'స్ట్ర‌యిట్‌గా చూస్తే శాంతిస్వరూప్‌లా ఉంటావ్'.. వర్ష పరువు తీసిన భాస్కర్!

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల‌లో ఎప్పుడూ కూడా స్కిట్ పండాలంటే కొన్ని జోక్స్ వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటూ ఆ షోకి రేటింగ్ పెంచే పనులు చేస్తూ ఉంటారు కమెడియన్స్. కొన్ని స్క్రిప్టెడ్ ఐతే కొన్ని స్పాంటేనియస్ గా జోక్స్ వేసేస్తూ ఉంటారు. అలాంటి ఒక జోక్ ఇప్పుడు ఎక్స్ట్రా  జబర్దస్త్ స్కిట్ లో మనం చూడొచ్చు. వర్ష మీద బులెట్ భాస్కర్ వేసిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాబోయే ఎపిసోడ్ లో ఈ జోక్ మనకు వినిపిస్తుంది. "అసలు వర్ష అమ్మాయేనా? మగాడిలా ఉంది" అంటూ భాస్క‌ర్‌ చేసిన కామెంట్స్ కి వర్ష స్టేజి మీద ఒక్కసారిగా షాక్ ఐపోయింది. "వర్ష అమ్మాయే కాదు, పక్కన ఉంటే అబ్బాయితో ఉన్న ఫీలింగ్ వస్తుంది" అంటూ గతంలో ఒక స్కిట్ లో ఇమ్ము కూడా అన్నాడు. అప్పుడు వర్ష చాలా హర్ట్ అయ్యింది. వెంటనే స్టేజి మీదే సీరియస్ ఐపోయి స్కిట్ మధ్యలోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే డైలాగ్ ఇప్పుడు బులెట్ భాస్కర్ నోటి నుంచి వ‌చ్చింది. కానీ వర్ష మాత్రం ఆ హఠాత్పరిణామానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక నవ్వేసింది. అప్పుడు ఇమ్ము సారీ కూడా చెప్పాడు. కానీ భాస్కర్ మాటలకు ఇప్పుడు వర్ష బాధపడినట్లే కనిపించడం లేదు. వర్ష, బులెట్ భాస్కర్ ఇద్దరూ కలిసి లవర్స్ లా "తెల్ల తెల్లని చీర" పాటకు రొమాంటిక్ డాన్స్ చేశారు. తర్వాత వర్ష "నేను యాంకర్ ని.. యాంకర్ ని అని అందరికీ చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదేంటి?" అంది. "నిన్ను అమ్మాయంటేనే ఎవరూ నమ్మట్లేదు.. ఇంక యాంకర్ అంటే ఎందుకు నమ్ముతారు?" అని వర్ష పరువు తీసేసాడు భాస్కర్. "నువ్ అలా అంటావ్ కానీ.. నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాననుకో లెఫ్ట్ నుంచి ఇంద్రజ గారు, రైట్ నుంచి ఖుష్భూ గారు అంటారు నన్ను" అంది వర్ష వ‌య్యారాలు పోతూ. "ఐతే స్ట్రైట్ గా చూస్తే శాంతి స్వరూప్ అంటారు" అని ఫుల్లుగా రెచ్చిపోయి పంచ్ వేశాడు భాస్కర్. వర్ష మూతి ముడుచుకుని ఏమి అనలేకపోయింది. ఇలా ఈ వారం బులెట్ భాస్క‌ర్ పంచెస్‌కి వర్ష బలైనట్టు కనిపిస్తోంది.

బోనాలు స్పెషల్: పండగలా 'జీ తెలుగు వారి జాతర'

బోనాల పండగ అనగానే భక్తుల కోలాహలంతో నిండిన గుళ్ళు, పోతరాజుల సందడి, అదరగొట్టే పాటలు, మరియు జాతరలు గుర్తుకురావడం సహజం. ఐతే, ఈ ఆదివారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు' బోనాల పండగ సంధర్బంగా అదే సందడిని మీ టీవీ స్క్రీన్స్ పై ఆవిష్కరించనుంది. 'జీ తెలుగు వారి జాతర' అనే కార్యక్రమంతో బుల్లితెర తారలు, కమెడియన్స్, మరియు సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ నాన్-స్టాప్ వినోదాన్ని పంచనుంది. శ్రీముఖి యాంకర్ గా మరియు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్ అతిధులుగా అలరించనున్న ఈ కార్యక్రమం, జూలై 31న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.  వివరాల్లోకి వెళితే, ఈ ఈవెంట్ ను నాలుగు జట్ల (జీ గ్యాంగ్, హౌస్ ఫుల్ గ్యాంగ్, చిచోరే గ్యాంగ్, జంటల గ్యాంగ్) మధ్యజరిగే నవ్వులాటగా వర్ణించవచ్చు. ప్రతీ గ్యాంగ్ యొక్క ఎంట్రీ అనంతరం వారిని జాతరకు సంబందించిన కొన్ని హాస్యపూరితమైన ప్రశ్నలను అడగడంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ చిలిపి ప్రశ్నలు అందరికి నవ్వులు పంచడమే కాకుండా ప్రేక్షకులకు వారి చిన్ననాటి అనుభవాలను గుర్తుచేస్తాయి. అంతేకాకుండా, ప్రేమ జంటలు (మనోజ్ & మధు, వల్లిగాయత్రి & తేజ, యాదమ్మ & స్టెల్లా, మెహబూబ్ & బ్రమరాంభిక, వెంకట చైతన్య & మణి కీర్తిక) 1980 నాటి పాటలకు వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలాడిస్తాయి. దీనితోపాటు, రియల్-లైఫ్ కపుల్స్ అనంత్ శ్రీరాం-స్వాతి, ఎకనాథ్-జై హారిక, అకుల్ బాలాజీ- జ్యోతి, విధ్యులేఖ-సంజయ్ మరియు సాకేత్-పూజిత 'టీజింగ్' థీమ్ తో చేసిన డాన్సులు అందరిని అలరిస్తాయి. అదేవిధంగా, గాయనీగాయకులు రఘు కుంచె, మధుప్రియ, శివనాగులు, మరియు మౌనిక యాదవ్ ఫోక్ సాంగ్స్ తో అదిరిపోయే ప్రదర్శనలు చేయనున్నారు. 'సీతా రామం' హీరోహీరోయిన్లు దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ చేసిన అల్లరి అందరిని మెప్పిస్తుంది. దుల్కర్ కు అంకితం చేస్తూ చేసిన సింగింగ్ మరియు డాన్స్ పెర్ఫార్మన్సెస్ అనంతరం దుల్కర్ పడిన పాట ప్రేక్షలను అలరిస్తుంది. అదేవిధంగా, ఇటీవలే పెళ్లాడిన కమెడియన్ రియాజ్ పై చేసిన ఒక ఫన్నీ సెగ్మెంట్ ఈ కార్యక్రమానికే హైలైట్ గా నిలుస్తుండగా, సీనియర్ నటీమణులు ఆమని, హరిత, శృతి లు చేసిన బోనాలు యాక్ట్, ఆ తరువాత సద్దాం-రియాజ్ జంట భాను శ్రీ, రోల్ రైడా, శివజ్యోతి, రోహిణి, మెహబూబ్, గణేష్ లతో కలిసి చేసిన కామెడీ స్కిట్ ఈ కారక్రమానికి ఘనమైన ముగింపు పలుకుతాయి. 

మ‌ళ్లీ వ‌స్తోన్న 'తల్లా పెళ్లామా'.. అనసూయ స్థానంలో శ్రీముఖి?

జెమినీ టీవీలో గతంలో ప్రసారమైన 'తల్లా పెళ్ళామా' రియాలిటీ షో కరోనా కారణంగా ఆగిపోయింది. ఐతే ఇప్పుడు మళ్ళీ ఈ షోని తిరిగి ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ ఛానల్. జులై 31 నుంచి ఈ సీరియల్ ఎపిసోడ్స్ ని తిరిగి ప్రసారం చేయబోతోంది. ఇప్పుడు ఈ రియాలిటీ షో ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ రవి అతని వైఫ్, వాళ్ళ అమ్మ పార్టిసిపేట్ చేసిన ప్రోమో ఇప్పుడు ప్రసారమవుతోంది. ఐతే ఈ ఫామిలీతో స్టార్ట్ చేసిన ఎపిసోడ్ కాబట్టి మళ్ళీ ఆడియన్స్ లో ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసింది జెమినీ టీవీ. భార్యకు, తల్లికి కొన్ని టాస్కులు ఈ షోలో ఇస్తారు. ఎవరు పోటీ పడి ఆడగలరు అనే విషయంపై పిల్లలు తల్లికి ఓటేస్తారా.. పెళ్ళానికి ఓటేస్తారా? అంటూ సాగే ఒక ఈ 'తల్లా.. పెళ్ళామా' ..రియాలిటీ షోకి అప్పట్లో కొంతమంది సినీ, టీవీలో ఫేమస్ యాక్టర్స్ వాళ్ళ అమ్మలతో, భార్యలతో కలిసి పార్టిసిపేట్ చేశారు.  ఇక ఈ రియాలిటీ షో ఈ నెల జులై 31 ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్స్ కి హోస్ట్ గా గతంలో అనసూయ చేసింది. ఐతే ఇప్పుడు అనసూయ మిగతా షోస్ లో, మూవీస్ లో బాగా బిజీగా ఉన్న కారణంగా ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐతే ఇద్దరిలో ఎవరు వస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి వుంది.

వరూధినికి పెళ్లయిపోయింది!

బుల్లితెర ఆర్టిస్టులు ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ ఐపోతున్నారు. ఇప్పుడు కన్నడ భామ చందనా శెట్టి కూడా వివాహం చేసేసుకుని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసేస్తోంది. ఈమె గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. 'వరూధిని పరిణయం' సీరియ‌ల్‌లో నటించింది చందన. అలాగే 'స్వర్ణ ప్యాలేస్', 'పవిత్ర బంధం', 'దేవయాని' వంటి సీరియల్స్ లో నటించింది. కన్నడలో వచ్చే మూవీస్ కి చందన డబ్బింగ్ చెప్తూ ఉంటుంది.  అలాగే మరో వైపు యాంకరింగ్ చేస్తూ ఇలా తెలుగు, కన్నడలో సీరియల్స్ చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఇక చందన తన చిన్నతనంలో కర్నాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకుంది. సింగర్ కావాలనుకుంది కానీ కాలేకపోయింది. మంచి నటిగా అవకాశాలు వచ్చేసరికి వాటి మీద దృష్టి పెట్టింది చందన. ఐతే చందన రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన పెళ్లి ఫోటోలను రివీల్ చేసింది సోషల్ మీడియాలో. చందన భర్త పేరు అనిల్. అతను తెలంగాణకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం తన భర్తతో కలిసి యూఎస్ కి వెళ్ళిపోయింది చంద‌న‌. 'వరూధిని పరిణయం' సీరియల్ ఐపోయినా కానీ అందులో వరూధినిని మాత్రం ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. చందన అనే పేరు కంటే కూడా వరూధిని గానే చాలామంది గుర్తుపడతారు.  ఆ హ్యాపీ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోవడానికి చందన తన చేతి మీద 'వరూధిని' అనే పేరుని టాటూగా కూడా అప్పట్లో వేయించేసుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ కి ఏ సీజన్ ఎలాంటి బ్యూటీ టిప్ అవసరమో కూడా చెప్తూ ఉంటుంది వరూధిని అలియాస్ చందనా శెట్టి.

మోనిత రి-ఎంట్రీ.. క‌థ ఇక మామూలుగా ఉండ‌దు!

`కార్తీక‌దీపం` సీరియ‌ల్ లో డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌ల‌తో పాటు త‌న విల‌నిజంతో మంచి క్రేజ్ ని తీసుకొచ్చిన పాత్ర మోనిత‌. ప్ర‌తీ ఎపిసోడ్ ని త‌న కుట్ర‌ల‌తో కీల‌క మ‌లుపులు తిప్పించింది. వంట‌ల‌క్క‌ని మోనిత బాధలు పెడుతున్న తీరుకు చాలా మంది ఈ పాత్ర ఎంట్రీ ఇవ్వ‌గానే శాప‌నార్థాలు పెట్టేవార‌ట‌. అంత‌లా త‌న పాత్ర‌తో అంద‌రిని క‌ట్టిప‌డేసింది మోనిత‌.  డాక్ట‌ర్ బాబుతో రాక్ష‌స ప్రేమ‌.. అనూహ్య ప‌రిస్థితుల్లో డాక్ట‌ర్ బాబుని మోసం చేసి త‌ల్లి కావ‌డం.. దాన్ని అడ్డంపెట్టుకుని డాక్ట‌ర్ బాబుని సొంతం చేసుకోవాల‌ని కుట్ర‌లు చేయ‌డంతో `కార్తీక దీపం` ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరిగింది. టాప్ 1 రేటింగ్‌తో రికార్డు సృష్టించింది. క‌థ మొత్తం కార్తీక్‌, దీప‌, మోనిత‌ మ‌ధ్యే సాగింది. దీంతో ఈ సీరియ‌ల్ టాప్ లో నిలిచి రికార్డు సృష్టించింది.  అయితే తాజాగా వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌ని ఎండ్ చేసి వారి త‌రువాత త‌రంతో సీరియ‌ల్ ని న‌డిపిస్తున్నారు. అయితే రేటింగ్ మ‌రీ దారుణంగా ప‌డిపోయింది. దీంతో నెంబ‌ర్ స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవాల‌ని సీరియ‌ల్ మేక‌ర్స్ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు కానీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మోనిత పాత్ర‌ని రీఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌ని మ‌ళ్లీ రంగంలోకి దింప‌డం కుద‌ర‌ని ప‌ని కావ‌డంతో మోనిత‌నే మ‌ళ్లీ ఓల్డ్ పాత్ర‌లో దించేయాల‌ని భావిస్తున్నార‌ట‌.  డాక్ట‌ర్ బాబు కార‌ణంగా త‌న‌కు కొడుకు వున్న విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌ని హిమ‌, శౌర్య రవ్వా ఇడ్లీ పేరుతో పిలుచుకుంటున్నారు. ఆ పాత్ర‌ని మొత్తానికి అనాథ‌ని చేశారు. త‌న కొడుకుని ఇంటికి చేర్చాల‌ని, త‌న‌కు ఆస్తిలో వాటా ఇవ్వాల‌నే కోణంలో మోనిత పాత్రని రంగంలోకి దింపి సౌంద‌ర్య‌పై కుట్ర‌లు చేయించ‌డం వంటివి మొద‌లు పెట్టొచ్చ‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇందుకు మోనిత పాత్ర‌లో న‌టించిన శోభాశెట్టి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది. 

తిలోత్త‌మ‌కు అస‌లు ర‌హ‌స్యం చెప్పిన విశాల్‌!

అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపులు, ట్విస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జీ తెలుగులో గ‌త కొంత కాలంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ రాత్రా 8:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, భావ‌నా రెడ్డి, విష్ణు ప్రియ‌, ద్వార‌కేష్ నాయుడు, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. ఆరు బ‌య‌ట కూర్చుని తిలోత్త‌మ మొక్క‌జొక్క పొత్తు కాలుస్తూ వుంటుంది. ఇదేం చిత్ర‌మో అని న‌య‌ని షాక‌వుతూ తిలోత్త‌మ‌ని అడుగుతుంది. నా కొడుకు కోసం కాలుస్తున్నాన‌ని చెప్ప‌గానే వ‌ల్ల‌భ బావ‌గారి కోస‌మా అంటుంది నయ‌ని. అయితే ఇది వ‌ల్ల‌భ కోసం కాద‌ని విశాల్ కోస‌మ‌ని తిలోత్త‌మ చెప్ప‌డంతో న‌య‌ని షాక్ అవుతుంది. ఏంటీ షాక్ అయ్యావా?  దీనికి ఉప్పుకారం, నిమ్మ‌కాయ ర‌సం కాకుండా మ‌రేదైనా రాసిస్తాన‌ని భ‌య‌ప‌డుతున్నావా? అలా చేస్తే నీకు ముందే తెలిసిపోతుంది క‌దా ? అందుకే ఆ ప‌ని చేయ‌డం లేద‌ని  న‌య‌నితో అంటుంది. క‌ట్ చేస్తే.. న‌య‌నికి తెలిసిన ఎస్ ఐ భూష‌ణ్‌ భార్య‌తో మాట్లాతుంటాడు. మీ ఆయ‌న మ‌ళ్లీ గొడ‌వ‌ల‌కు వెళుతున్నాడా? అంటూ నిల‌దీస్తుంటాడు. ఇది దూరంగా వుండి గ‌మ‌నించిన విశాల్ ప‌క్క‌నే కార్ పార్క్ చేసి ఎస్ ఐ ద‌గ్గ‌రికి వెళ‌తాడు. ఇద్ద‌రి మాట‌లు గ‌మ‌నించి భూష‌ణ్ చ‌నిపోయాడు క‌దా! అంటాడు. ఆ మాట‌లు విన్న భూష‌ణ్ భార్య విశాల్ పై అరుస్తుంది. నా భ‌ర్త నిక్షేపంగా వుంటె చ‌నిపోయాడంటావా అంటూ ఫైర్ అవుతుంది. దీంతో ఎస్ ఐ ఎక్క‌డ విశాల్ కి నిజం తెలిసిపోతుందోన‌ని కంగారు ప‌డుతుంటాడు. ఇంత‌లో విశాల్ కు భూష‌ణ్ బ్ర‌తికే వున్నాడ‌ని నిజం తెలుస్తుంది. ఆ విష‌యాన్ని త‌న పెంపుడు త‌ల్లి తిలోత్త‌మ కు చెప్పాల‌ని విశాల్ ఇంటికి వెళ‌తాడు. ఇదే విష‌యాన్ని న‌య‌నికి చెప్పాల‌ని ఎస్ ఐ ప్ర‌య‌త్నిస్తాడు కానీ న‌య‌ని ఫోన్ కి అందుబాటులో వండ‌దు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. భూష‌ణ్ బ్ర‌తికే వున్నాడ‌ని తెలిసినా తిలోత్త‌మ‌ని భ‌యపెడుతున్న ముగ్గురు పిల్ల‌లు ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

బిగ్ బాస్ సీజ‌న్ 6 కి సెంటిమెంట్ డేట్?

బిగ్ బాస్ సీజ‌న్ 6 కి అంతా సిద్ద‌మ‌యిన‌ట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వ‌చ్చేసింది. బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ నాన్ స్టాప్ పూర్త‌యిన వెంట‌నే బిగి్ బాస్ సీజ‌న్ 6ని స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ ఓటీటీ వెర్ష‌న్ అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డంతో ఈ సారి సీజ‌న్ 6 మ‌రింత కొత్త‌గా ఆడియ‌న్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా వుండాల‌ని మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కోసం టైమ్ తీసుకున్నారు. ఓటీటీ షో ఫ్లాప్ కావ‌డంతో దాని ప్ర‌భావం సీజ‌న్ 6 పై ప‌డ‌కుండా జాగ్ర‌త్తు తీసుకున్నారు. కంటెస్టెంట్ ల ఎంపిక నుంచి టాస్క్ ల వ‌ర‌కు ప్ర‌తీదీ కొత్త‌గా వుండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సీజ‌న్ తో పోయిన ప‌రువుని తిరిగి రాబ‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఇందు కోసం క‌లిసి వ‌చ్చిన సెంటిమెంట్ డేట్ ని ఫైన‌ల్ చేశార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 6 ని సెప్టెంబ‌ర్ 4న ఆదివారం నాడు ప్రారంభించ‌బోతున్నార‌ట‌. నాగార్జున ఈ సీజ‌న్ కు కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇంత వ‌ర‌కు సీజ‌న్ 4 సెప్టెంబ‌ర్ లోనే మొద‌లైంది. ఆ త‌రువాత సీజ‌న్ 5 కూడా సెప్టెంబ‌ర్ లోనే స్టార్ట్ చేశారు. ఈ రెండు సీజ‌న్ లు మిగ‌తా సీజ‌న్ ల‌ని మించి సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ నెల ని సెంటిమెంట్ భావించి సీజ‌న్ 6న ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. సీజ‌న్ 4 సెప్టెంబ‌ర్ లో స్టార్ట‌యి మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన తొలి సీజ‌న్ టీఆర్పీని అధిగ‌మించి రికార్డు సాధించింది. ఇక ఇండియాలో ఏ బిగ్ బాస్ సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకు రాని వీవ‌ర్ షిప్ ని సీజ‌న్ 4 సొంతం చేసుకోవ‌డం విశేషం. ఇక సీజ‌న్ 5 కూడా సెప్టెంబ‌ర్ లోనే మొద‌లై మంచి ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. అయితే రేటింగ్ లో కాస్త సీజ‌న్ 4 కంటే వెన‌క‌బ‌డింది. ఏది ఏమైనా బిగ్ బాస్ టీఆర్పీని పెంచిన సెప్టెంబ‌ర్ నెల‌ని సెంటిమెంట్ గా భావిస్తున్న స్టార్ మా వ‌ర్గాలు తాజా సీజ‌న్ ని కూడా సెప్టెంబ‌ర్ 4న ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.   

య‌ష్, వేద‌కు ఖుషి ఆచూకీ చెప్పిన చిట్టి!

కొంత కాలంగా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ 'ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం'. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, రాజా శ్రీ‌ధ‌ర్‌, సులోచ‌న త‌దితరులు న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. ఖుషీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమ‌న్యుపై అనుమానం వ్య‌క్తం చేస్తాడు య‌ష్‌. వెంట‌నే వెళ్లి అభిమ‌న్యుని నిల‌దీస్తాడు. అభిమ‌న్యు మాత్రం ఖుషీని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేదంటాడు. అయినా స‌రే య‌ష్ వినిపించుకోకుండా అభిమ‌న్యుపై అరుస్తాడు. దీంతో మాళ‌విక మ‌ధ్య‌లోకి ఎంట‌ర‌వుతుంది. "ఖుషీ నా క‌న్న కూతురు. అలాంటిది త‌న‌ని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో, ఎక్క‌డికి వెళ్లిందో గంట‌లోగా నాకు చెప్ప‌క‌పోతే మీ ఇద్ద‌రిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా" అంటూ బెదిరిస్తుంది. దీంతో అక్క‌డి నుంచి య‌ష్, వేద ఇంటికి వెళ‌తారు. ఖుషీ ఎక్క‌డికి వెళ్లింద‌ని వేద బాధ‌ప‌డుతూ ఇదంతా త‌న వ‌ల్లే జ‌రిగింది అని ఫీల‌వుతుంటుంది. నీ త‌ప్పేమీ లేద‌ని ఇదంతా త‌న‌ వ‌ల్లే జ‌రిగింద‌ని య‌ష్ వేద‌ని ఓదారుస్తుంటాడు. ఇంత‌లో పెట్ డాగ్ చిట్టి మెడ‌లో లెట‌ర్ తో ఇద్ద‌రి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అది చూసిన య‌ష్‌, వేద ఒక్క‌సారిగా షాక్ అవుతారు. "ఖుషీ ఎక్క‌డ చిట్టీ?" అని అడుగుతారు. చిట్టీ (డాగ్‌) మెడ‌లో వున్నచీటీ తీసి ఇద్ద‌రు చ‌దువుతారు. "ఇద్ద‌రూ విడిపోతే మీకు లైఫ్ లో క‌నిపించ‌ను" అంటూ ఖుషీ అందులో రాస్తుంది. వెంట‌నే చిట్టీ స‌హాయంతో ఖుషీ వున్న చోటుకి య‌ష్, వేద వెళ‌తారు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఖుషీ అక్క‌డే వుందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

'ఖుష్బూ! ఢీ జోడికి మ‌నిద్ద‌రం వెళ్దామా?'.. అడిగిన బులెట్ భాస్కర్

ఎక్స్ట్రా జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. గురు, శుక్రవారాల్లో వచ్చే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి కామెడీని పంచుతూ ఉంటాయి. వీటికి మంచి టీఆర్పీ కూడా వ‌స్తోంద‌న‌డంలో సందేహం లేదు. ఈ స్టేజెస్ మీద నుంచి వెళ్లిన ఎంతోమంది కూడా ఇప్పుడు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ షోకి గెటప్ శీను రీఎంట్రీ అద్దిరిపోయింది. ఈ ఎపిసోడ్ లో ఖుష్బూతో కలిసి బులెట్ భాస్కర్ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రోహిణి కూడా బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్నతో కలిసి మంచి కామెడీని పండించింది. హహ హాసిని అంటూ రోహిణి బొమ్మరిల్లులో జెనీలియాలా స్కిట్ ప్లే చేసింది. సిద్ధార్థ్ క్యారెక్టర్ లో భాస్కర్ వాళ్ళ నాన్న  సిద్ధుగా వ‌చ్చాడు.  "గోధుమపిండి బాగా గుద్ది గుద్ది ముద్ద చేసినట్టుగా ఉన్నావ్, నువ్ సిద్ధూవా?" అంది రోహిణి. "ఛీఛీ పోపో".. అని ఆమె అంటున్నా, భాస్కర్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి కదలకుండా కొద్దిసేపు ఆమెను అలాగే చూసి, తర్వాత వెళ్ళిపోతుంటాడు. వెంటనే రోహిణి, "ఓయ్.. అంతేనా?".. అంటూ మళ్ళీ కవ్వించింది. "ఇంకేంటి .. ఇంకేం కావాలా?" అని అడిగి మంచి ఫన్ క్రియేట్ చేశాడు భాస్కర్ వాళ్ళ నాన్న.  ఈ రాబోయే ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ తెల్ల తెల్లని చీర పాటకు వర్షతో కలిసి దుమ్ము రేపే డాన్స్ చేసేశాడు. తర్వాత  "రాను..రానంటూనే చిన్నదో" పాటకు ఖుష్బూ, భాస్కర్ కలిసి స్టెప్పులేశారు. పాట ఐపోయాక ఖుష్బూతో, "నెక్ట్స్‌ ఢీ జోడిలోకి మనిద్దరం వెళ్దామా, వెళ్తే అదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది" అన్నాడు భాస్కర్. దీంతో ఖుష్బూ ఒక్కసారిగా నవ్వేసింది.  

బిగ్ బాస్ హౌస్‌లోకి ఉదయభాను?

బిగ్ బాస్ సీజన్ 6 ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. బుల్లి తెర షోస్ నుంచి చాలామందిని ఇప్పటికే కాంటాక్ట్ చేసింది బిగ్ బాస్ టీమ్‌. ఐతే ఇప్పుడు ఈ హౌస్ లోకి ఉదయభాను ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. ఇంకా కొంతమందిని కలిసి ఓకే చెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.  కరోనా కారణంగా బిగ్ బాస్ 4, 5లో చాలావరకు కొత్త ఫేసెస్ కనిపించాయి. ఐతే ఆడియన్స్ కోరిక మేరకు ఫేమస్ ఫేసెస్ ని తీసుకొచ్చి ఈసారి షోని నిర్వహించాలని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. అందుకే స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ కి  చెందిన పాపులర్ యాక్టర్స్ ని, యాంకర్స్ ని కాంటాక్ట్ చేస్తున్నారట. ఉదయభానుతో ఇప్ప‌టికే చర్చలు జ‌రుపుతున్నార‌ట‌.  గతంలోనే ఉదయభాను బిగ్ బాస్ లో పాల్గొనాల్సి ఉండింది. ఐతే అప్పుడు పెద్దగా ఇంటరెస్ట్ చూపించని భాను ఇప్పుడు రావాలని చూస్తోంది.. అలాగే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భానుని తీసుకురావాలని చూస్తున్నారు. ఈమెకు మంచి రెమ్యూనరేషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. అన్ని ఓకే ఐతే గనక బిగ్ బాస్ సీజన్ 6లో ఉదయభాను ఎంట్రీ ఇవ్వ‌డం దాదాపు ఖాయం.  ఉదయభాను సీనియర్ యాంకర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి షోకి మంచి టీఆర్పీ వచ్చే అవకాశం ఉందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు. 'లీడర్', 'జులాయి' మూవీస్ లో ఐటెం సాంగ్స్ లో ఉదయభాను ఫుల్ జోష్ గా డాన్స్ వేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేసింది. ఐతే లైఫ్ లో కొన్ని అనుకోని ఇష్యూస్ రావడంతో ఉదయభాను స్మాల్ స్క్రీన్ కి దూరమయ్యింది. కానీ కొంతకాలానికే తేరుకుని మళ్ళీ షోస్ కి యాంకర్ గా వచ్చేసింది. అప్పట్లో సుమతో స‌మానంగా యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయ్యింది భాను.

రెచ్చిపోయి రవిని స్టేజి మీద తోసేసిన స‌న్నీ!

టీవీ షోస్ లో ఈమధ్య ప్రాంక్స్ ఎక్కువగా చేస్తున్నారు. అది నిజమో తెలియడం లేదు, అబద్ధ‌మో తెలియడం లేదు. కంటెంట్ మీద కామెడీ తక్కువగా చేస్తూ ఎవరికి వారు గొడవలు పెట్టుకుంటూ షోకి రేటింగ్ పెంచే పనిలోనే ఎక్కువగా ఉంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో ఇలాంటి ప్రాంక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు స్టార్ మా షోస్ లో కూడా ఈ టైపు ప్రాంక్స్ ఎక్కువగా  కనిపిస్తున్నాయి.  స్టార్ మాలో లేటెస్ట్ గా ఒక ఈవెంట్ జరిగింది. బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని పిలిచి కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోని టెలికాస్ట్ చేసింది. ఈ షోకి హోస్ట్ రవి. ఐతే బిందుకి, హమీదకి ఒక టాస్క్ ఇచ్చాడు రవి. క్యూబ్స్ అన్నీ పేర్చి ఉంటాయి. పక్కన చిట్టీలు ఉంటాయి. అందులోంచి ఒక చిట్టి తీసి డైలాగ్ చెప్పి ఒక క్యూబ్ మీద ఇంకో క్యూబ్ పెట్టి వెళ్లిపోవాలి. ఇదీ టాస్క్ ఆడే విధానం. ఐతే ఈ టాస్క్ లాస్ట్ లో దివి క్యూబ్ పెట్టింది. తర్వాత  కింగ్స్ నుంచి రవికృష్ణ క్యూబ్ పెట్టాడు కానీ మొత్తం క్యూబ్స్ పడిపోయాయి. దీంతో వీజే సన్నీ రెచ్చిపోయాడు. స్టేజి మీద హంగామా క్రియేట్ చేశాడు. రెచ్చిపోయి రవిని స్టేజి మీద తోసేశాడు. మీదకు రావొద్దు అంటూ రవి కూడా సన్నీకి వార్నింగ్ ఇచ్చేశాడు. ఇలా రెండు మూడు సార్లు తోసేసుకున్నాక స్టేజి మీద ఉన్న కంటెస్టెంట్స్ అంతా వచ్చి ఇద్దరినీ విడదీశారు. నువ్ బిగ్ బాస్ లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా క్వీన్స్ వైపే ఉన్నావ్ అంటూ మండిపడ్డాడు స‌న్నీ. ఎప్పుడు వన్ సైడ్ మాత్రమే ఆడతావ్ అంటూ ఆరోపణలు చేశాడు. ఇంతలో రోల్ రైడా, అవినాష్ వచ్చి.. ఇది గేమ్ మాత్రమే. సరదాగా ఆడుకోవడానికే కానీ, గొడవలు పడడానికి కాదు అంటూ ఇద్దరినీ విడదీశారు. ఇంతలో రవి మాట మార్చేసి ఎం జరగనట్టే బిల్డప్ ఇచ్చి అరే బావా బావా అంటావ్ కదరా అంటూ సన్నీతో కలిసి స్టెప్పులేశాడు. ఇద్ద‌రూ ఇలా అంద‌రి చెవుల్లో పువ్వులు పెట్టారు.

జీ బోనాల జాతరలో దుల్కర్ సల్మాన్

జీ తెలుగు ఎప్పుడూ కొత్త కొత్త షోస్ తో అలరిస్తూ ఉంటుంది. బోనాల్ సెలెబ్రేషన్స్ సందర్భంగా ఇప్పుడు"జీ తెలుగు వారి జాతర..అందరూ ఆహ్వానితులే" అంటూ ఈ నెల 31 న సాయంత్రం 6  గంటలకు ప్రసారం కాబోయే ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసింది. వీకెండ్స్ లో ఆడియన్స్ ని ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సిస్టమాటిక్ గా కొత్త కొత్త కంటెంట్ తో సరికొత్తగా షోస్ ని రిలీజ్ చేస్తోంది. స్టార్ మాతో పోటాపోటీగా మంచి షోస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.  ఇక రాబోయే బోనాల్ జాతర స్పెషల్  షోలో చాలా మంది బుల్లితెర నటీ నటులు సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో క్రేజీ కపుల్స్ తో డాన్సులు చేయించారు. రఘుకుంచె, మధు ప్రియా, ఇంకొంతమంది వచ్చి పాటలు పాడి ఎంటర్టైన్ చేశారు. మామూలు జాతర కాదు మాస్ జాతర అంటుంది హోస్ట్ శ్రీముఖి. ఇక వీళ్ళతో కలిసి మొలీవుడ్ ప్రిన్స్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వచ్చి అద్దిరిపోయే డాన్స్ చేసి స్టేజిని దడదడలాడించారు. సీతారామం లో నటించిన వీళ్ళిద్దరూ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటు బోనాల జాతరలో, అటు క్యాష్ లో కూడా సందడి చేయనున్నారు . నారి నారి నడుమ మురారి టైపులో  దుల్కర్ ఇటు శ్రీముఖితో అటు మృణాల్ తో కలిసి స్టెప్పులేసి ఇది కదా జాతరంటే అనిపించేలా చేసాడు.

నెలలో మూడు రోజులు అడ్జస్ట్ చేసుకోలేవా?.. నిలదీసిన చంటి!

అన్ని షోస్ లోకి జబర్దస్త్ ఇప్పుడు ఫుల్ ఫేమస్ ఐపోయింది. అందులోని కమెడియన్స్ చేస్తున్న ఆరోపణల కారణంగా కావొచ్చు , ఒక్కొక్కరిగా ఈ వేదిక విడిచి వెళ్లిపోతుండడం కారణం కావొచ్చు ఏదైనా సరే అందరూ ఈ షో గురించే అందరూ మాట్లాడుతుకుంటున్నారు. ఏమి లేని స్థాయి నుంచి ..పేరు లేని ఊరు నుంచి వచ్చి ఈ స్టేజి మీద ఫుల్ ఫేమస్ ఐన కమెడియన్స్ ఇప్పుడు  అన్ని షోస్ లో కనిపిస్తున్నారు. ఈ షోలో టీం లీడర్స్ అంతా కూడా వేరే చానెల్స్ లో, మూవీస్ లో నటిస్తూ ఇంకా ఇంకా ఫేమస్ అవుతున్నారు. ఐతే కొంతమంది ఈ షో నుంచి వెళ్లిపోయారు.  ఇదే నేపథ్యంలో అనసూయ కూడా జూన్ లోనే జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోతున్నట్టు సంకేతాలు ఇస్తూ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. కానీ జులై ఎండింగ్ వరకు కూడా షో లో కంటిన్యూ అయ్యింది. ఐతే ఇప్పుడు అనసూయ నిజంగా వెళ్ళిపోతున్నట్టుగా రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమోలో చూపించి జబర్దస్త్ వేదికగా అనసూయకు ఘనంగా వీడ్కోలు చెప్పించారు యాజమాన్యం. ఇలా వెళ్ళిపోతున్న అనసూయ కోసం ఒక స్కిట్ కూడా వేశారు. తాగుబోతు రమేష్ అనసూయలా లేడీ గెటప్ లో వచ్చి "నేను నిజంగా జబర్దస్త్ మానేయాలని అనుకుంటున్నా" అని చెప్పాడు. "మీకు చిన్నచిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళను మీ అమ్మగారికి ఇచ్చి జబర్దస్త్ కోసం మీరు పని చేశారు. ఇప్పుడు జబర్దస్త్ ను వదిలేయడం ఏంటి మేడం" అని వెంకీ కూడా ఒక ఎమోషనల్ డైలాగ్ వేసాడు. "జబర్దస్త్ అనేది పెర్మనెంట్ సర్..ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు..కానీ జబర్దస్త్ స్టిల్ రన్నింగ్ " అంటూ తాగుబోతు రమేష్ ఎమోషనల్ డైలాగ్ వేస్తాడు. ఈ డైలాగ్ కి చలాకి చంటి ముఖం డల్ గా కనిపిస్తుంది. ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకుంటుంది.  ఇక చంటి మైక్ తీసుకుని "నెలలో మూడు రోజులు మాకోసం అడ్జస్ట్ చేయలేవా " అని ఎమోషన్ గా అడుగుతాడు. కష్టం అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనసూయ. ఇక ఇంద్రజ ఆగలేక బాధను తట్టుకోలేక అనసూయను హగ్ చేసుకుంటుంది. "ఈ జర్నీలో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇస్తుంది..కానీ జబర్దస్త్ మాత్రం ఆగదు..కొత్త కొత్త కామెడీతో, కొత్త కొత్త ఆర్టిస్టులతో జబర్దస్త్ మీ ముందుకు వస్తూనే ఉంటుందని రాకెట్ రాఘవతో చెప్పించారు. "ఈ స్టేజి నీతో చాలా అనుబంధాన్ని పెంచుకుంది అనసూయ" అని అంటుంది ఇంద్రజ. ఏదైమైనా అందరూ కొంచెం ఎమోషన్ అయ్యారు కానీ అనసూయ మాత్రం కన్నీళ్లను మింగేసి బయటికి రానివ్వకుండా ఆ బాధను ఫేస్ లో కొంత మైంటైన్ చేసింది.  

శీను వచ్చాడు... సందడి తెచ్చాడు... మరి సుధీర్ ఎప్పుడో?

జబర్దస్త్ కమెడియన్స్ అందరినీ మళ్ళీ వెనక్కి తెస్తామని మల్లెమాల వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనిపిస్తోంది. ఎందుకంటే గెటప్ శీను రాబోయే వారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు.  శీను ఎంట్రీతో స్టేజి మొత్తం కళకళలాడిపోయింది. ఇంద్రజ, రష్మీ, ఆటో రాంప్రసాద్, సన్నీ ముఖాల్లో వెలుగొచ్చింది. ఇంద్రజ ఆ ఆనందంతో శీనుని హగ్ చేసుకుంది. ఇంతలో రాంప్రసాద్ స్టేజి మీద నుంచి "మేడం మా శీను వచ్చాడు, స్కిట్ చేద్దామనుకుంటున్నాం, మాకు కొంచెం టైం ఇస్తే" అంటాడు...మీరు ముందు ఈ స్కిట్ ని ప్యాక్ చేసేసి వెళ్ళిపోయి, మా శీనుని వెనక్కి తీసుకొచ్చేయండి చెప్తాను " అంటూ ఇంద్రజ చాలా ఎక్సయిట్మెంట్ తో అంటుంది ఇంద్రజ.  ఇక గెటప్ శీను ఈజ్ బ్యాక్ అంటూ రాంప్రసాద్, శీను, అన్నపూర్ణమ్మ, బాబు, సన్నీ అంతా కలిసి స్కిట్ వేస్తారు. "మావాడు కమలహాసన్ లా చేస్తాడు" అంటాడు రాంప్రసాద్ . "కమలహాసన్ లా మీ వాడు చేస్తే కమల్ హాసన్ ఏం చేస్తాడు..టీవీ చూస్తూ బఠానీలు తింటాడా " అంటూ పంచ్ డైలాగ్ వేసేస్తుంది అన్నపూర్ణమ్మ. మావాడు ఇప్పుడు కమల్ హాసన్ లా చేసి చూపిస్తాడు నువ్ కూడా అలా చేసి చూపించు" అంటాడు రాంప్రసాద్. అలా శీను, అన్నపూర్ణమ్మ ఇద్దరూ స్కిట్ ని అద్భుతంగా పండిస్తారు.  శీను స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వడంతో ఆడియన్స్ కళ్ళల్లో ఆనందం కనిపించబోతోంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెటిజన్స్ కామెంట్స్ ఐతే మాములుగా లేవు. " టిఆర్పీ ఊపిరి పీల్చుకో .. మా గెటప్ సీను అన్న వస్తున్నాడు..అలాగే మన సుధీర్ అన్న కూడా వస్తాడు వీళ్ళ ముగ్గురూ కలిసి మళ్ళీ  స్కిట్స్  చేయాలని కోరుకుంటున్నా..ఇలాగే వెళ్లిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి  వచ్చి పూర్వవైభోగం తేవాలి....శ్రీను రావడం చాలా హ్యాపీ గా ఉంది...శ్రీను రావడంతోనే నాకు స్మైల్ ఆగలేదు బ్రో" ఇలా కామెంట్స్ వరద కురుస్తోంది.  ఇక జబర్దస్త్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుందనే విషయం గెటప్ శీను ఎంట్రీతో ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది మల్లెమాల. ఇక సుధీర్ ఎంట్రీ ఎప్పుడో?

దొంగలకు వార్నింగ్ ఇచ్చిన హిమజ

సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక బుల్లి  తెర సెలెబ్రిటీస్ చాలామంది ఏ చిన్నదైనా సరే వీడియో చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో, యూట్యూబ్ చానెల్స్ లో పోస్ట్ చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ పేరుతో, హోమ్ టూర్స్ పేరుతో, అన్ బాక్సింగ్ పేరుతో, స్పెషల్ వంటల పేరుతో ఎన్నో కొత్త కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల హిమజ బిగ్ బాస్ కంటెస్టెంట్ తన కొత్త ఇంటికి సంబంధించి ఒక హోమ్ టూర్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఐతే తన సొంత ఇల్లు రేనోవేషన్ లో ఉంది కాబట్టి రెంటెడ్ హౌస్ లోకి మారిందట. ఐతే అభిమానుల కోరిక మేరకు ఆ రెంటెడ్ హౌస్ ని హోమ్ టూర్ చేసి ఫాన్స్ కోసం అందుబాటులో ఉంచింది. సోషల్ మీడియా లేని రోజుల్లో అసలు సెలెబ్రిటీస్ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమేం వాడుతూ ఉంటారు, వాళ్ళ కిచెన్ , గార్డెన్ ఎలా ఉంటుంది అనే సందేహాలు సాధారణ జనాల్లో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ బ్రేక్ వేస్తూ ఏ సెలెబ్రిటీ హౌస్ చూడాలన్నా సరే ఇట్టే చూసేయొచ్చు. ఎందుకంటే సెలెబ్రిటీ పేరుతో హోమ్ టూర్ అని గూగుల్ సెర్చ్ లో టైపు చేస్తే చాలు ఆ వీడియో వచ్చేస్తుంది. ఐతే హిమజ తాను ఉన్న ఇంటిని బాగు చేయించి అమ్మేద్దామనుకుంటున్నట్టు ఈ వీడియో లో చెప్పింది. అందుకే ఈ హౌస్ కి షిఫ్ట్ ఐనట్లు చెప్పుకొచ్చింది. తన రెంట్ హౌస్ లో పెంపుడు కుక్కల్ని చూపించింది, లివింగ్ రూమ్ ని, బెదురూమ్ ని, సర్దుకున్న కొన్ని సామాన్లను చూపించింది. అలాగే తన జ్యువెలరీని పెట్టుకుని అల్మారా చూపించింది. జ్యువెలరీ అనగానే దొంగలంతా రెడీ ఐపోతారేమో వచ్చేద్దామని అదంతా వన్ గ్రామ్ గోల్డ్ అంటూ పంచ్ వేసింది హిమజ. ఇక తన మేకప్ కిట్స్, బాల్కనీ వ్యూ, టీవీ, కిచెన్ చూపించేసింది హిమజ.

సుధీర్ మళ్ళీ రాబోతున్నాడా ?

బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్. ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా హీరో కి కూడా ఉండరు. ఏ షోలో చేస్తాడో ఆ షోకి ఫుల్ రేటింగ్ గ్యారెంటీ. పదేళ్లుగా జబర్దస్త్ షోలో ఎంటర్టైన్ చేస్తూ ఇటీవలే అక్కడ నుంచి వెళ్లిపోయే ఇంకొన్ని షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, నాగబాబు, రోజా, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, గెటప్ శీను, హైపర్ ఆది, ధనరాజ్, వేణు వంటి సీనియర్స్ అందరూ వెళ్లిపోయేనారు. ఆ తర్వాత జబర్దస్త్ లో అసలు లోపలేం జరుగుతోంది అనే విషయాలపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్ కాక పుట్టించాయి. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఓపెనప్ అయ్యి కొంతమంది ఆర్పీ కామెంట్స్ కి ఖండించారు , ఇంకొందరు అవే నిజలాంటూ చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా సుధీర్ వెళ్లిపోయేసరికి రష్మీ ఆ షోని హ్యాండిల్ చేస్తోంది. ఐతే మల్లెమాల నుంచి కొంతమంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు మొత్తం మళ్ళీ ఈ షోకి తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా కోరారు అలాగే వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో అక్క బావెక్కడ అంటూ రష్మిని అనడం చూస్తూ ఉంటె సుధీర్ ని త్వరలో ఈ షోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సుధీర్ తిరిగి వస్తాడో రాడో అనే విషయాన్ని పక్కన పెడితే రెండు చోట్ల షోస్ చేయడం కుదరక, అగ్రిమెంట్ టైం కూడా ఐపోవడంతో వెళ్లిపోయాడని ఆది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఈ సుధీర్ ఎంట్రీ గురుంచి ఈ ప్రోమో ద్వారా చెప్పిద్దామని చూసారా ? లేదా నిజంగానే వస్తాడా అనే విషయం తెలియాలంటే కొంత కలం వెయిట్ చేయాల్సిందే.

నిరుప‌మ్ - శౌర్య‌ కోసం ప్రేమ్ ప్రేమ పాఠాలు!

ఎంతో కాలంగా స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతూ నంబ‌ర్‌వ‌న్ సీరియ‌ల్‌గా నిలిచిన కార్తీక‌దీపం ప్ర‌స్తుతం కొత్త కొత్త మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ ఎలాంటి ట్విస్ట్ ల‌తో సాగ‌నుందో ఒక‌సారి చూద్దాం. సౌంద‌ర్య ఇంటికి వ‌స్తాడు ప్రేమ్‌. అత‌నితో హిమ ఎవ‌రూ విన‌కుండా నిరుప‌మ్‌, శౌర్య‌ల పెళ్లి గురించి మాట్లాడుతుంది. "హిమా! ప్రేమ పెరగాలంటే ఇద్ద‌రూ ఒకే చోట ఉండాలి. త‌ర‌చూ క‌లుసుకోవాలి, మాట్లాడుకోవాలి. క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూసుకోవాలి" అంటూ ప్రేమ పాఠాలు చెబుతాడు ప్రేమ్‌. ఆ త‌రువాత నిరుప‌మ్ -  శౌర్యల‌ని క‌ల‌ప‌డానికి ఏదో ప్లాన్ చెబుతాడు.  సీన్ క‌ట్ చేస్తే.. ఆనంద‌రావు సోఫాలో నీర‌సంగా ఉంటారు. నిరుప‌మ్ కంగారుగా వ‌చ్చి అక్క‌డే వున్న శౌర్య‌ని చూస్తాడు. ప్రేమ్‌, హిమ ఆ సీన్ చూసి సూప‌ర్ అనుకుంటారు. ఇంత‌లోనే అక్క‌డి నుంచి శౌర్య వెళ్లిపోతుంది. `దేవుడా.. ప్లాన్ ఫెయిల్` అని ఫీల‌వుతారు హిమ‌, ప్రేమ్‌. అది గ‌మ‌నించిన సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు కూడా ఫీల‌వుతారు. హిమ‌, ప్రేమ్ ఏం ప్లాన్ చేశారు?.. నిరుప‌మ్ ఎందుకు వ‌చ్చాడు?.. శౌర్య ఎందుకు బ‌య‌టికి వెళ్లింది? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నిరుప‌మ్ తో శౌర్య పెళ్లి చేయాల‌ని, ఇద్ద‌రిని క‌ల‌పాల‌ని హిమ ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. త‌న‌కి ప్రేమ్ తోడ‌వ్వ‌డంతో క‌థ‌నం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ప్రేమ్ చేసే ప్ర‌య‌త్నంలో హిమ ద‌గ్గ‌ర‌వుతుందా?.. నిరుప‌మ్, శౌర్య క‌లుస్తారా?.. హిమ అనుకున్న‌ట్టే ఒక్క‌ట‌వుతారా?.. శౌర్య ప్రేమ గెలుస్తుందా?.. డాక్ట‌ర్ బాబు నిరుప‌మ్ మ‌న‌సు మార్చుకుంటాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

తిలోత్త‌మ‌తో ఆడుకుంటున్న న‌య‌ని!

అషికా గోపాల్, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రాత్రి 8:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతూ థ్రిల్లింగ్ అంశాల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, భావ‌నా రెడ్డి, విష్ణుప్రియ‌, ద్వార‌కేష్ నాయుడు, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య త‌దిత‌రులు న‌టించారు. విశాల్‌, న‌య‌ని 50 కోట్ల షూ కాంట్రాక్ట్ ని తిలోత్త‌మ కుట్ర కార‌ణంగా పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది. కావాల‌నే డీల్ రోజు విశాల్ షూలో ఎల‌ర్జీ పౌడ‌ర్ చ‌ల్ల‌డంతో విశాల్ షూస్ ని మీటింగ్ జ‌రుగుతుండ‌గానే కాళ్ల‌తో త‌న్నేస్తాడు. ఇది గ‌మ‌నించిన ఇత‌ర కంప‌నీ వాళ్లు అర్థ్రాంత‌రంగా డీల్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతారు. ఈ విష‌యాన్ని సీరియ‌ల్ గా తీసుకున్న న‌య‌ని.. తిలోత్త‌మ‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌ని ప్లాన్ చేస్తుంది. తిలోత్త‌మ వేసుకున్న కొత్త చెప్పులు కాళ్ల‌కే ఫిక్స‌య్యేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌క తిలోత్త‌మ అవ‌స్థ‌లు పడుతూ వుంటుంది. ఇదే మంచి అద‌నుగా భావించిన న‌య‌ని స‌ల‌స‌ల కాగే నీళ్ల‌లో తిలోత్త‌మ కాళ్లు పెట్టించి తిలోత్త‌మ తిక్క కుదురుస్తుంది. ఒక్క సారిగా కాళ్లు మంటెక్కిపోవ‌డంతో టాప్ లేచేలా తిలోత్త‌మ అరుస్తుంది. ఆ త‌రువాత కాళ్ల‌కున్న చెప్పులు వీడి పోవ‌డంతో త‌న‌ని తీసుకెళ్లి బెడ్రూమ్ లో ప‌డుకోబెడుతుంది. ఇది నీకుట్రేన‌ని నాకు తెలుస‌ని తిలోత్త‌మ అన‌డంతో ఇది జ‌స్ట్ షాంపిల్ మాత్ర‌మే అని న‌య‌ని చెబుతుంది. ఆ త‌రువాత తిలోత్త‌మ‌ని ఆడుకోవ‌డం మొద‌లు పెడుతుంది. గాయ‌త్రీ దేవి, భూష‌ణ్‌, సుధ అంటూ ముగ్గురు పిల్ల‌ల‌తో ఆత్మ‌ల్లా నాట‌కం మొద‌లు పెడుతుంది. అది చూసిన తిలోత్త‌మ‌లో వ‌ణుకు మొద‌ల‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

య‌ష్ - వేద‌ల‌కు మాళ‌విక వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. కాంచ‌న‌, మాలినిల ద్వారా వేద ఇంటి నుంచి వెళ్లిపోయింద‌ని, ఇక రాద‌ని తెలుసుకున్న ఖుషీ వెంట‌నే వెళ్లి వేద‌ని ఇంటికి ర‌మ్మంటుంది. నేను, నువ్వు, డాడీ మ‌నం ముగ్గురం ఒక పార్టీ క‌దా ఎందుకు మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి ఇక్క‌డికి వ‌చ్చావ్? అంటూ నిల‌దీస్తుంది. ఆ త‌రువాత ఇంటికి రామ్మా అంటూ 1..2..3.. లెక్క పెడ‌తాను.. నీకు ఇంటి రావాల‌ని వుంటే న‌న్ను పిలువు లేదంటే వెళ్లిపోతాను అంటుంది. వేద స్పందించ‌క‌పోవ‌డంతో భారంగా అక్క‌డి నుంచి అపార్ట్ మెంట్ బ‌య‌టికి వెళ్లిపోతుంది. విష‌యం తెలిసి య‌ష్ .. వేద‌ని మంద‌లిస్తాడు. త‌ను అడిగినా రావా? అంటూ ఫైర‌ల్ అవుతాడు. ఎందుకిలా చేస్తున్నావ‌ని ఆవేశంతో ర‌గిలిపోతాడు. త‌న‌కు ఏదైనా జ‌రిగితే నిన్ను క్ష‌మించ‌ను అంటూ మండి ప‌డ‌తాడు. క‌ట్ చేస్తే వేద‌.. య‌ష్ ఇద్ద‌రు క‌లిసి ఖుషీని వెతుక్కుంటూ మాళ‌విక‌, అభిమ‌న్యుల వ‌ద్ద‌కు వెళ‌తారు. య‌ష్ ఆవేశంతో అభిమ‌న్యు కాల‌ర్ ప‌ట్టుకుని ఖుషీ ఎక్క‌డ అని నిల‌దీస్తాడు. త‌న‌కు తెలియ‌ద‌ని అభిమ‌న్యు అన‌డంతో య‌ష్ ఆవేశంతో ఊగిపోతాడు. విష‌యం ఆర్థం కావ‌డంతో మాళ‌విక రివ‌ర్స్ కౌంట‌ర్ ఇవ్వ‌డం మొద‌లు పెడుతుంది. ఖుషీ నా కూతురు దాచి పెట్టాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో చెప్పండి.. గంట టైమ్ ఇస్తున్నాను. ఆలోగా ఖుషీ సేఫ్ అన్న న్యూస్ నా చెవినప‌డాలి. లేదంటే ఇద్ద‌రిపై కేసు పెడ‌తాను అంటూ య‌ష్‌, వేద‌ల‌కు మాళ‌విక వార్నింగ్ ఇస్తుంది.