ఆ విష‌యం ఆల‌స్యంగా అర్థం చేసుకున్నా.. వైర‌ల్ అవుతున్న సునీత పోస్ట్‌

జీవితం చాలా క్లిష్టమైనది. ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ బాధలు, ఆవేదనలు చిన్నచిన్న కవితలుగా కూడా రూపాంతరం చెందుతాయి. అలాంటివి చాలా అద్భుతంగా ఎంతో లోతైన భావాల్ని పలికిస్తాయి. అలాంటి ఒక సందర్భాన్ని సింగర్ సునీత కూడా అనుభవించినట్లు కనిపిస్తోంది. ఐతే సునీత హోరెత్తే సముద్రం ఒడ్డున ఎక్కడో దూరంగా ఉన్న పడవను ఎంతో తన్మయత్వంతో నిలబడి చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సముద్రం, దూరంగా ఉన్న ఓడ తనకేదో పాఠం నేర్పిస్తున్నట్టు తాను అలా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఈ ఫోటో చూస్తే. "మీరు డిమాండ్ చేయకపోతే మీ గురించి ఎవరూ పట్టించుకోరు. మీరు అందరిచేతా నిర్లక్ష్యం చేయబడతారు. నేను ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను" అంటూ లోతైన భావాన్ని కవితాత్మకంగా రెండే రెండు వాక్యాల్లో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.  ఎదుటివాళ్లను నిర్లక్ష్యం చేయడం అనే విషయం చాలా బాధాకరమైంది.. అలాంటి బాధ ఎవరికీ రాకూడదు. ఈ సముద్రం, ఆ చివరన ఉన్న పడవ  కూడా నాలాంటి ఒక పరిస్థితిలోనే ఉన్నాయేమో. అందుకే తనలోని అలలను ఎగసెగసి పడేలా చేస్తోంది, చొచ్చుకుంటూ ఇంకాఇంకా ముందుకొచ్చేస్తోంది ఈ సముద్రం.. అలా రాకపోతే ప్రపంచం తనని నిర్లక్ష్యం చేస్తుందని నాలాగే సముద్రానికి, ఆ ఓడకు కూడా అర్దమయ్యిందేమో అంటున్నట్టుగా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడే ఈ కామెంట్ ఎందుకు పెట్టింద‌నేది అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని రేకెత్తిస్తోంది. సునీత ఎప్పుడూ కెరీర్ అంటూ ఫామిలీ అంటూ బిజీగా ఉంటుంది. కానీ తాను ఎక్కువగా సూర్యదయాన్ని, సముద్రాన్ని, వర్షాన్ని, దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి చాలా ఇష్టపడుతుంది. అందుకే ప్రకృతికి  సంబంధించిన ఫొటోస్ ని  తన ఇన్స్టా పేజీలో ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కున్న మీరు చాలా స్ట్రాంగ్, మానసిక ప్రశాంతత చాలా అవసరం అంటూ సునీత ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అందుకే 'మగధీర' ఆఫర్ వదులుకున్నా!

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించే అవకాశమొస్తే స్టార్స్ సైతం ఎగిరిగంతేస్తారు. ఎందరో స్టార్స్ ఆయన సినిమాల్లో చిన్న రోల్స్ చేయడానికి కూడా వెనకాడరు. కానీ నటి అర్చన మాత్రం ఆయన దర్శకత్వంలో వహించిన 'మగధీర'లో నటించే అవకాశమొస్తే వదులుకున్నారట. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో తన భర్త జగదీష్ తో కలిసి అర్చన పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ 'మగధీర' అవకాశం వదులుకోవడానికి ఓ రకంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కారణమని చెప్పారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో త్రిష ఫ్రెండ్ గా అర్చన నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అదే సమయంలో బాపు దర్శకత్వంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పోగొట్టింది. బాపు డైరెక్ట్ చేసిన 'రాధా గోపాళం'లో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట అర్చనకు వచ్చిందట. అయితే అదే సమయంలో ఆమె 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటిస్తుందని తెలిసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిందంటూ 'రాధా గోపాళం' నుంచి ఆమెను తీసేశారట. దానిని దృష్టిలో పెట్టుకునే అర్చన మగధీరకు నో చెప్పారట. 'మగధీర'లో సలోని పోషించిన పాత్ర కోసం ముందుగా అర్చనను సంప్రదించారట. అయితే ఇలాంటి చిన్న పాత్రలు చేస్తే, 'రాధా గోపాళం' విషయంలో జరిగినట్లుగా పెద్ద అవకాశాలు రావేమోనన్న భయంతో ఆమె చేయలేదట. కానీ 'మగధీర'లో చిన్న రోల్ లో మెరిసిన సలోనికి రాజమౌళి తన తదుపరి సినిమా 'మర్యాద రామన్న'లో హీరోయిన్ గా అవకాశమిచ్చారు. ఒకవేళ తాను 'మగధీర'లో నటించి ఉంటే.. 'మర్యాద రామన్న'లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేదేమో అంటూ అర్చన చెప్పుకొచ్చారు.

2019లో కులూ మనాలి రూమ్‌లో రెజీనాకు ఎదురైన అనుభ‌వం?

ప్రతీ వారం 'ఆలీతో సరదాగా' షో ద్వారా ఆడియన్స్ కి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, అర్చన జగదీశ్ ఇలా ఎంతో మంది తారలు వచ్చి ఆలీతో చిట్‌చాట్‌ చేసి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్టేజి మీదకు రెజీనా కసాండ్రా రాబోతోంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. 'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి గురించి అలీ అడిగినప్పుడు  రెజీనా మాట్లాడుతూ, "ఈ వయస్సులో కూడా ఆయ‌న‌ చాలా త్వరగా విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. ఇది చాలా ప్రశంసనీయం." అని చెప్పింది.  ఇక రెజీనా స్కూల్‌లో అబ్బాయిలను బాగా కొట్టేదట. క్లాస్ లీడ‌ర్‌గా ఉంటే అబ్బాయిల‌ను కొట్టేస్తారా? అని అలీ అడిగితే, ఆ అని ఆన్స‌ర్ ఇచ్చి న‌వ్వేసింది రెజీనా. నా ఫిజిక్‌ను చూసి అంద‌రూ న‌న్ను డామినేటింగ్ అనుకుంటారు అని కూడా చెప్పింది. "2019లో కులూమనాలిలో రూమ్ నెంబర్ తెలీదు కానీ ఒకటి జరిగింది" అని అలీ అనేసరికి "ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి నా లైఫ్‌లో" అని చెప్పుకొచ్చింది రెజీనా. అక్క‌డ ఏం జ‌రిగిందో కొంత క్లూ ఇచ్చింది. ఇక తనకు హారర్ జానర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకు నచ్చిన సబ్జెక్టు వస్తే మాత్రం ఎలా ఉండాలి, ఎలాంటి మానరిజమ్ ను ఆడియన్స్ కి చూపించాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉంటానని చెప్పింది రెజీనా. "హోటల్ కి వెళ్ళినా, క్యారవాన్ లోకి వెళ్ళినా ముందు రెజీనా అక్కడ ఎలా ఉంది అని చూడకుండా, ముందు బాత్రూంలోకి వెళ్లి ఎలా వుంది అని చూసుకుంటారంట ఏంటి?" అని అలీ అడిగితే గ‌ట్టిగా న‌వ్వేసింది. రెజీనా నటించిన  కొత్త  వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది.

నాగబాబు అసలు నువ్వేమనుకుంటున్నావ్? అవినాశ్ వార్నింగ్‌

'పార్టీ చేద్దాం పుష్ప' పార్ట్ 1 ఒక రేంజ్‌లో దుమ్ము లేపేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 ప్రోమో రెడీ ఐపోయింది. ఈ ఎపిసోడ్‌లో ఎవరికీ వారే పోటా పోటీగా పెర్ఫార్మ్ చేశారు. ఈ స్కిట్ లో నాగబాబుకి అవినాష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు. అవినాష్ తండ్రిగా.. జీవన్ కొడుకుగా ఒక స్కిట్ చేశారు. జీవన్ కి ఒక కల వచ్చింది. "నాగబాబుకి అవినాష్‌ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కల వచ్చింది" అని చెప్పాడు జీవ‌న్‌. తన కొడుకు కలను నెరవేర్చడం కోసం ఏదైనా సరే చేస్తానని గట్టిగా తీర్మానించుకుంటాడు తండ్రి అవినాష్. "ఆ కలను నెరవేర్చావంటే నీ ప్రాణం పోతుంది" అంటూ అవినాష్ కి అనసూయ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. "నా కొడుకు కోసం ఏమైనా చేస్తాను" అంటూ అవినాష్ చాలా సీరియస్ గా అనసూయతో చెప్పాడు.  ఇక అదే ఊపుతో  స్టేజి మీదకు వచ్చి చిటికె వేసి "మిస్టర్ నాగబాబు ఏమనుకుంటున్నావ్ అసలు నువ్వు.. ఏంటా లుక్కు.. ఇది కరెక్ట్ కాదు.. ఇది కరెక్ట్ కాదు." అంటూ గట్టిగా అరిచాడు అవినాష్. అవినాష్ అరుపులకు  స్టేజి మొత్తం అవాక్కైపోతుంది. నిజంగానే ఏదో జరగబోతున్న సెన్స్ అనేది క్రియేట్ అయ్యింది. కానీ ఆ అరుపులకు తెర దింపుతూ ఫైనల్ గా "ఇదే కరెక్ట్" అంటూ నాగబాబు కాళ్ళు పట్టుకున్నాడు అవినాష్. ఇక ఈ ఎపిసోడ్ లో దీపికా పిల్లి అద్భుతమైన డాన్స్ చేసేసరికి "పిల్లి అనుకుంటివా పులి" అంటూ అనసూయ అదిరిపోయే డైలాగ్ చెప్తుంది. ఈ ప్రోమో ఎండింగ్ లో సుధీర్ చేసిన డాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇలా ఈ వారం ఎపిసోడ్ అలరించబోతోంది.

ధనరాజ్ అంటే మినిమం ఇట్టా ఉండాలే.. గ‌వాస్క‌ర్‌, క‌పిల్‌తో ఫొటోలు!

ధనరాజ్ అటు మూవీస్‌లో, ఇటు రియాలిటీ షోస్‌లో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ , కమెడియన్. ప్రస్తుతం ధనరాజ్ యూఎస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్లి అక్కడి వాళ్ళను అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ధనరాజ్ కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఫుల్ వైరల్ అవుతున్నాడు. లెజెండరీ క్రికెటర్స్ ఐన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లతో కలిసి ఎప్పటికీ మరిచిపోలేని కొన్ని క్షణాలను ఫోటోలు తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. "చిన్నప్పటి నుండి ఈ ఇద్దరితో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.. సర్ ఇది నాకు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణం" అంటూ కాప్షన్ పెట్టి ఈ ఫొటోస్ షేర్ చేసాడు. ఇప్పుడు  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  వెస్టిండీస్ అగ్ర‌శ్రేణి క్రికెటర్ ఐన క్రిస్ గేల్‌తో కలిసి ఒక సెల్ఫీని దిగి దాన్ని కూడా పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడు ధనరాజ్.. శ్రీముఖి, రవి, సునీత, అడివి శేష్, అషు, మంగ్లీ, రవి, రఘు అలాగే ఇంకొంతమంది సెలబ్రిటీస్ తో కలిసి యూఎస్ లో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. 'కామెడీ స్టార్స్ ధమాకా'తో ధనరాజ్ అందరినీ అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే 'పార్టీ చేద్దాం పుష్ప'లో కూడా స్కిట్స్ తో ఆడియన్స్ ని బాగా అలరిస్తున్నాడు. 'జబర్దస్త్'లో కొంతకాలం చేసిన ధనరాజ్ తర్వాత ఆ షోని వదిలేసి మూవీస్ వైపు వెళ్ళాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ వన్ లో అవకాశం వచ్చేసరికి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసాడు. అలా ఇటు టీవీని అటు సినిమాలను బాలన్స్ చేస్తూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు ధనరాజ్.

మ‌ల్లెమాల‌పై కిర్రాక్ ఆర్పీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేదిక మీదకు ఏమీ లేకుండా వచ్చి, ఇప్పుడు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది వున్నారు. అలాంటి వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. ఇటీవల అత‌ను ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మల్లెమాల సంస్థ ఎవరికీ దేవుడు కాదు. మల్లెమాల అనేది ఒక పదం మాత్రమే. దాని వెనక ఒక మనిషి ఉంటాడు. వాళ్ళు పక్కా కమర్షియల్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చేసేది వ్యాపారం, నాగబాబు గారు చేసేది వ్యవహారం" అంటూ తన మనసులోని మాటల్ని చెప్పేసాడు ఆర్పీ. "నాగబాబు గారితో బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్థాయి చూడకుండా ప్రతీ ఒక్కరికీ సాయం చేసే మనసున్న వ్యక్తి. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి అలా కాదు. ఆయన ఎలాంటి హెల్ప్ ఎవరికీ ఎప్పుడూ  చేయలేదు, ఎప్పటికీ చేయరు కూడా" అంటూ చెప్పాడు. "నేను మల్లెమాలను తిట్టినందుకు చాలా మంది నా మీద ఫైర్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నా.. నాకు ఈటీవీ అంటే, మల్లెమాల అంటే, జబర్దస్త్ అంటే, శ్యాంప్రసాద్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం ఉండదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  "ఈ సంస్థలో విలువలు ఉండవ్. ఇప్పటికే ఉన్న విలువలు కూడా దిగజారిపోయాయి. మొదట్లోనే ఈ విషయాలన్నీ తెలిస్తే అసలు ఈ సంస్థకు వచ్చేవాడిని కాదు. కానీ ఇన్ని స్కిట్స్ వేశాక ఒక్కో విషయం బయటపడుతూ ఉంటే తెలిసింది. ఇక మల్లెమాల సంస్థలో దొరికే ఫుడ్ చాలా ఘోరం. ఎలా అంటే చంచ‌ల్‌గూడ, చర్లపల్లి, అండమాన్ జైళ్లల్లో మర్డర్స్ చేసిన వాళ్లకు పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంటుంది. చిప్పకూడు అంతకంటే ఘోరం" అంటూ మల్లెమాలలో గుట్టును బయటేసాడు ఆర్పీ. "మల్లెమాల సంస్థకు బయట పని చేసే కూలీలన్నా, లోపలున్న టీం లీడర్లు అన్నా ఒకటే" అంటూ ఎన్నో కీలక విషయాలు చెప్పాడు కిర్రాక్ ఆర్పీ. ఈ సంస్థలో ఇన్ని లోటుపాట్లు ఉండడం వలనే కామోసు అందరూ ఈ షోని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నారంటూ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

విష్ణుప్రియ, రీతూ పరువు తీసిన ప్రదీప్!

ఆహా ఓటిటి వేదికపై కొత్త మూవీస్ తో పాటు గేమ్ షోస్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఫేమస్ గేమ్ షో ఐన 'సర్కార్ 2' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ స్టేజి మీదకి నలుగురు తెలివైన వాళ్ళను తీసుకొస్తున్నట్లు చెప్పి వాళ్ళే వీళ్ళు అంటూ  దివి, విష్ణుప్రియ, రీతుచౌదరీ, భానుశ్రీని పరిచయం చేశాడు. ఇక ఈ నలుగురు కలిసి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు వచ్చారు. "ఎక్కడైనా నలుగురు కలిసి డాన్స్ చేస్తారు కానీ వీళ్ళ నలుగురు వేరు" అన్నాడు ప్రదీప్. ఆ డైలాగ్ కి విష్ణు పగలబడి నవ్వింది. "మీరేం కంగారు పడకండి, విష్ణు నవ్వు జనరేటర్ శబ్దంలా ఉంటుంది" అని పంచ్ వేశాడు ప్ర‌దీప్‌. ఆ నలుగురితో 'సర్కారు వారి పాట' పాడించాడు. ఇక ఫైనల్ గా 'జీపీఎస్' అంటే ఫుల్ ఫార్మ్ ఏమిటి అని అడిగాడు ప్ర‌దీప్‌. కానీ ఎవరూ ఆన్సర్ చెప్పలేక హైదరాబాద్ లో ఉన్న క్లబ్బుల పేర్లు చెప్పారు. "సారీ.. నలుగురు తెలివైన వాళ్ళను తెచ్చాను అనుకున్నా కానీ కాదు" అంటూ విష్ణు, రీతూ పరువు తీసేసాడు  ప్రదీప్. ఈ మధ్య నిహారిక, నవదీప్, సదా, విశ్వక్ సేన్, సాయి పల్లవి, రానా, అడివి శేష్, శోభిత ఇలా ఎంతో మందితో ఈ గేమ్ షో ఆడించాడు ప్రదీప్.  ప్రతీ ఎపిసోడ్ లో ఫోర్ రౌండ్స్ ఉంటాయి. ఫైనల్ రౌండ్ వరకు ఎవరు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తూ ఆడతారో వాళ్ళు గెలిచినట్టు. ఇక ఈ షోకి బిగ్ స్క్రీన్ నుంచి కూడా చాలా మంది సెలెబ్రిటీస్ వచ్చి ఈ సర్కారు వారి పాటలో పార్టిసిపేట్ చేశారు. మ‌రోవైపు ప్రదీప్ పాపులర్ డాన్స్ షో 'ఢీ 14'కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. 

మ‌లేసియాలో ఆర్య, అనును వెంటాడిన గ్యాంగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీనియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఆత్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, రామ్‌జ‌గ‌న్‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, అనుషా సంతోష్‌, సందీప్‌, మ‌ధుశ్రీ త‌దిత‌రులు న‌టించారు. రాగ‌సుధ త‌ప్పు బ‌య‌ట‌ప‌డ‌టంతో త‌ను జైలుకి వెళుతుంది. ఇన్నాళ్లూ ఆఫీసు, కోర్టు కొడ‌వ‌ల‌తో గ‌డిపిన ఆర్య‌, అను మ‌లేసియాకు వెకేష‌న్ కి వెళ్లాల‌ని ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఈ విష‌యం తెలిసి మాన్సీ త‌ను కూడా వ‌స్తాన‌ని గొడ‌వ చేస్తుంది. క‌డుపుతో వున్న వాళ్లు ప్ర‌యాణం చేయ‌కూడద‌ని చెప్ప‌డంతో తాను క‌డుపుతో లేన‌ని సీరియ‌స్ గా చెప్పినా ఆర్యవ‌ర్థ‌న్‌, అత‌ని త‌ల్లి అర్థం చేసుకోరు. త‌ను ఆవేశంగా చెబుతోంద‌ని భావిస్తారు. మాన్సీని వారిస్తారు. ఇక మాన్సీ ఇలా కావ‌డానికి కార‌ణం ఆమె త‌ల్లి షీలా అని ఆర్య త‌ల్లి, నీర‌జ్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి త‌న‌ని ఇంటి నుంచి పంపించేయాల‌ని ఆర్య‌తో చెబుతారు. ఈ విష‌యం విన్న అను, చాటుగా విన్న మాన్సీ కంగారు ప‌డ‌తారు. అయినా స‌రే త‌న‌ని ఇంటి నుంచి పంపించేయాల్సిందేన‌ని ఆర్య కూడా చెప్ప‌డంతో మాన్సీ మ‌రింత‌గా భ‌య‌ప‌డుతుంది. అయితే త‌న‌కు స‌పోర్ట్ చేస్తే త‌న‌తో పాటు న‌న్ను కూడా బ‌య‌టికి గెంటేస్తార‌ని, త‌న‌కు అస్సలు స‌పోర్ట్ చేయ‌కూడద‌ని మాన్సీ నిర్ణ‌యించుకుంటుంది.  ఇంత‌లో షీలా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం దుర్గమాల ధ‌రించాన‌ని అబ‌ద్ధం చెప్పి కాషాయం చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిస్తుంది. ఆమెలో ఈ మార్పుని చూసి ఆర్య త‌ల్లి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటుంది. క‌ట్ చేస్తే జెండే ఫ్లైట్ టికెట్స్ తీసుకురావ‌డంతో అను - ఆర్య మ‌లేసియా బ‌య‌లుదేర‌తారు.. ఎయిర్ పోర్ట్ లో దిగాక వీళ్ల‌ని రిసీవ్ చేసుకున్న ఓ వ్య‌క్తితో అక్క‌డి నుంచి కారులో బ‌యలు దేర‌తారు. వీళ్ల‌ని ఓ గ్యాంగ్ వెంటాడ‌టం మొద‌లు పెడుతుంది. అను - ఆర్య‌పై దాడికి ప్ర‌య‌త్నించింది ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సౌంద‌ర్య‌కు చేతిమీది ప‌చ్చ‌బొట్టు చూపించిన జ్వాల‌.. దాని క‌థేమిటి?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ విశేషాలేంటో తెలుసుకుందాం. జ్వాల త‌న‌ని కొట్టిన‌ట్టు.. ఆనంద‌రావు, సౌంద‌ర్య‌ల‌తో వెట‌కారంగా మాట్లాడిన‌ట్టుగా హిమ ఊహించుకుంటుంది. క‌ట్ చేస్తే.. జ్వాల‌కు హిమ శాలువా క‌ప్పి అవార్డుని అంద‌జేస్తుంది. ఆ వెంట‌నే "న‌మ‌స్తే డాక్ట‌ర్ హిమ‌గారు" అంటూ త‌న‌తో వెట‌కారంగా మాట్లాడుతుంది.   ఆ త‌రువాత ఆనంద‌రావు, సౌంద‌ర్య‌ల గురించి మాట్లాడుతూ "అంద‌రికి న‌మ‌స్కారం.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌కు పెద్ద న‌మ‌స్కారం" అంటుంది. ఆ త‌రువాత హిమ గురించి మాట్లాడుతూ "మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడి వుంటారు క‌దా, మీకు మ‌హా న‌మ‌స్కారాలు" అంటుంది. దీంతో ఆ మాట‌ల‌కు హిమ ఎమోష‌న‌ల్ అవుతుంది. "మీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న దీన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను" అంటుంది. ఆ మాట‌ల‌కు సౌంద‌ర్య‌, ఆనంద‌రావు బాధ‌ప‌డుతూ వుంటారు. అవార్డ్ ఫంక్ష‌న్ పూర్త‌య్యాక ఆనంద‌రావు, సౌంద‌ర్య త‌న నాన‌మ్మ‌, తాత‌య్య అనే విష‌యాన్ని జ్వాల బ‌య‌ట పెడుతుంది. నేనే మీ మ‌న‌వ‌రాలు శౌర్య అని తెలిసి కూడా ప‌రాయిదాన్ని చూసిన‌ట్టుగా చూశార‌ని నిల‌దీస్తుంది. "మా విష‌యం ప‌క్క‌న పెట్టు నువ్వు కూడా అలాగే ఎందుకు ప్ర‌వ‌ర్తించావు?" అని అన‌డంతో వెంట‌నే త‌న చేతిపై వున్న ప‌చ్చ బొట్టుని చూపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బ్యాంక్‌లో తిలోత్త‌మ‌కు న‌య‌ని ఇచ్చిన షాక్ ఇదే!

బుల్లితెర‌పై విజ‌య‌వంతంగా దూసుకుపోతోన్న సీరియ‌ల్స్‌లో 'త్రిన‌య‌ని' ఒక‌టి. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి త‌న భ‌ర్త త‌ల్లి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని ఎలా ఛేధించింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ఈ సీరియ‌ల్‌ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డుస్తోంది. ఆస‌క్తిక‌ర మ‌లుపులు, ట్విస్ట్ ల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. క‌సి కార‌ణంగా ఫ్యాక్టరీ నానాటికీ న‌ష్టాల్లో కూరుకుపోతూ వుంటుంది. ఇది తిలోత్త‌మ‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంది. చివ‌రికి అకౌంట్ నుంచి డ‌బ్బులు తీయ‌డానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇదే విష‌యాన్ని హాసిని హెచ్చ‌రిస్తుంది. క‌సిని న‌మ్ముకుంటే అంతా మ‌సే అని చెబుతుంది. ఇదే స‌మ‌యంలో న‌య‌ని, విశాల్ సొంతంగా వ్యాపారం చేయ‌బోతున్నార‌ని, బ్యాంక్ లోన్‌కి అప్లై చేయ‌బోతున్నార‌ని తెలియ‌డంతో తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ ఆ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకోవ‌డానికి వెళ‌తారు.   అదే స‌మ‌యంలో న‌య‌ని, విశాల్ బ్యాంకులో మేనేజ‌ర్ తో మాట్లాడుతుంటారు. క‌రెక్ట్ టైమ్‌కే వ‌చ్చామ‌ని వెట‌కారాలు పోయిన క‌సి.. విశాల్‌కుకు గాయ‌త్రీదేవి ఇండ‌స్ట్రీస్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతుంది. తిలోత్త‌మ కూడా వంత పాడుతుంది. దీంతో న‌య‌ని - విశాల్ త‌మ‌కు పుండ‌రీనాథం తాత వ‌ల్ల ల‌భించిన పెట్టెని లోనికి తీసుకుర‌మ్మంటారు. అది ఇక్క‌డికి ఎందుక‌ని తిలోత్త‌మ అంటుంది. చెప్తా అని విశాల్ "అమ్మ.. నువ్వే ఈ పెట్టెని ఓపెన్ చేయి" అంటాడు. తెరిచి చూసిన తిలోత్త‌మ అందులో బంగారు ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాలు వుండ‌టంతో ఒక్క‌సారిగా షాక‌వుతుంది. క‌సి, వ‌ల్ల‌భ ప‌రిస్థితీ అంతే. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

వేద‌ని స్టేష‌న్ లో అడ్డంగా బుక్ చేసిన కైలాష్!

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌తీ రోజు రాత్రి 9:30 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది. చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో, ట్విస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.   వేద‌ని బ‌ల‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న కైలాష్ అద‌ను చూసి అంద‌రిని సినిమాకు పంపించేసి త‌న‌పై దాడికి పూనుకుంటాడు. కైలాష్ చెడు బుద్ధి గ‌మ‌నించిన వేద అత‌ని నుంచి కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయినా కైలాష్ త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా వెంట‌ప‌డ‌తాడు. ఈ క్ర‌మంలో త‌న‌ని కొడ‌తాడు కూడా.. కింద‌ప‌డిన వేద‌పైకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డంతో అదే స‌మ‌యంలో వేద‌కు ఓ క‌ర్ర దొరుకుతుంది.. క‌ట్ చేస్తే.. వేద పోలీస్టేష‌న్ లోని సెల్‌లో బందీగా వుంటుంది. ముంబై నుంచి ఇంటికి తిరిగి వ‌చ్చిన య‌ష్.. వేద కోసం ఇళ్లంతా వెతుకుతుంటాడు. త‌ల్లి మాలిని, తండ్రిని అడిగితే స‌మాధానం వుండ‌దు. అభిమ‌న్యు చెప్పుడు మాట‌ల‌కు య‌ష్ పై అంతా గుర్రుగా వుంటారు. విష‌యం తెలుసుకున్న య‌ష్ అస‌లు జ‌రిగింది ఇది అని వివ‌రించ‌డంతో అంతా కూల్ అయిపోతారు. అయితే వేద ఎక్క‌డ అంటే ఎవ‌రి ద‌గ్గ‌రా స‌మాధానం వుండ‌దు.. దీంతో పోలీస్టేష‌న్ లో మిస్సింగ్ కేస్ ఫైల్ చేయ‌డానికి వెళ‌తాడు. అక్క‌డ ఎస్సైతో వాద‌న అనంత‌రం వేద అక్క‌డే సెల్ లో వుంద‌ని తెలిసి షాక్ అవుతాడు. ఈ విష‌యం తెలియ‌క య‌ష్ త‌ల్లి, తండ్రి ఫీల‌వుతుంటే కైలాష్ మాత్రం త‌ను ఇక ఇంటికి రాద‌ని, త‌న లైఫ్ ఫినిష్ అని త‌న‌లో తానే అనుకుంటూ వుంటాడు. స్టేషన్ లో ఎందుకున్నావ‌ని, ఏం జ‌రిగింద‌ని వేద‌ని ఎంత అడిగినా స‌మాధానం చెప్ప‌దు. వేద అసిస్టెంట్ నే అడ్డుపెట్టుకుని కైలాష్ గేమ్ ప్లాన్ చేసి త‌న‌ని ఇరికించాడ‌ని చెప్ప‌లేక‌పోతుంది. ఇంత‌కీ వేద బ‌య‌టికి వ‌చ్చిందా? కైలాష్ విష‌యం చెప్పిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

శ్రీముఖి, సాయిశ్రీ చరణ్ మధ్య ఏం జరుగుతోంది?

శ్రీముఖి ఇటీవల అన్ని షోస్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఇప్పుడు 'సరిగమప' షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. కోటి, శైలజ, స్మిత, అనంతశ్రీరాం జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ స్టేజికి ఈ వారం క్రేజీ ఫెలో టీం వచ్చి సందడి చేసింది. గత ఎపిసోడ్స్ నుంచి చూస్తే గనక శ్రీముఖి.. చరణ్ మీద జోక్స్ వేయడం, చరణ్ గురించే ప్రత్యేకంగా మాట్లాడడం చేస్తుండేసరికి ఇద్దరి మధ్యన ఏముందో అని గుసగుసలాడుకుంటున్నారు ఆడియన్స్. శ్రీముఖితో చరణ్ కలిసి డాన్స్ చేయడం, అతని డాన్స్ కి ఫిదా ఐపోయి శ్రీముఖి కూడా హగ్ ఇవ్వడం చూసాం. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ బోనాల స్పెషల్ షోకి గెస్ట్ గా వచ్చిన ఆది సాయికుమార్ "నీకు, చరణ్ కి సంబంధించి ఒక క్రేజీ వీడియో చూసాను. ఏం జరుగుతోంది ఇద్దరి మధ్య?" అని శ్రీముఖిని అడిగాడు.  "చరణ్ 'తొలిప్రేమ'లో పాట పాడినా మీకు అర్ధం కాలేదా?" ఇంకా అని అడిగింది శ్రీ‌ముఖి. అప్పుడు ఆది అర్థమైనట్టు తలూపాడు. "నా మనసులో మాట ఎన్నో సార్లు చెప్పాను. కానీ ఆయన మాత్రం చెప్పడు" అంటూ చరణ్ గురించి కామెంట్ చేసింది శ్రీ‌ముఖి. "ఒక అమ్మాయి ఇన్నిసార్లు ఐ లవ్ యు చెప్పినా చరణ్ పట్టించుకోవట్లేదు చూసారా ఆది గారు" అంది.  ఇక చరణ్ కూడా శ్రీముఖికి ప్రొపోజ్ చేయడానికన్నట్టు స్టేజి మీదకు వచ్చేసరికి అందరు కూడా ఒక్కసారి షాక్ అయ్యి అలానే చూశారు. శ్రీముఖి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ ఫైనల్ గా చరణ్  మోకాలి మీద కూర్చుని షూ లేస్ కట్టుకున్నాడు. అది చూసేసరికి శ్రీముఖికి నోటమాట రాకుండా పోయింది. "నాలో అర సెకను ఆశ రేపావు చరణ్. నువ్ లూజ్ అని తెలుసు. షో లేస్ ఐనా టైట్ గా కట్టుకో" అంటూ బాధపడింది శ్రీముఖి.

రాంప్రసాద్ స్కిట్‌లో ప‌స క‌నిపించ‌ట్లేదు!

ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఇటీవల కాస్త రేటింగ్ తగ్గింది. ఒకప్పుడు ఆటో రాంప్రసాద్ స్కిట్ అంటే ఒక పేరుండేది. ఐతే ప్రస్తుతం రాంప్రసాద్ స్కిట్ కి ఆదరణ చాలా తగ్గింది. ఎందుకంటే రాంప్రసాద్ పదాలతో ప్రాపర్టీస్ చూపిస్తూ స్కిట్ నడిపిస్తున్నాడు తప్ప అందులో ఒక గ్రేస్ అనేది కనిపించట్లేదు. ఆటో రాంప్రసాద్ ఇటీవల హైపర్ ఆదిని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే హైపర్ ఆది స్కిట్ లో కూడా పంచ్ డైలాగ్స్ తప్ప అందులో స్కిట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రాంప్రసాద్ కూడా అదే తరహాలోకి వెళ్ళిపోతున్నాడా అనిపిస్తోంది. రాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో చూస్తే ఆటో రాంప్రసాద్ స్కిట్ లో స్టేజి మీద ఎక్కువగా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఒక్కో డైలాగ్ కి ఒక్కో ప్రాపర్టీని చూపిస్తూ స్కిట్ నడిపించేసాడు.  దీనికి కారణం రాంప్రసాద్ ఫ్రెండ్స్  ఒక్కొక్కరిగా అతన్ని విడిచి వెళ్లిపోవడమే అని తెలుస్తోంది. బేసిగ్గా రాంప్రసాద్ ఒక రైటర్. కానీ తనతో ప్రయాణం చేసిన మిత్రులెవరూ ఇప్పుడు తోడుగా లేకపోవడంతో అసలు  స్కిట్ ఏం రాయాలో కూడా తనకు  అర్థం కావట్లేదు అని అన్నాడు. "నా ఫ్రెండ్స్ నాతో ఉన్నప్పుడు మాత్రం అలా పక్కకెళ్లి కొన్ని నిమిషాల్లోనే అదిరిపోయే స్కిట్ రాసేసేవాడిని. కానీ ఇప్పుడు అలా ఏమీ రాయలేకపోతున్నా" అంటూ గతంలో ఒక స్కిట్ లో రాంప్రసాద్ తన మనసులో మాటను చెప్పాడు. ఎవరు ఉన్న లేకున్నా షో ముందుకెళ్లాలంటే మంచి స్కిట్స్ ఉండాలి కాబట్టి రాంప్రసాద్ ఇకనుంచి మంచి టైమింగ్ ఉన్న  స్కిట్స్ రాసుకుని పెర్ఫార్మ్ చేయాలనీ ఆడియన్స్ ఆశిస్తున్నారు.

అనసూయను ముద్దు అడిగిన చలాకి చంటి!

ఒకరి తర్వాత తర్వాత జబర్దస్త్ షోని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళను చూస్తుంటే షో పరిస్థితి ఏమిటా అనే ఆలోచన ఆడియన్స్ కి వచ్చింది. ఐతే ఇప్పుడు ఈ షో మాత్రం కొంచెం కొంచెం గాడిన పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే చలాకీ చంటి టీం, రాకెట్ రాఘవ టీం ఈ షోకి ఇప్పుడు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ఇక ఇప్పుడు ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో చలాకి చంటి చిన్నపిల్లాడి వేషంలో వచ్చి ఈ స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. కొమరం ఛాతికి తల్లి పాత్రలో కనిపిస్తుంది.  "అమ్మా నన్ను ఎత్తుకోమని ఆ ఆంటీకి చెప్పవా" అంటూ అనసూయ వైపు చూపిస్తాడు. "నీ పిల్లలనైతే ఎత్తుకుని తిరుగుతావు.. నా పిలగాడికి ఎత్తుకోవడానికి ఏమైందమ్మా, అందంగా లేడా నా పిలగాడు"  అంటూ నిష్ఠూరంపోతుంది కొమరం. "గాడిదలా పెరిగాడు చూడు" అంటూ కౌంటర్ ఇస్తుంది అనసూయ. "ఒక ముద్దు పెట్టమని చెప్పవా అంటీని" అని మళ్ళీ  అడుగుతాడు చలాకీ  చంటి. "ఇలాగేనా నీ కొడుకుని పెంచేది" అంటూ అనసూయ సీరియస్ అయ్యేసరికి కొమరం.. చంటిని కొట్టి "స్కిట్ నీ కోసం రాసుకున్నావా, ఆ పిల్ల కోసం రాసుకున్నావా" అంటూ గడ్డి పెడుతుంది.  ఇక లాస్ట్ లో రాఘవ, ఆయన కొడుకు మురారి కలిసి "అదుర్స్" మూవీలోని బ్రహ్మానందం కామెడీ బిట్ ఆధారంగా వేసిన స్కిట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అలాగే వెంకీ మంకీస్ వేసిన దశావతారం స్కిట్ కూడా మంచి టైమింగ్ ఉన్న కామెడీని అందించింది. ఇలా ఈ వారం జబర్దస్త్ షోలో స్కిట్స్ అన్నీ కూడా ఆడియన్స్ ని అలరించబోతున్నాయి.

వేదిక‌పైనే హిమని కొట్టి షాకిచ్చిన‌ జ్వాల!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఈ రోజు ఎపిసోడ్ వివ‌రాలు ఏంటో ఒక‌సారి చూద్దాం. హైద‌రాబాద్ క్ల‌బ్ అవార్డ్‌ ఫంక్ష‌న్ మొద‌ల‌వుతుంది. ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లే ఈ ఫంక్ష‌న్ కు చీఫ్ గెస్ట్ లు. సౌంద‌ర్య స్పీచ్ ఇస్తున్న స‌మ‌యంలో జ్వాల ఎంట్రీ ఇస్తుంది. ఇక అక్క‌డే వున్న హిమ‌ని చూసి ఇదేంటీ ఇక్క‌డుంది.. మ‌నం వెన‌క్కి వెళ్లిపోవాలి అనుకుంటుంది. కానీ నేను ఎందుకు భ‌య‌ప‌డాలి అని మ‌ళ్లీ అక్క‌డే కూర్చుంటుంది. ఆ త‌రువాత జ్వాల‌ని చూసిన ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లు త‌ను ఎందుకు ఇక్క‌డికి వ‌చ్చింది అనుకుంటారు.     అదే స‌మ‌యంలో జ్వాల చేసిన గొప్ప‌ప‌ని గురించి చెప్పి త‌న‌ని అవార్డు తీసుకోవ‌డానికి రావాల‌ని పిలుస్తారు. ఆ మాట‌లు విని హిమ ఆనంద‌ప‌డుతుంది. ఇక అవార్డులు ఇస్తున్న సౌంద‌ర్య కూడా హ్యాపీగా ఫీల‌వుతుంది. కానీ లోలోన త‌న మ‌న‌వ‌రాలికే అవార్డ్ ఇస్తున్నాన‌ని చెప్పుకోలేక‌పోతున్నాన‌ని ఫీల‌వుతుంది. ఇంత‌లో త‌న‌కు అవార్డ్ ఇచ్చేది మీరు కాద‌ని డాక్ట‌ర్ హిమ అని నిర్వాహ‌కులు చెప్ప‌డంతో జ్వాల ఒక్కసారిగా షాక్ అవుతుంది. హిమ‌నే సీరియ‌స్ గా చూస్తూ వుంటుంది. హిమ ఎవ‌రో కాదు సౌంద‌ర్య మ‌న‌వ‌రాల‌ని ఎవ‌రో చెప్ప‌డంతో జ్వాల మ‌రింత ఆగ్ర‌హానికి గుర‌వుతుంది.   హిమ భయం భ‌యంగా స్టేజ్‌ ఎక్కుతుండ‌గానే జ్వాల త‌న చెంప ప‌గ‌ల‌గొడుతుంది. నువ్వు హిమ‌వా? ఇన్నాళ్లూ నాకు ఎందుకు చెప్ప‌లేదు అని అడుగుతుంది. నా ప‌క్క‌నే ఉంటావ్‌.. నా స్టోరీ వింటావ్‌.. నా ప్రేమ ను లాగేసుకుంటావ్ అని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నా డాక్ట‌ర్ సాబ్ ని దూరం చేస్తావ్‌.. పెళ్లి చేసుకుంటావ్‌.. నువ్వు మ‌హా మోస‌గ‌త్తెవి అని తిడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ప్రేమ ఒక అబ‌ద్ధం.. దీప్తి సునైన పోస్ట్ వైర‌ల్‌!

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా హాట్ అందాల‌తో నెటిజ‌న్ల‌కు గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. గ‌త కొంత కాలంగా యూట్యూబ‌ర్‌, బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫేమ్ షణ్ముఖ్ జ‌స్వంత్ తో ప్రేమ‌లో వున్న ఈ గ్లామ‌ర్ లేడీ అదే షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి హ‌న్మంత్ కార‌ణంగా ష‌ణ్ణుకు దూర‌మైంది. త‌న కంటే ష‌ణ్ణుకు సిరినే ఎక్కువ అని తెలుసుకున్న దీప్తి అత‌నికి బిగ్ బాస్ సీజ‌న్ ముగిసాక బ్రేక‌ప్ చెప్పేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఏదొక అంశ‌మై వార్త‌ల్లో నిలుస్తున్న దీప్తి తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచి వైర‌ల్ అవుతోంది. బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయిన దీప్తి సునైన యూట్యూబ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మ‌రింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నిత్యం త‌న గ్లామ‌ర్ ఫొటో షూట్‌ల‌తోనూ నెటిజ‌న్‌ల‌ని ఆక‌ట్టుకుంటూ రికార్డు స్థాయి ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో ఈ బ్యూటీని ఫాలోఅవుతున్న వారు 3.8 మిలియ‌న్స్.. అంటే 38 ల‌క్ష‌ల మంది అన్న‌మాట‌. ఇంత మంది ఫాలోవ‌ర్స్‌తో దీప్తి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే తాజాగా త‌ను పెట్టిన ఓ పోస్ట్ ఇప్ప‌డు వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల విడుద‌లైన `విరాట‌ప‌ర్వం` చిత్రంలోని ఓ డైలాగ్ వీడియోను అభిమానుల‌తో షేర్ చేసింది. ఈ వీడియోలో సాయి ప‌ల్ల‌వి తాను ఎంత‌గానో ప్రేమిస్తున్న రానాని క‌లిసేందుకు ఆరాట‌ప‌డుతున్న స‌న్నివేశం అది. ఓ లెక్చ‌ర‌ర్‌ని రానా ఆచూకీ చెప్ప‌మ‌ని అడిగిన సంద‌ర్భంలో ఆయ‌న‌, ఇక్క‌డ ఎవ‌రిని ఎవ‌రు ప్రేమించ‌ర‌ని, మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోవ‌డ‌మే నిజ‌మ‌ని, ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక పెద్ద అబ‌ద్ధ‌మ‌ని చెబుతాడు. ఉన్న‌ట్టుండి దీప్తి ఈ డైలాగ్ వీడియోను పోస్ట్ చేయ‌డం నెట్టింట వైర‌ల్ గా మారింది. త‌న ప్రేమ గురించి ఇండైరెక్ట్ గా చెప్పాల‌న్న ఉద్దేశ్యంలో భాగంగానే షణ్ణుపై దీప్తి సెటైర్ వేసింద‌ని నెటిజ‌న్లు కామెంట్‌ చేస్తున్నారు. 

ఒంట‌రిగా వున్న‌ వేద‌పై లైంగిక‌ దాడికి సిద్ధ‌ప‌డిన కైలాష్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం'. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బెంగ‌ళూరుకు చెందిన క‌న్న‌డ న‌టుడు నిరంజ‌న్, కోల్ క‌త్తా న‌టి డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, సుమిత్ర‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమాండ్ల, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతోంది.   వేద‌పై ఎలాగైనా దాడి చేయాల‌ని, త‌న కోరిక తీర్చుకోవాల‌ని ప‌థ‌కం వేసిన కైలాష్ సినిమాకు వెళ‌దామ‌ని భార్య కంచుతో అంటాడు. మ‌న‌సేమీ బాగాలేద‌ని, ఇంట్లో వుంటే అవే ఆలోచ‌నలు వెంటాడుతున్నాయ‌ని, సినిమాకు వెళితే రిలాక్స్ గా వుంటుంద‌ని చెబుతాడు. అంతే కాకుండా "మీ అమ్మ మాలినిని కూడా తీసుకెళదాం" అంటాడు. వెంట‌నే అంతా రెడీ అయిపోతారు. ఇంత‌లో త‌న‌కు దుబాయ్ నుంచి అర్జెంట్ కాల్ రావాల్సి వుంద‌ని, అది మాట్లాడేసి వ‌స్తానని, మీరు ముందు వెళ్లండ‌ని చెబుతాడు. అలాగే అని కంచు, మాలిని సినిమాకు వెళ్లిపోతారు. ఇంట్లో ఎవ‌రు లేకుండా చేసిన కైలాష్ .. వేద కోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఇదే స‌మ‌యానికి వేద వాళ్ల బావ పుట్టిన రోజని వేద ఫ్యామిలీ కూడా వేరే చోటికి వెళ్లిపోతారు. ఇదే మంచి ఛాన్స్ అని ఎదురుచూస్తున్న కైలాష్ కి వేద ఒంట‌రిగా దొరుకుతుంది. హాస్పిట‌ల్ నుంచి వ‌చ్చిన వేద చీర మార్చుకుంటుంటే చాటుగా చూస్తూ వుంటాడు కైలాష్. అది గ‌మ‌నించిన వేద "ఎవ‌రు?" అని అరుస్తుంది. వెంట‌నే బ‌య‌టికి వ‌చ్చిన కైలాష్ వేద‌పై దాడికి పూనుకుంటాడు. త‌న నుంచి త‌ప్పించుకుని వేద హాల్ లోకి వెళ్లినా వ‌ద‌లిపెట్ట‌డు.. దీంతో నీకు చెల్లెలి వ‌రుస అవుతాన‌ని, త‌న‌ని ఏమీ చేయొద్ద‌ని వేద వేడుకుంటుంది.. అయినా స‌రే కైలాష్ ఆమె మాట‌లు వినకుండా వేద‌ను బ‌ల‌వంతం చేయ‌బోతాడు. ఈలోగా వేద చేతికి ఓ బ‌ల‌మైన క‌ర్ర దొరుకుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ వ‌చ్చే సరికి త‌ను స్టేష‌న్ లో ఎందుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

'ఏజెంట్ ఆనంద్ సంతోష్‌'గా మ‌న ముందుకొస్తోన్న‌ షణ్ముఖ్

ఓటిటి ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు రాజ్యమేలుతోంది. కరోనా టైంలో థియేటర్స్ అన్నీ మూతబడేసరికి ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌కు ప్రజల నుంచి ఆదరణ విపరీతంగా పెరిగింది. ఎన్నో రకాల వెబ్ సిరీస్, కొత్త మూవీస్, టాక్ షోస్, సింగింగ్ షోస్ ఇలా ఎన్నో ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై ఈజీగా  చూసే ఛాన్స్ లభించింది. ఇక అందులోనూ ఆడియన్స్ ని నిత్యం ఎంటర్టైన్ చేయడానికి ఆహా ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ముందు వరుసలో నిలబడుతుంది. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన ఆహా ఇప్పుడు మరో  కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ చేయడానికి సిద్ధమౌతోంది. షణ్ముఖ్ జస్వంత్ పేరు వింటే చాలు గుర్తొచ్చేది 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్' అనే వెబ్ సిరీస్. ఇందులో షణ్ముఖ్ చాలా జనరల్ గా నటించి ఆడియన్స్ నుంచి మంచి మార్క్స్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ తో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా చోటు దక్కించుకున్నాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక షణ్ముఖ్ చాలా రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే దీప్తితో లవ్ బ్రేకప్ వంటి ఇష్యూస్ తో సైలెంట్ ఐపోయాడు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే షణ్ముఖ్ మళ్ళీ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. సరికొత్త వెబ్ సిరీస్ తో షణ్ముఖ్ ఇప్పుడు ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. "ఏజెంట్ ఆనంద్ సంతోష్" అనే వెబ్ సిరీస్ ద్వారా తన సత్తా చాటడానికి మళ్ళీ రెడీ అయ్యాడు.  అరుణ్ పవార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా ప్రసారం చేయడానికి సన్నద్ధమయ్యింది. ఈ విషయాన్ని ఆహా ఆఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. షణ్ముఖ్ ఈ పోస్టర్ లో ఒక సూట్ కేసు పట్టుకుని కనిపిస్తున్నాడు. దాని మీద 'కేసు క్లోజ్డ్‌' అనే లెటర్స్ హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నాగార్జున స‌ర‌స‌న న‌టించాల‌నేది అమ్మ‌ కోరిక‌.. వెల్ల‌డించిన సునీత‌ కుమారుడు!

  సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట పాడిందంటే చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంటుంది. టాలీవుడ్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. తన అద్భుతమైన గాత్రంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో పాటలు పాడి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాను పాడిన ఎన్నో పాటలకు అవార్డులను కూడా అందుకున్నారు. కొన్ని టీవీ షోస్ లో సింగర్ గా, ఇంకొన్ని షోస్ కి జడ్జి గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ మంచి ఫేమస్ అయ్యారు. ఐతే ఇటీవల అమ్మ మనసులోని మాటను ఆమె కుమారుడు ఆకాష్.. 'నిఖిల్ తో నాటకాలు' ఇంటర్వ్యూలో చెప్పాడు. "ఒక వేళ యాక్టింగ్ అంటే సునీత గారికి  ఇష్టం ఉండి ఉంటే ఎవరి పక్కన చేసే అవకాశం వుంది?" అని ఆకాష్ ని యాంకర్ నిఖిల్ అడిగాడు. "ఒకవేళ అమ్మకి యాక్టింగ్ ఛాన్స్ వస్తే హీరో నాగార్జున పక్కన చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఒక విషయం గురించి అమ్మకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు నాకు తెలిసింది.. నాగార్జున గారి పక్కన ఎవరు హీరోయిన్ గా చేసినా బాగా ఫేమస్ ఐపోతారు అని. డైరెక్ట్ గా ఈ విషయం అమ్మ నాతో చెప్పకపోయినా వాళ్ళ మాటల్ని బట్టి అమ్మకి ఒకవేళ ఛాన్స్ వస్తే నాగార్జున గారి పక్కన చేయడం ఇష్టం అని తెలిసింది." అంటూ చెప్పాడు ఆకాష్. కొడుకుతో పాటు సునీత కూడా పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఫైనల్ టచ్ గా సునీత "అవును నిజం.. నువ్వంటే నాకిష్టం" పాట పాడితే ఆకాష్ పాటకు తగ్గట్టు గిటార్ ప్లే చేసి మెస్మరైజ్ చేశాడు.