Karthika Deepam2 : షాక్ ఇచ్చిన సుమిత్ర..దానికి దీప అంగీకరిస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -471 లో...... నేను దీపని క్షమించాలంటే ఒక కండిషన్ ఉంది.. తను జ్యోత్స్నని చంపబోతుంటే ఆ బుల్లెట్ నా భర్తకి తగిలిందని ఒప్పుకోవాలని సుమిత్ర అనగానే అలా ఎలా ఒప్పుకుంటుందని కార్తీక్ అంటాడు. ఒప్పుకుంటానని దీప అంటుంది. చెయ్యని తప్పుని ఎందుకు ఒప్పుకుంటావని దీపతో కార్తీక్ అంటాడు. నువ్వు తప్పు చేసావ్ అది ఒప్పుకోమ్మంటున్నా.. నేను తప్పు చేసాను ఒప్పుకున్నా.. దీప ఒప్పుకోకుంటే మాత్రం నేను క్షమించనని సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. దీప తప్పు చేయలేదని కోర్ట్ నమ్మింది.. మావయ్యకి తగిలిన బుల్లెట్ దీప పట్టుకుని గన్ లో నుండి రాలేదని కోర్ట్ చెప్పిందని కార్తీక్ అంటాడు. నా దృష్టిలో దీప ఎప్పుడు దోషినే అని సుమిత్ర అనగానే దీప బాధపడుతుంది. ఇక ఒప్పుకుంటే వెళ్లిపోండి అని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళు ఇంటికి వస్తారు. ఎందుకు బావ నేను ఒప్పుకుంటే రెండు కుటుంబాలు కలిసేవి కదా అని కార్తీక్ తో దీప అంటుంది. శ్రీధర్ కూడా అదే మాట అంటాడు. ఇప్పుడు దీప ఒప్పుకుంటే కోర్ట్ లో కేసు ఇంకా నడుస్తుంది. దీప ఒప్పుకున్న మాటలని సాక్ష్యాలుగా చేస్తారు ఆ జ్యోత్స్న వాళ్ళు.. అప్పుడు దీపకి శిక్ష పడుతుందని కార్తీక్ అంటాడు. అమ్మ నువ్వు దీప తప్పు చేసిందని నమ్ముతున్నావా అని కార్తీక్ అడుగగా లేదని కాంచన అంటుంది నేను మౌనంగా ఉండడానికి కారణం మా వదిన ఎంత దెబ్బ కొట్టింది రా అని కాంచన ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : హాస్పిటల్ కి వెళ్ళిన రాజ్, కావ్య..‌ ఏం జరగనుంది!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -834 లో.. కావ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా ప్రేమ పెంచుకుంటుంది. అలా ఎందుకు పెంచుకుంటున్నావని రాజ్ అంటాడు. మన ప్రేమకి ప్రతిరూపం ఈ బిడ్డ.. ప్రేమ పెంచుకోకుండా ఎలా ఉంటానని కావ్య అంటుంది. మరొకవైపు సుభాష్, ప్రకాష్ ఇద్దరు ఆఫీస్ కి బయల్దేరి వెళ్తుంటే .. నా దిష్టి తగిలేలా ఉందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి.. నా కొడుకు కి మాత్రం అన్యాయం జరుగుతుందని అంటుంది. రాహుల్ వచ్చి నాకు కంపెనీని చూసుకునే సామర్థ్యం లేదు మమ్మీ అని రాహుల్ తను మారిపోయినట్లు ఇంట్లో వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కావ్య, రాజ్ హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అయి కిందకి వస్తారు. మొన్నే వెళ్లారు కదా మళ్ళీ ఎందుకని అపర్ణ వాళ్ళు అంటారు. వెళ్తే ఏంటి లోపల బేబీ కండిషన్ ఏంటో తెలుసుకోవాలి కదా అని రాజ్ అంటాడు.  కళ్యాణ్ లోపలికి రాగానే.. అసలు ఏం జరుగుతుంది బావకి నిజం చెప్పాక ఏం అన్నాడు నాకు ఏం చెప్పట్లేదని అప్పు అడుగుతుంది. కళ్యాణ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రాజ్ కావ్య హాస్పిటల్ కి వెళ్తారు. కావ్య బయట కూర్చొని ఉంటుంది. రాజ్ ఒక్కడే డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg boss 9 Telugu Voting:  దుమ్ములేపిన ఫ్లోరా సైనీ.. ప్రియా శెట్టి ఎలిమినేషన్ కన్ఫమ్!

బిగ్ బాస్ సీజన్-9 మూడో వారానికి వచ్చేసింది. ఇక నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ఏంటి.. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. మరి ఫస్ట్ టూ వీక్స్ లో బయటకు వెళ్తుందనుకున్న ఫ్లోరా సైనీ ఈ వారం వెళ్తుందా లేదా కామనర్స్ నుండి ఒకరు వెళ్తారా ఓసారి చూసేద్దాం. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రియా శెట్టి, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, రాము రాథోడ్, ఫ్లోరా సైనీ.. ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా ఫ్లోరా సైనీ 30 శాతం ఓట్లతో అందరికంటే ముందున్నది. ఆ తరువాత స్థానంలో 25 శాతం ఓట్లతో రాము రాథోడ్ ఉన్నాడు. దాదాపు మెజారిటీ ఓట్లన్నీ ఈ ఇద్దరే పంచేసుకుంటున్నారు. ఇక మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్‌ 20 శాతం ఓట్లతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కి 10 శాతం ఓట్లు పడుతుంటే.. రీతూ చౌదరికి 8 శాతం ఓట్లు పడుతున్నాయి. ఇక ప్రియశెట్టికి కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే పడుతున్నాయి. తొలిరోజు ఓటింగ్‌ని బట్టి చూస్తే.. ప్రియ శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.  కామనర్స్ ని బయటకు పంపించేయ్యాలని బిబి ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ ఏం ఇవ్వడం లేదు.. పైగా ఎంటర్ టైన్ చేసేవాళ్ళని క్రింజ్ కామెడీ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే వీరిని వీలైనంత త్వరగా బయటకు పంపించెయ్యాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ వారం కామనర్స్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.  

జానీ మాస్టర్ కి ప్రభుదేవా సలహా

జయమ్ము నిశ్చయమ్మురా షో ద్వారా ఎన్నో విషయాలను ఆడియన్స్ తెలుసుకుంటున్నారు. ఈ వారం షోకి డాన్స్  మాస్టర్ ప్రభుదేవా రాబోతున్నారు. ఇక ప్రభుదేవా గురించి ఒక్క ముక్కలో చెప్పలేం. ఎలాంటి డాన్స్ స్టైల్స్ తెలియని టైములో ఆయన తన ఓన్ స్టెప్స్ తో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు. అలాంటి ప్రభుదేవాని జగపతి బాబు ఇంటర్వ్యూ చేశారు. "ఆయన డాన్స్ చూడగలం కానీ..రెండున్నర గంటలు ఆయన్ని హీరోగా ఎలా చూస్తాం అనే మాట విన్నావా ఇంతకుముందు " అని జగ్గు భాయ్ అడిగేసరికి "కరెక్ట్ కదా" అన్నాడు ప్రభుదేవా. "మాములుగా బ్లేజర్ అది వేసుకోవు కదా" అని అడిగేసరికి "గెస్ట్ కన్నా హోస్ట్ భయంకరమైన స్టైలిష్ గా ఉన్నారు. అందుకే నేనే వెళ్లి ఈ బ్లేజర్ ని కొనుక్కున్నా" అన్నాడు ప్రభుదేవా. "నాకు ఆ ప్రభుదేవా అంటేనే ఇష్టం" అని చెప్పారు జగ్గు భాయ్. అంతే వెంటనే ప్రభుదేవా బ్లేజర్ తీసేసి ప్రశాంతంగా కూర్చున్నారు. "డాన్స్ చేయలేని వాళ్ళతో కూడా చేయించావ్. నాకు డాన్స్ వస్తుందా రాదా" అని అడిగేసరికి ప్రభుదేవా లేచి జగ్గు భాయ్ తో కొన్ని స్టెప్స్ వేయించారు. "నీ లవ్ స్టోరీ హిమానీ గారిని ఎక్కడ కలిశారు" అని అడిగారు. "అరచేతిలో పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ తగ్గించడానికి వచ్చారు. కానీ ఇంకా ఈ నొప్పి తగ్గలేదు" అన్నారు ప్రభుదేవా. "నీ శిష్యుల్లో ఏకలవ్య శిష్యుడు" అని అడిగారు. "శేఖర్, జానీ" అనేసరికి వెనక నుంచి జానీ  మాస్టర్ వచ్చాడు. "ఈయన ఒక్క సాంగ్ కె 5 సాంగ్స్ మూవ్మెంట్స్ ఇచ్చేస్తాడు. 100 రూపీస్ కి 100 రూపీస్ చెయ్..500 రూపీస్ చేయొద్దు అంటూ జానీ  మాస్టర్ కి ప్రభుదేవా సలహా ఇచ్చారు.  

రాఘవ పరువు తీసిన అన్నపూర్ణమ్మ

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. అందులో రాఘవ స్కిట్ ప్రోమో మాత్రమే వేరే లెవెల్. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ కూడా ఆ స్కిట్ లో ఉన్నారు. రాఘవ న్యూస్ పేపర్ చదువుతూ "డ్రైవర్ కావలెను" అన్న జాబ్ ఆఫర్ చూసి అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళాడు. "అమ్మా నమస్తే అమ్మ" అనేసరికి "ఎవరు నువ్వు" అని అడిగింది. "డ్రైవర్ ని" అన్నాడు రాఘవ. "స్క్రూ డ్రైవర్ అంత లేవు నువ్వెంట్రా డ్రైవర్" అని అన్నారిపూర్ణమ్మ వేసిన ఒక్క పంచ్ డైలాగ్ తో రాఘవ పరువు పోయింది. "గ్యారేజ్ లోకి పోయి బండి ఉంటాది ..ఒట్టుకొచ్చెయ్" అంది. ఇక రాఘవ ఫుల్ జోష్ తో రిక్షా పట్టుకొచ్చాడు. "గ్యారేజ్ లో బండి అన్నారు అక్కడ రిక్షా తప్ప ఎం లేదమ్మా" అన్నాడు రాఘవ. "మరి రిక్షాకె నిన్ను పిలిచినాను. రిక్షా తొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వచ్చేత్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను" అంది అన్నపూర్ణమ్మ. దానికి రాఘవ ఊపిరి పీల్చుకుని "హమ్మా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేవరకు నాకో పది రోజులు సెలవు దొరుకుతుంది" అన్నాడు రాఘవ. "అలగెలగా. తీర్థయాత్రలకు రిక్షాలో వత్తానని దణ్ణమెత్తుకున్నారా" అంటూ కౌంటర్ వేసింది అన్నపూర్ణమ్మ. ఆ మాటలకు నోరెళ్లబెట్టాడు రాఘవ. ఇక ఈ షోలో రాకింగ్ రాకేష్ లేడీ గెటప్ వేసుకొచ్చి స్కిట్ చేసాడు. ఇక అప్పారావు ఐతే చిన్నపిల్లాడి గెటప్ లో వచ్చాడు. ధన్ రాజ్ ని ఒక రేంజ్ లో ఆదుకున్నాడు. తెలుగు అక్షర మాలలో బండిరాని తీసేసారు కదా తీసేసిన బండిరా ఎక్కడ పెట్టారు అంటూ చేసిన ఫన్ మాములుగా లేదు. ఇక రియాజ్ ఐతే గంగూభాయ్ గెటప్ లో వచ్చాడు.

Bigg boss 9 Telugu :ఇమ్మాన్యుయల్ కి వచ్చిన ఫ్యామిలీ ఫోటో.. బ్యాటరీ తగ్గిందిగా!

  బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం లో ఫ్యామిలీ నుండి సర్ ప్రైజెస్ ని కంటెస్టెంట్స్ కి ఇవ్వాలని బిగ్ బాస్ ప్లాన్ చేసాడు. అలా రాగానే ఇలా ఉరికినా బిగ్ బాస్ ఇవ్వడు కదా.. ఒక టాస్క్ పెట్టాడు.. ఒక ఆపిల్స్ చెట్టుకి ఉంటాయి. అయితే అవి కంటెస్టెంట్స్ ఫోటో గల ఆపిల్స్.. ఎవరి పేరుతో ఉన్న ఆపిల్ వారిని తీసుకోమంటాడు. అది ఓపెన్ చేస్తే అందులో ఒక గింజ ఉంటుంది. ఆ గింజ అందరికి డిఫరెంట్ గా వస్తుంది. కొందరికి రెడ్..  మరికొందరికి బ్లూ.. ఇంకొకదరికి బ్లాక్.. ప్రియ, శ్రీజ, రీతూ తమాకి వచ్చిన గింజ కలర్ ని మార్చుకున్నారు. ఆ తర్వాత ఒక రకం కలర్ వచ్చిన వాళ్ళందరికి ఒక ఛాన్స్ అంట. బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరైతే బజర్ ముందు కొడుతారో వాళ్లకి ఛాన్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. దానికి శ్రీజ సంఛాలక్.. ముందుగా ఇమ్మాన్యుయల్ బజర్ కొట్టడంతో తనని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు బిగ్ బాస్. నీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను.. ఒకటి మీ నాన్న నుండి లెటర్.. దీనికి బ్యాటరి బోర్డు నుండి  ఫార్టీ(నలభై( శాతం బ్యాటరీ తగ్గుతుంది. రెండోది మీ అమ్మ వాయిస్ మెసేజ్.. దీనికి థర్టీ ఫైవ్(ముప్పై అయిదు) తగ్గుంది. మూడు మీ ఫ్యామిలీ ఫోటో దీనికి ట్వంటీ ఫైవ్ తగ్గుందని బిగ్ బాస్ అనగానే ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. అందరికి ఛాన్స్ రావాలని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో ఫ్యామిలీ ఫోటో సెలక్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఫోటో వస్తుంది. ఫోటోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిగతా హౌస్ మేట్స్ తమకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తుంటారు. హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ ఫోటోస్, కాల్, మెసెజెస్ ఇలా ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి మరి

Bigboss 9 Telugu : కాఫీ కోసం తనూజని ఎత్తుకున్న సుమన్ శెట్టి.. సాధించేశారుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. హౌస్ లోని వారంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడి అయ్యారు. హౌస్ లో ఏది ఊరికే రాదు.. రెంటర్స్ ఓనర్స్ అయ్యారు ఒనర్స్ రెంటర్స్ అయ్యారు. తనూజకి కాఫీ అంటే ప్రాణం.. రెంటర్స్ గా ఉన్నప్పుడు కాఫీ కూడా తనకి దొరకలేదు. ఇప్పుడు ఓనర్స్ అయ్యాం కదా సర్ కాఫీ పౌడర్ పంపించండి అని వీకెండ్ లో నాగార్జునతో తనూజ రిక్వెస్ట్ చేసింది. నిన్న తనకి కాఫీ పౌడర్ వచ్చింది కానీ సంజన ని ఇంప్రెస్ చెయ్యాలి.. తను ఇంప్రెస్ అయి మీకు కాఫీ పౌడర్ ఇవ్వాలని బిగ్ బాస్ మెలిక పెడతాడు. దాంతో తనూజ కామెడీ స్క్రిప్ట్ చెయ్యాలని ఇమ్మాన్యుయల్ ని పిలుస్తుంది‌. తను రానని అంటాడు. ముందు పవన్ కళ్యాణ్ ని తీసుకొని వెళ్లింది. తనతో వర్క్ అవుట్ అవట్లేదని ఇప్పుడు పిలుస్తుందని ఇమ్మాన్యుయల్ అలుగుతాడు. ఇక చాలా సేపు చూస్తుంది తనూజ. నువ్వు స్క్రిప్ట్ చేసి మీ అమ్మని ఇంప్రెస్ చేసి తనూజకి కాఫీ పౌడర్ ఇప్పించమని భరణి చెప్పగానే ఇమ్మాన్యుయల్ వెళ్తాడు. డీమాన్ పవన్ , సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్ ముగ్గురు కాలేజీలో స్టూడెంట్స్.. సుమన్ కి తనూజ లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఈ స్క్రిప్ట్ లో సుమన్, తనూజ ఇద్దరు నేచురల్ గా చేశారు. చివరికి తనూజని సుమన్ ఎత్తుకొని తిరుగుతాడు. స్క్రిప్ట్ బాగుండటంతో సంజన ఇంప్రెస్ అయి తనూజకి కాఫీ పొడి ఇస్తుంది. దాంతో లేట్ చేయకుండా తనూజ వెళ్లి కాఫీ పెట్టుకొని తాగుతుంది.  

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ మాట. రీతూ గాసిప్ వేట!

  బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం నామినేషన్లు ఫుల్ హీటెక్కించాయి. నిన్నటి ఎపిసోడ్ లో పవన్ తనని సేవ్ చెయ్యలేదని రీతూ ఏడుస్తుంది. మరొకవైపు తనని నామినేట్ చేసారని శ్రీజ ఏడుస్తుంది కానీ పవన్ తన పవర్ తో శ్రీజని నామినేషన్ నుండి సేవ్ చేస్తాడు. ఇక బిగ్ బాస్ రీతూ(Rithu Chowdary)ని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. తన ముందు చికెన్ పెట్టి ఇంట్లో జరుగుతున్న రహస్యం గురించి చెప్పమంటాడు. తనూజకి పవన్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. తనతో ఉన్నంతవరకు హ్యాపీగా ఉంటుందని రీతూ చెప్తుంది. ఇంకా పవన్ గురించి చెప్పమని బిగ్ బాస్ అడుగగా.. అతను ఒకమ్మాయిని లవ్ చేసాడట కానీ తనకి చెప్పలేదట. ఈ హౌస్ లో నేను అంటే ఇష్టం అన్నాడు ఫ్రెండ్ గా అని రీతూ చెప్పగానే నువ్వు ఏం సరిగ్గా చెప్పట్లేదని బిగ్ బాస్ అంటాడు. నాకు ఈవెనింగ్ వరకు టైం ఇవ్వండి బిగ్ బాస్ ఆ లోపు అందరి దగ్గరికి వెళ్లి తెలుసుకొని మీకు చెప్తాను. చికెన్ అప్పుడే ఇవ్వండి అని రీతూ అనగానే బిగ్ బాస్ సరే అంటాడు. ఇక రీతూ అదేపనిగా అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళ నుండి ఎంతో కొంత గాసిప్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత డీమాన్ పవన్ దగ్గరికి వచ్చి నీకు హౌస్ లో ఎవరంటే ఇష్టమని అడుగుతుంది. ఇండైరెక్ట్ గా తన పేరే చెప్తాడు డీమాన్ పవన్. ఇక కాసేపటికి సంజన దగ్గరికి వెళ్ళి రీతూ మాట్లాడుతుంది. ఎందుకు డీమాన్ పవన్ శ్రీజతో ఉంటున్నాడని రీతూని సంజన అడుగుతుంది. నిన్ను సేవ్ చెయ్యకుండా తనని సేవ్ చేసాడు.. నేను అదే అడిగాను.. మీ పేర్ చూడడానికి క్యూట్ గా ఉంటుంది. బాగా వెళ్తదని సంజన అంటుంది. ఇక రీతూకి ఒక హింట్ వచ్చేసింది.. ఇక తన పర్ ఫామెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Jayam serial: చిన్ని చెప్పిన రాజకుమారుడు రుద్ర సర్.. షాక్ లో గంగ!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -65 లో చిన్ని దగ్గరికి గంగ వెళ్తుంది. మాట్లాడుతుంటే వీరు మనిషి  గంగ తన అమ్మ ఫోటో పంపిస్తాడు. వెంటనే గంగ అతనికి ఫోన్ చేసి మా అమ్మకి ఏమైందని అడుగుతుంది. మీ అమ్మ ఇక్కడ పడి ఉంది. తన దగ్గరున్న కాగితం లో నీ నెంబర్ ఉంటే ఫోన్ చేసానని అతను చెప్తాడు. దాంతో చిన్నికి మళ్ళీ వస్తానని చెప్పి గంగ బయటకి వస్తుంటే .. రుద్ర ఎదురుపడతాడు. నువ్వు నీ ఫ్రెండ్ ని కలిసి రా.. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని రుద్ర అంటాడు. సరే సర్ మా ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పదు. చిన్ని దగ్గరికి రుద్ర వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్నిని తీసుకొని రుద్ర మీటింగ్ దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు వాళ్ళ అమ్మ దగ్గరికి గంగ వెళ్ళబోతూ.. రుద్ర అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. నీ బలహీనత అయిన నీ అమ్మని ఆయుధంగా చేసుకుని నీ శత్రువులు వాడుకుంటారు. ఏదైనా ఆలోచించాలని రుద్ర చెప్పిన మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతుంది. గంగ అతనికి ఫోన్ చేసి మా అమ్మ నీ దగ్గర లేదు.. నీ వేషాలు నాకు తెలుసు.. ఇంకొకసారి ఇలా చేస్తే రుద్ర సర్ కి చెప్తానని గంగ అతనికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మీటింగ్ లో చిన్నిని చదివిస్తున్న రుద్ర స్టేజిపై మాట్లాడతాడు. అది చూసి గంగ షాక్ అవుతుంది. అంటే నా రాజకుమారుడు రుద్ర సర్ ఆ అని గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : పెళ్లికి ముందు ప్రేమ తప్పు చేసిందా.. భద్రవతికి చెప్పిన భాగ్యం!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -271 లో....రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నా పేరు కళ్యాణ్, నేను ప్రేమ ప్రేమించుకున్నామని కళ్యాణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ వెనకలా నుండి ధీరజ్ వచ్చి కళ్యాణ్ ని కొడతాడు. మావయ్య గారు ఆ కళ్యాణ్ ఎవరని శ్రీవల్లి అనగానే.. ఎవరు లేదు మీరు అందరు లోపలికి వెళ్ళండి అని రామరాజు అంటాడు. అందరు వెళ్తారు. మరోవైపు కళ్యాణ్, ధీరజ్ మాట్లాడుకుంటారు. మీ నాన్నకి నిజం చెప్పేసానని కళ్యాణ్ అనగానే ధీరజ్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఆ రోజు ప్రేమ, ధీరజ్ పెళ్లి చేసుకునే కంటే ముందు ఏదో జరిగి ఉంటుంది. నీకు ఏమైనా తెలుసా అని నర్మదని సాగర్ అడుగుతాడు. నాకేం తెలియదని నర్మద కవర్ చేస్తుంది. ఆ తర్వాత  చందుతో శ్రీవల్లి గురించి ప్రేమ తప్పుగా మాట్లాడుతుంటే ప్రేమని చిన్నప్పటి నుండి చూస్తున్నాం.. తను మంచిది నువ్వు ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని శ్రీవల్లితో చందు అంటాడు. ఆ తర్వాత భాగ్యంకి శ్రీవల్లి జరిగిందంతా చెప్తుంది. ఇక ఆ ఇంట్లో ఏ గొడవ చెయ్యాలో నాకు తెలుసని భాగ్యం అనుకుంటుంది. మరొకవైపు వేదవతిని రామరాజు పక్కకి తీసుకొని వెళ్లి అసలేం జరుగుతుంది ఈ అబ్బాయి ఎవరని రామరాజు అడుగుతాడు. కానీ వేదవతి ఏం చెప్పదు. ప్రేమకి వేదవతి ఫోన్ చేసి త్వరగా ఇంటికిరా అని చెప్తుంది. మరొక వైపు భద్రవతి, విశ్వ ఇద్దరు భాగ్యం ఇంటికి వస్తారు. ఎందుకు రమ్మన్నావని భద్రవతి అడుగగా.. మీ ప్రేమ ఎవరితోనో ఫోటో దిగిందట.. పెళ్లికి ముందే ప్రేమ తప్పు చేసిందని అంటున్నారట అని భాగ్యం చెప్పగానే భద్రవతి, విశ్వ షాక్ అవుతారు. తరువాయి భాగంలో ప్రేమ ఇంటికి రాగానే రామరాజు ఫొటోస్ చూపించి ఎవరు ఇతను అని అడుగుతాడు అప్పుడే భద్రవతి కుటుంబం మొత్తం రామరాజు ఇంటికి గొడవకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కార్తీక దీపంలో సూపర్ ట్విస్ట్.. దీప ఒప్పుకుంటుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -470 లో.... సుమిత్ర కాంచన కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీధర్ పదా భోజనం చేద్దామని శివన్నారాయణ అనగానే శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్నయ్య నీకోసం నేను పాలకోవా చేశానని కాంచన అంటుంది. మీ వదిన దీపని క్షమించానని చెప్పాక.. అప్పుడే తినిపించమని దశరథ్ అంటాడు. ఆ తర్వాత దీపకి సుమిత్ర ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. ఏంటి ఇదంతా అని జ్యోత్స్న అనుకుంటుంది సుమిత్రని జ్యోత్స్న పక్కకి తీసుకొని వెళ్తుంది. మమ్మీ నువ్వు దీప ని క్షమించావా అడుగుతుంది. క్షమించాలి ఒక నెగటివ్ నే కాకుండా పాజిటివ్ కూడా చూస్తే ఆ మనిషి నచ్చేస్తారని సుమిత్ర అనగానే ఉన్న ఒక ఛాన్స్ కూడా మా మమ్మీ మిస్ చేసిందని జ్యోత్స్న డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న దేవుడి దగ్గర హారతి తీసుకొనిరా అనీ సుమిత్ర చెప్పగానే.. జ్యోత్స్న తీసుకొని వస్తుంది. దీపకి సుమిత్ర హారతి ఇచ్చి క్షమిస్తుంది. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక నా కోరిక తీరుస్తావా అని దీపని సుమిత్ర అడుగుతుంది. ఏంటని దీప అడుగుతుంది. నా కూతురు జ్యోత్స్నని చంపాలని ట్రై చేస్తుంటే నా భర్తకి బుల్లెట్ దిగిందని ఒప్పుకోవాలని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ మమ్మీ అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఎలా ఒప్పుకుంటుందని కార్తీక్ అంటాడు. ఒప్పుకుంటున్నానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యకి అబార్షన్ చేయమన్న రాజ్.. తను చూసేసిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -833లో.....రాజ్ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఒకతను తన భార్యకి అబార్షన్ చేయిస్తున్నాడని తెలిసి అతనితో గొడవపడతాడు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బయటకు తీసుకొని వెళ్తాడు. ఏంటి అన్నయ్య అందరితో గొడవ పెట్టుకుంటూ వెళ్తే ఎలా కనీసం వదినని అయిన బ్రతికించే ప్రయత్నం చెయ్ అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో రుద్రాణి ఆలోచిస్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. మమ్మీ మనకి ఇదే కరెక్ట్ టైం.. రాజ్ తో కంపెనీ బాధ్యతలు నాకు ఇవ్వమని చెప్తానని అంటాడు. అప్పుడే రాజ్, కళ్యాణ్ ఇంటికి వస్తారు.రాజ్ దగ్గరికి రాహుల్ వచ్చి కంపెనీ గురించి మాట్లాడాలి.. కొన్ని రోజులు ఆఫీస్ ను నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు. వద్దు నీకు ఆ సామర్థ్యం లేదని అంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి నా కొడుకు కి ఆఫీస్ బాధ్యతలు చూసుకునేంత సామర్ధ్యం ఉందని రుద్రాణి అంటుంటే వాడు కంపెనీ బాధ్యతలు చూసుకోవడానికి పనికి రాడాని రాజ్ చెప్తాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి ఎప్పుడెలా మాట్లాడాలో తెలియదని రుద్రాణిపై కోప్పడుతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. తను నిద్రపోతుంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో రాజ్ మాట్లాడుతాడు. అప్పుడే కావ్య లేస్తుంది. ఏంటి మీ బిడ్డని సరిగ్గా చూసుకుంటున్నానో లేదో తెలుసుకుంటున్నారా అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి తెలియకుండా మీరు అబార్షన్ చెయ్యండి. తను ఒప్పుకోదని డాక్టర్ ని రాజ్ రిక్వెస్ట్ చేస్తుంటే కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సిగ్గుపడుతూ కాబోయే వాడి కోసం లవ్ లెటర్ రాసిన కావ్య

  బుల్లితెర మీద నిఖిల్ - కావ్య ఒక నైస్ పెయిర్ అని పేరు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైములో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నిఖిల్ ఉన్న షోస్ లో కావ్య , కావ్య ఉన్న షోస్ లో నిఖిల్ కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షోలో కావ్య వచ్చింది. అందులో పెళ్లి సందడి మూవీలో "మా పెరటి జాంచెట్టు" సాంగ్ ని ప్లే చేసి పెళ్ళైన అమ్మాయిలు భర్తల కోసం పెళ్లి కానీ అమ్మాయిలు కాబోయే వాళ్ళ కోసం లవ్ లెటర్స్ రాయాలంటూ శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. ఇక ఆ స్టేజి మీద కొందరు పడుకుని కొందరు కూర్చుని లవ్ లెటర్స్ రాశాయి. అందులో కావ్య కూడా లవ్ లెటర్ రాసింది. దాన్ని శ్రీముఖి అలాగే కావ్య కూడా చదివి వినిపించారు. "నువ్వు ఎక్కడ ఉన్నవో ఎలా ఉన్నవో తెలీదు. కానీ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నుంచి నా సర్వం అంతా నువ్వే ఐపోతావు. ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను. కంటి రెప్పలా నిన్ను చూసుకుంటా" అని రాసింది. "ఎవరి కోసం రాసావు" అని అవినాష్, శ్రీముఖి అడిగేసరికి "కాబోయే వాళ్ళ కోసం" అని చెప్పింది కావ్య. దాని అవినాష్, హరి కలిసి గట్టిగా అరుపులు అరిచేసరికి "కాబోయేది పాస్ట్ గురించి కాదు రాసింది" అని క్లారిటీ ఇచ్చింది కావ్య. 10 కి 9 .75 మార్క్స్ ఇచ్చింది శ్రీముఖి. తర్వాత కావ్య ఆ లెటర్ ని చాలా ప్రేమగా చదివి వినిపించింది సిగ్గుపడుతూ.  

గోవాలో సిగ్గులేకుండా ఉన్నావేంటి.. నాన్న కొట్టినప్పుడు కమ్మగా లేదు

ప్రభుదేవా గురించి చెప్పాలంటే ప్రేమికుడు మూవీ గురించే ముందు చెప్పాలి. ఆ సినిమాలో ఊర్వశి సాంగ్ ఒక్కటే ప్రభుదేవాని - వడివేలును టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లింది. ట్రాన్స్పరెంట్ గా ఉన్న రన్నింగ్ బస్ మీద వీళ్ళ డాన్స్ చూస్తే 90 స్ లో అందరికీ పూనకాలు వచ్చేసేవి. ప్రభుదేవాకి ఇదొక ల్యాండ్ మార్క్ సాంగ్ అని చెప్పొచ్చు. "ముక్కాలా మూకాబులా" సాంగ్ ఐతే వేరే రేంజ్. అలాంటి ప్రభుదేవా ఇప్పుడు ఒక షోకి వచ్చేసారు. జయమ్ము నిశ్చయమ్మురా షో ప్రతీ వారం కొత్త కొత్త సెలబ్రిటీస్ తో ఆడియన్స్ కి ఫుల్ జోష్ ని అందిస్తూ సాగుతోంది. ఇక ఈ వారం షోకి కింగ్ ఆఫ్ డాన్స్, మ్యాన్ ఆఫ్ మూవ్స్ ఐన ప్రేమికుడు ప్రభుదేవా వచ్చేసారు. ఇక రావడమే తన డాన్స్ మూవ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. "మాములుగా చిన్నప్పుడు అందరూ సిగ్గుపడతారు ఓకే కానీ నువ్వు ఇన్నేళ్ళుగా సిగ్గు పడుతూనే ఉన్నావ్" అంటూ జగపతి బాబు అనేసరికి ప్రభుదేవా నిజంగానే సిగ్గుపడిపోతూ తలదించుకుని ముసిముసి నవ్వులు నవ్వేసుకున్నారు. "మరి గోవాలో సిగ్గులేకుండా ఉన్నావే" అని అడిగారు జగ్గు భాయ్. "ఈ షో గోవాలో పెట్టి ఉంటే బాగుండేది" అన్నారు ప్రభు దేవా. "సుందరం గారు మీ ఫాదర్ అంత పెద్ద డాన్స్ మాస్టర్.ఆయన స్ట్రిక్ట్ ఆ ఎప్పుడైనా కొట్టారా  " అన్నారు జగ్గు భాయ్. "ఫాదర్ అంటే భయం.." అని ప్రభుదేవా అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో "అబ్బనీ తియ్యని దెబ్బ" సాంగ్ ప్లే అయ్యింది. "ఆయన కొట్టినప్పుడు కమ్మగా లేదు" అంటూ నవ్వుతూ చెప్పారు ప్రభుదేవా. "అందరికీ తెలుసు ప్రభుదేవా అంటే డాన్స్ డాన్స్ అంటే ప్రభుదేవా అని " అని జగ్గు భాయ్ అడిగారు. "హిప్ హాప్, బ్రేక్ డాన్స్ , జాజ్ అవన్నీ తెలీదు. నాకు నా డాన్స్ తెలుసు అంతే" అన్నారు ప్రభుదేవా. మరి నీ డాన్స్ చూడాలి కదా అని జగ్గు భాయ్ అడిగేసరికి డాన్స్ చేసి చూపించారు ప్రభుదేవా. ప్రేమికుడు మూవీ రిలీజ్ అయ్యాక అబ్బాయిలంతా బ్యాగీ ఫాంట్స్ కొనుక్కుని ప్రభుదేవా స్టెప్స్ ని బాగా ఫాలో అయ్యేవాళ్ళు. మరి అలాంటి ప్రభుదేవా ఈ షోలో ఎలాంటి కబుర్లు చెప్తారో చూడాలి.  

అమ్మ చేతి ముద్దు ఆది అన్న ముద్ద జీవితాంతం మర్చిపోను

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం డెలివరీ బాయ్స్ కి డేడికేట్ చేశారు. ఇక ఇందులో సెలబ్రిటీస్ కి అలాగే డెలివరీ బాయ్స్ కి మధ్య టగ్ ఆఫ్ వార్ గేమ్ పెట్టారు. ఇక సౌమ్య శారద ఐతే ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసింది. "అర చేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేవు. బాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ని ఆపలేవు అని డైలాగ్ కొట్టినా మేడం రీసెంట్ గా ఒక పరీక్షను ఆపేసారు" అంటూ కామెడీగా చెప్పాడు ఒక డెలివరీ బాయ్. ఇక ఇదే డెలివరీ బాయ్ తన ఇల్లు రేకులు ఇల్లు అని వర్షం వస్తే స్విమ్మింగ్ ఫూల్ అవుతుంది అని చెప్పాడు. రీసెంట్ గా ఒక ప్రోగ్రాంకి ట్రై చేశానని డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని అనుకున్నట్లు చెప్పాడు. అక్కడ కూడా సక్సెస్ కాలేదు అని చెప్పాడు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని గుర్తు చేసుకుంటూ కొన్ని సాంగ్స్ ని పాడారు సింగర్స్. తర్వాత ఫుడ్ డెలివరీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒక స్కిట్ రూపంలో చేసి చూపించారు. ఈమధ్య కాలంలో ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం..అమ్మాయిలు ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తుంటే అక్కడ వాళ్లకు ఎదురయ్యే అవమానాలు. అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తే కస్టమర్స్ ని నుంచి వచ్చే మాటలు వీటన్నిటినీ ఆ స్కిట్ లో చూపించారు. ఇక ఫుడ్ డెలివరీ జాబ్ చేసే అమ్మాయి లేచి ఇలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాను అన్న విషయాన్నీ ఎప్పుడూ పేరెంట్స్ తో షేర్ చేసుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. "ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారంటే కచ్చితంగా వాళ్ళ ఇల్లు గడవని పొజిషన్ లో ఉన్నారని నా అభిప్రాయం" అంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఇక ఒక డెలివరీ బాయ్ ఐతే "ఒక్కో కస్టమర్ డ్రింక్ లో ఉంటారు. డబ్బులు ఇవ్వకుండా అవస్థలు పెడతారు" అంటూ చెప్పుకొచ్చాడు. "ఈరోజున మనుషులెవ్వరూ మీతో మాట్లాడడం లేదు. మీ డబ్బులతో మీ హోదాతో మాట్లాడుతున్నారు." అంటూ చెప్పుకొచ్చింది రోజా. ఇక ఆది ఐతే ప్లేట్ లో బిర్యానీ తెచ్చి "ఎన్నోసార్లు మీరు టైంకి మా ఆకలి తీర్చారు. ఈరోజు మీ అందరి ఆకలి మొత్తం తీర్చలేకపోయినా మీ అందరితో ఈ బిర్యానీని షేర్ చేసుకుంటాను" అంతో అందరికీ కలిపి ముద్దలు స్వయంగా తినిపించాడు ఆది. "అమ్మ చేతి ముద్దు ఆది అన్న ముద్ద జీవితాంతం మర్చిపోను" అని ఒక డెలివరీ గర్ల్ చెప్పింది.

Bigg boss 9 Telugu : హౌస్ లో డాడ్ లిటిల్ ప్రిన్సెస్.. ఇమ్మాన్యుయల్ పై కంప్లైంట్!

  బిగ్ బాస్ తెలుగులో ప్రతీ సీజన్ లో కొన్ని బాండింగ్స్ ఎప్పటికి గుర్తుండిపోతుంటాయి. అయితే సీజన్-9 లో కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి. హౌస్ లో ఎవరో ఒకరు ఏ రిలేషన్ లో అయినా ఉంటు వస్తున్నారు. ఇలా ప్రతీ సీజన్ లో ఏదో ఒక రిలేషన్ తో కనెక్ట్ అవుతున్నారు. అలా కనెక్ట్ అయిన రిలేషన్ హౌస్ లో నుండి బయటకు వచ్చాక కూడా కంటిన్యూ అవుతున్నాయి. గత సీజన్ లో శివాజీని నయని పావని డాడీ అంటూ పిలిచేది. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా శివాజీని అలాగే పిలుస్తుంది నయని పావని. ప్రస్తుతం హౌస్ లో రెండు రకాల రిలేషన్ షిప్ లు ఉన్నాయి. ఒకటి రీతూ, డిమాన్ పవన్ వాళ్ళది.. ఫ్రెండ్ కంటే ఎక్కువ రిలేషన్ షిప్ అంట వారిద్దరిది.. ఆ విషయం వాళ్లే చెప్పుకున్నారు. ఇంకొకరు భరణిని తనూజ నాన్న అని పిలుస్తుంది. అలా వీళ్ళిద్దరి బాండింగ్.. నెవెర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ ఎక్కువగా మెయిన్ ఎపిసోడ్ లో ఇవ్వకపోవచ్చు కానీ లైవ్ లో మాత్రం చాలా క్యూట్ గా ఉంది. తనూజని ఇమ్మాన్యుయల్ ఆటపట్టిస్తుంటే.... తనూజ చిన్నపిల్లలాగా భరణి దగ్గరికి వచ్చి నాన్న చూడు వాడు.. ఎలా అంటే అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నాడు అని కంప్లైంట్ ఇస్తుంటే.. వాడి సంగతి చెప్తాను పదా.. ఈ రోజు అయిపోయాడు వాడు అని భరణి అంటాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ పైకి భరణి గొడవకి వెళ్తాడు. వీకెండ్ లో భరణి సేవ్ కాగానే తనూజ ఎమోషనల్ అవుతుంది. వీళ్ళ ఇద్దరి బాండింగ్ కి సోషల్ మీడియా లో పాజిటివ్ గా రీల్స్ అండ్ మీమ్స్ వస్తున్నాయి. భరణి నాన్నగా.. తనూజ కూతురిగా.. ముఖ్యంగా తనూజని డాడ్ లిటిల్ ప్రిన్స్ అంటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇమ్మాన్యుయల్, తనూజ, భరణి కాంబో హౌస్ లో పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. 

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్-9 లో ట్విస్ట్.. కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్!

  బిగ్ బాస్ సీజన్-9 (Bigg boss 9 Telugu) రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ ఈ సారి చదరంగం కాదు రణరంగమన్నట్లు దూసుకుపోతుంది. ఈ సీజన్ లో అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాల్లో ఒకరు సెలబ్రిటీ, ఇంకొకరు కామన్ మ్యాన్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో అయిదుగురు కామనర్స్ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఈ వీక్ లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేయబోతున్నాడు. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన దివ్య నిఖిత, షకీబ్, నాగ ప్రశాంత్ ముగ్గురిని మిడ్ వీక్ లో హౌస్ లోకి పంపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ముగ్గురిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారు. ముగ్గురికి టాస్క్ లు పెట్టి ఎవరైతే విన్ అవుతారో వారిని హౌస్ లోకి పంపిస్తారంట. దాంతో పాటు హౌస్ లో ఉన్న వాళ్ళని ఓటింగ్ చేయమని వాటిని కూడా కన్సిడర్ చేసి హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ ని తీసుకొస్తున్నారంట. అయితే ఒక్కరికి మాత్రమే ఛాన్స్  అని మిగతా ఇద్దరిని హౌస్ నుండి ఎగ్జిట్ చేస్తారంట. ఇలా నెక్స్ట్ మిడ్ వీక్ కూడా మరొక ముగ్గురిని పంపించి టాస్క్ లు పెట్టి, ఒకరిని పర్మినెంట్ హౌస్ మేట్ చేసే ప్లాన్ లో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం కూడా ఒక కామనర్ బయటకు వస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఓటింగ్ పోల్ చూసిన కామనర్స్ లీస్ట్ లో ఉన్నారు. ఇక అయిదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే తెలుస్తోంది. అయిదో వారం నుండి హౌస్ లో మళ్ళీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ వార్ నడుస్తుదన్నమాట.  

Bigg Boss Buzzz Promo: ఇమ్మాన్యుయేల్ ఫైర్, తనూజ ఫ్లవర్.. బజ్‌లో షాకింగ్ కామెంట్స్ చేసిన మనీష్!

    బిగ్ బాస్ సీజన్-9 లో అప్పుడే ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు. ‌మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేషన్ అయ్యాడు. నిజానికి ప్రియ కానీ ఫ్లోరా కానీ ఎలిమినేట్ అవుతారని ఎక్కువమంది ఆడియన్స్ అనుకున్నారు. కానీ అందరికి షాకిస్తూ మర్యాద మనీష్ ని బయటికి పంపించేశాడు బిగ్‌బాస్. ఇక బయటకొచ్చిన తర్వాత బిగ్‌బాస్‌ బజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మర్యాద మనీష్. హౌస్‌లో ఫైర్ ఎవరు ఫ్లవర్ ఎవరని మర్యాద మనీష్‌ని శివాజీ అడిగాడు. డీమాన్ పవన్ ఫ్లవర్ అంటూ మనీష్ చెప్పాడు. అలానే టాప్-7 మెటీరియల్ కానీ ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వెళ్లిపోతారని నాకు కొడుతుందంటూ మనీష్ అన్నాడు. తనూజ గౌడ కూడా ఫ్లవరే.. తన వల్ల గేమ్ ఇప్పటికి ఇంపాక్ట్ అవ్వలేదంటూ మనీష్ అన్నాడు.ఇమ్మాన్యుయేల్ ఫైర్.. ఇతను మూడు విషయాలు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు సర్.. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్.. సెకెండ్ ఎమోషన్స్.. థర్డ్ టాస్క్.. ఇంకేం కావాలి సర్ అంటూ ఇమ్మాన్యుయల్ ని మనీష్ పొగిడేశాడు.  హౌస్ నుంచి బయటకొచ్చాక ప్రియ గురించి మీ అభిప్రాయమేంటని శివాజీ అడుగగా. నేను అయితే తనని నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దామనే అనుకున్నాను‌. వీళ్లిద్దరూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత అంటూ శ్రీజ, ప్రియ గురించి ఏదో చెప్పాడు మనీష్. ఇంతలో మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని నాకు తెలుసు కానీ మీరు మాట కూడా జారారు.. ఎందుకో మనీష్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా బిహేవ్ చేస్తున్నాడనిపించిందంటూ శివాజీ అన్నాడు. నేనూ నోటీస్ చేశానంటూ మర్యాద మనీష్ ఒప్పుకున్నాడు మర్యాద. ఇక పాయింట్ నెంబర్ వన్.. మీ దగ్గర యూనిటీ ఉందా.. ఉంటే ఎవరెవరితో ఎవరెవరికి ఉందని శివాజీ ప్రశ్నించాడు. అలానే మీరు, శ్రీజ, ప్రియ.. మీరు ఇంత చేయటం వల్లే ఆయన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారంటూ శివాజీ అన్నాడు. తను యాక్చువల్లీ ఫైర్‌గా ఉండే.. మేమే వైల్డ్ ఫైర్ చేశామని ఇప్పుడే రియలైజ్ అవుతున్నామంటూ మనీష్ అన్నాడు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడనేది తెలియదు. మరి మర్యాద మనీష్ ఏం మాట్లాడాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.  

Bigg boss 9 Telugu Nominations: మూడో వారం నామినేషన్లో ఉన్నది ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం నామినేషన్లతో హౌస్ అంతా హీటెక్కెపోయింది. దమ్ము శ్రీజని సంజన నామినేట్ చేసింది. నీ వల్ల హౌస్ ఆర్మని డిస్టబ్ అవుతంటూ తన నామినేషన్ చెప్పింది. ఎక్కడో చెప్పమని శ్రీజ అడుగగా. ‌ సరిగ్గా స్టాండ్ తీసుకోవని, అనవసర విషయాలకి మాట్లాటతావని సంజన చెప్పింది. ఇక డీమాన్ పవన్ ని హరీష్ నామినేట్ చేసి తన పాయింట్లు చెప్పుకొచ్చాడు.  నిస్పక్షపాంగా అందరి విషయంలోనూ ఉండాలి.. మనకి ఫ్రెండ్‌షిప్ ఉన్న వాళ్లతో ఫ్రెండ్లీగా ఉన్నవాళ్లతో మాత్రం ఒకరకమైన సాఫ్ట్ టోన్.. సాఫ్ట్ కార్నర్.. మనకి ఎవరితో అయితే రిలేషన్ లేదో వాళ్లతో మాత్రం ఒక రకంగా.. ఇదే దోగ్లా పని అంటారు దీన్నే .. డబుల్ స్టాండర్డ్స్.. అంటారంటూ డీమాన్ పవన్ తో హరీష్ చెప్పాడు. సరే మీరు మాట్లాడుకోండి అని డీమాన్ అనేసరికి హరీష్ కి ఇంకా కోపం పెరిగిపోయింది. నిజాలు మాట్లాడుకుందాం.. మాట్లాడుకునేటప్పుడు గుడ్డలు ఇప్పదీసుకొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా.. మీకు కంటిముందు జరిగేదే కళ్లు మూసుకుంటాయి మీకు పొరలు.. రీతూ విషయంలో కళ్లు మూసుకుపోతాయి మీకు.. మీరెళ్లి చాక్లెట్లు ఇచ్చి కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను అర్థమైందా..అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. ఈ మాట అనగానే బయట టీవీలో ఇదంతా చూస్తున్న రీతూ ఉలిక్కిపడింది. అది లత్కోర్ పని కాదు సర్ అని డీమాన్  పవన్ అన్నాడు. మరేంటది.. వేశారు కదా చూపించారు కదా.. నేషనల్ టెలివిజన్‌లో అర్థమైందిగా ఏం జరిగిందో మనం ఎంత పక్షపతంగా ఉంటామో ఎంత ఫెయిర్‌గా ఉంటామో కనబడుతుంది పవన్.. అంటూ హరీష్ అన్నాడు. సర్ ఆమెని నామినేట్ చేయొద్దని నేను చెప్పలేదంటూ డీమాన్ అన్నాడు. దీనికి అవును నామినేట్ చేయొద్దని చెప్పను కానీ ఇంకొకళ్లు అంటే ఏంటి దో ఛాయ్ కాన్సెప్ట్ అంటూ డీమాన్‌ పై అరిచేశాడు హరీష్. ఇంతలో సర్ మీరు అన్న వర్డ్ రాంగ్ అంటూ ప్రియ చెప్పింది. మీకన్నా కాదు అని హరీష్ అనగానే లత్కోర్ అన్న పదం కరెక్ట్ కాదంటూ శ్రీజ కూడా రెయిజ్ చేసింది. దీంతో తప్పేం కాదది బూతా.. బెట్ కాస్తారా..బూతా అది.. మీరు చెప్పండి దాని మీనింగ్ అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. అది బ్యాడ్ వర్డ్ అని శ్రీజ అంది. బ్యాడ్ వర్డ్ ఎలాగా.. మీనింగ్ చెప్పండి.. పులిహోర పంచాయితీ లాంటిది అర్థమైందా.. అంటే ఏంటి మీకు వినసొంపుగా ఉన్నాయి నేను మాట్లాడతానా అంటూ రివర్స్‌లో ఫైర్ అయ్యాడు హరీష్. చివరికి తన ఫోటోనే నామినేషన్స్ పెట్టేయాలని హరీష్ చెప్పాడు.   కామనర్స్ నామినేషన్లు పూర్తవ్వగానే సెలెబ్రిటీస్ వి మొదలయ్యాయి. మొదటగా దమ్ము శ్రీజని సంజన నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరిగాయి. ఇమ్మాన్యుయల్ ముందుగా పవన్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఎక్కువమందితో మాట్లాడట్లేదు.. ఇంకా సరైన గేమ్ చూపించలేదని పాయింట్లు చెప్పాడు. తర్వాత ప్రియని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయల్. శ్రీజ, సంజన మధ్య డిస్కషన్స్ లో రీతూ చౌదరి దూరింది. దాంతో రీతూ, శ్రీజ మధ్య కూడా చిన్న గొడవ అయింది. ఇలా నామినేషన్స్‌ పూర్తయ్యే సరికి బోర్డ్ మీద పవన్ కళ్యాణ్, ప్రియ, శ్రీజ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా, రాము రాథోడ్ ఫొటోలు ఉన్నాయి. అప్పుడే బిగ్‌బాస్ ఓ అనౌన్స్‌మెంట్ చేశాడు. డీమాన్ కెప్టెన్ అయిన కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాం.. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఒకర్ని మీరు సేవ్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. దాంతో అతను దమ్ము శ్రీజని సేవ్ చేశాడు. అది చూసి రీతూ చౌదరి హర్ట్ అయింది.