వేణుకి రెండుసార్లు హ్యాండ్ ఇచ్చిన పూరి!

'స్వయంవరం' మూవీ అంటే చాలు వేణు గుర్తొస్తాడు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, కల్యాణ రాముడు వంటి మూవీస్ లో యాక్ట్ చేసాడు వేణు. ఐతే తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేసాడు. ఇక ఇప్పుడు రవితేజ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'లో నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమౌతోంది. ఇందులో సీఐ మురళి రోల్ లో నటిస్తున్నాడు.   దీంతో వేణు ఈ మూవీ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాడు. 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎన్నో విషయాలను అలీతో షేర్ చేసుకున్నాడు. ఒకప్పుడు డైరెక్టర్స్ కి ప్రామిసింగ్ హీరోలా మంచి హిట్స్ ఐతే అందించాడు. ఇప్పుడు వేణు కెరీర్ లో ఏమంత మంచి హిట్స్ పడడం లేదు. ఇప్పుడు చేసిన ఈ మూవీ తనకు ఎంత అదృష్టాన్ని తెస్తుందో చూడాలి అన్నాడు. ఇక వేణు తన హైట్ 6 అడుగుల 3 అంగుళాలు అని చెప్పాడు.  ఐతే ఈ షో కి వెళ్ళమని వాళ్ళ అమ్మ చెప్పేసరికి తాను వచ్చానని చెప్పుకొచ్చాడు.  చదువుకునే వయసులో కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడ చదువుకోకుండా ఎక్కువగా సినిమాలు చూసేవాడిన‌ని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఇక ఈ విషయం ఇంట్లో తెలిసిపోయేసరికి వాళ్ళ నాన్న బెల్టు తెగేవరకు చితక్కొట్టేశారని చెప్పాడు. అలాగే తన వరకు వచ్చి మిస్ ఐన ఆఫర్స్ గురించి కూడా చెప్పాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదట 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' మూవీ కథను తనకు చెప్పారట. ఏమయ్యిందో ఏమో కానీ చివరికి ఈ మూవీలో రవితేజని హీరోగా పెట్టుకున్నారు.  తర్వాత 'దేశముదురు' చిత్రంలో టీవీ యాంకర్ రోల్ నాకైతే బాగుంటుందని కథ మొత్తం చెప్పారు. కానీ సినిమాను మాత్రం తనతో చేయలేదని చెప్పాడు. ఈ రెండు విషయాల్లో చాలా బాధపడ్డాడట వేణు. మచిలీపట్టణం మాజీ ఎంపీ మాగంటి అంకినీడుకు తొట్టెంపూడి వేణు మేనల్లుడు అవుతాడు. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి కూడా ఈ షోలో చెప్పాడు వేణు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.

దర్శకేంద్రుడు మాట్లాడిన వేళ‌.. సిరి క‌ల నెర‌వేరిన వేళ‌!

బిగ్ బాస్ ఫాలో అయ్యేవాళ్ళకు సిరి హన్మంత్ ఎవ‌రో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి. ఆమె యూట్యూబ్ లో 'మేడం సర్.. మేడం అంతే, 'గందరగోపాళం', 'రాంలీలా' వంటి వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ఎవరి నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇటీవల సిరి నటించిన #బిఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఆహా ఓటిటిపై ఈ వెబ్ సిరీస్ ప్రసారమయ్యింది.  ఈ  స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇద్దరమ్మాయిలు జాబ్ కోసం సిటీకి  వస్తారు. అలా అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటూ లైఫ్ ని ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. సిరి హన్మంత్, రమ్య పసుపులేటి కలిసి నటించిన ఈ సీరీస్ కి మంచి మార్క్స్ పడ్డాయి.  ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ సక్సెస్ ఐన సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సిరికి కాల్ చేసి అభినందించారట. ఆయన స్వయంగా తనతో మాట్లాడ్డం కలవడం చేసేసరికి తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. "ఈ రోజు నా కల నెరవేరింది. రాఘవేంద్రరావు గారు కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీరు నాకు చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోను" అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోతో కలిపి తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.  

నెటిజ‌న్ల మ‌తులు పోగొడుతున్న దీపిక గెంతులు!

దీపికా పిల్లి ఇటీవల బుల్లితెర మీద బాగా వినిపిస్తున్న పేరు. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ, వెబ్ సిరీస్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న దీపిక ఇప్పుడు 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో సుడిగాలి సుధీర్ తో కలిసి నటించేసింది కూడా. ఇక ఇప్పుడు దీపిక ఒక హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయేసరికి అందాల డోస్ పెంచేసింది. పొట్టి బట్టలు వేసి అందరిని అలరిస్తోంది. షోస్ లో ఇరగదీసే స్టెప్స్ వేసి అందరిలో హీట్ పుట్టిస్తోంది.  దీపికకు హీరోయిన్ అయ్యే అవకాశాలు ఇంకా ఎన్నో వస్తాయని దర్శకేంద్రుడు కితాబిచ్చారు కూడా. ఇక ఇప్పుడు దీపిక సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. మున్నార్ లో ఉంటూ అక్కడి నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తోంది. చుట్టూ కొండల్ని కోనల్ని చూస్తూ మైమరిచిపోతోంది. అక్కడ కురుస్తున్న వానలో తడుస్తూ వెదర్ డిమాండ్ చేస్తోంది కాబట్టి సూపర్ డాన్స్ చేస్తున్నాను అన్నట్టుగా ఒక కాప్షన్ పెట్టి "కురిసింది మేఘం మేఘం" హిందీ వెర్షన్ సాంగ్ కి ఐశ్వర్య రాయ్ వేసినట్టుగా స్టెప్పులేసి ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసుకుంది.  ఇప్పుడు ఈ వీడియో చూసిన‌ నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. టిక్ టాక్ ద్వారా ఎంతో మంది సోషల్ మీడియా స్టార్స్ ఇపోయారు. ఇది ఎంతో మందిలోని టాలెంట్ ని బయటికి తీసిన ఒక యాప్. దీపిక పిల్లి కూడా ఇలాగే పాపులర్ ఐన ఒక అమ్మాయి. ఆ క్రేజ్ తోనే ఈటీవీ వంటి సంస్థలో ఆఫర్ ని దక్కించుకుని పేరు సంపాదించుకుంది.

శేషు ఫామిలీ మెంబెర్స్‌ని మా ఆఫీస్ లో పనిచేయమనండి!

ఇటీవల ఎటు చూసిన బుల్లితెర మీద మల్లెమాల, జబర్దస్త్.. ఇవే హాట్ టాపిక్స్. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కిరాక్ ఆర్పీ ఎన్నో కామెంట్స్ చేసాడు. దానికి ఆటో రాంప్రసాద్, ఆది కౌంటర్ అటాక్స్ ఇచ్చారు. అదిరే అభి కూడా మాట్లాడాడు. ఇక ఇప్పుడు షేకింగ్ శేషు లైన్ లోకి వచ్చేసి ఆర్పీ బండారం బయటపెట్టాడు. "అసలు నీ అనుభవం ఎంత.. అంత పెద్ద మనుషుల్ని, లైఫ్ ఇచ్చిన స్టేజిని నానా మాటలు అనడానికి" అంటూ విరుచుకుపడ్డాడు. "డైరెక్టర్ ని కావాలంటూ మూవీ స్టార్ట్ చేసావ్. మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే 20 లక్షలు ఖర్చుపెట్టావు. ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ నిలదీసేసరికి తోక ముడిచావ్." అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ఈ విషయం గురించి ఆర్పీ మీద కంప్లైంట్ కూడా ఫైల్ చేసినట్లు చెప్పాడు.  శేషు కామెంట్స్ కి ఆర్పీ స్పందించాడు. "స్టోరీ లైన్ నచ్చేసరికి అరుణాచలం గారు మూవీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నారు. నాగబాబు గారు, చక్రవర్తి గారు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అనుకోని పరిస్థితుల కారణంగా మూవీ మిడిల్ డ్రాప్ అయ్యింది" అన్నాడు ఆర్పీ. "అంతా ఓకే అనుకున్నాకే ఆఫీస్ తీసుకున్నా. ఐనా జబర్దస్త్ లో నేను స్కిట్స్ వేసే టైంకి శేషు అక్కడ లేడు. జబర్దస్త్ పై రెండు మూడు సార్లు మాత్రమే అతన్ని కలిసాను" అన్నాడు. "మరి శేషుకి నా విషయంలో వేలు పెట్టి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమిటి?" అని ప్ర‌శ్నించాడు.  "శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు కాబట్టి శేషు అలా మాట్లాడుతున్నాడు" అంటూ విరుచుకుపడ్డాడు. "మూవీ స్టార్ట్ చేసాక ఎంతోమంది వస్తారు కాబట్టి ఆఫీస్ తీసుకున్నా.. శేషుకు నచ్చకపోతే ఆయన ఇల్లు ఇస్తే అక్కడే ఆఫీస్ పెట్టుకుంటా. వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని మా ఆఫీస్ లో పనిచేయమనండి" అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జబర్దస్త్ లోపల ఏం జరుగుతోంది. ఇన్నేళ్ల నుంచి మౌనంగా ఉన్న కమెడియన్స్ ఒక్కొక్కరుగా ఎందుకు ఇలా మాటల యుద్ధాలకు దిగుతున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డిని ఆర్పీ ఎందుకు అంతలా టార్గెట్ చేసాడు? అసలు దీని వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటి.. ఆర్పీ వెనక ఉన్నది ఎవరు?.. అనే ప్రశ్నలు ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్నాయి.

తిలోత్త‌మ వ‌ల్ల న‌య‌ని, విశాల్‌ వేరు కాబోతున్నారా?

ఆషికా గోపాల్‌, చందూగౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టిస్తోన్న‌ సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆస‌క్తిక‌ర మ‌లుపులు, ట్వీస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రైమ్ టైమ్ లో ప్ర‌సారం అవుతూ మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఇత‌ర‌పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, భావ‌నా రెడ్డి, విష్ణుప్రియ‌, ద్వార‌కేష్ నాయుడు, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య త‌దిత‌రులు న‌టించారు.   క‌సి కార‌ణంగా ఆస్తుల‌న్నీ పోగొట్టుకున్న తిలోత్త‌మ ఫ్యామిలీ అంతా విశాల్ - న‌య‌ని ఇంట చేర‌తారు. కొత్త ఇంట్లో స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తంతో పాటు హోమం చేయించాల‌ని న‌య‌ని ఏర్పాట్లు చేయిస్తుంది. అంతా కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకుని రెడీ అయిపోతారు. ఇదే స‌మ‌యంలో న‌య‌నికి ఇంట్లో చేయ‌బోతున్న హోమం కోసం తెచ్చిన ఇటుక‌ల వ‌ల్ల విశాల్ కు ప్ర‌మాదం వుంద‌ని తెలుస్తుంది. దీంతో పూజ జ‌రుగుతుంటే ఆ ఇటుక‌ల్ని పైన పెట్టిస్తుంది. ఇదే స‌మ‌యంలో న‌య‌ని చెల్లెలు సుమ‌న ద్వారా న‌య‌నికి వున్న వ‌రం గురించిన ర‌హ‌స్యాన్ని తిలోత్త‌మ‌ తెలుసుకుంటుంది.   దీని ఆధారంగా న‌య‌నిని విశాల్ కు దూరం చేయాల‌ని ప‌థ‌కం వేస్తుంది. విశాల్ పై ఇటుక ప‌డుతుంటే తెలిగా అత‌న్ని త‌ప్పించి త‌నకు గాయం అయ్యేలా చేసుకుంటుంది. దీంతో షాక్ కు గురైన విశాల్‌.. తిలోత్త‌మ‌ని హాస్పిట‌ల్ కి తీసుకెళ‌తాడు. అక్క‌డ బెడ్ పై అచేత‌నంగా ప‌డివున్న‌ట్టుగా యాక్టింగ్ మొద‌లు పెట్టిన తిలోత్త‌మ.. న‌య‌నిని టార్గెట్ చేస్తుంది. విశాల్ ముందు అడ్డంగా ఇరికించి త‌న‌పై అస‌హనాన్ని ప్ర‌ద‌ర్శించేలా చేస్తుంది. ఉన్న‌ట్టుండి విశాల్.. తిలోత్త‌మ కార‌ణంగా త‌న‌పై అర‌వ‌డంతో న‌య‌ని చొచ్చుకుంటుంది. ఏడుస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. అంతా వెళ్లాక క‌సి, వ‌ల్ల‌భ‌తో త‌న అస‌లు కుట్ర‌ని బ‌య‌ట‌పెడుతుంది తిలోత్త‌మ‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. అన్నం ముద్ద‌తో తిలోత్త‌మ‌కు దిష్టితీస్తూ న‌య‌ని ఏమ‌ని హెచ్చ‌రించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

కైలాష్‌ని య‌శ్ ఏం అడిగాడు? ఏం జ‌ర‌గ‌బోతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం` సీరియ‌ల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా సాగుతూ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటూ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ కీల‌క జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, ఆనంద్‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. వేద‌, య‌ష్ విడిపోయార‌ని, వారి పెళ్లి ఓ నాట‌క‌మ‌ని ఫ్యామిలీ జ‌డ్జిని ఇంటికి ర‌ప్పిస్తుంది మాళ‌విక‌. అయితే తెలివిగా వ‌సంత్ ఆ విష‌యాన్ని వేద‌కు చెప్పడంతో అంతా అల‌ర్ట్ అవుతారు. య‌ష్ ఇంటికి చెకింగ్ కోసం వ‌చ్చిన జ‌డ్జి.. మాళ‌విక చెప్పిన‌ట్టుగా ఇక్క‌డ ఏమీ జ‌ర‌గ‌లేద‌ని, అంతా బాగానే వుంద‌ని తెలుసుకుంటుంది. అంతే కాకుండా య‌ష్ - వేద‌ల గురించి ఇరుగు పొరుగు వారు కూడా పాజిటివ్‌గా చెప్ప‌డంతో మ‌రోసారి ఇలాంటి సిగ్గుమాలిని ప‌నికి పూనుకోవ‌ద్ద‌ని మాళ‌విక‌ని తీవ్రంగా మంద‌లిస్తుంది. 'నా తీర్పు త‌ప్పు కాద‌ని, ఖుషీని నీ క‌స్ట‌డీకి ఇచ్చి నేను త‌ప్పు చేయ‌లేద‌ని నిరూపించావు వేదా' అని అభినందిస్తుంది. దీంతో యష్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటారు. ఇక జ‌డ్జి వెళ్లిపోయిన త‌రువాత అంతా స‌మ‌యానికి విష‌యం చెప్పి ర‌క్షించావ‌ని వ‌సంత్‌ని అభినందిస్తుంటారు. "చేసింది వేద వ‌దిన. న‌న్ను అభినందిస్తున్నారేంటి?. తెలివిగా వ్య‌వ‌హ‌రించి మ‌న ఫ్యామిలీ ప‌రువుని కాపాడింది" అని వ‌సంత్ చెబుతాడు. దీంతో అంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోతారు. క‌ట్ చేస్తే.. కైలాష్.. ఫోన్ లో వేద ఫొటోలు చూస్తూ వుంటాడు. అప్పుడే సీరియ‌స్ అవుతూ వ‌చ్చిన య‌ష్ .. "నీకు వేద అసిస్టెంట్ తెలుసా?" అని అడుగుతాడు. అందుకు కైలాష్ తెలుస‌ని చెబుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'న‌న్ను లేపేయ‌డానికి ప్లాన్ వేసుకో'.. మ‌ల్లెమాల అధినేత‌కు ఆర్పీ స‌వాల్‌!

  రోజా వెళ్లిపోవ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో క‌ళ త‌ప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ షో పైనా, ఈ షోని నిర్వ‌హిస్తున్న నిర్వాహ‌కులైన మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డిపైనా క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. 'ఇటీవ‌ల సుడిగాలి సుధీర్ కు అక్క‌డ గ‌త నాలుగేళ్లుగా దారుణ అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని, ఆ కార‌ణంగానే అత‌ను ఆ షోని వీడాడు' అంటూ కిరాక్ ఆర్పీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం వాటిని హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ ఖండించ‌డం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కిరాక్ ఆర్పీ ఏకంగా నిర్మాత ఎం.శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంద‌ర్బంగా క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డిపై నిప్పులు చెరిగాడు. భార‌త‌దేశం గ‌ర్వంచ‌ద‌గ్గ నిర్మాత ఎం.ఎస్ రెడ్డి అని, ఆయ‌న క‌డుపున పుట్టిన శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డికి తండ్రి అంటూ విలువ‌లేద‌ని వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స‌వాల్ విసిరాడు. "నేమ్ ఫేమ్ కోస‌మో.. సంచ‌ల‌నం కోస‌మో నేను ఇలా మాట్లాడ‌టం లేదు. నాకు క‌ష్టం విలువ తెలుసు. నేను ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌డానికి వ‌చ్చి అన్న‌పూర్ణ హోట‌ల్ లో బాత్రూంలు క‌డిగాను." అంటూ చెప్పుకొచ్చాడు. "నేను ఇప్పుడు శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డిగారికి స‌వాల్ చేసి చెబుతున్నా.. తొక్కేస్తారు అని అంటున్నారు కదా.. నేను సినిమా తీస్తే ఆపుకో.. వెబ్ సిరీస్ తీస్తే ఆపుకో.. న‌న్ను లేపేయ‌డానికి ప్లాన్ వేసుకో.. మా ఇంట్లో బౌన్స‌ర్ లు లేరు. ఎప్పుడైనా రా న‌న్ను చంపుకో... నేను చ‌స్తే స‌మాధి నుంచే ప్ర‌శ్నిస్తా. ఇండ‌స్ట్రీలో నేను ఎవ‌రినీ ప్ర‌శ్నించ‌లేదు, జ‌బ‌ర్ద‌స్త్ లో ఎవ‌రిని ప్ర‌శ్నించ‌లేదు. కానీ శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డినే ప్ర‌శ్నిస్తున్నా... నేను ప‌ర్స‌న‌ల్ విష‌యాలు మాట్లాడ‌టంలేదు. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి గారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోకి వెళ్లానా?.. బానిస బ‌తుకులు.. బానిస బ‌తుకుల గురించే మాట్లాడుతున్నా".. అంటూ ఫైర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ.. అత‌ని కామెంట్స్ ఇప్పుడు సెన్సేష‌న‌ల్‌గా మారాయి.

ఐసీయూలో ఆర్య‌.. అను ఏమైంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతున్న ఈ సీరియ‌ల్ ని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందింయారు. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, విశ్వ‌మోహ‌న్‌, రాం జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, జ్యోతిరెడ్డి, క‌ర‌ణ్, అనుషా సంతోష్‌, సందీప్, మ‌ధుశ్రీ త‌దిత‌రులు న‌టించారు. మ‌లేసియా హ‌నిమూన్ టూర్ విషాదంగా మారుతుంది. హ‌నీమూన్ కోసం మ‌లేసియా వెళ్లిన ఆర్య - అను తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుంటారు. వీళ్లు ప్ర‌యాణిస్తున్న ఫ్లైట్ ప్ర‌మాదానికి గుర‌వుతుంది. సాంకేతిక లోపం కార‌ణంగా మంట‌లు చెల‌రేగ‌డంతో ఫ్లైట్ కాస్తా స‌ముద్రంలో ప‌డిపోతుంది. ఈ వార్త విన్న అను ప్యామిలీ తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతారు. టీవీలో ఈ వార్త చూస్తూనే అను తండ్రి సుబ్బు హార్ట్ స్ట్రోక్ కు గురికావ‌డంతో ఆయ‌న‌ని బ‌స్తీ వాసులు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. ఇక ఆర్య ఇంట్లో ప‌రిస్థితి కూడా ఇదే త‌ర‌హాలో వుంటుంది. ఆర్య - అను లు ప్ర‌యాణిస్తున్న విమానం ప్ర‌మాదానికి గురైంద‌ని తెలియ‌డంతో ఆర్య త‌ల్లి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌వుతుంది. ఇదే అద‌నుగా మాన్సి త‌ల్లి మాట‌ల‌తో ఆర్య ఫ్యామిలీని చిత్ర‌వ‌ద చేస్తూ వుంటుంది. ఆర్య - అను తిరిగిరాని లోకాలుకు వెళ్లిపోయార‌ని, వారు బ్ర‌తికి రావ‌డం క‌ల్ల అని ముస‌లి క‌న్నీరు కారుస్తూ వేధిస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చిన జెండే మాన్సీ త‌ల్లి షీలా నోరు మూయిస్తాడు. ఆర్య - అను బ్ర‌తికే ఛాన్స్ వుందంటాడు. క‌ట్ చేస్తే ఐసీయూలో అర్య .. త‌ల‌కు క‌ట్ల‌తో లేచి అను అంటూ అరుస్తాడు. వెంట‌నే ఆర్య ద‌గ్గ‌రికి వ‌చ్చిన జెండే అనుకు ఏమీ కాలేదంటాడు. కానీ ఆర్య న‌మ్మ‌డు.. ఇంత‌కీ అను ఏమైంది? ఎక్క‌డుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...

యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'పెళ్లి సందడి' చిత్రాన్ని టీవీల్లో వీక్షించేందుకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. వరుస టెలివిజన్ ప్రీమియర్స్ తో దూసుకెళ్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు', ఇప్పుడు 'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మీ ఎదురుచూపుకి ముగింపు పలకనుంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, రఘు బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 17న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.          వివరాల్లోకి వెళితే, రాఘవేంద్రరావు ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా, ద్రోణాచార్య అవార్డుగ్రహీతగా వశిష్ఠ అనే పాత్రలో నటించగా, యుక్తవయస్సులోని వశిష్టగా రోషన్ అదరగొట్టాడు. వశిష్ఠ (రాఘవేంద్ర రావు) తన జీవితకథను వివరిస్తుండడంతో కథ మొదలవుతుంది. వశిష్ఠ విధి కంటే సంకల్పశక్తే గొప్పదని నమ్మితే, సహస్ర (శ్రీలీల) విధే అన్నింటికీ కారణం అని విశ్వసిస్తుంది. ఐతే, వీరిద్దరూ ఒక పెళ్లిలో కలుసుకొని ప్రేమలో పడతారు. కానీ, సహస్ర తండ్రి (ప్రకాష్ రాజ్) వారి ప్రేమను అంగీకరించపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే, వశిష్ట, సహస్ర జంట తనను తిరిగి ఎలా ఒప్పిస్తారన్నదే మూలంగా కథ సాగుతుంది. వశిష్ఠ మరియు సహస్ర మధ్య జరిగే సన్నివేశాలు, రవి బాబు, షకలక శంకర్, వెన్నెల కిషోర్ వంటి హాస్యనటుల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమా ఆధ్యాంతం నవ్వులు పూయిస్తుంది. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం అందరిని ఆకట్టుకోగా, కలర్ఫుల్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ  ప్రేక్షకులను మెప్పించనుంది.

ఇంతకూ 'జబర్దస్త్‌'కు ఏమైంది?

ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఇంటిల్లిపాది హాయిగా నవ్వించడానికి అన్నట్టు ఉండేది. కొన్నేళ్లు బాగానే నడిచింది. కానీ తర్వాత్తర్వాత దాని రేటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇందులో ఉన్న టాప్ కమెడియన్స్, జడ్జెస్ ఎవరికీ వారు ఈ వేదికను వదిలి తమకు వస్తున్న అవకాశాలతో, రకరకాల కారణాలతో షోని వదిలేసి వెళ్లిపోతున్నారు. దీని కారణంగా జబర్దస్త్ కళ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ వేదిక నిండు గోదారిలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా పాపులర్ పర్సన్స్ స్కిట్స్ లేకపోయేసరికి ఈ షో చ‌ప్పగా సాగుతోంది. ఇక ఇటీవల కొంతమంది ఆర్టిస్టులు మల్లెమాల సంస్థ గొప్పతనాన్ని డామేజ్ చేసేలా మాట్లాడుతున్నారు.  అలాగే  జబర్దస్త్ అనేది కమెడియన్స్ వల్లనే బతికి బట్టకడుతోందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి ఈ షో రేటింగ్ అమాంతం కిందకు పడిపోయింది. అలాగే నాగ‌బాబు, రోజా.. ఇలా ఒక్కొక్కరు వెళ్లిపోయేసరికి  ఈ కామెంట్స్ అన్ని నిజమేనేమో అని అనిపిస్తోంది. ఐతే ఇన్ని విషయాలను తట్టుకుని కూడా జబర్దస్త్ షో సక్సెసఫుల్ గా రన్ అవుతోంది. నాగబాబు వెళ్ళిపోయాక రోజా ఈ షో బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంత్రి పదవి వచ్చేసరికి వెళ్లిపోయారు. ఇక  ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పేసరికి ఈ షో కి ఉన్న ఒకే ఒక అందం కూడా పోయింది. ఈ పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటే.. అసలు ఈ జబర్దస్త్ ఎటు పోతోంది అనే మీమాంస ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.

'గుప్పెడంత మ‌న‌సు' రిషి ఇన్‌స్టా హ్యాండిల్ హాక్‌!

'గుప్పెడంత మనసు' సీరియల్ ఈమధ్య మంచి రేటింగ్ తెచ్చుకుని అన్ని సీరియల్స్ తో పోటీ పడుతూ ముందు వరసలో నిలుస్తోంది. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీగా ఇప్పుడు యూత్ ని ఎక్కువగా అట్ట్రాక్ట్ చేస్తున్న సీరియల్. ఇందులో వసుధారగా రక్షా గౌడ, రిషిగా ముఖేష్ గౌడ, మహేంద్రగా సాయికిరణ్, విలన్ రోల్ సాక్షిగా రసజ్ఞ ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ తో ఈ సీరియల్ నడుస్తోంది. ఐతే ఇప్పుడు ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దీనికి గాను టీం మొత్తం కూడా కేక్ కట్ చేసుకుని సందడి చేసుకుంది. ఐతే ఒక మంచి వెనకాల చెడు ఉంటుంది. ఇటీవల ఫేమస్ పర్సన్స్ అకౌంట్స్ అన్నీ కూడా హాక్ అవుతున్నాయి. అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు రిషికి ఎదురయ్యింది. రిషి అలియాస్ ముఖేష్ గౌడ అనుక్షణం కష్టపడుతూ ఈ సీరియల్ లో తన నటనతో ఒక మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. దీనికి గాను ఎంతో మంది ఫాలోయర్స్ పెరిగారు, అభిమానులు కూడా పెరిగారు, తనకంటూ ఒక సక్సెస్ ని తెచ్చుకున్నాడు.  ఇలాంటి సంతోషకర సమయంలో రిషి ఇన్స్టాగ్రామ్ హేండిల్ ని ఎవరో హాక్ చేసేసారు. ఈ ఇన్సిడెంట్ తో టీం మొత్తం లైన్ లోకి వచ్చి రిషికి అండగా నిలబడింది. "కొంచెం ఆలోచించండి. అతని ఇన్స్టా హేండిల్ అతనికి తిరిగి ఇచ్చేయండి" అంటూ టీం మొత్తం కూడా ఈ విధంగా ముఖేష్ గౌడ గురించి తమ స్టోరీ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.

బాస్.. గంగ‌వ్వా మాజాకా!

అదృష్టం..అవ‌కాశం ఎప్పుడు ఎవ‌రి జీవితాన్ని మ‌లుపు తిప్పుతుందో చెప్ప‌లేం... ఆ క్ష‌ణం కోసం ఓపిక‌గా ఎదురుచూస్తూ ప్ర‌య‌త్నం చేస్తూ వుండాల్సిందే. అయితే అదృష్టంతో పాటు కాలం క‌లిసి వ‌చ్చిందా? ఇక అక్క‌డి నుంచి తిరుగేవుండ‌దు.. జీవితం కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఊహించ‌ని హైట్స్ కి తీసుకెళుతుంది. ఇది యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ విష‌యంలో అక్ష‌ర స‌త్యంగా నిలుస్తోంది. `మా విలేజ్‌ షో` అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఫేమ‌స్ అయి గంగ‌వ్వ ఇప్ప‌డు ఊహించని స్థాయికి వెళ్లింది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. క‌నీస విద్యార్హ‌త లేక‌పోయినా గంగ‌వ్వ సెల‌బ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తోంది. బిగ్ బాస్ సీజ‌న్ 4కు ఎంపికై హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అరుదైన అవ‌కాశాన్ని సొంతం చేసుకుని అంతా అవాక్క‌య్యేలా చేసిన గంగ‌వ్వ అక్క‌డ కూడా త‌న‌దైన మార్కు మాట‌ల‌తో కోట్ల మందికి చేరువ‌య్యింది. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లోనే హౌస్ ఉంచి బ‌య‌టికి వ‌చ్చిన గంగ‌వ్వ ఇదే స‌మ‌యంలో నాగార్జున నుంచి సొంతిల్లు క‌ట్టిస్తాన‌నే హామీని పొందింది. అన్న‌ట్టుగానే నాగార్జున గంగ్వ‌కు సొంతంగా ఇల్లు క‌ట్టించి ఇచ్చారు. బిగ్ బాస్ సీజ‌న్ ముగిసిన త‌రువాత నుంచి గంగ‌వ్వ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తోంది. రామ్ న‌టించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది. `ల‌వ్ స్టోరీ`లోనూ క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఇప్ప‌డు ఏకంగా మెగాస్టార్ న‌టిస్తున్న సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తున్న గంగ‌వ్వ‌కు ప్ర‌త్యేకంగా కార‌వాన్ ని కేటాయిస్తున్నార‌ట‌. పేరున్న వాళ్ల‌కు, స్టార్ల‌కు త‌ప్ప కార‌వాన్ లు కేటాయించ‌రు కానీ గంగ‌వ్వ‌కు ప్ర‌త్యేకంగా కార‌వాన్ ని కేటాయించ‌డంతో అంతా గంగ‌వ్వా మ‌జాకా అంటున్నారు. తన‌కు కార‌వాన్ ని నిర్మాత‌లు కేటాయిస్తున్న విష‌యాన్ని ఓ వీడియో ద్వారా వెల్ల‌డించింది గంగ‌వ్వ‌.  

వేద‌కు ప్ర‌శంస‌లు..మాళ‌విక‌కు చీవాట్లు పెట్టిన జ‌డ్జి!

బుల్లితెర‌పై కొంత కాలంగా ప్ర‌సారం అవుతున్న 'ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం' సీరియ‌ల్ ఆద్యంతం ట్విస్ట్‌లు, మ‌లుపుల‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజాశ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. బుధ‌వారం ఎపిసోడ్ ఫ్యామిలీ జ‌డ్జి ఎంట్రీతో ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది?.. మాళ‌విక కుట్ర ఫ‌లించ‌బోతోందా?.. అన్న‌ది ఇప్ప‌డు తెలుసుకుందాం. వేద‌, య‌ష్ విడిపోయార‌ని తెలుసుకున్న మాళ‌విక వెంట‌నే ఖుషీని య‌శోధ‌ర్ నుంచి వేరు చేయాల‌ని కుట్ర‌కు తెర‌లేపుతుంది. వెంట‌నే ఫ్యామిలీ కోర్టు జ‌డ్జిని క‌లుస్తుంది. వేద - య‌ష్ ల‌ది దొంగ పెళ్లి అని, త‌న నుంచి ఖుషీని సొంతం చేసుకోవాల‌న్న కుట్ర‌తోనే వాళ్లు పెళ్లి నాట‌కం ఆడుతున్నార‌ని చెబుతుంది. స‌రే నువ్వు చెప్పిందే నిజ‌మైతే ఖుషీని నీకు అప్ప‌గిస్తాన‌ని చెప్పి య‌ష్ ఇంటికి సిబ్బందితో స‌హా వ‌స్తారు జ‌డ్జి. య‌ష్ ని నిల‌దీస్తారు. "ఖుషీ కోసం మీరు, వేద పెళ్లి నాట‌కం ఆడారు" అంటారామె. "లేదు మేడ‌మ్, మీకు ఎవ‌రో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చారు" అని చెబుతాడు య‌ష్‌. వెంట‌నే జ‌డ్జి, "వేద ఎక్క‌డ?" అన‌డుగుతారు. అప్పుడే వేద ఎంట్రీ ఇస్తుంది. ఖుషి మీ గురించే అడుగుతూ వుంటుంద‌ని చెబుతుంది. అది గ‌మ‌నించిన మాళ‌విక ఇదంతా డ్రామా అంటుంది. ఇద్ద‌రు విడిపోయార‌ని, వీళ్ల మ‌ధ్య మాట‌లు లేవంటుంది. "కావాలంటే ఇరుగు పొరుగు వాళ్ల‌ని పిలిచి అడ‌గండి, వీళ్ల బండారం బ‌య‌ట‌ప‌డుతుంది" అంటుంది. దీంతో జ‌డ్జి ఇరుగు పొరుగు వాళ్ల‌ని పిల‌వండి అంటారు. "అలా చేస్తే మా ప‌రువు పోతుంది" అని ర‌త్నం అంటాడు. నా డ్యూటీ నేను చేయాల‌ని చెప్పిన జడ్జి ఇరుగు పొరుగు వారిని పిలిపించి విచారిస్తారు.  ప్ర‌తీ రోజు వేద - య‌ష్ గొడ‌వ ప‌డుతుంటార‌ని వ‌చ్చి వాళ్లు చెప్ప‌డంతో అంతా షాక్ అవుతారు. ఆ త‌రువాత వ‌ర్షం ప‌డిన రోజు య‌ష్.. వేద‌ని త‌న గుండెల‌కు హ‌త్తుకుని ఐ ల‌వ్ యూ చెప్పాడ‌ని, అంతే కాకుండా ఇటీవ‌ల జ‌రిగిన బార‌సాల‌లో వేద గురించి ఎంతో గొప్ప‌గా చెప్పాడ‌ని చెబుతారు. "వేద మంచి భార్యే కాదు, మంచి త‌ల్లి కూడా" అని ప్ర‌శంస‌లు కురిపిస్తారు. దీంతో మాళ‌విక చెప్పింది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని జ‌డ్జి గ్ర‌హిస్తారు. వేద‌ని ప్ర‌శంసించి, మాళ‌విక‌కు చీవాట్లు పెడతారు. దాంతో మాళ‌విక ముఖం పాలిపోతుంది.

11 నెలల కేలండర్ ఎక్కడైనా ఉంటుందా?

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రెడీ అవుతూ ఆడియన్స్ ని పలకరిస్తూ రేటింగ్ లో కూడా దుమ్ము దులిపేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ కేలండర్ లా అంటూ 2022 కేలండర్ ని చూపిస్తూ ఒక్కో నెలని ఒక్కొక్కరికి డేడికేట్ చేస్తూ అట్లుంటది మనతోని అన్న రేంజ్ లో కనిపిస్తోంది.  ఇక విషయంలోకి వస్తే జనవరిలో కీర్తికేశవ్ భట్, ఆది, ఫిబ్రవరిలో రష్మీ, మార్చ్ నెలకు కావ్యశ్రీ, నిఖిల్ జంట, ఏప్రిల్ నెలకు రష్మీ, నందిత శ్వేతాతో మరో వ్యక్తి ఉన్న జంట, మే నెలకు శివజ్యోతి, గంగూలీ జంట, జూన్ నెలకు ఆటో రాంప్రసాద్ జంట, జులై నెలకు ఆసియా, నూకరాజు, ఆగష్టు నెలకు హైపర్ ఆది, నాటీ నరేష్ తో మరో జంట, సెప్టెంబర్ నెలకు శాంతిస్వరూప్, బులెట్ భాస్కర్ నాన్న, మరో జోడి, ఇంకా నవంబర్ నెలకు ఫైమా, ప్రవీణ్ జంట కనిపించగా ఇక అదే నవంబర్ నెలలో ప్రగతి మరో లేడీతో కనిపించింది, ఫైనల్ గా డిసెంబర్ నెలలో అంబటి అర్జున్, సుహాసిని జోడి కనిపించబోతోంది. అంతా బానే ఉంది కానీ 12 నెలల్లో ఒక నెలను మాత్రం కనిపించకుండా సెన్సార్ చేశారు. అక్టోబర్ నెల కేలండర్ లో కనిపించలేదు.  ఈ నెలను మాత్రం ఎవరికీ ఎందుకు డేడికేట్ చేయలేదో తెలీలేదు. అలాగే ఈ నెలను కనబడకుండా చేయడం వెనక ఉద్దేశం కూడా అంతుబట్టడం లేదు. లేదంటే అక్టోబర్ బదులు నవంబర్ అని పొరపాటున రెండు సార్లు వచ్చేసిందా. ఇక బాక్గ్రౌండ్ వాయిస్ లో "కనబడాల్సింది ఒకే ఒక్క పేరు .. అట్లుంటది మనతోని" అంటూ వినిపిస్తుంది. మరి ఈ అక్టోబర్ నెలను సుధీర్ కి కానీ డేడికేట్ చేశారా!.. కానీ ప్రెజంట్ ఈ సీరియల్ నుంచి  పక్కకు వెళ్ళాడు కాబట్టి ఆ నెలను కనిపించకుండా చేశారా లేదా ఇంకా ఎవరైనా స్పెషల్ జోడితో ఎపిసోడ్ లో సీక్రెట్ గా రిలీజ్ చేస్తారా.. అబ్బో.. ఇలాంటి ఎన్నో అనుమానాలను రైజ్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఆ ఒక్క నెల వెనక ఉన్న మిస్టరీ ఏమిటో తెలియాలంటే 17 వరకు ఆగాల్సిందే.  

'సూర్యకాంతం'లో హీరో సుశాంత్

మన సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్న కట్టుబాట్లు, బాధ్యతలు ఎన్నో. వాటితో పాటు వాళ్ళు ఎదుర్కొనే ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎన్నో. ఇన్ని హర్డిల్స్ ని దాటుకుని  విజయవంతమైన మహిళలు కొందరే. ఆ కొందరిలో ఒకరు  సూర్యకాంతం. ఐతే ఇప్పుడు ఈ సీరియల్ లో ఒక ట్విస్ట్ కనిపించబోతోంది. బిగ్ స్క్రీన్ మీద నటించిన హీరో సుశాంత్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కనిపించి సందడి చేయనున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్ లో గెస్ట్ రోల్ చేయడానికి సిద్దమయ్యాడు సుశాంత్. ఐతే ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇందులో సుశాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఒక కేసును కూడా సాల్వ్ చేయడానికి రాబోతున్నాడు కూడా. ఇందులో భాగంగా సూర్య క్యారెక్టర్ తో కలిసి చేసే కామెడీ కూడా  ఆడియన్స్ ని అలరించనుంది. సుశాంత్ 'అల వైకుంఠపురం'లో నటించి అలరించాడు. ఇక ఇప్పుడు సీరియల్ విషయానికి వస్తే టామ్ బాయ్ గా సూర్య జీవితం ఈ సీరియల్ లో కీ రోల్. ఐతే బాగా డబ్బున్న ఒక అతను చైతన్యను పెళ్లి చేసుకుంటుంది. ఐతే చైతన్యకి ముగ్గురు అక్కలు ఉంటారు.  వాళ్లకు సూర్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. సూర్యను వాళ్ళ ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. మరి వాళ్లందరినీ ఎలా ఒప్పించి, విజయం సాధించాడు అనేదే ఈ సీరియల్ మెయిన్ స్టోరీ. ఇక ఈ సీరియల్ లో అనూష హెగ్డే, ప్రజ్వల పిడి, సాహితి, ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. జులై 2019లో ఈ సీరియల్ ప్రారంభమయ్యింది. తమిళ్ సీరియల్ సత్య యొక్క రీమేక్ ఈ సీరియల్.

మేం కలిసిపోయాం.. ఒక కారు కూడా కొనుక్కున్నాం!

సిరి హన్మంత్.. ఈ పేరు అందరికీ పరిచయమే. బిగ్ బాస్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో సిరి వేసుకున్న డ్రెస్సుల దగ్గర నుంచి షన్నుతో రెచ్చిపోయి మరీ చేసిన రొమాన్స్ వరకు కూడా ఆడియన్స్ కి అన్ని విషయాలు తెలుసు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది సిరి. బిగ్ బాస్ హౌస్ లో ఆమె షన్నుతో చేసిన ముద్దుల వ్యవహారం పై చాలా రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ కూడా అయ్యాయి.  షన్ను లేకపోతే బతకలేను అన్నట్టుగా ఒక సీన్ ని బాగా క్రియేట్ చేసి పండించేసింది. దాంతో ఆల్రెడీ అప్పటికే దీప్తితో ప్రేమలో ఉన్న షన్ను కొంత క‌న్ఫ్యూజ‌న్‌కు గురయ్యాడు. మరో పక్క దీప్తి ఇవన్నీ చూసి షణ్ముఖ్ తో లవ్ బ్రేకప్ చెప్పేసింది. అలాగే సిరి హన్మంత్‌కు ఆమె లవర్ శ్రీహాన్ కూడా బ్రేకప్ చెప్పాడు. అదే టైంలో వీళ్లందరి మధ్య గొడవలు కూడా తారాస్థాయికి వెళ్లాయి. ఏమయ్యిందో ఏమో కానీ ఇటీవల ఒక విషయం గమనిస్తే షన్ను, దీపు కలవలేదు కానీ శ్రీహాన్, సిరి హన్మంత్ మాత్రం కలిసిపోయి చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. ఇద్దరి మధ్య అసలేం జరగనట్టే కనిపిస్తున్నారు.. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టేటస్ లో పెట్టేసుకున్నారు. ఇక ఇద్దరూ కలిసి పండగ చేసుకోవడమే కాకుండా ఒక కాస్ట్లీ కారు కూడా కొనేసుకున్నారు. "కారు కొంటే కొన్నావ్ కానీ డ్రైవింగ్ నేర్చుకో ముందు" అంటూ పోస్ట్ పెట్టాడు శ్రీహాన్.  ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 కి శ్రీహాన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే అక్కడ శ్రీహాన్ ఎంత బాగా గేమ్ ప్లే చేస్తాడో చూడాల్సిందే.. వీళ్ళిద్దరూ కలిసిపోయారు.. అక్కడ దీప్తి, షన్ను ఎప్పటికీ కలుస్తారో వాళ్ళకే తెలియాలి.

ర‌ష్మీ ఇంటి లోన్‌కు మ‌ల్లెమాల ష్యూరిటీ సంత‌కం చేసింది: హైప‌ర్ ఆది

కిరాక్ ఆర్పీ ఇటీవ‌ల మ‌ల్లెమాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా సుడిగాలి సుధీర్ ని దారుణంగా అవ‌మానించార‌ని, అది భ‌రించ‌లేకే అత‌ను బ‌య‌టికి వ‌చ్చాడ‌ని కిరాక్ ఆర్పీ చేసిన ఆరోప‌ణ‌లు ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్దాల‌ని, మ‌ల్లెమాల ఎవ‌రినీ అవ‌మానించ‌లేద‌ని హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ తీవ్రంగా ఖండిస్తున్నారు. మ‌ల్లెమాల అంద‌రిని బాగా చూసుకుంద‌ని, అవ‌స‌రాల్లో ఉంటే డ‌బ్బు ఇచ్చింద‌ని, త‌రువాత ఎప్పుడో చేయాల్సిన స్కిట్ల డ‌బ్బులు కూడా ముందే ఇచ్చేసింద‌ని హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ర‌ష్మీ ఇంటి లోన్ కోసం మ‌ల్లెమాల షూరిటి సంత‌కం కూడా చేసింద‌ని, బ‌య‌ట ఏ సంస్థ అయినా ఇలా చేస్తుందా?  షూరిటీ సంత‌కం పెడుతుందా? అని ఎదురుప్ర‌శ్నిస్తున్నారు హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్.  "మా లాంటి వాళ్ల‌కే కాకుండా  చిన్న‌వాళ్ల‌కు కూడా సాయం చేసింది. ప‌ర‌దేశీ వాళ్ల అమ్మ‌కు బాగాలేద‌ని తెలిసి ముందుగానే డ‌బ్బులు ఇచ్చారు. అత‌ను ఢీకి రైట‌ర్ గా కూడా ప‌నిచేసేవాడు. అలా అడ్వాన్స్ గా టీమ్ లీడ‌ర్ల‌కు ఎన్నో ల‌క్ష‌లు ఇచ్చారు. పంచ్ ప్ర‌సాద్ కు అయితే ఎన్నో షోల‌లో ప‌ని క‌ల్పించారు. నెల‌కు అత‌ను దాదాపు మూడు ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. దొర‌బాబు, ప‌ర‌దేశీ ల వైజాగ్ ఘ‌ట‌న త‌రువాత మ‌ల్లెమాల ఒక్క‌మాట కూడా అన‌లేదు. ప‌రిస్థితిని అర్థం చేసుకుని నా మాట మీద న‌మ్మ‌కంతో ఆ ఇద్ద‌రిని మ‌ళ్లీ తీసుకున్నారు. వేరే సంస్థ అయితే గేటు కూడా దాట‌నివ్వ‌దు. కానీ మ‌ల్లెమాల అలా చేయ‌లేదు. అంత గొప్ప సంస్థ మ‌ల్లెమాల‌" అని తెలిపారు హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్.  "అలాంటి మ‌ల్లెమాల మీద కిరాక్ ఆర్పీ ఆరోప‌ణ‌లు చేయడం చాలా త‌ప్పు. వాటిని ఎవ్వ‌రు కూడా స‌మ‌ర్థించ‌రు. సుడిగాలి సుధీర్ కు డ‌బ్బు అవ‌స‌రం పెరిగింది.. అందువ‌ల్లే బయ‌ట ఎక్కువ వ‌స్తుందంటే బ‌య‌టికి వెళ్లాడు. అత‌న్ని ఇక్క‌డ ఎవ‌రూ అవ‌మానించ‌లేదు" అంటూ కిరాక్ ఆర్పీకి హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ కౌంట‌ర్ ఇచ్చారు. 

జ‌న‌సేనానితో క‌లిసి పాలిటిక్స్‌లోకి ఆది ఎంట్రీ!?

జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి,  జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి స్పెషల్ గా ఏమీ చెప్పుకోనవసరం లేదు. పవన్ సినిమాలు, రాజకీయాలు బాలన్స్ చేస్తూ ఉంటే  ఆది కూడా షోస్ ని, మూవీస్ ని బాలన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆది పంచ్ డైలాగ్స్ కి ఫేమస్ ఐతే, పవన్ ట్రెండ్ సెట్ చేయడంలో ఫేమస్. ఐతే జనసేనాని మీద ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.  పీకేకి ఆది వీరాభిమాని అని ఆడియన్స్ కి బాగా తెలుసు. ఐతే తాజాగా ఆది ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో పాటు తానూ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషిని తానింత వరకు చూడలేదన్నాడు. ఐతే క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్  హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ కోసం ఆయన్ని ఇంటికి వెళ్లి మరీ కలిసినట్లు చెప్పుకొచ్చాడు. అసలు పవన్ కళ్యాణ్ కి డబ్బు విషయం పెద్ద లెక్క కాదు, అలా అని అంత వ్యామోహం కూడా లేదంటూ కితాబిచ్చాడు. ఆయన సినిమాల్లో నటిస్తూ ఆ వచ్చిన రెమ్యూనరేషన్ ని పార్టీ కోసం, కార్యకర్తల కోసం అలాగే రైతుల కోసం వినియోగించడం అభినందనీయం అన్నాడు.  తన కోసం తన వాళ్ళ కోసం కాకుండా సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఎప్పుడూ ఉంటాడు కాబట్టే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసే విషయంపై సరైన క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేసాడు. ఏదేమైనా నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి ఆల్రెడీ ఒక మాటేసి ఉంచేసాడు. ఈ మాట ప్రకారం  ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

దూకుడు పెంచిన బిగ్ బాస్ స్టార్ ష‌ణ్ముఖ్‌!

'ది సాఫ్ట్‌వేర్ డెవ‌లప‌ర్‌', 'సూర్య' వంటి యూట్యూబ్ సిరీస్ ల‌తో ఆక‌ట్టుకుని పాపుల‌ర్ అయిన యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్‌ జ‌స్వంత్‌. కొత్త కొత్త వీడియోల‌తో, షార్ట్ ఫిలిమ్స్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నాడు. మిలియన్ ల కొద్దీ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ని సొంతం చేసుకున్న జ‌స్వంత్ ఈ క్రేజ్ తో రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే సిరి కార‌ణంగా, త‌న‌తో చేసిన అతి వ‌ల్ల ష‌ణ్ముఖ్ విన్న‌ర్ కాలేక ర‌న్న‌ర‌ప్ గా మిగిలిపోయాడు. ఇదే సిరి కార‌ణంగా త‌ను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న దీప్తి సున‌య‌న‌తో బ్రేక‌ప్ అవ్వాల్సి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి తీవ్ర నిరాశ‌లో వున్న ష‌ణ్ముఖ్ మొత్తానికి దూకుడు పెంచాడు. మ‌ళ్లీ మునుప‌టి జోష్ తో రంగంలోకి దిగాడు. ఏకంగా వెబ్ సిరీస్‌తో ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి ప్ర‌వేశిస్తున్నాడు. ష‌ణ్ముఖ్ న‌టించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `ఏజెంట్ ఆనంద్ సంతోష్‌`. ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మొత్తం 10 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్‌ని నిర్మించారు. ఆహాలో వీక్లీ వన్స్ ఓ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్ ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. స‌రికొత్త థాట్స్ తో ఈ సిరీస్ ఆస‌క్తిక‌రంగా వుంది.   "ఇంత‌కీ నువ్ ఏం చేస్తుంటావ్? నెల‌కి నీ జీతం ఎంత వ‌స్తుంది? అస‌లు ఎంత ఖ‌ర్చవుతుంది? ఎంత మిగులుతుంది?".. అంటూ ష‌ణ్ముఖ్ ను ప్ర‌శ్న‌లు అడ‌గ‌డంతో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. "నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ ను స‌ర్" అని ష‌ణ్ముఖ్ ఇచ్చే స‌మాధానం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వెబ్ సిరీస్ పై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు. ఇందులో ష‌ణ్ణు చాలా స్టైలిష్ గా క‌నిపించాడు. "మ‌న‌సు త‌ప్ప ఫిజిక‌ల్ గా, లిక్విడ్ గా ఏదైనా వెదికి పెడ‌తా" అని అత‌ను చెప్పే డైలాగ్ త‌న ఫ్యాన్స్ తో పాటు అంద‌రిని ఆక‌ట్టుకునేలా వుంది. ఈ సిరీస్ కు అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, సుబ్బు స్క్రిప్ట్ అందించాడు.