'సరిగమప' బోనాలు స్పెషల్
హైదరాబాద్, 1st జూలై, 2022: ఆసక్తికరమైన సీరియల్స్, అద్భుతమైన రియాలిటీ షోస్ తో పాటు, వరుస వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో 'జీ తెలుగు' ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గతవారం రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు క్రైమ్ థ్రిల్లర్ 'కిన్నెరసాని' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మరియు రాత్రి 9 గంటల నుండి సరిగమప బోనాలు స్పెషల్ ఎపిసోడ్ తో సందడి చేయనుంది.
రమణ తేజ దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ మరియు అన్ శీతల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులనుండి మంచి ప్రశంసలు అందుకుంది. వెంకట్ పాత్రలో లాయర్ గా మరియు అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ కలిగిన ఒక 'క్రిమినల్ లా' నిష్ణాతుడిగా కళ్యాణ్ దేవ్ మెప్పించగా, వేద పాత్రలో శీతల్ చక్కని ప్రదర్శన కనబరిచింది. ఐతే, వేద తన తండ్రి తనను చంపి కసి తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఒక పుస్తకం ద్వారా తెలుసుకుంటుంది. దీంతో, భయాందోళనకు గురైన వేద వెంకట్ ని సహాయం కోరుతుంది. ఇక విలన్ విషయానికొస్తే, జయదేవ్ పాత్రలో రవీంద్ర విజయ్ వేద అనే పేరు కలిగిన అమ్మాయిలను చంపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆధ్యాంతం పలు ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగల్చడంతో పాటు, ఇందులోని పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మరియు స్క్రీన్ ప్లే అందరిని ఆకట్టుకుంటాయి.
ఈ సినిమా అనంతరం 'సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్' బోనాలు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుండడంతో, 'జీ తెలుగు' తమ ప్రేక్షకులకు ఈ వారాంతానికి అద్భుతంగా ముగింపు పలికే అవకాశాన్ని కల్పించబోతుంది. పైగా, సెమీ-ఫైనల్స్ దగ్గరపడుతుండటంతో, పోటీదారులు ఒళ్ళు పులకరించే ప్రదర్శనలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికితోడు, 'క్రేజీ ఫెలోస్' చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆది షో కి రావడంతో మరియు ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండడంతో ఈ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగనుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'కిన్నెరసాని' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ని మరియు రాత్రి 9 గంటలకు 'సరిగమప' బోనాలు స్పెషల్ ఎపిసోడ్ ని తప్పక వీక్షించండి, మీ 'జీ తెలుగు' లో