్పించుకుంటున్నావా? అంటూ ఎగ‌తాలి చేస్తుంది. జ్యోతిష్యుడు ఎందుకు నీ జాత‌కం నేను చెబుతాను అంటూ మొద‌లు పెడుతుంది. నీకు లైఫ్ వుండ‌దు. ల‌వ్వు వుండ‌దు అంటుంది. ఆ మాట‌లు విన్న జ్యోతిష్యుడు త‌ను చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని నీకు ఐశ్వ‌ర్యం ల‌భిస్తుంద‌ని, ల‌వ్ కూడా వుంద‌ని చెబుతాడు. వెంట‌నే జ్వాల‌.. ఆ మాట‌లు వింటుంటే నీ క‌డుపు మండుతోంది క‌దా` అని శోభ‌కు కౌంట‌ర్ ఇస్తుంది. క‌ట్ చేస్తే...వేరే అమ్మాయిలో నువ్వు నా ప్రేమ‌ని చూసుకోవాలి బావ అని హిమ నిరుప‌మ్ తో అంటుంది. ఆ అమ్మాయి ఎవ‌రంటాడు నిరుప‌మ్‌. ఇదే స‌మ‌యంలో హిమ .. నిరుప‌మ్ నుంచి మాట తీసుకుని ఆ అమ్మాయి జ్వాల అంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  నిరుప‌మ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

హైప‌ర్ ఆదికి వ‌ర్షిణి ల‌వ్ ప్ర‌పోజ్‌!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వ‌చ్చిన స్టార్ కమెడియ‌న్‌, రైట‌ర్ హైప‌ర్ ఆది. త‌న‌దైన టైమింగ్ తో హైప‌ర్ గా పంచ్ లు పేల్చే ఆది గురించి ల‌వ్ ఎఫైర్ లు వినిపించ‌డం చాలా త‌క్కువే. అయితే తాజాగా మాత్రం అత‌నిపై ల‌వ్ ఎఫైర్ వార్త‌లు ఈ మ‌ధ్య జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా యాంక‌ర్ వ‌ర్షిణి సోష‌ల్ మీడియా వేదిక‌గా హైప‌ర్ ఆదికి ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `జ‌బ‌ర్ద‌స్త్‌` షో లో చాలా మంది జంట‌ల మ‌ధ్య పబ్లిసిటీ, షో కనెక్ట్ కావ‌డం కోసం ల‌వ్ ఎఫైర్ ల‌నే నాట‌కం ఆడుతున్న విష‌యం తెలిసిందే. అయితే వ‌ర్షిణి, హైప‌ర్ ఆది క‌లిసి ఏ షోలోనూ క‌నిపించ‌ని నేప‌థ్యంలో వ‌ర్షిణి .. హైప‌ర్ ఆదికి ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. భైప‌ర్ ఆది పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర్షిణి సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఇప్ప‌డు వైర‌ల్ గా మారింది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బర్ద‌స్త్ నుంచి బ‌య‌టికి చాలా రోజుల క్రిత‌మే బ‌య‌టికి వ‌చ్చేసిన వ‌ర్షిణి ఆ త‌రువాత `స్టార్ మా`లో ఓంకార్ స్టార్ట్ చేసిన కామెడీ షో `కామెడీ స్టార్స్‌`కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఆ షో నుంచి కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. ఆ త‌రువాత సుమంత్ తో ఓ సినిమా కూడా చేసిన వ‌ర్షిణి ప్ర‌స్తుతం ఎలాంటి టీవీ షోలు చేయ‌డం లేదు.   ఇదిలా వుంటే హైప‌ర్ ఆది పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర్షిణి పెంట్టిన పోస్ట్ ప‌లు అనుమానాలు రేకెత్తిస్తోంది. `సెల‌బ్రేష‌న్స్ కంటిన్యూస్‌.. డియ‌ర్ ఆది ఐ విష్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.. నువ్వు ఎల్ల‌ప్పుడూ నా జీవితంలో వుండాల‌ని.. వుంటావ‌ని కోరుకుంటున్నాను. నేను అత్య‌ధికంగా అభిమానించే వ్య‌క్తి. నా 3 AM ఫ్రెండ్‌..నా స‌పోర్ట్ సిస్ట‌మ్‌. రైట‌ర్ ఆది నువ్వు నాకు క‌రెక్ట్ రా` అంటూ వ‌ర్షిణి సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా చేసిన పోస్ట్ వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అని క‌న్ఫ‌ర్మ్ చేస్తోంది. ఈ పోస్ట్ పై నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. నీ లాస్ట్ కామెంట్ చూస్తుంటే డౌట్ గా వుంది. మీరిద్ద‌రు డేటింగ్ లో వున్నారా? అంటూ డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు. వ‌ర్షిణి మాత్రం ఈ కామెంట్ ల‌పై స్పందించ‌డం లేదు.   

వేద పై క‌న్నేసిన కైలాష్‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. హిందీలో సూప‌ర్ హిట్ అయిన సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మ‌లుపుల‌తో సాగుతూ రొమాంటిక్ సీరియ‌ల్ గా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప చుట్టూ సాగే అంద‌మైన క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణయ్ హ‌నుమండ్ల‌, రాజా శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, సుమిత్ర పంప‌న త‌దిత‌రులు న‌టించారు. మాళ‌వికకు బుద్ధి చెప్పే క్ర‌మంలో ఖుషీని వేద‌కు ద‌త్త‌త ఇస్తాడు య‌ష్‌.. క‌ట్ చేస్తే.. ఆ విష‌యం త‌లుచుకుంటూ మురిసిపోతూ వుంటుంది వేద‌. ఇంత‌లో య‌ష్ అటుగా వ‌స్తాడు. ఏంటీ అని అడిగితే వేద ఏమీ లేదంటుంది. ఆ త‌రువాత య‌ష్ వెళ్లి ప‌డుకుంటాడు. వేద కూడా ప‌డ‌కుని త‌న‌కు థాంక్స్ చెబితే బాగుండేది అని ఫీల‌వుతూ వుంటుంది. య‌ష్ కూడా వేలం పాట‌లో త‌న‌కు వేద హెల్ప్ చేసింద‌ని, అయితే అది గ‌మ‌నించ‌కుండా త‌న‌ని ఇబ్బంది పెట్టాన‌ని అందుకు త‌న‌కు సారీ చెప్పాల‌ని య‌ష్ ఫీల‌వుతూ వుంటాడు. క‌ట్ చేస్తే.. దుబాయ్ లో వుంటున్న య‌ష్ బావ కైలాష్ ఇంటికి వ‌స్తాడు. వ‌చ్చీ కాగానే త‌న బుద్ధిని బ‌య‌ట‌పెడ‌తాడు. ఆడ‌వాస‌న త‌గిలితే రెచ్చిపోయే క్రూరుడు అయిన కైలాష్ లోనికి ఎంట్రీ ఇస్తాడు. అంద‌రు క‌నిపిస్తున్నా య‌ష్ వైఫ్ ఎక్క‌డ‌ అంటాడు. ఆ స‌మ‌యంలోనే వేద‌ మొక్క‌ల‌కు నీళ్లు పోస్తూ వుంటుంది.. త‌న‌ని మాలిని పిల‌వ‌డంతో హాలు లోకి వ‌చ్చేస్తుంది. త‌నని చూసిన కైలాష్ లో రావ‌ణుడు బ‌య‌టికి వ‌చ్చేస్తాడు. వెంట‌నే వేద ద‌గ్గ‌రికి వెళ్లి చేయి ప‌ట్టుకుంటాడు. ఎంతో అందంగా వున్నావ‌ని ఓపెన్ గా చెప్ప‌డంతో అంతా షాక్ అవుతారు. ఆ త‌రువాత మాట మార్చి సంప్ర‌ద‌య బ‌ద్ధంగా వుంద‌న్నాన‌ని చెబుతాడు. ఆ త‌రువాత ఒంట‌రిగా వున్న వేద బెడ్రూమ్ లోకి వెళ‌తాడు కైలాష్‌.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. కైలాష్ వక్ర బుద్ధిని వేద ప‌సిగ‌ట్టిందా? .. అస‌లు ఏం జ‌ర‌గ‌బోతోంది?.. క‌థ ఎలాంటి మలుపులు తిరగ‌బోతోంది? .. య‌ష్ దాకా విష‌యం వెళితే ప‌రిస్థితి ఎలా మార‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

విశాల్ - న‌య‌నిల హ‌త్య‌కు వ‌ల్ల‌భ కుట్ర‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. త‌న‌కు, త‌న చుట్టూ వున్న వాళ్ల‌కు జ‌ర‌గ‌బోయేది ముందే ప‌సిగ‌ట్టే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఇది కూడా రీమేక్ సీరియ‌లే. ఆస్తికోసం గాయ‌త్రీ దేవిని మ‌ర్డ‌ర్ చేయించి ఆమె స్థానంలో స్థిర‌ప‌డిన తిలోత్త‌మ చుట్టూ సాగే క‌థ ఇది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ప‌విత్ర‌, నిహారికి, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య న‌టించారు. ఫ్యాక్టరీలో డైలీ లేబ‌ర్ ఉద్యోగం మానేసిన విశాల్‌, న‌య‌ని సొంతంగా కంప‌నీ పెట్ట‌డానికి రెడీ అయిపోతారు. ఇదే విష‌యాన్ని ఇంటికి వెళ్లి తిలోత్త‌మ‌కు వివ‌రించాల‌ని, అదే స‌మ‌యంలో గాయ‌త్రీ దేవి మ‌ర్డ‌ర్ జ‌రిగిన సంద‌ర్భంలో తిలోత్త‌మ పోగొట్టుకున్న బంగారు గాజుని తిరిగి ఇచ్చి తిలొత్త‌మ‌లో వ‌ణుకు పుట్టించాల‌ని న‌య‌ని ప్లాన్ చేస్తుంది. అనుకున్న వెంట‌నే విశాల్‌, న‌య‌ని క‌లిసి తిలోత్త‌మ కోసం ఇంటికి వెళతారు. ఎంట్రెన్స్ లోనే క‌సి ఎదురుప‌డ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న జ‌రుగుతుంది.. పెళ్లి కావాల్సిన అమ్మాయివి చెంప‌లు ప‌గ‌ల‌గొట్టించుకుంటే బాగోదు అంటూ విశాల్ గ‌డ్డిపెడ‌తాడు. అక్క‌డి నుంచి విశాల్‌, న‌య‌ని ఇంట్లోకి వెళ‌తారు. తిలోత్త‌మ పెద్ద కొడుకు వ‌ల్ల‌భ వెకిలి మాట‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతాడు. ఆ మాట‌ల‌ని స‌హిస్తూనే విశాల్ , న‌య‌ని లోప‌లికి వెళ్లి తాము ఎందుకు వ‌చ్చామో ఏం చేయ‌బోతున్నామో చెబుతారు. న‌య‌ని త‌న చెల్లికి సారె పెడుతుంది. ఆ త‌రువాత `గాన‌వి`(గాయ‌త్రిదేవి, న‌య‌ని, విశాల్‌) ఇండ‌స్ట్రీస్ ని ప్రారంభించ‌బోతున్నామ‌ని చెప్పి షాకిస్తాడు విశాల్‌. పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా వున్న మీరు కంప‌నీ పెడ‌తారంటే న‌వ్వోస్తోంద‌ని వ‌ల్లభ‌ వెట‌కారం ఆడ‌తాడు. అయినా స‌రే మా కంప‌నీ బాగుండాల‌ని మ‌మ్మ‌ల్ని దీవిస్తూ నాలుగు మంచి మాట‌లు కాగితంపై రాసిమ్మంటుంది న‌య‌ని. న‌య‌ని ప్లాన్ తెలిసిన క‌సి తిలోత్త‌మ ని రాయ‌కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది కానీ న‌య‌ని అడ్డుత‌గ‌ల‌డంతో క‌సి మాట‌లు తిలోత్త‌మ ప‌ట్టించుకోదు. వ‌ల్ల‌భ కూడా ఆ నాలుగు ముక్క‌లేదో రాసేయ్ పండ‌గ చేసుకుంటార‌న‌డంతో తిలోత్త‌మ.. న‌య‌ని భావించిన‌ట్టుగానే రాసి ఇచ్చేస్తుంది. ఆ పేప‌ర్ ప‌ట్టుకుని ఇంటికి బ‌య‌లు దేరిని విశాల్, న‌య‌ని మ‌ధ్య‌లో ఆగి మ‌ల్లెపూలు తీసుకుంటుంటే వెన‌కే కారులో వ‌చ్చిన వ‌ల్ల‌భ ఇద్ద‌రిని హ‌త్య చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది? వ‌ల్ల‌భ ప్లాన్ పారిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

ఆర్య అరెస్ట్‌.. ప్రాణ త్యాగానికి సిద్ధ‌మైన అను!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని నెల‌లుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. పాపుల‌ర్ హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష హెచ్.కె. కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గన్‌, విశ్వ‌మోహ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనూష సంతోష్‌, జ్యోతిరెడ్డి, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, ఉమా దేవి, మ‌ధుశ్రీ‌, సందీప్ న‌టించారు. రాగ‌సుధ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఆర్య వ‌ర్థ‌న్ ని ఇరికిస్తుంది. గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్ కి అడ్డంగా నిలిచి త‌న‌కు న్యాయం జ‌ర‌క్క‌పోతే ఆత్మాహుతి చేసుకుంటాన‌ని నాట‌కం ఆడ‌టంతో గ‌వ‌ర్న‌ర్ రాగ‌సుధ మాట‌ల‌ని న‌మ్మేస్తాడు. త‌ను కోరుకున్న‌ట్టే మూడు రోజుల పాటు ఆర్య వ‌ర్థ‌న్ ని క‌స్ట‌డీకి తీసుకోవాల‌ని పోలీసు శాఖ‌కు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నేప‌థ్యంలో అనుతో కేసు విత్  డ్రా చేయించి రాగసుధ‌పై కేసు పెట్టాల‌ని ప్ర‌య‌త్నించిన ఆర్య ప్ర‌య‌త్న‌లు వృథా అవుతాయి. స్టేష‌న్ లోనే వున్న ఆర్య‌ని గౌర‌వ క‌ష్ట‌డీకి తీసుకుంటున్న‌ట్టుగా క‌మీష‌న‌ర్ మీడియాకు వివ‌రిస్తాడు. అనంతరం ఫార్మాలిటీస్ అన్నీ పూర్త‌వ‌డంతో ఆర్యవ‌ర్ధ‌న్ సెల్ లోకి వెళుతుండ‌గా 'ఏదో ఒక‌టి చేయండి సార్‌.. మీరు మాత్రం ఇక్క‌డ వుండ‌టానికి వీల్లేదు' అని ఆర్య‌తో అను అంటుంది. ఆ మాట‌ల‌కు ఆర్య .. నీర‌జ్ ని పిలిచి అనుని ఇంటికి తీసుకెళ్లమంటాడు. దీంతో చేసేది లేక అక్క‌డున్న ఓ పోలీస్ నుంచి గ‌న్ లాక్కున్న అను త‌న త‌ల‌కు గురి పెట్టుకుని 'ఎవ‌రైనా ద‌గ్గ‌రికి వ‌స్తే న‌న్ను నేను షూట్ చేసుకుంటా' అంటుంది. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? .. ఆర్య కేసు ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌ది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే. 

నెల్లూరులో టైటానిక్ ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేసిన శౌర్య‌!

'కార్తీకదీపం' సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సీరియల్ లో వంటలక్క కూతురిగా శౌర్య యాక్ట్ చేసింది. వంటలక్క పాత్రతో పోటీ పడి మరీ నటించింది. ఈ చిన్నారి నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. రీల్ నేమ్ శౌర్య ఐతే రియల్ నేమ్ కృతిక. ఐతే కృతిక ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా టైటానిక్ ఐస్ క్రీం తింటూ ఇచ్చిన పోజ్ మంచి కామెంట్స్ ని అందుకుంటోంది. ఇదే కాదు "బృందావనంలో కృష్ణుడు వచ్చాడే" అనే సాంగ్ కి వేసిన స్టెప్స్ తో ఎంతో మంది ఫిదా ఇపోయారు కూడా. కృతిక కళ్ళను పొగుడుతూ ఇన్స్టాగ్రామ్ లో చాలామంది క్యూట్, సూపర్ ఐస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే నెల్లూరు వెళ్లిన కృతిక అక్కడ మురళీకృష్ణ రెస్టారెంట్ లో టైటానిక్ ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. "నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు ఈ సమ్మర్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?" అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కృతిక. నెటిజన్స్ కూడా "మా నెల్లూరు ఎప్పుడు వచ్చావ్?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'కార్తీక దీపం' సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ లో చిన్నారులు కృతిక, సహృద నటించి అందరిని మెప్పించారు. ఐతే నెమ్మది నెమ్మదిగా అన్ని కేరక్టర్స్ ని ఆపేయడంతో 'కార్తీక దీపం' సీరియల్ కి రేటింగ్ కూడా తగ్గిపోయింది.

‘తమన్ ని సిక్స్ ప్యాక్ తో చూడాలనుంది’ అన్న అల్లు అరవింద్

తమన్ కి సిక్స్ ప్యాక్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని ఉంది అంటూ అల్లు అరవింద్ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రెస్ మీట్ స్టేజిపై సరదాగా ఆట పట్టించారు. స్టేజి కింద కూర్చున్న తమన్ మైక్ తీసుకుని సిక్స్ ప్యాక్ లు ఆరు పాటల్లో ఉంటాయి అంటూ ఒక చెణుకును అలా  విసిరి అందరిని నవ్వించాడు. ఇక ఈ ప్రోగ్రాంకి జడ్జెస్ గా ఉన్న అందరిని విష్ చేస్తూ శ్రీరామ్ గురుంచి కొన్ని మాటలు చెప్పారు. శ్రీరామచంద్ర 2010 లో సోనీ టీవీ నిర్వహించిన ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం విన్నర్. ఐతే ఆ టైంలో శ్రీరామచంద్ర పెర్ఫార్మన్స్ కి ఫిదా ఐనా అల్లు నిర్మల తన  చేత వోట్ చేయించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ శ్రీరామచంద్ర నాకు అప్పుడు అలా తెలుసు. మళ్ళీ  ఇన్నాళ్లకు ఇలా ఆహా ప్రోగ్రాంకి హోస్ట్ గా వచ్చి ఈ షోకి వచ్చే అందరిని ఇలా ఆడించేస్తాడనుకోలేదు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. థాంక్యూ శ్రీరామ్ ఇలాగే కంటిన్యూ చెయ్యి అనేసరికి శ్రీరామ్ కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. ఇక ఈ ప్రోగ్రాంని కొత్త కొత్త ఐడియాస్ తో ముందుకు తీసుకెళ్తున్న అందరికి కూడా ఈ స్టేజి ద్వారా ధన్యవాదాలు చెప్పారు.

అవకాశాల్లేక పానీపూరి బండి పెట్టుకున్న శ్రీవాణి

ఘర్షణ, చంద్రముఖి సీరియల్స్ తో బుల్లి తెరపై సూపర్ పాపులర్ ఐన శ్రీవాణి ప్రస్తుతం అనుకున్నంత మేరకు అవకాశాలు రాకపోవడంతో చేసేదేం లేక శ్రీవాణి , భర్త విక్రమ్ పానీపూరి బండి పెట్టుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. ఇక శ్రీవాణిని కలవడానికి తమిళ్ ఇండస్ట్రీలో యాక్ట్ చేసే తన ఫ్రెండ్ నిప్పా వస్తుంది. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అవకాశాలు రాక ఇలా పానీపూరి బండి నడిపించుకుంటున్నాం అని చెప్తుంది. ఇక్కడే మా ఆయన బండి ఉంది పద వెళదాం పానీపూరి తిందువు గాని అంటూ తీసుకెళ్తుంది. అక్కడ శ్రీవాణి భర్త నిజంగానే పానీపూరి అమ్ముతూ కనిపిస్తాడు. ఈ బండి మీద నేను లక్షన్నర సంపాదిస్తున్నాను. ఇలాంటి బళ్ళు మాకు పది ఉన్నాయి మీరు కూడా మీ ఏరియాలో ఇలాంటి ఒక బండి పెట్టుకోండి మంచి లాభం వస్తుంది అంటూ సలహా ఇస్తాడు విక్రమ్ నిప్పాకి.   నిప్పా తనకు హైదరాబాద్ లో షూటింగ్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పానీపూరి పార్సిల్స్ కావాలంటే పంపిస్తారా అంటూ అడుగుతుంది. అందులో ఏముంది మా ఆయన పంపిస్తారు. డోర్ డెలివరీ కూడా ఉంది అంటుంది శ్రీవాణి. అంతలో అక్కడికి శ్రీవాణి ఫ్రెండ్ నీలిమ కూడా వస్తుంది. అలా బండి మీద పానీపూరి అమ్మడాన్ని చూసి నిజంగా షాక్ అవుతుంది. వచ్చే పోయే వాళ్లందరినీ బండి దగ్గరకు రమ్మని పిలుస్తూ రియాలిటీ దగ్గరగా ఉండేలా చేసిన ఈ ప్రాంక్ వీడియో ఇప్పుడు చాలా మందిని సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది. ఇంత ఎండలో నిలబడి పానీపూరి బండి వాళ్ళు ఎలా పని చేస్తున్నారో అందరికీ చెప్పడం కోసమే ఈ వెరైటీ ప్రాంక్ చేసి మా యూట్యూబ్ లో పెట్టాం అంటూ  నిప్పాకి, నీలిమకు చెప్పేసరికి ప్రాంకా అంటూ నోరెళ్లబెడతారు వాళ్ళు.  ఎలాంటి అవకాశాలు లేనప్పుడు ఇలా బండి పెట్టుకుని సేల్ చేసుకోవడం ఏమి తప్పు కాదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. ఈ ప్రాంక్, వ్లోగ్ సూపర్ అంటూ మెస్సేజెస్ ని షేర్ చేశారు.

'ఆహా' బంపర్ ఆఫర్.. రూ. 99కే సబ్‌స్క్రిప్ష‌న్‌

బుల్లితెర మీద బంపర్ హిట్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'. 'ఆహా'లో స్ట్రీమ్ అయ్యే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మంచి రేటింగ్స్ తో ముందుకెళ్తోంది. ఐతే ఈ షో ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మంచి సర్ప్రైజెస్ అనౌన్స్ చేశారు. ఆ సర్ప్రైజెస్ విషయాన్నీ కూడా చాల వెరైటీగా చెప్పారు. ఆహా ఇప్పటివరకు 29 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యింది అనేది సర్ప్రైజ్ కాదు, సుమారు టు  మిలియన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రోజు ఆహాని చూస్తారనే విషయం కూడా సర్ప్రైజ్ కాదు, ఇప్పటి వరకు 30 షోస్ కంప్లీట్ చేసుకుని 31st ఎపిసోడ్ అనేది ఈ నెల 10 న ప్రసారం కాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అది "అన్స్టాపబుల్ టాప్ ౬" అనే పేరుతో ప్రసారం కాబోతోంది. అన్నారు. "ఇక 17th న గ్రాండ్ ఫినాలే దుమ్ము రేపబోతోంది. ఆ గ్రాండ్ ఫినాలేలో ఎన్నో సర్ప్రైజెస్  ప్లాన్ చేసాం. ఎక్కువ మొత్తం క్యాష్ ప్రైజెస్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నాం. అమౌంట్ ఎంత అనేది ఇప్పుడే చెప్పను. వీటితో పాటు విన్నర్స్ కి రన్నర్స్ కి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు కల్పించాలో కూడా డిసైడ్ చేశాం. ఆ విషయాలన్నీ ఆరోజు రివీల్ చేస్తాం" అని అన్నారు . ఇన్ని సర్ప్రైజెస్ ఉన్న 17న జరగబోయే గ్రాండ్ ఫినాలేని ఎవ్వరూ మిస్ కాకూడదు అనే ఆలోచనతో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశామన్నారు.  "కొన్ని లక్షల మంది ఈ ప్రోగ్రాంకి వోట్ వేస్తూ వస్తున్నారు కానీ ఇంకా కొంతమంది ఆహాకి మనీ పే చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేక ఇబ్బందిపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ సందర్భంగా కేవలం రూ. 99ల‌కే సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ గ్రాండ్ ఫినాలే చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఐతే ఈ ఆఫర్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే" అంటూ అనౌన్స్ చేశారు. గ్రాండ్ ఫినాలే మాత్రమే కాదు అన్ని ప్రోగ్రామ్స్ ఆహాలో చూడొచ్చు కానీ ఒక నిర్ణీత సమయం వరకే అంటూ "ఇదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళుంటే వెంటనే చేసుకోండి ప్రోగ్రాంని ఎంజాయ్ చేయండి" అంటూ స్వీట్ న్యూస్ చెప్పారు.

అడివి శేష్ తో బుల్లి తెర నటి మహేశ్వరీ కూతురు హరిణి చిట్ చాట్

వదినమ్మ  సీరియల్ లో శైలు పాత్రలో టిపికల్ గా నటించి పేరుతెచ్చుకుంది నటి మహేశ్వరీ. ఐతే మహేశ్వరికి చాలా రోజుల తర్వాత షూటింగ్స్ కి కాస్త బ్రేక్ వచ్చేసరికి కూతుర్ని తీసుకుని మేజర్ మూవీకి వెళ్ళింది. కూతురు హరిణికి ఎంతో బాగా నచ్చేసింది ఆ మూవీ. ఏ  సినిమాకు వెళ్లినా సగంలోనే వెళ్ళిపోదాం అనే హరిణి ఈ మూవీ మొత్తం చూసింది అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కూతురు ఎక్సయిట్మెంట్ ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంది. అంతే కాకుండా బిగ్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసి డైరెక్ట్ గా అడివి శేష్ తో మాట్లాడించింది. మేజర్ మూవీ హీరోని డైరెక్ట్ గా చూసేసరికి మహేశ్వరీ కూతురు చాలా ఫిదా ఐపోయింది.  ఇక ఇద్దరి మధ్య సరదా చిట్ చాట్ జరిగింది. "అంకుల్ మీరు గన్ ఎలా పట్టుకున్నారు భయం వేయలేదా " అనేసరికి గన్ ని ఎలా పేల్చాలో చేత్తో చేసి చూపించారు అడివి శేష్. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దయ్యాక నేను పోలీస్ అవుతా దొంగల్ని కొట్టేస్తా అంటూ దానికి మేజర్ సర్ ఇన్స్పిరేషన్ అని చెప్తుంది హరిణి. ఇక నెటిజన్స్ కూడా తమ కామెంట్స్ ని షేర్ చేసుకున్నారు. చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు, మీరు. మంచి మూవీని సెలెక్ట్ చేసుకున్నారు,హరిణికి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మహేశ్వరీ, అడివి శేష్ తో వ్లోగ్ చేసినందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ వరద కురిపించారు.   ఒడిశా నుంచి ఒక చిన్నారి మేజర్  మూవీ ఇన్స్పిరేషన్తో ఆర్మీలో జాయిన్ అవుతానంటూ ఒడియాలో ఒక వీడియొ శేష్ కి పంపింది. ఆ వీడియొ చూసి తనకు చాలా హ్యాపీ అనిపించిందని చెప్పారు. ఇక ఇప్పుడు నేషనల్ డిఫెన్సె అకాడమీ వాళ్ళు కూడా కొత్త రూల్ ప్రకారం ఆర్మీలోకి మహిళలను కూడా తీసుకుంటున్నారని చెప్పారు. ఇలా ఎన్నో విషయాలను అడివి శేష్ ఈ వీడియొలో షేర్ చేసుకున్నారు. మరి మీరు కూడా ఈ వీడియొ చూసేయండి.

వినాయకుడికి విశిష్ట అభిషేకంతో దోషం తొలగిపోతుందా ?

రత్తమ్మను నిర్దోషి అని శ్యామా ప్రూవ్ చేసి తనకు అండగా నిలబడుతుంది. ఐశ్వర్య ఫ్యాక్టరీలో కారప్పొడులను  ప్యాక్ చేస్తూ శ్యామా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. మరో పక్క వసంతకు శ్యామా ఐశ్వర్య చేసిన పని గురుంచి కాకుండా ఎవరో కిట్టని వాళ్ళు రత్తమ్మ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసారంటూ జరిగిన విషయం చెప్తుంది. అలాంటి వాళ్ళను అందరి ముందు నిలబెట్టి ఇంకోసారి అలా జరగకుండా చూడాలంటూ ఐశ్వర్య ముందే శ్యామాకి  చెప్తుంది. వెంటనే ఐశ్వర్య గదిలోకి వెళ్లి శ్యామా మీద ఉన్న కోపంతో వస్తువుల్ని పగలగొడుతుంది. మరో పక్క వసంత వాళ్ళు శ్యామా , అఖిల్ ఫస్ట్ నైట్ ఏర్పాట్ల కోసం గురువుగారితో మాట్లాడతారు. ఐతే ఇద్దరి జాతకాలు బాగున్నాయి కానీ చిన్న లోపం ఉందని చెప్తారు.  ఆ లోపం పోవాలంటే విఘ్నేశ్వరుడికి విశిష్ట అభిషేకం చేయాలనే విషయం చెప్పి  ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని వసంత శ్యామాకు చెప్తుంది. మిగతా హైలైట్స్ కోసం ఈరోజు మధ్యాహ్నం జీ తెలుగులో ప్రసారమయ్యే కృష్ణతులసి సీరియల్ లో చూడొచ్చు.

అభిని వాడుకోవడానికి లాస్య కుట్ర!

అంకిత వాళ్ళ నాన్న ఆస్తి పత్రాలు రాయించడానికి వెళ్లే టైంలో తులసి ఫోన్ చేసి దారిలో కలుస్తుంది. తన జీవితాన్ని పాడు చేసిన లాస్య ఇప్పుడు అభి పేరు మీద ఆస్తి వస్తోందని పసిగట్టి తన బిడ్డను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తోందని బాధపడతుంది. అందుకే ఆస్తిని అభి పేరు మీద కాకుండా అంకిత పేరు మీద పెడితేనే చాలా మంచిదని సలహా ఇస్తుంది. అంకిత వాళ్ళ నాన్న తులసి చెప్పినట్టే చేస్తాడు.  ఆ పత్రాలను తీసుకున్న గాయత్రి అందులో అంకిత పేరు కనిపించేసరికి షాక్ అవుతుంది. "ఇలా ఎవరు చేయమన్నారు.. తులసేనా?" అంటూ అడుగుతుంది. దారిలో జరిగిందంతా చెప్తాడు. "నందు తులసికి విడాకులు ఇచ్చేసి పిల్లల బాధ్యతను గాలికి వదిలేస్తే తులసి ఆంటీ కష్టపడి పిల్లల్ని కాపాడుకుంటోంది. ఇంతకంటే ఏం తెలుసుకోవాలి తులసి ఆంటీ మంచితనం గురుంచి?" అంటూ అంకిత గట్టిగా తల్లితో వాదిస్తుంది.   చేసేదేం లేక "ఎవరి పేరు మీదయితే ఏముంది ఆస్తి అంకిత పేరు మీద రాస్తేనే చాలా మంచిది" అంటూ అభి రివర్స్ డ్రామా ఆడతాడు. మరో వైపు ప్రేమ్ తన ఫస్ట్ ఆల్బం కోసం స్పాన్సర్ ని వెతుక్కుంటూ ఒక ఆఫీస్ కి వెళ్తాడు. ఆ మేనేజర్ కి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడతాడు. ఆ మేనేజర్ నాలుగు చీవాట్లేసి గతంలో చేసిన ఆల్బమ్స్ ఉంటే రిఫరెన్స్ కోసం తీసుకురా అంటూ తిప్పి పంపించేస్తాడు. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం మా టీవీలో ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

కొత్తింటికి వచ్చిన బహుమతులు చూసి పొంగిపోయిన కెవ్వు కార్తిక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. షోస్ లో చేస్తూ ఒక్కో రూపాయి కూడబెట్టి సొంతింటిని సమకూర్చుకున్నారు కూడా. ఇక తన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి చాలా మంది ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, రియాలిటీ షోస్ లో కలిసి చేసిన మిత్రులంతా హాజరయ్యారు. ఐతే ఈ ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా బోల్డన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు కార్తీక్ కి.  సుమారు 700 మందికి పైగా కార్యక్రమానికి హాజరయ్యారని గిఫ్ట్స్ అన్ బాక్సింగ్ వీడియొలో చెప్పుకొచ్చాడు. కాకపొతే కొంత మంది హాజరు కాలేకపోయినా తమ ఇంట్లో వాళ్ళతో గిఫ్ట్స్ పంపించారని ఈ సందర్భంగా వాళ్లకు ఈ వీడియొ ద్వారా ప్రత్యేక కృతఙ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. చమ్మక్ చంద్ర వినాయకుడి లామినేషన్, ఆటో రాంప్రసాద్ డైనింగ్ సెట్, నరేష్ రెండు ఏనుగు బొమ్మలు, ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్స్, రాకెట్ రాఘవ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి తన ఛానల్ ఫాలో అయ్యేవాళ్లందరి కోసం వీడియొ చేసి పెట్టాడు. ఎక్కువగా దేవుడి బొమ్మలు, గోడ గడియారాలు, కిచెన్ సెట్స్, జ్యుసర్ సెట్స్ వచ్చాయి.  ఇక నెటిజన్స్ కూడా కార్తీక్ కి విషెస్ చెప్పారు. ఇంకా తాను పుట్టి పెరిగిన ఊరుకి సంబంధించి ఒక హోమ్ టూర్ వీడియొ చేయమంటూ కూడా చాలామంది కార్తిక్ ని  అడిగారు.