వాళ్లకు అస్సలు పెళ్లి అవదు.. తేల్చేసిన శీను

సుడిగాలి సుధీర్, రష్మీ గౌత‌మ్ జోడి స్మాల్ స్క్రీన్ మీద ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు. జబర్దస్త్ మొదలైన కొంత కాలం తర్వాత వీళ్లు చేసే  స్కిట్స్ ద్వారా వీళ్ళ మధ్యన ఏదో ఉంది అన్న భ్రమను కలిగించారు నిర్వాహకులు. అసలు రష్మీ, సుధీర్ మధ్యన ఏముంది అనేది ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే ఆడియన్స్ కి. ఐతే ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద గెటప్ శీను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్, రష్మీ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ మధ్యన ఏమీ లేదని ఓవైపు చెప్తూ కూడా ఇంకోవైపు ఏదో ఉంది అనుకునేలా క్రియేట్ చేస్తున్నారు. వీళ్లకు పెళ్ళైనట్లు కూడా చూపించేశారు. ఇక స్క్రీన్ మీద వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే మాత్రం నిజమైన లవర్స్ అనే అనుమానం రాకుండా ఉండదు. అందుకే 'ఇద్దరికీ పెళ్లెప్పుడూ?' అంటూ సోషల్ మీడియాలో  చాలా  మంది పెట్టే కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. ఐతే "సుధీర్, రష్మీ ఎప్పటికీ పెళ్లి చేసుకోరు. ఎందుకంటే సుధీర్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి అయ్యాక ఎవరి లోకం వారిది అన్నట్టుగా వెళ్ళిపోతారు. తెరపైన కామెడీని పండించడానికి లవర్స్ ముసుగు తొడుక్కుంటారంతే" అని అన్నాడు శీను.  సుధీర్ తర్వాత శీను కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇక ఇప్పుడు రాంప్రసాద్ మాత్రమే జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూ అలరిస్తున్నాడు. అలాగే "జబర్దస్త్ టీం మెంబెర్స్ తమకు వచ్చే రెమ్యూనిరేషన్ నుంచి ఏదో ఒక సేవ కార్యక్రమానికి కొంత డబ్బును ఖర్చు చేస్తాం" అని చెప్పుకొచ్చాడు శీను.

మ్యాజిక్ చేయబోతున్న ‘అంటే సుధీర్ కి’

జబర్దస్త్ వేదిక ద్వారా మస్త్ ఫేమస్ ఐన సుధీర్ ఆ షోని వదిలి వచ్చేసాక వరుసగా షోస్ చేస్తున్నాడు. మరో వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. జబర్దస్త్ షోలో రష్మీతో కూడా ఆన్ స్క్రీన్ ప్రేమను పండించి మంచి పేరును తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు కూడా. లేడీ ఫాన్స్ కూడా బాగా ఎక్కువయ్యారు సుధీర్ కి . ప్రస్తుతం సూపర్ సింగర్ జూనియర్స్ కి హోస్ట్ గా చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు పార్టీ చేద్దాం పుష్పకి కూడా హోస్ట్ గా చేసాడు సుధీర్. ఐతే ఇప్పుడు స్టార్ మాలో కొత్త షో ఒకటి మొదలు కాబోతోంది. దాని పేరు "అంటే సుందరానికి" అని పెట్టారు.  నాని నటించిన మూవీ పేరునే ఈ షోకి పెట్టారు. ఈ షో స్టార్ మా లో  17 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12  గంటలకు ప్రసారం కాబోతోంది. దీనికి సంబందించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో సుధీర్ ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. యువరాజు గెటప్ లో అమ్మాయిలతో ఆడిపాడాడు..యువరాణులను తన స్టైల్ తో మెప్పించాడు. ఇందులో ఎక్స్ప్రెస్  హరి, ముక్కు అవినాష్, రోహిణి , అరియనా కూడా కనిపించారు. ఈ ప్రోమోలో అమ్మాయిలతో కలిసి ఉట్టి కొడతాడు సుధీర్. యువరాణులకు బాణాలు ఎక్కుపెట్టి విలు విద్య  కూడా నేర్పిస్తున్నట్టు కనిపిస్తాడు. ఇప్పుడు ఈ షోతో మరొకసారి మ్యాజిక్ చేయబోతున్నాడు సుడిగాలి. ఇక ఇప్పుడు మూవీస్ పరంగా వాంటెడ్ పండుగాడ్, పట్టుకుంటే కోటి వంటి మూవీస్ తో అలరించబోతున్నాడు. అలాగే గాలోడు సినిమా కూడా చేసాడు సుధీర్.

సుమ కనకాల...రాజీవ్ వెనకాల అన్న అవినాష్

ఇస్మార్ట్ బోనాలు పేరుతో స్టార్ మాలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఇందులో సుమ హోస్ట్ గా చేసింది. ఇక ఇప్పుడు ఈ ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినాష్, రవికృష్ణ, బాబా భాస్కర్, బుల్లి తెర జంటలు ఎంతో మంది ఈ షోలో కనిపించబోతున్నారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఈ స్టేజి మీద అందంగా మెరిసింది. అవినాష్ కి రెడ్ ఫ్లవర్ ఇస్తుంది నేహా. అవినాష్ బ్యాక్ డ్రాప్ లో ఫీల్ మై లవ్ సాంగ్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అవినాష్ ఊహలకు బ్రేక్ వేస్తూ "బ్రో" అంటుంది నేహా. అంతే ఒక్కసారి షాక్ ఐపోతారంతా.. ఈ ఎపిసోడ్ లో అవినాష్ పేరు ఎగ్గొట్టం నిఖిల్ పేరు పొగ్గొట్టం అని పరిచయం చేసుకుంటారు.  మీ పేరేంటి అని అడిగేసరికి సుమ గొట్టం అని చెప్తుంది. ఛీఛీ సారీ కాదు సుమ కనకాల అని చెప్తుంది. ఇక వెంటనే అవినాష్ " సుమ కనకాల, రాజీవ్ వెనకాల" అంటూ ఫన్ చేస్తాడు. హా ఆ తర్వాత నీకు వణకాల కంటూ సుమ కౌంటర్ ఎటాక్ చేస్తుంది. ఇక నిఖిల్  అమరదీప్ ని పరిచయం చేస్తాడు నేహాసెట్టికి . వెనక నుంచి అవినాష్ అందుకుని పెళ్లయింది కానీ ఇంకా శోభనం కాలేదు అంటాడు. ఆ మాటకు నేహా సిగ్గు పడుతుంది. పరంపర సీజన్ 2  జులై 21  st రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సిరీస్  ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర జంట కూడా ఈ షోలో మెరుస్తారు. బోనాల షోకి బాబా భాస్కర్ రెగ్యులర్ గా వచ్చే పంచెతో కాకుండా స్టైల్ గా ఫ్యాన్టు షర్టు వేసుకొచ్చాడు.. "నా పేరు భాస్కర్..నా ఊరు గొట్టం" అని సుమ దగ్గర పరిచయం చేసుకుంటాడు. అదేంటి గొట్టం అని మీకు కదా పెట్టాలి ఊరికి పెట్టారేమిటి అంటుంది సుమ..ఇక ఇలా ఈ వారం బోనాల స్పెషల్ షోతో జులై 17 న సాయంత్రం 6 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

ఎంతపని చేశారు మనో గారు...

జబర్దస్త్ వారం వారం సరికొత్తగా ముస్తాబౌతు వస్తోంది. ఐతే ఇప్పుడు వచ్చే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎన్నో ప్రేమ విషయాలను పంచుకున్నారు జడ్జెస్, కమెడియన్స్. చలాకి చంటి, వెంకీ మంకీ ఇద్దరూ కలిసి మంచి స్కిట్స్ పెర్ఫామ్ చేసి అందరిని హూషారెత్తించారు. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటి అంటే వెంకీ మంకీ తన టీమ్ మేట్ గా తన వైఫ్ నే తీసుకొచ్చి స్కిట్ వేసాడు. "ఎన్నెన్నో జన్మల బంధం" సాంగ్ కి డాన్స్ వేశారు ఇద్దరూ. ఆ తర్వాత వెంకీని  తన వైఫ్ అడుగుతుంది "స్కిట్ లో అందరిని పట్టుకుని డాన్స్ చేస్తావ్. మరి నన్ను పట్టుకుని డాన్స్ చేయడానికి నీకు బాదేంటి" అని అడుగుతుంది. "అంటే వాళ్ళు మళ్ళీ దొరకరు కదా" అంటాడు "చూస్తున్నా ఈ మధ్య స్కిట్ లో కొత్త కొత్త అమ్మాయిలను తెస్తున్నారట" అని నిలదీస్తుంది.  "అంటే వాళ్లకు పేరు తీసుకొద్దామని" అంటూ కవర్ చేసుకుంటాడు. స్కిట్ ఐపోయాక ఇంద్రజ అడుగుతుంది వెంకీ మంకీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అని..లవ్ మ్యారేజ్ అని, తన భార్య కూచిపూడి డాన్సర్ అని, తానొక మిమిక్రి ఆర్టిస్ట్ అని చెప్తాడు. ముందుగా తన భార్యకు తానే ప్రొపోజ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే స్కిట్ లో తన ఇద్దరి పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేసాడు. వెంటనే వెంకీ కూడా ఇంద్రజాని లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతాడు. లవ్ మ్యారేజ్ అని తన పెళ్ళికి 7500  ఖర్చుతో కేవలం 13 మంది మధ్యలో పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చారు. తర్వాత మను ని కూడా అదే విషయం అడిగేసరికి తాను సంపాదిస్తున్నాని 19 ఏళ్లకే ఇంట్లో పెళ్లి చేసేశారని చెప్పారు. ఐతే మీది బాల్య వివాహమా అంటూ అనసూయ సెటైర్ వేసింది. అనసూయ పెళ్లి టాపిక్ వచ్చేసరికి నాది మొత్తం తెరిచిన పుస్తకం అంటూ నవ్వేసింది.  

అసలు మీరు మనుషులా, రాక్షసులా?.. మండిప‌డిన ర‌ష్మీ!

రష్మీ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలంటే తనకు ఎంతో ఇష్టం కూడా. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కుక్క బాధపడడం చూసిందంటే చాలు.. దానికి సేవ‌చేసి, వెంటనే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టేస్తుంది. అంత ఇష్టం అన్నమాట. ఇప్పుడు అలాంటిదే ఒక పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ మనసు ఈ విషయంలో మాత్రం చాలా గొప్పదని చెప్పొచ్చు. వీధి కుక్కలకు  తోచినంత ఫుడ్ పెడుతుంది. వాటికి అవసరమైతే షెల్టర్ కోసం ట్రై చేస్తుంది. ఐతే కొంత మంది యజమానులు కుక్కల్ని ఇంట్లో పెంచుకుని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడవి వర్షానికి తడుస్తూ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. 24 గంటల్లో నాలుగు జాతులకు చెందిన కుక్కల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడంపై ఆమె ఆగ్ర‌హించింది. "కుక్కతో ఎమోషనల్ బాండింగ్ ఎంతో గొప్పది. అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది కొంచెం కూడా జాలి, దయ, శ్రద్ద లేదా" అంటూ మండిపడింది. ఎవరైతే తమ పెంపుడు కుక్కల్ని వదిలి వెళ్లిపోయారో వాళ్ళను కర్మ వెంటాడుతూ ఉంటుందని హెచ్చరించింది.  "మీ పిల్లలు కూడా రేపు మిమ్మల్ని అలా రోడ్డు పాల్జేస్తే ఎలా ఉంటుంది?" అనే పోస్ట్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టింది రష్మీ. ఇక ఏదో తనకు తోచినంతలో హైదరాబాద్, వైజాగ్ లో ఫ్రీ పెట్ డాగ్ రెస్క్యూ వాన్స్ ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. అలాగే ఈ స్టేటస్ తో పాటు మరో స్టేటస్ కూడా పెట్టింది. గంగానది వరదల్లో మావటి ప్రాణాలను కాపాడిన ఏనుగును అతడు ములుగర్రతో బాధించడంపై రష్మీ బాధపడింది. ఇలా రష్మీ మూగ జీవాల సంరక్షణకై నిత్యం పోరాడుతూ ఉండ‌టాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

బ్రేక్ ది రూల్స్ అంటున్న ఏజెంట్

తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆహా ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తూ ముందుకెళ్తోంది. కొత్త కొత్త సబ్జెక్ట్స్ తో వెబ్ సిరీస్ ని కూడా ఆడియన్స్ ముందుకు తెస్తూ అలరిస్తూ ఉంది. క్వాంటిటీ, క్వాలిటీకి పెద్ద పీట వేస్తూ వెళ్తున్న ఆహా వేదిక పై ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ సందడి చేయబోతున్నాడు. షన్ను లీడ్ రోల్ లో నటించిన సిరీస్ ఇది. ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. "మనిషి బతకడానికి జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు..ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తే " అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలౌతుంది. ఇలాంటి రూల్స్ లేకుండా ఉండడానికి ఉద్యోగం మానేసి డిటెక్టివ్ ఏజెంట్ అవతారం ఎత్తుతాడు సంతోష్. ఆ తర్వాత ఆ ఏజెంట్ దగ్గరకు సిల్లీ, పెట్టీ కేసులు వస్తూ ఉంటాయి. టింకు గాడి ఇంట్లో  క్రికెట్ బ్యాట్లు పోయాయని, పక్కింటి సుశీల ఆంటీ ఇంట్లో రోజూ చెప్పులు పోతున్నాయని  ఇలాంటి కేసులు అన్నమాట.  ఇక అదే సమయంలో  "కూకట్ పల్లిలో కిడ్నాపులు, మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా ? " అనే బ్రేకింగ్ న్యూస్ చూస్తాడు. అప్పుడే అమ్మాయి మిస్ ఐన  కేసు ఒకటి ఆనంద్ దగ్గరకు వస్తుంది. ఇక ఈ కేసు సాల్వ్ చేసే టైంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసాడు అనేదే స్టోరీ లైన్.. ఈ ట్రైలర్ లో కామెడీ కూడా మస్త్ ఎంటర్టైన్ చేసేదిగా ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ జులై 22 నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది . ఆహా బెస్ట్ కంటెంట్ నే ఎప్పుడూ ఆడియన్స్ కి అందిస్తూ ఉంటుంది. సామ్-జామ్, అన్ స్టాపబుల్ , తెలుగు ఇండియన్ ఐడల్ వంటి షోస్ ని ప్రారంభించి ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇక ఇప్పుడు ఏజెంట్ ఆనంద్ సంతోష్ తో రాబోతోంది ఆహా..

బాలయ్య ఇక ఆగే పనే లేదు!

'అన్‌స్టాపబుల్' షో బాలయ్య బాబు రేంజ్‌ని వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ షో ద్వారా ఆయన ఓటిటిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫేమస్ సెలబ్రిటీస్ పరిచయాలతో సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో సీజన్ సెకండ్ ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. సెకండ్‌ సీజన్‌లో అద్దిరిపోయే సెలబ్రిటీస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలయ్య. ఆహా ఓటిటిపై ప్రసారమైన ఈ సీజన్ అంచనాలకు మించి సక్సెస్‌ని అందుకుంది. ఇక ఫైనల్‌గా మహేష్ బాబుతో సీజన్ వన్‌ని ఎండ్ చేశారు నిర్వాహకులు. ఇప్పుడు సీజన్ 2 వంతు వచ్చేసింది. ఐతే సీజన్ 2ని మేకర్స్ ఆగస్ట్‌ రెండో వారంలో స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఒక టాక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. బాలయ్య జనరల్ షోలా కాకుండా, అందరిలా రొటీన్ ప్రశ్నలు అడగకుండా సంథింగ్ స్పెషల్ గా అడుగుతూ ఉంటారు. కాంట్రవర్సీ టాపిక్స్ మీద ఎన్నో రకాల సందేహాలను కూడా అడుగుతుండేసరికి ఈ ప్రోగ్రాంకి మంచి రేటింగ్ అనేది వచ్చింది. సీజన్ 1కి మించేలా మంచి ఎంటర్టైన్మెంట్‌తో సీజన్ 2ని తీసుకురాబోతున్నారట. ఈ షోకి ఫస్ట్ ఎపిసోడ్ గెస్టుగా మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఆఫీషియల్ న్యూస్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. బాలయ్య అభిమానులు, ఆడియన్స్ అంతా ఈ షో కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.

సుధీర్ ఎప్పుడూ నా మనసుకు దగ్గరగానే ఉంటాడు!

జబర్దస్త్ అనేది స్టార్ట్ అయ్యాక బుల్లితెర జోడీల పేరుతో కొన్ని జంటలు పిచ్చ ఫేమస్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏం ఉందో, ఏం లేదో అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ కెమిస్ట్రీ స్మాల్ స్క్రీన్ మీద పండేసరికి ఆడియన్స్ కూడా వాళ్ళను ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ జోడీల్లో ఎవరైనా మిస్ ఐతే మాత్రం వాళ్లకు వీళ్ళు అస్సలు సరిపోలేదు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అలా స్క్రీన్ మీద ఫేమస్ ఐన జంటల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు సుధీర్-రష్మీ జంట. తర్వాత ఫైమా-ప్రవీణ్, తర్వాత వర్ష-ఇమ్మానుయేల్. వీళ్లంతా అభిమానులు ఇష్టపడే జంటలు.  కాగా రానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోని ఒక రొమాంటిక్ షోగా మార్చేశారు. ఇందులో ఫైమా, ప్రవీణ్ పెళ్లి బట్టల్లో స్టేజి మీదకు వ‌స్తారు. "ఐ లవ్ యు ఫైమా.. నువ్ ఒప్పుకుంటే ఈ రింగ్ నీ చేతికి పెడతాను" అంటూ రింగ్ పెడతాడు ప్ర‌వీణ్‌.. ఆ ఇద్ద‌రి మధ్య ఎప్పటినుంచో లవ్ ట్రాక్ నడుస్తోంది. వీటికి సంబంధించి ఎన్నో వీడియోస్ వైరల్ అయ్యాయి కూడా. "ఫైమా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాక వాళ్ళ అమ్మ అడిగిన కోరిక ఒక్కటే.. 'ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి నేను అందులోనే చనిపోవాలి' అని. వాళ్ళ అమ్మ కోరికను ఫైమా నెరవేర్చింది. అందుకే నాకు ఫైమా అంటే చాలా ఇష్టం" అని చెప్పాడు ప్రవీణ్. "ఫైమా! మీ అమ్మకు చెప్పు అల్లుడొస్తున్నాడని" అని చెప్పాడు ప్రవీణ్.  గతంలో ఒక ఎపిసోడ్ లో వర్ష కూడా ఇమ్మానుయేల్ తో ఇదే మాట చెప్పింది. ఇదంతా చూసిన రష్మీ ఒక్కసారిగా ఎమోషన్ అయ్యింది. ఈ విషయంపై రష్మీ మీద హైప‌ర్ ఆది జోక్స్ వేశాడు. "నువ్వేమన్నా మిస్ అవుతున్నావా.. నేను దూరం నుంచి నిన్ను చూశా. నువ్ కొంచెం ఎమోషనల్ ఐనట్టు కనిపించింది. అందుకే అడుగుతున్నా" అన్నాడు ఆది. అంతే.. రష్మీ ఏం చెప్పాలో తెలీక  సైలెంట్ ఐపోయింది. ఎందుకంటే ఇటీవల సుధీర్, రష్మీ ఎక్కడ జంటగా కనిపించట్లేదు. ఇద్దరు విడిపోయి చాలా నెలలౌతోంది.  "మనసులకు, దూరానికి ఎలాంటి సంబంధం ఉండదు. అవి ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాయి" అని క్లారిటీ ఇచ్చింది రష్మీ. ఐతే ఇప్పుడు ఈ డైలాగ్ తో రష్మీకి సుధీర్ అంటే ఇష్టమేనేమో అనే విషయం పై చర్చ జరుగుతోంది. అలాగే ఈ రొమాంటిక్ ఎపిసోడ్ లో సుధీర్, రష్మీ జోడీని చాలా మిస్ అవుతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీదేవి 'రొమాంటిక్' కంపెనీ!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త కొత్త స్కిట్స్ తో మంచి ఫేమస్ ఐన షో. ప్రతీ షోలో హైపర్ ఆది, రాంప్రసాద్, నూకరాజు, ఇమ్మానుయేల్ వాళ్ళ టైమింగ్ కామెడీతో నవ్విస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో కాన్సెప్ట్ తో బుల్లితెర కమెడియన్లు ముందుకొస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్ ఐతే  ఆద్యంతం చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది అన్నట్టుగా డిజైన్ చేసిన‌ట్లు లేటెస్ట్ ప్రోమో తెలియ‌జేస్తోంది. ఈ వారం ఎపిసోడ్ కాన్సెప్ట్ మంచి రసవత్తరంగా, రొమాంటిక్ గా కిక్కెకించేలా డిజైన్ చేశారు.  ఈ ఎపిసోడ్ లో సీరియల్ యాక్ట‌ర్స్‌ కూడా వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్సులు చేసి చల్లని వాతావరణంలో హీట్ పుట్టించారు. "దేవుడు కరుణిస్తాడని వరములు కురిసిపిస్తాడని" పాటకు బుల్లితెర సీరియల్స్ యాక్టర్స్ రొమాంటిక్ డాన్స్ చేసి అలరించగా, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ జంటలు వచ్చి రొమాన్స్ ని మరో యాంగిల్ లో పరిచయం చేశారు ఆడియన్స్ కి.  ఇక ఇదే పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటే స్టేజి మీద ఫస్ట్ నైట్  కోసం సిద్ధం చేసిన బెడ్ కనిపించింది. ఇదే పాటకు శ్రీదేవి జోడీస్ డాన్స్ చేశారు. ముందుగా హైపర్ ఆది బెడ్ మీదకు వచ్చాడు. తర్వాత ఒక అమ్మాయి కూడా వచ్చి రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చేస్తున్నట్లు చూపించారు. తర్వాత ఆదిని ఆమె పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఐతే ఆ నటి ఎవరో సరిగా చూపించకుండా చేశారు. వాళ్ళ తర్వాత నటి ఫైమా, పటాస్ ప్రవీణ్ పెళ్లి బట్టల్లో బెడ్ మీదకు వచ్చి రొమాన్స్ చేశారు.  ఇలా ఈ వారం షో మొత్తం రొమాంటిక్ గ్గా ప్లాన్ చేశారు. ఈ షోకి హైలైట్ ఏంటి అంటే నటి ప్రగతి, సీనియర్ హీరోయిన్ సంఘవి గెస్టులుగా వచ్చేసారు. ఐతే ఆదితో ఫుల్లుగా ఆడేసుకుంది సంఘవి. "మొదటిసారి ముద్దు పెడితే.. సాంగ్ చేశారు కదా మీరు.. రెండో సారి, మూడో సారి పెడితే ఎలా ఉంటుంది?" అని ఆది అడిగేసరికి "బాగానే ఉంటుంది, నీకు రెండిస్తే ఇంకా బాగుంటుంది" అంటూ కౌంటర్ వేసేసింది.  ఇక ఫైనల్ గా ఒక్కో జంట స్టేజి మీదకు వచ్చి సందడి చేశాయి. బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్న శాంతిస్వరూప్ ని పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. భాస్కర్ లైన్ లోకి వచ్చి "అమ్మకు అన్యాయం చేస్తావా నాన్నా?" అని అడిగాడు.. "ఈ అమ్మాయికి న్యాయం చేద్దామని" అంటూ లేడీ గెటప్ లో ఉన్న శాంతిస్వరూప్ ని చూపించాడు నాన్న‌.

కైలాష్‌తో ఆట మొద‌లు పెట్టిన‌ య‌ష్!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం` సీరియ‌ల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా సాగుతూ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ట్విస్ట్ లు, ట‌ర్న్ ల‌తో విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్న ఈ సీరియ‌ల్‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, ఆనంద్‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ కీల‌క పాత్ర‌ధారులు. కైలాష్.. వేద ఫొటోలు చూస్తున్న స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చిన య‌ష్ అత‌న్ని ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెడ‌తాడు. "సారిక తెలుసా?" అంటాడు. దానికి కైలాష్ "తెలుసు" అంటాడు. వెంట‌నే మాట మార్చి "వేద ప‌రిచ‌యం చేసింది" అంటాడు. అదంతా విన్న య‌ష్, "పెర‌ట్లో మొలిచింది పిచ్చి మొక్క అని తెలిసిన‌ప్పుడు దాన్ని పీకి పారేయాల్సిందే" అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. దీంతో కైలాష్ లో భ‌యం మొద‌ల‌వుతుంది. 'య‌ష్ ఏంటీ ఇలా మాట్లాడుతున్నాడు? సారిక గురించి తెలిసిపోయిందా?.. ఎందుకైనా మంచిది మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాలి' అనుకుంటాడు. వెంట‌నే డౌట్ క్లియ‌ర్ చేసుకోవ‌డానికి సారిక‌కు ఫోన్ చేస్తాడు. "మ‌న విష‌యం గురించి ఎవ‌రైనా అడిగారా? లేక నువ్వే చెప్పావా?" అని బెదిరిస్తాడు. నేను ఎవ‌రితో చెప్ప‌లేద‌ని, నువ్వు చెప్పిన‌ట్టే చేస్తున్నాన‌ని సారిక ఏడుస్తూ చెబుతుంది. ఇదంతా చాటుగా వుండి విన్న య‌ష్ కు ర‌క్తం మ‌రిగిపోతుంది. ఎలాగైనా వీడిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుని వీడి ఆట క‌ట్టించాల‌ని ఆట మొద‌లు పెడ‌తాడు. వాడు ప‌క్క‌కి వెళ్లిపోగానే య‌ష్ వెళ్లి ఫోన్ చెక్ చేస్తాడు. ఆ త‌రువాత కైలాష్ రూమ్ కి వెళ్లి త‌న‌ని బెదిరించి బెదిరించ‌న‌ట్టుగా మాట్లాడి "నీ గురించి అంద‌రూ తెలుసుకుంటారు. మా అక్క కూడా" అంటూ వెళ్లిపోతాడు. దీంతో కైలాష్ మ‌రింత‌గా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

ఫైమాకు రింగ్‌తో ప్ర‌పోజ్ చేసి ప్ర‌వీణ్‌!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో బుల్లెట్ భాస్క‌ర్ తో క‌లిసి ఫైమా చేసే హంగామా అంతా ఇంతా కాదు. త‌న‌దైన మార్కు హాస్యంతో ఆక‌ట్టుకుంటూ హాస్య‌ప్రియుల్ని త‌న స్కిట్ ల‌తో న‌వ్విస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఫైమా. ఇక తన త‌ర‌హాలోనే కామెడీ టైమింగ్ తో స్పాట్ లో పంచ్ లేస్తూ త‌క్కువ‌ స‌మ‌యంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ప‌టాస్‌ ప్ర‌వీణ్‌. వీళ్లిద్ద‌రూ క‌లిసి `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`లోనూ త‌మ‌దైన‌ కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా ప‌టాస్ ప్ర‌వీణ్, ఫైమా ఎమోష‌న‌ల్ అయ్యారు. `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` స్టేజ్ సాక్షిగా ఫైమాపై త‌న‌కున్న ప్రేమ‌ని ప‌టాస్ ప్ర‌వీణ్ బయ‌ట పెట్టాడు. ఫైమా వేలికి ఉంగ‌రం తొడిగిన ప‌టాస్ ప్ర‌వీణ్‌ ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఫైమా త‌న‌కు ఎందుకు న‌చ్చిందో చెప్పుకొచ్చాడు. `మ‌న‌కంటూ ఓ సొంత ఇల్లు వుండాలి. నేను అందులోనే చ‌నిపోవాలి` అని ఫైమా వాళ్ల అమ్మ త‌న‌ని కోరింది.  ఆవిడ‌ కోరిక‌ని ఫైమా తీర్చింది`అని వివ‌రించాడు ప్ర‌వీణ్‌. దీంతో ఫైమా భావోద్వేగానికి లోనైంది.  ఆ త‌రువాత `ఫైమా మీ అమ్మకు చెప్పు అల్లుడొస్తున్నాడ‌ని` అంటూ ప‌టాస్ ప్ర‌వీణ్‌ పంచ్ వేయ‌డంతో ఫైమా న‌వ్వేసింది. అయితే నిజంగానే ప్ర‌వీణ్ .. ఫైమాకు ప్ర‌పోజ్ చేశాడా? లేక స్కిట్ లో భాగంగానే ఇలా చేశాడా అన్న‌ది తెలియాలంటే ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌కు ప్ర‌సారం కానున్న `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` చూడాల్సిందే. ఈ వారం స్పెష‌ల్ స్కిట్ ని ప్లాన్ చేశారు. సంఘ‌వి, ప్ర‌గ‌తి గెస్ట్ లుగా ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా విడుద‌లైన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. సంఘ‌వితో హైప‌ర్ ఆది ఆడుకోవాల‌ని చూడ‌టం.. అదే స‌మ‌యంలో మీకు రెండిస్తే బాగుంటుంద‌ని సంఘ‌వి రివ‌ర్స్ పంచ్ వేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఆయన ఎక్కడుంటే నేను అక్కడే!

జబర్దస్త్ అన్ని షోస్ లోకి నెంబర్ వన్ షోగా దాదాపు పదేళ్ల నుంచి ప్రసారమౌతోంది. ఐతే అనుకోని కారణాలు, కామెంట్ల వలన ఈ షో రేటింగ్ ఒక్కసారిగా డౌన్ ఐపోయింది. ఈ షో నుంచి అందరూ బయటికి వచ్చేయడం ఒక కారణం. వీటితో పాటు ఆర్పీ ఓపెన్ గా మల్లెమాల గురించి హీటెక్కించే కామెంట్స్ చేయడం, ఆ తర్వాత వాటికి స్పందిస్తూ ఇంకొంతమంది కౌంటర్ అటాక్స్ ఇవ్వడం కొద్దీ రోజులుగా జరుగుతూ వస్తోంది. జబర్దస్త్ ఇప్పుడు రంగులు పులుముకున్న రాజకీయంలా మారిపోయింది. ఇకపోతే ఈ షోలో చమ్మక్ చంద్ర టీమ్ లో ఉండే సత్యశ్రీ అనే అమ్మాయి మీద ఇటీవల చాలా కామెంట్స్ వస్తున్నాయి. వీళ్ళ టీంలో ఈ అమ్మాయి ఎక్కువగా కనిపిస్తూ ఉండేసరికి చంద్రకి, ఈ అమ్మాయికి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఇక వీటికి స్పందిస్తూ సత్యశ్రీ తన కామెంట్స్ ని చెప్పుకొచ్చింది. చమ్మక్ చంద్ర తనను జబర్దస్త్ కి పరిచయం చేసిన గురువు అని చెప్పుకొచ్చింది. "కొన్ని సీరియల్స్ లో నటించిన నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు కానీ జబర్దస్త్ లో నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది" అని చెప్పుకొచ్చింది. ఆ అభిమానంతోనే చమ్మక్ చంద్ర టీమ్ లోనే తాను ఎక్కువగా స్కిట్స్ చేస్తున్నానంది. 'ఆయన ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉంటాను' అంది సత్యశ్రీ. ఇక 'ఇలాంటి ఎన్నో రూమర్లు వస్తూనే ఉంటాయి. వాటిని అస్సలు పట్టించుకోను' అంది. ఐతే ఈ విషయం గురుంచి తన పేరెంట్స్ కూడా అడిగారని , నాన్న తనకు ధైర్యం చెప్పారని, ఇలాంటి కామెంట్స్ పట్టించుకోకుండా ముందు వెళ్లమంటూ ప్రోత్సహించారని చెప్పింది.

వేణుకి రెండుసార్లు హ్యాండ్ ఇచ్చిన పూరి!

'స్వయంవరం' మూవీ అంటే చాలు వేణు గుర్తొస్తాడు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, కల్యాణ రాముడు వంటి మూవీస్ లో యాక్ట్ చేసాడు వేణు. ఐతే తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేసాడు. ఇక ఇప్పుడు రవితేజ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'లో నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమౌతోంది. ఇందులో సీఐ మురళి రోల్ లో నటిస్తున్నాడు.   దీంతో వేణు ఈ మూవీ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాడు. 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎన్నో విషయాలను అలీతో షేర్ చేసుకున్నాడు. ఒకప్పుడు డైరెక్టర్స్ కి ప్రామిసింగ్ హీరోలా మంచి హిట్స్ ఐతే అందించాడు. ఇప్పుడు వేణు కెరీర్ లో ఏమంత మంచి హిట్స్ పడడం లేదు. ఇప్పుడు చేసిన ఈ మూవీ తనకు ఎంత అదృష్టాన్ని తెస్తుందో చూడాలి అన్నాడు. ఇక వేణు తన హైట్ 6 అడుగుల 3 అంగుళాలు అని చెప్పాడు.  ఐతే ఈ షో కి వెళ్ళమని వాళ్ళ అమ్మ చెప్పేసరికి తాను వచ్చానని చెప్పుకొచ్చాడు.  చదువుకునే వయసులో కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడ చదువుకోకుండా ఎక్కువగా సినిమాలు చూసేవాడిన‌ని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఇక ఈ విషయం ఇంట్లో తెలిసిపోయేసరికి వాళ్ళ నాన్న బెల్టు తెగేవరకు చితక్కొట్టేశారని చెప్పాడు. అలాగే తన వరకు వచ్చి మిస్ ఐన ఆఫర్స్ గురించి కూడా చెప్పాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదట 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' మూవీ కథను తనకు చెప్పారట. ఏమయ్యిందో ఏమో కానీ చివరికి ఈ మూవీలో రవితేజని హీరోగా పెట్టుకున్నారు.  తర్వాత 'దేశముదురు' చిత్రంలో టీవీ యాంకర్ రోల్ నాకైతే బాగుంటుందని కథ మొత్తం చెప్పారు. కానీ సినిమాను మాత్రం తనతో చేయలేదని చెప్పాడు. ఈ రెండు విషయాల్లో చాలా బాధపడ్డాడట వేణు. మచిలీపట్టణం మాజీ ఎంపీ మాగంటి అంకినీడుకు తొట్టెంపూడి వేణు మేనల్లుడు అవుతాడు. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి కూడా ఈ షోలో చెప్పాడు వేణు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.

దర్శకేంద్రుడు మాట్లాడిన వేళ‌.. సిరి క‌ల నెర‌వేరిన వేళ‌!

బిగ్ బాస్ ఫాలో అయ్యేవాళ్ళకు సిరి హన్మంత్ ఎవ‌రో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి. ఆమె యూట్యూబ్ లో 'మేడం సర్.. మేడం అంతే, 'గందరగోపాళం', 'రాంలీలా' వంటి వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ఎవరి నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇటీవల సిరి నటించిన #బిఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఆహా ఓటిటిపై ఈ వెబ్ సిరీస్ ప్రసారమయ్యింది.  ఈ  స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇద్దరమ్మాయిలు జాబ్ కోసం సిటీకి  వస్తారు. అలా అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటూ లైఫ్ ని ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. సిరి హన్మంత్, రమ్య పసుపులేటి కలిసి నటించిన ఈ సీరీస్ కి మంచి మార్క్స్ పడ్డాయి.  ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ సక్సెస్ ఐన సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సిరికి కాల్ చేసి అభినందించారట. ఆయన స్వయంగా తనతో మాట్లాడ్డం కలవడం చేసేసరికి తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. "ఈ రోజు నా కల నెరవేరింది. రాఘవేంద్రరావు గారు కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీరు నాకు చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోను" అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోతో కలిపి తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.  

నెటిజ‌న్ల మ‌తులు పోగొడుతున్న దీపిక గెంతులు!

దీపికా పిల్లి ఇటీవల బుల్లితెర మీద బాగా వినిపిస్తున్న పేరు. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ, వెబ్ సిరీస్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న దీపిక ఇప్పుడు 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో సుడిగాలి సుధీర్ తో కలిసి నటించేసింది కూడా. ఇక ఇప్పుడు దీపిక ఒక హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయేసరికి అందాల డోస్ పెంచేసింది. పొట్టి బట్టలు వేసి అందరిని అలరిస్తోంది. షోస్ లో ఇరగదీసే స్టెప్స్ వేసి అందరిలో హీట్ పుట్టిస్తోంది.  దీపికకు హీరోయిన్ అయ్యే అవకాశాలు ఇంకా ఎన్నో వస్తాయని దర్శకేంద్రుడు కితాబిచ్చారు కూడా. ఇక ఇప్పుడు దీపిక సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. మున్నార్ లో ఉంటూ అక్కడి నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తోంది. చుట్టూ కొండల్ని కోనల్ని చూస్తూ మైమరిచిపోతోంది. అక్కడ కురుస్తున్న వానలో తడుస్తూ వెదర్ డిమాండ్ చేస్తోంది కాబట్టి సూపర్ డాన్స్ చేస్తున్నాను అన్నట్టుగా ఒక కాప్షన్ పెట్టి "కురిసింది మేఘం మేఘం" హిందీ వెర్షన్ సాంగ్ కి ఐశ్వర్య రాయ్ వేసినట్టుగా స్టెప్పులేసి ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసుకుంది.  ఇప్పుడు ఈ వీడియో చూసిన‌ నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. టిక్ టాక్ ద్వారా ఎంతో మంది సోషల్ మీడియా స్టార్స్ ఇపోయారు. ఇది ఎంతో మందిలోని టాలెంట్ ని బయటికి తీసిన ఒక యాప్. దీపిక పిల్లి కూడా ఇలాగే పాపులర్ ఐన ఒక అమ్మాయి. ఆ క్రేజ్ తోనే ఈటీవీ వంటి సంస్థలో ఆఫర్ ని దక్కించుకుని పేరు సంపాదించుకుంది.

శేషు ఫామిలీ మెంబెర్స్‌ని మా ఆఫీస్ లో పనిచేయమనండి!

ఇటీవల ఎటు చూసిన బుల్లితెర మీద మల్లెమాల, జబర్దస్త్.. ఇవే హాట్ టాపిక్స్. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కిరాక్ ఆర్పీ ఎన్నో కామెంట్స్ చేసాడు. దానికి ఆటో రాంప్రసాద్, ఆది కౌంటర్ అటాక్స్ ఇచ్చారు. అదిరే అభి కూడా మాట్లాడాడు. ఇక ఇప్పుడు షేకింగ్ శేషు లైన్ లోకి వచ్చేసి ఆర్పీ బండారం బయటపెట్టాడు. "అసలు నీ అనుభవం ఎంత.. అంత పెద్ద మనుషుల్ని, లైఫ్ ఇచ్చిన స్టేజిని నానా మాటలు అనడానికి" అంటూ విరుచుకుపడ్డాడు. "డైరెక్టర్ ని కావాలంటూ మూవీ స్టార్ట్ చేసావ్. మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే 20 లక్షలు ఖర్చుపెట్టావు. ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ నిలదీసేసరికి తోక ముడిచావ్." అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ఈ విషయం గురించి ఆర్పీ మీద కంప్లైంట్ కూడా ఫైల్ చేసినట్లు చెప్పాడు.  శేషు కామెంట్స్ కి ఆర్పీ స్పందించాడు. "స్టోరీ లైన్ నచ్చేసరికి అరుణాచలం గారు మూవీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నారు. నాగబాబు గారు, చక్రవర్తి గారు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అనుకోని పరిస్థితుల కారణంగా మూవీ మిడిల్ డ్రాప్ అయ్యింది" అన్నాడు ఆర్పీ. "అంతా ఓకే అనుకున్నాకే ఆఫీస్ తీసుకున్నా. ఐనా జబర్దస్త్ లో నేను స్కిట్స్ వేసే టైంకి శేషు అక్కడ లేడు. జబర్దస్త్ పై రెండు మూడు సార్లు మాత్రమే అతన్ని కలిసాను" అన్నాడు. "మరి శేషుకి నా విషయంలో వేలు పెట్టి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమిటి?" అని ప్ర‌శ్నించాడు.  "శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు కాబట్టి శేషు అలా మాట్లాడుతున్నాడు" అంటూ విరుచుకుపడ్డాడు. "మూవీ స్టార్ట్ చేసాక ఎంతోమంది వస్తారు కాబట్టి ఆఫీస్ తీసుకున్నా.. శేషుకు నచ్చకపోతే ఆయన ఇల్లు ఇస్తే అక్కడే ఆఫీస్ పెట్టుకుంటా. వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని మా ఆఫీస్ లో పనిచేయమనండి" అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జబర్దస్త్ లోపల ఏం జరుగుతోంది. ఇన్నేళ్ల నుంచి మౌనంగా ఉన్న కమెడియన్స్ ఒక్కొక్కరుగా ఎందుకు ఇలా మాటల యుద్ధాలకు దిగుతున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డిని ఆర్పీ ఎందుకు అంతలా టార్గెట్ చేసాడు? అసలు దీని వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటి.. ఆర్పీ వెనక ఉన్నది ఎవరు?.. అనే ప్రశ్నలు ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్నాయి.

తిలోత్త‌మ వ‌ల్ల న‌య‌ని, విశాల్‌ వేరు కాబోతున్నారా?

ఆషికా గోపాల్‌, చందూగౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టిస్తోన్న‌ సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆస‌క్తిక‌ర మ‌లుపులు, ట్వీస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రైమ్ టైమ్ లో ప్ర‌సారం అవుతూ మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఇత‌ర‌పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, భావ‌నా రెడ్డి, విష్ణుప్రియ‌, ద్వార‌కేష్ నాయుడు, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య త‌దిత‌రులు న‌టించారు.   క‌సి కార‌ణంగా ఆస్తుల‌న్నీ పోగొట్టుకున్న తిలోత్త‌మ ఫ్యామిలీ అంతా విశాల్ - న‌య‌ని ఇంట చేర‌తారు. కొత్త ఇంట్లో స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తంతో పాటు హోమం చేయించాల‌ని న‌య‌ని ఏర్పాట్లు చేయిస్తుంది. అంతా కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకుని రెడీ అయిపోతారు. ఇదే స‌మ‌యంలో న‌య‌నికి ఇంట్లో చేయ‌బోతున్న హోమం కోసం తెచ్చిన ఇటుక‌ల వ‌ల్ల విశాల్ కు ప్ర‌మాదం వుంద‌ని తెలుస్తుంది. దీంతో పూజ జ‌రుగుతుంటే ఆ ఇటుక‌ల్ని పైన పెట్టిస్తుంది. ఇదే స‌మ‌యంలో న‌య‌ని చెల్లెలు సుమ‌న ద్వారా న‌య‌నికి వున్న వ‌రం గురించిన ర‌హ‌స్యాన్ని తిలోత్త‌మ‌ తెలుసుకుంటుంది.   దీని ఆధారంగా న‌య‌నిని విశాల్ కు దూరం చేయాల‌ని ప‌థ‌కం వేస్తుంది. విశాల్ పై ఇటుక ప‌డుతుంటే తెలిగా అత‌న్ని త‌ప్పించి త‌నకు గాయం అయ్యేలా చేసుకుంటుంది. దీంతో షాక్ కు గురైన విశాల్‌.. తిలోత్త‌మ‌ని హాస్పిట‌ల్ కి తీసుకెళ‌తాడు. అక్క‌డ బెడ్ పై అచేత‌నంగా ప‌డివున్న‌ట్టుగా యాక్టింగ్ మొద‌లు పెట్టిన తిలోత్త‌మ.. న‌య‌నిని టార్గెట్ చేస్తుంది. విశాల్ ముందు అడ్డంగా ఇరికించి త‌న‌పై అస‌హనాన్ని ప్ర‌ద‌ర్శించేలా చేస్తుంది. ఉన్న‌ట్టుండి విశాల్.. తిలోత్త‌మ కార‌ణంగా త‌న‌పై అర‌వ‌డంతో న‌య‌ని చొచ్చుకుంటుంది. ఏడుస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. అంతా వెళ్లాక క‌సి, వ‌ల్ల‌భ‌తో త‌న అస‌లు కుట్ర‌ని బ‌య‌ట‌పెడుతుంది తిలోత్త‌మ‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. అన్నం ముద్ద‌తో తిలోత్త‌మ‌కు దిష్టితీస్తూ న‌య‌ని ఏమ‌ని హెచ్చ‌రించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

కైలాష్‌ని య‌శ్ ఏం అడిగాడు? ఏం జ‌ర‌గ‌బోతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం` సీరియ‌ల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా సాగుతూ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటూ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ కీల‌క జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, ఆనంద్‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. వేద‌, య‌ష్ విడిపోయార‌ని, వారి పెళ్లి ఓ నాట‌క‌మ‌ని ఫ్యామిలీ జ‌డ్జిని ఇంటికి ర‌ప్పిస్తుంది మాళ‌విక‌. అయితే తెలివిగా వ‌సంత్ ఆ విష‌యాన్ని వేద‌కు చెప్పడంతో అంతా అల‌ర్ట్ అవుతారు. య‌ష్ ఇంటికి చెకింగ్ కోసం వ‌చ్చిన జ‌డ్జి.. మాళ‌విక చెప్పిన‌ట్టుగా ఇక్క‌డ ఏమీ జ‌ర‌గ‌లేద‌ని, అంతా బాగానే వుంద‌ని తెలుసుకుంటుంది. అంతే కాకుండా య‌ష్ - వేద‌ల గురించి ఇరుగు పొరుగు వారు కూడా పాజిటివ్‌గా చెప్ప‌డంతో మ‌రోసారి ఇలాంటి సిగ్గుమాలిని ప‌నికి పూనుకోవ‌ద్ద‌ని మాళ‌విక‌ని తీవ్రంగా మంద‌లిస్తుంది. 'నా తీర్పు త‌ప్పు కాద‌ని, ఖుషీని నీ క‌స్ట‌డీకి ఇచ్చి నేను త‌ప్పు చేయ‌లేద‌ని నిరూపించావు వేదా' అని అభినందిస్తుంది. దీంతో యష్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటారు. ఇక జ‌డ్జి వెళ్లిపోయిన త‌రువాత అంతా స‌మ‌యానికి విష‌యం చెప్పి ర‌క్షించావ‌ని వ‌సంత్‌ని అభినందిస్తుంటారు. "చేసింది వేద వ‌దిన. న‌న్ను అభినందిస్తున్నారేంటి?. తెలివిగా వ్య‌వ‌హ‌రించి మ‌న ఫ్యామిలీ ప‌రువుని కాపాడింది" అని వ‌సంత్ చెబుతాడు. దీంతో అంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోతారు. క‌ట్ చేస్తే.. కైలాష్.. ఫోన్ లో వేద ఫొటోలు చూస్తూ వుంటాడు. అప్పుడే సీరియ‌స్ అవుతూ వ‌చ్చిన య‌ష్ .. "నీకు వేద అసిస్టెంట్ తెలుసా?" అని అడుగుతాడు. అందుకు కైలాష్ తెలుస‌ని చెబుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'న‌న్ను లేపేయ‌డానికి ప్లాన్ వేసుకో'.. మ‌ల్లెమాల అధినేత‌కు ఆర్పీ స‌వాల్‌!

  రోజా వెళ్లిపోవ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో క‌ళ త‌ప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ షో పైనా, ఈ షోని నిర్వ‌హిస్తున్న నిర్వాహ‌కులైన మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డిపైనా క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. 'ఇటీవ‌ల సుడిగాలి సుధీర్ కు అక్క‌డ గ‌త నాలుగేళ్లుగా దారుణ అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని, ఆ కార‌ణంగానే అత‌ను ఆ షోని వీడాడు' అంటూ కిరాక్ ఆర్పీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం వాటిని హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ ఖండించ‌డం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కిరాక్ ఆర్పీ ఏకంగా నిర్మాత ఎం.శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంద‌ర్బంగా క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డిపై నిప్పులు చెరిగాడు. భార‌త‌దేశం గ‌ర్వంచ‌ద‌గ్గ నిర్మాత ఎం.ఎస్ రెడ్డి అని, ఆయ‌న క‌డుపున పుట్టిన శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డికి తండ్రి అంటూ విలువ‌లేద‌ని వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స‌వాల్ విసిరాడు. "నేమ్ ఫేమ్ కోస‌మో.. సంచ‌ల‌నం కోస‌మో నేను ఇలా మాట్లాడ‌టం లేదు. నాకు క‌ష్టం విలువ తెలుసు. నేను ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌డానికి వ‌చ్చి అన్న‌పూర్ణ హోట‌ల్ లో బాత్రూంలు క‌డిగాను." అంటూ చెప్పుకొచ్చాడు. "నేను ఇప్పుడు శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డిగారికి స‌వాల్ చేసి చెబుతున్నా.. తొక్కేస్తారు అని అంటున్నారు కదా.. నేను సినిమా తీస్తే ఆపుకో.. వెబ్ సిరీస్ తీస్తే ఆపుకో.. న‌న్ను లేపేయ‌డానికి ప్లాన్ వేసుకో.. మా ఇంట్లో బౌన్స‌ర్ లు లేరు. ఎప్పుడైనా రా న‌న్ను చంపుకో... నేను చ‌స్తే స‌మాధి నుంచే ప్ర‌శ్నిస్తా. ఇండ‌స్ట్రీలో నేను ఎవ‌రినీ ప్ర‌శ్నించ‌లేదు, జ‌బ‌ర్ద‌స్త్ లో ఎవ‌రిని ప్ర‌శ్నించ‌లేదు. కానీ శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డినే ప్ర‌శ్నిస్తున్నా... నేను ప‌ర్స‌న‌ల్ విష‌యాలు మాట్లాడ‌టంలేదు. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి గారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోకి వెళ్లానా?.. బానిస బ‌తుకులు.. బానిస బ‌తుకుల గురించే మాట్లాడుతున్నా".. అంటూ ఫైర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ.. అత‌ని కామెంట్స్ ఇప్పుడు సెన్సేష‌న‌ల్‌గా మారాయి.