శ్రీముఖికి హ్యాండ్ ఇచ్చిన చరణ్!

సరిగమప ఫ్యాన్స్ స్పెషల్ రౌండ్ - 3 ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ షోకి కార్తికేయ మూవీ హీరో నిఖిల్ వచ్చి సందడి చేశాడు. "ఇంతకు మీ ఆవిడ ఎలా ఉన్నారు?" అని నిఖిల్‌ని అడిగింది శ్రీముఖి. "నాకు తెలిసి ఈ షో చూస్తూ ఉంటుంది.. ఎందుకంటే తనకు ఈ షో అంటే చాలా ఇష్టం" అని చెప్పాడు చ‌ర‌ణ్‌. "నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇంత మంది అమేజింగ్ మ్యుజీషియన్స్ , సింగర్స్, ఆర్టిస్ట్స్ మధ్యలో మీరేమిటి ?" అని నిఖిల్ అడిగేసరికి ఒక్కసారిగా శ్రీముఖి షాక్ అయ్యింది.  ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కి ఫాన్స్ కూడా ఉండడంతో వాళ్ళను స్టేజి మీదకు తీసుకొచ్చి వాళ్ళకు ఎందుకు ఇష్టం అనే విషయాలు ఈ స్టేజి మీద పంచుకున్నారు. అలానే కంటెస్టెంట్ అర్జున్ విజయ్ అద్భుతమైన పాట పాడి అందరిని మెస్మ‌రైజ్ చేశాడు. ఇక తన సాంగ్‌కి చాలామంది లేడీ ఫ్యాన్స్ కూడా స్టేజి మీదకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందులో ఒక అమ్మాయి అర్జున్ పేరుని చేతి మీద పచ్చబొట్టులా పొడిపించుకుని వచ్చి అర్జున్‌కి చూపించింది. తర్వాత డేనియల్ పాడిన పాటకు అత‌న్ని అభిమానించే ఒక వ్యక్తి వచ్చి అత‌నితో కలిసి ఒక పాట పాడి, ఆ తర్వాత బాలసుబ్రమణ్యంతో కలిసి దిగిన ఫోటో లామినేషన్ ఇచ్చి తన అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించాడు. చివరిగా సాయి శ్రీచరణ్ వచ్చి "ఏ చిలిపి కళ్ళలోన కలవో" అనే పాట పాడాడు. బ్యాగ్రౌండ్‌లో  శ్రీముఖిని చూపిస్తూ వ‌చ్చారు. ఆ పాట విని మైమరిచిపోయింది శ్రీముఖి. పాట పూర్తయ్యాక స్టేజి మీదకు వచ్చి, "నేను చెప్పిన పాటను ఇంత అద్భుతంగా, డిస్టర్బ్ అవ్వకుండా ప్రెజంట్ చేస్తావని అస్సలు అనుకోలేదు." అని ముద్దు ముద్దుగా చెప్పింది. "నువ్ చేసే యాక్టింగ్ నాకు బాగా నచ్చుద్ది.. అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉన్నావ్" అంది.  ఇంతలో చరణ్ అంటే ఇష్టపడే ఒకమ్మాయి స్టేజి మీదకు వచ్చి శ్రీముఖికి ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. చేతిలో ఒక పెళ్లి కార్డు పెట్టి, "మీరు వచ్చి దగ్గరుండి మాకు పెళ్లి చేయాలి అక్కా" అంటూ శ్రీముఖికి చెప్పింది శ్రీ అనే ఆ అభిమాని. ఆ పెళ్లి కార్డు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది శ్రీముఖి.

వీజే స‌న్నీపై డైలాగ్ ల‌తో రెచ్చిపోయిన‌ ఆడ‌పులి!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ విన్న‌ర్ బిందు మాధ‌వి క్రేజ్ మామూలుగా లేదు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవ‌డంతో ఈ బ్యూటీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అదే పాపులారిటీతో సినిమాల్లో అవ‌కాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా స్టార్ మాలో ఓ స్పోష‌ల్ సంద‌డి చేసింది. `బిగ్ బాటిల్ కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్ పేరుతో ఈ ఆదివారం ప్ర‌త్యేక షోని స్టార్ మా ప్లాన్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాల్గొనే ఈ షోకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు.   ఈ ప్రోమోలో బిందు మాధ‌వి డైలాగ్ ల‌తో రెచ్చిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. `ఒక కింగ్ మ‌రో కింగ్ ని గెల‌వ‌డానికి వెళితే యుద్ధం. అదే క్వీన్ కింగ్ పై గెల‌వ‌డానికి వెళితే అదే పెద్ద యుద్ధం` అంటూ యాంక‌ర్ ర‌వి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ని రివీల్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ వీజే స‌న్నీ కింగ్ గా, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ క్వీన్ గా ఈ షోలో పోటీప‌డ‌బోతున్నారు. `కాంపిటీష‌న్ అంటే మా స్టాండ‌ర్డ్స్ లో వుండే వాళ్లు కావాలి. వీళ్లతో పోటీ ఏంట‌బ్బా` అని స‌న్నీ అనేశాడు. దీనికి బిందు మాధ‌వి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. `తూఫాన్ వ‌చ్చే ముందు క్లైమేట్ కూడా చాలా కూల్ గా వుంటుంది రా... త‌ర్వాతే చాలా వైలెంట్ గా వుంటుంది` అంటూ అదిరిపోయే పంచ్ వేసింది. ఇద్ద‌రి మ‌ధ్య సాగే ఫన్నీ వార్ గా ఈ షోని డిజైన్ చేశారు. ఇక ఫైన‌ల్ గా బిగ్ బాస్ లో వుండే థ్రిల్ మొత్తం ఇందులో వుండ‌బోతోంద‌ని హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌వి చెప్ప‌డం కొస‌మెరుపు. స‌ర‌దా స‌ర‌దా ఆట‌ల‌తో ఫ‌న్నీ సంచ్ ల‌తో సాగే ఈ షో జూలై 24 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.   

ర‌ష్మీ పెళ్లి కుదిరింది.. సుధీర్ ప‌రిస్థితి?

'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌', 'ఢీ' షోల‌తో పాపులారిటీని సొంతం చేసుకుంది ర‌ష్మీ గౌత‌మ్‌. సుధీర్‌-ర‌ష్మీ జంట‌కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కొన్నేళ్లుగా బుల్లితెర‌పై వీరు చేస్తూ వ‌స్తోన్న హంగామాకు ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ఆ ఇద్ద‌రూ నిజ జీవితంలో జంట‌గా మారాల‌ని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా త‌క్కువేమీ కాదు. తెర‌పై వీరి రొమాంటిక్ ట్రాక్ కార‌ణంగానే వారికి భారీ సంఖ్య‌లో ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. లేటెస్ట్‌గా ఆ ఫ్యాన్స్ అంద‌రికీ షాకిచ్చింది ర‌ష్మీ. తొమ్మిదేళ్లుగా పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఏమారుస్తూ వ‌చ్చిన ఆమె.. ఇప్పుడు త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఒక‌వైపు ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌తో ఆక‌ట్టుకుంటూ వ‌స్తోన్న ర‌ష్మీ.. సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్‌ల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తోంది. విజువ‌ల్ ట్రీట్‌తో వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొమ్మిదేళ్ల‌కు పైగా జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌గా సుధీర్‌తో రొమాంటిక్ ట్రాక్ న‌డుపుతూ వ‌చ్చిన ఆమె.. ఇప్పుడు సుధీర్ ఆ షో నుంచి త‌ప్పుకోవ‌డంతో సింగిల్ అయిపోయింది.  ఆ ఇద్ద‌రికీ రోజా బుల్లితెర‌పై పెళ్లి చేసి, ముచ్చ‌ట తీర్చుకున్న త‌ర్వాత‌.. చాలా షోల‌లో సుధీర్‌-ర‌ష్మీ ప‌ర‌స్ప‌రం త‌మ ప్రేమ‌ను చాటుకుంటూ త‌మ‌పై వ‌చ్చిన వ‌దంతుల‌కు మ‌రింత ఆజ్యం పోస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల 'జ‌బ‌ర్ద‌స్త్‌'తో పాటు 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'ల నుంచి త‌ప్పుకున్న సుధీర్‌.. స్టార్ మా చాన‌ల్‌లో వ‌రుస షోలు చేసుకుంటూ పోతున్నాడు. మ‌రోవైపు ర‌ష్మీ మాత్రం జ‌బ‌ర్ద‌స్త్‌ను అంటిపెట్టుకొని ఉండిపోయింది. 9 సంవ‌త్స‌రాలుగా పెళ్లిపై స్పందించ‌ని ర‌ష్మీ, ఇప్పుడు 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'లో పెళ్లి గురించి చెప్పి షాకిచ్చింది. ఆ షోలో 'అక్కా! బావెక్క‌డ?' అనే స్పెష‌ల్ ఎపిసోడ్ చేశారు. అందులో "తొమ్మిదేళ్లుగా అడుగుతున్నారు కదా.. ఆ ప్ర‌శ్న‌కు ఈ రోజు ఇప్పుడు స‌మాధానం చెప్ప‌బోతున్నాను. పెళ్లి కుదిరింది" అంటూ చెప్పి ర‌ష్మీ సిగ్గుల మొగ్గ‌యింది ర‌ష్మీ. జూలై 24న ప్ర‌సారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. 

ఏడుకొండలు కామెంట్స్‌.. గెట‌ప్‌ శీను కౌంటర్!

'జబర్దస్త్' గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన రగడ అంతా ఇంతా కాదు. మల్లెమాల సంస్థ మీద అత‌ను ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫుడ్, రెమ్యూనరేషన్ వంటి విషయాల్లో ఆర్టిస్ట్స్ కి అన్యాయం జరిగిందంటూ ఎన్నో విమర్శలు చేశాడు. ఆర్పీ వ్యాఖ్యలని హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఖండించారు. జబర్దస్త్ మాజీ టీమ్ లీడర్ శేషు కూడా ఆర్పీని విమర్శించారు. ఇంత జరుగుతున్నా గెటప్ శీను, సుడిగాలి సుధీర్ మాత్రం ఈ వివాదంపై నోరు విప్పలేదు.  రీసెంట్‌గా ఈ వివాదంలోకి జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఎంట్రీ ఇచ్చి, గెటప్ శీను మీద ఎన్నో కౌంటర్లు వేశారు. జబర్దస్త్ మొదటి నుంచి ఎండింగ్ వరకు జరిగిన విషయాలన్నీ చెప్పారు. "జబర్దస్త్ షో నుంచి కిరాక్ ఆర్పీ వెళ్ళిపోయి నాలుగేళ్లు అవుతోంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి సీనియర్ నిర్మాతను విమర్శించే అర్హత వీడికేముంది?" అంటూ నేరుగా కౌంటర్లు విసిరారు.  జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన సుధీర్, గెటప్ శీనును కూడా ఏడుకొండలు వ‌ద‌ల్లేదు. "మొదట్లో వీళ్ళను జబర్దస్త్ నుంచి ఓంకార్ తీసుకెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు ఆ విషయం మీద వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాలని టీం లీడర్‌ని చేస్తానని ప్రామిస్ చేసాను. గెటప్ శీనుకి కారు ఇచ్చాను. జబర్దస్త్ వదిలి వెళ్లిపోయిన అందరూ మళ్ళీ రావాలి. వాళ్ళు మిగతా ఛానెళ్లలో ఎలా పని చేస్తారో చూస్తాను" అంటూ ఒక ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. "సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇస్తే ఇప్పుడు కనీసం నా ఫోన్ ఎత్తడు. ఒక ఇంటర్వ్యూ లైవ్ లో సుధీర్ కి ఏడుకొండలు ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు".. ఇలా ఆరోపించిన ఏడుకొండలు మాటలకు గెటప్ శీను గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. "నేను జబర్దస్త్ లో చేసిన బిల్డప్ బాబాయ్ పాత్రకు ఇతడే స్ఫూర్తి" అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.

న‌రేశ్‌-ప‌విత్ర‌ను కూడా వదల్లేదుగా ఆది!

శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ఇప్పుడు ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది అనే విషయం అందరికీ తెలుసు. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న అందరూ కూడా ఇప్పుడు ఆ షోలో కనిపించడం, ఇక్కడ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ను టీమ్స్ అందిస్తుండేసరికి ఈ షోకి మంచి పేరు వచ్చింది. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నరేష్-పవిత్ర వ్యవహారంపై వస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మైసూర్ లో ఒక హోటల్ లో ఉన్న నరేష్, పవిత్ర లోకేష్ గురించి పోలీసులను తీసుకెళ్లి డైరెక్ట్ ఎటాక్ ఇచ్చింది న‌రేశ్ మూడో భార్య ర‌మ్య‌. ఈ ఎపిసోడ్‌ను ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో వాడేసుకున్నారు. ఈ షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో అందరూ జోడీలుగా వచ్చారు. నరేష్ క్యారెక్టర్ వచ్చేసరికి, పవిత్ర ముందుకు వచ్చి... నరేష్ కి "నేను ఉన్నాను" అంటుంది. ఇక ఇదే టైంలో ఆది ఎంట్రీ ఇచ్చి పంచ్ వేస్తాడు. "నీ పేరేంటి?" అని ఆది అడిగేసరికి "పవిత్ర" అని ఆన్సర్ ఇస్తుంది. "వాడి పేరు ఏమిటి?" అని అడుగుతాడు ఆది. "నరేష్" అని చెప్తుంది పవిత్ర. ఇంకేముంది అన్నట్టుగా ఆది మొహం పెడతాడు. ఆ డైలాగ్ ఎవరికీ అర్థంకాకుండా పోతుంది. "పవిత్ర, నరేష్" అంటూ పంచ్ ప్రసాద్ క్లారిటీ ఇస్తాడు. దానికి అందరూ పగలబడి నవ్వేస్తారు. మొత్తానికి ఆది.. వాళ్ళను కూడా వదల్లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నువ్వు పసికందువి కావు, కసికందువి.. నిఖిల్‌పై నిహారిక పంచ్‌!

సుమ కనకాల హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం ప్రతీది సందడిగా సాగిపోతుంటుంది. మూవీ ప్రమోషన్స్ కోసం కోసం కూడా నటీనటులు వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు క్యాష్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "హలో వరల్డ్" టీం వచ్చింది. నిహారిక, నిఖిల్, నిత్యాశెట్టి , అనిల్ ఈ షోకి వచ్చేశారు. నిహారిక కోసం తన పేరు మీద సాంగ్ నిహారిక, నిహారిక అనే సాంగ్ ప్లే చేసేసరికి "నా పేరు మీద కూడా ఒక పాట ఉంది" అంది సుమ.  "సుమం ప్రతి సుమం" అనే సాంగ్ ప్లే అయ్యింది. నిహారిక ఈ ఎపిసోడ్ లో డాక్టర్ గా చేసింది. ఈలోపు అనిల్.. డాక్టర్ దగ్గరకు వ‌చ్చాడు. "ప్రాబ్లమ్ ఏమిటి?" అని అడిగేసరికి "నోటి దూల" అన్నాడు నిఖిల్. తర్వాత నిఖిల్ తల్లి పాత్రలో సుమ చేసింది. నిహారిక వచ్చి "ఆంటీ! నిఖిల్ కి ఎవరో ఇష్టం అంట" అని చెప్పింది. "ఊరుకోమ్మా అసలే చిన్నపిల్లాడు. వాడికి అప్పుడే పెళ్ళేంటి?" అంది సుమ. ఇంతలో నిఖిల్ వచ్చి, "అమ్మా! నేనేమీ ఎరుగని పసికందుని" అన్నాడు. "నువ్వు పసికందువి కావు, కసికందువి" అని హాస్య‌మాడింది నిహారిక. "అందుకే కాసుకో నిఖిలు.. కాసుకో నిఖిలు అని పెట్టుకున్నావు" అంది సుమ. సుమరాజ్యంలో శివగామిలా సుమ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సుమ తోటలోని కూరగాయలు తిన్నాడు అనిల్. "పర్మిషన్ లేకుండా తిన్నందుకు నీకు రేపు విరేచనాలు అవుతాయి" అని శాపం పెట్టింది సుమ‌. ఇంతలో వేరే రాజ్యం నుంచి సుమ రాజ్యం మీద దండెత్తడానికి వస్తున్నారంటూ ఒక లేఖ వస్తుంది. ఐతే "దండెత్తడానికి ఇప్పుడు వస్తే నాకు టైం లేదు. నెక్స్ట్ మంత్ డేట్స్ ఇస్తాను, అప్పుడు పెట్టుకోమను" అని పంచ్ వేసింది సుమ‌. ఇలా వచ్చే వారం ఎపిసోడ్ సందడి చేయనుంది.

సౌంద‌ర్య‌, ఆనంద‌రావు వృద్ధాశ్ర‌మం డ్రామా!

సుదీర్ఘ‌ కాలంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న టాప్ సీరియ‌ల్‌ 'కార్తీక దీపం' మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒక‌సారి చూద్దాం. హిమ అన్న మాట‌ల గురించి నిరుప‌మ్ ఆలోచిస్తూ వుంటాడు. ఇంత‌లో అక్క‌డికి స్వ‌ప్న వ‌స్తుంది. ఏం ఆలోచిస్తున్నావ‌ని అడుగుతుంది. "నేను గేమ్ గురించి ఆలోచించినా అది నీకు చెప్పాలా మమ్మీ" అంటాడు. దీంతో సీరియ‌స్ అయిన స్వ‌ప్న నీ పెళ్లికి అంగీక‌రించి త‌ప్పుచేశాన‌ని అంటుంది. ఆ మాట‌ల‌కు వెంట‌నే నిరుప‌మ్ సీరియ‌స్ అవుతాడు. క‌ట్ చేస్తే.. శౌర్య‌ ద‌గ్గ‌రికి వెళ్లిన ఆనంద‌రావు భోజ‌నానికి ర‌మ్మ‌ని పిల‌వ‌గా "నాకు ఆక‌లిగా లేదు మీరు వెళ్లండి" అంటుంది. అదే త‌ర‌హాలో సౌంద‌ర్య‌కు హిమ చెప్ప‌డంతో ఆనంద‌రావు, సౌంద‌ర్య ఇద్ద‌రు క‌లిసి శౌర్య‌, హిమ‌ల గురించి ఆలోచిస్తూ వుంటారు. ఇలా కాద‌ని ఇద్ద‌రం క‌లిసి వృద్ధాశ్ర‌మానికి వెళ్లిపోతున్న‌ట్టుగా డ్రామా ఆడితే స‌రి అని ప్లాన్ చేస్తారు. అదే విష‌యాన్ని హిమ‌, శౌర్యల‌కు చెప్ప‌డంతో షాక్ అవుతారు. అయితే ఆ ఇద్ద‌రిని హిమ‌, శౌర్య వెళ్ల‌డానికి వీళ్లేద‌ని ఆపేస్తారు. దీంతో "మీరు భోజ‌నం చేయ‌రు, మ‌మ్మ‌ల్ని చేయ‌నివ్వ‌రు" అని సౌందర్య అన‌డంతో "స‌రే మీరు చెప్పిన‌ట్టే చేస్తాం" అని హిమ‌, శౌర్య చెబుతారు. దీంతో అంతా క‌లిసి భోజ‌నం చేయ‌డానికి సంతోషంగా లోప‌లికి వెళ‌తారు. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్ గురించి ఆలోచిస్తూ వుంటుంది శోభ‌. ఇంత‌లో బ్యాంక్ మేనేజ‌ర్ ఫోన్ చేస్తాడు. లోన్ క‌ట్ట‌క‌పోతే హాస్పిట‌ల్ ని సీజ్ చేస్తామ‌ని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఎలా చేయాలా? అని శోభ టెన్ష‌న్ ప‌డుతూ వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

కైలాష్ బండారం బ‌య‌ట‌పెట్టిన య‌ష్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం` సీరియల్‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో మ‌హిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. మంగ‌ళ వారం ఎంపిసోడ్ విశేషాలేంటో తెలుసుకుందాం. వేద‌కు జ‌రిగిన అవ‌మానాన్నితిప్పికొట్టి త‌న నిజాయితీని నిరూపించాలంటే కైలాష్ కి గుణ‌పాఠం చెప్ప‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని భావించిన య‌ష్ ఆ వైపుగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు. కైలాష్ ఫోన్ ని వాడి సారిక‌కు మెసేజ్ చేస్తాడు. అది నిజ‌మే అని న‌మ్మిన సారిక మెసేజ్ లో చెప్పిన చోటుకి వ‌చ్చేస్తుంది. య‌ష్ రావ‌డంతో ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. వేద‌కు వ్య‌తిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పావ‌ని, అలా చేయ‌డానికి కార‌ణం ఏంట‌ని సారిక‌ని నిల‌దీస్తాడు య‌ష్‌. నీకు అన్ని విధాలుగా నేను అండ‌గా వుంటాన‌ని, కైలాష్ కి వ్య‌తిరేకంగా గ‌ట్టిగా నిల‌బ‌డాలి అంటాడు. అందుకు సారిక అంగీక‌రిస్తుంది. క‌ట్ చేస్తే వేద అక్క స‌డ‌న్ గా ఇంటికొచ్చి జ‌రిగిన విష‌యం తెలుసుకుని కైలాష్ ని న‌రికేస్తానంటూ ఊగిపోతుంది. వాడిని కోర్టుకీడ్చి బుద్ధి చెబుదామంటుంది. ఈ మాట‌ల‌న్నీ చాటుగా విన్న కాంచ‌న వెంట‌నే వెళ్లి త‌ల్లి మాలినికి చెబుతుంది. ఇక కైలాష్ త‌న గురించి య‌ష్ కి అనుమానం వ‌చ్చిందంటే చంపేస్తాడ‌ని, అర్జెంట్ గా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. కాంచ‌న వ‌చ్చే స‌రికి డ్రామా మొద‌లు పెడ‌తాడు. ఇద్ద‌రు క‌లిసి బ్యాగ్స్ స‌ర్దుకుని వెళ్ల‌బోతుంటే య‌ష్ ఎంట్రీ ఇస్తాడు. స్వ‌యంగా నేనే మిమ్మ‌ల్ని సాగ‌నంపుతాన‌ని చెప్పాను క‌దా? మీకు ఎందుకు ఇంత తొంద‌ర? అంటూనే స్పెష‌ల్ ప‌ర్స‌న్ వ‌చ్చార‌ని చెప్పి సారిక‌ని పిలుస్తాడు. త‌న‌ని చూడ‌టంతో కైలాష్ కి ద‌డ‌మొద‌ల‌వుతుంది.  త‌రువాత ఏం జ‌రిగింది? అంద‌రికి కైలాష్ గురించి తెలిసిపోయిందా? అనేది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

కాబోయే వాడిని ప‌రిచ‌యం చేసి షాకిచ్చిన జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ!

గ‌త కొన్ని రోజులుగా కిరాక్ ఆర్పీ కార‌ణంగా నెట్టింట వైర‌ల్ గా మారిన కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. టీమ్ లీడ‌ర్ల విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిన ఈ షోలో మ‌హిళా కంటెస్టెంట్ లు కూడా భారీ స్థాయిలోనే వున్నారు. శాంతి స్వ‌రూప్ లాంటి వాళ్ల త‌ర‌హాలో లేడీ గెట‌ప్ లు వేసే వాళ్లువున్నా మ‌హిళా కంటెస్టెంట్ లు కూడా చాలా మందే వున్నారు. స‌త్య‌శ్రీ‌, వ‌ర్ష‌, రోహిణి, ఫైమా లాంటి వాళ్లు ఆటో రాంప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, బుల్లెట్ భాస్క‌ర్ త‌ర‌హాలో కామెడీ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. సీరియ‌ల్స్ లో న‌టిస్తున్న రీతూ చౌద‌రి కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన స్టైల్లో కామెడీ స్కిట్ లు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. హైప‌ర్ ఆదితో క‌లిసి స్కిట్ లు చేస్తూ వస్తున్న రీతూ చౌద‌రి త్వ‌ర‌లో జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ కు షాకివ్వ‌బోతోంది. బుల్లితెర‌పై ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మ‌కోసం వంటి సీరియ‌ల్స్ లో న‌టించిన రీతూ చౌద‌రి అక్క‌డ బిజీగా వుంటూనే జ‌బ‌ర్ద‌స్త్ షోలోనూ పాల్గొంటోంది. టైమ్ చిక్కిప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్ అవుతూ వ‌స్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ తో వ్య‌క్తిగ‌త విష‌యాల‌ని వెల్ల‌డించే రీతూ చౌద‌రి తాజాగా త‌నకు కాబోయే వాడిని ప‌రిచ‌యం చేసి షాకిచ్చింది. నీ బంధం కంటే విలువైన‌ది ఏదీ లేదంటూ కామెంట్ చేసింది. త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ని అభిమానుల‌కు షేర్ చేసింది. అత‌ని పేరు శ్రీ‌కాంత్‌. రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన వ్య‌క్తిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పెళ్లితో రీతూ జ‌బ‌ర్ద‌స్త్‌కి గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మ‌ని, త‌న వ‌ల్ల జ‌బ‌ర్ద‌స్త్ కు మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

జ‌బ‌ర్ద‌స్త్.. ఇంద్ర‌జ పెళ్లికి అతిథులు 13 మందేన‌ట‌!

సుడిగాలి సుధీర్‌, కిరాక్ ఆర్పీ కార‌ణంగా జ‌బ‌ర్ద‌స్త్ షో కాస్తా గ‌త కొన్ని రోజులుగా ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆర్పీ విమ‌ర్శ‌ల‌కు హైప‌ర్ ఆదితో పాటు ఆటో రాంప్ర‌సాద్ కౌంట‌ర్లు ఇస్తూ వ‌చ్చారు. తాజాగా ఈ షో మాజీ మేనేజ‌ర్ కిరాక్ ఆర్పీతో పాటు సుడిగాలి సుధీర్ ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ షో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. ఇదిలా వుంటే ప్ర‌తీ గురువారం అంద‌ర్నీ న‌వ్విస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్. గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని ఈ షో విశేషంగా ఆక‌ట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంటోంది. తాజా ఎపిసోడ్ కోసం స‌రికొత్త స్కిట్ల‌తో సిద్ధ‌మైంది. ఈ నెల 21న ఈటీవీలో ప్ర‌సారం కానున్నఈ షోకు సంబంధించిన తాజా ప్రోమోని రీసెంట్ గా విడుద‌ల చేశారు. ఈ ఎపిసోడ్ లో క‌మెడియ‌న్ వెంకీ వైఫ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగిందో తాజా ఎపిసోడ్ లో చెప్పేశారు. ఇక ఇదే వేదిక‌పై త‌న‌ది ప్రేమ పెళ్ల‌ని చెప్పిన వెంకీ ఆ వెంట‌నే ఇంద్ర‌జ పెళ్లి గురించి అడిగాడు. మీది అరేంజ్ మ్యారేజా లేక ల‌వ్ మ్యారేజా అని అడిగితే ఇంద్ర‌జ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించింది. మాది ల‌వ్ మ్యారేజ్ అని, పెళ్లికి కేవ‌లం 13 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని, పెళ్లికి అయిన ఖ‌ర్చు 7,500 మాత్ర‌మేన‌ని చెప్పి షాకిచ్చింది. ఇదే సంద‌ర్భంగా మ‌నో పెళ్లి గురించి అన‌సూయ అడ‌గ‌డంతో ఆయ‌న కూడా త‌న పెళ్లిగురించి చెప్పేశారు. త‌ను చిన్న వ‌య‌సు నుంచే సంపాదించ‌డం మొద‌లు పెట్టాన‌ని, అందుకే త‌న‌కు 19 ఏళ్ల వ‌య‌సులోనే పెళ్లి చేశార‌ని చెప్పేశాడు. ఈ నెల 21న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.

నేను సుధీర్‌కు లైఫ్ ఇచ్చాను.. కానీ అత‌ను నేను ఫోన్ చేస్తే..

జబర్దస్త్ షో రచ్చ మాములుగా లేదు. ఆర్పీ మాట్లాడిన మాటలు ఇప్పుడు కార్చిచ్చులా రగులుతూ జబర్దస్త్ వేదికను తగలబెడుతున్నాయి. ఇప్పటివరకు ఆర్పీకి, కొందరి సీనియర్ కమెడియన్స్, ప్రొడ్యూసర్స్ కి మధ్య జరిగిన వాదోపవాదాలు విన్నాం. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో స్టార్టింగ్ లో మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు మీడియా ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. "ఆర్పీ షోని వదిలేసి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్?" అని అడిగారు. మల్లెమాలలో ఫుడ్ బాగుంటుంది, పేమెంట్ కూడా రెగ్యులర్ గా టైంకి ఇచ్చేస్తారని చెప్పుకొచ్చాడు. ఇదే ఇంటర్వ్యూలో సుధీర్, శీనుపై కూడా ఏడుకొండలు ఆరోపణలు చేశారు. "నేను సుధీర్ కి లైఫ్ ఇచ్చాను. ఇప్పుడు ఇంతలా ఎదగడానికి కారణం నేను. కానీ నేను ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. శీను బయటకి వెళ్లి షోస్ చేయలేడు.. వీళ్లందరి సంగతి నాకు బాగా తెలుసు" అన్నాడు ఏడుకొండలు. ఐతే ఇంత రచ్చకు అసలు కారణం.. షో నుంచి నాగబాబు బయటికి వచ్చేస్తూ ఒకప్పుడు ఆయన కూడా ఇవే మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆర్పీ ఆ మాటలకు ఆజ్యం పోసేసరికి వెనక నుంచి అంతా నడిపిస్తోంది నాగబాబు అని అనుకుంటున్నారంతా.  సుధీర్, ఆది, శీను, రోజా ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోయేసరికి జబర్దస్త్ కళ చాలావ‌ర‌కు తగ్గిపోయింది. మరి ఈ రచ్చ మొత్తాన్ని వెనక ఉండి గమనిస్తున్న నాగబాబు రంగంలోకి దిగుతారా లేదా నాకెందుకులే అని వదిలేసి ఆయన పని ఆయన చూసుకుంటారా ? ఏమో ఇదొక అంతు తేలని ప్రశ్న.

'పాప' పేరు వెనుక క‌థ‌!

రెజీనా కసాండ్రా పేరు కొంచెం పెద్దదే  కానీ చేసిన సినిమాలే చాలా తక్కువ. నటించింది కొన్ని మూవీస్ లోనే ఐనా రెజీనా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. అలీతో సరదాగా షోకి వచ్చి ఎన్నో విషయాలను పంచుకుంది రెజీనా. ఇటీవల 'అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్‌లో నటించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. త‌న‌ని ఇప్పటికి కూడా అందరు 'పాప' అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఈ పాప అనే పేరు వెనుక ఉన్న స్టోరీ కూడా చెప్పింది. త‌మిళ చిత్రం 'కేడీ బిల్లా కిలాడీ రంగా'లో శివ కార్తికేయన్ తో కలిసి నటించినట్లు తెలిపిన ఆమె, ఈ మూవీలో తన పాత్ర పేరు పాప అనీ, ఈ మూవీలో తన పాత్ర మంచి ఫేమస్ అయ్యేసరికి ఆ పాత్ర పేరుతోనే త‌న‌ను పిలుస్తున్నార‌నీ చెప్పుకొచ్చింది. ఇక అమ్మ క్రిస్టియన్, నాన్న ముస్లిం అనీ, రెజీనా పేరుకు అమ్మ కసాండ్ర అని జత చేసిందనీ చెప్పింది. తన ఆరేళ్ళ వయసులో అమ్మ నాన్న ఇద్దరూ  డివోర్స్ తీసుకున్నారని వెల్ల‌డించింది. రెజీనా ఫస్ట్ మూవీ త‌మిళంలో వ‌చ్చిన 'కంద నాళ్‌ ముదు'. అదే తెలుగులో 'శివ మ‌న‌సులో శ్రుతి' (ఎస్సెమ్మెస్)గా వచ్చింది. అందులో రెజీనా హీరోయిన్ గా నటించింది. అలాగే కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మూవీస్ లో కూడా నటించింది రెజీనా. తనది మొదటి నుంచి డామినేటింగ్ మనస్తత్వం అట. ఎవరితో అయినా తనకు ఇబ్బంది వస్తే మాత్రం అస్సలు ఊరుకోన‌ని కూడా చెప్పింది. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే  తనకు దోశ‌ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఎక్కువగా రొమాంటిక్ నావెల్స్ ని చదవడం అంటే ఇష్టమట రెజీనాకు. అంతేకాదు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ చాలా ఇష్టమైన హీరోస్ అని, అలాగే రజనీకాంత్ తనకు ఆల్ టైం ఫేవరెట్ అని తన మనసులో మాట చెప్పింది. నటనకు  ప్రిఫెరెన్సు ఇచ్చే రాజమౌళి డైరెక్షన్ అంటే ఇష్టమట. ఛాన్స్ వస్తే ఆయన మూవీలో యాక్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.

కామెంట్ల బురదలో ఇరుక్కుపోయిన జబర్దస్త్

జబర్దస్త్ కమెడియన్స్ చేస్తున్న రచ్చకు బుల్లి తెర షేక్  ఐపోతోంది. కిర్రాక్ ఆర్పీ చేస్తున్న వ్యాఖ్యలు మిగతా వాళ్ళు చేస్తున్న ఖండనలు చూస్తుంటే ఎవరి వాదన కరెక్ట్ అనే విషయం మాత్రం ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాత చిట్టిబాబు కిర్రాక్ ఆర్పీ మీద విరుచుకుపడ్డారు. జబర్దస్త్ లోపల అసలేం జరుగుతోంది అనే విషయాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటే  ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. మల్లెమాలను, జబర్దస్త్ ని, షేకింగ్ శేషుని, శ్యాంప్రసాద్ రెడ్డిని ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు ఆర్పీ. ఈ కామెంట్స్ అన్నిటికీ బ్రేక్ వేస్తూ  ఇంకొంతమంది సీనియర్ కమెడియన్స్ రంగంలోకి దిగి ఆర్పీకి కౌంటర్ అటాక్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆర్పీ మీద వ్యక్తిగత దూషణకు దిగారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు. "ఒక అడ్రస్ లేనివాడికి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది.  ఆర్పీ తినేది అసలు అన్నమేనా" అంటూ చాల ఘాటుగా స్పందించారు."ఆర్పీ నమ్మకద్రోహి" అంటూ ఒక వీడియో కూడా చూపించాడు. టాలెంట్ ఉన్నా  అవకాశాలు లేక బోల్డు మంది బయట ఉన్నారు. "జబర్దస్త్ అనే వేదిక అలాంటి వాళ్లకు ఎంతో చేసింది. ఈ వేదిక అనేదే లేకపోతే ఆర్పీ ఎవడో ఎవరికీ తెలిసేదే కాదు అన్నారు. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఒక పేరు , గుర్తింపు వచ్చేసింది కాబట్టి తనకు లైఫ్ ఇచ్చిన వేదికను ఎన్నైనా తిట్టొచ్చు" అన్నారు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఆర్పీ కామెంట్స్ వింటున్న  సీనియర్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా వచ్చి వేరే వేరే వేదికలపై ఖండించడం చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్ల నుంచి మచ్చ లేని జబర్దస్త్ పై ఇప్పుడు ఇలా బురద జల్లడం అవసరమా అంటూ కూడా కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు.  

ఆర్పీ చెప్పినవన్నీ నిజాలే.. అబద్ధాలు కావు!

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడు ఆ షో గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు కిర్రాక్ ఆర్పీ. మల్లెమాల ఎవరికీ సహాయం చేయదు అని అక్కడ ఫుడ్ సరిగా పెట్టరు అని, పేమెంట్ రెగ్యుల‌ర్‌గా ఇవ్వరని.. ఇలా ఎన్నో కామెంట్స్ వింటూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు ఆర్పీ చేసిన కామెంట్స్ కి మద్దతు ఇస్తున్నారు రాకేష్ మాస్టర్. మల్లెమాలలో తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బులెట్ భాస్కర్ కోరిక మేరకు పిలిస్తే అతని టీమ్ లో చేశానని చెప్పారు. ఆయన టీం మెంబెర్స్ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారని, భోజనాన్ని స్వయంగా ఆయనే  తీసుకొచ్చేవారని కూడా తెలిపారు. కానీ ఒక సందర్భంలో భాస్కర్ లేకపోయేసరికి తాను కూడా అందరి లాగే భోజనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. అక్కడ భోజనం అస్సలు బాగోదంటూ ఆరోపించిన ఆర్పీ మాటలు నిజమే అన్నారు రాకేష్ మాస్టర్. భాస్కర్ అక్కడి భోజనం బాగోకపోవడం వల్లనే బయటి నుంచి తనకు, తన టీమ్ మెంబర్స్‌కు తెప్పించేవాడని చెప్పారు. "మల్లెమాలలో భోజనాలు బాగుంటే బయటినుంచి తెప్పించుకోరు కదా" అన్నారు.  ఇదే కాకుండా ఇంకొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రాకేశ్ మాస్ట‌ర్‌. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ వాళ్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, ఎప్పుడూ ఒకరో ఒక అమ్మాయితో ఎకసెక్కాలు చేస్తూనే ఉంటారని కూడా కామెంట్ చేశారు. జబర్దస్త్ డైరెక్టర్ వస్తే అందరూ లేచి నిలబడాలి అన్నారు మాస్టర్. ఇకపోతే "ఆర్పీ చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు ఎంత మాత్రం కావు" అంటూ సపోర్ట్ చేశారు.

వాళ్లకు అస్సలు పెళ్లి అవదు.. తేల్చేసిన శీను

సుడిగాలి సుధీర్, రష్మీ గౌత‌మ్ జోడి స్మాల్ స్క్రీన్ మీద ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు. జబర్దస్త్ మొదలైన కొంత కాలం తర్వాత వీళ్లు చేసే  స్కిట్స్ ద్వారా వీళ్ళ మధ్యన ఏదో ఉంది అన్న భ్రమను కలిగించారు నిర్వాహకులు. అసలు రష్మీ, సుధీర్ మధ్యన ఏముంది అనేది ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే ఆడియన్స్ కి. ఐతే ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద గెటప్ శీను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్, రష్మీ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ మధ్యన ఏమీ లేదని ఓవైపు చెప్తూ కూడా ఇంకోవైపు ఏదో ఉంది అనుకునేలా క్రియేట్ చేస్తున్నారు. వీళ్లకు పెళ్ళైనట్లు కూడా చూపించేశారు. ఇక స్క్రీన్ మీద వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే మాత్రం నిజమైన లవర్స్ అనే అనుమానం రాకుండా ఉండదు. అందుకే 'ఇద్దరికీ పెళ్లెప్పుడూ?' అంటూ సోషల్ మీడియాలో  చాలా  మంది పెట్టే కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. ఐతే "సుధీర్, రష్మీ ఎప్పటికీ పెళ్లి చేసుకోరు. ఎందుకంటే సుధీర్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి అయ్యాక ఎవరి లోకం వారిది అన్నట్టుగా వెళ్ళిపోతారు. తెరపైన కామెడీని పండించడానికి లవర్స్ ముసుగు తొడుక్కుంటారంతే" అని అన్నాడు శీను.  సుధీర్ తర్వాత శీను కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇక ఇప్పుడు రాంప్రసాద్ మాత్రమే జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూ అలరిస్తున్నాడు. అలాగే "జబర్దస్త్ టీం మెంబెర్స్ తమకు వచ్చే రెమ్యూనిరేషన్ నుంచి ఏదో ఒక సేవ కార్యక్రమానికి కొంత డబ్బును ఖర్చు చేస్తాం" అని చెప్పుకొచ్చాడు శీను.

మ్యాజిక్ చేయబోతున్న ‘అంటే సుధీర్ కి’

జబర్దస్త్ వేదిక ద్వారా మస్త్ ఫేమస్ ఐన సుధీర్ ఆ షోని వదిలి వచ్చేసాక వరుసగా షోస్ చేస్తున్నాడు. మరో వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. జబర్దస్త్ షోలో రష్మీతో కూడా ఆన్ స్క్రీన్ ప్రేమను పండించి మంచి పేరును తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు కూడా. లేడీ ఫాన్స్ కూడా బాగా ఎక్కువయ్యారు సుధీర్ కి . ప్రస్తుతం సూపర్ సింగర్ జూనియర్స్ కి హోస్ట్ గా చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు పార్టీ చేద్దాం పుష్పకి కూడా హోస్ట్ గా చేసాడు సుధీర్. ఐతే ఇప్పుడు స్టార్ మాలో కొత్త షో ఒకటి మొదలు కాబోతోంది. దాని పేరు "అంటే సుందరానికి" అని పెట్టారు.  నాని నటించిన మూవీ పేరునే ఈ షోకి పెట్టారు. ఈ షో స్టార్ మా లో  17 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12  గంటలకు ప్రసారం కాబోతోంది. దీనికి సంబందించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో సుధీర్ ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. యువరాజు గెటప్ లో అమ్మాయిలతో ఆడిపాడాడు..యువరాణులను తన స్టైల్ తో మెప్పించాడు. ఇందులో ఎక్స్ప్రెస్  హరి, ముక్కు అవినాష్, రోహిణి , అరియనా కూడా కనిపించారు. ఈ ప్రోమోలో అమ్మాయిలతో కలిసి ఉట్టి కొడతాడు సుధీర్. యువరాణులకు బాణాలు ఎక్కుపెట్టి విలు విద్య  కూడా నేర్పిస్తున్నట్టు కనిపిస్తాడు. ఇప్పుడు ఈ షోతో మరొకసారి మ్యాజిక్ చేయబోతున్నాడు సుడిగాలి. ఇక ఇప్పుడు మూవీస్ పరంగా వాంటెడ్ పండుగాడ్, పట్టుకుంటే కోటి వంటి మూవీస్ తో అలరించబోతున్నాడు. అలాగే గాలోడు సినిమా కూడా చేసాడు సుధీర్.

సుమ కనకాల...రాజీవ్ వెనకాల అన్న అవినాష్

ఇస్మార్ట్ బోనాలు పేరుతో స్టార్ మాలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఇందులో సుమ హోస్ట్ గా చేసింది. ఇక ఇప్పుడు ఈ ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినాష్, రవికృష్ణ, బాబా భాస్కర్, బుల్లి తెర జంటలు ఎంతో మంది ఈ షోలో కనిపించబోతున్నారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఈ స్టేజి మీద అందంగా మెరిసింది. అవినాష్ కి రెడ్ ఫ్లవర్ ఇస్తుంది నేహా. అవినాష్ బ్యాక్ డ్రాప్ లో ఫీల్ మై లవ్ సాంగ్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అవినాష్ ఊహలకు బ్రేక్ వేస్తూ "బ్రో" అంటుంది నేహా. అంతే ఒక్కసారి షాక్ ఐపోతారంతా.. ఈ ఎపిసోడ్ లో అవినాష్ పేరు ఎగ్గొట్టం నిఖిల్ పేరు పొగ్గొట్టం అని పరిచయం చేసుకుంటారు.  మీ పేరేంటి అని అడిగేసరికి సుమ గొట్టం అని చెప్తుంది. ఛీఛీ సారీ కాదు సుమ కనకాల అని చెప్తుంది. ఇక వెంటనే అవినాష్ " సుమ కనకాల, రాజీవ్ వెనకాల" అంటూ ఫన్ చేస్తాడు. హా ఆ తర్వాత నీకు వణకాల కంటూ సుమ కౌంటర్ ఎటాక్ చేస్తుంది. ఇక నిఖిల్  అమరదీప్ ని పరిచయం చేస్తాడు నేహాసెట్టికి . వెనక నుంచి అవినాష్ అందుకుని పెళ్లయింది కానీ ఇంకా శోభనం కాలేదు అంటాడు. ఆ మాటకు నేహా సిగ్గు పడుతుంది. పరంపర సీజన్ 2  జులై 21  st రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సిరీస్  ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర జంట కూడా ఈ షోలో మెరుస్తారు. బోనాల షోకి బాబా భాస్కర్ రెగ్యులర్ గా వచ్చే పంచెతో కాకుండా స్టైల్ గా ఫ్యాన్టు షర్టు వేసుకొచ్చాడు.. "నా పేరు భాస్కర్..నా ఊరు గొట్టం" అని సుమ దగ్గర పరిచయం చేసుకుంటాడు. అదేంటి గొట్టం అని మీకు కదా పెట్టాలి ఊరికి పెట్టారేమిటి అంటుంది సుమ..ఇక ఇలా ఈ వారం బోనాల స్పెషల్ షోతో జులై 17 న సాయంత్రం 6 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

ఎంతపని చేశారు మనో గారు...

జబర్దస్త్ వారం వారం సరికొత్తగా ముస్తాబౌతు వస్తోంది. ఐతే ఇప్పుడు వచ్చే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎన్నో ప్రేమ విషయాలను పంచుకున్నారు జడ్జెస్, కమెడియన్స్. చలాకి చంటి, వెంకీ మంకీ ఇద్దరూ కలిసి మంచి స్కిట్స్ పెర్ఫామ్ చేసి అందరిని హూషారెత్తించారు. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటి అంటే వెంకీ మంకీ తన టీమ్ మేట్ గా తన వైఫ్ నే తీసుకొచ్చి స్కిట్ వేసాడు. "ఎన్నెన్నో జన్మల బంధం" సాంగ్ కి డాన్స్ వేశారు ఇద్దరూ. ఆ తర్వాత వెంకీని  తన వైఫ్ అడుగుతుంది "స్కిట్ లో అందరిని పట్టుకుని డాన్స్ చేస్తావ్. మరి నన్ను పట్టుకుని డాన్స్ చేయడానికి నీకు బాదేంటి" అని అడుగుతుంది. "అంటే వాళ్ళు మళ్ళీ దొరకరు కదా" అంటాడు "చూస్తున్నా ఈ మధ్య స్కిట్ లో కొత్త కొత్త అమ్మాయిలను తెస్తున్నారట" అని నిలదీస్తుంది.  "అంటే వాళ్లకు పేరు తీసుకొద్దామని" అంటూ కవర్ చేసుకుంటాడు. స్కిట్ ఐపోయాక ఇంద్రజ అడుగుతుంది వెంకీ మంకీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అని..లవ్ మ్యారేజ్ అని, తన భార్య కూచిపూడి డాన్సర్ అని, తానొక మిమిక్రి ఆర్టిస్ట్ అని చెప్తాడు. ముందుగా తన భార్యకు తానే ప్రొపోజ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే స్కిట్ లో తన ఇద్దరి పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేసాడు. వెంటనే వెంకీ కూడా ఇంద్రజాని లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతాడు. లవ్ మ్యారేజ్ అని తన పెళ్ళికి 7500  ఖర్చుతో కేవలం 13 మంది మధ్యలో పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చారు. తర్వాత మను ని కూడా అదే విషయం అడిగేసరికి తాను సంపాదిస్తున్నాని 19 ఏళ్లకే ఇంట్లో పెళ్లి చేసేశారని చెప్పారు. ఐతే మీది బాల్య వివాహమా అంటూ అనసూయ సెటైర్ వేసింది. అనసూయ పెళ్లి టాపిక్ వచ్చేసరికి నాది మొత్తం తెరిచిన పుస్తకం అంటూ నవ్వేసింది.  

అసలు మీరు మనుషులా, రాక్షసులా?.. మండిప‌డిన ర‌ష్మీ!

రష్మీ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలంటే తనకు ఎంతో ఇష్టం కూడా. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కుక్క బాధపడడం చూసిందంటే చాలు.. దానికి సేవ‌చేసి, వెంటనే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టేస్తుంది. అంత ఇష్టం అన్నమాట. ఇప్పుడు అలాంటిదే ఒక పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ మనసు ఈ విషయంలో మాత్రం చాలా గొప్పదని చెప్పొచ్చు. వీధి కుక్కలకు  తోచినంత ఫుడ్ పెడుతుంది. వాటికి అవసరమైతే షెల్టర్ కోసం ట్రై చేస్తుంది. ఐతే కొంత మంది యజమానులు కుక్కల్ని ఇంట్లో పెంచుకుని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడవి వర్షానికి తడుస్తూ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. 24 గంటల్లో నాలుగు జాతులకు చెందిన కుక్కల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడంపై ఆమె ఆగ్ర‌హించింది. "కుక్కతో ఎమోషనల్ బాండింగ్ ఎంతో గొప్పది. అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది కొంచెం కూడా జాలి, దయ, శ్రద్ద లేదా" అంటూ మండిపడింది. ఎవరైతే తమ పెంపుడు కుక్కల్ని వదిలి వెళ్లిపోయారో వాళ్ళను కర్మ వెంటాడుతూ ఉంటుందని హెచ్చరించింది.  "మీ పిల్లలు కూడా రేపు మిమ్మల్ని అలా రోడ్డు పాల్జేస్తే ఎలా ఉంటుంది?" అనే పోస్ట్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టింది రష్మీ. ఇక ఏదో తనకు తోచినంతలో హైదరాబాద్, వైజాగ్ లో ఫ్రీ పెట్ డాగ్ రెస్క్యూ వాన్స్ ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. అలాగే ఈ స్టేటస్ తో పాటు మరో స్టేటస్ కూడా పెట్టింది. గంగానది వరదల్లో మావటి ప్రాణాలను కాపాడిన ఏనుగును అతడు ములుగర్రతో బాధించడంపై రష్మీ బాధపడింది. ఇలా రష్మీ మూగ జీవాల సంరక్షణకై నిత్యం పోరాడుతూ ఉండ‌టాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.