సుధీర్ మళ్ళీ రాబోతున్నాడా ?

బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్. ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా హీరో కి కూడా ఉండరు. ఏ షోలో చేస్తాడో ఆ షోకి ఫుల్ రేటింగ్ గ్యారెంటీ. పదేళ్లుగా జబర్దస్త్ షోలో ఎంటర్టైన్ చేస్తూ ఇటీవలే అక్కడ నుంచి వెళ్లిపోయే ఇంకొన్ని షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, నాగబాబు, రోజా, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, గెటప్ శీను, హైపర్ ఆది, ధనరాజ్, వేణు వంటి సీనియర్స్ అందరూ వెళ్లిపోయేనారు. ఆ తర్వాత జబర్దస్త్ లో అసలు లోపలేం జరుగుతోంది అనే విషయాలపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్ కాక పుట్టించాయి. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఓపెనప్ అయ్యి కొంతమంది ఆర్పీ కామెంట్స్ కి ఖండించారు , ఇంకొందరు అవే నిజలాంటూ చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా సుధీర్ వెళ్లిపోయేసరికి రష్మీ ఆ షోని హ్యాండిల్ చేస్తోంది. ఐతే మల్లెమాల నుంచి కొంతమంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు మొత్తం మళ్ళీ ఈ షోకి తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా కోరారు అలాగే వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో అక్క బావెక్కడ అంటూ రష్మిని అనడం చూస్తూ ఉంటె సుధీర్ ని త్వరలో ఈ షోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సుధీర్ తిరిగి వస్తాడో రాడో అనే విషయాన్ని పక్కన పెడితే రెండు చోట్ల షోస్ చేయడం కుదరక, అగ్రిమెంట్ టైం కూడా ఐపోవడంతో వెళ్లిపోయాడని ఆది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఈ సుధీర్ ఎంట్రీ గురుంచి ఈ ప్రోమో ద్వారా చెప్పిద్దామని చూసారా ? లేదా నిజంగానే వస్తాడా అనే విషయం తెలియాలంటే కొంత కలం వెయిట్ చేయాల్సిందే.

నిరుప‌మ్ - శౌర్య‌ కోసం ప్రేమ్ ప్రేమ పాఠాలు!

ఎంతో కాలంగా స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతూ నంబ‌ర్‌వ‌న్ సీరియ‌ల్‌గా నిలిచిన కార్తీక‌దీపం ప్ర‌స్తుతం కొత్త కొత్త మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ ఎలాంటి ట్విస్ట్ ల‌తో సాగ‌నుందో ఒక‌సారి చూద్దాం. సౌంద‌ర్య ఇంటికి వ‌స్తాడు ప్రేమ్‌. అత‌నితో హిమ ఎవ‌రూ విన‌కుండా నిరుప‌మ్‌, శౌర్య‌ల పెళ్లి గురించి మాట్లాడుతుంది. "హిమా! ప్రేమ పెరగాలంటే ఇద్ద‌రూ ఒకే చోట ఉండాలి. త‌ర‌చూ క‌లుసుకోవాలి, మాట్లాడుకోవాలి. క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూసుకోవాలి" అంటూ ప్రేమ పాఠాలు చెబుతాడు ప్రేమ్‌. ఆ త‌రువాత నిరుప‌మ్ -  శౌర్యల‌ని క‌ల‌ప‌డానికి ఏదో ప్లాన్ చెబుతాడు.  సీన్ క‌ట్ చేస్తే.. ఆనంద‌రావు సోఫాలో నీర‌సంగా ఉంటారు. నిరుప‌మ్ కంగారుగా వ‌చ్చి అక్క‌డే వున్న శౌర్య‌ని చూస్తాడు. ప్రేమ్‌, హిమ ఆ సీన్ చూసి సూప‌ర్ అనుకుంటారు. ఇంత‌లోనే అక్క‌డి నుంచి శౌర్య వెళ్లిపోతుంది. `దేవుడా.. ప్లాన్ ఫెయిల్` అని ఫీల‌వుతారు హిమ‌, ప్రేమ్‌. అది గ‌మ‌నించిన సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు కూడా ఫీల‌వుతారు. హిమ‌, ప్రేమ్ ఏం ప్లాన్ చేశారు?.. నిరుప‌మ్ ఎందుకు వ‌చ్చాడు?.. శౌర్య ఎందుకు బ‌య‌టికి వెళ్లింది? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నిరుప‌మ్ తో శౌర్య పెళ్లి చేయాల‌ని, ఇద్ద‌రిని క‌ల‌పాల‌ని హిమ ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. త‌న‌కి ప్రేమ్ తోడ‌వ్వ‌డంతో క‌థ‌నం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ప్రేమ్ చేసే ప్ర‌య‌త్నంలో హిమ ద‌గ్గ‌ర‌వుతుందా?.. నిరుప‌మ్, శౌర్య క‌లుస్తారా?.. హిమ అనుకున్న‌ట్టే ఒక్క‌ట‌వుతారా?.. శౌర్య ప్రేమ గెలుస్తుందా?.. డాక్ట‌ర్ బాబు నిరుప‌మ్ మ‌న‌సు మార్చుకుంటాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

తిలోత్త‌మ‌తో ఆడుకుంటున్న న‌య‌ని!

అషికా గోపాల్, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రాత్రి 8:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతూ థ్రిల్లింగ్ అంశాల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, భావ‌నా రెడ్డి, విష్ణుప్రియ‌, ద్వార‌కేష్ నాయుడు, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య త‌దిత‌రులు న‌టించారు. విశాల్‌, న‌య‌ని 50 కోట్ల షూ కాంట్రాక్ట్ ని తిలోత్త‌మ కుట్ర కార‌ణంగా పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది. కావాల‌నే డీల్ రోజు విశాల్ షూలో ఎల‌ర్జీ పౌడ‌ర్ చ‌ల్ల‌డంతో విశాల్ షూస్ ని మీటింగ్ జ‌రుగుతుండ‌గానే కాళ్ల‌తో త‌న్నేస్తాడు. ఇది గ‌మ‌నించిన ఇత‌ర కంప‌నీ వాళ్లు అర్థ్రాంత‌రంగా డీల్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతారు. ఈ విష‌యాన్ని సీరియ‌ల్ గా తీసుకున్న న‌య‌ని.. తిలోత్త‌మ‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌ని ప్లాన్ చేస్తుంది. తిలోత్త‌మ వేసుకున్న కొత్త చెప్పులు కాళ్ల‌కే ఫిక్స‌య్యేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌క తిలోత్త‌మ అవ‌స్థ‌లు పడుతూ వుంటుంది. ఇదే మంచి అద‌నుగా భావించిన న‌య‌ని స‌ల‌స‌ల కాగే నీళ్ల‌లో తిలోత్త‌మ కాళ్లు పెట్టించి తిలోత్త‌మ తిక్క కుదురుస్తుంది. ఒక్క సారిగా కాళ్లు మంటెక్కిపోవ‌డంతో టాప్ లేచేలా తిలోత్త‌మ అరుస్తుంది. ఆ త‌రువాత కాళ్ల‌కున్న చెప్పులు వీడి పోవ‌డంతో త‌న‌ని తీసుకెళ్లి బెడ్రూమ్ లో ప‌డుకోబెడుతుంది. ఇది నీకుట్రేన‌ని నాకు తెలుస‌ని తిలోత్త‌మ అన‌డంతో ఇది జ‌స్ట్ షాంపిల్ మాత్ర‌మే అని న‌య‌ని చెబుతుంది. ఆ త‌రువాత తిలోత్త‌మ‌ని ఆడుకోవ‌డం మొద‌లు పెడుతుంది. గాయ‌త్రీ దేవి, భూష‌ణ్‌, సుధ అంటూ ముగ్గురు పిల్ల‌ల‌తో ఆత్మ‌ల్లా నాట‌కం మొద‌లు పెడుతుంది. అది చూసిన తిలోత్త‌మ‌లో వ‌ణుకు మొద‌ల‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

య‌ష్ - వేద‌ల‌కు మాళ‌విక వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. కాంచ‌న‌, మాలినిల ద్వారా వేద ఇంటి నుంచి వెళ్లిపోయింద‌ని, ఇక రాద‌ని తెలుసుకున్న ఖుషీ వెంట‌నే వెళ్లి వేద‌ని ఇంటికి ర‌మ్మంటుంది. నేను, నువ్వు, డాడీ మ‌నం ముగ్గురం ఒక పార్టీ క‌దా ఎందుకు మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి ఇక్క‌డికి వ‌చ్చావ్? అంటూ నిల‌దీస్తుంది. ఆ త‌రువాత ఇంటికి రామ్మా అంటూ 1..2..3.. లెక్క పెడ‌తాను.. నీకు ఇంటి రావాల‌ని వుంటే న‌న్ను పిలువు లేదంటే వెళ్లిపోతాను అంటుంది. వేద స్పందించ‌క‌పోవ‌డంతో భారంగా అక్క‌డి నుంచి అపార్ట్ మెంట్ బ‌య‌టికి వెళ్లిపోతుంది. విష‌యం తెలిసి య‌ష్ .. వేద‌ని మంద‌లిస్తాడు. త‌ను అడిగినా రావా? అంటూ ఫైర‌ల్ అవుతాడు. ఎందుకిలా చేస్తున్నావ‌ని ఆవేశంతో ర‌గిలిపోతాడు. త‌న‌కు ఏదైనా జ‌రిగితే నిన్ను క్ష‌మించ‌ను అంటూ మండి ప‌డ‌తాడు. క‌ట్ చేస్తే వేద‌.. య‌ష్ ఇద్ద‌రు క‌లిసి ఖుషీని వెతుక్కుంటూ మాళ‌విక‌, అభిమ‌న్యుల వ‌ద్ద‌కు వెళ‌తారు. య‌ష్ ఆవేశంతో అభిమ‌న్యు కాల‌ర్ ప‌ట్టుకుని ఖుషీ ఎక్క‌డ అని నిల‌దీస్తాడు. త‌న‌కు తెలియ‌ద‌ని అభిమ‌న్యు అన‌డంతో య‌ష్ ఆవేశంతో ఊగిపోతాడు. విష‌యం ఆర్థం కావ‌డంతో మాళ‌విక రివ‌ర్స్ కౌంట‌ర్ ఇవ్వ‌డం మొద‌లు పెడుతుంది. ఖుషీ నా కూతురు దాచి పెట్టాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో చెప్పండి.. గంట టైమ్ ఇస్తున్నాను. ఆలోగా ఖుషీ సేఫ్ అన్న న్యూస్ నా చెవినప‌డాలి. లేదంటే ఇద్ద‌రిపై కేసు పెడ‌తాను అంటూ య‌ష్‌, వేద‌ల‌కు మాళ‌విక వార్నింగ్ ఇస్తుంది.   

`రాధ‌మ్మ కూతురు` కోసం బుల్లితెర‌కు యంగ్ హీరో!

టాలీవుడ్ హీరో నిఖిల్ బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చాడు. `రాధమ్మ కూతురు` సీరియ‌ల్ లో స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చి ఫైట్ లు చేశాడు. వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ న‌టిస్తున్న సూప‌ర్ నేచుర‌ల్ స్పిర్చువ‌ల్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2014లో వ‌చ్చ‌న `కార్తికేయ‌` మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌కృష్ణుడికి సంబంధించిన చ‌రిత్ర‌, ద్వార‌కా న‌గ‌రంపై అన్వేష‌ణ చేసే ఓ మెడికోగా నిఖిల్ క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న ఇస్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ వారు మ‌ధుర‌లో వున్న బృందావానానికి  చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఈ మూవీ మ‌రింత‌గా వార్త‌ల్లో నిలిచింది. జూలై 22న విడుద‌లకు ప్లాన్ చేసిన ఈ మూవీని `థాంక్యూ` కార‌ణంగా వాయిదా వేశారు. ఆగ‌స్టు 12న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో నిఖిల్ బుల్లితెర‌పై అడుగు పెట్టాడు. జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న `రాధ‌మ్మ కూతురు` సీరియ‌ల్ లో స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇచ్చాడు. రాద‌మ్మ పెద్ద కూతురు అక్ష‌ర‌ని ఓ కారులో బంధించి ఆమె భ‌ర్త అర‌వింద్ కు మ‌రో పెళ్లి చేస్తుంటారు. దీని వెన‌క పెద్ద కుట్రే జ‌రుగుతుంటుంది. ఆ కుట్ర‌ని చేధించే క్ర‌మంలో రాధ‌మ్మ చిన్న‌కూతురు సాక్ష్యంతో పెళ్లిని అడ్డుకోవ‌డానికి వ‌స్తుంటుంది. త‌ను పెళ్లికి రాకుండా రౌడీల‌ని ఏర్పాటు చేస్తారు పెళ్లి కూతురు తండ్రి. వారి నుంచి రాధ‌మ్మ చిన్న కూతురుని ర‌క్షించి ఆమెని పెళ్లి మండ‌పానికి తీసుకెళ్లే స‌న్నివేశంలో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఓఫైట్ సీన్ ని కూడా నిఖిల్ పై షూట్ చేశారు. `కార్తికేయ 2` ప్ర‌చారం కోసం నిఖిల్ మొత్తానికి బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడ‌న్న‌మాట‌.   

శ్రీ‌లేఖ పాట విని బాలుగారు అంత‌మాట‌న్నారా?

డైలాగ్ కింగ్ సాయి కుమార్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో `వావ్‌`. ప్ర‌స్తుతం సీజ‌న్ 3 ప్ర‌సారం అవుతోంది. `మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో` అనే క్యాప్ష‌న్ తో ఈ షోని ర‌న్ చేస్తున్నారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం ఈటీవీలో ప్ర‌సారం అవుతూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ కోసం ఈ షోలో ఎమ్.ఎమ్. శ్రీ‌లేఖ‌, సాందీప్‌, అదితి భావ‌రాజు, కారుణ్య పాల్గొని సంద‌డి చేశారు. ఈ నెల 26న మంగ‌ళ‌వారం ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం నెట్టింట ఈ ప్రోమో సంద‌డి చేస్తోంది. ఎమ్.ఎమ్. శ్రీ‌లేఖ సంగీత ద‌ర్శ‌కురాలు కావ‌డానికి స్ఫూర్తి ఎవ‌రో, ఏ కార‌ణం వ‌ల్ల తాను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యిందో వెల్ల‌డించింది. అంతే కాకుండా బాలు గారు త‌న పాట విని ఏమ‌న్నారో కూడా వివ‌రించింది. ముందు కామెంట్ చేసిన ఆయ‌నే ఆ త‌రువాత కాకి కోక‌ల అయ్యింద‌ని కాంప్లిమెంట్ ఇచ్చార‌ట‌. అన్న‌య్య కీర‌వాణి కార‌ణంగానే తాను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాన‌ని, అయితే అందుకు అన్న‌య్య కారే కార‌ణ‌మ‌ని చెప్పింది. త‌న‌కూ కారు వుండాల‌నే ప‌ట్టుద‌లే త‌న‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ని చేసింద‌ని చెప్పుకొచ్చింది.  ఇక ఒక పాట పాడ‌టానికి వెళ్లి నాలుగు పాట‌లు పాడాన‌ని, లెక్క‌లేన‌న్ని పాట‌లు పాడాల‌న్న‌దే త‌న క‌ల అని కారుణ్య తెలిపాడు. యుఎస్ లో పుట్టి పెరిగిన అదితి భావ‌రాజు గాయ‌నిగా త‌న సంగీత ప్ర‌యాణం ఎలా మొద‌లైందో చెప్పుకొచ్చింది. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియాలంటే వ‌చ్చే మంగ‌ళ‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `వావ్ 3` మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో చూడాల్సిందే. 

ఎస్ఐ నాగికి బ్యూటీ టిప్ చెప్పిన రాకెట్ రాఘవ

జబర్దస్త్ స్కిట్ లో ఈ వారం కొంచెం చప్పగా అనిపించినా రాఘవ స్కిట్ మాత్రం కడుపుబ్బా నవ్వు తెప్పించింది. ఈ స్కిట్ లో రాఘవ కానిస్టేబుల్ గా నాగి ఎస్ఐ గా చేసారు ఈ స్కిట్ లో. ఇక ఈ స్కిట్ లో ఎస్ఐ నాగి కి కడుపునొప్పి వస్తోంది అనేసరికి రాఘవ ఒక సింపుల్ టిప్ చెప్తాడు. ఒక రాగి పాత్ర తీసుకుని వర్షం వచ్చేటప్పుడు ఆ రాగి పాత్రలో నీళ్లు నింపు నాలుగు రోజులు అట్టే పెట్టి ఐదో రోజు తీసి తల మీద పోసుకోవాలి అని  చెప్తాడు. అలా చేస్తే కడుపు నొప్పి తగ్గిపోద్దా అని అడుగుతాడు నాగి. లేదు సర్ తల తడుస్తుంది అప్పుడు మీరు డాక్టర్ దగ్గరకి వెళ్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది అంటూ ఫుల్ ఫన్ చేస్తాడు. ఎస్ఐ నాగి సీరియస్ ఐపోయి రాఘవ మీదకు వచ్చేసరికి సర్ మీ ముఖంలో అదృష్ట రేఖలు ఉన్నాయంటూ కాకా పట్టడం స్టార్ట్ చేస్తాడు. చాలా క్రీములు వాడాను కానీ ముఖం మీద మచ్చలు మాత్రం పోవడం లేదు అంటాడు నాగి. దానికి కూడా న దగ్గర  సూపర్ టిప్ ఉందని చెప్తాడు రాఘవ. చిన్న స్టీల్ గిన్నెలో కొంచెం గడ్డ పెరుగు వేసి అందులో చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత లేత వేప కొమ్మ ఒక అలా విరిచి దాంతో మొత్తాన్ని అలా తిప్పాలి ఆ తర్వాత రాత్రి 9 గంటల వరకు దాన్ని  ఫ్రిజ్ లో పెట్టి ఆ తర్వాత దాన్ని తీసి బయట పడేసి టైంకి వచ్చి పడుకుంటే ఈ చారలు తగ్గుతాయి అంటూ మస్త్ కామెడీ చేస్తాడు రాఘవ.

క్యాష్ : ‘సుమ’ రాజ్యంలో..శిక్షలు ఏంట‌వి.. ఎలా ఉంటాయ్‌?

పాపుల‌ర్ యాంక‌ర్ సుమ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ప్రోగ్రాం `క్యాష్‌`. ఈ వారం ప్ర‌సాం కాబోయే ఎపిసోడ్ లో `హ‌లో వ‌ర‌ల్డ్` వెబ్ సిరీస్‌ టీమ్  పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేశారు. మ‌హారాణిగా సుమ వేసిన శిక్ష‌లు నవ్వులు పూయిస్తున్నాయి. నిహారిక కొణిదెల ఈ సీరీస్ ని నిర్మించింది. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో నిఖిల్‌, నిత్యాశెట్టి, `మై విలేజ్ షో` అనిల్ పాల్గొన్నారు. సుమ‌తో వీరు క‌లిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ నెల 23న ప్ర‌సారం కానున్న ఈ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఇది నెట్టింట సంద‌డి చేస్తోంది. నిహారిక ఎంట్రీ ఇవ్వ‌డంతో `నిహారిక నిహారిక‌.. అంటూ సాంగ్ వేశారు.. ఇంత‌లో నా కోసం కూడా ఓ సాంగ్ వుంద‌ని సుమ అన‌డంతో `సుమం ప్ర‌తి సుమం సుమం..` అంటూ ఓ పాటేశారు. వెంట‌నే నిఖిల్ `ముస‌లోళ్ల‌కి వేసే సాంగ్ ల‌న్నీ వేస్తారీవిడ‌కి` అని పంచ్ వేశాడు.. నిత్యాశెట్టి రాగానే త‌న‌పై కూడా అనిల్ పంచ్ వేయ‌డంతో అంతా న‌వ్వేశారు. ఇక నిహారిక‌ని డాక్ట‌ర్ గా కూర్చోబెట్టి అనిల్ ని పేషెంట్ ని చేసింది సుమ‌. ఏంటీ నీ ప్రాబ్ల‌మ్ అని అడిగితే వెంట‌నే నిఖిల్ `నోటి దూల‌`అనేశాడు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టిన నిహారిక `ఏంట‌మ్మా నీ ప్రాబ్లమ్‌` అని మ‌ళ్లీ అడిగింది.. వెంట‌నే అనిల్ గ్యాప్ ప్రాబ్ల‌మ్ అన్నాడు. అయితే ఆల‌స్యం ఎందుకు కొత్త సిలిండ‌ర్ మార్చేయ్ అన‌డంతో అక్క‌డున్న వాళ్లంతా గొళ్లున న‌వ్వేశారు. ఆ త‌రువాత ఆంటీ నిఖిల్ కి ఎవ‌రో ఇష్ట‌మంట అని నిహారిక అన‌డం.. ఊరుకో అమ్మ చిన్న‌పిల్లాడు వాడికి అప్పుడే పెళ్లేంటి? అని సుమ స‌మాధానం చెప్ప‌డం..`అమ్మానేను ఏమీ ఎర‌గ‌ని ప‌సికందున‌మ్మా` అని నిఖిల్ అన‌డం.. వెంట‌నే `నువ్వు ప‌సికందుకు కాదురా క‌సి కందువు` అని నిహారిక పంచ్ వేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇంత‌కీ సుమ రాజ్యంలో వున్న శిక్ష‌లేంటీ? ఎలా వుంటాయ్? అన్న‌ది తెలియాలంటే 23 రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.    

క‌నిపించ‌ని ఖుషీ...వేద‌ని నిల‌దీసిన య‌ష్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. కైలాష్ ఇష్యూ కార‌ణంగా ఇంటి నుంచి వెళ్లిపోయి త‌ల్లిదండ్రుల‌తో వుంటున్న వేద‌ని తిరిగి ఇంటికి ర‌మ్మ‌ని య‌ష్ తండ్రి ర‌త్నం వెళ్లి అడుగుతాడు. అయితే వేద మాత్రం అందుకు అంగీక‌రించ‌దు. య‌ష్ వ‌చ్చి పిలిస్తేనే వ‌స్తాన‌ని చెబుతుంది. దీంతో ర‌త్నం వెనుదిరిగి వెళ్లిపోతాడు. విష‌యం తెలిసి య‌ష్ ఊగిపోతాడు. ఇంత‌లో ఒక భార్య భ‌ర్త నుంచి కోరుకునే ఎఫెక్ష‌న్ ని త‌ను నీ నుంచి కోరుకుంటోంది. ఒక్క‌సారి వెళ్లి ర‌మ్మ‌ను నువ్వు వెళ్లి వ‌చ్చేస‌రికికి నీకు ఎదురుప‌డుతుంది` అంటాడు ర‌త్నం. ఆ మాట‌లు విన్న ఖుషీ ..ఇంట్లో నుంచి మ‌మ్మీని ఎందుకు పంపించేశావ్ నీతో క‌టీఫ్ అని య‌ష్ తో అంటుంది. ఎక్క‌డికి వెళ్లినా మ‌మ్మి నీకు చెప్పి వెళుతుంది. అమ్మ‌మ్మ వాళ్లింటికి వెళ్లిన మ‌మ్మీని నువ్వే వెళ్లి పిలుచుకురా అంటుంది య‌ష్ తో. కానీ య‌ష్ ఆ మాట‌లు ప‌ట్టించుకోడు.   క‌ట్ చేస్తే ఖుషీ .. వేద కోసం వెళుతుంది. నువ్వు, నేను, డాడీ ఒక పార్టీ క‌దా..ఎందుకు మ‌మ్మల్ని వ‌దిలేసి ఇక్క‌డికి వ‌చ్చావ్‌..?  నాకూ, డాడీకి నువ్వు కావాల‌మ్మా.. ఇంటికి రామ్మా అంటుంది. కానీ వేద విన‌దు. నాకు కోపం వ‌స్తుంది. 1.2.3 అని ఎక్క‌పెడ‌తాను.. నువ్వు ఇంటికి వ‌చ్చే పని అయితే ఖుషీ అని పిలువు.. లేదంటే వెళ్లిపోతాను అంటుంది. అయినా వేద పిల‌వ‌దు. దీంతో ఖుషీ హ‌ర్ట్ అయి అపార్ట్ మెంట్ బ‌య‌టికి వెళ్లిపోతుంది. మాలిని ఖుషీ కోసం ఇల్లంతా వెతుకుతూ వుంటుంది. వేద ద‌గ్గ‌ర కూడా లేద‌ని చెప్ప‌డంతో య‌ష్ వెళ్లి వేద‌ని నిల‌దీస్తాడు. త‌ను అడిగినా రావా అంటాడు. త‌న‌కి ఏదైనా జ‌రిగితే నిన్ను క్ష‌మించ‌ను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌ర‌గింది?  ఖుషీ ఎటు వెళ్లింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

దివిపై కేసు పెట్టండి.. అందంతో చంపేస్తోంది!

"ఏ దివిలో విరిసిన పారిజాతమో" అన్న పాటకు తగ్గట్టుగా తన అందంతో అట్రాక్షన్ తో సోషల్ మీడియాని షాక్ చేసేస్తోంది దివి. ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసినా మెరిసిపోతూ ఉంటుంది. ప్రస్తుతం "పరంపర" అనే వెబ్ సిరీస్ లో నటించింది దివి. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దివి వంకాయ రంగు డ్రెస్ లో అద్దిరిపోయింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 'దివి చూపుల్లో ఏదో మేజిక్ ఉంది, మేజిక్ అంటే దివి, దివి అంటే మ్యాజిక్' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఒక నెటిజన్ మాత్రం "దివిపై కేసు పెట్టండి సర్.. అందంతో చంపేస్తోంది" అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దివి లాస్ట్ ఇయర్ "క్యాబ్ స్టోరీస్ " అనే వెబ్ సిరీస్‌లో నటించింది. పల్లెటూరి కాస్ట్యూమ్స్ తో దివి ఎక్కువ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రాబోయే కాలానికి కాబోయే టాలీవుడ్ యాక్టర్ లా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తన సహజమైన గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.  బిగ్ బాస్ లాంటి షోస్ లో, అవార్డు ఫంక్షన్స్ స్టేజెస్ మీద చేసే హాట్ డాన్సస్ కి దివి బోల్డంత పేరు తెచ్చుకుంది. ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్ చేసేసరికి ఆమె టాలెంట్ కూడా బయట పడుతోంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కంట్లో పడి మంచి హీరోయిన్ గా ఎదిగే ఛాన్సెస్ కోసం దివి నెమ్మదిగా రూట్ క్లియర్ చేసుకుంటోంది.

'మా ముందు వీళ్లంతా జుజుబీ' అంటూ దివిని వెక్కిరించిన సన్నీ

'ఒక కింగ్... కింగ్ మీద గెలవడానికి వెళ్తే అది బ్యాటిల్. అదే ఒక క్వీన్.. కింగ్ మీద గెలవడానికి వెళ్తే అది బిగ్ బ్యాటిల్.'.. ఈ లైన్ తో 'బిగ్ బ్యాటిల్: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' షో స్టార్ట్ కాబోతోంది. "కాంపిటీషన్ మా స్టాండర్డ్ లో ఉండే వాళ్ళతో పెట్టాలి కానీ వీళ్ళతో ఏమిటి? మా ముందు వీళ్లంతా జుజుబీ" అంటూ దివి గ్యాంగ్ ని వెక్కిరించాడు వీజే సన్నీ.  "తుఫాన్ వచ్చేముందు కూడా క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది. తర్వాతే చాలా వయొలెంట్ గా ఉంటుంది" అంటూ కౌంటర్ ఇచ్చింది బిందుమాధవి. బిగ్ బాస్ లో ఉండే థ్రిల్ మొత్తాన్ని ఈ ఎపిసోడ్ లో చూపించబోతున్నారు మేకర్స్ . 'బిగ్ బ్యాటిల్: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' పేరుతో మరో స్పెషల్ షోతో వచ్చేసింది పాపులర్ రియాలిటీ టీవీ సిరీస్ బిగ్ బాస్ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 5 విజేత VJ సన్నీ టీమ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తుండగా, బిగ్ బాస్ నాన్-స్టాప్ విజేత బిందు మాధవి టీమ్ క్వీన్ నాయకురాలు.  బిగ్ బాస్ కంటెస్టెంట్లు రవికృష్ణ, దివి, మెహబూబ్, అనిల్ రాథోడ్, శివ, మహేష్ విట్టా, రోల్ రైడా, భాను శ్రీ, అరియానా గ్లోరీ, సిరి హన్మంత్, అవినాష్ వంటి చాలామంది  ఈ స్పెషల్ షోలో భాగం కానున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రవి హోస్ట్ చేస్తున్న ఈ స్పెషల్ షో జూలై 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఎపిసోడ్ లో బిగ్ బ్యాటిల్ కింగ్స్ v/s క్వీన్స్ ఎపిసోడ్ లో ఎవరు ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి.

లిల్లీ అంటే చెల్లి అనుకున్నా కానీ పిల్లా!

జీ తెలుగులో ప్రతీ వారం ప్రసారమవుతున్న 'జీ సూపర్ ఫ్యామిలీ' షో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో 'ప్రేమ ఎంత మధురం' టీమ్, 'అగ్ని పరీక్ష' టీం మధ్య పోటీలు జరగబోతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ప్రదీప్ 'అగ్నిపరీక్ష' హీరోయిన్ తనూజతో మస్త్ ఫన్ చేశాడు. ఆమెను "మీరు ఏ ఎగ్జామ్ లో బెస్ట్?" అని అడిగాడు ప్రదీప్. "ఇంట్లో హ్యాపీగా నా లిల్లీతో స్పెండ్ చేస్తా.. కొత్త కొత్తగా కుకింగ్ నేర్చుకుంటా" అని చెప్పింది త‌నూజ‌.  "గ్రీన్ టీ వండుతారా?" అని అడిగాడు ప్రదీప్. "హా" అని ఆన్సర్ ఇచ్చింది అమాయ‌కంగా తనూజ. ఆ ఆన్సర్ కి అందరూ నవ్వేశారు. "ఈసారి లిల్లీని తీసుకురండి" అని చెప్పాడు ప్రదీప్.. "వద్దు దిష్టి తగులుద్ది" అంది త‌నూజ‌.. "లిల్లీ అంటే చెల్లి అనుకున్నా కానీ పిల్లా!" అని నవ్వుతాడు ప్రదీప్.  తర్వాత 'రామారావు ఆన్ డ్యూటీ' టీమ్‌ స్టేజి మీదకు వచ్చి సందడి చేసింది. "డైరెక్టర్ గారు చూసారా.. అమ్మాయిలను చూసి బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నారు. మిమ్మల్ని కనీసం హ్యాండ్సమ్ అని కూడా అనలేదు" అని యాక్ట‌ర్‌ వేణుతో అన్నాడు ప్ర‌దీప్‌. "అవసరం లేదండి.. అందరికీ తెలుసు నేను అందగాడినని" అంటూ కౌంటర్ వేశాడు వేణు. తర్వాత "వేణు గారు మీరు ఏ వంట బాగా చేస్తారు?" అని అడిగాడు ప్రదీప్.. "కాఫీ బాగా వండుతాను" అని పంచ్ వేశాడు వేణు. తనూజ 'బొంబాయి' చిత్రం నుంచి "కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే" సాంగ్‌కు అద్దిరిపోయే డాన్స్ చేసి అందరినీ మైమరిపించింది. అలాగే 'అగ్ని పరీక్ష టీమ్'లో సెకండ్ హీరోయిన్ కి  డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాడు ప్రదీప్. అందులో కోడి, గుడ్లు బొమ్మ గీసిందామె. "ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రశ్న.. కోడి ముందా గుడ్డు ముందా?" అంటూ అడిగాడు ప్ర‌దీప్‌. ఇలా రాబోయే వారం ఎపిసోడ్ ఫన్ చేయబోతోంది.

శ్రద్ధాదాస్ కి ఢీ 14 షోలో ఘోర అవమానం

ఢీ 14 డ్యాన్సింగ్ సీజన్ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హీరోయిన్ శ్రద్దాదాస్ డాన్స్ ఇరగదీసేసింది. ఈ వారం కొరియోగ్రాఫర్స్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఫైనల్ లో శ్రద్ధాదాస్ ఒక టీం కొరియోగ్రాఫర్ తో కలిసి  డాన్స్ చేసేసరికి ఆపోజిట్ టీం నుంచి కిరణ్ అనే పర్సన్ లేచి స్టేజి మీదకు వచ్చి పెద్ద న్యూసెన్స్ చేస్తాడు. వాళ్ళ టీమ్ తో కలిసి మీరు డాన్స్ చేశారు...మా టీమ్ తో ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. ఇదంతా గమనిస్తున్న ప్రదీప్ సర్దిచెప్పబోతాడు.. నువ్వు వాయిస్ రైజ్ చేసి మాట్లాడకు అంటూ ప్రదీప్ మీద, శ్రద్ద మీద ఫుల్ సీరియస్ ఐపోతాడు. అప్పటివరకు కూల్ గా ఉన్న స్టేజి కాస్తా చాలా హీట్ గా మారిపోయింది. వాళ్ళతో డాన్స్ చేసి ఆ టీమ్ వాళ్ళకే మంచి మార్క్స్ ఇస్తారు ..నాకు తెలియనిదా అంటూ ఫైర్ అవుతాడు  కిరణ్. శ్రద్ద ఘాటుగా సమాధానం ఇచ్చేసరికి తనకు కూడా గొంతు పెంచి మాట్లాడొద్దు, నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అవమానిస్తాడు. ఆ మాటకు  వెంటనే శ్రద్ద మైక్ ఇచ్చేసి ఏడ్చుకుంటూ అక్కడినుంచి స్టేజి దిగి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఆది ఎంట్రీ ఇచ్చి ఏదో చెప్దామని ట్రై చేసేసరికి అన్నా నువ్వు మధ్యలో రాకు అంటూ ఆది మీద కూడా అదే సీరియస్ మైంటైన్ చేస్తాడు. ఇదంతా ఎందుకు అంటూ అతన్ని సెట్ నుంచి పంపించేస్తున్నట్టుగా ఉన్న ఒక ప్రోమో కట్ చేశారు. ఇంకా ప్రదీప్ తో, శ్రద్దాతో గొడవ పడిన కిరణ్ ఎవరో కాదు. సోషల్ మీడియాలో ప్రాంకుల కిరణ్ గా ఫుల్ ఫేమస్ ఐన వ్యక్తి. అతను ఎంతోమందితో ప్రాంక్ లు చేసి ప్రాంక్ స్టార్ మచ్చాగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్. ఐతే నెటిజన్స్ మాత్రం ఇదంతా ప్రాంక్ మమ్మల్ని మోసం చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'నా మీదే ఫన్ చేస్తావా?'.. రష్మి మీద మండిపడిన ప్రగతి!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎవ్రీ ఎపిసోడ్ అద్భుతంగా హాస్యాన్ని పండిస్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ చాలా చక్కగా సందడి చేసింది. ప్రగతి, సంఘవి స్పెషల్ గెస్ట్స్ గా వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కేలండర్ 2022ని ప్రగతి, సంఘవి చేతుల మీదుగా ఓపెన్ చేయించింది ర‌ష్మీ. "ప్రగతి గారూ.. నాకు మీ దగ్గర నుంచి కొన్ని టిప్స్ కావాలి. మీ ఎన‌ర్జీకి అసలు రహస్యం ఏమిటి? మీరు చాలా ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటారు కదా. మీ ఎనర్జీ రహస్యం నాకు చెప్తే.. ఈవెన్ ఐ వాంట్ టు బి ఇన్ జర్నీ ఆఫ్ మై ఫిట్నెస్. ఎప్పుడు మీరు చక్కగా జిమ్ లో ఉంటారు?" అంటూ చాలా ఉత్సాహంగా అడిగింది రష్మీ.  వెంటనే ప్రగతి ఆ మాటకు సీరియస్ అయిపోయింది. "వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా.. అంతా నా ఎక్సర్‌సైజ్ గురించే. నీ ఇన్ఫర్మేషన్ కి థాంక్స్. నన్ను ఇక్కడికి నా యాక్షన్ చూసి పిలిచారు. నా వర్కౌట్స్ చూసి కాదు. కాసేపు ఇక్కడ ఉండడానికి వచ్చాను. నా మీద ఇలా హాస్యం చేయడం కరెక్ట్ కాదు" అంటూ మైక్ ఇచ్చేసి సీరియస్ గా స్టేజి దిగి వెళ్ళిపోయింది.  దాంతో స్టేజి మీద ఉన్నవాళ్ళంతా షాకైపోయారు. అసలేమయ్యింది.. ఏం జరుగుతోంది.. అనుకుంటూ భయపడుతూ ఉండ‌గా, ప్రగతి గబగబా మళ్ళీ స్టేజి మీదకు వచ్చేసి మైక్ తీసుకుని "ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ అంతా ప్రాంకులు చేస్తారని అన్నారు. అందుకే నాకు నచ్చినట్టు నేను ఏదో అలా ట్రై చేశా" అంటూ రష్మిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. అంతే! రష్మీ "హే" అంటూ నవ్వేసి హమ్మయ్య అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత‌, "నేను ఇంత కష్టపడి ఇంతమందిని పిలిచి శ్రీదేవి డ్రామా కంపెనీ కేలండర్ ని లాంచ్ చేస్తే, అది కూడా సంవత్సరం మధ్యలో నా మీదే ప్రాంక్ చేస్తారా మీరందరూ.. నేను మీ అందరితో కటీఫ్.. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తా" అని బుంగమూతి పెట్టి వెళ్ళిపోయింది రష్మీ.

భారతీరాజా గారిది చాలా గొప్ప మనసు అన్న వేణు

స్వయంవరం మూవీతో హిట్ కొట్టిన హీరో వేణు తొట్టెంపూడి. టాలీవుడ్ లో చేసినవి తక్కువ సినిమాలే ఐనా తన నటనతో ఆడియన్స్ మనసులో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మూవీలో కీరోల్ లో నటిస్తున్న వేణు ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకి వచ్చాడు. స్వయంవరం మూవీ షూటింగ్ టైంలో తాను చాలా కొత్త యాక్టర్ నని వేణు అన్నారు. అదే టైంలో అలీతో పరిచయమయ్యింది అంటూ ఆయన గురించి  కూడా చెప్పారు. సినిమాల నుంచి తాను నేర్చుకున్నది చాలా తక్కువని ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.  స్పెషల్ రోల్స్ లో ఆడియన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలనే కోరిక వలన అలాంటి రోల్స్ కోసం చూస్తూ రీఎంట్రీకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో తన కోరిక  తీరిందని చెప్పాడు. తాను ఇప్పటివరకు 25 చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. వేణు వాళ్ళ నాన్న గారు ప్రొఫెసర్ కావడంతో  ఎప్పుడూ  ఎదో ఊరు ప్రయాణం చేస్తూ ఉండాల్సి వచ్చేదని వివరించారు.   ఇక భారతిరాజా డైరెక్షన్ లో ఒక మూవీ మిస్ అయ్యానని చెప్పాడు వేణు. చెప్పాలంటే భారతి రాజా డైరెక్షన్లో రావాల్సిన మూవీనే తన ఫస్ట్ మూవీ కావాల్సింది కానీ ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాక సినిమా ఆగిపోయిందని భారతి రాజా వేణుకి చెప్పారు. వేణు యాక్షన్ నచ్చక షూటింగ్ ఆపేశారని అనుకున్న వేణు భారతి రాజా ముందు తనకు వచ్చిన అన్ని యాక్షన్ స్టిల్స్ ని చూపించారట. చివరికి షూటింగ్ వేరే కారణాల వలన ఆగిపోయిందని చెప్పి 500 రూపాయలు ఇచ్చి వెళ్లిపోయారని చెప్పాడు వేణు. తర్వాత చెన్నైలో జరిగిన తన పెళ్ళికి భారతి రాజా గారిని పిలిచానని  ఆయన కూడా వచ్చి ఆశీర్వదించారని చెప్పాడు. భారతిరాజా లాంటి గొప్ప డైరెక్టర్ ఆధ్వర్యంలో సినిమా మిస్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అన్నాడు వేణు.  

జంతువులను హింసించకండి

రష్మీ బుల్లి తెర మీద హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న యాంకర్. రష్మీ అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి హోస్ట్ గా చేస్తూ పేరు తెచ్చుకుంది. రష్మీ కేవలం యాంకర్, యాక్టర్ మాత్రమే కాదు జంతు ప్రేమికురాలు కూడా . సెలెబ్స్ అంతా ఫోటోషూట్స్ తో ఎక్కువ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటె రష్మీ రూటే సెపరేట్. మూగజీవులపై దాడులు జరిగినా,  తనకు కనిపించే ఏ జీవికైనా హానీ జరుగుతున్నా తాను అస్సలు చూస్తూ ఊరికే ఉండదు. వెంటనే సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఎంతోమందిలో అవగాహన కల్పిస్తుంది. అలాంటి సంఘటనలను వీడియోస్ తీసి, ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో వెంటనే షేర్ చేసేస్తుంది.  ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి పాము చర్మాన్ని కోసి లాగుతున్న వీడియో పోస్ట్ చేసింది. ఈ పాము చర్మం ఎక్కువగా బ్రాండెడ్ హ్యాండ్ బాగ్స్ తయారీకి వాడుతూ ఉంటారు అని ఒక కంపెనీ పేరు కూడా పెట్టి. ఇలాంటి జీవాల చర్మాలతో చేసే బాగ్స్ ని వాడొద్దు. వేగన్ బాగ్స్ ని మాత్రం వాడండి. మార్పు మన నుంచే మొదలవ్వాలి అంటూ ఒక పోస్ట్ పెట్టింది రష్మీ. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా రష్మీ పెద్దగా లెక్క చేయదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది.    

రియ‌ల్ లైఫ్ స్టోరీ స్కిట్‌.. క‌న్నీటిప‌ర్యంత‌మైన ర‌ష్మీ గౌత‌మ్‌!

శ్రీదేవి డ్రామా కంపెనీలో "అక్కా బావెక్కడ" పేరుతో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో రష్మీ తప్పుల తడకతో తెలుగు మాట్లాడుతూ ఉంటే దాన్ని హైపర్ ఆది సరిచేస్తూ ఉంటాడు. అప్పుడు రష్మీ లవ్ ఫెయిల్యూర్ ఐనట్టుగా "ఒక 90 కొడదామని వైన్ షాప్ కి బయల్దేరా. కానీ అక్కడకి వెళ్లి చూస్తే బోర్డు మీద 18 ఇయర్స్ నిండిన వాళ్ళకే అని రాసి ఉంది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసా." అని రష్మీ చెప్పేసరికి "అప్పటికే ఒక 90 వేసావ్ నువ్వు." అన్నాడు ఆది.  తర్వాత రోహిణి మందేసి "తకిట తధిమి" సాంగ్ కి కమల్ హాసన్ టైపులో డాన్స్ చేసి అలరించింది. తర్వాత రష్మీ బయోగ్రఫీ పేరుతో తన లైఫ్ లో పడిన కష్టాలని ఒక స్కిట్ గా చేసి చూపించారు కమెడియన్స్. రియల్ లైఫ్ లో  రష్మీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ విడిపోయారు. రష్మీ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరే ఉండిపోయింది. రష్మీ పెద్దదయ్యాక తనకు మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పి ఇండస్ట్రీ వైపు వెళ్తానని అడిగింది. "మంచేదో, చెడేదో నీకు తెలుసు కదా.. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు" అని వాళ్ళ అమ్మ ప్రోత్సహించి పంపించింది. ఆ తర్వాత రష్మీ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి కొన్ని బిట్స్ ప్లే అయ్యాయి. షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లింది ర‌ష్మీ. కానీ ఇంటి డోర్ ఎవరూ తియ్యకపోయేసరికి బాగా ఏడ్చేసింది. ఇలా రష్మీ తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని స్కిట్ రూపంలో చూపించేసరికి కన్నీరుమున్నీరయ్యింది. "తనకు తెలుగు మాట్లాడ్డం రాదు అనే స్థాయి నుంచి తెలుగు వాళ్ళందరూ తన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రష్మీ" అని చెప్పాడు ఆది. 

'క్యాష్'లో దుల్కర్ సల్మాన్ తెలుగులో మాట్లాడాడా?

అన్ని కార్యక్రమాలకంటే సుమ క్యాష్ ప్రోగ్రాం బుల్లి తెర మీద చాలా ఫేమస్. ఎంతోమందితో ఆమె ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రాం మొత్తం కూడా నవ్వుతూ ఉండేలా చేస్తుంది. అంత ఎంటర్టైన్మెంట్ ఈ షో నుంచి అందుతుంది మనకు. అలాగే కొత్త మూవీ వస్తే చాలు ఆ మూవీ ప్రమోషన్స్ కూడా ఈ స్టేజి మీదే ఎక్కువగా చేస్తూ ఉంటారు.  ఇప్పుడు ఫేమస్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ క్యాష్ షోలో కనిపించబోతున్నాడు. దుల్కర్ తన రాబోయే తెలుగు మూవీ 'సీతారామం' డైరెక్టర్ హను రాఘవపూడి, నటుడు సుమంత్ , డైరెక్ట‌ర్‌-యాక్ట‌ర్‌ తరుణ్ భాస్కర్‌తో కలిసి రాబోయే కాష్ ఎపిసోడ్ కి వచ్చి సందడి చేయబోతున్నారు. ఈ ప్రొమోషన్స్ కి సంబంధించిన ప్రోమో చిత్రాన్ని హీరో సుమంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు.  మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'మహానటి' మూవీలో జెమినీ గణేశన్ పాత్రలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 'సీతారామం'లో బాలీవుడ్ భామ‌ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. టీజర్, రెండు సాంగ్స్ తో పాటు, ఇటీవల ఒక వీడియోను విడుదల చేసారు.  ఇందులో సుమంత్ వాయిస్ ఓవర్ కూడా ఉంది.  'జాతిరత్నాలు', 'మహానటి' మొదలైన బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన వైజ‌యంతీ మూవీస్‌ దీన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే, సుమ కనకాల కెరీర్‌లో సుదీర్ఘ కాలం నుంచి రన్ అవుతున్న 'క్యాష్' ప్రోగ్రాం ఒకటి.  ఈ షో కి చాలామంది ఫేమస్ పర్సన్స్ వచ్చి సందడి చేస్తూ ఉంటారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, ద‌గ్గ‌ర్నుంచి న‌టి షకీల, అభినయశ్రీ, రాజశేఖర్ వంటివాళ్ళు ఈ షోలో కనిపించారు. అలాగే మూవీస్ లో కామెడీ పండించే జెన్నీ, కృష్ణవేణి, బాలాజీ, అల్లరి సుభాషిణి వంటి వాళ్ళు కూడా వచ్చి ఎంటర్టైన్ చేశారు.

ఇమ్మూకి పెళ్లి ప్రపోజల్.. వైర‌ల్ అయిన వీడియో

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అసలు ఎలాంటి గుర్తింపు లేనివాళ్లు కూడా ఈ వేదిక మీదకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ షో ద్వారా సుధీర్, రష్మీ, ఆది, వర్ష, ఇమ్మానుయేల్.. ఇలా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద పెర్ఫార్మ్ చేసే కమెడియన్స్ అందరూ కూడా వేరే షోస్ కి వెళ్లి అక్కడ కూడా సందడి చేస్తున్నారు. ఆ క్ర‌మంలో శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న "జాతిరత్నాలు" స్టాండప్ కామెడీ షోకి వచ్చి ఎంటర్టైన్ చేసాడు ఇమ్మానుయేల్‌. ఈ షోకి సంబంధించిన  ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ లో వాళ్ళు కామెడీని పండించారు. ఐతే ఈ షోలో ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి ఇమ్మూకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ తో వారు కామెడీ పండించినప్పటికీ, ఓ లేడీ ఫ్యాన్ ఇమ్మానుయేల్ కి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం హైలైట్ గా నిలిచింది. "ఆకాశంలో వెళ్తుంది రాకెట్టు.. నీకోసం నా లైఫ్ ని పెడతాను తాకట్టు" అని ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి. ఆమె మాటలు విన్న ఇమ్మానుయేల్ "పెళ్లి చేసుకుంటానంటే చెప్పు?" అని అడిగేసరికి ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే, చేసుకుంటానని చెప్పి స్టేజి పైకి వచ్చింది. తర్వాత ఇమ్మూతో "నీకు పెళ్లి ఓకేనా?" అని శ్రీముఖి అడగడంతో ఆ ప్రోమో ఎండ్ ఐపోతోంది. ఐతే ప్రస్తుతం వర్ష లేకుండా వేరే అమ్మాయి ఇమ్ముకు ప్రపోజ్ చేసేసరికి ఈ వీడియో వైరల్ గా మారింది. ఒకవేళ వర్షకు ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో చూడాలి.