వర్షంలో హనీమూన్ అనగానే ఎగబడతారు!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ కి సెన్సార్ లేకపోయేసరికి ముద్దుల ఎపిసోడ్ లు హద్దులు దాటుతున్నాయి. అసలే వర్షాకాలం మొదలయ్యింది. ఇలాంటి వర్షాకాలాన్ని కూడా స్టార్ మా కాష్ చేసుకోవడానికి సిద్ధ‌మైంది. అందుకే చల్లని వాతావరణంలో హీట్ పుట్టించే సీజనల్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తోంది. ఇక ఇప్పుడు 'ఈ వర్షం సాక్షిగా' పేరుతో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక హాట్ షోని ప్రసారం చేయబోతోంది. ఇందులో నిరుపమ్, మంజుల, అంబటి అర్జున్, సుహాసిని, రవికృష్ణ, నవ్యస్వామి, నిఖిల్, కావ్య, మానస్, కీర్తి, శ్రీముఖి, అవినాష్ జంటలు వర్షంలో రొమాన్స్ చేయడానికి సిద్ధమైపోయారు.  "మా నిఖిల్-కావ్య వచ్చారు.. మీ మధ్య ఏమన్నా ఉందా అంటే తలపట్టారు.. హనీమూన్ అనగానే ఎగబడ్డారు" అంటూ అవినాష్ నిఖిల్, కావ్య మీద సెటైర్ వేశాడు. తర్వాత సెనగపిండితో బజ్జీలు వేసే టాస్క్ లో నిరుపమ్, మంజుల జంటగా, అర్జున్, సుహాసిని జంటగా వచ్చారు. "ఎందుకో ఈ పోటీలో డాక్టర్ బాబు గెలుస్తాడనిపిస్తోంది ఎందుకంటే నాలుగేళ్లు వంటలక్కతో కలిసి చేసాడుగా" అంటూ అర్జున్‌ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి వేశాడు.  "ఏ ఏ.. ఎం చేశాడు" అంటూ అవినాష్ అడిగేసరికి "వంటలు చేసాడయ్యా" అన్నాడు అర్జున్. "ఈ పోటీలో ఎలాగైనా గెలవాలనే పట్టుదల నీలో కనిపిస్తోంది అర్జున్" అన్నాడు నిరుపమ్. "పట్టుదలైనా, పట్టుకోవడమైన నీ తర్వాతే" అంటూ రివర్స్ డైలాగ్ వేశాడు అర్జున్. ఇక ఫైనల్ లో అవినాష్ కి శ్రీముఖి ముద్దిస్తున్నట్టుగా చూపించి ప్రోమో కట్ చేశారు. 'ఈ వర్షం సాక్షిగా' ఫుల్ రొమాన్స్ అంటూ సరికొత్త ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

నరేశ్‌కి డైపర్లు ఇస్తానన్న బామ్మ!

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే ఎపిసోడ్ అంతా బోనాల జాతర స్పెషల్ ఎపిసోడ్ గా ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమయ్యింది. బుల్లితెర నటులు, కమెడియన్స్ అంతా కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. ఈ షోకి వచ్చిన ఒక బామ్మని నాటీ నరేష్ ఆటపట్టిందామనుకుంటాడు. కానీ ఆ బామ్మ సై అంటే సై అంటూ కౌంటర్ ఇచ్చి పడేస్తుంది. "ఏ బామ్మా నీకు ఫన్ కావాలన్నా, కామెడీ కావాలన్నా నన్ను అడుగు" అంటాడు నరేష్. "నీకు డైపర్లు కావాలంటే నన్నడుగు" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది బామ్మ. అంతే స్టేజి మీద ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.  ఇక ఈ షోకి ఇంద్రజ రీఎంట్రీ ఇచ్చి అందరిని ఆనందపరిచింది. నెటిజన్స్ కూడా ఇంద్రజ ఎంట్రీ పై చాలా బెస్ట్ కామెంట్స్ చేశారు. తర్వాత పవన్ క‌ళ్యాణ్, బాలయ్య డూప్స్ వచ్చి వర్ష, ఫైమాతో కలిసి సూపర్ సాంగ్స్ కి డ్యాన్సులు వేసి స్టేజిని ఇరగొట్టేసారు. ఇక ఈ షోకి 'కార్తికేయ 2' జంట‌ అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ వచ్చారు. "ఇలాంటి ఒక జాతరలో చిన్నప్పుడు నా మరదలు తప్పిపోయింది" అంటాడు నిఖిల్. "నా బావ కూడా మిస్ అయ్యాడు" జాతరలో అంటుంది అనుపమ. అనుపమ డైలాగ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇమ్ము స్టేజి మీదకు వచ్చి "దొండకాయ, బెండకాయ, అనుపమ నా గుండెకాయ్.. నేను అనుపమ బావను" అంటూ వస్తాడు. ఆ తర్వాత అనుపమ "అలా నువ్వు చూస్తే చాలు" అంటూ తన మూవీలోని సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక అనుపమతో కలిసి కమెడియన్స్ అంతా "రాను రానంటూ చిన్నదో" అనే పాటకు డాన్స్ చేసేస్తారు. ఇలా ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించనుంది.

నాలో కరెంటు ఉంటే కదా షాక్ కొట్టేది!

'ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్' ప్రతీ వారం కామెడీ స్కిట్స్ తో, ప్రాంక్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా ఫుల్ మస్తీ చేసిందనే చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ మొత్తం కొరియోగ్రాఫర్స్ రౌండ్ అన్నమాట. "షర్టులు, ప్యాంట్లు, మోడరన్ డ్రెస్సులు వేసుకున్న గ్రహాంతరవాసుల్ని చూద్దామనుకుంటున్నారా?" అంటూ ప్రదీప్ అనేసరికి హైపర్ ఆది స్టేజి మీద ఎంట్రీ ఇస్తాడు. ఆది చాలా డల్ గా వచ్చేసరికి.. "ఎందుకంత డల్ గా ఉన్నావ్?" అన‌డిగాడు ప్రదీప్. "బట్టలషాపులో చిన్న గొడవ. ఈ షాప్ లో చూసినన్నిటిని ట్రయిల్ వేసుకోవచ్చని చెప్పాడు కదా అని  నేనేమో సేల్స్ గర్ల్ ని చూశా" అన్నాడు ఆది. గర్ల్ దగ్గర బీప్ పడుతుంది.  "అందుకే నాకు, షాప్ ఓనర్‌కు గొడవయ్యింది. నా విషయం వదిలేయ్. ఇంకో ఇద్దరు గ్రహాంతరవాసుల్ని పిలువ్" అని ఆది అనేసరికి రవికృష్ణ, నవ్యస్వామి వచ్చేస్తారు స్టేజి మీదకు. "రవీ! నేనైతే నిన్ను లైఫ్ లో వదలను" అంది నవ్య. వెంటనే ఆది అందుకుని "ఎందుకంటే నీలాంటి బకరా మళ్ళీ దొరకడు కదా" అంటాడు. వెంటనే రవికి కోపం వచ్చేస్తుంది. "ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్? నా వేల్యూ నీకు తెలియట్లేదు. నాకు బెంగుళూరు నుంచి కూడా ఫాన్స్ ఉన్నారు తెలుసా?" అన్నాడు ఆదితో. "ఐతే అక్కడికే వెళ్ళు" అని చెప్పాడు ఆది. తర్వాత శ్వేతా నాయుడు టీమ్ వచ్చి డాన్సులు వేశారు. తర్వాత నవ్య స్వామి చేయి పట్టుకున్నాడు ఆది. "ఏంట్రా కరెంటు షాక్ ఏమీ రావట్లేదు" అన్నాడు ..'నాలో కరెంటు ఉంటే కదా షాక్ కొట్టేది" అంటూ తన మీద తాను జోక్ వేసుకుంది నవ్య. అందరూ నవ్వేశారు ఆ జోక్ కి. "హా.. ఆది! మర్చిపోయాను. రేపు నాతో పాటూ పార్కుకు రావా?" అని అడిగింది నవ్య. "ఎందుకు?" అని ఆది అడిగేసరికి, "ఎప్పుడూ ఒక్కదానివే వస్తున్నావ్, ఎవరో ఒక ఎదవను తీసుకురావచ్చు కదా.. అని వాచ్‌మ‌న్‌ అడుగుతున్నాడు" అంటుంది. ఆ మాటకు ఆది షాక్ ఐపోయి "ఏం పంచురా?" అన్నాడు. "నువ్వే కదరా రాసింది" అంటూ కౌంటర్ వేసేసింది నవ్య. ఇలా ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది.

దుల్కర్ వైఫ్ త‌న‌ని ఏమ‌ని పిలుస్తుందో తెలుసా?

బుల్లితెర స్టార్ యాంక‌ర్ సుమ క‌న‌కాల హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో `క్యాష్.. దొరికినంత దోచుకో`. ప్ర‌తి శ‌నివారం ఈటీలో ప్ర‌సారం అవుతున్న ఈ షో వీక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సుమ పంచ్ లు, గెస్ట్ ల అల్ల‌రితో ఈ షో ఆద్యంతం న‌వ్వులు పూయిస్తూ విజ‌య‌వంతంగా సాగుతోంది. తాజాగా ఈ శ‌నివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఈ షోలో 'సీతారామం' మూవీ టీమ్.. హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, న‌టులు సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి పాల్గొని సంద‌డి చేశారు.   'సీతారామం' మూవీని వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై సి. అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఆగ‌స్టు 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా దుల్క‌ర్ స‌ల్మాన్‌, ద‌ర్శ‌కులు త‌రుణ్ భాస్క‌ర్‌, హ‌ను రాఘ‌వ‌పూడి, సుమంత్ `క్యాష్ దొరికినంత దోచుకో` షోలో పాల్గొని సంద‌డి చేశారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, ద‌ర్శ‌కులు త‌రుణ్ భాస్క‌ర్‌, సుమంత్ ఈ షోలో చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఇక షోలోకి దుల్క‌ర్‌ ఎంట‌ర్ కాగానే అభిమానులు ఈల‌లు వేస్తూ గోల చేశారు. ఇదే స‌మయంలో దుల్క‌ర్ ని లేడీ ఫ్యాన్స్ కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. మీ వైఫ్ మిమ్మ‌ల్ని ఏమ‌ని పిలుస్తార‌ని అడిగితే దుల్క‌ర్ చెప్పిన స‌మాధానంతో అక్క‌డున్న వారి అరుపుల‌తో క్యాష్ షో రీసౌండ్ తో మోత మోగిపోయింది. త‌న వైఫ్ త‌న‌ని 'జాన్' (ప్రాణం) అని పిలుస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా దుల్క‌ర్ స‌మాధానం చెప్పాడు. తాజా ఎపిసోడ్ జూలై 30న రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. 

రాజీ, అను ఒక‌రే అని ఆర్య‌ క‌నిపెట్ట‌గ‌ల‌డా?

కొంత కాలంగా జీ తెలుగులో ప్ర‌సార‌మ‌వుతోన్న పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో ప్రేమ ఎంత మ‌ధురం ఒక‌టి. మ‌హిళా వీక్ష‌కులు ఈ సీరియ‌ల్ కోసం రోజూ ఎదురుచూస్తుంటారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా చిత్ర విచిత్ర‌మైన మలుపులు, ట్విస్ట్ ల‌తో సాగుతూ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది ప్రేమ ఎంత మ‌ధురం. విమాన ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆర్యవ‌ర్ధ‌న్‌ తిరిగి కోలుకుంటాడు. అయితే అనురాధ‌ ఆచూకీ మాత్రం ల‌భించ‌దు. దీంతో అను కోసం ఆర్య అన్వేష‌ణ మొద‌లు పెడ‌తాడు. చివ‌రికి ఓ చోట అనుని పోలివున్న రాజీ క‌నిపించ‌డంతో త‌నే అను అని ఆర్య మ‌న‌సు ఆరాట‌ప‌డ‌టం మొద‌లుపెడుతుంది. అయితే జెండే మాత్రం త‌ను అను కాద‌ని వాదిస్తూ వుంటాడు. కానీ ఆర్య మాత్రం "త‌ను అనునే అని నా న‌మ్మ‌కం" అని బ‌లంగా వాదిస్తూ వుంటాడు. త‌న గురించి తెలుసుకోవ‌డం మొద‌లు పెడ‌తాడు. త‌న‌కు క‌ళ్లు లేని ఓ అక్క‌, త‌మ్ముడు వున్నారని తెలుస్తుంది. అయినా స‌రే త‌ను అనునే అని నిరూపించ‌డం కోసం ఆర్య ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఇదే స‌మ‌యంలో ఆర్య, జెండేలని క‌లిసిన రాజీ "నాట‌కాలు వేయ‌డానికి వ‌చ్చిన వార‌ని తెలిసింది. డ‌బ్బులిస్తే నేనూ నాట‌కం వేస్తాను "అంటుంది. దీంతో ఇదే స‌రైన అవ‌కాశ‌మ‌ని, అనుకు గ‌తం గుర్తు చేయొచ్చ‌ని ఆర్య భావించి సీతారాముల నాట‌కం వేయ‌డానికి రెడీ అవుతారు. రాజీ.. సీత‌, ఆర్య.. రాముడు, జెండే.. హ‌నుమంతుడుగా గెట‌ప్ లు వేసుకోవాలి. జెండే గెట‌ప్ తో రెడీ అయిపోతాడు. అను కూడా రెడీ అయి వ‌స్తుంది. ఇంత‌లో ఆర్య.. రాముడి గెట‌ప్ లో రావ‌డంతో రాజీ లో మార్పు క‌నిపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

శ్యామల డ్రీమ్‌ హోమ్.. ఏముంది గురూ!

సోషల్ మీడియాలో సెల‌బ్రిటీలు ఏ వీడియో పోస్ట్ చేసినా దానికి లైక్స్, కామెంట్స్ లక్షల్లో వస్తూ ఉంటాయి. దీని కోసం సెలెబ్స్ అంతా ఇంట్లో చేసే ఏ పనైనా కావొచ్చు.. వీడియో తీసి తమ తమ యూట్యూబ్ చానెల్స్ లో పోస్ట్ చేసేస్తున్నారు. హోమ్ టూర్స్ అంటూ చాలా మంది వాళ్ళ వాళ్ళ కొత్త ఇళ్లను వర్ణిస్తూ చెప్పే ట్రెండ్ ఇప్పుడు బాగా ఎక్కువయ్యింది. ఇలాంటి స్పెషల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరికి టచ్ లో ఉంటున్నారు. ఆ లిస్టులో యాంక‌ర్ శ్యామ‌ల కూడా చేరింది. తాజాగా ఆమె తన హోమ్ టూర్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.  శ్యామ‌ల‌ మూవీస్ లో యాక్ట్ చేస్తుంది, సీరియల్స్ లో నటిస్తుంది, యాంకర్ గా కూడా రాణిస్తోంది. వీటితో పాటు అప్పుడప్పుడు కొన్ని మూవీ ప్రమోషన్స్ కి కూడా హోస్ట్ గా చేస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక కొత్త ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు ఆ ఇంట్లోని విశేషాల గురించి చెప్తూ "వెల్కమ్ టు మై నెస్ట్" పేరుతో ఒక హోమ్ టూర్ వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి ఖాళీ ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఇంటి ముందు ఒక అరుగుని వేయించుకుంది. అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేసుకుంది. తర్వాత ఇంటి మొత్తాన్ని కూడా చూపించింది శ్యామల. తనకు దైవభక్తి చాలా ఎక్కువట. అందుకే పూజ గది అలంకరణను కూడా చూపించింది. విశాలమైన కిచెన్, డైనింగ్ టేబుల్, ఇంట్లోని హాల్స్, బెడ్ రూమ్స్ అన్ని చూపించేసింది. తన సుపుత్రుడి ఇషాన్ కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసిన బెడ్ రూమ్, అటాచ్డ్‌ బాల్కనీ, ఇంట్లో ఉన్న లిఫ్ట్, ఓపెన్ వార్డ్రోబ్, రీడింగ్ ప్లేస్, మాస్టర్ బెడ్‌రూమ్‌, అలాగే ఇంటి పైన ఏర్పాటు చేయించిన సోలార్ ప్యానెల్‌ని కూడా ఈ వీడియోలో చూపించింది. ఇల్లు మొత్తం కూడా బ్రాంజ్ తో తయారు చేసిన వస్తువులనే ఇంటినిండా అలంకరించుకుంది శ్యామల.  అలాగే 1995లో ఫస్ట్ టైం స్టేజి మీద పాట పాడినందుకు వచ్చిన ప్రైజ్ ని కూడా దాచుకుని మరీ చూపించింది శ్యామల. అలాగే తనకు ఇష్టమైన వీణను కూడా చూపించింది. రేపటి రోజున పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకోసం లిఫ్ట్ కూడా పెట్టించినట్లు చెప్పింది. ఇంకా ఇషాన్ వేసిన డ్రాయింగ్స్ ని కూడా చూపించింది. ఇలా శ్యామల పోస్ట్ చేసిన హోమ్ టూర్ వీడియో నెటిజన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.

సుధీర్ టాలెంట్‌కి స్టాండింగ్ ఒవేషన్.. ఫ్యాన్ అయిపోయిన‌ హేమచంద్ర!

జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన బుల్లి తెర నటుడు సుడిగాలి సుధీర్‌. ఇప్పుడు ఆడియన్స్ కి, చానెల్స్ కి సెలెబ్రిటీగా మారిపోయాడు. వరుస షోస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల్లోని సింగింగ్ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చేందుకు అంకిత‌మైన‌ "సూపర్ సింగర్ జూనియర్ షో" సక్సెస్‌ఫుల్ గా నడుస్తోంది. ప్రతీ వారం ఒక కొత్త థీమ్ తో ఈ షో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో "పల్లెటూరికి, పట్నం జోరుకు మధ్య రసవత్తర పోరు" పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతోంది.  ఈ ఎపిసోడ్ లో సుధీర్, అనసూయ కామెడీ వేరే లెవెల్లో ఉంది. పిల్లలు కూడా ఈ ఎపిసోడ్ లో అద్భుతమైన సాంగ్స్ పాడి అందరినీ మైమరిపించారు. ఇక ఈ ఎపిసోడ్ లో పిల్లలతో పాటు సుధీర్ కూడా తన గొంతు కలిపాడు. ఇందులో జడ్జిగా ఉన్న లెజెండరీ సింగర్ చిత్రమ్మతో కలిసి సాంగ్ షేర్ చేసుకున్నాడు. "అందం హిందోళం" అనే పాటను తనదైన స్టైల్ లో సూపర్ గా పాడి జడ్జెస్ కూడా ఇంప్రెస్ చేసేసాడు సుధీర్. అందరూ ఆ పాట విని షాక్ అయ్యారు.  ఇక హేమచంద్ర ఐతే సుధీర్ సాంగ్ కి ఫిదా ఐపోయి "సుధీర్ బ్రో.. ఐ ఆమ్ ఆల్రెడీ ఏ ఫ్యాన్ ఆఫ్ య ..ఇక నీ డెడికేషన్ కి ఇంకా పెద్ద ఫ్యాన్ ఇపోయా" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. సాంగ్ తర్వాత చిత్రమ్మ కాళ్లకు దణ్ణం పెట్టాడు సుధీర్. జూనియర్ సింగర్స్ అంతా స్టేజి మీదకు వచ్చేసి సుధీర్ ని హగ్ చేసేసుకున్నారు. "సుధీర్ చాలా హార్డవర్క్ చేశారు. దాని కోసం అందరూ ఒక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి" అని అన్నారు చిత్ర. అలా సుధీర్ తన గానంతో, గాత్రంతో అందరినీ అలరించాడు. అంతా లేచి నిలబడి క్లాప్స్ కొట్టి మరీ సుధీర్ ని అభినందించారు.

వేటూరి గారిది స‌మ్మోహ‌న‌త్వం.. ఆ త‌ర్వాత వాళ్ల‌ది ఉత్త క‌విత్వం!

జొన్నవిత్తుల రామలింగేశ్వరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేయ ర‌చ‌యిత‌గా మూవీస్ లో ఎన్నో హిట్ సాంగ్స్ రాసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. "అవార్డులు ఏవీ రాకపోయినా ఎక్కడైనా నా పాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. అంతకన్నా నాకు అవార్డులు ఏం కావాలి" అని అంటారు జొన్నవిత్తుల. తన లైఫ్ లో వాళ్ళ నాన్న గారు అడిగిన కొన్ని విషయాలను అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చా జొన్నవిత్తుల.  "ఏరా జీవితంలో నేనేమన్నా నీకు ఇచ్చానా?" అని 90 ఏళ్ల వయసులో తనని అడిగారట. "ఏ తండ్రి ఇవ్వనంత సంపద నాకు ఇచ్చావ్.. అంతకన్నా నాకు ఏం కావాలి  నాన్నా" అన్నారట జొన్నవిత్తుల. తాను రాసే పాటలే కాదు, తన కంఠస్వరం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మంది అనేవారట. ఐతే వాళ్ళ నాన్నగారి వాయిస్ లో పది శాతం త‌న‌కు అలాంటి కంఠస్వరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నారాయ‌న‌. ఇక తన బాబాయి జెవిఎస్ రావు. ఆయన హిందుస్తానీ సంగీతంలో మహా విద్వాంసులు. ఆయన విజయవాడ సంగీత కళాశాలలో హిందుస్తానీ సంగీతం లెక్చరర్ గా కూడా పని చేసారని జొన్న‌విత్తుల వెల్ల‌డించారు. అలాగే చిన్న తాతయ్య ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు గారి కంఠ స్వరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. "మా అమ్మకి అన్నయ్య ఐన దైతా గోపాలం గారు నాకు మావయ్య అవుతారు. ఆయన, మా చిన్న తాతయ్య కలిసి కొన్ని పౌరాణిక నాటకాలు వేశారు. అలా అమ్మ తరపు వైపు, నాన్న తరపు కూడా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబాలు కావడంతో నాకు సంగీతం కాస్త అబ్బింది" అని చెప్పారు జొన్నవిత్తుల.  అలాగే తాను సరిగమపలతో రాసిన పాట విన్న ఆరుద్ర గారు తనని మెచ్చుకున్నారని చెప్పారు. పాటకు పరాకాష్ట వేటూరి గారు అంటే ఇష్టం అని చెప్పారు. "పాటకు సమ్మోహనత్వం సమకూర్చడం అనేది నారాయణరెడ్డి గారి తర్వాత వేటూరి గారికే అంతటి శక్తి ఉంది అని అనుకుంటాను. ఆ సమ్మోహనత్వం అంటే బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. మనసును పాట వైపు అలా లాగేస్తుంది. కావాల్సింది అదీ. మిగాతా వాళ్ళు రాసే పాటల్లో కవిత్వం మాత్రమే ఉంటుంది" అంటూ మనసులో మాట చెప్పారు జొన్నవిత్తుల.

అతను బొమ్మలేస్తే.. ఈమె డాల్గోన కాఫీ చేస్తుంది

నిహారిక .. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఆడియన్స్ కి చిరపరిచితమే. బుల్లితెర మీద నటిగా, హోస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలాగే నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ ని కూడా నిర్మించింది. ఒక చిన్న ఫామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ నిర్మించి మంచి మార్క్స్ కొట్టేసింది. కొన్ని మూవీస్ లో కూడా నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో పేరు రాకపోయేసరికి సోషల్ మీడియాలో డిఫరెంట్ షోస్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి నిఖిల్ తో నాటకాలు షోకి వచ్చేసింది. ఇక ఈ షోలో నిహారిక తన భర్త గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. మీ ఆయనలో నువ్ గమనించిన విషయాలు ఏమిటి అని నిఖిల్ అడిగేసరికి తానొక మంచి ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందని చెప్పింది. నిహారికకు స్టేషనరీ షాప్స్ కి వెళ్లి కాసేపు ఎంజాయ్ చేయడం ఇష్టం.  అదే టైంలో ఒకసారి చైతన్య హెచ్ బి పెన్సిల్స్ ని, స్కెచ్ బుక్స్ ని కొంటూ ఉండడం గమనించాను. హాబీ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాడేమో పోన్లే  అని అనుకున్నా.. కానీ తర్వాత మా ఇంట్లో పెంచుకునే కుక్క బొమ్మ గీసి చూపించేసరికి చాలా షాక్ అయ్యాను. పెళ్లి చూపులప్పుడు నీ గురించి చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. కానీ నేను తర్వాత గుడ్ ఆర్టిస్ట్ అనే విషయాన్ని మాత్రం కనిపెట్టాను. తన హస్బెండ్ లో ఇలాంటి క్వాలిటీ ఉందని చాలా రోజులు తెలుసుకోలేకపోవడం నిజంగా కొంచెం బాదే అని చెప్పింది. తర్వాత చైతన్య వంతు వచ్చేసింది. నిహారికలో మీరు కనిపెట్టిన, ఇష్టమైన అంశాలేమిటి అని నిఖిల్ అడిగేసరికి. నిహారిక డాల్గోన కాఫీ చాలా అద్భుతంగా చేస్తుంది. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఈమధ్యనే మేమంతా వెళ్ళాం. ఐతే ఒకరోజు మార్నింగ్ నీకు డాల్గోన కాఫీ కావాలా అని నన్ను అడిగింది. ఐతే అది ఎప్పుడు నేను తాగలేదు నాకు అసలు తెలీదు కూడా. కానీ ఆ కాఫీ తాగాక అమేజింగ్ అనిపించింది అంటూ నిహారిక చేసిన కాఫీ గురించి చెప్పేసాడు. ఇక మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అని అడిగేసరికి అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ చెప్పారిద్దరూ.

మాట్లాడ‌లేని స్థితిలో శ్రీ‌వాణి!

శ్రీవాణి ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉంటుంది. బుల్లితెర మీద రకరకాల షోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. భర్త, కూతురితో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఈమె చంద్రముఖి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. మనసు మమత, కలవారి కోడలు, కాంచన గంగ, మావి చిగురు, ఘర్షణ వంటి సీరియల్స్ లో నటించింది శ్రీవాణి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే శ్రీవాణి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది.  శ్రీవాణికి మాట పోయిందన్న విషయాన్ని ఆమె భర్త విక్రమ్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు. మొదట జలుబు అనుకున్నారట. దాని కోసం కొన్ని మందులు కూడా వాడాం అని చెప్పుకొచ్చారు. "రోజురోజుకు గొంతు సమస్య పెరిగిపోతూ చివరికి మాట్లాడలేకపోయే పరిస్థితికి వచ్చేసరికి చాలా భయంవేసింది. శ్రీవాణిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది" అని చెప్పాడు విక్రమ్.  డాక్టర్ కి చూపిస్తే గట్టిగా అరవడం కారణంగా గొంతు లోపలి టిష్యూ వాచిందని చెప్పారు. దానికోసం కొన్ని మందులు కూడా ఇచ్చారట. ఐతే మందులు వేసుకోవాలి కానీ నెల రోజుల పాటు అసలు మాట్లాడకూడదు.. అప్పుడే సెట్ అవుతుందని చెప్పారట. నెల తర్వాత మళ్ళీ గొంతు మాములుగా ఐపోతుందని డాక్టర్ చెప్పారన్నారు. ఐతే శ్రీవాణి మాట కోల్పోవడం పై ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

"మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి" అంటూ సుమతో చెప్పిన సల్మాన్

క్యాష్ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ షోకి సీతారామం టీం వచ్చేసింది. దుల్కర్ సల్మాన్, తరుణ్ భాస్కర్, సుమంత్ ఈ షోకి వచ్చేసారు. ఇక సల్మాన్ ని చూసేసరికి ఆడియన్స్ అరుపులు అన్నీ ఇన్ని కావు. అందరి నోళ్లు మూయించి చివరికి నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అంటుంది సుమ. అందరూ నవ్వేస్తారు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ ఎమోజిఎస్ తో ఎక్కువగా మెసేజెస్ చేసేది ఎవరు అని అడుగుతుంది సుమ. సుమంత్ తాను చేస్తానని చెప్తాడు. మనసులో ఏముందో ఎమోజిలో అది కనిపిస్తుందా అని అడుగుతుంది. మనసులో ఏమీ ఉండదు, నా మనసు బండరాయి అంటాడు. తర్వాత సుమన్ ని పక్కకు పిలిచి నిలబెట్టి వెనక స్క్రీన్ మీద మల్లెపూలు ఇమేజ్ ని చూపించి ఆ బొమ్మను అభినయించి చూపించాలని తరుణ్ భాస్కర్ కి చెప్తుంది.  భాస్కర్ కూడా కరెక్ట్ గా చేసి చూపిస్తాడు సుమంత్ మల్లెపూలు అని కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. తర్వాత అలాంటిదే మరో ప్రశ్నకు  సల్మాన్ ఆన్సర్ చెప్పేలా చేస్తుంది. తర్వాత సుమ సల్మాన్ ఇద్దరూ కలిసి మహానటిలో ఒక బిట్ డైలాగ్స్ తో ప్లే చేస్తారు. "మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి " అనే డైలాగ్ సుమ కోసం సల్మాన్ చెప్పేసరికి సుమ కూడా అలా చూస్తూ ఉండిపోతుంది.  తర్వాత కాష్ ట్రైనింగ్ స్కూల్ కి అందరిని తీసుకెళ్తుంది సుమ. మా స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటే బాగా ఫైట్స్ చేయొచ్చు అని టీమ్ కి చెప్తుంది. అలాగే ఒక ట్రైనర్ ని కూడా చూపిస్తుంది. ఆ తర్వాత ఆడియన్సు నుంచి ఒక అమ్మాయి "ప్రియతమా ప్రియతమా" అంటూ ఒక పాటను సల్మాన్ కోసం పాడుతుంది. ఇక ఈ ఎపిసోడ్ ఈ నెల 30 న ప్రసారం కానుంది.

ఎవరికైనా ఎప్పుడైనా సాయం చేశావా?.. ఓంకార్‌పై జ్యోతి మండిపాటు!

ఆట సందీప్ అంటే బుల్లి తెర మీద పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సందీప్, అతని భార్య జ్యోతి రాజ్‌ ఇద్దరూ కలిసి డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. డాన్స్ స్టెప్స్ కూడా నేర్పిస్తూ లైం లైట్ లో ఉన్నారు. ఐతే ఇప్పుడు ఓంకార్ ని టార్గెట్ చేస్తూ జ్యోతి కొన్ని ప్రశ్నలను సూటిగా సంధించింది. "ఎవరైనా తాను ఎదుగుతూ తన చుట్టుపక్కల వారిని ఎదిగేలా చేయడం మానవత్వం అంటారని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మరి నటుడు, యాంకర్ ఐన ఓంకార్ ఏమన్నా ఇలాంటివి చేశాడా?" అంటూ ఆమె ఓంకార్ మీద మండిపడ్డారు.  'ఆట' షోతో గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ తర్వాత ఎన్నో షోస్ నిర్వహించారు. ఈరోజు రియాలిటీ షోస్ కి డిమాండ్ ఇంతలా పెరిగింది అంటే దానికి కారణం ఓంకార్ అని చెప్పొచ్చు. మొదట జెమినీ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ని స్టార్ట్ చేసాడు. తర్వాత ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, ఇష్మార్ట్ జోడి, సిక్స్త్ సెన్స్ వంటి సూపర్ డూపర్ షోస్ తో ఒక రేంజ్ లో ఎదిగి పేరు తెచ్చుకున్నాడు ఓంకార్. ఇప్పుడు ఆహా ఓటిటిలో 'డాన్స్ ఐకాన్' అనే షోకి హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద తానేంటో ప్రూవ్ చేసుకుంటూ బిగ్ స్క్రీన్ వైపు కూడా అడుగులు వేసి జీనియస్, రాజుగారి గది 1, 2 డైరెక్ట్ చేశాడు. నాగార్జునని పెట్టి 'రాజుగారి గది 2' తీసాడంటే ఓంకార్ రేంజ్ ఏంటో ఈపాటికి అర్థ‌మయ్యే ఉంటుంది.  "చాలా రియాలిటీ షోస్ లో గుర్తింపు తెచుకున్నవారికి చాలామంది మంచి అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఓంకార్ మాత్రం అలా ఎందుకు ఛాన్సులు ఇవ్వడం లేదు, మంచి డాన్సర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిని ఎందుకు పట్టించుకోవడం లేదు?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది జ్యోతి. అలాగే "ఓంకార్ మూవీస్ తీసేటప్పుడు పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ నే ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళను, అలాగే మీ తమ్ముళ్లను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? వాళ్లకు ఎదిగే అవకాశాన్ని ఎందుకు కల్పించడం లేదు" అని అడిగింది.  "ఒకప్పుడు ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్ కైనా ఇప్పుడు లైఫ్ ఉందా? లేదు కదా.. వాళ్ళు అవకాశాలు లేక, ఈవెంట్స్ కి ఎవరూ పిలవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆట షోలో ఒకప్పుడు టాప్ అని పేరు తెచుకున్నవాళ్లంతా ఇప్పుడు కింద పడిపోయారు. వీళ్లల్లో ఎవరినైనా చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది" అంటూ తన మనసులో ఆవేదనని బయటపెట్టింది జ్యోతి. ఈ కామెంట్స్ కి ఓంకార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

లిప్ స్టిక్ ని అచ్చ తెలుగులో ఏమంటారు?

బుల్లితెర మీద కనిపించే సుధీర్ ని చూస్తే చాలు ఇప్పుడు ఆడియన్స్ కి ఎక్కడలేని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. కష్టపడి ఎదిగిన వ్యక్తిగా కూడా సుధీర్ ఆడియన్స్ మనసులో మంచి పేరు సంపాదించుకున్నాడు. సుధీర్ ఉంటే చాలు ఆ షో  సందడిగా కూడా ఉంటుంది. సుధీర్ షోకి టీఆర్పీ రేటింగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటుండడంతో మేకర్స్ కూడా ఆయన్నే షోస్ కి ఎగరేసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ అనసూయతో కలిసి స్టార్ మా సింగింగ్ షోలో హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ షోలో సుధీర్ అనసూయ మీద పంచులు మీద పంచులు వేసి కడుపుబ్బా నవ్వు తెప్పించాడు. సుధీర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఎంట్రీ ఇస్తాడు. అతని మాటలకు అక్కడికి వచ్చిన  అనసూయ పద్దతి, పాడు లేకుండా వచ్చారు అంటూ సుధీర్ పై మండిపడుతుంది. ఏవండీ మాదీ పల్లెటూరే..కానీ ఇప్పుడు దానికి సిటీ అని పేరు పెట్టారంటా అంటాడు..ఎం సిటీయో అని మూతి తిప్పుకుంటూ అడుగుతుంది "పబ్లిసిటీ" అంటాడు.  నేను కూడా అప్పుడు సిటీకి వచ్చాను అంటుంది అనసూయ. ఎం సిటీ అంటాడు సుధీర్. సింప్లిసిటీ అంటుంది అనసూయ. ఇలాంటి పంచ్ డైలాగ్స్ వింటుంటే నేను ఇంకో సిటీకి వెళ్ళిపోయాను అంటారు చిత్రగారు. ఎం సిటీకి వెళ్లారు అంటుంది అనసూయ. "స్కెర్ సిటీ " అంటారు చిత్ర గారు. ఇలా కాసేపు సిటీ మీద పంచ్ డైలాగ్స్ ఐన తర్వాత కొన్ని సింగింగ్ పెర్ఫార్మెన్స్లు అయ్యాక "నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను వాటిని అచ్చ తెలుగులో ఏమంటారో చెప్పండి అంటాడు సుధీర్ అనసూయను. సరే మైక్ ని ఏమంటారో చెప్పండి అంటాడు. మైకును మైక్ అంటారంటుంది. కాదు ధ్వని శబ్ద గొట్టం అంటారని చెప్తాడు. ఫోన్ ని ఏమంటారు అంటాడు. చరవాణి అంటుంది అనసూయ. చరవాణి, లంగావోణీ కాదు శబ్ద మాటల గొట్టం అంటాడు. ఐస్ క్రీంని తెలుగులో చెప్పమంటాడు. హిమక్రీము అంటుంది. కాదు హిమక్రీములు వేసుకునే గొట్టం అంటాడు. ఫైనల్ గా లిప్ స్టిక్ ని ఏమంటారు అని అడుగుతాడు. దీనికి సుధీర్ అన్నే ఆన్సర్ చెప్పగలుగుతాడు అంటాడు హేమచంద్ర. పెదాల్ని రంగురంగులుగా మార్చే గొట్టం అని అనసూయకు అందకుండా జడ్జెస్ దగ్గరకి పరిగెత్తుతాడు. అక్కడ అందరూ కలిసి సుధీర్ ని బాదేస్తారు. పల్లెటూరికి, పట్నం జోరుకి మధ్య రసవత్తర పోరు శీర్షికతో ఈ ఎపిసోడ్ రాబోతోంది.

కాకి కోకిలయ్యింది అంటూ శ్రీలేఖకు కంప్లిమెంట్ ఇచ్చిన బాలు

సాయికుమార్ హోస్ట్ గా చేస్తున్న "వావ్" షో ప్రతీ వారం అలా హాయిగా సాగిపోతూ ఉంది. ఇక ఈ వారం ఎపిసోడ్ కి ఎంఎం.శ్రీలేఖ, అదితి భావరాజు, సాందీప్, కారుణ్య విచ్చేసారు. ఇక శ్రీలేఖ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా 80 సినిమాలు చేశారు. సింగర్ గా 4 వేల పాటలు పాడారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషాల్లో పాడారు. శ్రీలేఖ తన ఏడేళ్ల వయసులో సంగీతం నేర్చుకోవాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కర్ణాటక నుంచి పారిపోయి వాళ్ల పెదనాన్న ఇంటికి వచ్చేశారట. ఆ తర్వాత  శ్రీలేఖను వాళ్ళ పెదనాన్న బాలు గారి దగ్గరకు తీసుకెళ్లి "మా అమ్మాయి పాడుతుంది మీరు కూడా ఒకసారి వినండి" అనేసరికి బాలు గారు "ఏది ఒక పాట పాడమ్మా" అన్నారట. వెంటనే "శంకరా" అంటూ గాడిద గొంతును, కాకి గొంతును మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో ఆ గొంతుతో పాడేసాను అని చెప్పారు శ్రీలేఖ.  బాలుగారు ఇక ఏమి అనలేక "మీరు పెద్దవారు మిమ్మల్ని ఏమీ అనలేను వెంటనే ఈ అమ్మాయిని ఇక్కడనుంచి తీసుకెళ్లిపొండి లేదంటే నాకు వచ్చిన సంగీతాన్ని కూడా నేను మర్చిపోయేలా ఉన్నాను..ఈమెకు సంగీతం నేను నేర్పలేను"  అంటూ మా పెదనాన్నకు చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేశారు అని అన్నారు శ్రీలేఖ. వెళ్తూ వెళ్తూ శ్రీలేఖ బాలుగారికి ఒక లుక్ ఇచ్చారట. "నీకు రాదు నేర్పడం..నేను చాలా అద్భుతంగా పాడతాను" అంటూ ఒక లుక్ ఇచ్చేసి సీరియస్ గా వచ్చేసాను. కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత బాలుగారితో కలిసి శ్రీలేఖ " ఆయనకిద్దరు" మూవీలో "అందాలమ్మో అందాలు" అనే ఒక డ్యూయెట్ పాడారట. "నేను పాడుతూ ఉంటే బాలుగారు ఒక పక్కన కూర్చుని అసలేం పాడుతోంది అనుకుంటూ అలా చూస్తూ ఉన్నారు. అసలు ఎవరు పిలిచారు ఈ అమ్మాయిని అన్నట్టుగా చూసి వెంటనే కోటి గారిని కూడా తిట్టేశారట బాలు గారు. అసలెందుకు ఈ అమ్మాయిని పిలిచావ్ " అని. ఇక కోటిగారేమో "కొంచెం ఓపిక పట్టండి సర్..ఈ అమ్మాయి బాగా పాడుతోంది" అనేసరికి బాలుగారు విని తర్వాత నాతో కలిసి ఆ పాటను పూర్తి చేశారు. ఆ తరువాత బయటికి వచ్చి నాతో అన్న మొదటి మాట "కాకి కోకిలయ్యింది" అని . ఆ టైంలో అది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పారు శ్రీలేఖ.

స్టేజి మీద ఇమాన్యుల్ కి రింగ్ పెట్టిన లేడీ ఫ్యాన్.. వర్ష పరిస్థితి ఏంటి ?

జాతిరత్నాలు స్టాండప్ కామెడీ ప్రతీ రోజు కొత్తగా కొత్తగా కామెడీని అందిస్తూ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇటీవలి లేటెస్ట్  ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. ఇందులో శ్రీముఖి గేలరీలో కూర్చున్న ఆడియన్స్ కి ఒక టాపిక్ ఇస్తుంది "ప్రాసలు - పొగడ్తలు" . ప్రాస పదాలతో పొగడ్తలు చెప్పాలని కండిషన్ పెడుతుంది. అప్పుడు ఒక చిన్న కుర్రాడు వెంకట్ లేచి " నేను మాట్లాడే భాష తెలుగు..నువ్వున్న చోట ఉంటుంది వెలుగు" అంటూ ప్రాస పదాలతో శ్రీముఖిని పొగిడేస్తాడు. తర్వాత ఒక అమ్మాయి లేచి నిలబడి ఇమ్ము ఇది నీకు అంటూ " ఎక్కువ తింటే వస్తుంది గ్యాసు ..ఇద్దరం కలిసి చేసేద్దాం రొమాన్సు" అంటూ పొగిడేసరికి ఇమ్ము సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక శ్రీముఖి " ఇది చూసి ఇంటికెళ్ళాక మీ డాడీ చేస్తాడు నీతో డ్యాన్సు" అంటూ కౌంటర్ ఇచ్చేస్తుంది. ఏమమ్మా ఎం మాట్లాడుతున్నావ్.. ఏ స్కూల్ అంటూ పంచ్ ప్రసాద్ సీరియస్ గా అడిగేసరికి హైస్కూల్ అంటాడు నూకరాజు. ఏ క్లాస్ అని ప్రసాద్ మళ్ళీ అడిగేసరికి "ఆన్లైన్ క్లాస్" అని ఆన్సర్ ఇచ్చి ఫన్ క్రియేట్ చేస్తారు శ్రీముఖి, నూకరాజు.  ఒక అమ్మాయి రొమాన్స్ చేస్తానని అడిగింది కదా నీ అభిప్రాయం ఏమిటి ఇమ్ము అంటుంది శ్రీముఖి..నాకు ఇష్టమే రొమాన్స్ అంటాడు..అసలు రొమాన్స్ అంటే ఏమిటి అంటూ ఏమి తెలియనట్టే అడుగుతాడు నూకరాజు. తర్వాత ఆడియన్స్ నుంచి చందు అనే కుర్రాడు లేచి ప్రాస పొగడ్త శ్రీముఖి మీద చెప్తాను అంటాడు. నీ ప్రాస పొగడ్త నచ్చితే నీతో డాన్స్ చేస్తానంటూ సూపర్ ఆఫర్ కూడా ఇచ్చేస్తుంది శ్రీముఖి.  "ఆకాశంలో ఎగురుతుంది గద్ద ..నేను రోజూ నీకు కలిపి తినిపిస్తా అన్నంముద్ద" అంటూ పొగిడేస్తాడు. తర్వాత మౌనిక అనే అమ్మాయి లేచి " గుండ్రంగా తిరుగుతుంది బొంగరం నీ వేలుకు తొడిగేస్తా ఉంగరం" అంటూ ఇమ్ముని పొగిడేస్తోంది. ఆ డైలాగ్ నచ్చేసరికి ఇమ్ము మౌనికను స్టేజి మీదకు తీసుకొచ్చి ఒక డ్యూయెట్ కి డాన్స్ చేస్తాడు. తర్వాత శ్రీముఖి పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటే ఇమ్మూకి, నూకరాజుకి రింగ్ పెట్టేస్తుంది మౌనిక. ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది.  

మోనిత‌లా తాళి క‌ట్టుకుంటాన‌న్న శోభ‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక‌దీపం`. స్టార్ మా లో గ‌త కొంత కాలంగా ప్ర‌సారం అవుతోంది. గ‌తంలో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని రికార్డు స్థాయి రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సీరియ‌ల్ ఇప్ప‌డు కాస్త వెన‌క‌బ‌డింది. మ‌ళ్లీ టాప్ రేటింగ్ తో నెం.1 స్థానాన్ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది కానీ అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే బుధ‌వారం ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోందో ఓ సారి లుక్కేద్దాం. హిమ కోసం నిరుప‌మ్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. సౌంద‌ర్య ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఇలా జ‌ర‌గ‌డంతో స్వ‌ప్న త‌న భ‌ర్త స‌త్య‌ని నిందిస్తూ వుంటుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియ‌దు.. నా కొడుకు నా ఇంట్లో వుండాలి అంటూ భ‌ర్త‌కు వార్నింగ్ ఇస్తుంది స్వ‌ప్న‌. క‌ట్ చేస్తే సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు .. నిరుప‌మ్ ఇంటికి వ‌చ్చిన విష‌యం గురించి మాట్లాడుకుంటుంటారు. క‌ట్ చేస్తే..హిమ‌.. నిరుప‌మ్ గురించి ఆలోచిస్తూ వుంటుంది.. ఇంత‌లో నిరుపమ్.. హిమ కోసం స్పెష‌ల్ గిఫ్ట్ తీసుకుని వ‌స్తాడు. జీన్స్‌, టీష‌ర్ట్ తెచ్చాన‌ని అవి నువ్వు వేసుకుని తీరాల్సిందేని చెబుతాడు నిరుప‌మ్‌. అది విన్న శౌర్య ఇంట్లో ఏదేదో జ‌రుగుతోంది. అంతా నాట‌కాలు ఆడుతున్నారంటుంది. క‌ట్ చేస్తే... నిరుప‌మ్ విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ శోభ ఆలోచిస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో అక్క‌డికి స్వ‌ప్న వ‌స్తుంది. అప్పుడు త‌న‌తో `నేను కూడా మోనిత‌లా మెడ‌లో తాళిబొట్టు క‌ట్టుకుంటాను` అని శోభ చెబుతుంది. వెంట‌నే షాక్ అయిన స్వ‌ప్న నేనేంటో చూనిస్తాను రెండు రోజులు టైమ్ ఇవ్వు అంటుంది. మ‌రో ప‌క్క‌.. ఇంట్లో హిమ మాత్రం నిరుప‌మ్ ఇంటికి ఎందుకొచ్చాడ‌ని ఆలోచ‌న‌లోప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

వేద‌ని మ‌ళ్లీ అవ‌మానించిన మాళ‌విక‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తోంది. క‌న్న‌త‌ల్లి క‌న్నా మిన్న‌గా ప్రేమించిచే యువ‌తి, ఓ పాప చుట్టూ సాగే అంద‌మైన క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. హిందీ సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బేబీ మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సులోచ‌న, వ‌ర‌ద‌రాజులు.. త‌దిత‌రులు న‌టించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఖుషీ ఆచూకీని పెట్ డాగ్ చిట్టీ కార‌ణంగా తెలుసుకున్న య‌ష్‌, వేద త‌న‌ని ఇంటికి తీసుకెళ‌తారు. ఆ త‌రువాత వేద కోసం ఖుషీ వెల్క‌మ్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఇళ్లంతా పూల‌తో ప‌రిచి వేద‌కు వెల్క‌మ్ చెప్ప‌డంతో అంతా థ్రిల్ అవుతారు. వేద మాత్రం ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌ట్ చేస్తే .. వేద‌ని ఇంటి నుంచి తీసుకెళ్లింది త‌ల్లి సులోచ‌న అని, త‌నే వేద‌ని చేయిప‌ట్టి ఇంటికి తీసుకొచ్చి అప్ప‌గించాల‌ని మాలిని కండీష‌న్ పెడుతుంది. సులోచ‌న కూడా త‌న కూతురు కోసం ఎంత వ‌ర‌కైనా త‌గ్గ‌డానికి తాను సిద్ధ‌మ‌ని వెళ్లి మాలిని ముందు త‌ల వంచుతుంది. అయితే త‌న వేద క్షేమం కోసం త‌ల వంచాన‌ని, అదే త‌న‌కు ఏదైనా క‌ష్టం వ‌స్తే దించిన త‌ల ఎత్తి మ‌రీ ప్ర‌శ్నిస్తానని చెబుతుంది. క‌ట్ చేస్తే.. వేద కోసం సులోచ‌న బోనం ఎత్తుతాన‌ని మొక్కుకుంటుంది. అదే స‌మ‌యంలో ఖుషీ కోసం మాళిని బోనం ఎత్తుతాన‌ని మొక్కుకుంటుంది. ఇదే విష‌య‌మై మాలిని, సులోచ‌న మ‌ధ్య గొడ‌వ జరుగుతుంది. ఆ త‌రువాత అంతా క‌లిసి బోనం ఎత్తుకుని గుడికి వెళ‌తారు. అక్క‌డ మాళ‌విక ఎంట్రీ ఇస్తుంది. వేద‌ని అవ‌మానిస్తుంది. ఖుషీ క‌న్న‌త‌ల్లిని నేను. కానీ ఇది క‌న‌కుండానే నా బిడ్డ‌కు త‌ల్లిగా మారింద‌ని గొడ‌వ చేస్తుంది. దీంతో ఆ మాట‌లు విన్న సోద‌మ్మ మీ ఇద్ద‌రిలో ఆ పాప‌కు త‌ల్లి ఎవ‌రో అమ్మ నిర్ణ‌యిస్తుంద‌ని, స‌జావుగా అమ్మ‌కు ఎవ‌రు బోనం స‌మ‌ర్పిస్తారో ఆమె ఈ పాపు అస‌లైన త‌ల్లి అంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ఈ షోలో రియల్ కపుల్స్ ముద్దులే ముద్దులు!

బుల్లితెర మీద డైలీ ఎన్నో కొత్త కొత్త షోస్ వస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు జీ తెలుగు వారి బోనాల జాతర షో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ షో టీజర్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో రియల్ కపుల్స్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ మధ్య జరిగే టీజింగ్ పెర్ఫార్మన్సెస్ ని ఆడియన్స్ కి సరికొత్తగా చూపించబోతున్నారు. ఈ టీజర్ లో చాలా మంది కపుల్స్ వచ్చి అద్దిరిపోయే డాన్సులు చేసి హంగామా చేసేసారు. కానీ ఒకే ఒక్క డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఒక కపుల్ మాత్రం సంథింగ్  స్పెషల్ గా కనిపిస్తోంది. ఆ పెయిర్ ఎవరు అంటే ఫేమస్ సింగర్ అనంత శ్రీరామ్, ఆయ‌న‌ వైఫ్ స్వాతి.  ఫస్ట్ టైం ఈ షోలో శ్రీరామ్, స్వాతి స్టేజిపై కనిపించబోతున్నారు. అనంత శ్రీరామ్ ఈమధ్య షోస్ లో జోష్ గా పాల్గొంటూ ప్రాస పదాలతో కొత్త కొత్త వాక్యాలు చెప్తూ డాన్స్ చేస్తూ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తన భార్యను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఐతే శ్రీముఖి "మీ పేరు?" అని శ్రీరామ్ వైఫ్ ని అడిగింది. "జీ తెలుగు బాగుండాలి" అని ఆన్సర్ ఇచ్చింది స్వాతి.  దాంతో శ్రీముఖి పేరు చెప్పకుండా ఇదేమిటా అన్నట్టుగా క్వ‌శ్చ‌న్ మార్క్‌ ఫేస్ పెట్టేసరికి, శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చి "ఆ ఒక్క డైలాగే" రాసా అంటాడు. అంతే స్టేజి మీద నవ్వులే నవ్వులు. తర్వాత "ఫ్రంట్ సీట్ లో కంఫర్ట్ గా లేదని బ్యాక్  సీట్ కి వచ్చి ముద్దు పెట్టాడు" అంటూ ఏక్‌నాథ్‌ గురించి హారిక ముద్దు సీక్రెట్ ని రివీల్ చేసి సిగ్గు పడింది. ఇలా ఈ షోలో ముద్దులెక్కువగానే కనిపించబోతున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'జీ తెలుగు వారి జాతర.. అందరూ ఆహ్వానితులే' అనే ప్రోగ్రాంలో చూడొచ్చు. 

'స్ట్ర‌యిట్‌గా చూస్తే శాంతిస్వరూప్‌లా ఉంటావ్'.. వర్ష పరువు తీసిన భాస్కర్!

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల‌లో ఎప్పుడూ కూడా స్కిట్ పండాలంటే కొన్ని జోక్స్ వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటూ ఆ షోకి రేటింగ్ పెంచే పనులు చేస్తూ ఉంటారు కమెడియన్స్. కొన్ని స్క్రిప్టెడ్ ఐతే కొన్ని స్పాంటేనియస్ గా జోక్స్ వేసేస్తూ ఉంటారు. అలాంటి ఒక జోక్ ఇప్పుడు ఎక్స్ట్రా  జబర్దస్త్ స్కిట్ లో మనం చూడొచ్చు. వర్ష మీద బులెట్ భాస్కర్ వేసిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాబోయే ఎపిసోడ్ లో ఈ జోక్ మనకు వినిపిస్తుంది. "అసలు వర్ష అమ్మాయేనా? మగాడిలా ఉంది" అంటూ భాస్క‌ర్‌ చేసిన కామెంట్స్ కి వర్ష స్టేజి మీద ఒక్కసారిగా షాక్ ఐపోయింది. "వర్ష అమ్మాయే కాదు, పక్కన ఉంటే అబ్బాయితో ఉన్న ఫీలింగ్ వస్తుంది" అంటూ గతంలో ఒక స్కిట్ లో ఇమ్ము కూడా అన్నాడు. అప్పుడు వర్ష చాలా హర్ట్ అయ్యింది. వెంటనే స్టేజి మీదే సీరియస్ ఐపోయి స్కిట్ మధ్యలోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే డైలాగ్ ఇప్పుడు బులెట్ భాస్కర్ నోటి నుంచి వ‌చ్చింది. కానీ వర్ష మాత్రం ఆ హఠాత్పరిణామానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక నవ్వేసింది. అప్పుడు ఇమ్ము సారీ కూడా చెప్పాడు. కానీ భాస్కర్ మాటలకు ఇప్పుడు వర్ష బాధపడినట్లే కనిపించడం లేదు. వర్ష, బులెట్ భాస్కర్ ఇద్దరూ కలిసి లవర్స్ లా "తెల్ల తెల్లని చీర" పాటకు రొమాంటిక్ డాన్స్ చేశారు. తర్వాత వర్ష "నేను యాంకర్ ని.. యాంకర్ ని అని అందరికీ చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదేంటి?" అంది. "నిన్ను అమ్మాయంటేనే ఎవరూ నమ్మట్లేదు.. ఇంక యాంకర్ అంటే ఎందుకు నమ్ముతారు?" అని వర్ష పరువు తీసేసాడు భాస్కర్. "నువ్ అలా అంటావ్ కానీ.. నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాననుకో లెఫ్ట్ నుంచి ఇంద్రజ గారు, రైట్ నుంచి ఖుష్భూ గారు అంటారు నన్ను" అంది వర్ష వ‌య్యారాలు పోతూ. "ఐతే స్ట్రైట్ గా చూస్తే శాంతి స్వరూప్ అంటారు" అని ఫుల్లుగా రెచ్చిపోయి పంచ్ వేశాడు భాస్కర్. వర్ష మూతి ముడుచుకుని ఏమి అనలేకపోయింది. ఇలా ఈ వారం బులెట్ భాస్క‌ర్ పంచెస్‌కి వర్ష బలైనట్టు కనిపిస్తోంది.