మాస్క్ మ్యాన్ హరీష్ సింపథీ డ్రామా.. డిఫెండ్ చేసుకోలేకపోయిన కామనర్స్!

  బిగ్‌బాస్ సీజన్-9 లో అప్పుడే రెండు వారాలు గడిచిపోయింది. రెండో వారం మర్యాద మనీష్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. సోమవారం నాటి ఎపిసోడ్ లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్స్ హీటెక్కించాయి. బిగ్‌బాస్ తెలివిగా రెండు గ్రూపుల్లోనూ వాళ్లలో వాళ్లు కొట్టుకు చచ్చేలా ఈ నామినేషన్స్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా టెనెంట్స్‌గా ఉన్న కామనర్లని ముందుగా సెలబ్రెటీల నుంచి నామినేషన్స్ చేయాలని చెప్పాడు. కానీ ఇందులో కంపల్సరీగా ఒకరు టెనెంట్ అయి ఉండాలని కండీషన్ పెట్టాడు. దాంతో రెండు గ్రూప్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. కామనర్లు అందరు చాలా సేపు తమ పాయింట్స్ డిస్కస్ చేసుకొని సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా సైనీలని నామినేట్ చేశారు. ముఖ్యంగా ప్రియ, శ్రీజ ఇద్దరు కలిసి రీతూ చౌదరిని నామినేట్ చేశారు. అయితే రీతూను కాపాడటానికి కెప్టెన్ డీమాన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ గట్టిగానే ట్రై చేశారు. కానీ ప్రియ, శ్రీజ, హరీష్ ఒప్పుకోకపోవడంతో రీతూని తీయలేకపోయారు. అయితే తర్వాత తమ నుంచి ఒకర్ని నామినేట్ చేయాలన్నప్పుడు అందరు కలిసి హరీష్‌ సెలెక్ట్ చేశారు. అయితే దీనికి హరీష్ ఒప్పుకోక.. ప్రతీ ఒక్కరిని వాయించి వదిలేశాడు. ముఖ్యంగా డీమాన్‌ని అయితే గట్టిగానే భయపెట్టాడు. సెలబ్రెటీల్లో నలుగుర్ని నామినేట్ చేసేసిన తర్వాత తమలో తాము ఎవరిని నామినేట్ చేయాలా అని టాపిక్ వచ్చింది. ముందుగా హరీష్ మాట్లాడాడు. నా వైపు నుంచి అయితే ప్రియ అనుకుంటున్నాను. ప్రియ ఎందుకంటే సండే రోజు ఎపిసోడ్ లో హోస్ట్ గారి ముందు స్టాండ్ సరిగా తీసుకోకుండా.. లేదు సర్ నేను తప్పు ఒప్పుకుంటున్నానని అన్నారు.. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే తను ఇప్పటికీ కూడా ఫుడ్ మానిటర్ అనుకుంటున్నారు.. ఆమె ఫుడ్ మానిటర్ కాదు కుకింగ్ మానిటర్.. రెండింటికీ తేడా ఉంది.. నాకు ఒక మాట నాకు చివుక్కుమంది.. మనీష్‌కి కూడా బాధ కలగడానికి అదే రీజన్.. ఓనర్స్ మైండ్‌ఫుల్‌గా చూసి తినండి అన్నారు.. ఆ మాట నాకు చివుక్కుమనిపించింది.. తినే ఒక్క ముద్ద కోసం ఈవిడ అలా అనేశారే.. అది లూజ్ టంగ్‌లా అనిపించింది నాకు.. ఆకలేసి లోపల పీకేస్తున్నా కూడా వణికేస్తున్నా కూడా కంట్రోల్ చేసుకున్నా ఠక్కుమని నోరుజారట్లేదంటూ హరీష్ తన నామినేషన్ పాయింట్లు చెప్పాడు. ఇలా మాస్క్ వేసుకొని ఫుడ్ తినలేదనే సింపథీ డ్రామాని ప్లే చేస్తున్నాడు హరీష్.  ఇక వెంటనే ప్రియ నా నామినేషన్ హరీష్ గారు.. అంటూ చెప్పింది. మీ పర్సనల్ అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండటమనేది నాకు అసలు నచ్చలేదు.. లాస్ట్ వీక్‌లో మీకు నాకు అసలు ఒక సంభాషణే రాలేదు.. అంటూ ప్రియ అంది. ఇక కామనర్స్ మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరిగాయి. ఇలా నామినేషన్స్‌ పూర్తయ్యే సరికి బోర్డ్ మీద పవన్ కళ్యాణ్, ప్రియ, శ్రీజ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా, రాము రాథోడ్ ఫొటోలు ఉన్నాయి. 

Jayam serial : రాజకుమారుడిని గంగకి చిన్ని చూపిస్తుందా.. సూపర్ ట్విస్ట్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -64 లో....గంగని ఇంట్లో వాళ్ళు అట పట్టిస్తారు. నీకు ఎలాంటి అతను కావాలని అడుగుతారు. నా రాజకుమారుడు ఎక్కడ ఉన్నాడోనని చిన్ని మాటలని గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత  గంగకి చిన్నీ ఫోన్ చేసి.. నా బడ్డీ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడికి వస్తే అతన్ని చూడొచ్చని చిన్ని చెప్తుంది. ఆ రాజకుమారుడినా.. తప్పకుండా చూడాలని గంగ అనుకుంటుంది. రుద్ర తీసుకున్న డ్రెస్ గంగ వేసుకుంటుంది. మరొకవైపు రుద్ర బాగా రెడీ అవుతాడు. అప్పుడే రుద్రకి చిన్ని వీడియో కాల్ చేసి ఎలా రెడీ అయ్యాడో చూస్తుంది. త్వరగా రమ్మని చిన్ని చెప్పగానే సరేనని రుద్ర గదిలో నుండి బయటకు వస్తాడు. గంగ కూడా అప్పుడే బయటకు వస్తుంది. రుద్ర సైలెంట్ గా కిందకి వెళ్తాడు. తన వెనకాలే గంగ వెళ్తుంది. ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారని ఇందుమతి అడుగుతుంది. నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నానని గంగ అంటుంది. ఒంటరిగా వద్దని చెప్పాను కదా అని రుద్ర అంటాడు. మరి మీరు నన్ను నా ఫ్రెండ్ దగ్గర వదిలెయ్యండి అని గంగ రిక్వెస్ట్ చెయ్యగానే రుద్ర సరే అంటాడు. ఆ తర్వాత గంగ స్కూల్ దగ్గర దిగుతుంది. రుద్ర కూడ నాకు ఇక్కడే వర్క్ ఉందని అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్తారు. రుద్రకి అప్పుడే ఇన్‌స్పెక్టర్ ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇచ్చిన అతను దొరికాడు వెంటనే రమ్మని చెప్తాడు. తరువాయి భాగంలో చిన్నిని గంగ కలిసి మాట్లాడుతుంది. గంగ వాళ్ళ అమ్మ ఫోటోని చిన్ని చూసి వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది. వెంటనే గంగ బయటకు వస్తుంటే.. రుద్ర ఎదురుపడుతాడు. గంగని పెళ్లి చేసుకోవాలనుకున్న అతను గంగని కిడ్నాప్ చెయ్యాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : బయటపడ్డ నిజం..రామరాజు ఏం చేయనున్నాడు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -270 లో... రామరాజు ఇంటికి వస్తాడు. ఎక్కడ శ్రీవల్లి ఫోటోస్ గురించి చెప్తుందోనని  త్వరగా భోజనం చెయ్యండి అని వేదవతి టెన్షన్ పడుతుంది. అదంతా రామరాజు చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. శ్రీవల్లిని వేదవతి పక్కకి తీసుకొని వెళ్లి ఫోటోస్ గురించి.. ఇప్పుడు అయనకి ఏం చెప్పొద్దని అంటుంది. నర్మద వచ్చి అదే విషయం శ్రీవల్లికి చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి లోపలికి వెళ్లి ఫోటోస్ కొరియర్ లో పెట్టుకొని బయటనుండి ఎవరో తీసుకొని వచ్చినట్లు తీసుకొని వచ్చి మావయ్య మీరు కొరియర్ అని ఇవ్వబోతుంటే నర్మద కొరియర్ లాక్కొబోతుంటే ఫోటోస్ కిందపడిపోతాయ్. అవి చూసి రామరాజు షాక్ అవుతాడు. శ్రీవల్లి లోపలికి వెళ్లి భాగ్యంకి ఫోన్ చేసి ప్రేమ గురించి ఇంట్లో తెలిసేలా చేసానని అంటుంది. ఆ తర్వాత ఫోటో లో ఉన్న అతన్ని చూసారా మావయ్య.. మొన్న ప్రేమ తన వెంట కర్ర పట్టుకొని వెంబడిస్తుంటే పేపర్ లో వచ్చిందని చెప్తుంది.ఏమై ఉంటుంది ప్రేమ, దోమ అనుకుంటా అని శ్రీవల్లి అనగానే శ్రీవల్లిపై రామరాజు కోప్పడతాడు. తెలుసుకోకుండా అలా మాట్లాడతారా అని రామరాజు అంటాడు. అప్పుడే రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను నీ చిన్న కోడలు ప్రేమించుకున్నామని చెప్తాడు అప్పుడే వెనకాల నుండి ధీరజ్ వచ్చి కళ్యాణ్ తలపై కొడుతాడు.  ఏంటి ఫోన్ కట్ అయిందని రామరాజు మళ్ళీ ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పారిజాతాన్ని చూసి భయపడిపోయిన జ్యోత్స్న.. దీప హ్యాపీ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -469 లో....జ్యోత్స్నని పారిజాతం కొడుతుంది. నేను నా రక్తసంబంధం వాల్లే సంతోషంగా ఉండాలనే స్వార్థపరురాలిని.. నేను అలా ఆలోచించబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావని పారిజాతం కోప్పడుతుంది. అసలు మావయ్యకి హెల్ప్ చెయ్యమని చెప్పిందే నేనని జ్యోత్స్న అంటుంటే.. నీ నాటకాలు నా దగ్గర కాదు ఇంకొకసారి నీ నాన్న, తమ్ముడు సహాయం కోసం వస్తే చెయ్.. లేదంటే నాకు చెప్పమని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆమ్మో గ్రానీ ఇంత వైలెంట్ గా ఉందేంటి.. కొంపదీసి నేనే తన కొడుకుని చంపాలని ట్రై చేసానని తెలిస్తే నన్ను చంపేస్తుందని.. తెలియకుండా జాగ్రత్తపడాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న మాటలకు కాంచన బాధపడుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. దీపకి నీకు ఒక బిడ్డ ఎందుకు ఉండకూడదని శౌర్యకి తోడుగా ఉంటుంది కదా అని కాంచన అనగానే అవన్నీ ఆలోచించకని కార్తీక్ అంటాడు. మరుసటి రోజు కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. మనమందరం కలిసి వెళ్లాడానికి వచ్చానని శ్రీధర్ అనగానే కాంచన కోపంగా మాట్లాడుతుంది. నా కోసం తనతో వెళదామని కార్తీక్ అంటాడు. దానికి కాంచన సరే అంటుంది. ఆ తర్వాత కాంచన కుటుంబం వస్తుందని సుమిత్ర అన్ని వంటలు చేస్తుంది. అప్పుడే కాంచన కుటుంబం వస్తుంది. అక్కడే ఉన్నావేంటి దీప.. మధ్యాహ్నం భోజనం టైమ్ అయింది రండి అనీ సుమిత్ర అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ ని ఇబ్బంది పెడుతున్న..కావ్యకి అబార్షన్ తప్పదా!

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -832 లో..... రాజ్ డిస్సపాయింట్ గా ఇంటికి వస్తాడు. అప్పుడే రాజ్ ని ఆఫీస్ కి వెళ్ళమని సుభాష్ అంటాడు. నేను వెళ్ళనని సుభాష్ పైకి రాజ్ గట్టిగా అరుస్తాడు రాజ్. దాంతో సుభాష్ బాధపడుతాడు. రాజ్ ఇలా ఎందుకు చేస్తున్నాడని అందరు షాక్ అవుతారు. రాజ్ లోపలికి వెళ్లి డాక్టర్ తో ఫోన్ మాట్లాడుతాడు. డాక్టర్ అబార్షన్ కాకుండా వేరొక ఛాన్స్ ఉంది కానీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే అని అతను చెప్తాడు. ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి కావ్య ఉంటుంది. అసలు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు. నాకు కళ్యాణ్ అంతా చెప్పాడు ఏదో ప్రాబ్లమ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాడు. ఏంటి అది అని కావ్య అడుగుతుంది. ఎన్నడు లేనిది మీ నాన్నని అన్ని మాటలు అన్నారు. అయన ఎంత బాధపడి ఉంటారని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత సుభాష్, అపర్ణ మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ వచ్చి నన్ను క్షమించండి నాన్న అని కాళ్ల పై పడబోతుంటే వద్దని సుభాష్ అంటాడు. నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటని రాజ్ ని సుభాష్ అడుగుతాడు. అది ఇప్పుడు చెప్పలేనని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో వదినకి అబార్షన్ చేయించు వేరే దారి లేదని రాజ్ తో కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తేజ గురించి రాశి సెన్సేషనల్ కామెంట్స్

  "సిలకేమో సీకాకుళం" అంటూ వెంకీ మూవీలో ఐటెం సాంగ్ చేసిన రాశి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆమె ఒకప్పుడు చాలా ఫామిలీ టైపు మూవీస్ చేశారు. శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి వాళ్లందరితో ఆమె నటించింది. అలాంటి రాశి కెరీర్ నిజం అనే మూవీతో ఆగిపోయింది. అలాగే డైరెక్టర్ తేజ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా కామెంట్స్ చేశారు. "చెప్పిన క్యారెక్టర్ ఒకటి చేయించింది ఇంకో క్యారెక్టర్ అని ఆ మూవీ వదిలేసి వెళ్లిపోయారు" అంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు రాశి జవాబిచ్చారు. "నాకు ఇలా చెప్పలేదు. తేజ గారు నన్ను ఆఫీస్ కి పిలిచారు. స్టోరీ చెప్పుకొచ్చారు. ఎలా అంటే గోపీచంద్ - మీకు మధ్య లవ్ ఉంటుంది ఇందులోకి మహేష్ బాబు గారు ఎంటరవుతారన్నారు. అప్పుడు మనం పాజిటివ్ గా ఫీలవుతామా, నెగటివ్ గానా...పాజిటివ్ గానే ఫీలవుతాం కదా. అంటే మహేష్ బాబును పొడవటం, మగరాయుడిలా ఉండటం, లెన్స్ పెట్టాలి, లుక్ మారాలి అని చెప్పి ట్రైనర్ ని పెట్టి వెయిట్ లాస్ చేయించారు. ఆ మూవీకి అసలు మేకప్ లేదు. లెన్స్, లిప్ స్టిక్, కాజల్ అంతే. ఫస్ట్ డే షూట్ కి వెళ్లాను చేయకూడని సీన్ ని ఫస్ట్ డేనే పెట్టేసారు. తర్వాత చేసి ఉన్నా వేరేగా ఉండేది. కానీ ఫస్ట్ సీనే అది. తర్వాత పక్కకొచ్చి మా అన్నయ్యతో, పిఆర్ఓతో చెప్పా నేను ఈ సినిమా చేయను అని..ఈ సీన్స్ గురించి ముందే చెప్పలేదు నాకు చెప్పకుండా చేయడం తప్పు నేను చేయను నాకు ఉండే ఇమేజ్ కి ఈ సినిమా చేస్తే నా కెరీర్ కి ఫుల్ స్టాప్ ఐపోతుంది అని చెప్పా. ఇక పిఆర్ఓ బాబురావు గారు వచ్చి సెట్ లో షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళిపోవడం అనేది చరిత్రలో లేదు అన్నారు. ఇంత ఓపెన్ గా మీడియా ముందు నేను ఇలా చెప్తున్నాను అంటే అది నిజం కాబట్టే కదా. అబద్దం ఐతే చెప్పలేను కదా నేను కూడా. నేను కూడా అయిష్టంగానే చేసాను. అలా సినిమా ఐపోయాక తేజ గారు కాల్ చేసి సారీ అన్నారు . నా రోల్ కి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. సారీని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసాను. ఈ మూవీ వరకు ఆయన అంటే కోపం. లేకుంటే తేజ గారితో నేను చాలా ట్రావెల్ చేశా. కేక మూవీకి, లక్ష్మి కళ్యాణం మూవీలో కాజల్ అగర్వాల్ కి నేనే డబ్బింగ్ చెప్పాను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ని మర్చిపోతారు అని ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగితె తేజ పేరే చెప్పాను. నన్ను డిజప్పోయింట్ చేస్తే పర్లేదు. ఆడియన్స్ ని డిజప్పోయింట్ చేయకూడదు కదా. నిజంగానే ఆ సినిమా నా కెరీర్ కి ఫుల్ స్టాప్ ఐపోయింది." అని చెప్పింది.

Jayam serial : విషం కలిపిన కేక్ తినేసిన రుద్ర.. గంగని కాపాడుకోగలడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -63 లో..... గంగ పుట్టినరోజు కోసం పెద్దసారు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరొకవైపు గంగని చంపాలని ఇషిక, వీరు ప్లాన్ చేసి కేక్ లో ఏదో కలుపుతారు. గంగ రెడి అయి కిందకి వస్తుంది. తనని చూసి శకుంతల ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత పెద్దసారు, శకుంతల దగ్గర గంగ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ కేక్ మొత్తం గంగకే తినిపించి మొత్తం పూయాలని ఇషిక అంటుంది. గంగ కేక్ కట్ చేస్తుంది. గంగకి శకుంతల కేక్ తినిపించుబోతుంటే రుద్ర తన చేతిలో నుండి కేక్ తీసుకొని తింటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఏంటి అలా చేసావని పెద్దసారు అడుగుతాడు. గంగ నా బాధ్యత ప్రొద్దున షాపింగ్ మాల్ లో తనపై ఎటాక్ జరిగింది. ఇప్పుడు కేక్ లో ఏదైనా కలిపి ఉండొచ్చు కదా అందుకే తిన్నానని రుద్ర అంటాడు. ఆ తర్వాత గంగకి శకుంతల కేక్ తినిపిస్తుంది.. అదంతా కిటికీలో నుండి లక్ష్మి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. లక్ష్మీ తిరిగి వెళ్తుంటే పైడిరాజు చూస్తాడు. తనని చూసి లక్ష్మీ భయపడుతుంది. ఇది నా భ్రమనా నిజంగానే వచ్చిందా అని  పైడిరాజు అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో  తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత 2...

పవన్ కళ్యాణ్ - రాశి నటించిన గోకులంలో సీత మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అప్పట్లో. ఐతే ఇప్పుడు రాశి ఆనాటి విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. "నా కూతురు ఫస్ట్ బర్త్ డేకి కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసాను. ఐతే అప్పటికి నేను ఏ అపాయింట్మెంట్ తీసుకోలేదు. నేను నా డ్రైవర్ కి చెప్పాను. అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాం మేడం అన్నాడు. సరే వాళ్ళ స్టాఫ్ కి పలానా ఆవిడ వచ్చారని చెప్పు అన్నాను. ఈ మాటలు కళ్యాణ్ గారి చెవిలో పడి అక్కడ నుంచి నన్ను పిలుస్తున్నారు. మా డ్రైవర్ ని మళ్ళీ నా దగ్గరకు పంపించి నన్ను తీసుకురమ్మని చెప్పారు.తిడుతున్నారు ఆవిడ వస్తే ఎందుకు అంత సేపు కూర్చోబెట్టారు అని. నేను వెళ్లాను ఒక 20 నిముషాలు మాట్లాడారు. గోకులంలో సీత మూవీ టైములో జరిగిన విషయాల గురించి మాట్లాడారు. నా ఫామిలీ గురించి ప్రతీ విషయం అడిగి తెలుసుకున్నారు. గోకులంలో సీత మూవీ చేస్తున్నప్పుడు హాయ్, హలో, బై తప్ప ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ఆయనకు సిగ్గు ఎక్కువ, డౌన్ టు ఎర్త్, అమ్మాయిలతో ఎక్కువగా కలవరు. ఇప్పుడు మాట్లాడేసరికి ఆనందంగా అనిపించింది. వీలయితే మా అమ్మాయి బర్త్ డేకి తప్పకుండా రావాలి అని అడిగాను. ఊళ్ళో ఉంటే డెఫినిట్ గా వస్తాను అని చెప్పారు. ఇక వెళ్లిపోయేటప్పుడు ఆయన కూడా లేచి కార్ వరకు వచ్చి నన్ను సాగనంపారు. అది కళ్యాణ్ గారు అంటే. గోకులంలో సీత 2  చేయాలనుకుంటున్నారా ..నేనైతే రెడీ అని చెప్పాను. పెళ్లయ్యాక కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు. పెళ్ళవక ముందు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది కదా పెళ్లయ్యాక శ్రీరామచంద్రుడు అయ్యారా..శ్రీకృష్ణుడయ్యాడా అన్నది ఉంటుంది" అంటూ నవ్వుతూ చెప్పింది రాశి.

Bigg boss 9 Telugu: హౌస్ లో టాప్-3, బాటమ్-3 ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-9 తెలుగు మొదలై అప్పుడే రెండు వారాలైంది. సెకెండ్ వీక్ లో‌ కంటెస్టెంట్స్ ఆట రెట్టింపు అయింది. ఇమ్మాన్యుయల్, తనూజ ఎమోషనల్ అవ్వడం.. రీతు ప్లాన్ వల్ల డీమాన్  పవన్ కెప్టెన్ అవ్వడం.. రీతూని, డీమాన్ పవన్, ని ఫ్లోరా సైనీని నాగార్జున తిట్టడం.. ఇవన్నీ ఆడియన్స్ కి ఫుల్ ప్యాక్ మిక్స్ డ్ ఎమోషన్స్ ని ఇచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లో సొంతంగా గేమ్  ప్లాన్ చేసినా కూడా వారు గేమ్ ఆడకపోతే హౌస్ నుండి బయటకి రావాల్సిందే. మర్యాద మనీష్ ది అలాగే జరిగింది. తను సరిగ్గా ఆడకుండా భరణిని స్నేక్ అని నోటికొచ్చినట్టు వాగాడు. అతని ఆటతీరుని చూస్తే కామన్ మ్యాన్ కాదు.. బయటున్న లోపలున్నా ఒకటే అనిపించింది. నామినేషన్ ముగిసేసరికి ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్ ఉండగా మర్యాద మనీష్ ని ఎలిమినేషన్ గా ప్రకటించాడు నాగార్జున. ఇక స్టేజ్ మీదకి వచ్చిన మనీష్ ఇంకా షాక్ లోనే ఉన్నానని చెప్పాడు. ఇక హౌస్ లో ఎవరు టాప్-3, ఎవరు బాటమ్-3 అని మర్యాద మనీష్ ని నాగార్జున అడిగాడు.  సుమన్‌శెట్టి, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజలు తమ ఆటతీరును మెరుగుపరచుకోవాలని సూచిస్తూ వారిని బాటమ్-3లో ఉంచాడు. ఈ ఇక టాప్-3 ఎవరని అడుగా... భరణి, ఇమ్మాన్యుయల్, సంజన మరియు హరిత హరీష్‌ల పేర్లు చెప్పాడు. ఇక వారి ఆటతీరును మెచ్చుకున్నారు. అంతేకాకుండా, ఒక కంటెస్టెంట్‌పై 'బిగ్ బాంబ్' వేయమని నాగార్జున చెప్పాడు. ప్రియకు బాత్రూమ్ డ్యూటీని అప్పగించాడు‌ మనీష్. హౌస్ లో మనీష్ ఆటతీరు ఎలా అనిపించింది. అతని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనిపిస్తే కామెంట్ చేయండి.

Maryadha manish eliminated : బిగ్‌బాస్‌ నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌!

బిగ్ బాస్ సీజన్-9(Bigg boss 9 Telugu) రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటివారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్లలో మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డీమాన్ పవన్, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, మరియు భరణి ఉన్నారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరిని సేవ్ చేయలేదు నాగార్జున. నిన్నటి సండే ఎపిసోడ్ లోనే అందరిని సేవ్ చేసి చివరి వరకు ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్ ని ఉంచారు. అయితే కామనర్ గా వచ్చిన మర్యాద మనీష్ కి ఓట్ బ్యాకింగ్ అంతగా లేదు. పైగా అతని ఆటతీరు కూడా పెద్దగా కనపడలేదు. అయితే ఫ్లోరా సైనీ ఫస్ట్ వీక్ ఓటింగ్ లో ఉండటం, ఈ వీక్ లో ఉండటం తనకి కలిసొచ్చింది. అందుకే మర్యాద మనీష్(Maryadha manish) కన్నా అత్యధిక ఓట్లు పడ్డాయి. సుమన్ శెట్టి(Suman Shetty)  రెండు వారాలు నామినేషన్లో‌ ఉండటం మరియు అతనికి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండటంతో అతను అత్యధిక ఓటింగ్ తో‌ నెంబర్ వన్ లో నిలిచాడు.  ఇక సండే ఫన్ డే అంటు కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిస్తూ, ఆటలు ఆడిస్తూ, మధ్య మధ్యలో నామినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చివరికి ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్‌ మిగిలారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్తారని అందరిలో ఉత్కంఠ పెరిగింది. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఫ్లోరా సైనీ సేఫ్ అయ్యింది. దీంతో మనీష్ బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 

అమ్మాయిలను నమ్మకండి...జనరేషన్ బాలేదు...తెలియకుండా మోసపోయాను

బుల్లితెర మీద నిఖిల్ - కావ్య జోడి ఎంత ఫేమ్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ జోడి ఆడియన్స్ కి కూడా నచ్చింది. వీళ్ళు పెళ్లి చేసేసుకుంటారు అనుకున్న టైములో ఇద్దరూ అనుకోని కారణాలతో విడిపోయారు. ఇక ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. షోస్ లో ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఐతే ఈ వారం సుమ అడ్డా షోలో "సం ఫైర్ మొమెంట్స్" పేరుతో సుమ ఒక కాన్సెప్ట్ నిర్వహించింది. ఇక ఈ షోకి నిఖిల్, ప్రేరణ, మణికంఠ, వచ్చారు. ఇక నిఖిల్ తో మొదలు పెట్టింది సుమ. నిఖిల్ రావడమే ప్రేమ అనే బోర్డు తీసి కాల్చేశాడు. ప్రేమ అనే దాని మీద తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. "చూజ్ వైజ్లీ, సెలెక్ట్ వైజ్లీ అని ఇందులో నాది కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తెలియకుండా మోసపోయాను. ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే మీ పక్కన ఎవరు ఉండాలో డిసైడ్ చేసుకోవాలి జాగ్రత్తగా. అంత ఈజీగా నమ్మకండి జనరేషన్ అస్సలు బాలేదు. ప్రేమ అనేది అంత ఈజీ కాదు కాంప్లికేటెడ్. ఇద్దరి సైడ్ నుంచి అండర్స్టాండింగ్ ఉంటే ఫ్రెండ్ షిప్ కానీ ప్రేమ కానీ నిలబడుతుంది. అందుకే ఈ ప్రేమను నేను నిప్పుల్లో వేసి బూడిద చేస్తున్నా. ఈ ప్రేమలో ఉన్న నెగటివిటీ మొత్తం కాలిపోయి అందరికీ పోజిటివిటీని పంచాలని కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక కొన్ని టీవీ షోస్ లో నిఖిల్ ఎదురుపడిన చూడకుండా వెళ్ళిపోతోంది. ఇక నిఖిల్ కూడా కావ్యకు దూరంగా ఉంటున్నాడు. గోరింటాకు సీరియల్ టైం నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరికి వారుగా ఉన్నారు.

రాజ్ విశ్వప్రయత్నాలు.. కావ్యకి నిజం తెలిసిందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -831 లో..... డాక్టర్ దగ్గరికి రాజ్ వచ్చి తల్లి బిడ్డని కాపాడే మార్గం చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాడు. వేరే ఆప్షన్ లేదు.. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అబార్షన్ చేయించండి అని డాక్టర్ చెప్తుంది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది.. మా వాళ్ళ కాదని చేతులు దులుపుకుంటారు.. ఎందుకు అలాంటప్పుడు హాస్పిటల్ లు మీరు ఎందుకు అని డాక్టర్ పై రాజ్ సీరియస్ అవుతాడు. రాజ్ కోపంగా బయటకి వస్తాడు. సారీ డాక్టర్ అని కళ్యాణ్ చెప్తాడు. అర్థం చేసుకోగలను కానీ మీరు అయితే త్వరగా అబార్షన్ చేయించండి అని డాక్టర్ చెప్తుంది. రాజ్ దగ్గరికి కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావని అంటాడు. నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేసానని కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి ఈ అవతారం ఏదో పనికి వెళ్లినట్టు అని స్వప్న అనగానే నిజంగానే పనికి వెళ్ళాను.. మూటలు మోసి వచ్చాను.. ఇదిగో వెయ్యి రూపాయలు అని స్వప్న చేతికి రాహుల్ డబ్బు ఇస్తాడు. ఎంటి ఇంత మార్పు అని స్వప్న అనగానే అంటే నా కూతురు కోసమని రాహుల్ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. మరొకవైపు రాజ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. కావ్య గురించి చెప్పి రిపోర్ట్స్ పంపిస్తాడు. అవి చూసి అతను కూడా అబార్షన్ చెయ్యాలని చెప్పడంతో రాజ్ ఇంకా ఫ్రస్ట్రేషన్ అవుతాడు. రాజ్ ఇంటికి రాగానే రాజ్ ఆఫీస్ కి వెళ్ళు అని సుభాష్ అంటాడు. నేను వెళ్ళనని రాజ్ తన తండ్రి సుభాష్ పై సీరియస్ అవుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ ఒక డాక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. మీ భార్యకి అబార్షన్ కాకుండా ఒక ఛాన్స్ ఉంది. అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటుంది. రాజ్ ఫోన్ మాట్లాడి వెనక్కి చూసేసరికి కావ్య ఉంటుంది. నాకు కళ్యాణ్ అంతా చెప్పాడని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జ్యోత్స్నని చితకబాదిన పారిజాతం.. సంతోషంలో శివన్నారాయణ కుటుంబం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -468 లో.....దీపని క్షమించు అత్త అని సుమిత్రతో కార్తీక్ అంటాడు. మావయ్య మీరు అత్తని క్షమించండి.. ఎందుకు మనకి గొడవలు.. ముందులా మనం సంతోషంగా ఉండలేమా అని దశరథ్ తో కార్తీక్ అంటాడు. నేను దీపని క్షమించాలంటే మీ మావయ్య నన్ను క్షమించాలని సుమిత్ర అంటుంది. నేను కాదు క్షమించల్సింది నా చెల్లి అని దశరథ్ అంటాడు. నా కోడలిని క్షమిస్తే నేను నిన్ను క్షమించినట్లేనని కాంచన అంటుంది. సరే నేను దీపని క్షమిస్తానని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. రేపు నేనొక నిర్ణయం తీసుకోబోతున్నాను.. అందరు మా ఇంటికి రండి.. విందు రెడీ చేస్తానని సుమిత్ర అందరిని ఆహ్వానిస్తుంది. సుమిత్ర వెళ్తు అందరికి చెప్తుంది. దీపకి కూడా చెప్తుంది. దాంతో దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న డిస్సపాయింట్ అవుతుంది. నేను కూడా మీ కుటుంబంలో ఒకవాడిని అని మర్చిపోకండి అని కాంచన వాళ్ళతో శ్రీధర్ అంటాడు. శివన్నారాయణ, దశరథ్ జరిగింది గుర్తుచేసుకొని సంతోషంగా మాట్లాడుకుంటారు. చాలా రోజులకి మీరు సంతోషంగా ఉన్నారు నాన్న అని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. మరొకవైపు శ్రీధర్ కి డ్రింక్ తీసుకొని వస్తుంది కావేరి. కార్తీక్ ప్రాణధాత దీప అని తెలిసి స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని శ్రీధర్ తో కావేరి అంటుంది. నా కొడుకు ప్రాణాలు కాపాడింది కోడలా.. తనకి నేను ఎప్పటికీ బుణపడి ఉంటాను. మిమ్మల్ని ఆ కుటుంబానికి దగ్గర చెయ్యమని దీపని అడగాలనుకుంటున్నానని శ్రీధర్ అనగానే కావేరి సంతోషపడుతుంది. అదంతా స్వప్న విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఏంటి గ్రానీ నాకు సపోర్ట్ చేయకుండా దీపకి చేస్తున్నావని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. కాశీ గాడి గురించి నాకు ఎందుకు చెప్పలేదని జ్యోత్స్నని కొట్టిన చోట కొట్టకుండా బాదుతుంది పారిజాతం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కళ్యాణ్ కుట్ర.. వాళ్ళిద్దరి ఫోటోని చూసేసిన రామరాజు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -269 లో..... కళ్యాణ్ తన ఫ్రెండ్ కి పెన్ డ్రైవ్ ఇచ్చి రామరాజుకి ఇవ్వమని చెప్తాడు. అతను రామరాజు కి ఇచ్చి వెళ్తాడు. ఇందులో ఏముందని తిరుపతిని అడుగుతాడు రామరాజు. అది లాప్ ట్యాప్ లో పెట్టి చూడాలని అతను అంటాడు. పక్కనున్న అబ్బాయి దగ్గర లాప్ ట్యాప్ తీసుకొని పెన్ డ్రైవ్ అందులో పెట్టి చూస్తారు. కరెక్ట్ టైమ్ కి ధీరజ్ వచ్చి అవి నా ఎగ్జామ్ రిజల్ట్స్.. అవి చూసి మీరు నన్ను తిట్టాలని.. నా ఫ్రెండ్స్ ఇలా చేశారని ధీరజ్.. ఆ పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ ఫ్రెండ్స్ ప్రేమ దగ్గరికి వచ్చి.. నీతో పక్కనున్న అబ్బాయి ఎవరు.. ఫోటో బ్లర్ లో ఉంది.. త్వరలో రివీల్ చేస్తామని చెప్తారు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. మరొకవైపు భాగ్యం, ఆనందరావుని శ్రీవల్లి కలిసి ప్రేమ విషయం చెప్తుంది. ఎలాగైనా అసలు విషయం కనిపెట్టాలని శ్రీవల్లి వాళ్ళతో చెప్తుంది. మరొకవైపు ప్రేమ ఎందుకో టెన్షన్ పడుతుందిరా అని తిరుపతితో రామరాజు  అంటాడు.  మరొకవైపు ధీరజ్ కి ప్రేమ ఫోన్ చేసి కళ్యాణ్ నా జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నాడని చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు.. నేను వాడి గురించి వెతుకుతున్నానని ధీరజ్ అంటాడు. మరొకవైపు రామరాజు ఇంటికి వస్తాడు. శ్రీవల్లి తన దగ్గరున్న కొరియర్ రామరాజుకి ఇవ్వాలని ట్రై చేస్తుంది. రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. తరువాయి భాగంలో ప్రేమ, కళ్యాణ్ ఉన్న ఫోటోని రామరాజు చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గంగ పుట్టిరోజు వేడుకకు వాళ్ళ అమ్మని తీసుకొచ్చిన పెద్దసారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -62 లో.....గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. గంగ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అందరు తనకి బర్త్ డే విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేస్తారు. దాంతో గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు వెళ్లి రెడీ అయి రా.. తర్వాత కేక్ కట్ చెయ్యాలని పెద్దసారు చెప్తాడు. గంగ లోపలికి వెళ్తుంది. గంగ పుట్టినరోజు వేడుకలు గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ చూడాలని లక్ష్మిని పెద్దసారు ఎవరు చూడకుండా ఇంటికి పిలుస్తాడు. పైడిరాజు వస్తుంటే లక్ష్మీ ఎదరుపడుతుంది. నా భార్య అని కళ్ళు నులముకొని చూసేలోపే లక్ష్మీ దాక్కుంటుంది. నా భ్రమ అయి ఉంటుందని పైడిరాజు అనుకుంటాడు. ఎందుకు వచ్చావని పెద్దసారు కోప్పడతాడు. మందుకి డబ్బు నా కూతురు దగ్గర తీసుకుందామని అని పైడిరాజు అనగానే.. ఇప్పుడు వెళ్లి గంగ దగ్గర ఏం వాగుతాడో ఏంటోనని పెద్దసారే పైడిరాజుకి మందుకి డబ్బు ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత లక్ష్మీని పిలిచి నువ్వు ఎవరు చూడకుండా ఆ కిటికీ దగ్గర నిల్చొని చూడు.. గంగ కేక్ కట్ చేసేది కనిపిస్తుందని పెద్దసారు అంటాడు. మరొక వైపు ఇంట్లో వాళ్లంతా బెలూన్ లతో డెకరేషన్ చేస్తారు. గంగ బర్త్ డే అని ముందే తెలిసి ఉంటే గిఫ్ట్ తీసుకొని వచ్చేవాళ్ళమని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అసలు రుద్ర అన్నయ్య తనని షాపింగ్ కి తీసుకొని వెళ్లి డ్రెస్ కొనివ్వడమే పెద్ద గిఫ్ట్ అని వంశీ అంటాడు. గంగ రెడీ అయి వచ్చి కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కెప్టెన్సీ రద్దు చేసిన నాగార్జున.. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి!

బిగ్ బాస్ ప్రేక్షకులకు వీకెండ్ అంటే పండుగే. ఎందుకంటే ప్రతీ వారం మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని నాగార్జున మెచ్చుకుంటూ.. పర్ఫామెన్స్ ఇవ్వని వాళ్లకి చివాట్లు పెడతాడు. అయితే ఈ వారం రీతూకి గట్టిగా ఇచ్చుకున్నాడు నాగార్జున. అసలు విషయానికి వస్తే రీతూకి పవన్ డిమాన్ కెప్టెన్ కావాలని ఉండే.. అందుకే తనకి ఫేవర్ గా నిర్ణయం చెప్పింది. రంగు పడుద్ది టాస్క్ లో సంఛాలక్ మాట లెక్కచెయ్యకుండా ఆపండి అంటున్నా కూడా ఆపకుండా రంగు పూస్తున్నావంటూ భరణిని టాస్క్ నుండి తొలగించింది రీతూ. అసలు నిజం ఏంటంటే ఆపండి అన్నా ఆగకుండా రంగు పూసింది డీమాన్ పవన్. కానీ అతనే కెప్టెన్ అని ఫైనల్ లో చెప్పేసింది రీతూ. ఆ డెసిషన్ ఎంత మంది తప్పు అంటున్నారని అడుగగా అందరు తప్పు అనేదే అని అంటారు. అంతే కాకుండా టాస్క్ ముందు రీతూకి డీమాన్ పవన్ చాక్లెట్ తీసుకొని వచ్చి ఇవ్వడం నువ్వు కెప్టెన్ అయితే చూడాలని ఉందని రీతూ చెప్పడం అదంతా నాగార్జున వీడియో ప్లే చేసి చూపించడంతో రీతూకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు పాపం. ఇక అంతా అయ్యాక నేను అప్పుడు అంత గమనించలేదని మెల్లిగా సారీ చెప్తుంది రీతూ. రాంగ్ డెసిషన్ వల్ల వచ్చిన కెప్టెన్సీ వద్దు సర్.. నేను ఆడి గెలుచుకుంటానని డీమాన్ పవన్ అనగానే నాగార్జున తన కెప్టెన్సీ రద్దు చేస్తాడు. కెప్టెన్ బ్యాండ్ తన దగ్గర నుండి తీసుకుంటాడు. ఇలా ఒక కెప్టెన్ ని రద్దు చెయ్యడమనేది బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారీ.

మాస్క్ మ్యాన్ హరీష్ భార్యతో మాట్లాడిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్-9 లో  కామనర్స్ స్పెషల్. ఎందుకంటే వాళ్ళు అగ్నిపరీక్షలో గెలిచి ఇందులోకి వచ్చారు. కామనర్స్ లో మాస్క్ వేసుకొని వచ్చి హరీష్ అందరిని ఆశ్చర్యపరిచాడు. మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్. తనకంటూ విభిన్న మనస్తత్వంతో జడ్జెస్ ని ఆకట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో అందరు ఒకటి అంటే తనొకటి అంటాడు. బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు అత్యధిక నామినేషన్లు పడ్డ కంటెస్టెంట్ హరిత హరీష్. కొన్ని రోజులుగా హౌస్ లో భోజనం చెయ్యడం లేదు.. నేను వెళ్ళిపోతాను.. ఇప్పుడున్న సిచువేషన్ లో నన్ను నా ఫ్యామిలీనీ సొసైటీ ఎలా చూస్తుందోనని ఓవర్ థింకింగ్ చేస్తూ నేను వెళ్ళిపోతానని అంటున్నాడని నాగార్జున చెప్పుకొచ్చాడు కానీ దానికి సంబంధించినది మాత్రం ఎపిసోడ్ లో టెలికాస్ట్ చెయ్యలేదు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో మాస్క్ మ్యాన్ హరీష్ భార్య హరితతో నాగార్జున మాట్లాడాడు. మీరు మీ ఫ్యామిలీ బాగున్నారా.. ఎందుకు హరీష్ అలా ఫీల్ అవుతున్నాడని హరితని నాగార్జున అడిగాడు. అంటే నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చాడు కదా అలా ఆలోచిస్తున్నాడని హరిత చెప్తుంది. మీరు ఏం హరీష్ గురించి టెన్షన్ పడకండి తను బాగున్నాడు అన్నం తింటున్నాడని నాగార్జున చెప్తాడు. తనలో ఉన్న హ్యూమర్ ఇంకా బయటకు రాలేదు. తనకి నేను చెప్పినట్టుగా చెప్పండి అసలు హౌస్ లోకి ఏ పర్పస్ పై వెళ్ళావ్.. ఎందుకు వెళ్ళావ్.. వాట్ నెక్స్ట్ .. ఈ ముడు గుర్తు పెట్టుకొమ్మని చెప్పండి అని నాగార్జునతో  హరిత చెప్తుంది. తన మాటలకి నాగార్జున ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత ఎపిసోడ్ మధ్యలో హరీష్ తో నాగార్జున మాట్లాడతాడు. ఇప్పుడే మీ వైఫ్ హరితతో మాట్లాడాను.. వాళ్ళు బాగున్నారు.. నీకు ముడు విషయాలు హరిత చెప్పిందని నాగార్జున చెప్పగానే హరిష్ ఎమోషనల్ అవుతాడు.. కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తాడు. తన భార్య చెప్పిన మాటలని హరీష్ అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఎప్పుడు వెళ్తావ్ హౌస్ నుండి అని నాగార్జున అడుగగా లేదని, వెళ్ళనని హరిష్ అంటాడు.  

బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సెలబ్రిటీస్.. వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కామనర్స్!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై రెండు వారాలవుతుంది. ఇప్పటివరకు కామనర్స్ ఓనర్స్ గా.... సెలబ్రిటీలు టెనెంట్స్ గా ఉన్నారు. రాజభోగాలు అనుభవిస్తూనే ఓనర్స్ ఉండగా చాకిరి చెయ్యడానికే హౌస్ లోకి వెళ్లినట్లు అన్ని పనులు చేస్తూ టెనెంట్స్(సెలెబ్రిటీస్) కష్టపడుతున్నారు. ఏది తినాలన్న ఓనర్స్(కామనర్స్) పర్మిషన్ ఉండాల్సిందే ‌.. ఇప్పటివరకు  టెనెంట్స్ ని ఓనర్స్ పురుగుల్లా చూసారు. ఓనర్స్ ఏ విషయంలో క్లారిటీగా లేరు.. ఇక నాగార్జున తన ముందున్న బోర్డు పై కంటెస్టెంట్స్ ఫోటోస్ ఉంచాడు. ఎవరికి రంగు పడుద్దో చూద్దామని నాగార్జున అనగా కంటెస్టెంట్స్ అంతా టెన్షన్ ఫీల్ అయ్యారు. ఈ వారంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ ఫోటోకి రంగు పూయలేదు. వరెస్ట్ పర్ఫామెన్స్ఇచ్చిన వాళ్ళకి రంగు పూసాడు. అయితే ఓనర్స్ లో  అందరికి రంగు పడుద్ది.. టెనెంట్స్ లో ఒక్క రీతూకి తప్ప ఎవరి ఫోటోకి రంగు పడదు. దాంతో ఒనర్స్ కి గట్టిగానే క్లాస్ తీసుకున్న నాగార్జున.. వాళ్ళకి ఒక  ట్విస్ట్ ఇచ్చాడు. ఇక నుండి బిగ్ బాస్ రూల్ చేంజ్.‌ ఇప్పటివరకు కామనర్స్ ఓనర్స్ గా సెలబ్రిటీలు టెనెంట్స్ గా ఉన్నారు.. కానీ ఇప్పుడు రివర్స్.. సెలబ్రిటీలు ఓనర్స్ గా.. కామనర్స్ రెంటర్స్ గా ఉంటారని ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు నాగార్జున. ఇక భరణి, రాము వాళ్ళు అడి గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఓనర్స్ గానే ఉంటారని నాగార్జున చెప్తాడు. ఇకనుండి కామనర్స్ కి చుక్కలే.

శ్రీజ, ప్రియాని ఏకిపారేసిన నాగార్జున.. సుమన్ శెట్టి పంచ్! 

బిగ్ బాస్ సీజన్-9 మొదలై రెండు వారాలు పూర్తి కాబోతుంది. ఇందులోకి మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి ఇద్దరు కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరంతా అగ్నిపరీక్షలో జడ్జెస్ ని ఇంప్రెస్ చేసి హౌస్ లోకి వచ్చారు. కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చిన వీళ్లపై ఆడియన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి కానీ రెండు వారాలు గడుస్తున్నా వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వలేదు. ఇక దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి  ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఏదో ఆడతారని నవదీప వాళ్ళని లోపలికి పంపించాడు కానీ తీరా చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి టాపిక్ ని తీసుకొని దాని గురించి మాట్లాడుతూ అందరికి చిరాకు తెప్పిస్తున్నారు. వీళ్ళిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మాములుగా రావడం లేదు.  వీకెండ్ ఎపిసోడ్ లో రెండు టాస్క్ లకి ప్రియ సంఛాలాక్ గా ఉంది‌. తను సంఛాలక్ గా ఉన్న రెండు టాస్క్ లకి కూడా రాంగ్ డెసిషన్ ఇచ్చింది. తను ఇచ్చిన రాంగ్ డెసిషన్స్ ని నాగార్జున ఆధారాలతో సహా వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అది చూసి ప్రియకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు.. కాలచక్రం టాస్క్ లో తప్పు నిర్ణయం తీసుకుంది.. అలాగే రెంటర్స్ లో ఒకరు పర్మినెంట్ ఓనర్ అయ్యే టాస్క్ లో సుమన్ శెట్టిని రాంగ్ డెసిషన్ తో తప్పించింది. ఆ టాస్క్ లో సుమన్ శెట్టి చేతిలో క్లాత్ ఉంటుంది. దానిని లాగడానికి ఫ్లోరా, సంజన ప్రయత్నించగా సుమన్ శెట్టి తన చేతితో క్లాత్ ని కొడతాడు. కానీ ఫ్లోరా, సంజనని కొట్టాడని టాస్క్ నుండి ఎలిమినేట్ చేస్తుంది ప్రియ‌. ఆ వీడియోని బిగ్ స్క్రీన్ పై నాగార్జున ప్లే చేసి చూపిస్తాడు. సారీ అన్నా అని సుమన్ శెట్టితో ప్రియా చెప్తుంది. ఇప్పుడు ఓనర్ అయ్యే టాస్క్ అయిపోయింది కదా ఇప్పుడేం చేయలేము..  ఇప్పుడు ఓనర్ గా నాకు ఛాన్స్ ఇస్తారంటే నీ సారీ ఆక్సెప్ట్ చేస్తానని ప్రియకి సుమన్ శెట్టి(Suman Shetty) కౌంటర్ వేస్తాడు. దాంతో నాగార్జున నవ్వుకుంటాడు. ఇక వీకెండ్ లో ప్రతీదానికి అవసరమున్నా లేకపోయినా మేం మాట్లాడుతామంటూ హ్యాండ్ రేస్ చేస్తున్నారు ప్రియా, శ్రీజ. దాంతో నాగార్జునకి కోపం వచ్చి ప్రతీసారీ మాట్లాడుతుంటే మధ్యలో వస్తారు. ఎందుకు ఎప్పుడు ఎదుటి వారిలో తప్పు వెతికే పనిలోనే ఉంటారని నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్ వేస్తాడు నాగార్జున.