జూలై 11 నుండి ముక్కుపుడక

'దేవతలారా దీవించండి', 'కోడళ్ళు మీకు జోహార్లు' వంటి సరికొత్త సీరియల్స్ తో ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతున్న 'జీ తెలుగు', ఇప్పుడు 'ముక్కుపుడక' అనే మరో సీరియల్ తో తెలుగు ప్రజల ముందుకు రానుంది. ఒక సాంప్రదాయక కుటుంబ నేపథ్యంలో వస్తున్న ఈ సీరియల్ జూలై 11 నుండి ప్రతి సోమవారం నుండి శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. సాధారణంగా అత్తాకోడళ్ల ఆధిపత్యపోరాటం నేపథ్యంలో వచ్చే సీరియల్స్ కన్నా, 'ముక్కుపుడక' కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఇక వివరాల్లోకి వెళితే, వేదవతి అనే ఒక స్త్రీ తనకు వారసురాలిగా అన్నపూర్ణ దేవి యొక్క ముక్కుపుడకని ధరించి, అమ్మవారిని కొలిచి, తన ఊరిని ఆ దేవి ఆగ్రహం నుండి కాపాడే ఒక అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలనుకుంటుంది. ఇందుకు గాను, ఆ అమ్మాయి జాతకం తన జాతకంతో కలవాల్సి ఉంటుంది. అయితే, తన జాతకం కలిగిన ఒక అమ్మాయిని చూసి తన చిన్న కొడుకైన శ్రీకర్ (రాకి గౌడ) కు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నప్పటికీ, శ్రీకర్ అవని (ఐశ్వర్య పిస్సే) అనే ఒక టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. మరి, అవని జాతకం వేదవతి జాతకంతో కలుస్తుందా? అవనిని వేదవతి తన కోడలిగా స్వీకరిస్తుందా? వేదవతి తరువాత అన్నపూర్ణ దేవిని కొలిచి తన ఊరిని అమ్మవారి ఆగ్రహం నుండి కాపాడేది ఎవరు? అసలు అమ్మవారి ఆగ్రహానికి కారణాలేంటి? ఇలా, బోలెడన్ని ప్రశ్నలతో, ఊహించని మలుపులతో ఈ సీరియల్ అందర్నీ టీవీలకు కట్టిపడేలా చేస్తుంది. జూలై 11 నుండి సోమవారం-శనివారం వరకు రాత్రి 8 గంటలకు కుటుంబ సమేతంగా ‘ముక్కుపుడక’ సీరియల్ ను వీక్షించండి.

ప్ర‌గ‌తి స్టెప్పుల‌కు హైప‌ర్ ఆదికి ఆయాసం

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. అటు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూనే.. బుల్లితెర‌పై కూడా త‌న‌దైన స్టైల్లో హంగామా చేస్తోంది. సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, అత్త పాత్ర‌ల్లో న‌టిస్తున్న ప్ర‌గ‌త నెట్టింట్లో మాత్రం హీరోయిన్ ల‌కు పోటీగా వ‌ర్క‌వుట్ లు చేస్తూ నానా హంగామా చేస్తోంది. ప్ర‌గ‌తి వ‌ర్క‌వుట్ వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారుతున్నాయి. బుల్లితెర‌పై కూడా ఇదే త‌ర‌హాలో ర‌చ్చ చేస్తోందామె. బుల్లితెర‌పై అదిరిపోయే స్టెప్పుల‌తో దుమ్ముదులిపేస్తున్న ప్ర‌గ‌తి లేటెస్ట్ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రీసెంట్ గా ప్ర‌గ‌తి `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` షోకి గెస్ట్ గా వెళ్లింది. ఈ షోకు జ‌డ్జిగా పూర్ణ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షోలో హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్‌, వ‌ర్ష‌, బుల్లెట్ భాస్క‌ర్‌, ఇమ్మానుయేల్, శ్రీ‌వాణి, అన్న‌పూర్ణ టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ న‌వ్విస్తున్నారు. ర‌ష్మీగౌతమ్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో ప్ర‌తీ ఆదివారం న‌వ్వులు పూయిస్తోంది. అయితే జూలై 10న ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ ని స్పెష‌ల్ గా ప్లాన్ చేశారు. `ఆషాడం అల్లుళ్లు` పేరుతో ఈ ఆదివారం స్పెష‌ల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కోసం ప్ర‌గ‌తి గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. స్టేజ్ పై కి చేరి హుషారుగా స్టెప్పులేసి షోని హోరెత్తించారు. "కుర్రాడు బాబోయ్" పాట‌కు ప్ర‌గ‌తి ప‌ద‌హారేళ్ల అమ్మాయిలా స్టెప్పులేసింది. అయితే త‌న‌తో క‌లిసి హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ కూడా డ్యాన్స్ చేశారు. కానీ ఆమె స్పీడుని మ్యాచ్ చేయ‌లేక‌పోయారు. ప్ర‌గ‌తి స్టెప్పుల‌కు హైప‌ర్ ఆదికి ఆయాసం వ‌చ్చేసింది. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి హ‌ల్ చల్ చేస్తోంది.

జ‌బ‌ర్ద‌స్త్‌లో' కార్తీక‌దీపం' సిస్ట‌ర్స్ హంగామా!

`కార్తీక దీపం`.. ఓ ద‌శ‌లో టాప్ రేటింగ్ తో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా క్రేజీ సీరియ‌ల్ గా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఎప్పుడైతే డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌ని ద‌ర్శ‌కుడు చంపేసి కొత్త‌గా మ‌ళ్లీ మొద‌లు పెట్టాడో అప్ప‌టి నుంచి ఈ సీరియ‌ల్ క‌ళ త‌ప్పింది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌తో పాటు మోనిత పాత్ర‌కు కూడా ఎండ్ కార్డ్ వేసేశాడు ద‌ర్శ‌కుడు. ఇక వంట‌ల‌క్క పిల్ల‌లుగా న‌టించిన హిమ (స‌హృద‌), శౌర్య (బేబి క్రితిక‌) ల‌ను త‌ప్పించి వాళ్ల పాత్ర‌ల‌ని పెద్ద వాళ్లుగా మార్చి వీరి స్థానంలో కీర్తి భ‌ట్‌, అమూల్య‌ గౌడ‌ల‌ని తీసుకొచ్చాడు. ఇప్పుడు క‌థ మొత్తం వీళ్ల‌చుట్టే తిరుగుతోంది. కానీ ఆడియ‌న్స్ ని మాత్రం హిమ (స‌హృద‌), శౌర్య (బేబి క్రితిక‌) త‌ర‌హాలో ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. కొన్ని ఎపిసోడ్ లు ఈ ఇద్ద‌రు పిల్ల‌ల కార‌ణంగానే ర‌న్న‌యింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంత‌గా క్రేజ్ ని సొంతం చేసుకున్న హిమ (స‌హృద‌), శౌర్య (బేబి క్రితిక‌) లు `కార్తీక దీపం` సీరియ‌ల్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాక ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడ‌యాలో హంగామా చేస్తున్నా బుల్లితెర‌పై మాత్రం వీళ్ల సంద‌డిని చాలా మంది మిస్స‌వుతున్నార‌ట‌.   ఈ విష‌యాన్ని మ‌ల్లెమాల టీమ్ ప‌సిగ‌ట్టిందో, ఏమో తెలియ‌దు కానీ ఈ ఇద్ద‌రిని జ‌బ‌ర్ద‌స్త్ షోలోకి తీసుకొచ్చారు. మ‌నో, ఇంద్ర‌జ జ‌డ్జిలుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్ జూలై 14న ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని రీసెంట్ గా విడుద‌ల చేశారు. హిమ (స‌హృద‌), శౌర్య (బేబి క్రితిక‌) లు ఈ షోలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభ ఎపిసోడ్ లోనే శివ‌గామి సిస్ట‌ర్స్ గా ఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టేశారు. హిమ (స‌హృద‌), శౌర్య (బేబి క్రితిక‌) లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న తాజా ప్రోమో నెట్టింట్ వైర‌ల్ గా మారింది.

 వ‌సుధార‌కు జ‌గ‌తి వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. ఫ్యామిలీ ల‌వ్ డ్రామాగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంత‌గా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అక్ష‌ర గౌడ‌, ముఖేష్ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి కిర‌ణ్‌, జ్యోతిరాయ్‌, మిర్చి మాధ‌వి, న‌వ‌భార‌త్ బాలాజీ, చ‌ల్లా సుధీర్‌, ఉష‌శ్రీ, గోపాల్ శ్యామ్‌, విజే రోషిణి, వీణా స్వ‌రూప‌, కిర‌ణ్ కాంత్ త‌దిత‌రులు న‌టించారు. శుక్ర‌వారం ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. రిషీ సార్ సాక్షితో సినిమాకు ఎలా వెళ్తాడు అని జ‌గ‌తిని వ‌రుధార నిల‌దీస్తుంది. అదే స‌మ‌యంలో వ‌చ్చిన రిషీ త‌న‌కు క్యాబ్ బుక్ చేసిన‌ట్టు చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఇంత‌లో వ‌సుధార మ‌ళ్లీ మేడ‌మ్ మీ అబ్బాయి అంటుంది. వెంట‌నే జ‌గ‌తి అవును మా అబ్బాయే.. ప్రాబ్ల‌మ్ త‌న‌ది కాదు నీకు నువ్వే ప్రాబ్ల‌మ్ .. ప్రేమ ఎప్పుడు వ్య‌క్తం చేయాల‌న్న‌ది మబ్బుల్లో చంద‌మామ‌లా ఎప్పుడో ఒక‌సారి కాదు అని జ‌గ‌తి .అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే.. మేడ‌పైన గౌత‌మ్‌, వ‌సుధార వున్నార‌ని తెలిసి రిషీ పైకి వెళ్లిచూస్తాడు. అక్క‌డ వ‌సుధార ని చూసి ఏం చేస్తున్నార‌ని అడిగితే కొలుస్తున్నాం అంటుంది. క్లాస్ ఎగ్గొట్టి ఇక్క‌డ ఏంటి అని రిషి తిట్టికిందికి వెళ్లిపోతాడు. మ‌హేంద్ర రాగానే మీ శిష్యురాలిని కిందికి ర‌మ్మ‌ని చెప్పండి అంటాడు. క‌ట్ చేస్తే జ‌గ‌తి క్లాస్ చెబుతూ వుంటుంది. అదే స‌మ‌యంలో వ‌సుధార .. రిషీ గురించి ఆలోచిస్తూ వుంటుంది. అది గ‌మ‌నించిన జ‌గ‌తి .. క్లాస్ రూమ్ లో ఏంటిది అంటూ వార్నింగ్ ఇస్తుంది. క్లాస్ రూమ్ నుంచి బ‌య‌టికి పంపించేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

వేద నిజాయితీని య‌ష్ నిరూపించ‌గ‌ల‌డా?

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. బుల్లి తెర‌పై గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ట్విస్ట్ లతో షాకిస్తూ ఆస‌క్తిక‌ర‌మ‌లుపులు తిరుగుతున్న ఈ సీరియ‌ల్ శుక్ర‌వారం ఎలా సాగ‌నుందో ఇప్పుడు చూద్దాం. కైలాష్ త‌న‌ని వేధించాడ‌ని, ఓ అమ్మాయితో నాట‌కం ఆడించి త‌న‌ని పోలీస్టేష‌న్ లో పెట్టించాడ‌ని వేద చెబుతుంది. అయితే ఇదంతా క‌ట్టుక‌థ అని, కావాల‌నే త‌న భ‌ర్త మీద బుర‌ద జ‌ల్లుతోంద‌ని య‌ష్ సోద‌రి కంచు ఆరోపిస్తుంది. కైలాష్ నాట‌కం మొద‌లు పెట్టి వేద ఫోన్ నుంచి బూతు మెసేజ్ లు వ‌చ్చాయ‌ని దొంగ సాక్ష్యాలు చూపిస్తాడు. దీంతో కంచు మ‌రింత‌గా రెచ్చిపోయి వేద‌పై చేయి చేసుకోవ‌డ‌మే కాకుండా మ‌రింత నీచంగా మాట్లాడుతూ వేద‌ని వేధిస్తుంది. ఇంత జ‌రుగుతున్నా య‌ష్ క‌నీసం ప్ర‌త‌ఘ‌టించ‌డు.. ఇదే స‌మ‌యంలో వేద త‌ల్లి సులోచ‌న, తండ్రి వ‌ర‌ద‌రాజులు శ‌ర్మ ఎంట్రీ ఇస్తారు. త‌న కూతురిపై నేను బ్ర‌తికుండ‌గానే నింద‌వేస్తారా? అని సులోచ‌న ఆగ్ర‌హంతో ఊగిపోతుంది. నిప్పుని నిప్పు అని చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌ప్పు ఎక్క‌డో జ‌రిగిందంటుంది. ఎవ‌డ్రా నువ్వు అంటూ కైలాష్ పై మండిప‌డుతుంది.  కంచు క‌ల‌గ‌జేసుకుని వేద‌ని నిందిస్తుంటే మ‌ళ్లీ ఆ కూత కూస్తే చెప్పు తెగుతుంద‌ని వార్నింగ్ ఇస్తుంది. మ‌ధ్య‌లో మాలిని ఎంట‌రై సులోచ‌న‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేసినా సులోచ‌న లెక్క‌చేయ‌దు. కంచు ..వేద‌ని మెడ‌ప‌ట్టి బ‌య‌టికి గెంటేయ‌మ‌న‌డంతో సులోచ‌న మ‌రింత‌గా ఫైర్ అవుతుంది. అది చెప్పాల్సింది య‌ష్‌.. మిస్ట‌ర్ య‌శోధ‌ర్ చెప్పిండి అని నిల‌దీస్తుంది. య‌ష్ మాట్లాడ‌క‌పోవ‌డంతో ఒక్క క్ష‌ణం కూడా నా కూతురిని ఇలాంటి చెడిపోయిన వారి ఇంటిలో వుండ‌నివ్వ‌న‌ని వేద‌ని త‌న వెంట తీసుకెళుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ మ‌న‌లో ఏముంది? కైలాష్ భ‌ర‌తం ప‌ట్టాడా?  వేద నిజాయితీని నిరూపించాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

'నాగి ఆర్టిస్ట్ కాదు దేవుడు' అంటున్న రాకెట్ రాఘవ

ఈవారం జబర్దస్త్ షో ఇలా పూర్తయ్యిందో లేదో.. అలా  వచ్చే వారం షో ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ ఐపోయింది. ఇందులో స్కిట్స్ అన్నీ కూడా మంచి నవ్వు తెప్పించేవిగా పెర్ఫార్మ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇది వరకు జబర్దస్త్ కి సుధీర్ టీం బ్యాక్ బోన్ గా ఉండి షోని నడిపేవారు. కానీ ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ , బ్యాక్ ఫేస్, అన్ని కూడా చలాకి చంటి టీమ్, రాకెట్ రాఘవ నడిపిస్తున్నారు. ఈ జబర్దస్త్ చరిత్రలో ఏ వారం కూడా బోర్ కొట్టించకుండా, అసభ్యకరమైన పదాలు వాడకుండా చాలా నీట్ గా సాగే రాకెట్ రాఘవ స్కిట్స్ ఇప్పటికీ మంచి మార్కులను సంపాదించుకుంటున్నాయి. ఇక వచ్చే వారం రాఘవ, నాగి టీమ్ చేసిన కేక్ స్కిట్ మాత్రం చాలా నవ్వు తెప్పించేదిలా ఉంది. ఈ స్కిట్ విషయానికి వస్తే  రాఘవ తన వైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఒక కూల్ కేక్ తీసుకొచ్చి నాగికి ఇచ్చి తన ఫ్రిజ్ లో పెట్టమని చెప్తాడు. "దానికేం భాగ్యం.. ఇటివ్వండి" అని అడిగి మరీ తీసుకుని ఫ్రిజ్ లో పెడతాడు కేక్ ని. అలా అనేసరికి రాఘవ ఎంతో  ఆరాధనగా నాగీని చూస్తూ "మీరు దేవుడు సర్" అంటాడు. "మరి వాళ్ళు ఆర్టిస్ట్ అంటున్నారేంటి" అంటాడు అనుమానంగా నాగి. "ఎవరు సర్ అలా అన్నది.. మీరు ఆర్టిస్ట్.. కానీ కాదు" అంటాడు రాఘవ. కంఫ్యూజన్ లో "కరెక్ట్ నేను ఆర్టిస్ట్ ని కాదు" అంటూ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోతాడు నాగి. ఇక కేక్ ని ఫ్రిజ్ లో పెడ్తాడు నాగి. తర్వాత నుంచి  అదే పనిగా రాఘవ.. నాగి ఇంటి తలుపు కొట్టి "సర్ కేక్ ప్యాకెట్ తిప్పి పెట్టారా, తిప్పకుండా పెట్టారా?" అని అడుగుతాడు. "మళ్ళీ వచ్చి మీరు భోజనం చేశారా?" అని నాగీని అడుగుతాడు రాఘవ. చేశానంటాడు. "హమ్మయ్య.. ఐతే నా కేక్ సేఫె" అంటాడు రాఘవ. మళ్ళీ తలుపు కొట్టి "ఇంతకు కేక్ ఫ్రిజ్ లో పెట్టాం కానీ ప్లగ్ పెట్టారా లేదా?" అని అనుమానంగా అడుగుతాడు. నాగీకి ఒళ్ళు మండిపోతుంది. ఇలాంటి ట్విస్టెడ్ అండ్ కామెడీ స్కిట్స్ వచ్చే వారం మనందరినీ అలరించబోతున్నాయి.

నిరుప‌మ్ - శౌర్య‌ల పెళ్లి ప్ర‌య‌త్నాల్లో హిమ‌!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' సీరియ‌ల్ శుక్ర‌వారం ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. ఇంట్లో జ్వాల ఏడుస్తూ వుంటే చంద్ర‌మ్మ త‌న‌ని ఓదారుస్తూ వుంటుంది. ఏడ‌వ‌కు జ్వాల‌మ్మ అని చెప్పి, ఇంద్రుడిని బ‌య‌టి నుంచి భోజ‌నం తీసుకుర‌మ్మంటుంది. మ‌రో వైపు ఇంటికి వెళ్తున్న సౌంద‌ర్య‌, ఆనంద‌రావు, హిమ‌లు జ్వాల మాట‌లు గుర్తు చేసుకుని బాధ‌ప‌డుతూ వుంటారు. ఆనంద‌రావు వెళ్లి జ్వాల‌ని "ఇంటికి వెళ‌దాం బంగారం" అంటాడు. "మీ నాన‌మ్మ ఎదురుచూస్తుంది. ఎన్నో జ్ఞాప‌కాలు ఎదురుచూస్తున్నాయి" అని చెబుతాడు. "అయితే నా శ‌త్రువు కూడా ఎదురుచూస్తోంది. నేను రాను తాత‌య్యా" అంటుంది. "ఈ వ‌య‌సులో మమ్మ‌ల్ని ఎందుకు ఏడిపిస్తావ్ అమ్మా" అని ఆనంద‌రావు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా జ్వాల విన‌కుండా ఆనంద‌రావుని తిరిగి ఇంటికి పంపించేస్తుంది. ఇంటికి వెళ్లిన ఆనంద‌రావు బాధ‌ప‌డుతూ "ఇక శౌర్య ఇంటికి రాదేమో" అని అంటాడు. హిమ మాత్రం నిరుప‌మ్ బావ‌తో శౌర్య పెళ్లి చేయాల‌ని ఫిక్స్ అవుతుంది. కానీ శౌర్య‌లో మాత్రం ఎలాంటి మార్పు క‌నిపించ‌దు. క‌ట్ చేస్తే.. శౌర్య బ‌య‌టికి వెళ్లి ఇంటికి వ‌స్తుంది. త‌లుపులు తెరిచే వుండ‌టాన్ని గ‌మ‌నించి ఎవ‌రు తెరిచార‌ని లోప‌లికి వెళ్లేస‌రికి హిమ వంకాయ‌లు కోస్తూ క‌నిపిస్తుంది. "ఏం చేస్తున్నావే?" అని శౌర్య అడిగితే.. వంట చేస్తున్న శౌర్య "ఎంతైనా వంట‌ల‌క్క కూతుళ్లం క‌దా?" అంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన శౌర్య.. హిమ చేతిలో వున్న వంకాయ‌ల‌ని విసిరికొడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

కార్తీక దీపం వంటలక్క..ఇంత పని చేసిందా !

ఒకప్పుడు మహిళలంతా దూరదర్శన్ లో ప్రసారమయ్యే డైలీ సీరియల్ ఋతురాగాలను ఎంత ఆసక్తిగా చూసేవారో మళ్ళీ ఇన్నాళ్లకు కార్తీక దీపాన్ని అంతలా ఆరాధించారు. ఇక ఇందులో నల్లగా కనిపించే వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాధ్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని, టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకుంది. కేవలం వంటలక్క కోసమే సీరియల్ చూసే వాళ్ళు వున్నారు. స్క్రీన్ మీద వంటలక్క ఏడిస్తే ఇంట్లో ఏడ్చే మహిళలు కూడా ఉన్నారు. అలాంటి    ఇన్సిడెంట్స్ మీద కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవర్ కట్ ఐనా సరే కార్తీకదీపం సీరియల్ టైం అయ్యింది టీవీ పెట్టండి అనే పోస్టర్స్ కూడా అప్పట్లో  బాగా ట్రెండింగ్  అయ్యాయి. దీని బట్టి కార్తీకదీపం ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సీరియల్ లో  డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పిల్లలు పెద్దవాళ్ళు ఇపోయారు.  అందుకే ఒరిజినల్  క్యారెక్టర్స్ ని పూర్తిగా ఆపేసి కొత్త యంగ్ క్యారెక్టర్స్ తో సీరియల్ ని నడిపిస్తున్నారు. ఐనా సరే ఈ సీరియల్ ని చూడకుండా ఎవరూ ఉండడం లేదు. ఎందుకంటే ఏదో ఒక ఎపిసోడ్ లో అన్నా వంటలక్క కనిపిస్తుందేమో అనే ఆశతో చూస్తున్నారు. చాలామంది కూడా వంటలక్క క్యారెక్టర్ లేని సీరియల్ చూడము అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఆమెను మళ్ళీ సీరియల్ లో కనిపించేలా ప్లాన్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలను  కూడా వంటలక్క చుట్టేసింది. ఇక ఇప్పుడు దీప ఒక నేరం చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ గా మారింది. "వాంటెడ్ దీప" అంటూ ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ఇన్నేళ్ళుగా దోచుకుని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసి వదిలి వెళ్లిపోవడం కరెక్టా..ఇలా చేయడం నేరం కదా అంటున్నారు ఫాన్స్. ఆమెను పట్టుకుంటే రివార్డ్ కూడా ఇస్తాం అంటూ అభిమానులకు ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. ప్రేమి విశ్వనాధ్ బుల్లి తెరకు దూరమైనా సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన ఫోటో షూట్స్ ని, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అభిమానులకు ఇచ్చే సెల్ఫీ పిక్స్ ని అన్నిటినీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ కూడా చేస్తుకుంటూ ఉంటుంది.

ర‌ష్మిని హైప‌ర్ ఆది తెలిసే కొట్టాడా?

జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌ని సుడిగాలి సుధీర్‌తో పాటు అన‌సూయ కూడా వ‌దిలేయ‌డంతో హైప‌ర్ ఆది కూడా జ‌బ‌ర్ద‌స్త్‌ని వీడి `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`లో సెటిల‌య్యాడు. సుడిగాలి సుధీర్‌తో పాటు అన‌సూయ స్టార్ మాలో సెటిలైపోయారు. అక్క‌డే సూప‌ర్ సింగ‌ర్ షోతో పాటు ప‌లు షోల‌కు యాంక‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`లో సెటిలైన హైప‌ర్ ఆది అక్క‌డ త‌న‌దైన స్టైల్లో పంచ్‌లు వేస్తూ నానా ర‌చ్చ చేస్తున్నాడు. ఇందులోకి రీసెంట్ గా ర‌ష్మీ గౌత‌మ్ కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇద్ద‌రు క‌లిసి ఓ రేంజ్‌లో ర‌చ్చ చేస్తున్నారు. ఇంద్ర‌జ ప్లేస్‌లో పూర్ణ కంటిన్యూ అవుతోంది. జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలు కాస్త క్రేజ్ త‌గ్గ‌డంతో వాటి సంద‌డి క‌నిపించ‌డం లేదు. కానీ `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` మాత్రం రీసౌండ్ ఇస్తోంది. సుధీర్‌తో మొద‌లైన ఈ షో ఇప్ప‌డు పాపుల‌ర్ అయిపోయింది. ఇందులో లేడీ టీమ్ లీడ‌ర్స్ తో పాటు ఆటో రాం ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, బుల్లెట్ భాస్క‌ర్, ఇమ్మానుయేల్‌ వంటి వాళ్లు త‌మ‌దైన స్కిట్ల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఈ ఆదివారం జూలై 10 న ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ ని `ఆషాడం అల్లుళ్లు` పేరుతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.   దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ షోకు న‌టి ప్ర‌గ‌తి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ర‌ష్మీని వ‌ర్ష‌ కాసేపు ఆట‌ప‌ట్టించింది. "నువ్వు కూడా ఆషాడానికి వ‌చ్చావు క‌దా అక్కా.. బావ అక్క‌డున్నాడు క‌దా" అని వ‌ర్ష కామెంట్ చేసింది. దీంతో ర‌ష్మీ.. "ఎవ‌రే నీకు అక్క.. వెళ్లి కూర్చో" అని మండిప‌డింది. ఇక ఆదికి క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి అత్త‌ల‌ని కొట్టాల‌ని క‌ర్ర ఇవ్వ‌డంతో దొరికిందే ఛాన్స్ అనుకుని ర‌ష్మీని కొట్టేశాడు.. ఆ త‌రువాత "నేను ర‌ష్మీని" అన‌డంతో ఐతే ఓకే అన్నాడు. దీంతో అక్క‌డున్న వారంతా న‌వ్వేశారు. న‌వ్వులు పూయిస్తున్న ఈ ఎపిసోడ్ జూలై 10 ఆదివారం ప్ర‌సారం కానుంది. 

సుధీర్ అక్కడ..రష్మీ ఇక్కడ..వన్ ఇయర్ ఆషాఢం ఆఫర్ అంటూ ఆది కామెంట్స్

ప్రతీ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ తో పోటీ పడుతూ టాప్ రాంక్ లో దూసుకుపోతోంది. ఇక రాబోయే వారం ప్రోమో రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఆషాఢమాసం మొదలైన సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో  ఆషాఢం అల్లుళ్ళు పేరుతో చేసిన ఎపిసోడ్ ప్రోమో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఇక ఈ షోకి ప్రగతి గెస్ట్ గా వచ్చి రచ్చ చేసింది. ఇక ఆసియా, నూకరాజు, గీతాసింగ్, హైపర్ ఆది, వర్ష, ఇమ్మానుయేల్ జంటలుగా వచ్చి పెర్ఫార్మ్ చేశారు. మేం మా భార్యల దగ్గర ఫిట్ గా ఉండాలంటే ప్రగతి గారు ఓ రెండు ఎక్సరసైజులు చెప్పండి అంటూ ఆది అడుగుతాడు. ఆ తరువాత " కుర్రాడు బాబోయ్" అనే పాటకు ఆది, ప్రగతి,. ఆటో రాంప్రసాద్ డాన్స్ చేసి స్టేజిని మంచి ఎనర్జిటిక్ గా మార్చేశారు. వర్ష వచ్చి "రష్మీ అక్కా నువ్వు కూడా ఆషాడానికి వచ్చావ్ కదా మరి బావేమో అక్కడున్నాడు కదా " అంటూ సుధీర్ లేకపోయినా తన ప్రస్తావన తెచ్చి మరీ రష్మీని ఏడిపిస్తుంది వర్ష. "ఎవరే నీకు అక్క" అంటూ వర్ష మీద ఫైర్ అవుతుంది రష్మీ. ఐనా "రష్మీ నీకు సుధీర్ కి సంవత్సరం ఆషాడం అనుకుంటా కదా" నువ్విక్కడ..ఆయనక్కడ అనే అర్ధం వచ్చేలా  అంటూ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఆది మళ్ళీ తవ్వి తీసాడు. ఇక చివరిగా ఆది కళ్ళకు, అత్తల కళ్ళకు గంతలు కడుతుంది రష్మీ. ఆది నువ్విప్పుడు  అత్తలను వెతికి మరీ కొట్టాలి అనేసరికి "అత్తా అంటూ రష్మినే  పిచ్చ కొట్టాడు కొడతాడు"...ఇలా ఈ వారం పంచ్ డైలాగ్స్ తో, అదిరే స్కిట్స్ తో ఆషాఢం అల్లుళ్ళు ఎపిసోడ్ శ్రేదేవి డ్రామా కంపెనీలో ఆడియన్స్ ని అలరించబోతోంది. 

కమాన్ గుసగుస అంటున్న అషు

అషు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ గా హీట్ పుట్టించే ఫొటోస్ పెట్టి సందడి చేస్తూ ఉంటుంది. ఈమె ఇప్పుడు యూఎస్ లో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. ఐతే తాను ఎన్ని ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా సమయం తీసుకుని మరీ సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ కి టచ్ లో ఉండడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఐతే ఈసారి వెరైటీగా కొంచెం ట్రెండ్ చేంజ్ చేసింది. హాట్ ఫోటో సెషన్ కాకుండా  "కమాన్ గుసగుస" అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చి వాటిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ప్రేమ మీద అషు అభిప్రాయాన్ని అడిగిన ఒక ఫాలోవర్ కి "ప్రేమ అనేది ఒక పరీక్ష లాంటిది ..పాస్ ఐనా ఫెయిల్ ఐనా తప్పక ఫేస్ చేయాల్సిందే" అంటూ రిప్లై ఇచ్చింది.  అలాగే ఇంకో ఫాలోవర్ " బిగ్ బాస్ హౌస్ లో మీరు శివ టామ్ అండ్ జెర్రీలా భలే ఫైట్ చేసుకునేవారు..ఆ బాండింగ్ చాలా బాగుంది" అని పోస్ట్ చేశారు. అలాగే అషుకి ఎక్స్ ప్రెస్ హరికి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు అనే విషయం కూడా తెలిసిందే. అన్ని షోస్ లో కూడా వీళ్ళిద్దరూ  కలిసి పెర్ఫార్మ్ చేయడం చూస్తే ఇద్దరి మధ్య ఏదో ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఇదే ప్రశ్న ఒక ఫ్యాన్ అడిగేసరికి హరి తనకు మంచి ఫ్రెండ్ అంటూ కమాన్ గుసగుసలో చెప్పుకొచ్చింది. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ  సోషల్ మీడియా సునామి సృష్టించేసింది. బిగ్ బాస్ బ్యూటీ గా, టీవీ సెలెబ్రిటీగా, అప్పుడప్పుడు స్కిన్ షోస్ తో, ఫోటో షూట్స్ తో  ఓ రేంజ్ లో దూసుకుపోతోంది అషు బేబీ..  

రాజువయ్యా..మహరాజువయ్యా..

కొంతమందికి తీసుకునే అలవాటు ఉంటే ఇంకొంతమందికి ఇచ్చే అలవాటు ఉంటుంది. రెండో  కోవలోకి వస్తారు  మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అతని కొడుకు రికీ. ఈసారి ఒక స్వచ్చంద కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా నిర్వహించి మళ్ళీ తన అభిమానుల మనసులను దోచుకున్నాడు. హైదరాబాద్ లోని చెంగిచెర్లలో ఉన్న 70 మంది నిరుపేద పిల్లలకు పీజ్జాలు, పుస్తకాలను పంపిణీ చేసాడు. ఆ తర్వాత కాసేపు ఆ ఇద్దరూ కలిసి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ స్కూల్లో చదువు ఎలా చెప్తున్నారు, ఎలా చదువుకుంటున్నారనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపమ్, రిక్కీ ఇద్దరూ కలిసి వాళ్ళతో కొంత టైం స్పెండ్  చేశారు. ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా కార్తీకదీపం గురుంచి ప్రత్యేకంగా ముచ్చట్లు చెప్పారు.   ఇప్పటికీ ఇంకా ఆ సీరియల్ ని ఫాలో అవుతున్నామన్నారు.  కార్తీక దీపం సీరియల్ లో మీరిద్దరూ చాలా బాగా  నటించారు . ఈసారి మాత్రం తప్పనిసరిగా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ని కూడా తీసుకురావాలి అని మరీ మరీ చెప్పారు. కార్తీక దీపం సీరియల్ నుంచి బయటకి వచ్చేశాక డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే ఇవ్వడం అనేది అలవాటు చేస్తే వాళ్లకు కూడా తెలుస్తుంది తనకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అలాంటి సౌకర్యాలు లేక బయట ఎంతమంది బాధ పడుతున్నారు అనే విషయాలు . అందుకే రిక్కీకి ఇవన్నీ తెలియాలనే తీసుకెళ్ళాను అన్నాడు డాక్టర్ బాబు. ఇక కార్తీక దీపం బుల్లి తెర మీద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. నిరుపమ్ ఇప్పటికే ఎన్నో షోస్ లో కనిపించాడు. చాలా సీరియల్స్ లో నటించాడు. ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటే. ఇప్పుడు ఈ కార్తీకదీపం సీరియల్ లో కొత్త క్యారెక్టర్స్ గా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ, మానస్ నాగులపల్లి, మనోజ్ కుమార్, సుష్మా కిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక నిరుపమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరితో అనే విషయాలు ఇప్పటివరకు ఇంకా రెవీల్ చేయలేదు.

ఎన్ని పెగ్గుల తర్వాత ఇలా.. శ్రీరామ్, సన్నీ పరువు తీసేసిన యాని మాస్టర్

ఫేమస్ బ్యాక్ గ్రౌండ్ సింగర్ ఇంకా  నేపథ్య గాయకుడు, రియాలిటీ టీవీ స్టార్ శ్రీరామ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆయన ఇటీవల తన బాయ్స్ టీమ్ తో కలిసి సరదాగా శ్రీశైలం ట్రిప్ కి వెళ్ళాడు. ఎప్పుడు కనిపించే వేషధారణలో కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా చాలా ట్రెడిషనల్ గా పట్టు పంచెలతో, చొక్కాలతో రోడ్డు మీద నిలబడి రకరకాల ఫోజులతో కనిపించి సందడి చేశారు. అలా తన బాయ్స్ టీంతో కలిసి వెళ్లిన శ్రీశైలం ట్రిప్ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు శ్రీరామచంద్ర. దీంతో పాటు విజె సన్నీతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసుకున్నారు. "మామ మనం కలిసి చాలా కాలం అయ్యింది. ఇంత కాలానికి ఇలా నిన్ను చూడడం నాకు చాలా  సంతోషంగా ఉంది డార్లింగ్. నీ రాబోయే ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ " అని కాప్షన్ పెట్టాడు శ్రీరామ్ . ఇక ఈ పోస్ట్ కింద యాని  మాస్టర్ "ఎన్ని పెగ్గుల తర్వాత ఇలా మాట్లాడుకున్నారు" అంటూ కామెంట్ పెట్టి ఇద్దరి పరువు తీసి పారేశారు. ]ఓటిటి వేదికపై శ్రీరామచంద్ర తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా పోటీ చేసాడు. తెలుగు ఇండియన్ ఐడల్ షోకి మేకర్స్ హోస్ట్ గా శ్రీరామ్ ని ఎంచుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక శ్రీరామచంద్ర 2013 లో  హిందీ ఇండియన్ ఐడల్ గెలిచి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు.  ఆయన గాత్రానికి మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కూడా ఫిదా ఐపోతారు. శ్రీరామా చంద్రకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. షోస్ తో ఫుల్ బిజీ గా ఉండే శ్రీరామ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ తో టచ్ లో ఉంటూ క్రేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు.

నెటిజన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఏజెంట్ ఆనంద్ సంతోష్

సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇక్కడ సీక్రెట్స్ ఏమీ ఉండవ్. ఎవరికీ ఏది నచ్చితే అది మాట్లాడేసుకుంటారు. పోట్లాడుకుంటారు. సెలబ్రిటీస్ పోస్టులకు నెటిజన్స్ కూడా హోరాహోరి మాటల యుద్దాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎవరిమధ్య ఐనా సీరియస్ చాటింగ్ జరిగేటప్పుడు కొంతమంది నెటిజన్స్ ఆ చాటింగ్ మధ్యలోకి వచ్చేసి అనవసరమైన టాపిక్స్ తీసుకొచ్చి పక్కనోళ్ళను ఇరికించేసి చల్లగా వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి ఒక కాంట్రవర్సీ  టాపిక్ ఒకటి ఒక నెటిజన్ కి షణ్ముఖ్ కి మధ్యన జరిగింది. శ్రీరామచంద్ర, యాని మాస్టర్ , సన్నీ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో చాటింగ్ చేసుకుంటూ ఉండగా ఒక నెటిజన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చేసి "షణ్ముఖ్ తన యూట్యూబ్ జర్నీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  షణ్ణుకి కంగ్రాట్స్ చెప్పండి యాని మేడం" అంటూ ఒక కామెంట్ పెట్టాడు . ఈ కామెంట్ చూసిన షణ్ముఖ్ అలియాస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ వచ్చి "నువ్వెంట్రా బాబు అందరి దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతున్నావు" అని  అడిగేసరికి మళ్ళీ ఆ నెటిజన్ తనదైన స్థాయిలో షన్నుకి సపోర్ట్ చేసాడు.  "తప్పు లేదు బ్రో..శ్రీరామచంద్ర, యాని మాస్టర్, సన్నీ వీళ్ళను వీళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు నిన్ను  అస్సలు పట్టించుకోవట్లేదు..చెప్పాలంటే నీకు  వీళ్ళ ప్రమోషన్స్ ఏమీ అవసరం లేదు. మేమంతా  ఉన్నాం ప్రమోట్ చేయడానికి" అని  రిప్లై ఇచ్చాడు. "ఇలాంటి కామెంట్స్ పెట్టడం  కరెక్ట్ కాదు బ్రో" అంటూ షన్ను స్వీట్ వార్నింగ్ లాంటి ఒక మెసేజ్ పెట్టేసరికి ఏమనుకున్నాడో ఏమో ఆ నెటిజన్ మళ్ళీ "ఎందుకు తప్పు కాదు. నేనేమన్నా నెగిటివ్ కామెంట్ పెట్టానా..పని గట్టుకుని ఎవరి జీవితం నాశనం చేసానా..నా హీరో ప్రాజెక్ట్ గురించి నేను ప్రమోట్ చేస్తున్నాను. అదేం తప్పు కాదు" అంటూ అదే స్పీడ్ తో రివర్స్ రిప్లై ఇచ్చాడు షణ్ణుకి.  

గణేష్ మాస్టర్ విజిల్  ఆది సీరియస్ ?

ఢీ-14 1980 స్పెషల్ సాంగ్స్ ఎపిసోడ్ మంచి డాన్సస్ తో పంచ్ డైలాగ్స్ తో సాగిపోయింది ఈ వారం. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఆనాటి రెట్రో స్టయిల్లో డ్రెస్సింగ్ చేసుకుని  డాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆది తేజస్వినిని తన వైఫ్ గా పరిచయం చేసాడు. తేజస్విని "రూప్ తేరా మస్తానా" సాంగ్ కి సాయికుమార్ అనే కుర్రాడితో  కలిసి అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ డాన్స్ చూసి నందిత శ్వేతా, గణేష్ మాస్టర్, శ్రద్దా దాస్, గెస్టులుగా వచ్చిన సుశాంత్ , ప్రియా ఆనంద్ కూడా ఫిదా అయిపోయారు. ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ అయ్యాక ఆది  కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసాడు. ఇప్పటికే తేజు నలుగురు పిల్లల తల్లి. ఇల్లాంటి పొట్టి బట్టలు వేసుకోవద్దు అంటే వినడం లేదు అంటూ ఒక క్లాత్ తీసుకెళ్లి ఇది కప్పుకో అని ఇస్తాడు.  సుశాంత్ కూడా  ఆది వెనకాలే వెళ్లి ఒక  స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తాడు స్టేజి మీద. మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకోండి, వాళ్లకు నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు అని చెప్తాడు. ఆఫ్రికన్ స్టయిల్లో వేసిన స్టెప్స్ ని మళ్ళీ ఒకసారి వేయండి అంటూ తేజుని , సాయికుమార్ ని అడుగుతాడు గణేష్ మాస్టర్. వాళ్ళు మళ్ళీ ఆ స్టెప్స్ వేసి చూపించేసరికి ఆదికి కోపం వచ్చేస్తుంది. మాస్టర్ "మా ఆవిడ ఒక్కసారి చేయడమే వద్దు అనుకుంటున్నాను కానీ మీరు మళ్ళీ మళ్ళీ మా ఆవిడతో డాన్స్ చేయించి విజిల్ కూడా వేస్తున్నారు" అని ఉడుక్కుంటాడు. ఇక ఈ ఎపిసోడ్ లో నైనిక, శ్వేతనాయుడు టీం లీడర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా  నైని "బావ బావ" అంటూ ప్రదీప్ ని   ఆటపట్టిస్తూ అలరించింది.    

జ‌బ‌ర్ద‌స్త్ వ్యాపారం అంటూ కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్‌

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో చాలా మంది క‌మెడియ‌న్ ల‌ని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా చాలా వ‌ర‌కు విమ‌ర్శ‌ల‌ని కూడా ఎదుర్కొంది. క‌మెడియ‌న్ లతో చేయించుకునే అగ్రిమెంట్ లు వివాదాస్ప‌మైన విష‌యం  తెలిసిందే. ఇప్ప‌టికీ మ‌ల్లెమాల అగ్రిమెంట్ ల‌పై నాగ‌బాబు త‌న షోలో సెటైర్లు వేస్తూనే వున్నారు. తాజాగా కిరాక్ ఆర్పీ కూడా మ‌ల్లెమాల‌పై సంచ‌ల‌న కామెంట్ లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. జ‌బ‌ర్ద‌స్త్ ని వీడిన కిరాక్ ఆర్పీ ప్ర‌స్తుతం నాగ‌బాబు నిర్వ‌హిస్తున్న `కామెడీ స్టార్స్ ధ‌మాకా`తో పాటు ప‌లు ప్ర‌త్యేక షోల‌లో క‌నిపించి త‌న‌దైన పంథాలో న‌వ్విస్తున్నాడు. ఇటీవ‌లే ల‌క్ష్మీ ప్ర‌సన్న అనే యువ‌తిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నాడు. ఇటీవ‌లే వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌లో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా పాల్గొని ఇద్ద‌రిని ఆశీర్వ‌దించారు. ఇదిలా వుంటే హోటల్ లో స‌ర్వ‌ర్ గా ప‌ని చేసిన స్థాయి నుంచి ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో సొంత ఇట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన కిరాక్ ఆర్పీ గ‌త కొన్ని నెల‌లుగా నాగ‌బాబు నిర్వ‌హిస్తున్న `కామెడీ స్టార్స్ ధ‌మాకా` షోలో న‌వ్విస్తున్నాడు.   తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు మ‌ల్లెమాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ‌ల్లెమాల నిర్మాత శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి ఓ వ్యాపారి అని, నాగ‌బాబు దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే నాగ‌బాబు పేరు ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాన‌న్నాడు. నాకు అన్ని విధాలుగా నాగ‌బాబుగారు అండ‌గా నిలిచార‌ని, అయితే శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి మాత్రం ప‌క్కా వ్యాపారిలా నీకెంత నాకెంత అనే లెక్క‌లు వేసేవార‌ని కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆర్పీ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైరల్ గా మారాయి.    

ఆర్య త‌మ వెంట‌ప‌డుతున్న వారిని క‌నిపెట్టాడా?

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ప్ర‌ధాన జంట‌గా శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, రామ్ జ‌గ‌న్‌, క‌ర‌ణ్‌, అనుషా సంతోష్‌, సందీప్‌, మ‌ధుశ్రీ న‌టించారు. జెండే ఫ్లైట్ టికెట్స్ తీసుకురావ‌డంతో ఆర్య - అను హ‌నీమూన్ కోసం మ‌లేసియా బ‌య‌లుదేర‌తారు. ఫ్లైట్ ఎక్కాక సాంకేతిక కార‌ణాల వ‌ల్ల అది రాజ‌మండ్రిలోని మ‌ధుర‌పూడి ఏయిర్ పోర్ట్‌లో ఎమ‌ర్జెన్సీ గా ల్యాండ్ అవుతుంది. రేపు ఫ్లైట్ మ‌లేసియా బ‌య‌లుదేరుతుంది అని చెప్ప‌డంతో ద‌గ్గ‌ర‌లో వున్న క‌పోతేశ్వ‌రాల‌యం టెంపుల్ కు వెళ్లాల‌నుకుంటారు. జెండే ఏర్పాటు చేసిన మ‌నుషుల స‌హాయంతో ఫ్రెష్ అయిన అను - ఆర్య వెహికిల్స్ లో క‌పోతేశ్వ‌రాల‌యానికి వెళుతుంటారు. ఏయిర్ పోర్ట్ నుంచి వెంబ‌డిస్తున్న బ్యాచ్ కూడా వారిని అనుస‌రిస్తుంది. ఆర్య - అను ఆల‌య ప్రాంగ‌ణంలోకి ఎంట్రీ అవుతారు.. వారి వెంటే కొంత మంది గ‌న్స్ ప‌ట్టుకుని వెంబ‌డిస్తారు. అత‌ను చూసి దాడికి పూనుకోవాల‌ని రెడీ అవుతుంటారు. అనుతో వెళుతున్న ఆర్య ఆ గ్యాంగ్ ని ప‌సిగ‌డ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఆర్య వారిని ప‌ట్టుకున్నాడా? .. ఇంత‌కీ ఆ గ్యాంగ్ ని పంపించింది ఎవ‌రు? .. ఆర్య - అనుల‌పై దాడికి పూనుకుంది ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

క‌సి వ‌ల్ల రోడ్డున ప‌డిన తిలోత్త‌మ ఫ్యామిలీ!

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో వీక్ష‌కుల్ని అలిర‌స్తోన్న సీరియ‌ల్ త్రిన‌య‌ని. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి త‌న భ‌ర్తని ఆప‌ద‌ల నుంచి ఎలా కాపాడుకుంది, త‌న భ‌ర్త స‌వ‌తి త‌ల్లి కుట్ర‌ల‌ని ఎలా చేధించింది, త‌న భ‌ర్త త‌ల్లి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని ఎలా తెలుసుకుంది? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణుప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నారెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.  కొత్త‌గా వ్యాపారం ప్రారంభించాల‌ని బ్యాంక్ లోన్ కోసం వెళ్లిన విశాల్, న‌య‌నిల‌ని అక్క‌డికి వ‌చ్చిన తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ అవ‌మానిస్తారు.. లోన్ ఇవ్వ‌కుండా అడ్డుప‌డ‌తారు. అయితే పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో ల‌భించిన పెట్టెని లోనికి తీసుకొచ్చి తిలోత్త‌మ‌తో ఓపెన్ చేయించేస‌రికి అందులో బంగారు న‌గ‌లు, వ‌జ్రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. వీటి లెక్క ఎంతుంటుందో చెప్పండి అంటుంది న‌య‌ని మేనేజ‌ర్ తో. కోట్ల‌ల్లో వుంటుంద‌ని, దీన్ని పెట్టుకుని 30 కోట్ల వ‌ర‌కు వెంట‌నే లోన్ ఇచ్చేస్తానంటాడు. అది విని తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ షాక్ అవుతారు. వెంట‌నే వ్యాపారం ప్రారంభిస్తార‌ని క‌సి అంటుంది. ఆ డ‌బ్బుతో వ్యాపారం చేయ‌డం లేద‌ని, గాయత్రీ దేవి కంపెనీకి డిపాజిట్ గా ఇచ్చేస్తున్నామ‌ని చెప్పి షాకిస్తుంది న‌య‌ని.  క‌ట్ చేస్తే తిలోత్త‌మ ఇంట్లో చ‌ర్చ మొద‌ల‌వుతుంది. న‌య‌ని, విశాల్ ఎదుగుతున్నార‌ని వారిని ఎలాగైనా ఆపాల‌ని ఆలోచిస్తుంటారు తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ. అది విన్న విక్రాంత్ మీ వ‌ల్ల కాదంటాడు. క‌ట్ చేస్తే.. ఇంటికి వ‌చ్చిన న‌య‌ని.. కొత్త‌గా వ్యాపారం మొద‌లు పెడుతున్నామ‌ని చెప్పి బొట్టుపెడుతుంది. దీనితో అయినా మీ త‌ల‌రాత మారాల‌ని చెబుతుంది. అంత‌లోనే ఇంటికి సీల్ వేసేస్తారు. ఇంత‌కీ ఏం జ‌రిగింది? ఎందుకు సీల్ వేశారు.. తిలోత్త‌మ ఫ్యామిలీ క‌సి వ‌ల్ల ఎలా రోడ్డున ప‌డింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

నిజం చెప్పిన వేద‌.. కొత్త డ్రామా స్టార్ట్ చేసిన కైలాష్‌!

గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ లో నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఖుషీ అనే పాప చుట్టూ తిరిగిన ఈ సీరియ‌ల్ గ‌త వారం నుంచి చిత్ర మైన మ‌లుపులు తిరుగుతూ వేద - కైలాష్ ల చుట్టూ న‌డుస్తోంది.  పోలీస్ స్టేష‌న్ లో వున్న వేద‌ని య‌ష్ మొత్తానికి ఇంటికి తీసుకొస్తాడు. అస‌లు ఏం జ‌రిగింది? అని వేద‌ని నిల‌దీయ‌డంతో కైలాష్ త‌న‌ని వేధించ‌డం.. ఇంట్లో వాళ్లంద‌రిని సినిమాకు పంపించేసి త‌న‌పై అఘాయిత్యానికి పూనుకోవ‌డం.. అన్న‌య్యా అని బ్ర‌తిమాలుకున్నా విన‌కుండా త‌న‌ని వేధించాడ‌ని చెప్ప‌డంతో య‌ష్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌వుతాడు.. ఆ వెంట‌నే కైలాష్ పైకి వెళుతుంటే అత‌ని సోద‌రి కంచు అడ్డుప‌డుతుంది. "త‌ను చెప్పింది న‌మ్ముతున్నావా?" అంటూ య‌ష్ ని నిల‌దీస్తుంది. విష‌యం చేయిదాటేలా వుంద‌ని గ‌మ‌నించిన కైలాష్ కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంత జ‌రిగాక ఇంట్లో వుండ‌ను అంటూ వెళ్లిపోతున్నాన‌ని డ్రామా మొద‌లు పెడ‌తాడు.. ఇదే స‌మ‌యంలో సాక్ష్యాలు కావాలంటే నా ఫోన్ లో వున్నాయ‌ని కంచుతో చెబుతాడు. అందులో వేద‌నే త‌న‌కు అస‌భ్య‌క‌రంగా మెసేజ్ చేసిన‌ట్టుగా క్రియేట్ చేయ‌డంతో కంచు.. వేద‌ని కొట్టి నీచంగా మాట్లాడుతుంది. ఇది గ‌మ‌నిస్తున్న య‌ష్ ఏమీ అన‌కుండా అక్క‌డే నిల‌బ‌డి చూస్తుంటాడు. త‌ను చెప్పిందే న‌మ్మేసి వేద‌ని అదోలా చూస్తుంటాడు.  విష‌యం తెలిసిన వేద త‌ల్లిదండ్రులు రావ‌డంతో క‌థ మ‌రో ట‌ర్న్ తీసుకుంటుంది. "వేద మీ భార్య, త‌న‌కు అండ‌గా వుండ‌టం భ‌ర్త భాధ్య‌త" అని వేద త‌ల్లి చెప్పినా య‌ష్ లో చ‌ల‌నం వుండ‌దు. "ఇలాంటి ఇంట్లో నా కూతురిని ఒక్క‌క్ష‌ణం కూడా వుండ‌నివ్వ‌ను" అంటూ సులోచ‌న తీసుకెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.