తెలుగు త్రినయని ఇక తమిళ్ లో మారి

బుల్లితెర మీద త్రినయని సీరియల్ ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇందులో త్రినయనిగా నటించిన ఆషిక గోపాల్ పదుకొనె ఈ సీరియల్ తో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. కథలో రాజకుమారి అనే డైలీ  సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆషిక. ఇక ఇప్పుడు తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఈ త్రినయని సీరియల్ తమిళ్ లో "మారి" పేరుతో జులై 4  నుంచి ప్రసారం కానుంది. నాకు తెలుగు నుంచి మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీ రావడం చాలా సంతోషంగా ఉంది అని అంది ఆషిక.  ఇక ఈ షూటింగ్ సెట్స్ కి వచ్చిన స్నేహ, సంగీత, శరణ్యతో కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో  షేర్ చేసింది.  "సినిమా పరిశ్రమలోని అత్యుత్తమ నటీమణులను కలవడం గౌరవంగా భావిస్తున్నాను." అంటూ కాప్షన్ పెట్టింది . మారిగా తమిళ్ లో రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిని జులై 4 న రాత్రి 8 గంటలకు జీ తమిళ్ ఛానల్ లో కలుస్తానంటూ చెప్పింది ఆషిక.  ఇక ఈ సీరియల్ మొత్తం లేడీ ఓరియెంటెడ్ గా నిర్మించారు. ఈ సీరియల్ హీరోయిన్ తెలుగులో త్రినయని తమిళ్ లో మారి.అన్నమాట. ఎన్నో అతీంద్రియ శక్తులున్న అమ్మాయి. భవిష్యత్తును ముందుగా ఊహిస్తూ జరగబోయేది చెప్పి అందరితో తిట్లు తినే ఒక క్యారెక్టర్ ఈమెది. ఇక ఈమెకు ఒక అబ్బాయితో పెళ్లౌతుంది. ఐతే దుష్ట శక్తుల నుంచి తన భర్తను అతని ఫామిలీని ఎలా రక్షించుకుంది అనేదే సీరియల్. త్రినయనిలో చందు గౌడ, పవిత్ర జయరాం, జయలలిత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.  టిఆర్పి చార్ట్‌లలో ఈ న్యూ  తమిళ డైలీ షో ఎలాంటి రేటింగ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.  

క‌త్తిపై తిలోత్త‌మ వేలి ముద్ర‌లు బ‌య‌ట‌ప‌డ్డాయా?

అషికా గోపాల్, చందూ గౌడ జంట‌గా న‌టించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `త్రిన‌య‌ని`. బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని నెల‌లుగా చిత్ర విచిత్ర‌మైన మలుపులు, ట్విస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త రెండు వారాలుగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌ర‌లు న‌టించారు. న‌య‌ని - విశాల్ వెలికి తీసిన పెట్టెని వ‌ల్ల‌భ బ్రేక్ చేస్తాడు. దీంతో అది ఓపెన్ అవుతుంది. ఎస్ ఐ స‌మ‌క్షంలో ఓపెన్ చేసిన పెట్టెలో క‌త్తి బ‌య‌ట‌ప‌డుతుంది. అది చూసి అంతా అవాక్క‌యితే తిలోత్త‌మ మాత్రం షాక్ కు గుర‌వుతుంది. ఎందుకంటే అది భూష‌న్ ని తిలోత్త‌మ హ‌త్య చేసిన క‌త్తి కాబ‌ట్టి. ఎక్క‌డ త‌న నేరం బ‌య‌ట‌ప‌డుతుందో న‌ని అక్క‌డి నుంచి వెంట‌నే వెళ్లిపోతుంది. త‌ను ఎందుకంత టెన్ష‌న్ ప‌డుతోందో అర్థం కాక వ‌ల్ల‌భ త‌ల‌తిక్క‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. దీంతో తిలోత్త‌మ వ‌ల్ల‌భ‌కు అస‌లు విష‌యం చెప్ప‌డంతో షాక్ అవుతాడు. క‌ట్ చేస్తే న‌య‌ని, విశాల్ ..తిలోత్త‌మ ఇంటికి వస్తారు వారితో పాటే క‌త్తిని తీసుకుని ఎస్‌. ఐ వేలిముద్ర‌ల కోసం త‌న టీమ్ తో వ‌స్తాడు. దీంతో తిలోత్త‌మ మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుంది. వీళ్లెందుకొచ్చార‌ని ఆరాతీస్తుంది. మీ ప్రాంగ‌నంలో క‌త్తి దొరికింది కాబ‌ట్టి మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వేలి ముద్ర‌లు కావాలంటాడు ఎస్ ఐ. ఇదే విష‌యాన్ని న‌య‌ని చెబుతూనే గాయ‌త్రీ దేవి అమ్మ‌గారి హ‌త్య కేసుని తిరిగి రీఓపెన్ చేయించాన‌ని షాకిస్తుంది. వ‌రుస‌గా కుటుంబ స‌భ్యులు అంతా వేలి ముద్ర‌లు ఇవ్వ‌డం  మొద‌లు పెడ‌తారు. తిలోత్త‌మ వంతు వచ్చే స‌రికి వ‌ణ‌క‌డం మొద‌లు పెడుతుంది. దీంతో అత్త‌మ చేతులు వ‌ణుకుతున్నాయి. మీరు ద‌గ్గ‌రుండి వేలి ముద్ర‌లు ఇప్పించండి అని విశాల్ తో అంటుంది న‌య‌ని.. తిలోత్త‌మ వేలిముద్ర‌ల‌తో దొరికిపోయిందా? ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

"గెటౌట్ ఆఫ్ మై స్టూడియో" అంటూ కిషోర్ పై అరిచిన గెటప్ శీను

అశోకవనంలో అర్జునకల్యాణం మూవీ టైంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో యాంకర్ దేవికి, విశ్వక్ సేన్ కి మధ్య ఎంత పెద్ద వార్ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీకి సంబంధించి చేసిన  ప్రాంక్ వీడియో విషయంపై ఆ న్యూస్ ఛానల్ లో  హాట్ హాట్ గా జరిగిన డిబేట్ మాత్రం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. తర్వాత ఈ టాపిక్ మీద జబర్దస్త్ స్కిట్స్ కూడా మస్త్ పేలాయి. ఐతే తాజాగా గెటప్ శీను ఈ కాంట్రవర్సీ టాపిక్ మీద ఒక వీడియో చేసి వార్తల్లో నిలిచాడు. హ్యాపీ బర్త్డే అనే మూవీ జులై 8 న రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇందులో నటించిన వారితో ఒక స్కిట్ చేసాడు. న్యూసెన్స్ అనే టీవీ లోగో పెట్టి అందులో న్యూస్ రీడర్ గా గెటప్ శీను దేవి నాగవల్లి అవతారమెత్తుతాడు. ఇక ఈ మూవీలో నటించిన కమెడియన్ అని చెప్పుకు తిరుగుతున్న సత్య గారు మన స్టూడియోలో ఉన్నారు అంటాడు శీను. చెప్పు కాదండి షూ వేసుకొచ్చానని సత్య కామెడీ చేస్తాడు. వెంటనే పక్కనే వున్న వాటర్ బాటిల్ సత్య మీదకు విసిరేసి ఇలాంటి డైలాగులు బయటవేసుకోండి లేదా మీ సినిమాలో పెట్టుకోండి అంటూ సీరియస్ అవుతాడు.  ఇక  మూవీ హీరో నరేష్ అగస్త్య స్టూడియోకి వస్తారు. ఫైనల్ గా లైవ్ లో వెన్నెల కిషోర్ జాయిన్ అవుతారు. ఇక ఈ ముగ్గురు ఎన్ని సినిమాలు తీశారు. ఎన్ని ఆడాయి అంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ఈ మూవీలో హీరో ఎవరు అంటూ అరుచుకుంటూ ఉంటారు.    ఏంటయ్యా ఈ చెత్త డిబేట్లు అంటూ ఫైర్ అవుతాడు వెన్నెల కిషోర్. అరె పిల్ల బచ్చాస్ ఏ ఈవెంట్ లో ఐనా హీరో లాస్ట్ లో మాట్లాడతాడు అంటాడు. ఇక ఈ షోలో బినామీ క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తి స్టూడియోలోకి వచ్చేసి సత్యతో హడావిడి చేస్తూ ఉంటాడు. గెటప్ శీను అతన్ని చూసి చాలా ఇరిటేట్ అవుతాడు. ఏం చేయాలో అర్థంకాక  టైం స్లాట్ ఐపోయింది నెక్స్ట్ డిబేట్ లో చూద్దాం అంటాడు. అక్కడి గొడవ చూసి వెన్నెల కిషోర్ బుల్ షిట్ అంటాడు. వెంటనే గెటప్ శీను సీరియస్ ఐపోయి గెట్ అవుట్ అంటూ అరుస్తాడు.  వెంటనే కిషోర్ బయట చల్లగా ఉందండి అంటూ కామెడీ చేసేసరికి గెటౌట్ ఆఫ్ మై స్టూడియో అంటూ పిచ్చి పట్టినట్టు అరుస్తాడు శీను. నేను స్టూడియోలో లేనండి బాబు క్యారవాన్ లో ఉన్నాను అంటాడు కిషోర్. ఐనాసరే గెటౌట్ అంటాడు శీను. మీలో ఎవరు హీరో అనే స్కిట్ చివరికి గొడవగొడవగా మారి శీను స్టూడియోలోంచి లేచి  వెళ్ళిపోతాడు మరో డిబేట్ లో కలుద్దామంటూ. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.  

వేద పై దాడికి సిద్ధపడ్డ కైలాష్‌.. అదే టైం లో..!

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఖుషీ అనే పాప కోసం ఇష్టం లేక‌పోయినా జంట‌గా మారిన య‌ష్‌, వేద ల క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. స్టార్ ప్ల‌స్ లో సూప‌ర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహ‌బ్బ‌తే` సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ న‌టించారు. కైలాష్ గురించి య‌ష్ కు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న వేద చెప్ప‌లేక‌పోతుంది. అయితే య‌ష్ .. వేద మాట‌ల‌ని బ‌ట్టి ఏదో జ‌రిగింద‌ని ఆరా తీయ‌డం మొద‌లు పెడ‌తాడు. కానీ వేద మాత్రం ఫోన్ మాట్లాడుతూనే ఐ మిస్ యూ అని పెట్టేస్తుంది. దీంతో య‌ష్ లో మ‌రింత అనుమానం మొద‌ల‌వుతుంది. వెంట‌నే త‌న సోద‌రుడు వ‌సంత్ కి విష‌యం చెప్పి ఏం జ‌రిగిందో క‌నుక్కో మంటాడు. అయితే ఇంటికి వెళ్లి వేద‌తో మాట్లాడిన వ‌సంత్ కు మ‌రింత అనుమానం మొద‌ల‌వుతుంది. వ‌దిన ఎందుకిలా వుంద‌ని అమ్మ‌ని క‌నుక్కుంటాన‌ని వెళ్లి విష‌యం మాలినితో చెబుతాడు. విష‌యం య‌ష్ వ‌ర‌కు వెళ్లొద్ద‌ని, అత‌నికి ఫోన్ చేయొద్ద‌ని చెప్పినా వేద పొగ‌రుగా త‌న మాట‌ని లెక్క‌చేయ‌లేద‌ని మాలిని ఆగ్ర‌హిస్తుంది. వేద బాగానే వుంద‌ని, అన‌వ‌ర ఆరాలు య‌ష్ ని మానుకోమ‌ని చెప్ప‌మంటుంది. దీంతో వ‌సంత్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. వెంట‌నే మాలిని .. వేద ద‌గ్గ‌రికి వెళ్లి చెప్పినా కూడా ఎందుకు య‌ష్ కు విష‌యం చెప్పావ‌ని నిల‌దీస్తుంది. బెదిరిస్తుంది. అదే స‌మ‌యంలో వేద త‌ల్లి వీరి సంభాష‌ణ విని షాక్ అవుతుంది. ఏం జరిగింద‌ని ఆరాతీస్తుంది. మాలిని బెదిరించ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ముంబై నుంచి బ‌య‌లు దేర‌డానికి సిద్ధ‌మ‌వుతున్ య‌ష్ వేద గురించే ఆలోచిస్తూ త‌ను ఎందుకు ఇలా వుంద‌ని ఆలోచిస్తుంటాడు. క‌ట్ చేస్తే... వేద పై దాడికి కైలాష్‌ సిద్ధపడ్డతాడు .. అదే టైం లో ఇంటికొచ్చిన యష్‌.. లోప‌ల ఏం జ‌రుగుతుందో అని అటుగా వెళుతుంటాడు. త‌న ఎంట్రీతో ఏం జ‌ర‌గ‌బోతోంది.. కైలాష్ కు ఈ రోజు మూడిన‌ట్టేనా.. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

సుమ కొంటె పనులు కూడా స్పెషలే

సుమ షోస్ లోనే కాదు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసే రీల్స్ లో  కూడా కొంటె పనులు చేస్తూ తెగ నవ్వించేస్తుంది. రీసెంట్ గా ఒక డాన్స్ స్టెప్ ని తన స్టాఫ్ పర్సన్ కి నేర్పించింది. అంతకుముందు డాగ్ ట్రైనర్ గా మారింది. ఇక ఇప్పుడు ఒక ఫన్నీ రీల్ తో మనముందుకు వచ్చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రీల్ ని చేయడానికి ట్రై చేసింది. మ్యూజిక్ తో స్లోగా మోకాళ్ళ మీద కింద కూర్చునే ఈ రీల్ సుమ తనదైన కామెడీ స్టైల్ లో చేసింది. కానీ నడుము విరిగిన మ్యూజిక్ తో ఎక్స్ప్రెషన్ తో ఒక్కసారి లేచి నిలబడుతుంది. దీనికి గాను "ప్రతీ ట్రెండ్ మనకు సంబంధించినది కాదు " అనే కాప్షన్ పెట్టి ఈ వీడియో పోస్ట్ చేసింది. సుమ ఏది చేసిన అందులో ఒక వెరైటీ ఉంటుంది. ఆమె ఎక్కడుంటే అక్కడ వాతావరణాన్ని కూల్ చేసేస్తుంది తన అచ్చమైన తెలుగు మాటలతో, డైలాగ్స్ తో, పంచులతో..అందుకే సుమ ఎక్కడ షో చేసినా అది గ్రాండ్ సక్సెస్ ఐపోతుంది. ఆమె ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మార్చుకుంటుంది కాబట్టే ఇప్పటికీ సూపర్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. ఈమెతో పాటు ఉన్నవాళ్లు చాలామంది కూడా ఈమె లాంటి క్రేజ్ ని సంపాదించుకోలేకపోయారు. ఇక సుమ చేసిన ఈ వీడియోకి చూసి  ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. నవ్వుకుంటున్న ఎమోజిస్ పోస్ట్ చేస్తున్నారు. ఏ ఏజ్ లో ఆ ఏజ్ పనులే చేయాలి, ఈ వయసులో అనవసరంగా కష్టాలు తెచ్చుకోకండి , బామ్మ గారు ఎందుకు మనకు ఇవన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 అన‌సూయ 'జ‌బ‌ర్ద‌స్త్'ని వీడ‌టానికి కార‌ణం ఇదేనా?

కామెడీ షోలు ఎన్ని వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్త్ కున్న క్రేజే వేరు.. కానీ ఇప్ప‌డు ఈ షోలు కూడా క‌ళ త‌ప్పుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని న‌వ్విస్తున్న జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో లు క్ర‌మ క్ర‌మంగా త‌మ ప్రాభ‌వాన్ని కోల్పోతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కార‌ణం ఈ షోల‌లో త‌మ‌దైన కామెడీతో ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్న క‌మెడియ‌న్ లు మూకుమ్మ‌డిగా షోని వీడిపోవ‌డ‌మే అని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ షోకు యాంక‌ర్ అన‌సూయ కూడా భారీ షాకిచ్చింది. గ‌త కొన్నేళ్లుగా సినిమాల్లో న‌టిస్తూనే జ‌బ‌ర్ద‌స్త్ షో కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. కానీ ఇటీవ‌ల బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఇండైరెక్ట్ గా వెల్ల‌డించి ఈ షో నుంచి త‌ప్పుకుంది. నాగ‌బాబు నుంచి మొద‌లైన ఈ ప‌రంప‌ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే వుంది. రీసెంట్ గా సుడిగాలి సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`ని కూడా విడ‌టంతో ఈ షోల‌కు క్రేజ్ త‌గ్గ‌డం మొద‌లైంది. తాజాగా అన‌సూయ కూడా గుడ్ బై చెప్ప‌డంతో ఆమె త‌రువాత ఇంకా ఎంత మంది ఈ షోని వీడ‌తారో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే అన‌సూయ ఈ షోని వీడ‌టానికి కార‌ణం ఇదే అంటూ నెట్టింట ఓ వార్త వైర‌ల్ గా వినిపిస్తోంది. ఒక‌ప్పుడు టాప్ రేటింగ్ లో వున్న ఈ షోకు పాపులారిటీ త‌గ్గ‌డం.. రేటింగ్ దారుణంగా ప‌డిపోవ‌డం.. అంతే కాకుండా ఇదే స‌మ‌యంలో అనసూయ వ‌రుస సినిమాలు, టీవీ షోల్లో బిజీగా మార‌డంతో ఈ షోని వీడిన‌ట్టుగా చెబుతున్నారు. స్టార్ మాలో సుధీర్ తో క‌లిసి `సూప‌ర్ సింగ‌ర్‌` కి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది అన‌సూయ‌. అంతే కాకుండా ఇదే ఛాన‌ల్ లో మ‌రో కార్య‌క్ర‌మానికి కూడా సుధీర్ తో క‌లిసి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కార‌ణంగానే అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ ని వీడిన‌ట్టుగా చెబుతున్నారు. 

జ్యోతక్క బంగారం వేసుకోదు.. తింటుంది!

శివజ్యోతి అంటే కొంతమందికే తెలుస్తుంది. కానీ జ్యోతక్క అంటే చాలు ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. బిగ్ బాస్ హౌస్ జ్యోతక్క ఏడ్చిన మెమోరీస్ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోరు. "నెత్తి మీద గంగను పెట్టుకున్నావా.. అంతలా ఏడుస్తున్నావ్?" అంటూ హోస్ట్ నాగార్జున కూడా అనడం తెలిసిందే. ఇక  జ్యోతక్క వీ 6  ఛానెల్లో తీన్మార్, టీవీ 9 లో ఇస్మార్ట్ న్యూస్ వంటి షోస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి అవకాశం దక్కించుకుంది.  బిగ్ బాస్‌లో ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూ ఉండేది శివజ్యోతి. బిగ్ బాస్ తర్వాత వరసగా టీవీ షోస్‌లో అవకాశాలు దక్కించుకుంటూ తనతో పాటు తన భర్తను కూడా షోల‌కి తీసుకొస్తూ  మంచిగా ఎంటర్టైన్ చేస్తోంది. అలాగే జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి రకరకాలు వీడియోస్ చేస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. ఇప్పుడు తాజాగా ఒక ఫుడ్ వ్లాగ్ చేసింది. అందులో జ్యోతి గోల్డెన్ దోశ గురించి కబుర్లు చెప్పింది. కారం దోశ, చాకోలెట్ దోశ, పిజ్జా దోశ, 916 కేడీఎం గోల్డ్ దోశ తినేసి వాటి రెసిపీలను  ఈ వీడియోలో చూపించింది. ఇక ఇక్కడికి వచ్చే కస్టమర్స్ తమ ఫీడ్ బ్యాక్‌ని ఒక నోటీసు బోర్డులో కూడా అంటించి వెళ్తారట. ఎపుడైనా హైదరాబాద్ వస్తే ఈ 'హౌస్ ఆఫ్ దోశ'ని విజిట్ చేయకుండా తినకుండా వెళ్లొద్దు అంటూ చెప్తోంది. ఈ ఫుడ్ వ్లాగ్ కి బోల్డన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక శివజ్యోతి మీద తన పర్సనల్ లైఫ్ విషయంలో ఒకానొక టైమ్‌లో నెగటివ్ కామెంట్స్ బాగా ట్రోల్ అయ్యాయి. కానీ జ్యోతక్క చాలా బోల్డ్ క‌దా. వాటన్నిటిని తిప్పి కొట్టి, సరైన సమాధానం ఇచ్చింది కూడా.

షోస్ లో కంటే సోషల్ మీడియాలోనే టైంపాస్

విష్ణుప్రియ టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యాంకర్ గా మారి కొన్ని టీవీ షోస్ కూడా చేసింది. వీటన్నిటికంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది. తన ప్రతీ అప్ డేట్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. విష్ణుప్రియకు హీరోయిన్ అవ్వాలని ఆశ. అందుకే సినిమాల్లో బీభత్సంగా ట్రై చేస్తోంది. మూవీస్ లో అవకాశం రావాలంటే సోషల్ మీడియా ద్వారా దారి వేసుకుంటూ వెళ్లాలన్న  విషయం ఈరోజు ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విష్ణు కూడా ఆ దారినే ఫాలో అవుతూ తన హాట్ ఫొటోస్ ని, జిమ్ లో చేసే వర్కౌట్స్ ని, బెల్లీ డ్యాన్సులను, వెకేషన్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక లేటెస్ట్ గా సుడిగాలి సుధీర్ హీరో గా యాంకర్ దీపికా పిల్లి, విష్ణు ప్రియా హీరోయిన్స్ గా "వాంటెడ్ పండుగాడ్' అనే మూవీ చేసింది. ఇక  ఇప్పుడు  విష్ణుప్రియ చిన్న గౌన్ వేసుకుని ఒక హిందీ సాంగ్ కి  డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తాయి అంటూ కాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోవే పోరా షోతో ఆడియన్స్ ని అలరించింది విష్ణు ప్రియ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో పాల్గొంది. మల్లెమాల వేదిక ద్వారా ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ ఇప్పుడు షోస్ లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తోంది.

సాయికుమార్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ రాలేద‌ని బాధ‌ప‌డ్డ క‌స్తూరి

సాయికుమార్ తో కలిసి ఒక్క మూవీ కూడా చేయలేకపోయానని కస్తూరి 'వావ్' షోలో బాధపడింది. ఇక ఇటీవల ప్రసారమైన షో 'వావ్' 100 వ ఎపిసోడ్ కి కస్తూరి, అర్చన, లైలా, రోహిత్ వచ్చి సందడి చేశారు. హోస్ట్ సాయికుమార్ వీళ్ళ 100 డేస్ మూవీస్, వాటి సెలబ్రేషన్స్ ఎవరి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకున్నారంటూ అడిగి వాళ్ళ నుంచి సమాధానాలు చెప్పించారు. "హాయ్ కస్తూరి ఎలా ఉన్నావ్?" అని సాయికుమార్ అడిగేసరికి "అన్ని చోట్ల కలుస్తున్నాం కానీ కలిసి మాత్రం వర్క్ చెయ్యట్లేదు. నాకు చాలా బాధగా వుంది ఈ విషయంలో. ఇట్స్ మై డ్రీం నాట్ కం ట్రూ" అంటూ చెప్పింది కస్తూరి. "ఈ సాయికుమార్ గారితో మాత్రం నేను నటించలేదయా" అంది కస్తూరి. "అర్చనతో కలిసి 'సామాన్యుడు' చేసాను. లైలాతో కూడా ఛాన్స్ మిస్సయ్యింది" అన్నారు సాయికుమార్. "నాతో ఎన్ని అవకాశాలు మిస్ అయ్యాయో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా" అంది కస్తూరి. "అంటే ఇంతకంటే ఏదో పెద్ద అవకాశం రాబోతోందని అర్థం.. కాబట్టి త్వరలోనే కలిసిచేద్దాం" అని సాయికుమార్ భరోసా ఇచ్చారు. "నెక్స్ట్ టైం చేద్దాం అంటారు కానీ అలాగే ఐపోతోంది కానీ కలిసి నటించే అవకాశం రావట్లేదు" అంటూ ఫీలయ్యింది  కస్తూరి. 'ఆతా ఉన్ కోయిలీలే' అనే సినిమా ద్వారా తాను  ఆడియన్స్ కి కస్తూరిగా పరిచయమయ్యాను అని చెప్పిందామె. ఆ మూవీని తెలుగులో 'ప్రేమ విజేత' పేరుతో తీశారని చెప్పారు సాయికుమార్. ఈ మూవీకి కమలహాసన్ చేతులమీదుగా అవార్డు తీసుకోవడం, అందులోనూ అప్పటికే 'భారతీయుడు' మూవీ లో చేసినందుకు కూడా అమితాబ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను అంటూ 'వావ్' 100వ ఎపిసోడ్ లో తన జ్ఞాపకాలను పంచుకుంది కస్తూరి.

తులసికి తగ్గ కోడలు అంకిత

లాస్య, భాగ్య ఇద్దరూ కలిసి గాయత్రీ దగ్గరకు వచ్చి తులసి పోగొట్టుకున్న డబ్బుకు అంకిత షూరిటీ సంతకం చేసిందని చెప్పేసరికి గాయత్రీ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. గాయత్రీకి తులసి మీద  లేని పోని చాడీలు చెప్పి ఇంకా రెచ్చగొడతారు. మరో వైపు పరంధామయ్య వచ్చి అంకిత ఎందుకు షూరిటీ సంతకం చేసావని అడుగుతాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు నేను సంతకం పెట్టడం తప్పు కాదనిపించి పెట్టేసాను అంటుంది. ఇక తులసి వేడి వేడి మిర్చి బజ్జీలు తెస్తుంది. అదే టైం కి గాయత్రి అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.  గాయత్రీ మాటలు విని అంకిత భయపడేసరికి గాయత్రి ఇంకా ఇంకా విరుచుకుపడుతుంది. ఏం జరిగిందో చెప్పకుండా అరిస్తే ఎలా అని తులసి అడిగేసరికి షూరిటీ సంతకం గురించి చెప్తుంది. అంకిత చేయలేదు అంటూ బుకాయిస్తుంది. తులసి దివ్య మీద ఒట్టేసి చెప్తాను ఈ విషయం గురుంచి ఏమీ తెలీదు అనేసరికి అంకిత అడ్డుపడి తాను షూరిటీ సంతకం చేశానని చెప్పేస్తుంది. తనకు తెలియకుండా ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నావంటూ తులసి అంకితను నిలదీస్తుంది.  గాయత్రి మాత్రం ఊరుకోకుండా దీనికి అంతటికి కారణం తులసి అని ఇంకా తిట్టిపోస్తుంటుంది. అప్పుడు తులసి నీకు నా సొంత డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అంటూ మాట ఇస్తుంది. మరో వైపు లాస్య, భాగ్య ఇద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తారు. ఇక తులసి రంజిత్ కాల్ లిస్ట్ సంపాదిస్తుంది. అందులో లాస్య కాల్స్ చాలా ఎక్కువగా ఉండేసరికి ఇదంతా లాస్య చేయించిన కుట్ర అని అర్థమైపోతుంది. ఈసారి లాస్యను ఊరుకునేది లేదు అంటుంది తులసి.  

వ‌సు మీద రిషికి కోపం వ‌చ్చింది.. రీజ‌న్ ఏంటంటే..

మంచి నీళ్ల బిందెను తీసుకుని వసు ఇంటికి రావడం చూసి ధరణి "ఏంటిది వసు?" అని అడుగుతుంది. తాగటానికి నీళ్లు లేకపోయేసరికి తెచుకున్నానని చెప్తుంది వ‌సు. ఆ తర్వాత గౌతమ్, రిషి, ధరణి ముగ్గురూ కలిసి "స్కాలర్‌షిప్ టెస్ట్ లో గెలిచావ్" అంటూ స్వీట్ తినిపిస్తారు. "మీ ఇంటికి ఎండీ గారు వ‌చ్చారు. కాఫీలు, టీలు వంటి మర్యాదలు ఏమీ చేయవా" అంటూ గౌతమ్ కామెడీ చేస్తాడు. "వదినా వసుని నీళ్లు మోయొద్దని చెప్పండి" అంటాడు. ఆ మాటలకు సంతోషంగా ఫీల్ అవుతుంది వసు.  ఇంకో వైపు ఫణీంద్ర.. దేవయానితో కామెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రిషి వాళ్ళు రావ‌డంతో ధరణి మీద కోప్పడుతుంది దేవ‌యాని. ఆ టైంలో రిషి అడ్డుపడి "నేను వదినను తీసుకెళ్లా పెద్దమ్మా" అని చెప్తాడు. అప్పుడు వసు గురించి మాట్లాడతాడు రిషి. దేవయానికి అది నచ్చక గౌతమ్ ని ఇన్‌డైరెక్ట్ గా తిట్టేసరికి దేవయాని మీద సీరియస్ అవుతాడు రిషి. అంతే.. దేవయాని సైలెంట్ ఐపోతుంది.  మరోవైపు వసు పేరు నోటీసు బోర్డులో వేసేసరికి అందరూ చదివి హ్యాపీగా ఫీల్ అవుతారు. "సన్మాన సభ ఏర్పాట్లను రిషి సర్ దగ్గరుండి చూసుకుంటున్నారు" అని వసుతో చెప్తుంది పుష్ప‌. వ‌సు చాలా సంతోషిస్తుంది. ఆమె సడెన్ గా కనిపించకుండా పోయేసరికి రిషి వెయిట్ చేస్తుంటాడు. అత‌డికి సంతోషం క‌లిగిస్తూ ఫైనల్ గా వసు కనిపిస్తుంది. అదే టైంలో క‌మిష‌న‌ర్ గురించి జగతి, మహేంద్ర మాట్లాడేసరికి వసు వైపు చూస్తూనే సమాధానం చెప్తాడు. ఆ తర్వాత కమీషనర్ ని తప్పకుండా పిలవాలి అంటాడు. జగతి అక్కడి నుంచి వసు దగ్గరకి వెళ్లి మాట్లాడుతుతూ ఉంటుంది. రిషి కూడా వెళ్లిపోతుండేసరికి వసు "ఆగండి సర్" అంటూ అరుస్తుంది. ఐనా వినిపించుకోనట్టే వెళ్ళిపోతాడు. ఇంతలో రిషికి అడ్డు వచ్చి "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడుగుతాడు మ‌హేంద్ర‌. "పని ఉంది" అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇక సాక్షి అక్కడికి వచ్చి రిషికి వ‌సుధార ప్ర‌పోజ్ చేసిన వీడియో బయట పెడుతుంది. దాంతో రిషికి వసు మీద బాగా కోపం వస్తుంది. ఇదంతా వసు ప్లాన్ అనుకుంటూ ఉంటాడు. ఎపిసోడ్ లోని మిగతా హైలైట్స్ కోసం ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు'లో చూడొచ్చు.

1980ల‌లోకి తీసుకెళ్లిన 'ఢీ 14'

'ఢీ 14' రాబోయే  ఎపిసోడ్ మొత్తం కూడా 1980లోకి తీసుకెళ్లబోతోంది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జెస్ గా గణేష్ మాస్టర్, శ్రద్ధా దాస్, నందిత శ్వేతా హాజరయ్యారు. అలనాటి సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు కంటెస్టెంట్స్ అంతా అప్పటి హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ తో డాన్సులు చేసి మైమరిపించారు. "సామజ వరగమనా "సాంగ్ కి జ్ఞాన్‌ సాహు, రిషిక డాన్స్ ఇరగదీశారు. "కుర్రాడు బాబోయ్" పాటకు కూడా మంచి ఊపుతో డాన్స్ చేశారు. ఇక ప్రదీప్ కూడా మంచి జోష్ స్టెప్పులేసి అందరినీ మరింత హుషారెత్తించాడు. సుశాంత్ స్పెషల్ గెస్ట్ గా ఈ షోకి వచ్చాడు. ఇక జతిన్ టీం "నా కళ్ళు చెబుతున్నాయి"కి డాన్స్ చేసేసరికి శ్రద్ధా దాస్ "కన్నార్పకుండా చూసాను" అని కామెంట్ చేసింది. ఆది సోఫా చూసి "చిన్న సైజు ఫ్యామిలీలా ఉంది" అంటాడు ప్రదీప్. "హలో ఫామిలీ ఫోటో ఏంటి ఫ్యామిలీయే" అంటూ డాన్సర్ తేజస్విని తన భార్య అని, చైల్డ్ కంటెస్టెంట్స్ ముగ్గురు తమ పిల్లలని చెప్తాడు ఆది. "ఏమే వాన సాంగ్ చూసావ్ కదా మనం కూడా అలా వానలోకి వెళ్లి డాన్సులు చేయాలి" అంటాడు తేజుతో ఆది. "ఎండిపోయిన మొక్కకు ఎండైతే ఏమిటి, వానైతే ఏమిటి" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది తేజు. "వద్దు ఒక్క పిల్లాడితో ఆగుదాం అంటే ముగ్గుర్ని కన్నది" అంటాడు మళ్ళీ ఆది. ఇలా ఈ వారం ఎపిసోడ్ ప్రోమో సందడి చేస్తోంది.

అనసూయ ఆగుతుందా.. సాగుతుందా?!

అనసూయ 'జబర్దస్త్' షోకి బై బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ షోకి నిజంగానే బై బై చెప్పిందా లేదా, కంటిన్యూ చేస్తుందా అనే విషయంలో సందేహాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ 'జబర్దస్త్' షూటింగ్ కోసం ఒక అద్భుతమైన బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసిన అనసూయ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే హైట్ కి తగ్గ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి కాస్ట్యూమ్ వాడినా బాగుంటుంది. ఈ రోజు సోషల్ మీడియాకి రిలీజ్ చేసిన పిక్ చూస్తే.. ట్రెడిషనల్ గా, పద్ధ‌తిగా కనిపిస్తోంది. 2013లో 'జబర్దస్త్' షో మొద‌లైన‌ దగ్గరనుంచి అనసూయ చేస్తోంది. ఇక మూవీస్ లో కీ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఆమె న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ జూలై 1న రిలీజ‌వుతోంది. 'దర్జా' మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. 'పుష్ప 2', 'రంగ మార్తాండ' మూవీస్ లో నటిస్తోంది. లేటెస్ట్ గా 'సింబల్' అనే టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పింది అనసూయ. "ఇలా నిటారుగా నిలబడడం అంటే నాకు చాలా ఇష్టం" అనే కాప్షన్ తో ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఫాషన్ ఐకాన్ , క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా అనసూయ జబర్దస్త్ స్టేజి మీద ఆగిపోతుందా, కంటిన్యూ అవుతుందా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆర్య మాస్ట‌ర్ ప్లాన్‌కు అడ్డంగా బుక్కైన రాగ‌సుధ‌!

'బొమ్మ‌రిల్లు' ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించిన సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. బుల్లితెర‌పై జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మర్డర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. తాజాగా ఈ సీరియ‌ల్ చివరి అంకానికి వ‌చ్చేసింది. క్లైమాక్స్ చేరుకుంది. ఇందులో శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా వ‌ర్ష హెచ్.కె. న‌టించ‌గా ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, జ్యోతి రెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, రాధాకృష్ణ‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు. రాగ‌సుధ ఎలాగైతే త‌మ‌ని మోసం చేసిందో అలాగే ఆమె నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని ఆర్యవ‌ర్ధ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ని అను చేత అమ‌లు చేయిస్తాడు. ఆర్య చెప్పిన ప్లాన్ ప్ర‌కారం రాగ‌సుధ గెట‌ప్ ని మాన్సీ త‌ల్లికి వేయించి అను ఓ వీడియో షూట్ చేయిస్తుంది. రాజ‌నందిని గ‌దిలో త‌న‌తో పాటే వున్న రాగ‌సుధ ఆమెను న‌మ్మించి ఆస్తి ప‌త్రాల‌ని ఎలా కొట్టేసిందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా షూట్ చేయిస్తుంది. దాన్నే ఆధారంగా చేసుకుని కోర్టులో స‌బ్మిట్ చేస్తుంది. ఇక అక్క‌డి నుంచి ఆర్య త‌రుపు వాదిస్తున్న లాయ‌ర్ ఆట మొద‌లు పెడ‌తాడు. అను షూట్ చేయించి తెచ్చిన వీడియో వున్న‌ పెన్ డ్రైవ్ ని జ‌డ్జికి స‌మ‌ర్పిస్తాడు. అదే వీడియోను కోర్టులో ప్ర‌ద‌ర్శిస్తారు. వీడియో చూసిన జ‌డ్జి, రాగ‌సుధ త‌రుపున వాదిస్తున్న లాయ‌ర్‌, రాగ‌సుధ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌వుతారు. ఇదే అద‌నుగా ఆర్య‌వ‌ర్ధ‌న్ లాయర్ రాగ‌సుధ‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ ఊపిరి ఆడ‌కుండా చేస్తాడు.  "కేవ‌లం డ‌బ్బు వ్యామోహంతోనే ఇప్పుడు అనురాధ‌ గారిని ఎలా క‌త్తితో పొడిచి చంపాల‌నుకున్నారో.. అప్పుడు రాజ‌నందిని గారిని కూడా క‌త్తితో కిరాత‌కంగా క‌ర్క‌శంగా పొడిచి చంపారు" అని నిల‌దీస్తాడు.. అయితే రాగ‌సుధ లేదు అని బుకాయిస్తుంది... అయినా స‌రే క‌త్తితో పొడిచి పొడిచి చంపార‌ని లాయ‌ర్ రెట్టిస్తాడు.. దీంతో టంగ్ స్లిప్ప‌యిన రాగ‌సుధ పొడ‌వ‌లేద‌ని, నెట్టేశాన‌ని నిజం చెప్పేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? రాగ‌సుధ జైలుకి వెళ్లిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

పెట్టెలో దొరికిన క‌త్తిపై తిలోత్త‌మ వేలిముద్ర‌లున్నాయా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'త్రిన‌య‌ని'. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా కొడుకు కోసం ఆరాట‌ప‌డే త‌ల్లి ఆత్మ క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. చిత్ర విచిత్ర‌మైన మలుపులు, ట్విస్ట్ ల‌తో ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ థ్రిల్ల‌ర్ సీరియ‌ల్స్ ని అమితంగా ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఇందులో అషికా గోపాల్, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌ర‌లు న‌టించారు. న‌య‌ని, విశాల్ వెలికి తీసిన పెట్టెలో ఏముందో చెప్ప‌డం లేద‌ని ఆగ్ర‌హించిన తిలోత్త‌మ.. క‌సి, వల్ల‌భ‌, దురంధ‌ర‌, హాసినిల‌తో క‌లిసి న‌య‌ని ఉంటున్న ఏరియాకు వ‌స్తుంది. అప్ప‌టికే సుమ‌న ద్వారా విష‌యం తెలుసుకున్న విక్రాంత్.. త‌ల్లి తిలోత్త‌మ‌పై సీరియ‌స్ అవుతాడు. త‌ల్లి కూడా న‌టిస్తుందా? అని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తాడు. క‌ట్ చేస్తే.. విశాల్ - న‌య‌నిల‌ని ఈ ప్రాంగ‌ణంలో తవ్వితీసిన పెట్టెని బ‌య‌టికి తీసుకుర‌మ్మ‌ని తిలోత్త‌మ అరుస్తుంది. అంతా ఒక‌చోట చేర‌డంతో బ‌స్తీ జ‌నం కూడా పోగ‌వుతారు. ఇంత‌లో వ‌ల్ల‌భ‌ని పెట్టెని బ్రేక్ చేయ‌మంటుంది తిలోత్త‌మ‌. ఇదే స‌మ‌యంలో న‌య‌ని త‌న‌కు ప‌రిచ‌యం వున్న ఎస్.ఐ కి ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన ఎస్.ఐ పెట్టెని బ‌ద్ద‌లు కొట్టాల్సిందే అంటాడు.. వ‌ల్ల‌భ‌ని ఆ ప‌ని చేయ‌మ‌ని తిలోత్త‌మ చెబుతుంది. పెట్టెని బ్రేక్ చేయ‌డంతో డోర్ ఓపెన్ చేసి చూసి అంతా షాక్ అవుతారు. తిలోత్త‌మ‌, క‌సి అనుకుంటున్న‌ట్టుగా అందులో ఎలాంటి నిధి వుండ‌దు. గాయ‌త్రిదేవి హ‌త్య‌కు తిలోత్త‌మ ఉప‌యోగించిన క‌త్తి ల‌భిస్తుంది. దీంతో ఒక్క‌సారిగా తిలోత్త‌మ షాక్ అవుతుంది.  క‌ట్ చేస్తే.. ఇదే విష‌యాన్ని న‌య‌ని.. తిలోత్త‌మ‌తో చెబుతుంది. ఆ క‌త్తిపై వున్న వేలి ముద్ర‌లు మీవో కాదో తేల్చ‌డానికి పోలీస‌న్న వ‌చ్చాడ‌ని.. ఇక గాయ‌త్రి దేవి అమ్మ‌గారిని చంప‌డానికి నువ్వు రాసిన లెట‌ర్ లోని అక్ష‌రాల‌ని విశాల్ బాబు గుర్తు ప‌ట్టాడ‌ని చెబుతుంది న‌య‌ని.. దీంతో తిలోత్త‌మ‌లో టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది.. ఆ త‌రువాత ఏం జ‌ర‌గ‌నుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సూరత్‌లో స్ట్రీట్ ఫుడ్ అదుర్స్.. కావాలంటే న‌వీన‌ని అడ‌గండి!

బుల్లితెరపై ఎంతో మంది తమని తాము నిరూపించుకుని దూసుకుపోతున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది నటి యాటా నవీన. తెలుగు సీరియల్స్ ద్వారా ఈమె ఆడియన్స్ కి సుపరిచితమే. 'కలవారి కోడలు', 'చంద్రముఖి' వంటి సీరియల్స్ లో యాక్ట్ చేసిన నవీన తన నటనతో, అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఈమె భర్త పేరు యాట సత్యనారాయణ. ఈయన 'కలవారి కోడలు', 'పెళ్లి నాటి ప్రమాణాలు' సీరియల్స్ కి నిర్మాతగా పని చేశారు. ఇక నవీన సీరియల్స్ తో న‌టించ‌డంతో పాటు యూట్యూబ్ లో కూడా వరుసగా వీడియోస్ చేస్తుంటుంది.  ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఫుడీస్ అందరికోసం ఒక ఫుడ్ వీడియో చేసింది. గుజరాత్ కి వెళ్లిన నవీన సూరత్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అని చెప్తూ అక్కడి ఫుడ్ గురించి వివ‌రించింది. ఉధ్నా బజార్ అని సూరత్ లో మంచి ఫేమస్ ప్లేస్. అక్కడ కోల్డ్ కోకో ఫేమస్ డ్రింక్. గ్లాస్ లో ఐస్ వేసి చాక్లెట్ సిరప్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇస్తారు. కోల్డ్ కాఫీలంటే ఇష్టపడని నవీన ఫస్ట్ టైం కోల్డ్ కోకో తాగి టెంప్ట్ ఐపోయింది.  తర్వాత స్పెషల్ ఫ్రాంకీ, సూరత్ స్పెషల్ రింజిమ్ స్టఫ్డ్ పిజ్జా మస్త్ ఎంజాయ్ చేసింది. గుజరాత్ కి వచ్చిన వారెవరైనా పానీపూరి తినకుండా వెళ్ళరు. అంత ఫేమస్ ఫుడ్ అది. ఇక దాన్ని అక్కడ బాస్కెట్ చాట్ అంటారట. అలా సూరత్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ ని ఫుడ్ లవర్స్ కోసం వీడియో చేసి పెట్టింది నవీన. వీటిని ఫాలో అయ్యి ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఆ ఫొటోస్ ని కూడా తనతో షేర్ చేసుకోమని చెప్పుకొచ్చింది నవీన. ఈ వీడియోకి సూపర్ వ్లాగ్ అని, సూపర్ వీడియో అని, యమ్మీ ఫుడ్ అని.. ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బెడ్‌రూమ్‌లో వేద‌ని వేధిస్తున్న‌ కైలాష్.. య‌ష్ ఏం చేశాడు?

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో సాగుతోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. య‌ష్ బిజినెస్ ప‌నిమీద‌ ముంబై వెళ్లిపోవ‌డంతో ఇదే మంచి అద‌నుగా భావించిన కైలాష్ వావి వ‌రుస‌లు మ‌రిచిపోయి.. ఒంట‌రిగా బెడ్రూమ్ లో వున్న వేద‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు.. త‌న ప్ర‌పోజ‌ల్ కు ఒప్పుకోమ‌ని ఇబ్బందికి గురిచేస్తాడు. ఇందు కోసం ల‌వ్ సింబ‌ల్ తో వున్న గిఫ్ట్ ని కూడా ఇస్తాడు. అత‌ని నీచ‌పు మ‌న‌స్త‌త్వానికి షాకైన వేద ఏడుస్తూ హాల్లోకి వ‌స్తుంది. జ‌రిగిన విష‌యాన్ని అత్త మాలినితో చెబుతుంది. కానీ త‌ను న‌మ్మ‌దు. పైగా వేద‌నే అనుమానిస్తుంది. కైలాష్ ఎలాంటి వాడో త‌న‌కు తెలుస‌ని, త‌ను ఇంటి అల్లుడు అని, అత‌ని అధికారం ముందు త‌ల వంచాల్సిందేన‌ని, ఈ విష‌యాన్ని య‌ష్ కు ఎట్టిప‌రిస్థితిలో చెప్ప‌కూడ‌ద‌ని వేద‌ని హెచ్చ‌రిస్తుంది. ఉన్న‌ట్టుండి అంతా తారుమార‌య్యే స‌రికి వేద అచేత‌నురాల‌వుతుంది. అయినా స‌రే.. "సాటి ఆడ‌దాని బాధ‌ని అర్థం చేసుకోండి" అని నిల‌దీస్తుంది. అయినా మాలిని.. వేద మాట‌ల‌ని విన‌దు.. నీది అపోహ అని కొట్టి పారేస్తుంది. ఏం చేయాలో తెలియ‌క బెడ్రూమ్ లో య‌ష్ ఫొటోని అద్దంలో చూస్తూ "మిస్ యు" అని రాస్తుంది వేద‌.. ఆ త‌రువాత య‌ష్ కు జ‌రిగిన విష‌యం చెప్పాల‌ని ఫోన్ చేస్తుంది. కానీ య‌ష్‌.. మాలిని ప‌డిపోవ‌డంతో త‌న వ‌ద్దే వుంటాడు.. ఫోన్ సైలెంట్ లో వున్న విష‌యం ప‌ట్టించుకోడు.. త‌రువాత ఫోన్ చెక్ చేస్తే వేద చాలా సార్లు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది.  వెంట‌నే వేద‌కు ఫోన్ చేస్తాడు య‌ష్‌.. త‌ను విష‌యం చెప్పే లోపు "కైలాష్ గురించేనా?" అంటే షాకిస్తాడు. "త‌న‌కు డ‌బ్బులు ఇప్పించావు, ఉద్యోగం ఇవ్వ‌మ‌న్నావు.. ఇదంతా తెలిసి మా అమ్మ నిన్ను ఆకాశానికి ఎత్తేసి వుంటుంది క‌దా?" అంటాడు. త‌న‌కు జ‌రిగిన విష‌యం చెప్ప‌లేక, మ‌న‌సులో దాచుకోలేక వేద న‌ర‌కం అనుభ‌విస్తూ అది య‌ష్ కు తెలియ‌కుండా మాట్లాడుతుంది. అయినా య‌ష్ గ‌మ‌నించి "ఏం జ‌రిగింది?" అని ఆరాతీస్తే "ఐ మిస్ యూ" అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది.. దీంతో స‌మ్ థింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని య‌ష్ కు అర్థ‌మ‌వుతుంది.  క‌ట్ చేస్తే.. వేద ఒంట‌రిగా బెడ్రూమ్ లో వుండ‌టం గ‌మ‌నించిన కైలాష్ త‌న కోరిక తీర్చ‌మ‌ని వేద‌ని వేధించ‌డం మొద‌లు పెడ‌తాడు.. ఇదే స‌మ‌యంలో య‌ష్ ముంబై నుంచి దిరిగి ఇంటికి చేర‌తాడు.. హాలులో య‌ష్‌.. బెడ్రూమ్ లో వేద‌, కైలాష్‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది?.. య‌ష్ ఎలా రియాక్ట్ కాబోతున్నాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'ఇంటి గుట్టు', 'మిఠాయికొట్టు చిట్టెమ్మ' మహాసంగమం

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు' లో ప్రసారమవుతున్న 'ఇంటి గుట్టు', 'మిఠాయికొట్టు చిట్టెమ్మ' సీరియల్స్ వినూత్న కథాంశాలతో, రిలేటబుల్ కంటెంట్ తో తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ప్రేక్షకులను ఆ ఛానల్ 'మహాసంగమం' ఎపిసోడ్స్ తో కనువిందు చేయడానికి సిద్దమవుతుండడంతో, ఇరు సీరియల్స్ లోని నటీనటులను ఒకే ఫ్రేములో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. అంతేకాకుండా, సీరియల్స్ నిర్వాహకులు ఈ ఎపిసోడ్స్ ద్వారా జూన్ 30న, జూలై 1న మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు గంటపాటు రెట్టింపు వినోదాన్ని 'జీ తెలుగు' వీక్షకులకు అందించనున్నారు.    వివరాల్లోకి వెళితే, ఈ మెగా ఎపిసోడ్ అనేక ట్విస్టులతో, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రసవత్తరంగా సాగనుంది. సంపద, సిద్ధు (ఇంటి గుట్టు), కాంతమ్మ (మిఠాయికొట్టు చిట్టెమ్మ) మధ్య జరిగే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. డబ్బు కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధంగా ఉండే ఈ ముగ్గురి మధ్య వచ్చే ఒక సిట్యుయేషన్ ని ఇరు సీరియల్స్ లోని ఫీమేల్ లీడ్స్ ఐన కళ్యాణి, చిట్టెమ్మ ఎలా ఎదుర్కుంటారనేది ఈ 'మహాసంగమం' ఎపిసోడ్స్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఈ గురువారం, శుక్రవారం 'ఇంటి గుట్టు' మరియు 'మిఠాయికొట్టు చిట్టెమ్మ' మహాసంగామం ఎపిసోడ్స్ ను మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు 'జీ తెలుగు'లో వీక్షించ‌వ‌చ్చు.

మొక్కలతో మీ రోహిణి...

ప్రపంచం మొత్తం కూడా ప్లాస్టిక్ మాయమైపోతుంది. పచ్చని చెట్లు ఎక్కడా  కనిపించకుండా పోతున్నాయి. ఐతే కొంతమంది మాత్రం ఇంట్లో మొక్కల్ని పెట్టుకోవడమా, గార్డెన్ లో, లాన్లో మొక్కల్ని పెంచుకోవడమే వంటివి చేస్తారు. అలాంటి కోవలోకి వస్తుంది రౌడీ రోహిణి. తన ఇంటినంతటిని మొక్కలతో అలంకరించేసింది. వాటిని ఆడియన్స్ తో షేర్ చేసుకోవడానికి ఒక వీడియో కూడా చేసింది. గోల్డెన్ టబ్ లో కొన్ని మొక్కల్ని డెకరేట్ చేసి గోడకు తగిలించింది. తన ఇంట్లో పెట్టిన మొక్కలన్నీ కూడా లోలైట్, ఎయిర్ ప్యూరిఫయ్యర్ ప్లాంట్స్ అన్నమాట. వీటికి ప్రతీ రోజు నీళ్లు పోయాల్సిన పని లేదు, టెన్ డేస్ కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పింది .  అలాగే ఎండ కూడా అంత అవసరం ఉండదు, ఇవన్నీ నీడ పట్టున పేరైన ఇన్డోర్ ప్లాంట్స్ అని చెప్పింది. అందానికి అందాన్ని ఇవ్వడమే కాదు ఫ్రెష్ ఎయిర్ కూడా అందిస్తాయట ఈ మొక్కలు. రెడ్ ఎగ్లోనిమా, గోల్డెన్ పోతోస్ అని మనీ ప్లాంట్ లో ఒక వెరైటీని, అలాగే పేపరోమియా ప్లాంట్ కూడా డెకరేట్ చేయించుకుంది. ఇక తన బెడ్ పక్కన స్నేక్ ప్లాంట్ అనే ఒక మొక్కను పెట్టించుకుంది. ఈ మొక్క ఆక్సిజన్ ఎక్కువగా సరఫరా చేస్తుందట . అలాగే చైనీస్ ఎవర్ గ్రీన్ అనే మొక్కను వాళ్ళ అక్క రూమ్ లో పెట్టించింది.  రోహిణి వాళ్ళ అమ్మ కోసం తులసి మొక్కను , తన కోసం ఎల్లో రోజ్ ప్లాంట్ ని కూడా తెప్పించుకుంది. ఇక అలాగే తన ఇంట్లో స్పేస్ కి తగ్గట్టు ప్లాంట్ పాట్స్ ని డిజైన్ చేశారు ప్లాన్ ఏ ప్లాంట్ వాళ్ళు అని చెప్పుకొచ్చింది రోహిణి. ఇక మొక్కల్లో ఉన్న మట్టి ఎండిపోతే తప్ప లేకపోతే నీళ్లు పోయాల్సిన అవసరం పడదని చెప్పింది. ఎందుకంటే 20 రకాల మట్టి నమూనాలతో తయారు చేసిన మట్టి కాబట్టి అంత తొందరగా ఎండిపోయే పరిస్థితి రాదని వివరించింది. ఇక ప్లాంట్ డెకొరేషన్ చాలా బాగుంది. మొక్కల్ని ఇంట్లో షోగా పెట్టుకుంటారని తెలుసు కానీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..